
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి వత్సల రాజగోపాల్ (93) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా శుక్రవారం (అక్టోబర్ 30) చెన్నైలో ఆమె తుదిశ్వాస విడిచారు. తమిళ చిత్రాలతో పాటు తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన ఆమె.. ‘అదుర్స్’ సినిమాలో నటించారు. ఎన్టీఆర్ బామ్మగా ఆమె పంచిన వినోదాన్ని తెలుగు ప్రేక్షకులు అంత తేలికగా మర్చిపోలేరు.
సాధారణంగా నటీనటులు చిన్న వయసులోనే సినిమాల్లోకి వస్తుంటారు. కానీ వత్సల రాజగోపాల్ ప్రయాణం మాత్రం భిన్నం. మొదట రంగస్థలంపై నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. సుమారు 60 ఏళ్ల వయసులో సినిమాల్లోకి అడుగుపెట్టారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘రోజా’ (1992) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో మధుబాలకు నాయనమ్మగా నటించి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.
ఆ తర్వాత వయసుతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ‘సతి లీలావతి’, ‘రిథమ్’, ‘విన్నర్’, ‘అన్నియన్’, ‘మొళి’ వంటి తమిళ చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. ముఖ్యంగా అమ్మమ్మ, నాయనమ్మ పాత్రల్లో తన సహజమైన నటనతో అభిమానులను ఆకట్టుకున్నారు.
వత్సల రాజగోపాల్ ప్రయాణం సినిమాలకే పరిమితం కాలేదు. తమిళ టెలివిజన్ రంగంలోనూ ఆమె ఎన్నో సీరియళ్లలో నటించారు. ‘చిత్తి’, ‘ఆనందం’, ‘ముందానై ముడిచ్చు’, ‘వసంతం’ వంటి సీరియళ్లతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రంగస్థలం, సినిమా, టెలివిజన్.. ఇలా మూడు విభాగాల్లోనూ తనదైన ముద్ర వేశారు.
ఇది కూడా చదవండి: తొమ్మిదో నెలలోనూ అదే ఫిట్‌నెస్.. సమంత వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.!

[Adhurs Actress Vatsala Rajagopal Passed Away, Vatsala Rajagopal passes away, Vatsala Rajagopal Death, NTR Adhurs Movie, Roja actress, Vatsala Rajagopal Age, Vatsala Rajagopal Movies, Vatsala Rajagopal]





.webp)
