Home

»

Latest News

బ‌య‌టి సినిమాల ఈవెంట్ల‌కు ఓకే.. తన సినిమా వేడుకకు 'నో' చెప్పిన నయనతార.!

Oct 30, 2026 4:11PM

సినిమాల్లో నటించడానికి మాత్రమే కాదు.. సినిమా ప్రమోషన్లకు కూడా కొందరు హీరోయిన్లు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం చాలాకాలంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన సినిమాల ఈవెంట్లకు, ఇంటర్వ్యూలకు పెద్దగా హాజరుకాని ఆమె.. ఇటీవల ఈ పద్ధతికి కాస్త భిన్నంగా వ్యవహరించారు. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో పాటు, ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లోనూ సందడి చేశారు. దీంతో ఇకపై నయనతార కూడా తన సినిమాల ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటారని అభిమానులు భావించారు. కానీ తాజాగా మరోసారి తన పాత పద్ధతినే కొనసాగించారు.

నయనతార ప్రధాన పాత్రలో సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేయగా, రెజీనా కసాండ్రా ప్రతినాయకురాలిగా కనిపించనున్నారు. సుమారు రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు వేల్స్ ఇంటర్నేషనల్‌తో పాటు సుందర్.సి, నయనతార కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించింది. అయితే ఈ కార్యక్రమానికి నయనతార హాజరుకాలేదు. ఇటీవల ఇతర సినిమాల ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె.. తనే ప్రధాన పాత్రలో నటించిన సినిమా వేడుకకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ఈ వేడుకకు నయనతార ఎందుకు రాలేదనే విషయంపై చిత్రబృందం వివరణ ఇచ్చింది. ప్రస్తుతం మరో సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయారని తెలిపింది. మరోవైపు సినిమా చిత్రీకరణ సమయంలో నయనతార నాన్‌వెజ్‌కు దూరంగా ఉన్నారని దర్శకుడు సుందర్.సి వెల్లడించారు. పాత్ర పట్ల, సినిమా పట్ల ఆమె చూపించిన నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఈవెంట్‌కు రాలేదనే విషయంపై చర్చ జరుగుతున్నప్పటికీ, సినిమా కోసం ఆమె తీసుకున్న శ్రద్ధను కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమా వేడుకకు కొన్ని గంటల ముందే నయనతార సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరితమైన లేఖను పంచుకున్నారు. దర్శకుడు సుందర్.సి, నిర్మాత ఐసరి కె. గణేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. రెజీనా కసాండ్రా, ఖుష్బూ, స్నేహాలతో కలిసి పనిచేయడం తనకు ప్రత్యేకమైన అనుభవమని పేర్కొన్నారు. సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కూడా చెప్పారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సినిమా గురించి స్పందించిన నయనతార.. వేడుకకు మాత్రం దూరంగా ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

 

 

[Nayanthara, Mookuthi Amman 2, Nayanthara Pre Release Event, Sundar C, Regina Cassandra, Nayanthara Promotions, Mookuthi Amman 2 Release Date]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com