
విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కట్ అవుట్ ల మానియాకి పాజిటివ్ వైబ్రేషన్స్ తోడైతే బాక్స్ ఆఫీస్ ఏ విధంగా తన దాహాన్ని తీర్చుకుంటుందో అనే ఉదాహరణ ఆదర్శ కుటుంబం ద్వారా నెరవేరే అవకాశం ఉందని సినీ ప్రియులు వహిస్తున్నారు. ఆ దాహం యొక్క స్థాయి ఏ రేంజ్ లో ఉండబోతుం దో ఈ రోజు సెకండ్ షో తర్వాత తెలియనుంది. రీసెంట్ గా ఆదర్శ కుటుంబం గురించి సినీ సర్కిల్స్, నెట్టింట ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది.
సినిమా విడుదలయ్యే సమయం, ఆ సమయంలో వచ్చే సెలవులు, ప్రేక్షకుల మూడ్ బాక్సాఫీస్ భవితవ్యాన్ని, కలెక్షన్ల స్పీడ్ ని శాసిస్తాయి. సరిగ్గా ఈ అంశమే ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లోనూ, సాధారణ ప్రేక్షకుల్లోనూ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ‘ఆదర్శ కుటుంబం’వస్తున్న విశేష స్పందన, పాజిటివ్ టాక్ చూస్తుంటే మేకర్స్, డిస్ట్రిబ్యూటర్లు ఎంతో సంతోషపడుతున్నారు. అయితే అదే సమయంలో ప్రతి ఒక్కరి నోటా ఒకే మాట వినిపిస్తోంది. ఈ సినిమా కనుక దసరా పండుగ సీజన్‌లో థియేటర్లలోకి వచ్చి ఉంటే, కలెక్షన్ల ఉధృతి ఏ రేంజ్‌లో ఉండేదో ఊహించుకోవడానికే మైండ్ బ్లాక్ అవుతోందని స్పష్టం చేస్తున్నారు. దసరా అంటేనే తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సమేతంగా థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడటానికి ఈ సెలవుల కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పాఠశాలలు, కళాశాలలకు దసరా సందర్భంగా వరుసగా 10 నుండి 15 రోజుల పాటు సుదీర్ఘమైన సెలవులు లభిస్తాయి. ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వివిధ నగరాల్లో స్థిరపడిన ప్రజలంతా సొంత ఊర్లకు చేరుకుంటారు. దాంతో గ్రామాలు, చిన్న పట్టణాలలోని బి, సి సెంటర్ థియేటర్ల వద్ద కలెక్షన్ల జాతర కనిపిస్తుంది. ఇలాంటి పండుగ సీజన్‌లో ‘ఆదర్శ కుటుంబం’ లాంటి ఫ్యామిలీ, మాస్ ఎంటర్‌టైనర్ పడి ఉంటే బాక్సాఫీస్ వద్ద అత్యంత భారీగా ఉంటుంది. పైగా కుటుంబ సమేతంగా చూడదగ్గ కంటెంట్ కావడంతో ప్రతి కుటుంబం ఈ సినిమా వైపు అడుగులు వేస్తోంది.
ఇది కూడా చదవండి: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ
.webp)
ఒకవేళ ఈ చిత్రం పక్కా ప్రణాళికతో దసరా హాలిడేస్ రేసులో దిగి ఉంటే, ఆ సుదీర్ఘమైన సెలవుల రోజులు ఈ సినిమా వసూళ్లకు విపరీతంగా ఉపయోగపడేవి. మామూలు రోజుల్లోనే థియేటర్లకు కుటుంబాలు తరలివస్తుంటే, దసరా లాంటి పెద్ద పండుగ సెలవుల్లో అడ్వాన్స్ బుకింగ్స్, హౌస్‌ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదయ్యేవనే మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వాళ్లంతా అభిమానం కొద్దీ మరి చొరవ తీసుకొని అలా అంటున్నారు గాని, బడా హీరో, బడా డైరెక్టర్ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే ఆ కలెక్షన్స్ ల కథే వేరు. అభిమానులు, సినీ ప్రియులు అయితే ఇప్పుడే దసరా అనుకుంటామని కూడా అంటారు.
[Aadarsha Kutumbam Public Talk, Aadarsha Kutumbam Movie Review Telugu, Aadarsha Kutumbam Movie Review, Aadarsha Kutumbam review,Telugu Cinema, telugu Cinema News, Tollywood, Tollwyood News]






