Home

»

Latest News

ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్: రితికా సింగ్ వీడియోలతో కొత్త దందా.!

Oct 30, 2026 6:56PM

సోషల్ మీడియాలో సెలబ్రిటీల పేరుతో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేయడం, వారి ఫొటోలు, వీడియోలను దుర్వినియోగం చేయడం ఈ మధ్య ఎక్కువైపోయింది. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత డీప్‌ఫేక్‌ వీడియోల బెడద మరింత పెరిగింది. తాజాగా నటి రితికా సింగ్ కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బందిపడుతోంది. ఆమె పేరుతో ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు సృష్టించడమే కాకుండా.. డీప్‌ఫేక్‌ వీడియోల పేరుతో అభిమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారట.

ఈ విషయాన్ని స్వయంగా రితికా సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కొందరు వ్యక్తులు తన పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి, వాటి ద్వారా ఏఐతో రూపొందించిన డీప్‌ఫేక్‌ వీడియోలను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. అంతేకాదు, ఈ నకిలీ ఖాతాల్లో వీడియోలు చూడాలంటే నెలకు రూ.400 చొప్పున సబ్‌స్క్రిప్షన్ చెల్లించాలని అడుగుతున్నారట. దీంతో తన అభిమానులు ఇలాంటి మోసాలకు బలికావద్దని ఆమె హెచ్చరించింది.

తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్ ఉన్న అకౌంట్ మాత్రమే అఫీషియల్ అని రితికా స్పష్టం చేసింది. తన పేరుతో కనిపించే ఇతర అకౌంట్స్ ను నమ్మవద్దని, వాటిని గుర్తించిన వెంటనే రిపోర్ట్ చేయాలని కోరింది. ముఖ్యంగా అనధికారిక ప్రొఫైల్స్‌లో కనిపించే వీడియోలు, సబ్‌స్క్రిప్షన్ లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ఇది కూడా చదవండి: డ్రాగన్ అణుబాంబులా ఉంటుంది.. ఈసారి ఎన్టీఆర్ అభిమానులు రెండు కాలర్లు ఎగరేస్తారు.!

 

 

 

[Ritika Singh Fake Instagram Subscription Scam, Ritika Singh Instagram, Ritika Singh Deepfake Videos, Ritika Singh AI Videos, Ritika Singh Viral Videos, Ritika Singh, AI Deepfake Videos, Telugu Film News]

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com