Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సోనమ్ వాంగ్‌చుక్ కు రేవంత్ సంఘీభావం.. నేడో రేపో హస్తినకు పయనం.!
posted on: Jul 17, 2026 11:22AM

పర్యావరణ పరిరక్షకుడు, సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్ చుక్ తో భేటీకి హస్తిన పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో రేవంత్ రెడ్డి దిల్లీకి చేరుకుని, జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌ను స్వయంగా కలిసి సంఘీభావం ప్రకటించనున్నారని కాంగ్రెస్ లో అత్యంత విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు తెలపడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు బయలుదేరనుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరశన చేపట్టారు. ఇలా ఉండగా ఆయన నిరవధిక నిరశన శుక్రవారం (జులై 17) నాటికి 20వ రోజుకు చేరింది. ఇలా ఉండగా పార్లమెంట్ భవనం ముట్టడించేందుకు కూడా సోనమ్ వాంగ్‌చుక్ బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ కీలక తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుగా ప్రత్యక్షంగా రంగంలోకి దిగడంతో ఈ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.
ఇప్పటికే ఆప్ అధినేత, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జంతర్ మంతర్ వద్ద సోనమ్ వాంగ్‌చుక్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. కేజ్రీవాల్ పర్యటనతో ఈ ఉద్యమానికి రాజకీయ బలం చేకూరింది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ తరఫున దక్షిణాదిలో అత్యంత బలమైన నేత రేవంత్ రెడ్డి స్వయంగా హస్తిన వెళ్లి సోనమ్ వాంగ్‌చుక్ కు, ఆయన పోరాటానికి సంఘీభావం ప్రకటించనుండటంతో.. కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరగడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా రేవంత్ రెడ్డిని ఈ ఉద్యమ వేదికపైకి పంపించడం ద్వారా ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో రేవంత్ ది బలమైన వాయిస్ అని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటన, సోనమ్ వాంగ్‌చుక్‌తో భేటీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే.. కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఈ పర్యటన ఖరారైందని అంటున్నాయి.
Telangana CM, Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, TeluguOne


.webp)



