
టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి తెరలేపుతోంది ఒక భయానక చిత్రం. దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి వస్తున్న విభిన్నమైన చిత్రం ‘అమెన్’ (AMEN). ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై రూపొందిన ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జూలై 24న విడుదల కానుంది.
ఈ సినిమా గురించి ఎస్కే బషీద్ మాట్లాడుతూ, “ఇప్పటివరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా ‘అమెన్’ రూపొందించాం. సరికొత్త సస్పెన్స్, భయానక ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం.. గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం. ఔట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం.” అన్నారు.
ఇటీవల విడుదలైన ‘అమెన్’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “హెచ్చరిక: మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా ఇంట్లో ఉంచి సినిమాకు రండి...” అనే క్యాప్షన్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. త్వరలో ట్రైలర్ విడుదల కానుంది. టాలీవుడ్‌లో కొత్త హారర్ వేవ్‌ను సృష్టించేందుకు సిద్ధమైన ‘అమెన్’ జూలై 24న థియేటర్లలో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.

Amen Movie, Horror Thriller, SK Basheed, Telugu Cinema





