Home

»

Latest News

‘రంగస్థలం’ తర్వాత మళ్లీ కలిసిన రామ్ చరణ్–సుకుమార్.. పూజకు ముహూర్తం ఫిక్స్!

Oct 31, 2026 8:36PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగస్థలం’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో మరో సినిమా రాబోతుండటంతో మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాల తేదీ, సమయాన్ని వెల్లడిస్తూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ పోస్టర్ ప్రకారం నవంబర్ 1, 2026న ఉదయం 10:50 గంటలకు సినిమా పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, T Films సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నాయి. ‘మాస్టర్ స్టోరీటెల్లర్ సుకుమార్’ అంటూ పోస్టర్‌పై పేర్కొనడం, ‘You Can Imagine’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. తాజాగా సాత్విక వీరవల్లి పేరు తెరపైకి వచ్చింది. అయితే ఆమె ఎంపికపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలోనూ పలువురు హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూజా కార్యక్రమం సందర్భంగా నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

‘రంగస్థలం’తో రామ్ చరణ్‌కు కెరీర్‌లో గుర్తుండిపోయే విజయాన్ని అందించిన సుకుమార్.. ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారన్న ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈసారి సుకుమార్ ఎలాంటి ప్రపంచాన్ని సృష్టిస్తారో చూడాలి.

 

 

[Ram Charan, Sukumar, RC17, Ram Charan Sukumar Movie, RC17 Pooja Ceremony, Mythri Movie Makers, Sukumar Writings, Ram Charan Upcoming Movie]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com