LATEST NEWS
 తెలంగాణ రాజకీయాలలో ఈటల రాజేందర్ పరిచయం అక్కర్లేని పేరు. బీఆర్ఎస్ హయాంలో కీలక నేతగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా ఈటల కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే. అయితే ఈ తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విభేదాల కారణంగా బీఆర్ఎస్ ను వీడి కమలం గూటికి చేరారు. అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీలో ఎలా ఇముడుతారా అన్న చర్చ ఆ సందర్భంగా జోరుగా సాగింది. అయితే ఈటల కమలం పార్టీలో కుదురుకున్నట్లుగానే కనిపించారు. మధ్య మధ్యలో అడపాదడపా ఇబ్బందులు తలెత్తినా సర్దుకున్నారు.  అయితే ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు. ఒక దశలో ఆయకు ఆ పదవి దక్కడం ఖాయమని అంతా భావించారు. అయితే అది జరగలేదు. అప్పటి నుంచీ ఈటల రాజకీయంగా మౌనం వహించారు. బీజేపీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదు.  ఈ నేపథ్యంలోనే ఈటలకు బీజేపీలో ఉక్కపోత ఎక్కువైందన్న  చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగింది. ఆయన కమలం గూటికి వీడతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు.  కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న  రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం  కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్   బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.  అయితే.. తాజాగా కాళేశ్వరంపై హైదరాబాద్ లో  మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని  తప్పుపట్టారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మిడ్ మానేరు  అత్యంత కీలకం అన్న ఆయన..   కరవు  ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లోలెవల్ పాయింట్‌కు చేరుతున్న నీటిని ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవడానికి  కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు.   ఆ సందర్భంగా తాను ఎవరికో భయపడి మాట్లాడే వ్యక్తిని కాదనీ.. తాను  తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమకారుడినీ అదే తన గుర్తింపనీ ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యల ద్వారా కమలం పార్టీకి తాను కట్టుబానిసను కాననీ, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెళ్లడిస్తాననీ అన్యాపదేశంగానే అయినా విస్పష్టంగా చెప్పారు.  తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమనీ, ఈ తరువాతే.. పార్టీ అని కుండబద్దలు కొట్టారు.   దీంతో  ఈటల రాజేందర్ కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ అధికార పక్షం ఆరోపణలు గుప్పించడం, బండి సంజయ్ వంటి బీజేపీ నేతలు ఈటలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈటల మళ్లీ కారెక్కే అవకాశం ఉందంటూ రాజకీయవర్గాలలో ప్రచారం జోరందుకుంది.   Etela Rajender join the BRS, Kaleshwaram Project, BRS Support Rumors, Telangana Politics, BJP MP Etela Comments
  ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన తర్వాత, ఆ పార్టీ అగ్రనాయకత్వం మరియు ముఖ్య నేతలు తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తున్నారు. ఇటీవల గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ఒక వివాదాస్పద నిందితుడు (జోసెఫ్ అలియాస్ రావణ) అరెస్టు మరియు అతనిపై ఉపా (UAPA) చట్టం ప్రయోగం నేపథ్యంలో కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జనసేన ఒత్తిడి వల్లే ఈ కేసులు నమోదయ్యాయని, అయితే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లోని ఒక నిర్దిష్ట సామాజిక వర్గం నాయకులే అతనికి వెనుకనుండి బెయిల్ ఇప్పించారంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు అధికార పక్షంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ అంశంపై జర్నిలిస్ట్ గోపీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్మ రావు  టోన్ న్యూస్‌లో ఆసక్తికర చర్చ నిర్వహించారు. వైసీపీ ఇటువంటి సంచలన వ్యాఖ్యల ద్వారా రాష్ట్రంలో మళ్లీ పాత కుల రాజకీయాలను తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ మరియు పారిశ్రామికీకరణపై పూర్తి శ్రద్ధ పెడుతుంటే, విపక్షం మాత్రం ఈ విధమైన వివాదాల ద్వారా ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.వ్యూహం మరియు పరిణామాలు కొడాలి నాని హఠాత్తుగా మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యల వెనుక వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద వ్యూహమే అమలు చేస్తున్నట్లు విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి.  రాష్ట్రంలో సుమారు 164 స్థానాలతో అత్యంత బలమైన మేజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిని నేరుగా ఎదుర్కొవడం అంత సులువు కాదని వైసీపీ గుర్తించింది. అందుకే ఈ కూటమికి ప్రధాన బలమైన తెలుగుదేశం మరియు జనసేన పార్టీల మధ్య, ముఖ్యంగా కమ్మ మరియు కాపు సామాజిక వర్గాల మధ్య శాశ్వత విభేదాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఒక వైపు నుంచి విమర్శిస్తూనే, మరోవైపు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గం జనసేనకు వ్యతిరేకంగా అంతర్గతంగా వ్యవహరిస్తోందనే తప్పుడు సంకేతాలను జనసేన శ్రేణుల్లోకి పంపడం ద్వారా కూటమి బంధాన్ని దెబ్బతీయాలని వైసీపీ భావిస్తోంది.  గతంలో అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ వంటి కాపు సామాజిక వర్గ నేతలను ఉపయోగించి చేసిన ప్రయోగాలు విఫలం కావడంతో, ఇప్పుడు కొడాలి నాని వంటి కమ్మ సామాజిక వర్గ నేతను ముందుంచి ఈ కుల సమీకరణాల మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. అయితే, ఈ తరహా కుల విభజన వ్యూహాల వల్ల సమాజంలో తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. నిందితుల బ్యాంక్ ఖాతాల స్తంభన, ఈడీ (ED) మరియు ఎన్ఐఏ (NIA) విచారణల వంటి కీలక అంశాల నుండి తాడేపల్లి ప్యాలెస్ లింకులను దాచడానికే ఈ పక్కదారి పట్టించే వ్యూహాలు అమలు చేస్తున్నారని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.భవిష్యత్తు రాజకీయ ప్రభావం ఈ పరిణామాలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మరియు రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.  విశ్లేషకుల అంచనాల ప్రకారం, వైసీపీ అనుసరిస్తున్న ఇటువంటి కుల విభజన వ్యూహాలు ఆ పార్టీకే మరింత గండంగా మారేలా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ ఓట్ బ్యాంకులో దాదాపు 20 శాతం మేర భారీ పతనం నమోదైనట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా, వైసీపీ అంతర్గత శ్రేణుల్లోనే దాదాపు 70 శాతం మంది కార్యకర్తలు మరియు నాయకులు ప్రస్తుత నాయకత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం. కూటమి ప్రభుత్వం ఈ రకమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలను సమర్థవంతంగా మరియు చట్టపరంగా ఎదుర్కోకపోతే, అది విపక్షానికి కొంత మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కూటమి నాయకత్వం అభివృద్ధి అజెండాతో పాటు ఇటువంటి కుట్రలపై కఠినంగా వ్యవహరిస్తే, 2029 ఎన్నికల నాటికి వైసీపీ రాజకీయ ఉనికి మరింత ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, సమన్వయం భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగితే, విపక్షాల కుల వ్యూహాలు పూర్తిగా అట్టర్ ప్లాప్ అవుతాయి. ఇలాంటి అంశలపై పూర్తి చర్చను  టోన్ న్యూస్‌లో తప్పక వీక్షించండి.    Kodali Nani Comments, AP Politics, Ankamma Rao Analysis, TDP Janasena Alliance, YSRCP Strategy,   CM Chandrababu Naidu, Pawan Kalyan, Kamma Kapu Politics, Andhra Pradesh News, Tone News Telugu.
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన యూట్యూబర్  ప్రశ్న రావణ్   అరెస్ట్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశద్రోహ పూరిత వ్యాఖ్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం  ఉపా  కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా కోర్టులో జరుగుతున్న విచారణలో నిందితుడికి న్యాయ సహాయం అందించడానికి ఆయన ముందుకు వచ్చారు.  ఈ వివాదాస్పద కేసులో గన్నవరం పోలీసులు నిందితుడిని మరింత లోతుగా విచారించేందుకు  10 రోజుల పాటు  కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం కోర్టులో   పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున దాఖలైన ఈ కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు జరగనున్న నేపథ్యంలో..  రావణ్ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించనున్నారు.    Prasna Ravan UAPA Case, Ponnavolu Sudhakar Reddy, Joseph Ravan Arrest, Gannavaram Court News, YSRCP Legal Aid, AP Political News.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ కు ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో సర్జరీ జరగనుంది.  గత కొంతకాలంగా పవన్ కల్యాణ్  తీవ్రమైన భుజాల  నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే..  ఆయనకు ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు అత్యవసరంగా సర్జరీ చేయించుకోవాలని సూచించారు. జూన్ నెలాఖరులోనే ఆయన తన సతీమణి అన్నా కొణిదెలతో కలిసి ముంబై వెళ్లి సమగ్ర వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కల్యాణ్ కు వైద్యులు..  రెండు భుజాల రొటేటర్ కఫ్  దెబ్బతిందని చెప్పారు.  అలాగే రెండు ప్రధాన భుజాల కండరాలు పూర్తిగా చిట్లిపోయాయనీ పరీక్షల్లోతేలినట్లు వైద్యులు తెలిపారు.  పరిస్థితి తీవ్రతను బట్టి వెంటనే శస్త్రచికిత్స అవసరమని అప్పుడే చెప్పారు. అందరూ కూడా  పవన్ కల్యాణ్ సర్జరీ తరువాతే ముంబై నుంచి తిరిగి వస్తారని అప్పట్లో భావించారు. అయితే..    రాష్ట్రంలో ఉన్న ముందస్తు  పాలనా బాధ్యతలు, కీలకమైన  అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని పవన్ కళ్యాణ్ వైద్యులకుచెప్పారు.   ఇప్పుడు ఆయన తీరిక చేసుకుని భుజాలకు సర్జరీ చేయించుకోవడానిక మంబై బయలుదేరారు.  తాజా సమాచారం మేరకు.. శనివారం  (జూలై 11)  పవన్ కు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో  మొదటి విడత సర్జరీ జరుగుతుంది.  ఆ తర్వాత కొద్ది రోజుల విరామం ఇచ్చి, పరిస్థితిని బట్టి రెండో భుజానికి కూడా వౌద్యులు సర్జరీ చేస్తారు. ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు  పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో..  పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రజా ప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కీలక నేతలకు తాను నెల రోజుల పాటు అందుబాటులో ఉండననీ, ఆ సమయంలో   పార్టీ ప్రజా ప్రతినిధులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి, , క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు.   Pawan Kalyan to undergo shoulder surgery in Mumbai, Shoulders Injury, Gabbarsingh Moovie, kokila Dhirubhai Ambani, Hospital
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. రాయలసీమ వ్యాప్తంగా ప్రధాన పార్టీల నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో   ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలపై తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మధుసూదన్ రెడి మాట్లాడారు.  రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను సృష్టించి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు వైసీపీ కుట్రలు పన్నుతోందని మధుసూదన్ రెడ్డి అన్నారు.    ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి,  ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా బట్టకాల్చి మీదేసే రాజకీయాల వల్ల ప్రజల్లో నేతలపై నమ్మకం సడలిపోతుందన్నారు. గతంలో కాపు సామాజిక వర్గంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు, ఆ తర్వాత దళిత క్రైస్తవ అంశాలను తెరపైకి తెచ్చి అలజడులు సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ వరుస ఎపిసోడ్లను నడిపిందన్న ఆయన..  ఇప్పుడు రాప్తాడు, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో పరిటాల సునీత కుటుంబం, స్థానిక ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఒకేసారి దాడులకు దిగడం వెనుక రాజకీయ వైరుధ్యాన్ని శాంతిభద్రతల సమస్యగా మార్చే కుట్ర దాగి ఉందన్నారు. అహోబిలం దేవస్థానం సొమ్ముపై గంగుల కుటుంబం చేస్తున్న ఆరోపణలు కూడా ఇందులో భాగమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినప్పటికీ కాంట్రాక్ట్ పనులు, లిక్కర్ వ్యాపారాల్లో అవినీతి ఇంకా పూర్తిగా సమసిపోలేదన్న మధఉసూదన్ రెడ్డి.. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో జరుగుతున్న సీసీ రోడ్ల పనుల్లో కూడా కొందరు ప్రభుత్వ అధికారులు ఏడు శాతం వరకూ లంచాలు డిమాండ్ చేస్తున్నారని, ఈ విషయమై ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్   దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరిట సొంత వారికి కట్టబెట్టిన గాలేరు, నగరి, హంద్రీనీవా పనుల్లో జాప్యం వల్లే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం మీడియా ముందుకు వచ్చి సవాళ్లు విసురుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని, నాలుగు మసాలా వార్తలు వినా నిజాలు బయటకు రావన్నారు. ఎవరైనా అసత్య ఆరోపణలు చేస్తే..  బాధితులు తక్షణమే స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించారు. చట్టపరమైన విచారణ జరిపించి, ఆధారాలు చూపని వారిని కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి పోకడలకు అడ్డుకట్ట పడుతుందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ప్రశాంతమైన వాతావరణం కొనసాగాలన్నా కూటమి ప్రభుత్వం అలజడులు సృష్టించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని, చట్టబద్ధ పాలనను గౌరవిస్తూ తప్పుడు ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే ఏపీలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉంటాయని, తద్వారా రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని విశ్లేషించారు. AP Politics Analysis,  MS Raju vs Thopudurthi Prakash Reddy,  Rayalaseema Political Riots, Kutami Government Law and Order
ALSO ON TELUGUONE N E W S
కొన్ని సినిమాలు ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, ప్రేమ, మిస్టరీ కలిసిన అలాంటి కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్న ఓ భారీ కాన్సెప్ట్ సినిమా ఘనంగా ప్రారంభమైంది.   రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ అధికారికంగా లాంచ్ అయ్యింది. సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్, 'టైగర్', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం' వంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ఆయన దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.   టాలీవుడ్ లో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ సినిమాల స్థాయిని తన వినూత్న స్టొరీ టెల్లింగ్ తో మార్చిన విఐ ఆనంద్ అందించిన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలాజీ గుట్ట,  కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కమలాకర్ ఫిల్మ్ కార్పొరేషన్ సహకారం అందిస్తోంది. ఆసక్తికరమైన కాన్సెప్ట్, భారీ స్థాయి నిర్మాణంతో ఈ చిత్రం సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. కాకతీయ హిల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. హీరో నిఖిల్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ కెకె సెంథిల్ కుమార్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు. విఐ ఆనంద్ స్క్రిప్ట్‌ను చిత్ర బృందానికి అందజేయడమే కాకుండా, ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఫాంటసీ, రొమాన్స్, కామెడీ, మిస్టరీ, సైన్స్ ఫిక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం, ఊహలు, భావోద్వేగాలు, అద్భుతమైన దృశ్యాలతో కూడిన ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళ్లనుంది. పూర్తి స్థాయి థియేట్రికల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి మలుపు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, ప్రతి భావోద్వేగం చెరగని ముద్ర వేస్తుందని చిత్ర బృందం హామీ ఇస్తోంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. అన్వేష్ వరాల సినిమాటోగ్రాఫర్ గా, చోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతుండగా, రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.      Roshan Kanakala, VI Anand, Tollywood, TeluguOne  
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరించడంలో ఎప్పుడూ ముందుంటారు. ఈసారి ఆయన ఒక వైల్డ్ రైడ్‌తో ముందుకు రాబోతున్నారు. ఇండో-కొరియన్ బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ హారర్ కామెడీ మూవీ 'కొరియన్ కనకరాజు' (Korean Kanakaraju). ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో విడుదలై ఒక్కసారిగా సెన్సేషన్ సృష్టించింది. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 ఆగస్టు 7న ఈ వైల్డెస్ట్ హారర్ కామెడీ రైడ్‌ ప్రేక్షకులు ముందుకు రానుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. పోస్టర్‌లో వరుణ్ తేజ్ ఒక లగ్జరీ కుర్చీలో రస్టిక్ అండ్ స్టైలిష్ లుక్‌తో కూర్చొని ఉన్నారు. కోర మీసం, లుంగీ కట్టు, చేతిలో కత్తితో వరుణ్ తేజ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ చూస్తుంటేనే ఇదొక విభిన్నమైన ఇండో-కొరియన్ కల్చరల్ మిక్స్ అని, హారర్ ఎలిమెంట్స్‌తో సరికొత్తగా సినిమా సాగనుందని స్పష్టమవుతోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. తనదైన మార్క్ హిలేరియస్ కామెడీతో వినోదాన్ని పంచడంలో దిట్ట అయిన ఆయన, ఈసారి హారర్ ఎలిమెంట్స్, కొరియన్ డ్రామాను మిక్స్ చేసి సరికొత్త మ్యాజిక్ చేయబోతున్నారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అందాల భామ రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. థమన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని అందిస్తున్నారు. హారర్ కామెడీ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందుకే థమన్ తన మార్క్ అదిరిపోయే రీ-రికార్డింగ్, సాంగ్స్‌తో ఈ చిత్రాన్ని మరో లెవెల్‌కు తీసుకువెళ్లనున్నారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఇండో-కొరియన్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో ప్రేక్షకులకు ఒక సరికొత్త విజువల్ అండ్ కామెడీ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఆగస్టు 7న రాబోతున్న ఈ క్రేజీ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. https://x.com/UV_Creations/status/2075529304994460007 Varun Tej, Korean Kanakaraju, Merlapaka Gandhi, Ritika Nayak, TeluguOne  
Varun Tej's upcoming horror comedy Korean Kanakaraju is finally heading to theatres on August 7. The makers officially announced the release date with a new poster featuring the actor in an energetic avatar, signalling that promotions for the film are entering the final phase. Directed by Merlapaka Gandhi, Korean Kanakaraju has generated curiosity ever since its announcement because of its unusual cross-cultural premise. The film blends horror and comedy while exploring a story that unfolds across different cultures, making it one of the more unconventional Telugu releases this year. A major portion of the film has been shot in Vietnam, with the team choosing several unexplored international locations to give the film a fresh visual appeal. The promotional campaign has also worked in the film's favour. The first single, "Kamsahamnida," composed by Thaman S and sung by Sid Sriram, turned into a popular chartbuster and added to the buzz surrounding the project. The latest release date poster further hints at the film's colourful and entertaining tone. Apart from Varun Tej, the film stars Ritika Nayak as the female lead, while comedian Satya plays a key role. Given the success of Satya's comic timing in recent years, his combination with Varun Tej is expected to be one of the major highlights of the film. Backed by UV Creations, Korean Kanakaraju is aiming to capitalise on the beginning of the festive season. With an offbeat premise, overseas backdrop and a strong promotional response so far, the film will be looking to translate the pre-release buzz into box office success.   Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
నటీనటులు: అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ, జావేద్ జాఫేరి, సంజయ్ మిశ్రా, రవి కిషన్, ఉపేంద్ర లిమాయే, సంజీద షేక్, అంజలి ఆనంద్, ఈషా గుప్తా. సాంకేతిక బృందం: రచన: బల్వీందర్ సింగ్ సూరి, పరితోష్ పెయింటర్, వేద్ ప్రకాష్ ఛాయాగ్రహణం: సుధీర్ కె. చౌదరి కూర్పు (ఎడిటింగ్): సంజయ్ సంక్లా సంగీతం: తనిష్క్ బాగ్చి, ఆదిత్య దేవ్, నీల్ కమల్ సింగ్, సంజు రాథోడ్, గురు రాంధావా, గిల్ మచ్‌రాయ్, రోనీ అజ్నాలి, అమర్ మోహిలే దర్శకత్వం: ఇంద్ర కుమార్ నిర్మాతలు: అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, కిషన్ కుమార్, అశోక్ థాకేరియా, ఇంద్ర కుమార్, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్ అజయ్ దేవగన్ (Ajay Devgn) ప్రధానంగా ఫ్రాంచైజీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్నారు. గత చిత్రాలను ఆదరించిన ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని, సులభంగా విజయం సాధించాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఫ్రాంచైజీ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో  ఆసక్తి తగ్గుతున్నప్పటికీ, ఆయన మాత్రం ఆశించిన విజయం కోసం గట్టిగానే శ్రమిస్తున్నారు. ఇప్పుడు ఆయన 'ధమాల్ 4'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఎలా ఉందో వివరంగా తెలుసుకుందాం. కథ: ఒక నిధికి సంబంధించిన మ్యాప్ కోసం గుడ్డు రస్తోగి (Ajay Devgn), సముద్రపు దొంగల నాయకుడు అధూరా (Ravi Kishan) మధ్య పోరాటం జరుగుతుంది. ఆ మ్యాప్‌ను డీకోడ్ చేయడం కేవలం పృథ్వీ (Upendra Limaye)కి మాత్రమే తెలుసు. కానీ అతను గుడ్డు, అధూరాల నుండి తప్పించుకుంటాడు. మరోవైపు లల్లన్ (Riteish Deshmukh) ఒక ధనిక యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, కానీ పొరపాటున పారో (Anjali Anand)ను ధనవంతురాలని భావించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆది (Arshad Warsi), రోసీ (Sanjeeda Sheikh) దంపతులు. అయితే మానవ్ (Javed Jafferi) కారణంగా రోసీ అతనికి దూరంగా ఉంటుంది. ఈ సమయంలో గుడ్డు, ఆలియా (Esha Gupta)తో ప్రేమలో పడతాడు, కానీ ఆమె పిల్లలు అతన్ని అంగీకరించరు. పృథ్వీని వెంబడిస్తున్న క్రమంలో వీరందరికీ నిధి గురించి తెలుస్తుంది. చివరకు ఆ నిధిని ఎవరు దక్కించుకున్నారనేది మిగతా కథ. విశ్లేషణ: ఫ్రాంచైజీలోని పాత సినిమాలను గుర్తుచేసే (callbacks) సన్నివేశాలతో, అవే తరహా జోకులతో ప్రేక్షకులను నవ్వించడానికి ఈ సినిమా చాలా కష్టపడింది. ప్రతి సన్నివేశం పాత సీన్‌ని గుర్తుచేయడం లేదా రిపీట్ చేసినట్లుగా ఉంటుంది. అజయ్ దేవగన్ ఈ సినిమాలో పెద్దగా ఆసక్తి చూపించినట్లు అనిపించదు, పైగా అతని చాలా సన్నివేశాలు గ్రీన్ స్క్రీన్ ముందు చిత్రీకరించారు. నాసిరకం ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ (VFX) లోపాలు మిగతా వారికంటే ఆయన ఉన్న సన్నివేశాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. తెరపై మంచి కథలను చెప్పాలనే ప్రయత్నాన్ని ఆయన దాదాపుగా వదులుకున్నట్లే అనిపిస్తుంది. రితేష్ దేశ్‌ముఖ్‌కు కాస్త మెరుగైన కథాంశం దక్కినా, అంజలి ఆనంద్‌తో అతని కెమిస్ట్రీ అంతగా పండలేదు. సంజీద షేక్ కనిపించే ఫ్రేమ్‌లు అతిగా ఎడిట్ చేసినట్లు (ఎయిర్‌బ్రెష్డ్) అనిపిస్తాయి. జావేద్ జాఫేరి జోకులు కూడా పెద్దగా నవ్వించవు. ఈ సినిమా  కొన్ని హాలీవుడ్ కామెడీల్లో పాపులర్ అయిన కామెడీ సన్నివేశాలను ఎలాంటి ఉద్దేశ్యం లేకుండా వరుసగా పేర్చినట్లుగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ పనితీరు ఎంత పేలవంగా ఉందంటే, దర్శకుడు కూర్చుని ఆలోచించి తీసినట్లు కాకుండా ప్రతి ఫ్రేమ్ ఏదో ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో ఎడిట్ చేసినట్లుగా ఉంటుంది. రవి కిషన్ సన్నివేశాలు, ఉపేంద్ర లిమాయే పాత్ర, అలాగే సినిమాలోని ప్రతి అంశం మొదట్నుంచి చివరి వరకు చాలా నిరాశపరుస్తాయి. ధమాల్ సినిమా అనూహ్య విజయాన్ని సాధించింది. డబుల్ ధమాల్, టోటల్ ధమాల్ చిత్రాలు పెద్దగా కష్టపడకపోయినా సక్సెస్ అయ్యాయి. నాలుగో సినిమా కూడా అదే దృక్పథంతో తీసినట్లు తెలుస్తోంది. అక్కడక్కడా కొన్ని మంచి సన్నివేశాలు ఉన్నప్పటికీ, సినిమా మొత్తం చాలా సాగదీసినట్లుగా, హాస్యం లోపించినట్లుగా ఉండటంతో అవి కూడా ఆకట్టుకోవు. మొత్తానికి ఇది మరో ఫ్రాంచైజీ కిల్లర్ అని చెప్పొచ్చు! ప్లస్ పాయింట్స్: కొన్ని మంచి సన్నివేశాలు మైనస్ పాయింట్స్: నటీనటుల పనితీరు విజువల్ ఎఫెక్ట్స్ (VFX)పై అతిగా ఆధారపడటం కొత్త జోకులు లేకపోవడం పాత సన్నివేశాలను గుర్తుచేస్తూ ప్రేక్షకులను నవ్వించడానికి అతిగా ప్రయత్నించడం చివరి గా : ధమాల్  కాదు .. ఢమాల్!! రేటింగ్: 2/5   డిస్క్లైమర్: ఈ సమీక్షలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు పూర్తిగా రచయిత వ్యక్తిగతమైనవి. వీటికి సంస్థకు ఎలాంటి బాధ్యత ఉండదు. పాఠకులు తమ సొంత విచక్షణతో వీటిపై స్పందించాలని సూచిస్తున్నాము.  
Cast: Ajay Devgn, Riteish Deshmukh, Arshad Warsi, Javed Jafferi, Sanjay Mishra, Ravi Kishan, Upendra Limaye, Sanjeeda Sheikh, Anjali Anand, Esha Gupta Crew:  Written by Balvinder Singh Suri, Paritosh Painter, Vedd Prakash Cinematography by Sudhir K. Chaudhary Edited by Sanjay Sankla Music by Tanishk Bagchi, Aditya Dev, Neelkamal Singh, Sanju Rathod, Guru Randhawa, Gill Machrai, Rony Ajnali, Amar Mohile Directed by Indra Kumar Produced by Ajay Devgn, Bhushan Kumar, Krishan Kumar, Ashok Thakeria, Indra Kumar, Anand Pandit, Kumar Mangat Pathak Ajay Devgn has been working majorly in franchise films. He is targetting the audiences who loved earlier films and trying to find an easy success. While the franchise fatigue is catching up, he is still trying hard to find that eluding success. Now, he has come up with Dhamaal 4 and let's discuss about the film in detail.  Plot: Guddu Rastogi (Ajay Devgn) fights with Pirate Leader Adhoora (Ravi Kishan) for the map of a treasure. Only Prithvi (Upendra Limaye) can decode the map but he escapes from Guddu and Adhoora. Lallan (Riteish Deshmukh) wants to marry a rich girl but he misunderstands Paaro (Anjali Anand) for a rich person. He marries her. Adi (Arshad Warsi) is married to Rosy (Sanjeeda Sheikh) and she stays away from him due to Manav (Javed Jafferi). Meanwhile Guddu falls in love with Aaliya (Esha Gupta) but her kids doesn't accept him. All of them get to know about the treasure while chasing Prithvi and who will find it forms the rest of the film.  Analysis: The movie tries hard to sell the similar jokes with call backs to the franchise films. Each scene is either a call back or a repeat of the similar scene. Ajay Devgn looks completely disinterested and many of his scenes are shot with a green screen. The shoddy edit and VFX are very clearly visible with him on screen more than others. He seems to be more or less given up on trying to tell good stories on screen.  Riteish Deshmukh gets better storyline but his chemistry with Anjali Anand is not absolutely perfect to route for him. Sanjeeda Sheikh frames look too airburshed and Javed Jafferi jokes don't land either. The film feels like a random exhibition of gags that are popular within the franchise and in some Hollywood comedies. VFX work is so forgettable that every frame looks like an After Effects edit rather than people really sitting through and putting a thought to it.  Ravi Kishan scenes, Upendra Limaye character and every beat just becomes abysmal from start to end. Dhamaal became a surprise hit and Double Dhamaal, Total Dhamaal succeeded despite being low on effort. Looks like the fourth film is also made with similar outlook. While some genuine moments seem to be attempted at places but they do not land well enough as the movie just feels too draggy and unfunny. Another franchise killer!  Positives: Few Genuine Moments Negatives: Actors Performances Over dependency on VFX No Original jokes Try too Hard to tickle audiences with call backs Bottomline: No Dhamaal only noise!  Rating: 2/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ రామ్ చరణ్ కెరీర్ లో 17వ సినిమాగా రానుంది. అయితే, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక సెన్సేషనల్ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌ లో, రూటెడ్ నేటివిటీతో సాగే పవర్‌ఫుల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనుందని టాక్ వినిపిస్తోంది. గత కొన్ని కాలంగా తెలుగు సినీ పరిశ్రమలో నేటివిటీ కథలకు, ముఖ్యంగా తెలంగాణ మట్టి వాసనతో కూడిన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 'బలగం', 'దసరా' వంటి భారీ విజయాలే  అందుకు ఉదాహరణ. 'ఎల్లమ్మ', 'ఇడుపు కాయితం' వంటి సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. గత కొన్నేళ్లలో విడుదలైన ఎన్నో తెలంగాణ బేస్డ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో రికార్డులను సృష్టించాయి. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, రా అండ్ రస్టిక్ ఇంటెన్సివ్ కథలకు గ్లోబల్ వైడ్‌గా ఆదరణ పెరుగుతుండటంతో మేకర్స్ కూడా ఇటువైపే మొగ్గు చూపుతున్నారు. సుకుమార్ ఇప్పటికే అల్లు అర్జున్‌తో 'పుష్ప' సిరీస్‌ను ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు శేషాచలం అడవుల నేపథ్యంలో ఎంతో క్వాలిటీగా చూపించారు. ఇప్పుడు చరణ్ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ తెలంగాణ రూటెడ్ స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. సుకుమార్ ప్రతి స్క్రిప్ట్‌పై చాలా సమయం తీసుకుని, ప్రతి పాత్రను ఎంతో సహజంగా మలుస్తారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం మూడు విభిన్నమైన ఐడియాలను పరిశీలించి, చివరికి ఒక అద్భుతమైన లైన్‌ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ఇటీవల స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'తో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు మరోసారి రూరల్ కథలో నటించనున్నారని టాక్.  ఏదేమైనా చరణ్ మాస్ యాసతో తెలంగాణ నేపథ్యంలో సుక్కు మార్క్ టేకింగ్‌లో వస్తే థియేటర్లు బద్దలైపోవడం గ్యారెంటీ. దీనిపై అధికారిక ప్రకటన కోసం మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.     Ram Charan, Sukumar, RC17 Movie, Telangana  
  తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు, కొన్ని క్యారెక్టరైజేషన్లు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన మైలురాయి చిత్రం 'రంగస్థలం'. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)పోషించిన 'చిట్టిబాబు' రోల్  తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. 1980ల నాటి పల్లెటూరి వాతావరణంలో, వినికిడి లోపం ఉన్న ఒక సాధారణ యువకుడిగా చరణ్ చూపించిన నటన ఊహాతీతం. సుకుమార్ దర్శకత్వంలో 2018 లో వచ్చి  బాక్సాఫీస్ వద్ద దాదాపు 216 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డులను సృష్టించింది. కేవలం వసూళ్లే కాదు, ఒక కమర్షియల్ హీరో తన ఇమేజ్ పక్కన పెట్టి ఇలాంటి క్యారక్టర్ చేయగలడా అని అందరూ ముక్కున వేలేసుకునేలా చరణ్ నటన సాగింది. చరణ్ నటుడిగా వంద శాతం పరిపూర్ణత సాధించాడనే ప్రశంసలు దక్కాయి. ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని(Akhil Akkineni)లెనిన్(Lenin)కి రంగస్థలానికి మూవీ లవర్స్ పోలికలు తెస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు స్పందిస్తూ 'అఖిల్ మొదటి చిత్రం నుంచి అన్ని సినిమాలు చూస్తూ ఉన్నాం. ఆ చిత్రాల్లో లేని ఒక మెస్మరైజ్  లెనిన్ ద్వారా అఖిల్ లో చూసాం. గ్రామీణ యువకుడిగా రంగస్థలంలో చరణ్ ఎలా అయితే అన్ని రకాల వేరియేషన్స్ ఉన్న క్యారక్టర్ లో కనిపించాడో, అఖిల్ కూడా లెనిన్ లో అంతే కనిపించాడు. క్యారక్టర్ డిజైన్ పరంగా రెండు చిత్రాల్లోని క్యారెక్టర్స్ తమ గుండెల్లో మండుతున్న పగ యొక్క అగ్నిజ్వాలాన్ని పర్ఫెక్ట్ గా చూపించాలి. అప్పడే కథ యొక్క తీవ్రత ప్రేక్షకుల హృదయాల్లోకి వెళ్తుంది. ఆ తీవ్రతని చరణ్, అఖిల్ పర్ఫెక్ట్ గా పండించారని, చిట్టిబాబు రోల్  ఎలాగైతే చరణ్ కెరీర్ కి టర్నింగ్ గా నిలిచిందో, అఖిల్ కెరీర్‌ లెనిన్ తో మలుపు తిరిగినట్టే అని కామెంట్స్ చేస్తున్నారు.  Also read: Lenin: హమ్మయ్య గండం దాటారు.. ఎవర్రా ఐరెన్ లెగ్! స్టిల్ లెనిన్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రివ్యూస్ కూడా ప్యూర్ పాజిటివ్ గా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో లెనిన్ సాధించే ఫస్ట్ డే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.  
సినిమా ఇండస్ట్రీలో స్టార్‌డమ్ రాగానే చాలామంది నటీనటులు తమ పంథా మార్చుకుంటారు. కానీ, గ్లామర్ ప్రపంచంలో ఉంటూ కూడా తనకంటూ కొన్ని ప్రత్యేకమైన విలువలు, సిద్ధాంతాలను ఏర్పరచుకుని, వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ 'లేడీ పవర్ స్టార్'గా ఎదిగిన అరుదైన నటి సాయి పల్లవి. మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలో మలర్ పాత్రతో దక్షిణాది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ బ్యూటీ, ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'ఫిదా' చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ఇక్కడి ప్రేక్షకులను ఆక‌ట్టుకొని అద్భుతమైన స్టార్‌డమ్ సంపాదించుకుంది. వరుస హిట్లతో సౌత్ అగ్ర కథానాయికగా దూసుకుపోతున్నా, తాను స్టార్ అనే గర్వాన్ని తలకెక్కించుకోకుండా ఎప్పుడూ ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆమెది. తాజాగా సినిమాల్లో అవకాశాల కోసం వెంపర్లాడనని, తన వ్యక్తిగత విలువల కంటే ఏదీ ఎక్కువ కాదంటూ సాయి పల్లవి చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవికి ఒక సూటియైన ప్రశ్న ఎదురైంది. దర్శకులు ఎప్పుడైనా మిమ్మల్ని ముద్దు సన్నివేశాల్లో నటించమని అడిగారా, అసలు అలాంటి సీన్స్ చేయకూడదని మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు అని యాంకర్ అడగ్గా, సాయి పల్లవి ఏమాత్రం తడబడకుండా, చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు. అవును, ఇప్పటికీ చాలా మంది దర్శకులు నన్ను ముద్దు సన్నివేశాల్లో నటించమని అడుగుతూనే ఉంటారు, నేను అలాంటి సీన్స్ చేయనని స్పష్టంగా తెలిసినా కూడా ఇప్పటికీ ఆ తరహా ఆఫర్లు వస్తూనే ఉంటాయని ఆమె వెల్లడించారు. ఒకవేళ నాకు ఒక జీవిత భాగస్వామి లేదా బాయ్‌ఫ్రెండ్ ఉండి ఉంటే, కేవలం సినిమా నటన కోసమైనా సరే మరొక వ్యక్తిని ముద్దు పెట్టుకోవడం అనేది నా మనస్సాక్షికి సరైందిగా అనిపించదని ఆమె స్ప‌ష్టం చేశారు. ఇదే క్రమంలో డబ్బు, విలాసవంతమైన జీవితంపై తనకున్న దృక్పథాన్ని కూడా సాయి పల్లవి ఎంతో హుందాగా వివరించారు. ఒక సాధారణ మనిషి ఈ సమాజంలో సంతోషంగా ప్రశాంతంగా జీవించడానికి ఒక మంచి కుటుంబం, తలదాచుకోవడానికి ఒక ఇల్లు, ప్రయాణించడానికి ఒక కారు ఉంటే చాలు అని ఆమె అన్నారు. దేవుడి దయ వల్ల ఆ వసతులన్నీ తనకు ఇప్పటికే ఉన్నాయని, అంతకు మించి ఇంకో లగ్జరీ కారు కొనడానికో, లేదా మరింత విలాసవంతమైన జీవితాన్ని గడపడానికో తాను డబ్బు కోసం కక్కుర్తి పడి మరొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని అన్నారు. తనకు ఉన్నదానితోనే ఎంతో తృప్తిగా, సంతోషంగా ఉన్నానని చెప్పారు. కేవలం తన నటన నచ్చి, ఆ పాత్రకు తాను 100 శాతం న్యాయం చేయగలనని నమ్మి ఎంపిక చేసుకుంటేనే సినిమాలు చేస్తానని, ఒకవేళ కథలో ఇంటిమేట్ లేదా ముద్దు సన్నివేశాలు అంత ప్రాధాన్యమైతే, తన స్థానంలో అలాంటి అభ్యంతరాలు లేని వేరే హీరోయిన్‌ను తీసుకోవచ్చని, అందులో తనకు ఎలాంటి కోపం గానీ, అభ్యంతరం గానీ ఉండదని చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సినిమా అవకాశాలు, కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కంటే తన ఆత్మగౌరవానికి, వ్యక్తిగత విలువలకే ప్రాధాన్యత ఇచ్చిన ఆమె నిర్ణయాన్ని చూసి నెటిజన్లు "దటీజ్ సాయి పల్లవి" అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.     Sai Pallavi, Sai Pallavi Kissing Scenes, Tollywood Updates
  అక్కినేని అభిమానుల మోస్ట్ అవైటెడ్  మూవీ 'లెనిన్' ఈ రోజు వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. ఎర్లీ మార్నింగ్ నుంచే షోస్ ప్రదర్శించడంతో అక్కినేని అభిమానులు చాలా ఉద్వేగపూరితమైన వాతావరణంలో  థియేటర్స్ లో అడుగుపెట్టారు.  ప్రేక్షకులది కూడా ఇంచు మించి అదే పరిస్థితి.  ఇందుకు కారణం ఉంది. అఖిల్ తొలి చిత్రం 'అఖిల్' మూవీ నుంచి ప్రీవియస్ మూవీ ఏజెంట్ వరకు అఖిల్ కి హిట్ అనేది అందని ద్రాక్షగా మారింది. హీరో కట్ అవుట్, అందం, పెర్ఫార్మ్ అన్ని ఉన్నా హిట్ ని మాత్రం అందుకోలేకపోతుండటంతో అభిమానుల్లో తెలియని దిగులు పట్టుకుంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ కొంచం బెరుకుగానే  థియేటర్స్ లోకి అడుగుపెట్టారు. కానీ ఒక్కసారిగా థియేటర్స్ లోకి  అడుగుపెట్టగానే క్రమం క్రమంగా  భయాలు అన్ని పటాపంచలు.  సినిమా రన్ అవుతున్న కొద్దీ, స్క్రీన్ పై అఖిల్ పెర్ఫార్మ్ చేస్తున్న కొద్దీ సినిమా హిట్ అని తేలిపోయిందంటూ సంబరాల్లో మునిగిపోయారు.  ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ లో అఖిల్ పెర్ఫార్మ్ కి స్టాండింగ్ ఒవేషన్ సైతం ఇచ్చారు. ఈ నేపథ్యంలో  వాళ్ళ కళ్ళల్లో అఖిల్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని, పైగా ఊర మాస్ హిట్ కొట్టాడనే ఆనందం కనపడింది. Also read: Lenin: లెనిన్ హైలెట్స్ ఇవే.. హిట్ కొట్టినట్టేనా! భాగ్యశీ బోర్సే విషయానికి వస్తే  తను సిల్వర్ స్క్రీన్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే  అందం, పెర్ఫార్మ్ పోటీపడుతున్నాయేమో అనిపిస్తుంది. కళ్ళతోనే తన క్యారక్టర్ భావజాలాన్ని చాలా బలంగా చాటగలదు. లెనిన్ ముందు వరకు చేసిన సినిమాలు ప్లాప్. దీంతో ఐరన్ లెగ్ అనే టాగ్ లైన్ ఇవ్వడానికి ఒక బ్యాచ్ రెడీ అయ్యింది . అలాంటి టైంలో లెనిన్ తో వచ్చింది. రావడమే కాదు మెస్మరైజ్ చేసే పెర్ ఫార్మ్ ని ప్రదర్శించడంతో పాటు అఖిల్ లా లెనిన్ విజయానికి కారణమైంది. థియేటర్స్ లో భాగ్యశ్రీ బోర్సే ప్రదర్శించిన పెర్ఫార్మ్  కి  ఎవర్రా ఐరెన్ లెగ్  విత్ షార్ట్ పీరియడ్ భాగ్యశీ అగ్ర హీరోయిన్ అవ్వడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.   
"అయ్యగారే నెంబర్ వన్" అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. గతంలో అఖిల్ అక్కినేని సినిమా విడుదల సందర్భంగా "ఎవరి వల్ల కాదు.. అఖిలే కరెక్ట్.. అయ్యగారే నెంబర్ వన్" అంటూ ఒక డై హార్డ్ ఫ్యాన్ చెప్పిన మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అప్పటినుంచి అఖిల్ ని అందరూ అయ్యగారు అని పిలవడం స్టార్ట్ చేశారు. తనకంటే తన ఫ్యాన్ ఎక్కువ పాపులర్ అవుతున్నాడంటూ స్వయంగా అఖిల్ ఎంతో సంతోషంగా చెప్పాడంటే.. ఆ ఫ్యాన్ చెప్పిన "అయ్యగారే నెంబర్ వన్" డైలాగ్ ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ డైలాగ్ చెప్పిన అక్కినేని ఫ్యాన్, ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వచ్చాడు. అఖిల్ తాజాగా "లెనిన్" సినిమాతో థియేటర్లలో అడుగుపెట్టాడు. కెరీర్ స్టార్టింగ్ నుండి భారీ కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు.. మొదటి షో నుంచే ఈ సినిమా ఆ నమ్మకాన్ని కలిగించింది. అన్ని చోట్లా పాజిటివ్ టాక్ తో, థియేటర్ల దగ్గర అక్కినేని అభిమానుల హంగామా కనిపిస్తోంది. అయితే ఎంతమంది ఉన్నా "అయ్యగారే నెంబర్ వన్" డైలాగ్ చెప్పిన ఫ్యానే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.    Akhil Akkineni, Lenin Movie, Ayyagaru, Trending, TeluguOne  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య ముడిపడేదే కాదు.. రెండు కుటుంబాల మధ్య ముడిపడే బంధం.  భారతదేశంలో చాలా వరకు వివాహం తర్వాత అమ్మాయి అత్తవారింటికి వెళుతుంది.  భర్త, అత్తమామలతో కలిసి జీవిస్తుంది.  అత్తారింట్లో అత్తమామలు మంచివాళ్లు, కోడలిని అర్థం చేసుకుని బాగా చూసుకునేవాళ్లు అయితే ఆ ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా ఉంటుంది. కానీ కోడలిగా వచ్చిన ఆడపిల్లను బాధపెట్టే అత్తమామలు ఉంటే.. ఆ ఆడపిల్లల జీవితం నరకప్రాయంగా ఉంటుంది.  అయితే.. బాధపెట్టే అత్తమామలు ఉన్నారని, వివాహ బంధాన్ని తెంచుకుని వెళ్లలేరు చాలామంది అమ్మాయిలు,  బాధపెట్టే అత్తమామలతో  ఎలా ఉండాలో,  వాళ్లతో కలిసి ఎలా జీవించాలో లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు..  వీటి గురించి తెలుసుకుంటే.. మార్చాలని అనుకోకూడదు.. కొన్నిసార్లు  అత్తమామలు కోడళ్ల మీద ఒత్తిడిని, ఇబ్బందులను కలిగిస్తారు. బాధపెట్టే అత్తమామల గురించి చాలా మంది జోక్ గా చెప్తూ ఉంటారు. కానీ బాధపెట్టే అత్తమామలు ఉండటం జోక్ కాదు.. అది ఆడపిల్లలను చాలా బాధపెడుతుంది, చాలా ఒత్తిడిలోకి నెడుతుంది.  అలాంటి అత్తమామలు  మానసిక ప్రశాంతతను, వివాహ బంధాన్ని కూడా ప్రభావితం చేస్తారు. చాలా మంది కోడళ్లు తమ అత్తమామలు మారితే బాగుండు అని అనుకుంటారు. కానీ అత్తమామలు మారాలని,  వాళ్లను  మార్చాలని అనుకోవడం వ్యర్థం. అత్తమామలు ఏ విషయాల పట్ల బాధపెడతారో తెలిసినప్పుడు వాటి గురించి పట్టించుకోకుండా ఉండటమే  మంచిది. పరిమితులు..  బాధపెట్టే అత్తమామలు ఉన్నప్పుడు, ప్రతి కోడలు తన భర్త సహాయంతో  కొన్ని సొంత పరిమితులను నిర్దేశించుకుని, వాటికి కట్టుబడి ఉండడం  మంచిది. పరిమితులు ఏర్పాటు చేసుకున్నప్పుడు పెద్దవాళ్లు, అత్తమామలు మాట్లాడే ఏ మాటలు లేదా ప్రవర్తన పరిమితులను దాటి జీవితంలోకి తీసుకుని బాధపడే పరిస్థితి రాదు.   సమస్య, పరిష్కారం.. ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు, దాని మూల కారణాన్ని అర్థం చేసుకోవడం ముఖ్యం. అత్తమామల చెడు  ప్రవర్తన అకస్మాత్తుగా జరగదు. వారు ప్రతీదీ తమకు నచ్చినట్టుగా జరగాలని కోరుకోవడం, తమ భావాలను అదుపు చేసుకోలేకపోవడం, లేదా గతంలోని మానసిక గాయాలను మోయడం వంటి కారణాల వల్ల ఇది తరచుగా జరుగుతుంది. కొన్నిసార్లు, అత్తమామలు కోడలు పెరిగిన విధానాన్ని, కోడలి పుట్టింటి వారి పద్దతులను,  నియమాలను అగౌరవపరుస్తారు, మరికొన్ని సార్లు  స్వార్థపరురాలు అనే ట్యాగ్ వేసి  వ్యక్తిగత స్వేచ్ఛను ఉల్లంఘిస్తారు, లేదా కుటుంబంలో కలహాలు సృష్టించి కోడలిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పద్ధతులను గుర్తించడమే కోడళ్లు అత్తారింట్లో బాధపెట్టే అత్తమామలతో కలిసి ఎలా జీవించాలనే విషయాన్ని అర్థమయ్యేలా చేస్తాయి.                                      *రూపశ్రీ.
వేసవి సెలవలు పూర్తయ్యాక పిల్లలు స్కూల్ కు వెళ్లడం అనేది సహజం. పాఠశాలకు వెళ్లడం పిల్లల జీవితంలో పెద్ద మార్పుగా మారుతుంది. మరీ ముఖ్యంగా కొత్తగా స్కూల్ లో జాయిన్ అయిన పిల్లల విషయంలో ఇది మరింత ప్రభావవంతంగా ఉంటుంది. కొత్త వాతావరణం, కొత్త ఉపాధ్యాయులు, కొత్త తరగతులు మరియు కొత్త స్నేహితులు ఉత్సాహంతో పాటు ఆందోళనను కూడా కలిగిస్తాయి. చాలా మంది పిల్లలు మొదట్లో పాఠశాలలో తమకు ఎదురయ్యే విషయాలను, తమ మనసులోని విషయాలను  మనసు విప్పి చెప్పలేరు. అయితే తల్లిదండ్రుల బాధ్యత కేవలం పిల్లలను బడికి పంపడమే కాదు.. పిల్లల గురించి ఎన్నో విషయాలు తల్లిదండ్రులు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా..  కొత్తగా స్కూల్ కు వెళ్తున్న పిల్లలను కొన్ని ప్రశ్నలు తప్పకుండా అడగాలి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ప్రతిరోజూ పిల్లలను అడాగాల్సిన ప్రశ్నలు.. నచ్చిన విషయం.. ఈ రోజు పాఠశాలలో అన్నింటి కన్నా నీకు నచ్చిన విషయం ఏదని పిల్లలను అడగాలి.  ఈ ప్రశ్న పిల్లలో సానుకూల విషయాలను వెలికితీయడానికి సహాయపడుతుంది.  కొందరు పిల్లలు బడికి వెళ్లొచ్చిన తర్వాత మళ్లీ బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ బడిలో వారికి నచ్చిన విషయాన్ని గుర్తు చేయడం వల్ల పిల్లలకు పాఠశాల పట్ల ఉత్సాహం పెరుగుతుంది.  అలాగే తల్లిదండ్రులు పిల్లలతో ఇలా మాట్లాడటం వల్ల పిల్లలు  స్వేచ్ఛగా మాట్లాడటం నేర్చుకుంటారు,  ఏ విషయాన్ని అయినా బెరుకు లేకుండా చెప్పగలుగుతారు. ఇది పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. పిల్లలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో కూడా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది. ఎవరితో ఆడుకున్నావు లేదా మాట్లాడావు అని అడగాలి.. పిల్లలు పాఠశాలలో ఎవరితో ఆడుకున్నారు, మాట్లాడారు అనే విషయాలు కొత్త స్నేహితుల గురించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి సహాయపడుతుంది.  పిల్లలకు సామాజిక అవగాహన అర్థం అవుతుంది. పిల్లలు బడిలో ఒంటరిగా ఉంటారా లేదా ఇతరులతో కలుస్తున్నారా,  ఎవరితో అయినా కలవడంలో  ఇబ్బంది ఫీలవుతున్నారా?  అనే విషయాలు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులకు సహాయపడుతుంది. ఏదైనా భయం లేదా బాధ పెట్టే విషయం ఉందా అని అడగాలి.. కొందరు పిల్లలు స్కూల్ లో తోటి విద్యార్థుల వల్ల, ఉపాధ్యాయుల వల్ల బాధపడటం, భయపడటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల పిలల్లు బడికి  వెళ్లాలంటే భయపడటారు.  ఈ కారణంగా చదువు మీద ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పిల్లల భయాన్ని తగ్గించినప్పుడే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రోజు ఏం నేర్చుకున్నావని అడగాలి.. పిల్లలను  ఈ రోజు ఏం నేర్చుకున్నావని ప్రతి రోజూ అడిగితే వారికి ఏ విషయం పట్ల ఆసక్తి ఎక్కువ ఉందో అర్థమవుతుంది. తద్వారా పిల్లలను ప్రోత్సహించడంలో తల్లిదండ్రులకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇలా అడిగినప్పుడు పిల్లలు అన్ని చెబుతూ ఉంటే.. పిల్లలలో జ్ఞాపకశక్తి,  వారిలో బావ వ్యక్తీకరణ వంటివి మెరుగు పడతాయి.                          *రూపశ్రీ.
ప్రజల జీవితాలలో ముఖ్యమైనవి సంబంధాలు. నేటికాలంలో ఇంటర్నెట్, డిజిటల్ పరంగా ఎంత దూరంలో ఉన్నా ఎవరినీ పెద్దగా మిస్ కాకుండా పక్కనే ఉన్నట్టుగా పోన్ మాట్లాడటం, వీడియో కాల్స్ చేయడం వంటి మార్గాలలో దగ్గరగానే ఉన్నట్టు ఫీల్ అవుతారు. కానీ బంధాల మధ్య గతంలో కంటే అపార్థాలు,  గొడవలు, అతిగా స్పందించడం, జోక్యం చేసుకోవడం వంటివి కూడా గతంలో కంటే ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. వీటి వల్ల బంధాల మధ్య దూరం పెరుగుతుంది. అయితే నేటికాలంలో బంధాలు బలంగా ఉండాలంటే మైక్రో ప్రైవసీ పాటించాలట. ఇంతకీ మైక్రో ప్రైవసీ అంటే ఏంటి? ఇది బంధాలను బలంగా ఉంచడంలో ఎలా సహాయపడుతుంది? తెలుసుకుంటే.. మైక్రోప్రైవసీ.. మైక్రో-ప్రైవసీ అనేది నేటికాలంలో సంబంధాల గురించి జాగ్రత్త చేసే ఒక మార్గం. సంబంధంలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత పర్సనల్ స్పేస్  అవసరమని ఇది చెబుతుంది. ఈ స్పేస్  వ్యక్తికి మానసిక స్వేచ్ఛను అందిస్తుంది , సంబంధం భారంగా మారకుండా నివారిస్తుంది. ప్రేమ అంటే ప్రతీదాన్నీ నియంత్రించడం కాదని, ఒకరి హద్దులను మరొకరు గౌరవించుకోవడం కూడా అని మైక్రో ప్రైవసీ నొక్కి చెబుతుంది. మైక్రో-ప్రైవసీ సంబంధాలలో ఒక బాలెన్స్ ను క్రియేట్ చేస్తుంది.  దీనివల్ల ఇద్దరు వ్యక్తులు కలిసి ఉన్నా ఎవరి ఐడెంటిటీ వారికి ఉంటుంది. మైక్రో ప్రైవసీలో అసలు అర్థం.. మైక్రోప్రైవసీలో ఉండే  ముఖ్యమైన అంశం  భాగస్వామి లేదా కుటుంబ సభ్యుని  పర్సనల్ ఫీలింగ్స్ ను, పర్సనల్  సమయాన్ని గౌరవించడం. ఎప్పుడూ వారితో టచ్‌లో ఉండటం లేదా ప్రతి కదలికను గమనించడం అనేది  సంబంధాలను బలహీనపరుస్తుంది. దానికి బదులుగా, ఒకరికొకరు కొంత స్వేచ్ఛను ఇచ్చుకుంటూ, ఒత్తిడి లేకుండా సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. అతిగా డిపెండ్ అవడాన్ని, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ను నియంత్రణలో ఉంచడంలో కూడా మైక్రో ప్రైవసీ సహాయపడుతుంది. మైక్రో ప్రైవసీ ఎందుకు అవసరం.. మైక్రో ప్రైవసీ  సంబంధాలలో నమ్మకాన్ని, అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందిస్తుంది. ప్రతి ఒక్కరికి  వారి స్వంత సమయం, స్పేస్  ఉన్నప్పుడు, వారు మానసికంగా మరింత ప్రశాంతంగా, బాలెన్స్డ్ గా  ఉంటారు. ఇది సంబంధాలలో అనవసరమైన ఒత్తిడిని తగ్గించి ఎక్కువ కాలం బంధాలు పదిలంగా ఉండేలా చేస్తుంది. మైక్రో ప్రైవసీ పాటించే వ్యక్తులు తమ ఐడెంటిటీని కూడా కోల్పోకుండా ఉంటారు.  ఒకరి ముందు ఒకరు తక్కువ కాదు అనేలా బందాలు ఉంటే.. ఆ బంధాలు ఎన్నేళ్ళైనా పదిలంగా ఉంటాయి. ఇలా  చేయాలి.. భార్యాభర్తలలో ఎవరో ఒకరు అప్పుడప్పుడు ఒంటరిగా సమయం గడపాలని, అభిరుచులను కొనసాగించాలని, లేదా స్నేహితులతో సమయం గడపాలని కోరుకున్నప్పుడు, వారికి అంతరాయం కలిగించకుండా లేదా ప్రశ్నించకుండా వారి ఇష్టాలను గౌరవించడం, వారి అభిరుచులను కొనసాగించడంలో మద్దతు ఇవ్వడం వంటివి మైక్రో ప్రైవసీకి చక్కని ఉదాహరణ.  ఇది ఈ రోజు కొత్తగా  చెప్పాల్సిన విషయమేమీ కాదు.. కానీ కొందరికి అర్థం కావాలంటే కొన్ని ప్రత్యేక మార్గాలలో చెప్పాలి. అందుకే దీన్ని మైక్రో ప్రైవసీ అంటున్నారు.  ఈ మార్గాన్ని పాటిస్తే బంధాలు పదిలంగా ఉంటాయి.                                  *రూపశ్రీ.
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా..  గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు  టీ,  కార్శీరీ ఖవ్వా టీ,  జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు బరువు తగ్గడంలో సహాయపడతాయని చెబుతారు.  ఇవన్నీ మొన్నటి వరకు ట్రెండ్ అయినవే. అయితే ఇప్పుడు మరొక కొత్త టీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.  పైగా బరువు తగ్గడం కోసం సెలబ్రిటీలు గ్రీన్ టీకి స్వస్తి చెప్పి ఈ కొత్త రకం టీ ను ఉపయోగిస్తున్నారని చెబుతారు. అసలు ఈ మాచా టీ ఏమిటి? దీన్నితాగడం వల్ల బరువు ఎలా తగ్గుతారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. మచా టీ.. సాధారణ గ్రీన్ టీని కేవలం ఆకులను  మరిగించిన నీటిలో వేడయం  ద్వారా తయారుచేస్తారు, అయితే మాచా అనేది మొత్తం ఆకులను పొడిగా తయారు చేసి దాన్ని  నీటిలో కలిపి తయారు చేసే టీ... ఈ కారణంగానే గ్రీన్ టీ కంటే మాచా ఎక్కువ ప్రయోజనకరమైనదిగా ఉంటందని చెబుతారు. సెలబ్రిటీలకు ఫేవరేట్ ఎందుకంటే.. మాచా గురించి అందరికీ తెలియడానికి కారణం.. ఈ టీను సెలబ్రిటీల నుండి సోషల్ మీడియాలో ఎంతో మంది దీన్ని తమ ఆరోగ్యం కోసం తాగుతున్నారు.  ఎందుకంటే మాచాలో కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG ఉంటాయి, ఇవి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. మాచా  శరీరం కేలరీలను బర్న్ చేసే  సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని అనేక నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా, మాచాలో కెఫీన్ , ఎల్-థియానైన్ ఉంటాయి, ఇవి మనసును ప్రశాంతపరిచి శక్తిని అందిస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది ఉదయం పూట టీ , కాఫీకి బదులుగా మాచా తాగడానికి ఇష్టపడుతున్నారు. మాచా బరువు తగ్గడానికి సహాయపడుతుందా?  బరువు తగ్గడానికి మాచా నిజంగా సహాయపడుతుందా అని  చాలామంది సందేహపడుతూ ఉంటారు.  అయితే మాచా అనేది అకస్మాత్తుగా బరువును తగ్గించే  మ్యాజిక్ డ్రింక్ ఏమీ కాదని ఆహార నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మాచా తాగినా లేదా బరువు తగ్గించే మరే ఇతర పానీయం తాగినా, అవి బరువు తగ్గడంలో మాత్రమే సహాయపడగలవు. కేవలం వాటిని తాగడం ద్వారా బరువు తగ్గేంత బలమైన ప్రభావం వాటికుండదు. అంటే.. ఆహారంపై శ్రద్ధ పెట్టకుండా , వ్యాయామం చేయకుండా కేవలం ఈ పానీయాలపై మాత్రమే ఆధారపడటం వల్ల బరువుపై ఎటువంటి ప్రభావం ఉండదని అంటున్నారు.                                                 *రూపశ్రీ.
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో , శక్తిని నిలుపుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నేటికాలంలో మారుతున్న జీవనశైలి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం,  పోషకాహార లోపాల కారణంగా, చాలా మంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ బి12 ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాలలో లభిస్తుంది కాబట్టి, శాకాహారులకు విటమిన్ బి12 లోపం కనిపిస్తూ ఉంటుంది.  టెస్ట్ లలో  విటమిన్ బి12 లోపం ఉన్నట్లు తేలితే, ఆహార , జీవనశైలి మార్పుల ద్వారా విటమిన్ బి12 లోపాన్ని అధిగమించవచ్చు.  విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి కొన్ని సులభమైన మార్గాలను తెలుసుకుంటే.. విటమిన్ బి12 లోపిస్తే కనిపించే లక్షణాలు..  ఎప్పుడూ  అలసటగా మరియు బలహీనంగా అనిపించడం.  చేతులు మరియు పాదాలలో జలదరింపు లేదా తిమ్మిరిగా ఉండటం,   తలతిరగటం,  చర్మం పసుపు రంగులోకి మారడం,  దేని మీదా ఏకాగ్రత లేకపోవడం,  మానసిక స్థితిలో వేగంగా  మార్పులు ఉండటం. విటమిన్ బి12 లోపం అధిగమించడానికి తీసుకోవలసిన ఆహారాలు.. విటమిన్ బి12 లోపాన్ని అదిగమించడానికి పాలు , పాల ఉత్పత్తులు తీసుకోవడం మంచి మార్గం. ముఖ్యంగా శాకాహారులు, పాల ఉత్పత్తులు బాగా తీసుకోవాలి.  పాలు, పెరుగు, పనీర్ , జున్ను వంటి పాల ఉత్పత్తులలో విటమిన్ బి12తో పాటు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను ఉంటాయి.  కాల్షియం మరియు ప్రోటీన్ కూడా ఉంటాయి.  గుడ్లు, చేపలు, చికెన్ , మాంసం మొదలైన వాటిలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.  మాంసాహారులు వీటిని తీసుకోవచ్చు.   ఈ ఆహారాలలో ఉండే విటమిన్ బి12ను శరీరం సులభంగా వినియోగించుకుంటుంది. గుడ్డు సొనలో విటమిన్ బి12 ఉంటుంది. చేపలు , చికెన్‌లో ప్రోటీన్ , అనేక ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా , బాలెన్స్డ్ గా  తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ బి12 స్థాయిలను సులువుగా పెంచుకోవచ్చు. శాకాహారులకు లేదా పాల ఉత్పత్తులకు దూరంగా ఉండేవారు విటమిన్-బి12 కోసం , బలవర్ధక ఆహారాలు బాగా సహాయపడతాయి. బలవర్ధక ఆహారాలు అంటే విటమిన్లు , ఖనిజాలతో కూడిన ఆహారాలు. చాలా రకాల  బ్రేక్‌ఫాస్ట్ సెరియల్స్, సోయా పాలు లేదా బాదం పాలు వంటి మొక్కల ఆధారిత పాలు,  న్యూట్రిషనల్ ఈస్ట్‌లో విటమిన్ బి12 ఉంటుంది. వీటిని  రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12   లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సప్లిమెంట్ల విషయంలో.. విటమిన్ బి12 లోపం తీవ్రంగా ఉంటే, కేవలం ఆహారం ద్వారా దానిని భర్తీ చేయడం కష్టం . అటువంటి సందర్భాలలో డాక్టర్ విటమిన్ బి12 సప్లిమెంట్లు, టాబ్లెట్లు లేదా ఇంజెక్షన్లను సిఫార్సు చేయవచ్చు. విటమిన్ బి12 లోపానికి చికిత్స అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్య స్థితి , లోపం యొక్క తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, పరీక్షలు చేయించుకోకుండా , డాక్టర్‌ను సంప్రదించకుండా ఎక్కువ కాలం సప్లిమెంట్లను తీసుకోవడం మంచిది కాదు.                                 *రూపశ్రీ.
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా? థైరాయిడ్ ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి? ఏ ఆహారాలకు దూరంగా ఉండాలి? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. ఈ వీడియోలో సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డా. పి. జానకి శ్రీనాథ్ థైరాయిడ్ సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చో, రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆహారపు అలవాట్లు ఏమిటో వివరంగా చెబుతున్నారు.  ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: థైరాయిడ్ అంటే ఏమిటి? థైరాయిడ్ రావడానికి ఆహారపు అలవాట్లు ఎంతవరకు కారణం? థైరాయిడ్ ఉన్నవారు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు తగ్గించాల్సిన లేదా మానాల్సిన ఆహారాలు అయోడిన్, సెలీనియం, జింక్ వంటి పోషకాల ప్రాముఖ్యత థైరాయిడ్ రోగులు పాటించాల్సిన ఆరోగ్యకరమైన డైట్ చిట్కాలు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు థైరాయిడ్ సమస్యలను నియంత్రించుకోవాలనుకునే వారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది.