ప్రఖ్యాత హాలీవుడ్ లెజెండరీ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, విజువల్ వండర్‌గా తెరకెక్కించిన అద్భుత సృష్టి 'ది ఒడిస్సీ'. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో జులై 17న విడుదలవుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ అద్భుత దృశ్యకావ్యాన్ని థియేటర్లలో వీక్షించేందుకు వెళ్లే ప్రేక్షకులకు, ముఖ్యంగా ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌లలో చూసేవారికి చిత్ర బృందం మరియు సినీ విశ్లేషకులు ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమా ప్రారంభ సమయానికి కంటే కనీసం 30 నిమిషాల ముందే థియేటర్ సీట్లలో కూర్చోవాలని వారు గట్టిగా సూచిస్తున్నారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైన రహస్యంతో పాటు అత్యంత బలమైన కారణాలు కూడా దాగి ఉన్నాయి.
క్రిస్టోఫర్ నోలన్ ఈ చిత్రాన్ని సంపూర్ణంగా సరికొత్త అధునాతన ఐమ్యాక్స్ కెమెరాలతో విజువల్స్ పరంగా ఎక్కడా రాజీ పడకుండా విజువలైజ్ చేశారు. ప్రేక్షకులకు కనీవినీ ఎరుగని సరికొత్త థియేట్రికల్ అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఆయన పనిచేశారు. ఈ క్రమంలోనే, కొన్ని ఎంపిక చేసిన ఐమ్యాక్స్ 70ఎంఎం (IMAX 70mm) స్పెషల్ స్క్రీనింగ్‌లలో ప్రధాన చిత్రం ప్రారంభం కావడానికి ముందే ఒక అద్భుతమైన సర్ప్రైజ్ కంటెంట్‌ను స్క్రీన్‌పై ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. హాలీవుడ్ వర్గాల టాక్ ప్రకారం, డెనిస్ విల్లేనువే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'డూన్: పార్ట్ త్రీ' (Dune: Part Three) చిత్రానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన 4 నిమిషాల ప్రొలోగ్ (లాంచ్ వీడియో)ను 'ది ఒడిస్సీ' మెయిన్ మూవీ కంటే ముందే ఐమ్యాక్స్ ప్రేక్షకుల కోసం ప్రదర్శించనున్నారు.
గతంలోనూ నోలన్ తన క్లాసిక్ హిట్స్ అయిన 'ది డార్క్ నైట్', 'ది డార్క్ నైట్ రైజెస్' చిత్రాల విడుదల సమయంలో కూడా ఇలాంటి అద్భుతమైన ప్రమోషనల్ స్ట్రాటజీలను ఉపయోగించి సరికొత్త సంచలనం సృష్టించారు. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్ రిపీట్ కాబోతుండడంతో ఈ 4 నిమిషాల ప్రొలోగ్‌ను మిస్ కాకుండా ఉండాలంటే అరగంట ముందే వెళ్లడం తప్పనిసరి.సాధారణంగా ఇలాంటి విజువల్ వండర్ మూవీస్ విడుదల రోజున థియేటర్ల వద్ద భారీ రద్దీ ఉంటుంది. పార్కింగ్ ఇబ్బందులు, టికెట్ స్కానింగ్ క్యూలైన్స్, థియేటర్ హాల్స్ లో సీట్లు వెతుక్కోవడం వంటి వాటివల్ల మెయిన్ సినిమా స్టార్ట్ అయ్యేసరికి చాలామందికి లేట్ అవుతుంది. అందుకే ఎలాంటి హడావిడి లేకుండా అరగంట ముందే వెళ్తే ప్రశాంతంగా సినిమాను ఆస్వాదించవచ్చు.
నోలన్ ఆశించిన పూర్తిస్థాయి ఐమ్యాక్స్ 70ఎంఎం ఫార్మాట్‌లో ఈ సినిమాను ప్రదర్శించే అల్ట్రా-ప్రీమియం థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా కేవలం 41 మాత్రమే ఉండడం విశేషం. హోమర్ రాసిన చారిత్రాత్మక గ్రీకు ఇతిహాసం 'ది ఒడిస్సీ' ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన ఒడిస్సియస్‌గా హాలీవుడ్ స్టార్ హీరో మ్యాట్ డామన్ నటించగా.. ఆయనతో పాటు యాన్ హత్వే, టామ్ హాలండ్, జెండాయా వంటి క్రేజీ స్టార్ కాస్ట్ కీలక పాత్రలు పోషించారు. సుమారు 2 గంటల 52 నిమిషాల నిడివితో వస్తున్న ఈ సినిమా లండన్ ప్రీమియర్ షో నుంచే మైండ్ బ్లోయింగ్ టాక్ సొంతం చేసుకుంది. సాంకేతికంగానూ, భావోద్వేగాల పరంగానూ ఇదొక మాస్టర్ పీస్ అని విమర్శకులు కొనియాడుతున్నారు. కాబట్టి థియేటర్ సీట్లలో అరగంట ముందే సెటిలైపోండి, ఈ విజువల్ వండర్‌ను పూర్తిగా ఆస్వాదించండి.




