LATEST NEWS
పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దేశ రాజధాని ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో  సోనమ్ నిరశన చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో సోనమ్ వాంగ్‌చుక్ ప్రత్యక్షంగా పాల్గొని నిరాహార దీక్ష చేపట్టడం రాజకీయంగా కూడా ప్రధాన్యత సంతరించుకుంది . సోనమ్ వాంగ్ ఛుక్ చేపట్టిన నిరవధిక నిరశనకు రోజురోజుకూ   ప్రజాదరణతో పాటు నెటిజన్ల మద్దతు కూడా పెరుగుతోంది.   కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా వేదికగా ఉద్భవించి, ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయ పోరాటాల్లోకి అడుగుపెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పేపర్ లీకేజీపై ఆందోళనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.   ఈ క్రమంలోనే   పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మద్దతుగా నిలవడమే కాకుండా..  నిరశన దీక్ష చేపట్టి, ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకునే వరకు   దీక్షను విరమించేది లేదని ప్రకటించారు. ఈ పరిణామం కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనకు ఒక్కసారిగా జాతీయ స్థాయి  ప్రాధాన్యత వచ్చింది.   ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సోనమ్  వాంగ్ చుక్ నిరవధిక నిరశన సాగుతోంది.  గత 20 రోజులుగా ఆయన నిరాహార దీక్ష చేస్తుండటంతో.. ఆరోగ్య పరిస్థితి క్రమంగా క్షీణిస్తోందని వైద్య వర్గాలు తెలిపాయి.  ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా ప్రజల్లో, సామాజిక మాధ్యమాల్లోఆయనకు మద్దతు అనూహ్యంగా పెరిగింది.   ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా వాంగ్ చుక్ నిరశనకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది.  అలాగే సామాన్య ప్రజలతో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు కూడా సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.   ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా జంతర్ మంతర్ వద్దకు వెళ్ల  నిరశన దీక్షలో ఉన్న సోనమ్ వాంగ్‌చుక్‌ను  కలిసి సంఘీభావాన్ని ప్రకటించారు.   ఇలా విపక్షాల మద్దతు, ప్రజా సంఘాల భాగస్వామ్యంతో ఈ ఆందోళన తీవ్ర రూపం దాలుస్తున్నా..  కేంద్ర ప్రభుత్వం దీనిపై ఇంత వరకూ స్పందించలేదు.  ఇలా స్పందించకపోవడానికి సోనమ్ వాంగ్ చుక్ నిరసన, కాక్రోచ్ జనతాపార్టీ ఆందోళనల ప్రభావం కేంద్రంపై ఇసుమంతైనా లేదని చాటే వ్యూహమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయితే.. సోనమ్ వాంగ్ చుక్ కు పెరుగుతున్న మద్దతు,  యువత నుంచి వ్యక్తమవుతున్న ఆగ్రహంతో కేంద్రం ఒకింత ఆందోళన చెందుతున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. అంతే కాదు.. సోనమ్ వాంగ్ చుక్ నిరశన విషయంలో ప్రభుత్వ మౌనం, నిర్లక్ష్యం పట్ల నెటిజనులు ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ లీకేజీ అంశంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తు దేశ వ్యాప్తంగా విద్యావేత్తలు, విద్యార్థుల  తల్లిదండ్రులు కూడా వాంగ్ చుక్ నిరశనకు మద్దతు తెలుపుతూ.. ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.    public support growing day by day to Wangchuks protest, Cockroach Janta Party, Dharmendra Pradhan Resignation Demand, NEET Paper Leak Controversy, Jantar Mantar Delhi Protest
పర్యావరణ పరిరక్షకుడు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ   రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి  సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు  తెలుస్తోంది. నేడో రేపో  రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా  సాగుతున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడానికి తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి  నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్  తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరశన చేపట్టారు. ఇలా ఉండగా ఆయన నిరవధిక నిరశన శుక్రవారం (జులై 17) నాటికి 20వ రోజుకు చేరింది. ఇలా ఉండగా  పార్లమెంట్ భవనం  ముట్టడించేందుకు కూడా  సోనమ్ వాంగ్‌చుక్   బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కీలక తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్‌చుక్  మద్దతుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో  ఈ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటికే ఆప్ అధినేత,  దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసి  మద్దతు  ప్రకటించారు. కేజ్రీవాల్ పర్యటనతో ఈ ఉద్యమానికి   రాజకీయ బలం చేకూరింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తరఫున దక్షిణాదిలో అత్యంత బలమైన నేత  రేవంత్ రెడ్డి స్వయంగా హస్తిన వెళ్లి సోనమ్ వాంగ్‌చుక్  కు, ఆయన పోరాటానికి సంఘీభావం ప్రకటించనుండటంతో..  కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిని ఈ ఉద్యమ వేదికపైకి పంపించడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో రేవంత్ ది బలమైన వాయిస్ అని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన, సోనమ్ వాంగ్‌చుక్‌తో భేటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ పర్యటన ఖరారైందని అంటున్నాయి.     Telangana CM, Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, TeluguOne 
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YCP) ప్రస్తుతం తీవ్రమైన వ్యూహాత్మక అయోమయంలో కొట్టుమిట్టాడుతోంది. అధికార పక్షాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా ఎదుర్కొని బలపడాల్సిన తరుణంలో, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న అనాలోచిత విధానాలు మరియు బలహీనమైన వ్యూహాలు పార్టీని మరింత రక్షణాత్మక ధోరణిలోకి నెడుతున్నాయి. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మధ్య ఆసక్తికర చర్చ టోన్‌ నిర్వహించింది. రాజకీయ పరిస్థితి మరియు లోపించిన సునిశితత్వంప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న వైఎస్సార్సీపీ అనేక క్షేత్రస్థాయి సమస్యలను తన రాజకీయ ఎదుగుదలకు అనుకూలంగా మార్చుకోవడంలో విఫలమవుతోంది. విజయవాడ లాకప్ డెత్ (సాయికృష్ణ కేస్) వంటి తీవ్రమైన సమస్యలను గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం పార్టీ వ్యూహాత్మక లోపాన్ని స్పష్టం చేస్తోంది. ఇలాంటి అత్యంత సున్నితమైన అంశాలలో మొదట హడావుడి చేయడం, ఆ తర్వాత బాధితులను లేదా ఆందోళనకారులను సమన్వయం చేసుకోలేక మధ్యలోనే వదిలేయడం జగన్ నాయకత్వానికి బలహీనతగా మారింది. స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించకుండా, క్షేత్రస్థాయిలో నిరంతర పోరాటాలు నిర్మించకుండా కేవలం ప్రెస్ మీట్లకు మాత్రమే పరిమితమవ్వడం వైస్సార్సీపీకి శాపంగా మారింది.  సమగ్ర అధ్యయనం లేకుండా మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో విమర్శలకు, మీమ్స్ మరియు ట్రోల్స్‌కు దారితీస్తున్నాయి.వైఎస్సార్సీపీ బలహీన వ్యూహాలు మరియు పరిణామాలుపూర్వపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ శైలిని గమనిస్తే, ఆయన ఏ ప్రజాసమస్యపైనైనా పోరాడేముందు క్షేత్రస్థాయిలో పనిచేసే మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజ నేతలతో మాట్లాడి పూర్తి అవగాహనతో ముందడుగు వేసేవారు. అయితే, ప్రస్తుత వైఎస్సార్సీపీలో అటువంటి నిర్మాణాత్మక చర్చలు లేకపోవడం ప్రధాన లోపం. రావణ ఎపిసోడ్ వంటి సందర్భాల్లో మొదట మైనారిటీల తరఫున నిలబడతామని ప్రకటించి, ఆపై కేంద్ర నాయకత్వానికి (NDA) దూరం కాకూడదనే భయంతోనో లేదా హిందూ ఓట్ బ్యాంక్ దెబ్బతింటుందనే ఆందోళనతోనో వెనక్కి తగ్గడం ఆ పార్టీలో నెలకొన్న సిద్ధాంతపరమైన గందరగోళాన్ని సూచిస్తోంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారానికి ఒకటి రెండు సార్లు బెంగళూరు నుండి వచ్చి కేవలం పరామర్శలు చేసి వెళ్ళిపోవడం వల్ల శ్రేణుల్లో నమ్మకం సడలుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఒక పద్ధతి ప్రకారం నిరసనలు, ఉద్యమాలు చేపట్టలేకపోవడం వైఎస్సార్సీపీ వైఫల్యానికి అద్దంపడుతోంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంనిర్మాణాత్మక వ్యూహాలు, క్షేత్రస్థాయి శ్రేణులతో బలమైన సమన్వయం లేకపోతే వైఎస్సార్సీపీ భవిష్యత్తు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కేవలం గుడ్డి వ్యతిరేకత ప్రదర్శించే 'యాక్టివ్ అపోజిషన్' వైఖరి పార్టీ ఇమేజ్‌ను మరింత దెబ్బతీస్తుంది. తప్పులను ఆత్మవిమర్శ చేసుకుని, చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నేతల అనుభవ శైలిని గమనించి రాజకీయ పరిణతి సాధించాల్సిన అవసరం జగన్ కి ఎంతైనా ఉంది. పార్టీని గందరగోళం మరియు అయోమయ పరిస్థితుల నుంచి బయటపడేసి, క్యాడర్‌లో భరోసా నింపకపోతే వచ్చే ఎన్నికల నాటికి వైఎస్సార్సీపీ మరింత ప్రాభవాన్ని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 'జూనియర్ ఎన్టీఆర్' (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ కేవలం ఒక సాధారణ ఊహాగానం కాదు.. అది రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేయగల ఒక బలమైన శక్తీకరణ..  జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తే తెలుగునాట ఒక పెద్ద రాజకీయ భూకంపాన్ని సృష్టించింది. ఈ అంశంపై టోన్ న్యూస్ "వాస్తవ వేదిక" చర్చా కార్యక్రమంలో తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు. ఒకవైపు సినిమా రంగంలో గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న తారక్, మరోవైపు తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వారసత్వాన్ని అందిపుచ్చుకుని క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందనే అంశం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి చర్చనీయాంశాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం రెండు ప్రధాన రాజకీయ శక్తులు బలంగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరియు తెలుగుదేశం పార్టీ (TDP) ల మధ్య సుదీర్ఘ కాలంగా సాగుతున్న ఆధిపత్య పోరులో, ఒక కొత్త మరియు అత్యంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడి అవసరం ఉందనే వాదన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.  చారిత్రకంగా చూస్తే, ఎన్టీఆర్ కుటుంబానికి ప్రజాక్షేత్రంలో ఉండటం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. స్వర్గీయ ఎన్టీఆర్ ఏ పరిస్థితుల్లోనైతే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో, నేటి రాజకీయ పరిస్థితులు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశానికి అనుకూలంగా మారాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన నేటివరకు ఎలాంటి ప్రత్యక్ష సామాజిక సేవా కార్యక్రమాలు లేదా పూర్తిస్థాయి రాజకీయ కార్యాచరణను ప్రకటించకపోవడం గమనార్హం. అయినప్పటికీ, ప్రజల్లో జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం పట్ల ఉన్న విశ్వసనీయత ఏమాత్రం తగ్గలేదు. వ్యూహాలు మరియు అంతర్గత సమీకరణాలుజూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం వెనుక అనేక వ్యూహాత్మక కోణాలు దాగి ఉన్నాయి.   తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి సమకాలీన రాజకీయ నేతల పాత్ర కూడా ఈ సరికొత్త సమీకరణాల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. తమిళనాడు తరహా రాజకీయ ఫార్ములా—అనగా కేవలం చలనచిత్ర చరిష్మాతో నేరుగా అధికారం సాధించడం—ఇక్కడ సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఆర్థిక బలంతో సంబంధం లేకుండా కేవలం ప్రజాదరణ, బలమైన భావజాలం మరియు సరైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్తే విజయం సాధ్యమని ఇటీవలి రాజకీయ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.  తారక్ రాజకీయాల్లోకి వస్తే అది తెలుగుదేశం పార్టీ (TDP) లోని అంతర్గత సమతుల్యతను దెబ్బతీస్తుందనే భయంతో, కొందరు దీనిని వ్యతిరేకిస్తూ మరియు ఇది తారక్ స్వయంకృతం కాదనే ప్రచారాలు చేస్తున్నారనే వాదన కూడా ఉంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంభవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, అది కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా మొత్తం రాష్ట్ర రాజకీయ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వైఎస్సార్సీపీ మరియు టీడీపీల ఏకఛత్రాధిపత్యానికి ప్రత్యామ్నాయంగా తారక్ సరికొత్త మూడవ శక్తిగా లేదా టీడీపీకి అసలైన వారసుడిగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.  ఆయనకు ఉన్న అశేష యువత, అభిమాన గణం రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల సమీకరణను మలుపు తిప్పగలవు. ఒకవేళ ఆయన పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే, తెలుగునాట సాంప్రదాయ రాజకీయ సమీకరణాలు పూర్తిగా పక్కకుపోయి, సరికొత్త రాజకీయ శకానికి నాంది పలికే అవకాశం ఉంది. ఈ రాజకీయ భూకంపం ఏ తీరానికి చేరుతుందనేది తారక్ తీసుకునే తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక చరిత్రలోనే కాకుండా, ఉభయ తెలుగు  రాష్ట్రాల వ్యాపార వర్గాల్లో ఇప్పుడో  భావోద్వేగ చర్చ మొదలైంది. చిత్తూరు జిల్లా నేల నుంచి పుట్టి, దేశవ్యాప్తంగా తన బ్రాండ్ ఇమేజ్‌ను చాటిన ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం అమరరాజా గ్రూప్, పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తన అడుగులు బలంగా వేసింది. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద దాదాపు 9 వేల 500 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక గిగా కారిడార్‌లో భాగంగా, తొలి కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్‌ను అమరరాజా యాజమాన్యం  ప్రారంభించింది. ఈ ప్లాంట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి   ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరరాజా అధినేత గల్లా జయదేవ్ సామాజిక మాధ్యమాల వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ పెట్టిన ఒక పోస్ట్  అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే.. జయదేవ్ గల్లా సోషల్ మీడియాలో చేసిన  ఈ ట్వీట్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆ సందర్భంగా లోకేష్ చేసిన ఎమోషనల్ కామెంట్స్  రెండు రాష్ట్రాల రాజకీయాల్లో  సంచలనం సృష్టిస్తున్నాయి.  గల్లా జయదేవ్ ట్వీట్‌కు స్పందిస్తూ నారా లోకేష్..  ఏపీ మీకు క్షమాపణ చెప్పాలి గల్లా జయదేవ్ గారు అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు ప్రతి ఒక్కరినీ కదిలిస్తోంది.   గత నాలుగు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ సాధించిన అతిపెద్ద పారిశ్రామిక విజయగాథలలో అమరరాజా కేవలం ఒక వ్యాపార సంస్థ మాత్రమే కాకుండా.. ఈ రాష్ట్ర ఆత్మగౌరవానికి  నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్న లోకేష్..  స్థానికంగా వేలాది మంది యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, చిత్తూరు జిల్లా పేరును ప్రపంచ చిత్రపటంలో సగర్వంగా నిలబెట్టిన ఘనత అమరరాజా సంస్థదేనన్నారు. అయితే  జగన్ ప్రభుత్వ  హయాంలో ఈ సంస్థ ఎదుర్కొన్న రాజకీయ వేధింపులు, ఆటంకాలు   ఉండాల్సింది కాదనీ,  సొంత గడ్డపై పెట్టుబడులు పెట్టి, ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని భావించిన ఒక  పారిశ్రామికవేత్తకు లభించాల్సింది ప్రోత్సాహం,  గౌరవం మాత్రమేనన్న.. లోకేష్, జగన్ హయాంలో అమరరాజా సంస్థకు, యాజమాన్యానికి  దక్కినవి బెద రింపులు, వేధింపులేనని పేర్కొన్నారు. లోకేష్ కామెంట్స్ తో జగన్ హయాంలో.. అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో..  పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. జగన్ హయాంలో అమరరాజా ఎదుర్కొన్న వేధింపులు ఒక ఆంధ్రుడిగా తనను  కలచివేశాయన్న లోకేష్ వ్యాఖ్యలతో పారిశ్రామిక వర్గం ఏకీభవిస్తున్నది.   ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   పారిశ్రామిక రంగానికి పూర్వవైభవాన్ని తీసుకొస్తున్నదని లోకేష్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  అమరరాజా ప్రస్థానం ఎక్కడైతే మొదలైందో, అదే ఆంధ్రప్రదేశ్ గడ్డపై రాబోయే రోజుల్లో  ఆ సంస్థ కొత్త అధ్యాయాలు సృష్టిస్తుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్న లోకేష్.. మా హృదయాలు, ఏపీ తలుపులు అమరరాజా కోసం ఎల్లప్పుడూ  తెరిచే ఉంటాయని పేర్కొంటూ.. నారా లోకేష్ గల్లా జయదేవ్‌ను ఏపీకి  హ్వానించారు. లోకేష్ ఈ ట్వీట్ ద్వారా.. రాజకీయాల వల్ల పారిశ్రామిక రంగం నష్టపోకూడదనే సందేశాన్నిచ్చారని పరిశ్రమవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.  Amara Raja Batteries, Nara Lokesh Tweet, Galla Jayadev, Telangana Gigafactory, AP Investment Shift, Nara Lokesh Apology to Galla Jayadev 
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనీ రాయ్ (Mouni Roy) తాజాగా ముంబైలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'నాగిని' సిరీస్‌తో విశేష ప్రజాదరణ పొందిన ఈ అందాల భామ, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' (Vishwambhara) సినిమాలో ఒక కీలక పాత్రతో పాటు స్పెషల్ సాంగ్‌లో నటిస్తూ బిజీగా ఉంది.  సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను నిరంతరం కెమెరాల్లో బంధించే పాపారాజీల (ఫొటోగ్రాఫర్ల) అత్యుత్సాహం ఒక్కోసారి హద్దులు దాటుతుందనడానికి తాజాగా మౌనీ రాయ్ విషయంలో జరిగిన ఘటనే నిదర్శనం. సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఆమె ఫొటోగ్రాఫర్లపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వివాదానికి దారితీసిన అసలు కథ ముంబైలోని ఒక ప్రముఖ రెస్టారెంట్ దగ్గర మొదలైంది. మౌనీ రాయ్ తన ఫ్రెండ్, నటి అనుషా దండేకర్‌తో కలిసి డిన్నర్ కోసం వెళ్ళింది. డిన్నర్ ముగించుకుని వారు బయటకు రాగానే, పాపారాజీలు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టారు. కెమెరా ఫ్లాష్ లైట్లతో ఆమెను ఫొటోలు తీయడం ప్రారంభించారు. సెలబ్రిటీగా అలవాటైన విషయమే అయినా, ఆ తర్వాత వారు ప్రవర్తించిన తీరు ఆమెకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. మౌనీ రాయ్, అనుషా దండేకర్ ఇద్దరూ తమ కారులోకి వెళ్లి కూర్చున్న తర్వాత కూడా, ఫొటోగ్రాఫర్లు వదలకుండా కారు విండో గ్లాసెస్ నుండి లోపలికి కెమెరాలు పెట్టి ఫొటోలు, వీడియోలు తీస్తూనే ఉన్నారు. కారు లోపల కూడా కనీస ప్రైవసీ లేకుండా ప్రవర్తించడంతో మౌనీ రాయ్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. సహనం కోల్పోయిన ఆమె కారు విండో లోంచి వేలు చూపిస్తూ, చాలా సీరియస్ లుక్‌తో 'బంద్ కరో' (కెమెరాలు ఆపండి) అంటూ గట్టిగా హెచ్చరించింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన ఆమె స్నేహితురాలు అనుషా దండేకర్ వెంటనే జోక్యం చేసుకుంది. ఒకవైపు మౌనీని శాంతింపజేస్తూనే, మరోవైపు కారు బయట ఉన్న ఫొటోగ్రాఫర్లకు ఇక కెమెరాలు ఆపేయాలని, తమను వెళ్ళనివ్వాలని విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత కారు అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ, ఈ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో ఆమె స్పష్టంగా.. "దయచేసి ఇకపై నన్ను ఎప్పుడూ ఫొటోలు తీయకండి. చాలా కాలంగా నేను మిమ్మల్ని ఎప్పుడూ నా కోసం రమ్మని పిలవలేదు. మీ అందరిపై నాకు ప్రేమ, గౌరవం ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని పిలవను. కాబట్టి నా కోసం రావద్దు. ఒకవేళ భవిష్యత్తులో ఎప్పుడైనా నా ఫొటోలు మీడియాలో బయటకు వస్తే, వాటికోసం నేనే పిలిచానని మాత్రం అనుకోకండి. దయచేసి నన్ను ఫొటోలు తీయడం పూర్తిగా ఆపేయండి. ప్లీజ్... ఇక చాలు." అని రాసుకొచ్చింది. అయితే ఈ పోస్ట్ పెట్టిన 15 నుండి 20 నిమిషాల వ్యవధిలోనే మౌనీ రాయ్ దానిని ఇన్‌స్టాగ్రామ్ నుండి డిలీట్ చేసింది. ఆమె ఎందుకు డిలీట్ చేసిందనేది సస్పెన్స్‌గా మారినప్పటికీ, అప్పటికే కొందరు నెటిజన్లు ఆ స్టోరీని స్క్రీన్‌షాట్‌లు తీసి వైరల్ చేసేశారు.  ఈ మొత్తం వ్యవహారంపై నెటిజన్లు ఇప్పుడు రెండు వర్గాలుగా విడిపోయారు. కొందరు మౌనీ రాయ్ అంతలా రియాక్ట్ అవ్వడం అనవసరమని విమర్శిస్తుండగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. సెలబ్రిటీలకైనా కనీస ప్రైవసీ ఉంటుందని, కారు  లోపలికి కెమెరాలు పెట్టి వేధించడం తప్పు అని ఫొటోగ్రాఫర్ల తీరును తప్పుబడుతున్నారు.  https://x.com/SAMTHEBESTEST_/status/2077361882118394290     Mouni Roy, Paparazzi, Vishwambhara Movie, Chiranjeevi  
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ట్రేడ్ వర్గాల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ సింగిల్ 'కమ్సహమ్నిదా' కొరియన్ ఫ్లేవర్‌తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ పాట అందించిన జోష్‌తో ఇప్పుడు మేకర్స్ రెండో సాంగ్ అప్‌డేట్‌తో సిద్ధమయ్యారు. చిత్ర బృందం ఈ సినిమా నుండి రెండో పాటను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ సాంగ్‌కు ‘రాస గుమ్మడి’ అనే మాస్ టైటిల్‌ను ఖరారు చేశారు. కొరియన్ కబుర్లతో సాగిన మొదటి పాటకు పూర్తి భిన్నంగా, ఈ రెండో సాంగ్ పక్కా లోకల్ రాయలసీమ బీట్స్‌తో సాగబోతోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ ఊరమాస్ సాంగ్ లిరికల్ వీడియోను జూలై 19న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు ఒక సరికొత్త పోస్టర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. "కొరియన్ కబుర్లు ముగిశాయి.. ఇప్పుడు రాయలసీమ బీట్స్ సమయం" అంటూ సోషల్ మీడియాలో చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన అందాల భామ దక్షా నగార్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన స్వరాలు సమకూరుస్తున్నారు. మొదటి సాంగ్ క్లాస్ అండ్ ట్రెండీగా సాగగా, ఈ ‘రాస గుమ్మడి’ సాంగ్ థమన్ మార్క్ మాస్ బీట్స్‌తో థియేటర్లలో రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు వినోదాన్ని పంచే ఈ 'కొరియన్ కనకరాజు' సినిమాను ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. క్లాస్ మరియు మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా రూపొందుతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. జూలై 19న రాబోయే ఈ రాయలసీమ మాస్ బీట్ 'రాస గుమ్మడి' సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.     Korean Kanakaraju, Varun Tej, Thaman S
కుటుంబ బంధాలు, మధ్యతరగతి అనుబంధాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే ఈటీవీ సంస్థ నుంచి సరికొత్త ఓటీటీ కంటెంట్ ప్రేక్షకులను పలకరించింది. సరికొత్త కథాంశంతో నేరుగా ఈటీవీ విన్ (ETV Win) డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చిన చిత్రమే 'మధురాపురి సదన'. భరత్ సాయినాథ్ వర్మ, యశు మాశెట్టి జంటగా నటించిన ఈ సినిమాకు సాయి తరుణ్ దర్శకత్వం వహించారు. ఈ గురువారం అంటే జులై 16 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క కలలు, ఆశయాలు, వారు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందుల చుట్టూ తిరిగే ఈ కథ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కథ విషయానికి వస్తే, హైదరాబాద్ నగరంలో వాసు (శ్రీనివాస్ భోగిరెడ్డి) ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన పదవీ విరమణకు చాలా దగ్గరగా ఉంటాడు. కూతురు ఇప్పటికే అమెరికాలో స్థిరపడగా, భార్య పద్మ, కొడుకు కృష్ణ (భరత్ సాయినాథ్)లతో కలిసి నివసిస్తుంటాడు. కొడుకు కృష్ణ కూడా అమెరికా వెళ్లి మంచి ఉద్యోగం సంపాదించాలనేది తండ్రి వాసు కోరిక. కానీ, కృష్ణకు మాత్రం ఎలాగైనా సినిమా దర్శకుడు కావాలనే బలమైన ఆశయం ఉంటుంది. ఈ కెరియర్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య తీవ్ర అసంతృప్తి నెలకొంటుంది. మరోవైపు కృష్ణ తాను నివసించే కాలనీలోనే ఉండే అదితి (యషు మాశెట్టి)ని ప్రేమిస్తాడు. అయితే, ఆమె కూడా కృష్ణ విదేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలనే కోరుకుంటుంది. కానీ కృష్ణ మాత్రం తన డ్రీమ్ వైపే అడుగులు వేస్తాడు. ఇదిలా ఉండగా, సొంత ఇల్లు లేదనే వెలితి కృష్ణ తల్లి పద్మను ఎప్పుడూ వేధిస్తూ ఉంటుంది. సొంత గూడు కట్టుకోవాలనే ఆమె ఆశను నెరవేర్చడానికి అమెరికా నుంచి కూతురు కొంత డబ్బు పంపిస్తుంది. దాంతో ఇంటి నిర్మాణ పనులు ఎంతో ఉత్సాహంగా చకచకా మొదలవుతాయి. కానీ కొద్ది రోజుల్లోనే ఆ పనులు హఠాత్తుగా ఆగిపోతాయి. అక్కడి నుంచి ఆ ఇల్లు పూర్తి చేయడం ఆ కుటుంబానికి ఒక పెద్ద సవాలుగా మారుతుంది. తండ్రి దాచుకున్న సేవింగ్స్ డబ్బుతో ఇల్లు పూర్తి చేద్దామని కృష్ణ అనుకుంటే, తండ్రి వాసు ఆ డబ్బును తన బావమరిదికి ఇచ్చి మోసపోయాడని తెలుస్తుంది. అదే సమయంలో, కృష్ణ కూడా ఇంటి కాగితాలను వేరొకరి దగ్గర తాకట్టు పెట్టాడని తండ్రికి తెలుస్తుంది. ఈ గందరగోళ పరిస్థితుల తర్వాత ఆ కుటుంబం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఇల్లు ఎలా పూర్తి అయింది అనేదే మిగతా సినిమా. దర్శకుడు సాయి తరుణ్ రెడ్డి ఈ చిత్రంలో ఒక మంచి పాయింట్‌ను హైలైట్ చేశారు. కుటుంబంలో ఏ చిన్న నిర్ణయమైనా అందరూ కలిసి ఆలోచించి తీసుకోవాలని, ఒకరిని సంప్రదించకుండా మరొకరు నిర్ణయాలు తీసుకుంటే ఆ ఫ్యామిలీ ఎలాంటి ప్రమాదంలో పడుతుందో చక్కగా చూపించారు. సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా నిలబడాలనే సందేశాన్ని ఇచ్చారు. అయితే, కథలో ఉన్న ఎమోషన్స్ బాగానే వర్కౌట్ అయినప్పటికీ, లవ్ అండ్ రొమాన్స్ ట్రాక్ చాలా పైపైన తేల్చేశారు. కామెడీ పరంగా కూడా బలమైన సన్నివేశాలు లేకపోవడం నిరాశ పరుస్తుంది. హీరో కృష్ణ డైరెక్టర్ కావడానికి చేసే ప్రయత్నాలను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాను ఇష్టపడే వారికి, ఒక మిడిల్ క్లాస్ యువకుడి పోరాటంగా సాగే ఈ సినిమా ఓ మోస్తరుగా అలరిస్తుంది. 
టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపుతోంది ఒక భయానక చిత్రం. దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి వస్తున్న విభిన్నమైన చిత్రం ‘అమెన్’ (AMEN). ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జూలై 24న విడుదల కానుంది. ఈ సినిమా గురించి ఎస్కే బషీద్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా ‘అమెన్’ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్, భయానక ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం.. గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం. ఔట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.” అన్నారు. ఇటీవల విడుదలైన ‘అమెన్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “హెచ్చరిక: మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా ఇంట్లో ఉంచి సినిమాకు రండి...” అనే క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. త్వరలో ట్రైలర్‌ విడుదల కానుంది. టాలీవుడ్‌లో కొత్త హారర్ వేవ్‌ను సృష్టించేందుకు సిద్ధమైన ‘అమెన్’ జూలై 24న థియేటర్లలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.   Amen Movie, Horror Thriller, SK Basheed, Telugu Cinema  
మనం రోజుకు మూడు పూటలా ఎంతో ఇష్టంగా తినే ఆహారం అసలు సురక్షితమేనా? పచ్చటి పంటల వెనుక దాగున్న ప్రమాదకరమైన కెమికల్స్ మన శరీరంలోకి ఎలా చేరుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నంలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్, బాలీవుడ్ ప్రముఖ నటుడు శ్రేయాస్ తల్పాడే కలిసి ఒక సరికొత్త సోషల్ మీడియా మూవ్‌మెంట్‌కు శ్రీకారం చుట్టారు. తాము ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది ఇండియా స్టోరీ' ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ కలిసి ఇంటర్నెట్‌లో #WhatsOnYourPlate అనే వినూత్నమైన డిజిటల్ ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ఈ సరికొత్త ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన రోజువారీ భోజనం ప్లేట్ ఫోటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా మనం నిత్యం తీసుకునే ఆహారంలో పురుగుమందుల కల్తీ ఎంతవరకు ఉందనే కోణంలో ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించేలా ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ చైతన్య ఉద్యమం కేవలం తనతోనే ఆగిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆమె టాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్‌లను ఈ ఛాలెంజ్‌లోకి ఆహ్వానిస్తూ నామినేట్ చేశారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చే సమంత, రకుల్ లను నామినేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే ఈ ఛాలెంజ్ పై రకుల్ స్పందించారు. తాను క్లీన్ అండ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ తింటున్నట్లు తాను తింటున్న ప్లేట్ ఫోటోలు షేర్ చేశారు. అలాగే, ఈ ఛాలెంజ్‌లోకి ఆహ్వానిస్తూ తన భర్త జాకీ భగ్నానీతో పాటు, హీరోయిన్ తమన్నాను నామినేట్ చేయడం విశేషం.  మరోవైపు బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే కూడా ఈ వినూత్న క్యాంపెయిన్‌లో చురుగ్గా భాగమయ్యారు. సామాన్య ప్రజలు ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారంపై మరింత అవగాహన పెంచుకోవాలని, ఈ ఆరోగ్యకరమైన సవాల్‌ను స్వీకరించి తమ భోజనం ఫోటోలను ఆయా సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేవలం థియేటర్లలో సినిమా చూపించి వదిలేయడం కాకుండా, దేశంలోని ప్రతి ఇంటా ఒక బాధ్యతాయుతమైన, ఆరోగ్యకరమైన చర్చ జరగాలనే ఉన్నతమైన లక్ష్యంతోనే తాము ఈ వినూత్న డిజిటల్ క్యాంపెయిన్‌ను డిజైన్ చేసినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం మన వ్యవసాయ రంగంలో విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు, ప్రాణాంతక పురుగుమందుల వల్ల సామాన్య ప్రజల ఆరోగ్యం రోజురోజుకూ ఎలా ప్రమాదంలో పడుతోందనే సున్నితమైన, అత్యంత భయంకరమైన సామాజిక అంశాన్ని ఈ సినిమాలో అత్యంత వాస్తవికంగా చూపించబోతున్నారు. సామాజిక బాధ్యతతో కూడిన ఈ క్రేజీ సోషియో-రియలిస్టిక్ డ్రామా మూవీ 'ది ఇండియా స్టోరీ' జూలై 24న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది.      Kajal Aggarwal, Samantha Ruth Prabhu, Rakul Preet Singh, The India Story, Tamannaah Bhatia  
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘NBK 111’ విడుదలపై చిత్ర యూనిట్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, ఇప్పుడు బాక్సాఫీస్ ఈక్వేషన్స్ మారడంతో సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi) సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమా డిసెంబర్ మొదటి వారంలో వస్తుండటంతో.. థియేటర్ల లభ్యత, కలెక్షన్ల పరంగా ఎలాంటి క్లాష్ రాకూడదని ‘NBK 111’ మేకర్స్ భావించారు. అందుకే బాలయ్య మాస్ జాతరను డిసెంబర్ చివరి వారంలో వచ్చే క్రిస్మస్ పండుగ సెలవుల కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది. పండగ సీజన్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని, ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా భారీగా థియేటర్లకు తరలివస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ కూడా పక్కా ప్రణాళికతో సాగుతున్నాయి. దసరా పండుగ కంటే ముందే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ముగించాలని గోపీచంద్ మలినేని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దసరా లోపు షూటింగ్ పూర్తయితే, డిసెంబర్ క్రిస్మస్ రేస్‌కు సినిమాను పర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేయడానికి వీలవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది.  ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ కూడా అతి త్వరలోనే రాబోతోంది. గతంలో బాలయ్యతో 'వీరసింహారెడ్డి' సినిమా చేసిన గోపీచంద్ మలినేని, ఈసారి ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ తో రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది.  ఈ సినిమాలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సంజయ్ దత్ ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘NBK 111’ మాస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన వెంటనే బాలయ్య.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సెన్సేషనల్ పొలిటికల్ డ్రామా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.     Nandamuri Balakrishna, NBK 111, Christmas Release, Prabhas, Fauzi  
హాలీవుడ్ సంచలన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ది ఒడిస్సీ’ (The Odyssey) థియేటర్లలోకి అడుగుపెట్టింది. లెజెండరీ గ్రీక్ కావ్యం ఆధారంగా రూపొందిన ఈ మైథలాజికల్ యాక్షన్ ఎపిక్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) లో నెటిజన్లు తమ ఫస్ట్ రివ్యూలను పంచుకుంటున్నారు.  నోలన్ గత చిత్రం 'ఓపెన్‌హైమర్' తర్వాత వస్తున్న సినిమా కావడంతో వరల్డ్ వైడ్‌గా దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం కనిపిస్తోంది. ముఖ్యంగా ఐమాక్స్ 2డి, 4డిఎక్స్ ఫార్మాట్లలో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. నోలన్ మరోసారి తన మార్క్ విజువల్స్, మేకింగ్ స్టైల్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాడని మెజారిటీ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాలో కింగ్ ఒడిస్సీ పాత్రలో నటించిన హాలీవుడ్ స్టార్ మ్యాట్ డామన్ (Matt Damon) నటనకు సోషల్ మీడియాలో విశేషమైన రెస్పాన్స్ వస్తోంది. ఒక వీరుడిగా మాత్రమే కాకుండా, అతని వెనుక ఉన్న భావోద్వేగపూరితమైన మనిషిని కూడా మ్యాట్ డామన్ అద్భుతంగా పండించాడని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఒడిస్సీ భార్య పెనెలోప్ పాత్రలో ఆన్ హాత్వే (Anne Hathaway), ఎథీనా దేవిగా జెండయా (Zendaya) తమ నటనతో మెప్పించారు. ఇక ఒడిస్సీ కుమారుడు టెలిమాకస్ పాత్రలో టామ్ హాలండ్ (Tom Holland) నటన గుండెలను పిండేసేలా ఉందని, తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ చూసి థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నామని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. విలన్ పాత్ర అయిన యాంటినస్ రోల్‌లో రాబర్ట్ ప్యాటిన్సన్ (Robert Pattinson) నటన పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని కామెంట్లు వస్తున్నాయి. అయితే ఈ సినిమాపై ట్విట్టర్‌లో కొన్ని మిశ్రమ స్పందనలు కూడా వ్యక్తమవుతున్నాయి. నోలన్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టాప్ నాచ్‌గా ఉన్నప్పటికీ.. స్క్రీన్‌ప్లే కొంత నెమ్మదిగా సాగిందని కొందరు రివ్యూ ఇస్తున్నారు. డ్రామా ఎలిమెంట్స్ రొటీన్‌గా ఉన్నాయని, అలాగే కొన్ని చోట్ల సౌండ్ మిక్సింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల డైలాగ్స్ సరిగ్గా వినబడలేదని కొంతమంది నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. సినిమా ప్రారంభంలో ట్రాయ్, స్పార్టా, ఇథాకా ప్రపంచాన్ని పరిచయం చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడని, ఆ తర్వాతే అసలు కథనం స్పీడందుకుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నెగటివ్ పాయింట్స్ ఎలా ఉన్నా, సినిమా క్లైమాక్స్ మాత్రం అందరినీ మెస్మరైజ్ చేస్తోంది. ముఖ్యంగా లాస్ట్ 30 నుండి 40 నిమిషాల ఎపిక్ ఫినాలే సినిమాకే హైలైట్‌గా నిలిచిందని నెటిజన్లు చెబుతున్నారు. హోమర్ రాసిన అసలైన కావ్యం ఏ స్థాయిలో అయితే ఉంటుందో, నోలన్ చివర్లో అదే స్థాయి ఎమోషన్, యాక్షన్, డ్రామాను వెండితెరపై ఆవిష్కరించాడని కామెంట్స్ చేస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, హ్యూమర్ కలగలిసిన ఒక పక్కా కమర్షియల్ సినిమా ఇదని, ఐమాక్స్ స్క్రీన్‌లపై మాత్రమే చూడదగ్గ అద్భుత దృశ్యకావ్యమని నెటిజన్లు తేల్చి చెప్తున్నారు. ఓవరాల్‌గా క్రిస్టోఫర్ నోలన్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడినట్టేనని నెటిజన్ల టాక్ స్పష్టం చేస్తోంది.     The Odyssey Review, Christopher Nolan, Matt Damon, The Odyssey, Movie Review  
స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలం తర్వాత వెండితెరపై అలరించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మా ఇంటి బంగారం'. 'ఖుషీ' సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్‌తో సమంత సోలో లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ఇది. వైవిధ్యమైన కథాంశాలతో ఫ్యామిలీ ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించే దర్శకురాలు బి.వి. నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన మొదటి ఆట నుంచే ఈ సినిమా మహిళా ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందనను సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చి, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్ల భారీ వసూళ్లు సాధించి ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనాథ అయిన స్వర్ణ (సమంత) ఎన్నో ఆశలతో డాక్టర్ అనిరుథ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ, వీరి వివాహం పెద్దల అనుమతి లేకుండా జరుగుతుంది. పెళ్లయిన మూడేళ్ల తర్వాత తన భర్త చెల్లెలి పెళ్లి కోసం అనిరుథ్‌తో కలిసి అతని సొంతూరిలో అడుగుపెడుతుంది స్వర్ణ. అత్తవారింట్లో అందరి మనసులు గెలుచుకుని, ఆ కుటుంబంలో ఒకరిగా కలిసిపోవాలని ఆమె ఎంతో ఆరాటపడుతుంది. అయితే సరిగ్గా అదే సమయంలో సువర్ణ గతం తెలిసిన ఒక వ్యక్తి ఆమెను గుర్తించి, జైల్లో శిక్ష అనుభవిస్తున్న కరుణ(గుల్షన్ దేవయ్య)కు సమాచారం అందిస్తాడు. కరుణ జైలు నుంచి పారిపోయి అనిరుథ్ కుటుంబాన్ని అంతమొందించాలని స్కెచ్ వేస్తాడు. అసలు స్వర్ణ గతమేంటి? కరుణతో గొడవేంటి? తన గతాన్ని అత్తవారింటికి తెలియకుండా దాచిపెట్టిన స్వర్ణ.. ప్రాణసంకటంలో పడిన తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? వంటి ఆసక్తికర అంశాలతో నందినీ రెడ్డి ఈ చిత్రాన్ని మలిచారు.  సినిమా ప్రారంభం నుంచి ఎక్కడా ల్యాగ్ లేకుండా వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో, అద్భుతమైన ఉమ్మడి కుటుంబ ఎమోషన్స్‌తో సాగుతుంది. ముఖ్యంగా సమంత కెరీర్‌లోనే వినూత్నంగా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతూ మంచి వసూళ్లను సాధిస్తున్న ఈ చిత్రం, డిజిటల్ ప్రియుల కోసం ఊహించని విధంగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' లో ఈ చిత్రం తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ నేటి (జూలై 17) నుండి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో ఈ రూ.100 కోట్ల బ్లాక్‌బస్టర్‌ను మిస్ అయిన వారు, అలాగే సమంత అభిమానులు వీకెండ్‌లో తమ కుటుంబ సమేతంగా హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను వీక్షించవచ్చు. ఓటీటీలో స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన వెంటనే మంచి రెస్పాన్స్ వస్తోంది. రికార్డు వ్యూస్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.      Samantha, Maa Inti Bangaaram, OTT Movies, Jio Hotstar  
హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ ప్రపంచంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా భయపెట్టే కథలను ఆడియన్స్ ఎగబడి చూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ 'జియో హాట్ స్టార్' సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీ 'ది కాల్' (The Call) ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. జూలై 10వ తేదీ నుండి తెలుగు ఆడియన్స్‌కు అందుబాటులోకి వచ్చిన ఈ హారర్ డ్రామా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ఈ కథనంలో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, సిటీకి దూరంగా ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఎడిత్ క్రాన్స్ టన్ (లిన్ షేయ్) అనే ఒక వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది. ఆమె వింత ప్రవర్తన మరియు రూపం కారణంగా చుట్టుపక్కల వారు ఆమెను ఒక మంత్రగత్తెగా భావిస్తారు. అయితే, తానియా అనే యువతి తన చెల్లెలు లారా కనిపించకుండా పోవడానికి ఈ వృద్ధురాలే కారణమని బలంగా నమ్ముతుంది. ఈ కక్షతో తానియా తన స్నేహితులైన క్రిస్, బ్రెడ్, జాక్‌లతో కలిసి ఎడిత్ ఇంటిపై రాళ్లు రువ్వి అద్దాలను పగులగొట్టి తీవ్రంగా వేధిస్తుంది. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఎడిత్ ఆత్మహత్య చేసుకుంటుంది. అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఎడిత్ భర్త ఊరి నుండి తిరిగి వచ్చి, తన భార్య రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులకు ఇవ్వకుండా ఉండాలంటే ఒక షరతు విధిస్తాడు. తన భార్య శవంతో పాటు పూడ్చిపెట్టిన ఫోన్ నెంబర్‌కు మేడపై గది నుండి ఒక్కొక్కరుగా కాల్ చేసి ఒక నిమిషం పాటు మాట్లాడాలని కోరతాడు. అలా మాట్లాడిన వారికి భారీ నగదు బహుమతి ఇస్తానని ఆశ చూపుతాడు. ప్రాణభయంతో ఆ నలుగురు స్నేహితులు ఆ ఫోన్ కాల్స్ చేయడానికి సిద్ధపడతారు. చనిపోయిన వ్యక్తి మొబైల్‌కు రింగ్ వెళ్లడం, అవతలి వైపు నుండి ఆత్మ మాట్లాడటం అనే పాయింట్ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతుంది. కానీ, ఈ ఉత్కంఠ ఎక్కువసేపు నిలబడదు. దర్శకుడు లీ చుంగ్-హ్యూన్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, కథనాన్ని నడిపించడంలో తడబడ్డారు. మేడపై గదిలోకి వెళ్లిన పాత్రలు ఒక భిన్నమైన ప్రపంచంలోకి ప్రవేశించినట్లు చూపించినా, ప్రేక్షకులను భయపెట్టే సీన్లు చాలా తక్కువగా ఉన్నాయి. లైటింగ్ మరియు సౌండ్ ఎఫెక్ట్స్ ఓ మోస్తరుగా ఉన్నప్పటికీ, వెన్నులో వణుకు పుట్టించే ఒక్క హారర్ మూమెంట్ కూడా ఇందులో కనిపించదు. శవంతో పాటు ఫోన్‌ను ఖననం చేయడం, దానికి కాల్ కలవడం వంటి అంశాలు లాజిక్‌కు చాలా దూరంగా మరియు సిల్లీగా అనిపిస్తాయి.     
ప్రఖ్యాత హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజువల్ వండర్‌గా తెరకెక్కించిన అద్భుత సృష్టి 'ది ఒడిస్సీ'. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జులై 17న విడుదలవుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని థియేటర్లలో వీక్షించేందుకు వెళ్లే ప్రేక్షకులకు, ముఖ్యంగా ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌లలో చూసేవారికి చిత్ర బృందం మరియు సినీ విశ్లేషకులు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమా ప్రారంభ సమయానికి కంటే కనీసం 30 నిమిషాల ముందే థియేటర్ సీట్లలో కూర్చోవాలని వారు గట్టిగా సూచిస్తున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన రహస్యంతో పాటు అత్యంత బలమైన కారణాలు కూడా దాగి ఉన్నాయి. క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని సంపూర్ణంగా సరికొత్త అధునాతన ఐమ్యాక్స్ కెమెరాలతో విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా విజువలైజ్ చేశారు. ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. ఈ క్రమంలోనే, కొన్ని ఎంపిక చేసిన ఐమ్యాక్స్ 70ఎంఎం (IMAX 70mm) స్పెషల్ స్క్రీనింగ్‌లలో ప్రధాన చిత్రం ప్రారంభం కావడానికి ముందే ఒక అద్భుతమైన సర్ప్రైజ్ కంటెంట్‌ను స్క్రీన్‌పై ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్ వర్గాల టాక్ ప్రకారం, డెనిస్ విల్లేనువే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'డూన్: పార్ట్ త్రీ' (Dune: Part Three) చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన 4 నిమిషాల ప్రొలోగ్ (లాంచ్ వీడియో)ను 'ది ఒడిస్సీ' మెయిన్ మూవీ కంటే ముందే ఐమ్యాక్స్ ప్రేక్షకుల కోసం ప్రదర్శించనున్నారు.  గతంలోనూ నోలన్ తన క్లాసిక్ హిట్స్ అయిన 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్' చిత్రాల విడుదల సమయంలో కూడా ఇలాంటి అద్భుతమైన ప్రమోషనల్ స్ట్రాటజీలను ఉపయోగించి సరికొత్త సంచలనం సృష్టించారు. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ రిపీట్ కాబోతుండడంతో ఈ 4 నిమిషాల ప్రొలోగ్‌ను మిస్ కాకుండా ఉండాలంటే అరగంట ముందే వెళ్లడం తప్పనిసరి.సాధారణంగా ఇలాంటి విజువల్ వండర్ మూవీస్ విడుదల రోజున థియేటర్ల వద్ద భారీ రద్దీ ఉంటుంది. పార్కింగ్ ఇబ్బందులు, టికెట్ స్కానింగ్ క్యూలైన్స్, థియేటర్ హాల్స్ లో సీట్లు వెతుక్కోవడం వంటి వాటివల్ల మెయిన్ సినిమా స్టార్ట్ అయ్యేసరికి చాలామందికి లేట్ అవుతుంది. అందుకే ఎలాంటి హడావిడి లేకుండా అరగంట ముందే వెళ్తే ప్రశాంతంగా సినిమాను ఆస్వాదించవచ్చు.  నోలన్ ఆశించిన పూర్తిస్థాయి ఐమ్యాక్స్ 70ఎంఎం ఫార్మాట్‌లో ఈ సినిమాను ప్రదర్శించే అల్ట్రా-ప్రీమియం థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 41 మాత్రమే ఉండడం విశేషం. హోమర్ రాసిన చారిత్రాత్మక గ్రీకు ఇతిహాసం 'ది ఒడిస్సీ' ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన ఒడిస్సియస్‌గా హాలీవుడ్ స్టార్ హీరో మ్యాట్ డామన్ నటించగా.. ఆయనతో పాటు యాన్ హత్వే, టామ్ హాలండ్, జెండాయా వంటి క్రేజీ స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించారు. సుమారు 2 గంటల 52 నిమిషాల నిడివితో వస్తున్న ఈ సినిమా లండన్ ప్రీమియర్ షో నుంచే మైండ్ బ్లోయింగ్ టాక్ సొంతం చేసుకుంది. సాంకేతికంగానూ, భావోద్వేగాల పరంగానూ ఇదొక మాస్టర్ పీస్ అని విమర్శకులు కొనియాడుతున్నారు. కాబట్టి థియేటర్ సీట్లలో అరగంట ముందే సెటిలైపోండి, ఈ విజువల్ వండర్‌ను పూర్తిగా ఆస్వాదించండి.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
   పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం వల్ల పెద్దగా నష్టం ఏమీ ఉండదని అనుకుంటారు.  సాధారణంగా ఇంట్లో మగవాళ్లు అయినా ఆడవాళ్లు అయినా పిల్లలు ఉన్నా పెద్దగా పట్టించుకోకుండా బట్టలు మార్చుకుంటారు.  అయితే.. ఇలా పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం సరైనదేనా?  దీని వల్ల కలిగే పర్యవసానాలు ఏంటి? తెలుసుకుంటే.. మంచి, చెడు.. పిల్లలు అనేది వారి వయసును పరిగణలోకి తీసుకునే.. అలాంటి పిల్లల మెదడు ఇంకా ఎదిగే దశలో ఉంటుంది.  ఈ కారణంగా పిల్లలకు మంచి ఏది చెడు ఏది అనే విషయాలు అర్థం చేసుకునేంత ఆలోచన ఉండదు. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు అలా బట్టలు మార్చుకున్నా లేదా విప్పినా అది పెద్ద విషయమేమీ కాదని అనుకుంటారు. ఇదెప్పుడూ మంచిది కాదు. ప్రైవసీ.. ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన విషయం. తల్లిదండ్రులైనా సరే.. పిల్లల ముందు బట్టలు మార్చుకోవడం ద్వారా వారికి శరీరం వాల్యూ తెలియదు. శరీరం బట్టలు లేకుండా ఉన్నప్పుడు ఒకరికి కనిపించకూడదని, ఇతరుల ముందు ఎల్లప్పుడూ శరీరాన్ని వస్త్రాలతో కప్పి ఉంచాలని.. ఇలాంటి చిన్న విషయాలు వారు తెలుసుకోలేరు.  ఈ కారణంగా వారికి  శరీరం గురించి అవగాహన రాదు. హద్దలు.. పిల్లలకు కూడా వ్యక్తిగత హద్దులు అనేవి ఉండాలి.  తమ ముందు ఎవరు ఎలా ఉండాలి?  తాము ఎవరి ముందు ఎలా ఉండాలి వంటివి పిల్లలు అర్థం చేసుకోవాలంటే అది తల్లిదండ్రుల ద్వారా మాత్రమే సాధ్యం  అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లల ముందు దుస్తులు మార్చుకుంటే.. తమ ముందు ఎవరు మార్చుకున్నా పర్వాలేదని,  తాము కూడా ఎవరి ముందైనా బట్టలు మార్చుకోవచ్చని అనుకుంటారు. తల్లిదండ్రులు చేసే పని వల్ల వారికి హద్దులు అనేవి అర్థం కావు. తప్పులు.. తల్లిదండ్రులు పిల్లల ముందు బట్టలు మార్చుకుంటే పిల్లలు తప్పు మార్గంలో వెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరైనా బట్టలు మార్చుకొనేటప్పుడు కూడా తాము చూడటం తప్పు కాదని అనుకుంటారు. ఇది ఇతరుల ప్రైవసీకి ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. ఇతరులకు విలువ కూడా ఇవ్వకుండా తయారవుతారు. ఈ వయసుకు తప్పనిసరి.. పిల్లలకు వయసు అనుసరించి ప్రైవసీ నేర్పాలి. ముఖ్యంగా మూడు సంవత్సరాల తర్వాత పిల్లలకు ప్రైవసీ నేర్పాలి.  ఇతరుల ముందు బట్టలు మార్చుకోవడం,  విప్పడం  చేయరాదని, ఇతరులు బట్టలు మార్చుకొనేటప్పుడు చూడరాదని పిల్లలకు చెప్పాలి.  ఇదంతా తల్లిదండ్రులు తమ నుండే మొదలు పెట్టాలి.                                    *రూపశ్రీ  
  ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునేవారు.  వారిని పెంచి పెద్ద చేయాలి,  మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి.  ఆడపిల్ల పుట్టిందంటే పెద్ద ఆర్థిక భారంగా భావించేవారు. కానీ నేటికాలంలో ఆడపిల్లే కావాలని ఆశ పడే తల్లిదండ్రులు ఉన్నారు.  ముఖ్యంగా.. ఆడపిల్లను యువరాణిలాగా,  అపురూపంగా పెంచే వారు ఉన్నారు.  తల్లిదండ్రులు ఇద్దరిలో ఆడపిల్ల విషయంలో తండ్రే ఎక్కువ ప్రేమ చూపిస్తాడని అందరూ అంటారు. అందుకే ఆడపిల్లను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటుంటారు.  అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని అలవాట్లు వదులుకోవాలి.  లేదంటే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది, పైగా ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది.  ఇంతకూ ఆడపిల్ల తండ్రులు వదులుకోవలసిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే.. కోపంగా అరవడం.. చాలామంది మగాళ్లకు కోపంతో గట్టిగా అరవడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో ఇలా కోపంగా, గట్టిగా అరిస్తే ఆడపిల్లలకు భయం పెరిగి నమ్మకం తగ్గుతుంది.  తనకు ఏదైనా బాధ లేదా సమస్య అనిపిస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోలేదు. అందుకే కోపంగా అరిచే అలవాటు ఉంటే ఆ అలవాటు మానేయ్యాలి. భార్యను తక్కువ చేయడం.. భార్య మీద అరవడం, బార్యను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా మంది మగాళ్లకు ఉండే అలవాటు. అయితే కూతురు ఉన్నప్పుడు ఇలా  భార్యను తక్కువ చేసి మాట్లాడటం, భార్య మీద అరవడం వంటివి చేయరాదు. ఎందుకంటే భార్య విషయంలో మగాడు చేసే ప్రవర్తన వల్ల కూతురికి తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అతను ఎప్పటికీ కూతురి దృష్టిలో ఉన్నతంగా ఉండలేడు. అందుకే కూతురి ముందు భార్యను తిట్టడం, చిన్నతనంగా మాట్లాడటం, అవమానించడం చేయకూడదు. ఆడపిల్లలను తక్కుగా మాట్లాడటం.. చాలామంది మగాళ్లు ఆడపిల్లల విషయంలో అనే మాట.. నువ్వు ఆడపిల్లవు అది చేయకు ఇది చేయకు అని.  నువ్వు చేయలేవు అని అనడం.  ఇలా మాట్లాడటం వల్ల ఆడపిల్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆడపిల్ల తన జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యాలు సాధించకపోగా, భయస్థురాలిగా ఉండిపోతుంది. అందుకే ఆడపిల్లలను ప్రోత్సహించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు. పద్దతుల పేరుతో కఠినం.. సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు పద్దతులను  మగపిల్లల కంటే ఆడపిల్లలను పెంచడంలోనే ఎక్కువ ప్రయోగిస్తారు. పద్దతుల పేరుతో ఆడపిల్లలను కఠినంగా, వారిని భయపెడుతూ పెంచుతారు.  కానీ ఆడపిల్లలను పద్దతుల పేరుతో భయపెట్టి కాదు.. ప్రేమతో పెంచాలి. సమస్యలు, పరిష్కారం.. ఆడపిల్లకు సామర్థ్యం ఉండదని, ఏ సమస్యను వారు ఎదుర్కోలేరని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ కారణంగానే ఆడపిల్ల ఏదైనా సమస్య అనగానే తండ్రే పరిష్కరించడం ఆడపిల్లను సేఫ్ జోన్ లో ఉంచడం చేస్తారు.  దీని వల్ల ఆడపిల్ల చేతకాని దాని లాగా,  సమస్యలు వచ్చినప్పుడు దిక్కుతోచక నిస్సహాయంగా ఉండిపోతుంది. అందుకే అన్ని సమస్యలు తండ్రి పరిష్కరించకుండా కొన్ని ఆడపిల్ల కూడా పరిష్కరించేలా అవకాశం ఇవ్వాలి.  ఇది జీవితంలో కొండంత ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.                                        *రూపశ్రీ.
  ప్రతి వ్యక్తికి తన జీవితంలో బోలెడు బలం, ప్రశాంతత,  ఆత్మవిశ్వాసం,  జీవితం మీద భరోసా కలిగేది కుటుంబం వల్లనే.. బయట ఎన్ని సమస్యలు ఉన్నా,  ఎంత ఇబ్బందులు ఎదుర్కున్నా ఇంటికి రాగానే సంతోషం బోలెడు ప్రశాంతత,  జీవితంలో ఊరట కలుగుతోంది అంటే.. ఆ కుటుంబం ఎంతో ఆరోగ్యంగా ఉందని అర్థం. కానీ కొన్ని కుటుంబాలలో ఆరోగ్యకరమైన వాతావరణం ఉండదు. ఇలా ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోతే కుటుంబ సభ్యులు చాలా వరకు మానసికంగా డిస్టర్బ్ అవుతుంటారు. అయితే  కుటుంబ వాతావరణం అనారోగ్యంగా ఉండటానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో తరాల అంతరం వల్ల కుటుంబంలో వాతావరణం సరిగా లేకుండా ఉండే అవకాశం ఉంది, అలాగే కుటుంబ అలవాట్ల వల్ల కూడా వాతావరణం దెబ్బతింటుంది. కానీ కుటుంబ జీవితంలో నిర్లక్ష్యం చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి.  వాటిని తెలుసుకుంటే.. కుటుంబం తిరిగి ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  ఇంతకీ ఆ విషయాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమోషన్స్ దుర్వినియోగం.. కుటుంబంలో సులభంగా గుర్తించగలిగే ప్రమాదకరమైన విషయాలు ఏవీ ఉండవు. కానీ చాలా సున్నితంగా ఉంటూనే మనుషుల్ని బాధపెడతారు. ఎమోషన్స్ తో ఇబ్బంది పెడతారు. కుటుంబ సభ్యులు తమదే తప్పు అన్న భావనను కుటుంబంలో  వ్యక్తికి కలిగిస్తారు. కొన్నిసార్లు, వారు బాధితులుగా నటిస్తూ ఎదుటివారిని ఎక్కువగా నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వాతావరణం ఉన్న ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం, సంతోషం ఉండవు. నిర్ణయాల దగ్గర బంధనం..  కుటుంబంలో జీవిత నిర్ణయాల గురించి మిమ్మల్ని అడగకుండా, తమకు తాము నిర్ణయాలు తీసుకుని ఆఖరిగా మీకు చెబుతూ ఉంటే.. ఒకవేళ అదే నిజమైతే, ఇది నిర్లక్ష్యం చేయకూడని విషయమని లైఫ్ స్టైల్ నిపుణులు చెబుతున్నారు. . ఈ నియంత్రణ చిన్నతనం నుండి కౌమారదశ వరకు ఆరోగ్యకరంగానే ఉంటుంది. , కానీ  పెద్దయ్యాక కుటుంబ సభ్యుల నుండి ఇదే వైఖరి కొనసాగడం మంచిది కాదు. హద్దులు లేకపోవడం.. ప్రతిఒక్కరూ ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను మరొకరు గౌరవించుకున్నప్పుడే కుటుంబ సంబంధాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. అలా చేయడంలో విఫలమైతే, కాలక్రమేణా విషపూరితమైన సంబంధాలకు దారితీయవచ్చు. అంతేకాకుండా, ఈ విషయాలు  వ్యక్తి యొక్క భావోద్వేగ ఎదుగుదలకు చాలా కీలకమైనవి. గొడవల పరిష్కారం.. పరిష్కారం కాని కుటుంబ వివాదాలు చాలా కుటుంబాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటివి పదేపదే మరో వాదనకు లేదా ఘర్షణకు దారితీసి, పరిస్థితిని మరింత తీవ్రం చేస్తాయి. దీనివల్ల, ఆ విషయం పరిష్కారమైన తర్వాత కూడా ఎమోషనల్ దూరం పెరగవచ్చు. పట్టించుకోకపోవడం.. కుటుంబంలో మీ భావాలను లేదా అభిప్రాయాలను ఎప్పుడూ  పట్టించుకోవడం జరిగితే అది కుటుంబ సభ్యుల నుండి దూరాన్ని పెంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైతై ఎమోషనల్ సపోర్ట్ లేదా అభిప్రాయాలకు విలువ ఇవ్వకపోవడం జరుగుతుందో అప్పుడు ఆ ఇంట్లో వ్యక్తి పరాయివాడుగా ఫీలవుతారు.                                     *రూపశ్రీ.  
నేటికాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే అతిపెద్ద సమస్య కాలుష్యం.   గాలి కాలుష్యం, ఆహార కాలుష్యం, నీటి కాలుష్యం.. ఇలా ప్రతిదీ కాలుష్యం కోరల్లో చిక్కుకుని ఉన్నాయి.  బయటకు వెళ్లినప్పుడు వాహనాల పొగతో పాటు ఎన్నో కారణాల వల్ల గాలి కాలుష్యం అవుతుంది. అయితే చాలామంది ఇళ్లలో కూడా గాలి స్వచ్చంగా లేకపోవడం వల్ల శ్వాస సంబంధం సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో ఇంట్లో గాలి కాస్త డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది.   కొన్ని రకాల మొక్కలను ఇంట్లో ఉంచుకోవడం వల్ల  గాలిని శుద్ది చేసి గాలిని స్వచ్చంగా మారుస్తాయి. అంతేకాదు. ఆక్సిజన్ స్థాయిలను కూడా మెరుగుపరుస్తాయి.  ఇంట్లో ఆక్సిజన్ స్థాయిలను మెరుగు పరిచి,  గాలిని శుద్ది చేసే ఆ మొక్కలు ఏవో తెలుసుకుంటే.. ఇండోర్ మొక్కలు ఎందుకు ప్రయోజనకరంగా పరిగణించబడతాయి..? ఇంట్లో పెంచే మొక్కలను ఇండోర్ మొక్కలు అని అంటారు.  ఈ మొక్కలు  గాలిని సహజంగా శుద్ది చేసే పరికరాలుగా  పనిచేస్తాయి. అవి కార్బన్ డయాక్సైడ్‌ను తగ్గించి, ఆక్సిజన్‌ను విడుదల చేయడం ద్వారా గాలిలోని హానికరమైన కాలుష్య కారకాలను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, అవి ఇంటి అలంకరణకు కూడా ఎంతో మంచివి.  చాలా మంది ఇళ్లలో అలంకరణ కోసం మొక్కలను పెంచుతారని అనుకుంటారు. కానీ.. ఇవి అలంకరణ కోసం మాత్రమే కాకుండా ఇంట్లో గాలిని శుద్ది చేయడానికి కూడాపెంచుతారు. ఇంట్లో గాలిని శుద్ది చేసి ఆక్సిజన్ పెంచే మొక్కలు.. పీస్ లిల్లీ.. ఇంటి లోపల చక్కగా పెరిగే ఒక  మొక్క పీస్ లిల్లీ..  ఈ మొక్కల పువ్వులు చాలా విభిన్నంగా ఉంటాయి. గాలి చాలా బాగా శుద్ది చేయడంలో ఈ మొక్కలు చాలా గొప్పగా సహాయపడతాయి.  కలబంద.. కలబంద ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా ఉండే మొక్క, అయితే ఇళ్లలో వాడే  డిటర్జెంట్లు, పెయింట్లు,  గమ్ లలో  ఉండే కొన్ని సాధారణ రసాయనాలు గాలిలో కలిసిపోయి ఉంటాయి. అలాంటి  గాలిని శుద్ధి చేసి, ఇంటిని తాజాగా ఉంచే సామర్థ్యం కలబందకు ఉంది. స్నేక్ ప్లాంట్.. నీరు, వెలుతురు, సూర్యరశ్మి సరిగా లేకపోయినా, చాలా తక్కువగా ఉన్నా సరే..అలాంటి వాతావరణంలో కూడా స్నేక్ ప్లాంట్ పెరుగుతుంది. దీనికున్న ప్రత్యేక లక్షణం .. ఇది రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను ఆక్సిజన్‌గా మారుస్తుంది, అందువల్ల ఇది పడకగదిలో పెంచడానికి కూడా చాలా అనువైన మొక్క. మనీ ప్లాంట్.. వాస్తు పరంగా , శాస్త్రీయంగా కూడా చాలా ప్రాచుర్యం పొందిన మొక్క మనీ ప్లాంట్, భారతీయులలో చాలా ఇళ్లలో మనీ ప్లాంట్ ఉంటుంది. ఇది ఇంట్లో ఉంటే డబ్బుకు లోటు ఉండదని,  ఆర్థిక ఎదుగుదల ఉంటుందని అనుకుంటారు. ఇంటిలోని మూసి ఉన్న గదులలోని కలుషిత గాలిని శుభ్రపరచడానికి , ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచడానికి సహాయపడుతుంది. స్పైడర్ ప్లాంట్.. పొడవాటి, చారల ఆకులతో ఉండే ఈ మొక్క వేగంగా పెరుగుతుంది . దీనికి పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు. గాలి నుండి కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తొలగించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. పైన చెప్పుకున్న మొక్కలను ఇంట్లో  పెంచుకుంటే ఇంటి వాతావరణం,  ఇంటి గాలి చాలా శుద్ధంగా మారుతుంది.                                   *రూపశ్రీ.  
ఉద్గీత ప్రాణాయామం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు..రోజుకు 5 నిమిషాలు చాలు.! రోజుకు కేవలం 5 నిమిషాలు ఉద్గీత ప్రాణాయామం (ఓం ధ్యానం) చేస్తే శరీరం, మనసు ఎలా మారుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియోలో ప్రముఖ సీనియర్ యోగా థెరపిస్ట్ & ఆయుర్వేద డైటీషియన్ శ్రీమతి స్రవంతి రఘు గారు ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో సులభంగా వివరిస్తారు. అలాగే దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయంగా నిరూపితమైన అంశాలు, ఒత్తిడి తగ్గడం, మానసిక ప్రశాంతత పెరగడం, ఏకాగ్రత మెరుగుపడడం, మంచి నిద్రకు సహాయపడడం వంటి విషయాలను వివరంగా తెలియజేస్తారు. అంతేకాకుండా, ఉద్గీత ప్రాణాయామాన్ని ఎవరు చయాలి? ఎవరు చేయకూడదు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రారంభ స్థాయి వారు ఎలా ప్రారంభించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు కూడా సమాధానాలు ఈ వీడియోలో పొందుపరిచారు. యోగా, ధ్యానం, సహజ ఆరోగ్యం మరియు మానసిక ప్రశాంతతపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన ఉపయోగకరమైన వీడియో ఇది. ఈ వీడియోను పూర్తిగా వీక్షించి, ఉద్గీత ప్రాణాయామాన్ని సరైన విధంగా అభ్యసించి ఆరోగ్యకరమైన జీవనశైలికి నాంది పలకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మీ వంటింట్లో నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు ఉన్నాయా?  ఇవి ఎంతవరకు సేఫ్ మీకు తెలుసా? ఉల్లిపాయ ఆహారంలో ఎక్కువగా వినియోగించే కూరగాయ.  ఏ కూరలు చేసినా అందులో ఉల్లిపాయ వేస్తే వచ్చే రుచి, సువాసన వేరు.  చాలామంది పచ్చి ఉల్లిపాయలు తినడానికి ఇష్టపడతారు.  అయితే గత కొంత కాలంగా ఉల్లిపాయల మీద నల్లటి మచ్చలు,  దుమ్ము లాంటి బూజు కనిపించడం చాలా మంది గమనించే ఉంటారు.  మార్కెట్ నుండి ఉల్లిపాయలు తెచ్చాక వాటిని నీటిలో కడిగి వండేస్తుంటారు. అయితే ఇలాంటి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?  దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?  వివరంగా తెలుసుకుంటే.. ఉల్లిపాయపై నలుపు రంగు..  ఉల్లిపాయ తొక్కలపై ఉండే నల్లటి మచ్చలు మట్టిలో కనిపించే ఒక సాధారణ శిలీంధ్రం వల్ల ఏర్పడతాయి. ఉల్లిపాయలపై కనిపించే ఈ శిలీంధ్రం సాధారణంగా అంటువ్యాధి కాదు, అయినప్పటికీ, ఉపయోగించే ముందు వాటిని బాగా కడగడం ముఖ్యం. చాలా మంది బాగా ఆరోగ్యంగా ఉండేవారికి ఉల్లిపాయ మీద ఉండే ఈ  బూజు వల్ల ప్రమాదం ఉండదు. అయితే, బూజు ఉల్లిపాయ లోపలి పొరలకు వ్యాపించినా, ఉల్లిపాయ మెత్తబడినా, లేదా కుళ్ళు స్పష్టంగా కనిపించినా, దానిని తినడం మంచిది కాదు. ఈ బూజు  కేవలం ఉల్లిపాయ పైననే కాకుండా   కొన్నిసార్లు దాని సన్నని వేర్లు కంటికి కనిపించని విధంగా లోపలికి కూడా వ్యాపిస్తాయి. ఆరోగ్యానికి మంచిదేనా? బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఈ బూజు పెద్దగా ఆరోగ్యానికి హాని చేయదు. దీని వల్ల ప్రమాదం ఏమీ ఉండదు.   అయితే  కొంతమందిలో బూజు స్పోర్‌లు తుమ్ములు, ఆయాసం లేదా కంటి మంట వంటి అలెర్జీ రియాక్షన్ లకు కారణం కావచ్చు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఎండిన పొరపై కొద్దిగా నల్లటి పొడి మాత్రమే ఉండి, లోపల ఉల్లిపాయ పూర్తిగా గట్టిగా, శుభ్రంగా ఉంటే, బయటి పొరను తీసివేసి, బాగా కడిగిన తర్వాత దానిని ఉపయోగించవచ్చు. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? ఉల్లిపాయలపై నల్ల మచ్చలను కలిగించే శిలీంధ్రం సాధారణంగా హానికరమైనది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో, ఇది ఓక్రాటాక్సిన్ ఎ అనే మైకోటాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలదట. దీనిని ఎక్కువ కాలం పాటు, అధిక పరిమాణంలో తీసుకుంటే, అది మూత్రపిండాలు , కాలేయానికి నష్టం కలిగించగలదట. ఈ విషపదార్థం  వేడికి కూడా నశించదుని కాబట్టి వండటం వల్ల ఇది తప్పనిసరిగా తొలగిపోదని అంటున్నారు. అందుకే దీనిని ఆహారంలో ఉపయోగించే ముందు సరిగ్గా చూసుకోవడం  చాలా ముఖ్యం.                                     *రూపశ్రీ.