LATEST NEWS
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు సోషల్ మీడియాను ఎంతవరకు యాక్టివ్‌గా వినియోగిస్తున్నారనే అంశంపై ఆయన ఆరా తీశారు. సోషల్ మీడియాను నేతలు సమర్థంగా వినియోగించాలని లోకేష్ సూచించారు. సోషల్ మీడియానే కదా అని తేలిగ్గా తీసుకోవద్దని.. దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టాలని చెప్పారు. ఏఎంసీ, కార్పొరేషన్ ఛైర్మన్లు కూడా తాము చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వివరించాలని.. ప్రభుత్వ పనితీరుపై ఓపెన్‌గా మాట్లాడాలని నేతలకు సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోల ద్వారా తన సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారని గుర్తుచేశారు. తాను కూడా సుజ్లాన్ విండ్ ప్రాజెక్టులకు శంకుస్థాపన, డీఎస్సీపై జరుగుతున్న దుష్ప్రచారానికి సంబంధించి సెల్ఫీ వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు లోకేష్ తెలిపారు. విషయం చిన్నదైనా, పెద్దదైనా ప్రజలకు వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత నాయకులపై ఉందన్నారు. ప్రతిపక్షాల పని ఎప్పుడూ బురదజల్లడమేనని వ్యాఖ్యానించిన లోకేష్.. వారి దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సూచించారు. పార్టీ ఆదేశాలు, కార్యక్రమాలపై సోషల్ మీడియా టీమ్స్ తక్షణమే స్పందించేలా పనిచేయాలని అన్నారు. జగన్‌కు సంబంధించిన అంశాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు గుడ్డిగా సమర్థిస్తున్నారని లోకేష్ విమర్శించారు. అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని.. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు.       (Minister  Nara Lokesh, Telugu Desam Party, Amaravati, Leadership Conclave, Political Communication, Public Orientation, Social Media, TDP Leaders, Social Media Strategy, CM Chandrababu, YS Jagan, YSRCP, Telugu One, Telugu News)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి.  సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.   విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ  స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి.  అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో  విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి  అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు   పార్టీలోకి వచ్చి తన  నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  రాష్ట్ర రాజకీయాల్లో   బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.  ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది.   తనను తాను శివసేన వ్యవస్థాపకుడు  బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము.  ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   [Vijayasai Reddy Bal Thackeray  Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]
తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు.   ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.   [Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]
వైసీపీ ఇండియా కూటమిలో చేరబోతోందా? 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. కాంగ్రెస్ అండ వినా గత్యంతరం లేదని భావిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా జగన్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారని వైసీపీ వర్గాలూ చెబుతుతున్నాయి.  అందులో భాగంగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్..   జాతీయ స్థాయిలో కీలకంగా మారిన  ఇండియా కూటమితో   జతకట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకుంటూ, రాబోయే కాలంలో అనుసరించాల్సిన విధానాలపై అయన విస్తృతంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను పదును పెడుతున్న జగన్.. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు.  ఇండియా కూటమితో భాగం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీయేయేతర పార్టీలతో సయోధ్య ఏర్పడుతుందనీ, తద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన గళం వినిపించే అవకాశం లభిస్తుందని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.    గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో  సయోధ్యతో వ్యవహరించిన జగన్.. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత.. బీజేపీతో ఎంతగా కలిసి సాగాలన్నా ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీతో ఉన్న చెలిమి కారణంగా వీలు కావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చూపు ఇండియా కూటమి వైపు మళ్లిందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరినట్లైతే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ సహయ సహకారాలు అందుతాయనీ, అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   రాష్ట్రంలో  ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఏకైక విపక్షంగా క్షేత్రస్థాయిలో చేపట్టే ఆందోళనలకు మద్దతు లభించాలంటే.. ఇండియా కూటమి అండ అవసరమన్న భావనలో జగన్ ఉన్నారని అంటున్నారు.    [Jagan Join INDIA Alliance, 2029 AP Elections, YCP political strategy, AP politicalnews, AP Politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది.  రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు  కీలక నేతగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీ ప్రకటన అధికారికంగా చేశారు.  రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సరళికి పూర్తి భిన్నంగా, పూర్తిగా ప్రజా పక్షం వహించే సరికొత్త ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడమే లక్ష్యంగా తన కొత్త పార్టీ ఉంటుందన్నారాయన. సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి  ప్రస్తుత రాజకీయ పార్టీలవి కేవలం ఎన్నికల రాజకీయాలే తప్ప, వాటిలో సామాన్యుల నిజమైన సమస్యలను పట్టించుకునే తత్వం కరువైందని  విమర్శించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ధోరణులు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమన్నారు. సమాజంలోని నిరుపేదలు, సామాన్యులు, కర్షకులు,  యువత ఎదుర్కొంటున్న సమస్యలకు అసెంబ్లీ,  పార్లమెంటు వేదికగా గొంతుక వినిపించేందుకు ఒక బలమైన శక్తి అవసరమని, అందుకే తాను తన  నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని విజయసాయి వివరించారు.   ఈ కొత్త రాజకీయ వేదిక విశేషాలు, పార్టీకి సంబంధించిన పూర్తి విధివిధానాల  ప్రకటన త్వరలోనే దశలవారీగా వెల్లడిస్తామన్న విజయసాయి..  కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పరిపాలనా విధానాన్ని అందించేందుకు తన రాజకీయ పార్టీ పనిచేస్తుందని   స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, ప్రజా సమస్యలపై సమగ్రమైన కార్యాచరణను రూపొందించనున్నట్లు విజయసాయి చెప్పారు. తన కొత్త పార్టీ సీఎం అభ్యర్థిని తాను కాదని ఈ సందర్భంగా చెప్పిన విజయసాయి..  సంకేతాలు ఇచ్చారు. గతంలో తాను తీసుకున్న రాజకీయ విరామ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్నట్లు చెప్పారు.    [Vijayasai Reddy Announce new party, AP politics, YCP, TDP, Andhra Pradesh politics,  Vijayasai Reddy announcement, Teluguone]
ALSO ON TELUGUONE N E W S
Kangana Ranaut has entered the ongoing controversy surrounding Trisha Krishnan and the remarks that dragged the actress into a political fight in Tamil Nadu. Without directly naming Trisha, Kangana questioned why women are so often made the target when rumours or alleged relationships involve two people. Speaking to reporters in Kullu, the actor-turned-politician pointed to the recent Tamil Nadu controversy and said that while a relationship involves both parties, abuse and character assassination are disproportionately directed at the woman.  She argued that this pattern is not restricted to India and is often used against successful women, actors, politicians and those in positions of power. The controversy gained momentum after DMK leader Udhayanidhi Stalin made a remark at a Cauvery protest that was widely interpreted as a double entendre involving Trisha.  Udhayanidhi later maintained that he had not named the actress, while the comment triggered political and public backlash. A case was registered against him following the controversy. The issue has also been addressed by Tamil Nadu Chief Minister Vijay, who recently warned against personal attacks and derogatory comments targeting women during a speech in the Assembly. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  'గిర గిర గింగిరాగిరే' అంటూ అనస్వర రాజన్ ఏమంటు తెలుగు తెరపై చిందులేసిందో గాని, ఇప్పుడు వరుసపెట్టి పలు ఆఫర్స్ తన చుట్టూ గిర గిర తిరుగుతున్నాయి. ఈ కోవలోనే  మెగాస్టార్ చిరంజీవి, బాబీ ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్  'కాకా' (Kaaka) లో చిరు డాటర్ గా ఆఫర్ దక్కించుకొని తెలుగు ప్రేక్షకుల డైలీ చిట్ చాట్ లో ఉంది. ఈ రోజు అనస్వర రాజన్  పుట్టిన రోజు. ఈ సందర్భంగా 'కాకా' మేకర్స్ బర్త్ డే విషెస్ చెప్తూ    ' హార్ట్ ఆఫ్ కాకా, అమ్ములు పాప అనే క్యాప్షన్ తో కూడిన అనస్వర లుక్ రిలీజ్ చేసారు. సదరు లుక్ తో అనస్వర మెడిసిన్ చదువుతున్న ఏంబిబిఎస్ స్టూడెంట్ అని అర్ధం అవుతుంది. అలాగే తన ఫేస్ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే  మనసులో ఎలాంటి కల్మషం లేని అమాయకత్వపు మోముతో ఉంది. బ్యాక్ గ్రౌండ్ లో చిరు షాడో కనపడుతూ ఉంది దీంతో అభిమానులతో పాటు నెటిజెన్స్ ఎవరకి తోచిన విధంగా వారు కథని అల్లుకునే బిజీలో ఉన్నారు.   Also Read: విశ్వనాథ్ అండ్ సన్స్ ఓటిటి డేట్ ఇదే: కాకపోతే తెలుగు ఫ్యాన్స్ కి మాత్రం....!        పోస్టర్ రిలీజైన కాసేపటికే  సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్స్  ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికలపై రికార్డ్స్ సాధించే పనిలో కాకా టీం ఉంది. అనస్వర స్వస్థలం కేరళలోని కరివెల్లూరు.     [Anaswara Rajan, Chiranjeevi, Kaaka, Look Release, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
స్వచ్ఛమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కి  ఎక్స్ పైరీ డేట్ ఉండదనే ధైర్యాన్ని ఇచ్చిన చిత్రం 'విశ్వనాథ్ అండ్ సన్స్'. థియేటర్ ముఖం చూసి చాలా రోజులు దాటిపోయిన వాళ్ళని సైతం థియేటర్స్ కి రప్పించిందంటే  'విశ్వనాధ్ అండ్ సన్స్' సృష్టించిన సునామిని అర్ధం చేసుకోవచ్చు. 25 రోజుల్లోనే సాధించిన  250 కోట్ల రూపాయలే సునామి యొక్క సజీవ సాక్ష్యం.  ఇప్పుడు ఈ మూవీ  ఓటీటీలో తన అల్లరి హంగామా వినిపించడానికి స్ట్రీమింగ్ డేట్‌ సిద్ధం చేసుకుంది.ఈ నెల 11 నుండి ఈ సూపర్ హిట్ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ మరియు మలయాళ భాషల్లో ఏకకాలంలో స్ట్రీమింగ్ కానుండటం విశేషం. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం తమ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ, "అథ్లెట్, బిలియనీర్, ఫిలాంత్రపిస్ట్ మరియు ఒక అనురాగగల తండ్రి అయిన సంజయ్ విశ్వనాథ్ క్యారక్టర్ ని  కలిసేందుకు సిద్ధంగా ఉండండి" అంటూ పోస్టర్  విడుదల చేసింది. దీంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. Also Read: Ramayana: పార్ట్ 1 లో యష్ స్క్రీన్ టైమ్ ఇంతేనా: రావణుడిగా విశ్వరూపం తప్పదా!           వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ నిర్మించగా ఆగస్టు 14న థియేటర్స్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.      [vishwanath And Sons, Suriya, Mamitha Bhaiju,Venky Atluri,  Ott date, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
బ్లాక్ బస్టర్ 'బేబీ' జోడీ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’. '90s' వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్న యువ దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ‘ఎపిక్’ చిత్రం సెప్టెంబర్ 11, 2026న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య, పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన మీరు, ఒక తెలుగమ్మాయిగా స్టార్‌డమ్ చూడటం ఎలా ఉంది? - చాలా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రుల సపోర్ట్ తో పాటు సినీ పరిశ్రమ, ప్రేక్షకుల మద్దతుతోనే ఇక్కడివరకు వచ్చాను. పలువురు తెలుగమ్మాయిలు సినీ పరిశ్రమలో వారి వారి ప్రత్యేకతను చాటుతున్నారు. అందులో నేను కూడా ఉండటం ఆనందంగా ఉంది. ఎపిక్ సినిమాలో ఆనంద్, మీరు పోషించిన పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? - ఆనంద్ పోషించిన ఆదిత్య పాత్ర సాఫ్ట్ గా, కామ్ గా ఉంటుంది. జీవితంలో ఎదురైన అనుభవాల నుంచి ఆదిత్య ఏం నేర్చుకున్నాడనేది ఆసక్తికరంగా ఉంటుంది. నేను పోషించిన కడలి పాత్ర స్ట్రాంగ్ అమ్మాయి. తన కోసం తాను నిలబడే అమ్మాయి. క్లారిటీ ఉన్న అమ్మాయి.  'తన కోసం తాను నిలబడే అమ్మాయి' అంటున్నారు. కడలి పాత్ర మీ నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందా? - ప్రతి ఒక్కరిలోనూ కడలి పాత్ర ఉంటుంది. కానీ, కుటుంబం వల్లనో, సమాజం వల్లనో మనలోని ఆ వెర్షన్ లోపలే ఉండిపోతుంది. బయటకు రాదు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదోక సమయంలో వారి కోసం వారు నిలబడాలి. అందుకే కడలి పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది. బేబీ తర్వాత కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? - కథలోనూ, నా పాత్రలోనూ కొత్తదనం ఉండాలి. ఆ పాత్రలో నన్ను నేను చూసుకోగలగాలి. ఎపిక్ ఎంచుకోవడానికి కారణమదే.  దర్శకుడు ఆదిత్య హాసన్ గురించి? - దర్శకుడు ఆదిత్యతో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. ఆయన జీవితాన్ని చాలా లోతుగా గమనిస్తుంటారు. జీవితంలో ఉన్న ప్రతి చిన్న విషయాన్ని గమనిస్తూ, అందులో ఉన్న ప్రాముఖ్యత గురించి మాట్లాడుతుంటారు. ఎపిక్ సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. ఆదిత్య, కడలి పాత్రల మధ్య జరిగే చిన్న విషయాలకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూపిస్తారు. ఆదిత్య యూనిక్ డైరెక్టర్. నాకు బాగా ఇష్టమైన దర్శకులలో ఆయన ఒకరు. - దర్శకుడు ఆదిత్యతో నాకు ముందు పరిచయం లేదు. ఎపిక్ కథ చెప్పడానికి వచ్చినప్పుడే మొదటిసారి కలిశాను. కానీ, అప్పటికే 90s వెబ్ సిరీస్ చూసి ఉన్నాను. ఆ సిరీస్ నాకు ఎంతగానో నచ్చింది. బేబీ తర్వాత మీరు, ఆనంద్ గారు కలిసి నటించిన సినిమా కాదా.. ఏమైనా ఒత్తిడి ఉందా? - బేబీ, ఎపిక్ సినిమాలు దేనికవే ప్రత్యేకమైనవి. ఒత్తిడి లేదు కానీ, ఛాలెంజింగ్ గా తీసుకొని ఎపిక్ సినిమా చేశాము. ఈ సినిమాలో మమ్మల్ని చూస్తున్నప్పుడు బేబీ గుర్తుకు రాకపోతే మేము విజయం సాధించినట్టే. ఎపిక్ ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకం మాకు మొదటి నుంచి ఉంది. నిర్మాత నాగవంశీ గారి గురించి? - సితార బ్యానర్ లో సినిమా చేయడం సంతోషంగా ఉంది. నాగవంశీ గారు అందరికీ ఫ్రీడమ్ ఇస్తారు. ఖర్చు విషయంలో రాజీపడరు. సినిమా అవుట్ పుట్ బాగా రావాలని మాత్రమే ఆలోచిస్తారు.  'అల వైకుంఠపురములో' సినిమాలో చెల్లి పాత్ర చేసిన మీరు, ఇప్పుడు అదే బ్యానర్ లో హీరోయిన్ గా నటించడం ఎలా ఉంది? - ప్రతి ఒక్కరూ జీవితంలో పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకోవచ్చు అనే ఆశను నాకు కలిగించింది. పెద్ద గోల్స్ పెట్టుకొని, వాటిని రీచ్ అవ్వొచ్చనే నమ్మకాన్ని కలిగించింది. నా జీవితంలో ఇలా జరగడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఎపిక్ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటి? - మనం ఎన్నో లవ్ స్టోరీలు చూసుంటాం. కానీ, ప్రతి లవ్ స్టోరీలోనూ ఏదోక ప్రత్యేకత ఉంటుంది. ఎపిక్ లో కూడా ఆ ప్రత్యేకత ఉంది. భిన్న దారులు, భిన్న మనస్తత్వాలు ఉన్న ఇద్దరు యూకేకి చదువుకోవడానికి వెళ్లి, అక్కడ కలుస్తారు. లివ్ ఇన్ లో ఉంటారు. ఆ ఇద్దరు ప్రైవేట్ గా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉంటాయో, ఆ సంభాషణల మీద నడిచే సినిమా. అమ్మాయి జీవితాన్ని ఒకలా చూస్తుంది. అబ్బాయి ఒకలా చూస్తాడు. అసలు వీరిద్దరూ ఎలా కలిశారు? వీరిద్దరి ఆలోచనలు ఏంటి? అనేది కొత్తదనాన్ని తీసుకొస్తుంది. ఈ సినిమాలో హంగామా ఉండదు. హత్తుకునేలా ఉంటుంది. ఎపిక్ నుంచి మీరేం నేర్చుకున్నారు? - నేను ఏదైనా విషయం బయట మాట్లాడాలంటే కాస్త భయపడుతుంటాను. కడలి పాత్ర ద్వారా నేనొక విషయం నేర్చుకున్నాను. ముందు మనల్ని మనం నమ్మాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి.  - అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉన్న సినిమాలు ఇప్పటికే చాలా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే.. ఒక సముద్రం లాంటి అమ్మాయి, తన జీవితంలో ఉన్న సమస్యను డీల్ చేస్తూ.. తన జీవితాన్ని ఎలా ముందుకు నడిపించింది అనేది ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది. ఎపిక్ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ రావొచ్చా? - ఖచ్చితంగా రావొచ్చు. ఈ సినిమాలో లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి మాట్లాడతాం కాబట్టి, 90s వెబ్ సిరీస్ అంత క్లీన్ ఎంటర్టైనర్ లా ఉండకపోవచ్చు. కానీ, దర్శకుడు ఆదిత్య ఈ సినిమాకి ఏది అవసరమో అది చూపిస్తూనే, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు చూపించాలో అంతవరకు చూపించారు. ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమా చూడొచ్చు. తదుపరి చిత్రాలు? - సితార బ్యానర్ లో నితిన్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళ్ లో రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను.       [EPIC First Semester, Epic Movie, Vaishnavi Chaitanya, Anand Deverakonda, Aditya Hasan, Telugu Film News, Telugu News]  
ఎంత బడా కట్ అవుట్ అయినా కంటెంట్ లేకపోతే బొమ్మ నడవడదనే నగ్న సత్యం రీసెంట్ గా 'టాక్సిక్' తో మరోసారి యష్ తో పాటు అందరికి అర్ధమయ్యింది. అందుకే 'కంటెంట్ ఈజ్ ఫస్ట్ కింగ్' అంటారు. అయితే  యష్ ఈ దీపావళికి నవంబర్ 6 న  'మైథలాజికల్ విజువల్ వండర్' ‘రామాయణ’ పార్ట్ 1 తోసెల్యులాయిడ్ పై ప్రత్యక్షం కానున్నాడు.  ఈ సారి  లంకాధిపతి రావణుడిగా రావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.  రామాయణ స్టార్ట్ అయినప్పటి నుంచి యశ్ రోల్  నిడివిపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోను పలు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పార్ట్ 1 లో యశ్ కేవలం 15 నిమిషాల కేమియోగా కనిపిస్తాడని, పార్ట్-2లోనే పూర్తి స్థాయిలో సందడి చేస్తాడనే రూమర్స్ జోరుగా వినిపించాయి.  అయితే తాజాగా సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న  సమాచారం ప్రకారం పార్ట్-1'లోనే  యశ్ ఏకంగా  గంట కంటే ఎక్కువ సమయం సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలోనే రావణాసురుడి పాత్రకు సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలు, లంకేశ్వరుడి పరిచయం మరియు అతడి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే ఘట్టాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి.      Also Read: ధురంధర్ రేంజ్ లో ఆ సౌత్ స్టార్ హీరో మూవీ: మరి ధురంధర్ రికార్డ్స్ గల్లంతేనా! కేవలం చివరి నిమిషాల్లో వచ్చే ఒక చిన్న రోల్  కాకుండా, కథనానికి బలమైన పునాది వేసే విధంగా దర్శకుడు రావణుడి క్యారక్టర్ ని గంటకి  పైగా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని సమాచారం.   కథ ప్రధానంగా శ్రీరాముడి అయోధ్య ప్రయాణం, అరణ్యవాసం మరియు సీతాపహరణం చుట్టూ తిరుగుతుంది. అయితే రావణాసురుడి ఘనతను, అతని శక్తులను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి దాదాపు 60 నిమిషాలకు పైగా నిడివి కేటాయించడం యశ్ అభిమానులకు నిజంగా ఒక గొప్ప శుభవార్తే. యశ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తుండటం తెలిసిందే. కనివిని ఎరుగని  భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణలో శ్రీరాముడిగా  రణబీర్ కపూర్,సీతమ్మ వారుగా సాయి పల్లవి కూడా మెస్మరైజ్ చేయనున్నారు. నితేష్ తివారీ దర్శకుడు కాగా నమిత్ మల్హోత్రా నిర్మాత.      [ Yash, Ramayana Part 1, Ravanasurudu, Ravana Screen Time, Ranabir kapoor, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
ఈ వారం థియేటర్లలో సరికొత్త సినిమాల జాతర మొదలుకాబోతోంది. పలు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి దూసుకొస్తున్నాయి. క్రైమ్ థ్రిల్లర్, స్పై యాక్షన్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్, మైథలాజికల్ థ్రిల్లర్.. ఇలా విభిన్న జానర్ సినిమాలు ఈ వారం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాయి.  తమిళ్ హీరో కార్తీ 'సర్దార్ 2'తో మళ్లీ రచ్చ చేయడానికి సిద్ధమైపోయారు. పి.ఎస్. మిత్రన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మోస్ట్ ఎవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 10న మన ముందుకు వస్తోంది. మొదటి పార్ట్ 'సర్దార్' ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇక ఈ సీక్వెల్ లో యాక్షన్ విజువల్స్, హై-వోల్టేజ్ ట్విస్టులు మైండ్ బ్లోయింగ్ గా ఉండబోతున్నాయి. స్పై థ్రిల్లర్స్ ప్రేమికులకు ఈ సినిమా ఒక పర్ఫెక్ట్ ఐ ఫీస్ట్ కానుంది. టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ విలన్ గా నటించిన తమిళ్ మూవీ 'మండాడి', మాస్ మహారాజా రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ భూపతీరాజు డెబ్యూ రూరల్ యాక్షన్ మూవీ 'మారెమ్మ' సెప్టెంబర్ 10న సందడి చేయనున్నాయి.  యూత్ ని అలరించడానికి 'బేబీ' కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్'. '90s' ఫేమ్ ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేసిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 11న విడుదలవుతోంది. లండన్ లో చదువుకోవడానికి వెళ్లిన ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి లైఫ్, అక్కడ చిగురించిన లవ్, ఆ తర్వాత వచ్చే బ్రేకప్ ఎమోషన్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. బేబీ లాగే ఈ సినిమా కూడా కుర్రకారుని మెస్మరైజ్ చేస్తుందని మూవీ టీమ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సుమంత్ డిఫరెంట్ అటెంప్ట్ గా వస్తున్న డివైన్ మిస్టరీ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' సెప్టెంబర్ 11న వస్తుండగా, పంజాబీ కామెడీ ప్రియుల కోసం 'సింగ్ వర్సెస్ కౌర్ 2' కూడా రేసులో ఉంది. బాలీవుడ్ ని కుదిపేయడానికి వస్తున్న బిగ్ మూవీ 'హైవాన్'. సుమారు 18 ఏళ్ల తర్వాత అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ప్రియదర్శన్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ ఒక బ్లైండ్ మార్షల్ ఆర్టిస్ట్ గా నటిస్తుంటే.. అక్షయ్ కుమార్ మోస్ట్ డేంజరస్ అండ్ రూర్లెస్ సైకో కిల్లర్ గా కనిపించబోతున్నారు. ఒక చిన్న పాపని కాపాడటానికి ఒక కంటి చూపు లేని యోధుడు, ఆ సైకోతో ఎలాంటి పోరాటం చేశాడు అనేదే ఈ మూవీ మెయిన్ పాయింట్.  ఇక సర్వైవల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారి కోసం హాలీవుడ్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సీక్వెల్ 'ఫాల్ 2: డెడ్ పాయింట్'. 2022లో వచ్చిన 'ఫాల్' సినిమా థియేటర్లలో మనల్ని ఏ రేంజ్ లో భయపెట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు దానికి కంటిన్యుయేషన్ గా వస్తున్న ఈ సీక్వెల్ సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తోంది. థాయ్‌లాండ్‌ లోని నిటారుగా ఉండే ఒక ప్రాణాంతకమైన పర్వతంపై చిక్కుకున్న ఇద్దరు యువతులు.. బతకడానికి చేసే ఊపిరిసలపని సర్వైవల్ ఫైట్ ఈ సినిమా. డిఫరెంట్ జోనర్స్ తో ఈ వారం థియేటర్లు కలర్‌ఫుల్ గా కళకళలాడబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలి.       [This Week Releases, Epic First Semester, Sardar 2 Movie, Mahendragiri Varahi, Maremma Movie, Mandaadi Movie, Telugu Film News, Telugu News]  
The first look of Anaswara Rajan from Chiranjeevi and Bobby Kolli’s Kaaka has added an interesting layer to the film’s promotions. Unveiled on the occasion of the actress’s birthday, the poster introduces her as Ammulu, a medical student, in a remarkably simple setting. Anaswara is seen in a traditional Punjabi-style outfit, carrying what appears to be medical books. However, the real attention-grabber is her shadow, which transforms into the silhouette of Chiranjeevi. The visual immediately suggests that Ammulu’s character has a strong connection with the Megastar’s character in the story. The makers have described Ammulu as a beautiful presence who makes his world more special, but the poster deliberately leaves the nature of their relationship open. That mystery could be an important part of the film’s emotional track, particularly given Bobby Kolli’s attempt to balance Chiranjeevi’s action-heavy character with humour and sentiment. Kaaka marks Chiranjeevi’s second collaboration with Bobby Kolli after Waltair Veerayya. The film features Chiranjeevi in the role of Satyam, a fishery owner with a violent past, with the promotional material hinting at different phases of his character. With S Thaman handling the music, Kaaka is currently progressing with its shoot and is targeting a January 13 release. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
    ధురంధర్ సిరీస్ సాధించిన విజయం, సృష్టించిన కలెక్షన్ తుఫాన్ తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ కి పట్టిన దిష్టి మొత్తాన్ని తీసేసింది. ఎందుకంటే దిష్టి ఏదో పెట్టినట్టుగా బాలీవుడ్ కి సరైన హిట్ వచ్చి చాలా దినాలు అవుతుంది. దీంతో బయటి ప్రేక్షకులతో పాటు సొంత ప్రేక్షకుల్లోనే నవ్వులు పాలయ్యే పరిస్థితి. వాటన్నిటికీ చెక్ పెట్టేసి ధురంధర్ సిరీస్ బాలీవుడ్ ని కాలర్ ఎగరేసేలా చేసింది. వరల్డ్ వైడ్  ఉన్న ధురంధర్ అభిమానులైతే  మూడో పార్టు కూడా కావాలని ధర్నా చేసే పరిస్థితి. దీన్ని బట్టి ధురంధర్ చరిష్మా అర్ధం చేసుకోవచ్చు.  ఇప్పుడు ఈ సినిమాని మరిపించేలా శింబు మూవీ ముస్తాబవుతుందనే మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో వినపడుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో శింబు (శిలంబరసన్ TR), ప్రతిభావంతుడైన దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'అరసన్'. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై తమిళ చిత్రసీమలోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల చెన్నైలోని సత్యభామ కాలేజీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శింబు మాట్లాడుతు ;బాలీవుడ్‌లో రణ్‌వీర్ సింగ్ నటించిన 'దురంధర్' చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతటి ఘనవిజయాన్ని సాధించి హిందీ పరిశ్రమ గర్వపడేలా చేసిందో, అదే తరహా సంచలనాత్మక ప్రభావాన్ని తమ 'అరసన్' చిత్రం తమిళ సినీ పరిశ్రమకు తీసుకొస్తుంది. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గర్వపడతారు. 'అరసన్' ఏమాత్రం చిన్న సినిమా కాదు. కథా పరిధి చాలా విస్తృతమైనది . హీరో తన చిన్నతనం నుంచి వృద్ధాప్యం వరకు జరిగే సుదీర్ఘ జీవిత ప్రయాణాన్ని  ఆవిష్కరిస్తుంది. ఈ క్యారక్టర్  కోసం  6 భిన్నమైన గెటప్పులలో కనిపించబోతున్నాను. ఇప్పటివరకు 3 గెటప్పులకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన 3 గెటప్పుల షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది.క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్‌ను వేగంగా ముగించకుండా సమయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. మన్మధ మూవీతో తెలుగులో కూడా శింబుకి రెండు దశాబ్దాల నుంచే అభిమానులు ఉన్న విషయం తెలిసిందే.     Also Read: వీడియో లీక్: జయం రవి, కేనిషా కలిసి ఒకరికొకరు... క్లియర్ గా అర్ధమవుతుంది! ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే.. ఇది వెట్రిమారన్ తీసిన సూపర్‌హిట్ చిత్రం 'వడ చెన్నై' సినిమా విశ్వంలోకి (Vada Chennai Universe) వస్తుంది. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక కీలకమైన పాత్రలో నటిస్తుండగా, ఆండ్రియా జెర్మియా, సముద్రఖని, కిషోర్, అమీర్ వంటి ప్రముఖ నటులు తమ పాత్రలను పునరావృతం చేస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కలైప్పులి ఎస్ ధాను నిర్మిస్తున్నారు. అద్భుతమైన టెక్నికల్ టీమ్ మరియు బలమైన కథాంశంతో వస్తున్న 'అరసన్' ఖచ్చితంగా భారతీయ సినిమాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.        [Simbu, Arasan, Dhurandhar Impact, vetri Maaran, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన 'ధ్రువ' మూవీ, తమిళ్ లో జయం రవి చేసిన మూవీ అనే విషయం తెలిసిందే. దీన్ని బట్టి జయం రవి సినిమాల పట్ల ఉండే క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.  గత కొన్ని నెలలుగా జయం రవి  వ్యక్తిగత జీవితం వరుస వివాదాలకి  వేదికగా మారుతోంది. భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు రవి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి, సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక కొత్త రగడ వెలుగులోకి వస్తూనే ఉంది. రవి, ఆయన భార్య ఆర్తి మధ్య విడాకుల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉండగానే, తాజాగా నెట్టింటిలో  ప్రత్యక్షమైన ఒక వీడియో ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలో తీవ్ర కలకలం రేపుతోంది.   లీక్ అయిన  వీడియో క్లిప్‌లో జయం రవి, గాయని కేనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. అంతేకాదు, వారిద్దరూ ఒకే సిగరెట్‌ను పరస్పరం షేర్ చేసుకుంటూ సంభాషిస్తున్నట్లు ఆ దృశ్యాల్లో వ్యక్తమవుతోంది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారి, పలు చర్చలకి దారి తీస్తుంది. కేనిషా గురించి గతంలో జయం రవి మాట్లాడుతు 'కేనీషా నాకు మంచి స్నేహితురాలు మా  మధ్య ఎలాంటి వివాహేతర సంబంధం లేదు. అంతేకాకుండా, ఆర్తి చేసిన అనవసర ఆరోపణల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన కేనిషా, తన నుంచి 100% దూరంగా వెళ్ళిపోయిందని చెప్పాడు. అయితే, తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న క్లిప్పింగ్స్ వెలుగులోకి రావడంతో, గతంలో ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధమేనా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.        also read: మూడు కోట్లు కట్టాల్సిందేనా: ఆ రోజు ఫ్లైట్ లో ఏం జరిగింది? లీక్ అయిన వీడియోలో ఏముంది! అయితే, ఈ వైరల్ క్లిప్ వెనుక వేరే కోణాలు కూడా ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. నెటిజన్లలో ఒక వర్గం ఇది ఆధునిక ఏఐ (Artificial Intelligence) సాంకేతికత లేదా డీప్‌ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ వీడియో అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ఇది పాత వీడియోనా లేక ఈ మధ్య కాలంలో చిత్రీకరించబడిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏఐ దెబ్బకి 'ఎవరు ఒరిజినల్,ఎవరు డూప్లికేట్టొ తెలియక జుట్టు పీక్కొనే రోజులు వచ్చేసాయి. బహుశా వందల ఏళ్ళ క్రితం పెద్దలు ఇది ఊహించే 'పెరుగుట విరుగుట కొరకే' అనే సామెతని లూప్ లైన్ లోకి తెచ్చి ఉంటారు.      [Jayam Ravi, Kenishaa Francis, Video Viral, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి 'టెంపర్' లో 'ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ,  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి 'బాహుబలి'లో 'మనోహర' అంటూ ఆడిపాడిన భామ 'నోరా ఫతేహి'. బాలీవుడ్ లో అయితే ఈ అమ్మడి ట్రాక్ రికార్డుకి చాలా విశిష్టత ఉంది. చిందేసిందంటే చాలు బాక్స్ ఆఫీస్ అదనపు వసూళ్లతో తడిసి ముద్దవ్వాల్సిందే.    జనరల్ గా  తన గ్లామరస్ డ్యాన్స్ మూమెంట్స్, సోషల్ మీడియా వీడియోలతో నిత్యం వార్తల్లో నిలిచే నోరా, ఇప్పుడు ఒక ప్రైవేట్ విమాన ప్రయాణం సందర్భంగా చేసిన వ్యాఖ్యల వల్ల ఏకంగా 3 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి. ఈ వివాదం వెనుక ఉన్న అసలు వివరాల్లోకి వెళితే, గత ఏడాది డిసెంబర్‌లో నోరా ఫతేహి ముంబై నుంచి జైపూర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో 'డ్యూన్స్ ఏవియేషన్' సంస్థకి  చెందిన 'సెస్నా సైటేషన్ సీజే2 '(Cessna Citation CJ2) చార్టర్డ్ విమానంలో ప్రయాణించారు. ఆ ప్రయాణంలో విమానం లోపలి దృశ్యాలని వీడియోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోల్లో సదరు చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి "ఇది చాలా చిన్నగా ఉంది", "ఒక బొమ్మ విమానంలా (Toy Plane)", "లెగో ఎయిర్‌ప్లేన్ (Lego Airplane)" అంటూ  కామెంట్స్ చేసింది. నోరా చేసిన ఈ వ్యాఖ్యలపై డ్యూన్స్ ఏవియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టుని  ఆశ్రయించింది. తమ విమానం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనలకు కట్టుబడి, చెల్లుబాటు అయ్యే నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్‌తో చట్టబద్ధంగా నడుస్తోందని సంస్థ స్పష్టం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం లేకుండా, వాస్తవాలను ధృవీకరించుకోకుండా నోరా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. నోరా వ్యాఖ్యల వల్ల తమ సంస్థ గుడ్‌విల్ దెబ్బతినడమే కాకుండా, కస్టమర్లలో నమ్మకం తగ్గి తమ వ్యాపార బుకింగ్స్ ఏకంగా 15 శాతం నుండి 20 శాతం వరకు పడిపోయాయని, పలు బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది.      ఈ ఆర్థిక నష్టానికి మరియు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నందుకు గానూ నోరా ఫతేహి నుంచి  3 కోట్ల పరిహారాన్ని డ్యూన్స్ ఏవియేషన్ డిమాండ్ చేస్తోంది. దాంతో పాటు సోషల్ మీడియాలో ఉన్న వీడియోలని తక్షణమే తొలగించి, బహిరంగంగా వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పాలని కోరింది. గాంధీనగర్ సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అగర్వాల్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, సెప్టెంబర్ 25న తదుపరి విచారణను చేపడుతుండటంతో నోరాకు ఇప్పటికే కోర్టు నోటీసులు పంపినట్లు సమాచారం. సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక విమానయాన సంస్థ ప్రతిష్ట దెబ్బతీసి, చివరకి కోర్టు మెట్లు ఎక్కించేంత పెద్ద వివాదంగా మారుతాయని, మూడు కోట్ల పరువు నష్టం దాకా వెళ్తుందని   బహుశా ఆమె కూడా ఊహించి ఉండరు. అందుకే అంటారు అవసరం లేకుండా  అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదని, అలా ప్రదర్శిస్తే టంగ్ కంట్రోల్ లో ఉండే అవకాశం మాగ్జిమమ్ మన చేతుల్లో ఉండదని.     [Nora Fatehi, Defamation Case, 3 Crore, Cessna Citation CJ2, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం అనేది చాలా గొప్ప బంధానికి దారి తీస్తుంది.  జీవితాంతం ఒకరికి ఒగరుగా ఉండటం కోసం వివాహం చేసుకుంటారు.  కానీ  కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భార్యాభర్తలు విడిపోవాల్సి వస్తుంది.  చట్టబద్దంగా విడాకులు తీసుకుని విడిపోతుంటారు.  విడాకులు పొందిన తర్వాత జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం, మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన నిర్ణయం. గత అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, ఏర్పడిన మానసిక పరిపక్వత ఈ కొత్త ప్రయాణానికి పునాదిగా నిలుస్తాయి. అయితే కొందరు తొందరపడి పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటారు.  కానీ ఇలా చేసే తొందరపాటు పని రెండవ వివాహం తర్వాత కూడా జీవితాన్ని విచ్చిన్నం చేస్తుంది.  రెండవ సారి వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు కొన్ని విషయాలు ఆలోచించడం,   కీలకమైన జాగ్రత్తలు పాటించడం , కొన్ని విషయాలలో ముందే స్పష్టత తెచ్చుకోవడం చాలా ముఖ్యం.  దీని వల్ల భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగుతుంది. మళ్లీ పెళ్లి చేసుకునే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు , ఏ ఏ విషయాల్లో స్పష్టత అవసరమో తెలుసుకుంటే.. గతం నుండి బయటపడటం.. విడాకుల తర్వాత మరో పెళ్లికి సిద్ధపడే ముందు, పాత బంధం కలిగించిన బాధలు, కోపాలు, అసంతృప్తుల నుంచి పూర్తిగా కోలుకోవాలి. మానసిక ప్రశాంతత లభించినప్పుడే కొత్త వ్యక్తికి మన జీవితంలో సరైన స్థానం ఇవ్వగలుగుతాం. పాత గాయాలు మానకుండా ఇంకొకరితో ప్రయాణం మొదలుపెడితే, చిన్న చిన్న విషయాలకే పాత జ్ఞాపకాలు గుర్తుకువచ్చి కొత్త బంధంలో అపార్థాలకు దారితీస్తాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దని గ్రహించడం.. ఒంటరితనాన్ని జయించడానికో లేదా సమాజం ఏమనుకుంటుందో అనే భయంతోనో మరో పెళ్లి చేసుకోకూడదు.  జీవితంలో నిజంగా ఒక తోడు కావాలని, కొత్త జీవితాన్ని పంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని అనిపించినప్పుడు మాత్రమే ముందడుగు వేయాలి. సమయం తీసుకుని ఆలోచించడం ఎంతైనా మంచిది. స్వయం పరిశీలన చేసుకోవడం.. గత బంధంలో లోపాలు ఎక్కడ జరిగాయి, మీ వైపు నుంచి ఏవైనా పొరపాట్లు ఉన్నాయా అనే అంశాలపై నిజాయితీగా ఆలోచించుకోవాలి. గత తప్పులను గుర్తించడం వల్ల వాటిని రాబోయే కొత్త బంధంలో మళ్లీ చేయకుండా జాగ్రత్తపడవచ్చు. కొత్త భాగస్వామి విషయంలో ఉండాల్సిన స్పష్టత..  పారదర్శకత , నిజాయితీ.. గత విడాకులకు సంబంధించిన పూర్తి వివరాలను కొత్త భాగస్వామికి స్పష్టంగా చెప్పాలి. ఏ విషయాలనూ దాచకూడదు. చట్టపరంగా విడాకుల ప్రక్రియ పూర్తి అయిందో లేదో తెలియజేయడం చాలా ముఖ్యం.  గత జీవితం గురించి  ఎంత స్పష్టంగా ఉంటే, కొత్త బంధంలో నమ్మకం అంత త్వరగా బలపడుతుంది. ఆర్థిక విషయాలపై స్పష్టత.. ఆర్థిక సమస్యలు చాలా సంబంధాలలో విభేదాలకు కారణమవుతాయి. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, అప్పులు, సంపాదన, అలాగే గత భాగస్వామికి ఇస్తున్న లేదా పొందుతున్న భరణం వంటి విషయాలను కొత్త భాగస్వామితో వివరంగా చర్చించాలి. ఇద్దరి ఆర్థిక బాధ్యతలను ఎలా పంచుకుంటారో ముందే ఒక అవగాహనకు రావడం మంచిది. పిల్లల బాధ్యతలు , పెంపకం.. ఒకవేళ మొదటి పెళ్లి ద్వారా పిల్లలు ఉంటే, వారి విషయంలో పూర్తి స్పష్టత ఉండాలి. పిల్లల పెంపకం, వారి చదువు, కస్టడీ హక్కులు,  సమయం కేటాయించడం వంటి విషయాలపై కొత్త భాగస్వామి అభిప్రాయాన్ని తెలుసుకోవాలి. కొత్త భాగస్వామి మీ పిల్లలను ఎలా స్వీకరిస్తారు, వారి పట్ల వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చాలా కీలకం. అలాగే, రాబోయే రోజుల్లో కొత్తగా పిల్లలను కనాలా వద్దా అనే అంశంపై కూడా ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి. వ్యక్తిగత హద్దులు, ఆశించడాలు.. ప్రతి ఒక్కరికీ కొన్ని వ్యక్తిగత ప్రాధాన్యతలు, సరిహద్దులు ఉంటాయి. కెరీర్, కుటుంబ సభ్యులతో సంబంధాలు, లైఫ్ స్టైల్, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి విషయాలలో పరస్పరం ఏమేమి ఆశిస్తున్నారో స్పష్టంగా మాట్లాడుకోవాలి. మీ ఆలోచనలు, వారి ఆశయాలు సరిపోలుతున్నాయో లేదో గమనించాలి. సహనం ,  ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్.. మళ్లీ పెళ్లి చేసుకున్న కొత్తలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. చిన్న చిన్న విషయాలకు పాత భాగస్వామితో కొత్త వారిని పోల్చడం తప్పు. ప్రతి వ్యక్తి భిన్నమైన ఆలోచనలు కలిగి ఉంటారని గుర్తుంచుకోవాలి. సమస్యలు వచ్చినప్పుడు దాచకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం వల్ల బంధం మరింత బలపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.. విడాకులు జీవితానికి ముగింపు కాదు, అది ఒక కొత్త ఆలోచనకు, మార్పుకు ఆరంభం. ఆచితూచి అడుగులు వేస్తూ, పూర్తి మానసిక పరిపక్వతతో, స్పష్టమైన ఆలోచనలతో ముందడుగు వేస్తే రెండో పెళ్లి జీవితం మరింత సంతోషకరంగా, అర్ధవంతంగా మారుతుంది.                                     *రూపశ్రీ.  
  నేటి ఆధునిక కాలంలో యుక్తవయస్సు లేదా కౌమారదశ (Adolescence) లోకి అడుగుపెడుతున్న టీనేజర్ల మానసిక ఆరోగ్యం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకరమైన విషయంగా మారింది. అయితే, మానసిక సమస్యలు లేదా ప్రవర్తనా వైపరీత్యాలు కేవలం ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికో లేదా ఆర్థిక స్థాయికో పరిమితం కాలేదని, విభిన్న సామాజిక ఆర్థిక నేపథ్యాల (Socioeconomic Backgrounds) నుంచి వచ్చే టీనేజర్లలో ఇవి అత్యంత సాధారణంగా కనిపిస్తున్నాయని ఒక నూతన విస్తృత అధ్యయనం సంచలన నిజాలను బయటపెట్టింది. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి సామాజిక వర్గంలోని కౌమారదశ పిల్లలు తమ వయస్సుకు తగిన మానసిక ఒత్తిళ్లు, ఆందోళన (Anxiety), డిప్రెషన్ (Depression) మరియు ఇతర ప్రవర్తనా రుగ్మతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా తక్కువ సామాజిక ఆర్థిక స్థాయి లేదా పేదరికంలో పెరిగే పిల్లలు ఆర్థిక ఇబ్బందులు, సరైన వనరులు లేకపోవడం మరియు కుటుంబ ఒత్తిళ్ల వల్ల ఎక్కువ మానసిక సమస్యలకు గురవుతారని సమాజంలో బలమైన నమ్మకం ఉండేది. కానీ, తాజా పరిశోధనల ప్రకారం ఉన్నత సామాజిక ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన టీనేజర్లు సైతం సమాన స్థాయిలో లేదా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని స్పష్టమైంది. పేదరికంలో ఉన్న పిల్లలకు వనరుల కొరత మరియు భద్రతా లేమి ప్రధాన సమస్యలుగా మారితే, ఉన్నత వర్గాల పిల్లలకు తల్లిదండ్రుల నుండి వచ్చే విపరీతమైన విద్యా ప్రతిభ ఒత్తిడి (Academic Pressure), సామాజిక గుర్తింపు పోటీ మరియు విలాసవంతమైన జీవనశైలి తెచ్చిపెట్టే ఒంటరితనం మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయి. టీనేజర్లలో కనిపించే ఈ మానసిక సమస్యలకు కేవలం ఆర్థిక అంశాలే కాకుండా, డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వాడకం, కుటుంబ సంబంధాలలో క్షీణత, నాణ్యమైన నిద్ర లేకపోవడం మరియు తోటివారి ఒత్తిడి (Peer Pressure) ప్రధాన హేతువులుగా మారుతున్నాయి. నిరంతరం స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గడపడం వల్ల ప్రతీ సామాజిక వర్గానికి చెందిన టీనేజర్లు తమ జీవితాలను ఇతరులతో పోల్చుకుంటూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇది వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచి, డిప్రెషన్ మరియు మానసిక రుగ్మతలకు బీజం వేస్తోంది. అంతేకాకుండా, బడి మరియు కళాశాల వాతావరణంలో పోటీ తత్వాన్ని తట్టుకోలేకపోవడం కూడా వీరి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ భయానక పరిస్థితి నుంచి కౌమారదశ పిల్లలను కాపాడుకోవడానికి సమాజం మరియు తల్లిదండ్రులు తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని మానసిక వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పిల్లల ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా, వారు చెప్పే మాటలను వినడం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు వారి ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గమనించడం అత్యంత ముఖ్యం. పాఠశాలల్లో నాణ్యమైన కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయులకు టీనేజర్ల మానసిక ఆరోగ్య సం సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వడం ద్వారా మానసిక రుగ్మతలను ప్రారంభంలోనే నివారించవచ్చు. ప్రతి ఇంట్లోనూ సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు డిజిటల్ డిటాక్స్ అలవాటు చేయడం వల్ల టీనేజర్లు మానసికంగా దృఢంగా తయారవుతారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.         Adolescent mental health study facts, causes of teen depression and anxiety.
  సిగరెట్ లేదా బీడీ కాల్చడం వల్ల కలిగే అనర్థాల గురించి నిరంతరం వింటూనే ఉంటాం. అయితే, మీరు పొగతాగకపోయినా సరే, పక్కన ఎవరైనా పొగ తాగుతుంటే ఆ పొగను పీల్చడం (Passive Smoking , Second hand Smoke) అంతకంటే తీవ్రమైన ప్రాణాంతక ముప్పుగా మారుతోందని ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య పత్రిక  లాన్సెట్  (The Lancet) ప్రచురించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. 1990 సంవత్సరం నుండి ఇప్పటివరకు భారతదేశంలో పరోక్ష ధూమపానం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిపోవడం ఆరోగ్య నిపుణులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ధూమపానం చేసేవారు విడుదల చేసే విషపూరితమైన పొగను తెలియకుండానే పీల్చడం వల్ల ఎందరో అమాయకులు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులు అకాల మరణాల బారిన పడుతుండటం కలవరపెడుతోంది. తాజా గణాంకాల ప్రకారం, ఒక్క 2023 సంవత్సరంలోనే భారతదేశంలో పరోక్ష పొగతాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య సమస్యలతో ఏకంగా 3,25,600 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, భారతదేశంలో ఇదే సంవత్సరంలో సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల 9.28 మిలియన్ల డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ (DALYs) నష్టం వాటిల్లింది. అంటే అనారోగ్యం, వైకల్యం లేదా అకాల మరణం కారణంగా ప్రజలు తమ జీవితంలో ఇన్ని మిలియన్ల ఆరోగ్యకరమైన సంవత్సరాలను కోల్పోయారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 2023 నాటికి ఏకంగా 2.71 బిలియన్ల మంది ప్రజలు పరోక్ష ధూమపానానికి గురవుతున్నారు. దీని ఫలితంగా ప్రపంచ స్థాయిలో ఏడాదికి 1.66 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతుండగా, 44.8 మిలియన్ల డాలీస్ నష్టం జరుగుతోంది. అంతర్జాతీయంగా చూస్తే చైనా, భారతదేశం మరియు ఇండోనేషియా దేశాల్లోనే అత్యధికంగా ప్రపంచ పరోక్ష ధూమపాన బాధితుల్లో సగం మంది ఉన్నారు. చైనాలో అత్యధికంగా 664 మిలియన్ల మంది ప్రజలు ఈ ప్రమాదకర పొగకు గురవుతుండడం గమనార్హం. పరోక్షంగా పీల్చే పొగ శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల ప్రధానంగా ఇస్కీమిక్ గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), రొమ్ము క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా మరియు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయని లాన్సెట్ అధ్యయనం తేల్చింది. ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులు తాగే పొగను పీల్చడం వల్ల చిన్న పిల్లల ఊపిరితిత్తుల ఎదుగుదల దెబ్బతిని, వారిలో తీవ్రమైన నిమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. మహిళలు కూడా ఈ పొగ బారిన పడి తీవ్ర గుండె సంబంధిత మరియు క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ భయానక పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి ప్రజల్లో తీవ్రమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొగతాగే అలవాటు ఉన్నవారు తమ ఇల్లు, ఆఫీస్ మరియు బహిరంగ ప్రదేశాల్లో కాకుండా కేవలం నిర్దేశించిన ఓపెన్ ఎయిర్ ప్రాంగణాల్లో మాత్రమే స్మోకింగ్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు ఉన్న ఇళ్లల్లో పొగతాగడం పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వాలు కూడా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు, పరోక్ష ధూమపానం తెచ్చే ముప్పుపై చైతన్యాన్ని విస్తృతంగా తీసుకెళ్లినప్పుడే లక్షలాది అమాయకుల ప్రాణాలను కాపాడుకోగలమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.       How secondhand smoke affects women and children, Lancet report on passive smoking deaths in India.
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారడమే కాకుండా నీరసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా దీని ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్ లేదా ఇతర మందులు వాడుతుంటారు, కానీ ఇవి ప్రతిసారీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఔషధాల ప్రమేయం లేకుండా, ఇంట్లోనే  రెండు  ప్రభావవంతమైన పద్ధతుల ద్వారా కొన్ని నిమిషాల్లోనే కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. వైద్యులు రికమెండ్ చేస్తున్న ఈ చిట్కాలు ఏమిటో తెలుసుకుంటే.. హెర్బల్ స్టీమ్.. సాధారణ నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాసనాళాలు కాసేపు రిలాక్స్ అవుతాయి కానీ.. గట్టిగా ఉన్న కఫం కరగదు. నీటిలో కొన్ని రకాల సహజ మూలికలను చేర్చి ఆవిరి పట్టినప్పుడు, ఆ ఆవిరి ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి కఫాన్ని సులభంగా కరిగిస్తుంది. కావాల్సిన పదార్థాలు.. పుదీనా ఆకులు.. 10 నుండి 12 తులసి ఆకులు..  10 నుండి 12 హిమాలయన్ పింక్ సాల్ట్..  1 టీస్పూన్ తురిమిన అల్లం..  అర అంగుళం నీరు.. ఆవిరి రావడానికి సరిపడా ఇందులోని పదార్థాల ప్రత్యేకత..  పుదీనాలో ఉండే మెంతోల్ శ్వాసనాళాలను తెరిచి కఫాన్ని పలుచన చేస్తుంది.  తులసిలోని యాంటీమైక్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను నశింపజేసి, వాపును తగ్గిస్తాయి.  హిమాలయన్ ఉప్పు కఫాన్ని కరిగించడానికి తోడ్పడతుంది.   అల్లం గొంతు మంటను తగ్గించి శ్వాసకోశాల్లోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తయారీ , ఉపయోగించే విధానం.. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. స్టవ్ ఆపివేసిన తర్వాత, ఆ వేడి నీటిలో పుదీనా, తులసి ఆకులు, హిమాలయన్ సాల్ట్ , తురిమిన అల్లం వేయాలి. వెంటనే పాత్రపై ఒక టవల్ మూసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఆ మూలికలలోని ఆరోమాటిక్ ఆయిల్స్ నీటిలోకి విడుదలవుతాయి. ఆ తర్వాత పాత్ర మూత తీసి, ముఖాన్ని   తగినంత దూరంలో ఉంచి, తలను టవల్‌తో లేదా దుప్పటితో  కప్పుకోవాలి. ముక్కు , నోటి ద్వారా లోతుగా శ్వాస తీసుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చాలి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫం త్వరగా కరిగిపోతుంది. డీప్ ఎక్స్‌పాన్షన్ బ్రీతింగ్ వ్యాయామం.. ఆవిరి పద్ధతితో పాటు డీప్  ఎక్స్‌పాన్షన్ ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని కలిపి చేసినప్పుడు ఫలితం మరింత వేగంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల లోపలి భాగాల్లో చిక్కుకున్న కఫాన్ని పైకి నెట్టి, సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది. చేసే విధానం.. మొదట ఒక కుర్చీలో నిటారుగా, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాసను ఎంత వీలైతే అంత లోతుగా లోపలికి తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత, దానిని 3 నుండి 4 సెకన్ల పాటు ఊపిరితిత్తుల్లోనే పట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి, నాళాలకు అతుక్కుపోయిన కఫం వదులవుతుంది. తరువాత పెదవులను కొవ్వొత్తిని ఊదుతున్నట్లుగా చిన్నగా చేసి, నోటి ద్వారా గాలిని బలంగా బయటకు వదలాలి. ఈ పద్ధతిని వరుసగా 5 నుండి 7 సార్లు పునరావృతం చేయాలి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. ముగింపు.. జలుబు, దగ్గు లేదా మొండి కఫంతో బాధపడుతున్నప్పుడు ఈ రెండు సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే ఊపిరితిత్తులు శుభ్రపడి, హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.                           *రూపశ్రీ.    
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అలాంటి వారికి శొంఠి పొడి (ఎండు అల్లం పొడి) ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదంలో చెబుతారు. అయితే శొంఠిని సరైన మోతాదులో, సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా అల్లంతో పోలిస్తే ఎండు అల్లం లేదా శొంఠికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు శొంఠి ఎలా సహాయపడుతుంది? మజ్జిగలో పావు టీస్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? పిల్లల నుంచి పెద్దల వరకు శొంఠిని ఎలా ఉపయోగించాలి? ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది? ఈ విషయాలపై ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. శొంఠి పొడి వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకునే సరైన విధానం, మోతాదు వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు శొంఠిని ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా ఇంటి చిట్కా లేదా ఆయుర్వేద పదార్థాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)