Home

»

Gossips

ప్రభాస్ వల్ల ప్లాన్ మార్చిన బాలయ్య.!

Jul 17, 2026 10:28AM

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘NBK 111’ విడుదలపై చిత్ర యూనిట్ ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ ఈ సినిమాను విజువల్ వండర్‌గా తీర్చిదిద్దుతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ చిత్రాన్ని డిసెంబర్ ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావించినప్పటికీ, ఇప్పుడు బాక్సాఫీస్ ఈక్వేషన్స్ మారడంతో సరికొత్త ప్లాన్ సిద్ధం చేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ (Fauzi) సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ లాంటి గ్లోబల్ స్టార్ సినిమా డిసెంబర్ మొదటి వారంలో వస్తుండటంతో.. థియేటర్ల లభ్యత, కలెక్షన్ల పరంగా ఎలాంటి క్లాష్ రాకూడదని ‘NBK 111’ మేకర్స్ భావించారు. అందుకే బాలయ్య మాస్ జాతరను డిసెంబర్ చివరి వారంలో వచ్చే క్రిస్మస్ పండుగ సెలవుల కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకుంది. పండగ సీజన్ అయితే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయమని, ఫ్యామిలీ ఆడియన్స్‌ కూడా భారీగా థియేటర్లకు తరలివస్తారని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ కూడా పక్కా ప్రణాళికతో సాగుతున్నాయి. దసరా పండుగ కంటే ముందే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను ముగించాలని గోపీచంద్ మలినేని టార్గెట్‌గా పెట్టుకున్నారు. దసరా లోపు షూటింగ్ పూర్తయితే, డిసెంబర్ క్రిస్మస్ రేస్‌కు సినిమాను పర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేయడానికి వీలవుతుందని చిత్ర బృందం నమ్ముతోంది. 

ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ అనౌన్స్‌మెంట్ కూడా అతి త్వరలోనే రాబోతోంది. గతంలో బాలయ్యతో 'వీరసింహారెడ్డి' సినిమా చేసిన గోపీచంద్ మలినేని, ఈసారి ఎలాంటి పవర్ ఫుల్ టైటిల్ తో రాబోతున్నారనే ఆసక్తి నెలకొంది. 

ఈ సినిమాలో బాలకృష్ణ సరసన స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ సంజయ్ దత్ ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ ‘NBK 111’ మాస్ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన వెంటనే బాలయ్య.. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సెన్సేషనల్ పొలిటికల్ డ్రామా షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

 

 

Nandamuri Balakrishna, NBK 111, Christmas Release, Prabhas, Fauzi

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com