Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కూతురి కోసం ప్రతి తండ్రి వదులుకోవలసిన 5 అలవాట్లు ఇవి..!
posted on: Jul 16, 2026 12:40PM
.webp)
ఒకప్పుడు ఆడపిల్ల పుడితే భారం అనుకునేవారు. వారిని పెంచి పెద్ద చేయాలి, మంచి కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. ఆడపిల్ల పుట్టిందంటే పెద్ద ఆర్థిక భారంగా భావించేవారు. కానీ నేటికాలంలో ఆడపిల్లే కావాలని ఆశ పడే తల్లిదండ్రులు ఉన్నారు. ముఖ్యంగా.. ఆడపిల్లను యువరాణిలాగా, అపురూపంగా పెంచే వారు ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరిలో ఆడపిల్ల విషయంలో తండ్రే ఎక్కువ ప్రేమ చూపిస్తాడని అందరూ అంటారు. అందుకే ఆడపిల్లను డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని అంటుంటారు. అయితే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి కొన్ని అలవాట్లు వదులుకోవాలి. లేదంటే ఆడపిల్ల ఎదుగుదల దెబ్బతింటుంది, పైగా ఆడపిల్ల భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. ఇంతకూ ఆడపిల్ల తండ్రులు వదులుకోవలసిన అలవాట్లు ఏంటో తెలుసుకుంటే..
కోపంగా అరవడం..
చాలామంది మగాళ్లకు కోపంతో గట్టిగా అరవడం అనే అలవాటు ఉంటుంది. కానీ ఆడపిల్లలు ఉన్న తండ్రులు ఇంట్లో ఇలా కోపంగా, గట్టిగా అరిస్తే ఆడపిల్లలకు భయం పెరిగి నమ్మకం తగ్గుతుంది. తనకు ఏదైనా బాధ లేదా సమస్య అనిపిస్తే తండ్రితో మనసు విప్పి చెప్పుకోలేదు. అందుకే కోపంగా అరిచే అలవాటు ఉంటే ఆ అలవాటు మానేయ్యాలి.
భార్యను తక్కువ చేయడం..
భార్య మీద అరవడం, బార్యను తక్కువ చేసి మాట్లాడటం వంటివి చాలా మంది మగాళ్లకు ఉండే అలవాటు. అయితే కూతురు ఉన్నప్పుడు ఇలా భార్యను తక్కువ చేసి మాట్లాడటం, భార్య మీద అరవడం వంటివి చేయరాదు. ఎందుకంటే భార్య విషయంలో మగాడు చేసే ప్రవర్తన వల్ల కూతురికి తండ్రి మీద గౌరవం తగ్గిపోతుంది. అతను ఎప్పటికీ కూతురి దృష్టిలో ఉన్నతంగా ఉండలేడు. అందుకే కూతురి ముందు భార్యను తిట్టడం, చిన్నతనంగా మాట్లాడటం, అవమానించడం చేయకూడదు.
ఆడపిల్లలను తక్కుగా మాట్లాడటం..
చాలామంది మగాళ్లు ఆడపిల్లల విషయంలో అనే మాట.. నువ్వు ఆడపిల్లవు అది చేయకు ఇది చేయకు అని. నువ్వు చేయలేవు అని అనడం. ఇలా మాట్లాడటం వల్ల ఆడపిల్లకు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది. ఆడపిల్ల తన జీవితంలో ఎలాంటి ఉన్నత లక్ష్యాలు సాధించకపోగా, భయస్థురాలిగా ఉండిపోతుంది. అందుకే ఆడపిల్లలను ప్రోత్సహించాలి తప్ప తక్కువ చేసి మాట్లాడకూడదు.
పద్దతుల పేరుతో కఠినం..
సమాజంలో ఎంతో మంది తల్లిదండ్రులు పద్దతులను మగపిల్లల కంటే ఆడపిల్లలను పెంచడంలోనే ఎక్కువ ప్రయోగిస్తారు. పద్దతుల పేరుతో ఆడపిల్లలను కఠినంగా, వారిని భయపెడుతూ పెంచుతారు. కానీ ఆడపిల్లలను పద్దతుల పేరుతో భయపెట్టి కాదు.. ప్రేమతో పెంచాలి.
సమస్యలు, పరిష్కారం..
ఆడపిల్లకు సామర్థ్యం ఉండదని, ఏ సమస్యను వారు ఎదుర్కోలేరని తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ కారణంగానే ఆడపిల్ల ఏదైనా సమస్య అనగానే తండ్రే పరిష్కరించడం ఆడపిల్లను సేఫ్ జోన్ లో ఉంచడం చేస్తారు. దీని వల్ల ఆడపిల్ల చేతకాని దాని లాగా, సమస్యలు వచ్చినప్పుడు దిక్కుతోచక నిస్సహాయంగా ఉండిపోతుంది. అందుకే అన్ని సమస్యలు తండ్రి పరిష్కరించకుండా కొన్ని ఆడపిల్ల కూడా పరిష్కరించేలా అవకాశం ఇవ్వాలి. ఇది జీవితంలో కొండంత ధైర్యాన్ని, సమస్యలను ఎదుర్కునే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
*రూపశ్రీ.


.webp)


