
మెగా కోడలు ఉపాసన సమాజంతో పాటు మహిళలకి పలు విషయాల్లో అండదండలు అందిస్తూ కొండంత దైర్యంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
చిత్తూరులో అపోలోలో విద్యా సంస్థల ద్వారా 5900 మంది విద్యని అభ్యసిస్తున్నారు. త్వరలోనే అర్ధగిరి ఆలయంలో రామ విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నాను. ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. నా తాతయ్య ప్రతాప్ రెడ్డి పుట్టిన నెల చిత్తూరుతో నాకున్న అనుబంధం ప్రత్యేకమైనది అని సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా రిలీజ్ చేసారు.
ఇది కూడా చదవండి: ధురంధర్ సరసన డ్రాగన్: కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్!

.ఉపాసన తల్లి వైపు తండ్రిగారైన అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు చెందిన వారు. చిత్తూరు జిల్లాలోని తవణంపల్లె మండలం ఆరగొండ గ్రామం. ఉపాసన అమ్మగారైన శోభనా కామినేని గారి తండ్రి ప్రతాప్ రెడ్డి గారు ఇక్కడే జన్మించి, ఇక్కడి నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభించి ప్రపంచ స్థాయి వైద్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ కారణంగానే ఉపాసన బాల్యం నుంచీ ఆరగొండ గ్రామం మరియు చిత్తూరు జిల్లాతో ఎంతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు.
[Upasana Konidela Latest News, Upasana Kamineni, Pratap C Reddy Apollo, Chittoor Aragonda connection, Upasana Ram Charan, Tollywood Cinema News, Tollywood, Telugu Cinema, Telugu Cinema News ]




