LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆయనను మరింత ఏకాకిగా మార్చేలా ఉన్నాయి.  సోమవారం (సెప్టెంబర్ 7) ఆయన ఆర్భాటంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కొత్త పార్టీ ప్రకటన చేశారు. అయితే పార్టీ పేరు, జెండా, అజెండాలను రివీల్ చేయలేదు. అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.   విజయకొత్త పార్టీ ప్రకటన చేసి కూడా పార్టీ పేరు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటన్న ప్రశ్న రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.  ఇక ఆయన అనుసరిస్తున్న విధానాలు, పార్టీ లక్ష్యాలపై ఆయనలోనే అయోమయం, గందరగోళం ఉందని ఆయన మీడియా ముఖంగా మాట్లాడిన మాటలను బట్టి అవగతమౌతున్నది. పార్టీ  స్థాపిస్తారట కానీ, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదంటున్నారు విజయసాయిరెడ్డి.  అసలు రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన వంటి పార్టీలు క్రియాశీలంగా ఉన్న సమయంలో  విజయసాయిరెడ్డి పార్టీ ఏర్పాటు చేసి.. తాను కాదు మరో నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతాను.. తాను వెనుకుండి సలహాలూ, సూచనలూ ఇస్తాననడం ఆయనలోని గందరగోళానికి  అద్దంపడుతున్నట్లుగా ఉంది. సీఎం అభ్యర్థి స్థాయి నాయకుడు   పార్టీలోకి వచ్చి తన  నాయకత్వంలో పని చేసేంత సీన్ విజయసాయిరెడ్డికి ఉందా అన్న అనుమానాలు రాజకీయపరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  రాష్ట్ర రాజకీయాల్లో   బలంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, వైసీపీలను కాదని మరీ.. బలమైన నేత ఎవరైనా.. విజయసాయి నాయకత్వంలో పని చేయడానికి ముందుకు వస్తారా అంటే అనుమానమే అంటున్నారు పరిశీలకులు.  ఆయన మాటలను బట్టి చూస్తే.. ప్రజాదరణ, క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్న బలమైన నేతను ముందు పెట్టి తాను వెనకుండి చక్రం తిప్పాలన్నది విజయసాయి ఆలోచనగా కనిపిస్తోంది.   తనను తాను శివసేన వ్యవస్థాపకుడు  బాల్ థాక్రే తో పోల్చుకోవడం కూడా విస్తుగొలుపుతోంది. బాల్ థాకరే మహారాష్ట్రలో హిందుత్వ ఐకాన్, అలాగే.. మరాఠా సెంటిమెంట్ ఆయనకు అప్పట్లో పెద్ద బలంగా నిలిచింది. కానీ ఇక్కడ అంటే ఏపీలో అటువంటి పరిస్థితి లేదు. అన్నిటికీ మించి జగన్ అక్రమాస్తుల కేసు సహా పలు కేసులలోఆయన నిందితుడిగా ఉన్నారు. ఆ కేసులు ముందు ముందు విజయసాయి పొలిటికల్ జర్నీకి అడ్డంకులుగా మారే అవకాశాలనూ కొట్టిపారేయలేము.  ఈ విషయాలన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని ఆలోచిస్తే.. ఇంకా నామకరణం కూడా జరగని విజయసాయి కొత్త పార్టీ ప్రయాణం నల్లేరు మీద బండి నడకగా మారే అవకాశం ఇసుమంతైనా కనిపించడం లేదు.   [Vijayasai Reddy Bal Thackeray  Strategy, New Political Party, AP Politics, YCP, Telugudesham, Janasena, Ap Politics, Telugu One]
తెలుగుదేశం, వైసీపీలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తున్నాయి. తన కొత్త పార్టీ ప్రకటన కోసం విజయవాడలో సోమవారం (సెప్టెంబర్ 7) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగుదేశం, వైసీపీలకు ప్రజాసమస్యల పరిష్కారం పట్ల ఇసుమంతైనా శ్రద్ధ, చిత్తశుద్ధి లేదన్నారు. తాను కొత్త పార్టీ ప్రారంభించడం ఖాయమని ఈ సందర్భంగా విస్పష్టంగా చెప్పిన విజయసాయి.. తన పార్టీ జెండా, అజెండా ప్రకటించడానికి ముందు వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్న ఉద్దేశంతోనే మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ, జనసేనలు ఒకే తానులోని గుడ్డలేనన్నారు.  ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటికి పట్టవని విమర్శించారు.   ప్రస్తుతం ఏపీ రాజకీయం మొత్తం తెలుగుదేశం, వైసీపీల చుట్టూనే తిరుగుతోందని విమర్శించిన విజయసాయి, ఆరెండు పార్టీలూ కూడా కుటుంబ, ఫ్యాక్షన్ పార్టీలేననీ,వాటివి స్వార్థపూరిత అజెండాలనీ అన్నారు.  ప్రజాధనాన్ని ఏ స్థాయిలో దోచుకోగలం, ఎలా దోచుకోగలం అన్న విషయంలో  ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయన్న విజయసాయి,  రాష్ట్రంలోపోలీసు వ్యవస్థ సహా అన్ని వ్యవస్థలూ ఆ పార్టీల ధోరణికి మద్దతు ఇస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు గోరంత, మాకు కొండంత అన్నది ఆ పార్టీల విధానమని విమర్శించారు.  ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు నిజమైన న్యాయం జరగాలంటే, ఈ సంప్రదాయ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా మరో ప్రత్యామ్నాయ వేదిక రావలసిన సమయం ఆసన్నమైందని, తన పార్టీ ఆ పాత్ర తీసుకుంటుందని చెప్పారు.   [Vijayasai Reddy Say  YSRCP And YCP Same, TDP YCp faction parties, third alternative, AP politics, Telugu One]
వైసీపీ ఇండియా కూటమిలో చేరబోతోందా? 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే.. కాంగ్రెస్ అండ వినా గత్యంతరం లేదని భావిస్తోందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. 2029 ఎన్నికలలో రాష్ట్రంలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా జగన్ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తున్నారని వైసీపీ వర్గాలూ చెబుతుతున్నాయి.  అందులో భాగంగానే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్..   జాతీయ స్థాయిలో కీలకంగా మారిన  ఇండియా కూటమితో   జతకట్టాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  గత ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను బేరీజు వేసుకుంటూ, రాబోయే కాలంలో అనుసరించాల్సిన విధానాలపై అయన విస్తృతంగా చర్చిస్తున్నట్లు చెబుతున్నారు.  మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా జగన్ ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను పదును పెడుతున్న జగన్.. ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు.  ఇండియా కూటమితో భాగం కావడం వల్ల కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ స్థాయిలో ఎన్డీయేయేతర పార్టీలతో సయోధ్య ఏర్పడుతుందనీ, తద్వారా రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తన గళం వినిపించే అవకాశం లభిస్తుందని జగన్ యోచిస్తున్నట్లు సమాచారం.    గత ప్రభుత్వ హయాంలో కేంద్రంతో  సయోధ్యతో వ్యవహరించిన జగన్.. 2024 ఎన్నికలలో పరాజయం తరువాత.. బీజేపీతో ఎంతగా కలిసి సాగాలన్నా ఆ పార్టీకి తెలుగుదేశం పార్టీతో ఉన్న చెలిమి కారణంగా వీలు కావడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చూపు ఇండియా కూటమి వైపు మళ్లిందని పరిశీలకులు చెబుతున్నారు. జగన్ ఇండియా కూటమిలో చేరినట్లైతే రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ సహయ సహకారాలు అందుతాయనీ, అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ ఆందోళనలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   రాష్ట్రంలో  ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఏకైక విపక్షంగా క్షేత్రస్థాయిలో చేపట్టే ఆందోళనలకు మద్దతు లభించాలంటే.. ఇండియా కూటమి అండ అవసరమన్న భావనలో జగన్ ఉన్నారని అంటున్నారు.    [Jagan Join INDIA Alliance, 2029 AP Elections, YCP political strategy, AP politicalnews, AP Politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది.  రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు  కీలక నేతగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి నూతన రాజకీయ పార్టీ ప్రకటన అధికారికంగా చేశారు.  రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ సరళికి పూర్తి భిన్నంగా, పూర్తిగా ప్రజా పక్షం వహించే సరికొత్త ప్రత్యామ్నాయ వేదికను తీసుకురావడమే లక్ష్యంగా తన కొత్త పార్టీ ఉంటుందన్నారాయన. సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడిన విజయసాయి  ప్రస్తుత రాజకీయ పార్టీలవి కేవలం ఎన్నికల రాజకీయాలే తప్ప, వాటిలో సామాన్యుల నిజమైన సమస్యలను పట్టించుకునే తత్వం కరువైందని  విమర్శించారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ధోరణులు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసింది శూన్యమన్నారు. సమాజంలోని నిరుపేదలు, సామాన్యులు, కర్షకులు,  యువత ఎదుర్కొంటున్న సమస్యలకు అసెంబ్లీ,  పార్లమెంటు వేదికగా గొంతుక వినిపించేందుకు ఒక బలమైన శక్తి అవసరమని, అందుకే తాను తన  నూతన రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని విజయసాయి వివరించారు.   ఈ కొత్త రాజకీయ వేదిక విశేషాలు, పార్టీకి సంబంధించిన పూర్తి విధివిధానాల  ప్రకటన త్వరలోనే దశలవారీగా వెల్లడిస్తామన్న విజయసాయి..  కేవలం ఎన్నికల్లో పోటీ చేయడం కోసమే కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పరిపాలనా విధానాన్ని అందించేందుకు తన రాజకీయ పార్టీ పనిచేస్తుందని   స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సేకరించి, ప్రజా సమస్యలపై సమగ్రమైన కార్యాచరణను రూపొందించనున్నట్లు విజయసాయి చెప్పారు. తన కొత్త పార్టీ సీఎం అభ్యర్థిని తాను కాదని ఈ సందర్భంగా చెప్పిన విజయసాయి..  సంకేతాలు ఇచ్చారు. గతంలో తాను తీసుకున్న రాజకీయ విరామ నిర్ణయాన్ని పక్కన పెట్టి, ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి పునరాగమనం చేస్తున్నట్లు చెప్పారు.    [Vijayasai Reddy Announce new party, AP politics, YCP, TDP, Andhra Pradesh politics,  Vijayasai Reddy announcement, Teluguone]
తమిళనాడు రాజకీయాల్లో మహిళలపై జరుగుతున్న అసభ్య,  ద్వంద్వార్థ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ సీరియస్ గా స్పందించారు. అసెంబ్లీ వేదికగా ‘ఆమె’పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.  అసెంబ్లీలో పోలీసు శాఖ బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా మాట్లాడిన విజయ్..  మహిళలను కించపరిచేలా మాట్లాడే వారిని  ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.   రాజకీయ విమర్శలు ఎంత తీవ్రంగానైనా ఉండవచ్చని..  కానీ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం క్షమించరాని నేరమన్నారు. ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా  మహిళలను లక్ష్యంగా చేసుకుని డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్య  పదజాలం వాడటం  ప్రజలు అంతా గమనిస్తున్నారన్న విజయ్..  అటువంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కాగా అసెంబ్లీ వేదికగా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందుకు కారణం డిఎంకె అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ గత నెలలో జరిగిన  కావేరి నిరసనల సమయంలో   నటి,  త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కారణమని పరిశీలకలు అంటున్నారు.  త్రిషపై ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలపై గత  4న చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, తంజావూరుకు తరలించి విచారించిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాత ఆయన స్టేషన్ బెైల్‌పై విడుదలయ్యారనుకోండి అది వేరే సంగతి. ఈ నేపథ్యంలోనే  సీఎం విజయ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై నేరుగా అసెంబ్లీలో   ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.  రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు సంయమనం పాటించాలని, రాజకీయ హద్దులు దాటి మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడే ధోరణి ఇకపై చెల్లదని ఆయన అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు.  [CM Vijay Mass Warning On Untoward Comments women, Trisha remarks row, Udhayanidhi Stalin, Tamil Nadu Assembly, Vijay on women safety, double meaning comments]
ALSO ON TELUGUONE N E W S
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబోలో వచ్చిన 'ధ్రువ' మూవీ, తమిళ్ లో జయం రవి చేసిన మూవీ అనే విషయం తెలిసిందే. దీన్ని బట్టి జయం రవి సినిమాల పట్ల ఉండే క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.  గత కొన్ని నెలలుగా జయం రవి  వ్యక్తిగత జీవితం వరుస వివాదాలకి  వేదికగా మారుతోంది. భార్య ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు రవి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి, సోషల్ మీడియా వేదికగా నిత్యం ఏదో ఒక కొత్త రగడ వెలుగులోకి వస్తూనే ఉంది. రవి, ఆయన భార్య ఆర్తి మధ్య విడాకుల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉండగానే, తాజాగా నెట్టింటిలో  ప్రత్యక్షమైన ఒక వీడియో ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రసీమలో తీవ్ర కలకలం రేపుతోంది.   లీక్ అయిన  వీడియో క్లిప్‌లో జయం రవి, గాయని కేనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి చాలా సన్నిహితంగా కనిపిస్తున్నారు. అంతేకాదు, వారిద్దరూ ఒకే సిగరెట్‌ను పరస్పరం షేర్ చేసుకుంటూ సంభాషిస్తున్నట్లు ఆ దృశ్యాల్లో వ్యక్తమవుతోంది. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారి, పలు చర్చలకి దారి తీస్తుంది. కేనిషా గురించి గతంలో జయం రవి మాట్లాడుతు 'కేనీషా నాకు మంచి స్నేహితురాలు మా  మధ్య ఎలాంటి వివాహేతర సంబంధం లేదు. అంతేకాకుండా, ఆర్తి చేసిన అనవసర ఆరోపణల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన కేనిషా, తన నుంచి 100% దూరంగా వెళ్ళిపోయిందని చెప్పాడు. అయితే, తాజాగా వీరిద్దరూ కలిసి ఉన్న క్లిప్పింగ్స్ వెలుగులోకి రావడంతో, గతంలో ఆయన చెప్పిన మాటలన్నీ అబద్ధమేనా అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.        also read: మూడు కోట్లు కట్టాల్సిందేనా: ఆ రోజు ఫ్లైట్ లో ఏం జరిగింది? లీక్ అయిన వీడియోలో ఏముంది! అయితే, ఈ వైరల్ క్లిప్ వెనుక వేరే కోణాలు కూడా ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. నెటిజన్లలో ఒక వర్గం ఇది ఆధునిక ఏఐ (Artificial Intelligence) సాంకేతికత లేదా డీప్‌ఫేక్ టెక్నాలజీతో రూపొందించిన ఫేక్ వీడియో అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ఇది పాత వీడియోనా లేక ఈ మధ్య కాలంలో చిత్రీకరించబడిందా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఏఐ దెబ్బకి 'ఎవరు ఒరిజినల్,ఎవరు డూప్లికేట్టొ తెలియక జుట్టు పీక్కొనే రోజులు వచ్చేసాయి. బహుశా వందల ఏళ్ళ క్రితం పెద్దలు ఇది ఊహించే 'పెరుగుట విరుగుట కొరకే' అనే సామెతని లూప్ లైన్ లోకి తెచ్చి ఉంటారు.      [Jayam Ravi, Kenishaa Francis, Video Viral, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]
    మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కలిసి 'టెంపర్' లో 'ఇట్టాగే రెచ్చిపోదాం అంటూ,  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి 'బాహుబలి'లో 'మనోహర' అంటూ ఆడిపాడిన భామ 'నోరా ఫతేహి'. బాలీవుడ్ లో అయితే ఈ అమ్మడి ట్రాక్ రికార్డుకి చాలా విశిష్టత ఉంది. చిందేసిందంటే చాలు బాక్స్ ఆఫీస్ అదనపు వసూళ్లతో తడిసి ముద్దవ్వాల్సిందే.    జనరల్ గా  తన గ్లామరస్ డ్యాన్స్ మూమెంట్స్, సోషల్ మీడియా వీడియోలతో నిత్యం వార్తల్లో నిలిచే నోరా, ఇప్పుడు ఒక ప్రైవేట్ విమాన ప్రయాణం సందర్భంగా చేసిన వ్యాఖ్యల వల్ల ఏకంగా 3 కోట్ల పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి. ఈ వివాదం వెనుక ఉన్న అసలు వివరాల్లోకి వెళితే, గత ఏడాది డిసెంబర్‌లో నోరా ఫతేహి ముంబై నుంచి జైపూర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో 'డ్యూన్స్ ఏవియేషన్' సంస్థకి  చెందిన 'సెస్నా సైటేషన్ సీజే2 '(Cessna Citation CJ2) చార్టర్డ్ విమానంలో ప్రయాణించారు. ఆ ప్రయాణంలో విమానం లోపలి దృశ్యాలని వీడియోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియోల్లో సదరు చార్టర్డ్ విమానాన్ని ఉద్దేశించి "ఇది చాలా చిన్నగా ఉంది", "ఒక బొమ్మ విమానంలా (Toy Plane)", "లెగో ఎయిర్‌ప్లేన్ (Lego Airplane)" అంటూ  కామెంట్స్ చేసింది. నోరా చేసిన ఈ వ్యాఖ్యలపై డ్యూన్స్ ఏవియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్‌లోని గాంధీనగర్ కోర్టుని  ఆశ్రయించింది. తమ విమానం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనలకు కట్టుబడి, చెల్లుబాటు అయ్యే నాన్-షెడ్యూల్డ్ ఆపరేటర్స్ పర్మిట్‌తో చట్టబద్ధంగా నడుస్తోందని సంస్థ స్పష్టం చేసింది. సాంకేతిక పరిజ్ఞానం లేకుండా, వాస్తవాలను ధృవీకరించుకోకుండా నోరా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని కంపెనీ తన పిటిషన్‌లో పేర్కొంది. నోరా వ్యాఖ్యల వల్ల తమ సంస్థ గుడ్‌విల్ దెబ్బతినడమే కాకుండా, కస్టమర్లలో నమ్మకం తగ్గి తమ వ్యాపార బుకింగ్స్ ఏకంగా 15 శాతం నుండి 20 శాతం వరకు పడిపోయాయని, పలు బుకింగ్స్ క్యాన్సిల్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేసింది.      ఈ ఆర్థిక నష్టానికి మరియు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నందుకు గానూ నోరా ఫతేహి నుంచి  3 కోట్ల పరిహారాన్ని డ్యూన్స్ ఏవియేషన్ డిమాండ్ చేస్తోంది. దాంతో పాటు సోషల్ మీడియాలో ఉన్న వీడియోలని తక్షణమే తొలగించి, బహిరంగంగా వివరణ ఇస్తూ క్షమాపణ చెప్పాలని కోరింది. గాంధీనగర్ సీనియర్ సివిల్ జడ్జి ఆర్. అగర్వాల్ ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించి, సెప్టెంబర్ 25న తదుపరి విచారణను చేపడుతుండటంతో నోరాకు ఇప్పటికే కోర్టు నోటీసులు పంపినట్లు సమాచారం. సరదాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఒక విమానయాన సంస్థ ప్రతిష్ట దెబ్బతీసి, చివరకి కోర్టు మెట్లు ఎక్కించేంత పెద్ద వివాదంగా మారుతాయని, మూడు కోట్ల పరువు నష్టం దాకా వెళ్తుందని   బహుశా ఆమె కూడా ఊహించి ఉండరు. అందుకే అంటారు అవసరం లేకుండా  అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదని, అలా ప్రదర్శిస్తే టంగ్ కంట్రోల్ లో ఉండే అవకాశం మాగ్జిమమ్ మన చేతుల్లో ఉండదని.     [Nora Fatehi, Defamation Case, 3 Crore, Cessna Citation CJ2, TeluguCinema, TeluguCinema News, Tollywood, Tollywood News]  
హీరో కార్తి తమిళం, తెలుగు భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయిన ‘సర్దార్’ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ‘సర్దార్ 2’తో థియేటర్లలోకి వస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను హాజరయ్యారు.  ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో కార్తి మాట్లాడుతూ.. "సర్దార్ సినిమాకు ఇక్కడ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ‘సర్దార్ 2’ నా కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇలాంటి స్పై క్యారెక్టర్ దొరకడం నా అదృష్టం. నిజానికి గూఢచారులకు ఎలాంటి గుర్తింపు ఉండదు. కానీ వాళ్ల పని వాళ్లు చాలా నిజాయితీతో,  ఏదీ ఆశించకుండా చేస్తారు. ‘సర్దార్ 2’ చూసే ముందు ‘సర్దార్’ సినిమా మరొకసారి చూడమని కోరుతున్నాను. అది యూట్యూబ్‌లో ఫ్రీగా ఉంది. అలా ఆ సినిమా చూస్తే మీరు ‘సర్దార్ 2’కి  ఇంకా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అవుతారు. ఇంగ్లీష్ సినిమాలు చూస్తున్నప్పుడు ఇంత స్టైలిష్‌గా యాక్షన్ సినిమాలు చేయడం మనకు కుదరదా అని అనిపించేది. అది ఈ సినిమాతో తీరింది. మిత్రన్ గారు అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. మ్యూజిక్, యాక్షన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఇలాంటి పెద్ద సినిమాలు తీయడం అంత ఈజీ కాదు. మా నిర్మాతలకు థాంక్యూ. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న నాగార్జున గారికి, సుప్రియ గారికి, అన్నపూర్ణ స్టూడియోస్‌కి ధన్యవాదాలు. ఆషికా, మాళవిక సినిమాలో మంచి పాత్రలు చేశారు. ఈ సినిమాలో డాన్స్ లేదు.. యాక్షన్ ఉంటుంది. గర్ల్ పవర్ చూడబోతున్నారు. SJ సూర్య గారిని మీరు వేరే రకంగా ఇందులో చూస్తారు. అందరూ ఎంజాయ్ చేసే విలన్‌గా చేశారు. షామ్ సీఎస్‌కి ఇది వందో సినిమా. ‘ఖైదీ’ తర్వాత తను అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఎప్పుడూ కూడా మీరు తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారని అడుగుతుంటారు. ‘హిట్ 4’ సినిమా వస్తుంది. అంతకుముందు కళ్యాణ్ శంకర్‌తో సినిమా కూడా వస్తుంది. ఆ సినిమా చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తున్నాను." అన్నారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. "నా ఫేవరెట్ సినిమాల్లో కార్తీ గారివే ఎక్కువ. ఆవారా, ఖైదీ, ‘సత్యం సుందరం’ ఈ సినిమాలన్నీ ఇష్టం. అలాగే నాకు ‘సర్దార్’ సినిమా కూడా చాలా ఇష్టం. స్పై సినిమాల్లో మాస్ మసాలా ఫిలిం ‘సర్దార్’. ఈ సినిమాని నేను థియేటర్‌లో చాలా ఎంజాయ్ చేశాను. సర్దార్ 2 ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాను. మాళవిక, ఆశికా రంగనాథన్, టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్." అన్నారు. ఎస్.జె. సూర్య మాట్లాడుతూ.. "సర్దార్ ఆల్రెడీ చాలా పెద్ద హిట్ అయిన సినిమా. ఆ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ‘సర్దార్ 2’ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. కంటెంట్, యాక్షన్ చాలా కొత్తగా ఉంటుంది. డైరెక్టర్ మిత్రన్ గారు అద్భుతమైన కథతో సినిమాని ఎక్స్‌ట్రార్డినరీగా తీశారు. డైరెక్టర్ గారు ఫ్యూచర్‌కి ఏం కావాలో అనే ఒక విషయాన్ని చెప్తున్నారు. ఈ సినిమాని మీరు గుండెల్లో పెట్టుకోవాలి. ఆలోచించాలి. కార్తీ గారు మంచి కథలకు ఎప్పుడూ ఆమోదం తెలుపుతారు. ఆయన సినిమాలన్నీ కూడా చాలా ప్రత్యేకంగా, డిఫరెంట్‌గా ఉంటాయి. కార్తీ గారు ఒక ఏజెంట్‌గా ఫెంటాస్టిక్‌గా పెర్ఫామ్ చేశారు. ఇందులో రెండు గెటప్స్ ఉన్నాయి. చాలా సిన్సియర్‌గా చేశారు. ఆయన ఈ సినిమా మీద పెట్టిన ప్రేమ కోసం మీరందరూ సెప్టెంబర్ 10న సినిమా చూసి చాలా పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను." అన్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "తెలుగు  సినిమా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి సినిమా సక్సెస్ సాధిస్తోంది. పరిశ్రమ కళకళలాడుతోంది. ఇలాంటి సమయంలో ‘సర్దార్ 2’ సినిమా వస్తోంది. ఈ సినిమా కూడా ఇదే దోవలో అద్భుతమైన సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘సర్దార్’ ప్రేక్షకులందరికీ నచ్చిన సినిమా. కార్తీ గారు, సూర్య గారు డిఫరెంట్ సబ్జెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే వాళ్లిద్దరూ చాలా మంచి మనసున్న మనుషులు. వాళ్లిద్దరూ చాలా పాజిటివ్‌గా ఉంటారు. అందుకే ప్రేక్షకులు కూడా ఇంత పాజిటివ్‌గా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మిగతా సినిమాలన్నీ కూడా మంచి సినిమాలు అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు పరిశ్రమ సక్సెస్ రేట్ ఇలాగే ముందుకు వెళ్లాలి. కార్తీ గారితో ప్రత్యేకమైన పరిచయం ఉంది. ఆయన ఎలాంటి మనిషో నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ సినిమా మొదటి రోజు చూడాలని నేను ఎదురు చూస్తున్నాను. మళ్లీ సక్సెస్ మీట్‌లో కలుద్దాం." అన్నారు. హీరోయిన్ మాళవిక మోహన్ మాట్లాడుతూ: సర్దార్ చాలా స్పెషల్ ఫిలిం. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశారు. . కార్తీక్ గారు ఇన్‌స్పైరింగ్ కోస్టార్. చాలా జెంటిల్‌మ్యాన్. సూర్య గారు కూల్ విలన్. చాలా మంచి యాక్షన్, యాక్షన్ డ్రామా ఉన్న సినిమా ఇది. అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. "సర్దార్ 2 నాకు చాలా స్పెషల్ సినిమా. నేను చేస్తున్న ఫస్ట్ యాక్షన్ జానర్. అలాగే కార్తీక్ గారితో చేస్తున్న తొలి సినిమా. సర్దార్ చాలా ఇంపాక్ట్ చేసింది. దానికంటే ఈ సినిమా డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్ గారితో నటించడం చాలా మంచి ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా మీ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది." అన్నారు. నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. "సర్దార్ పెద్ద హిట్. సర్దార్ 2 కూడా సినిమా స్థాయికి తగ్గకుండా ఉంటుంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. కార్తీక్ గారు పాన్ సౌత్ స్టార్. ఆయన సినిమాలు అందరికీ ఇష్టం. సర్దార్ 2 కచ్చితంగా బ్లాక్‌బస్టర్ అవుతుంది. ఆ సినిమాతో పాటు వచ్చిన మిగతా సినిమాలన్నీ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను." అన్నారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ మాట్లాడుతూ.. "సర్దార్ సినిమా తెలుగులో చాలా పెద్ద హిట్. ఆ సినిమాకి మేమందరం చాలా పెద్ద ఫ్యాన్స్. ఈ సినిమా తెలుగు వెర్షన్ చూశాను. సర్దార్ ఎంట్రీ అదిరిపోతుంది. ఎస్జే సూర్య గారి హ్యాండ్ చాలా మంచిది. ఒకరిని సీఎం చేశారు, మరొకరిని డిప్యూటీ సీఎం చేశారు. ఈ సినిమా అదిరిపోవాలి." అన్నారు. నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. "ఆవారాలో కార్తీ గారిని ఎలా చూశారో, మా సినిమాతో కళ్యాణ్ అలా సినిమా చూపించబోతున్నాడు. సినిమా గురించి తర్వాత మాట్లాడుకుందాం. సర్దార్ తెలుగులో చాలా పెద్ద హిట్. ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను." అన్నారు.  నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ.. "తెలుగు పరిశ్రమలో కార్తి అంటే అందరికీ ఇష్టం. సర్దార్ పెద్ద హిట్. సర్దార్ 2పై కూడా చాలా అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచాయి. ఈ సినిమా కార్తి గారి రికార్డులన్నీ రీ-క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను." అన్నారు. https://x.com/Theteluguone/status/2097003968903917778         [Sardar 2 Pre Release Event, Hero Karthi, SJ Suryah, Adivi Sesh, Boyapati Srinu, Telugu Film News, Telugu News]  
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (రవి మోహన్) వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొద్దికాలంగా భార్య ఆర్తితో నడుస్తున్న విడాకుల గొడవలు, మరియు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్‌తో ఆయన సాగిస్తున్న ప్రయాణం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతూనే ఉన్నాయి. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో, మరోసారి టాలీవుడ్‌, కోలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో జయం రవి, సింగర్ కెనీషా ఇద్దరూ చాలా క్యాజువల్‌గా ఒక గ్రూప్ డిస్కషన్‌లో పాల్గొన్నారు. అయితే అందులో జయం రవి స్వయంగా సిగరెట్ తాగుతూ, మధ్యలో ఆ సిగరెట్‌ను కెనీషాకు అందించడం.. ఆమె కూడా దానిని పీల్చడం స్పష్టంగా రికార్డైంది. ఇద్దరూ ఒకే సిగరెట్‌ను షేర్ చేసుకుంటున్న ఈ విజువల్స్ ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా షాక్‌కు గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే భార్యతో విడాకుల మంజూరు అయ్యే వరకు తాను సినిమాలకు దూరంగా ఉంటానని, అలాగే కెనీషాతో బ్రేకప్ చెప్పుకున్నామని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ జంట తరచూ కలిసి కనిపిస్తుండటం అందరినీ విస్మరిస్తోంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఈ జంట, ఇప్పుడు ఇలా పబ్లిక్‌గా సిగరెట్ తాగుతూ కెమెరా కంటికి చిక్కడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగుల్చుతోంది. గతంలో జయం రవి విడాకుల వార్తలు బయటికి వచ్చినప్పుడు చాలామంది నెటిజన్లు ఆయనకు అండగా నిలిచారు. కానీ, వరుసగా ఇలాంటి వీడియోలు బయటపడుతుండటంతో ఆయనపై ఉన్న గౌరవం కోల్పోతున్నామని సోషల్ మీడియా వేదికగా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వైరల్ వీడియోపై నటుడు జయం రవి గానీ, సింగర్ కెనీషా గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరి ఈ విమర్శలపట్ల ఈ జోడీ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. https://x.com/ItsSundarVJ/status/2096655593012682851?s=20     [Jayam Ravi Smoking Video, Ravi Mohan Keneeshaa Francis, Jayam Ravi Divorce News, Telugu Entertainment News, Tollywood Gossip]
Mani Ratnam has announced the title of his next film, Inji Vellam, starring Vijay Sethupathi and Sai Pallavi in the lead roles. The film is a romance, marking the master craftsman’s return with another beautiful story that is expected to leave a lasting impression on audiences. The title announcement poster instantly brings back memories of Mani Ratnam’s romantic classics like Geethanjali and OK Kanmani. Rain covers both Vijay Sethupathi and Sai Pallavi in the poster, creating a soft and poetic mood that reflects the filmmaker’s signature treatment of romance. He has also presented both leads in their best looks while retaining a natural appearance. Inji Vellam means “Ginger Sweet” or “Ginger Jaggery.” The title itself conveys the nature of the central couple, with one being like ginger and the other like jaggery, suggesting contrasting personalities coming together. A.R. Rahman is composing the music for the film, which is being produced by Lyca Productions and India Talkies. The story is set against a Kolkata backdrop, and the team has already completed around 40–50% of the shoot. Inji Vellam is targeting a January 2027 theatrical release and is locked for the Sankranti festive season. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
దక్షిణాది చిత్రాలతో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటి తాప్సీ పన్ను. ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకునే ఈ భామ, ఇటీవల సినీ ఇండస్ట్రీలో అవకాశాల ఎంపికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం ప్రతిభ ఉన్నంత మాత్రాన సినీ రంగంలో వరుస అవకాశాలు రావని ఆమె సంచలన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తాప్సీ మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో నటీనటుల ఎంపిక కేవలం టాలెంట్‌పై మాత్రమే ఆధారపడి ఉండదని స్పష్టం చేశారు. బాక్సాఫీస్ వద్ద మార్కెట్ వాల్యూ, సోషల్ మీడియా ప్రభావం, ఇండస్ట్రీలో ఉండే కాంటాక్ట్స్ మరియు నెట్‌వర్కింగ్ వంటి అంశాలే నేటి రోజుల్లో హీరోయిన్లకు ప్రాజెక్టులు తెచ్చిపెడుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారీ కమర్షియల్ చిత్రాలలో హీరోయిన్ పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత ఉండదని, అక్కడ ఎవరైనా సులభంగా రీప్లేస్ అయిపోతారని వ్యాఖ్యానించారు. తనకు ఇండస్ట్రీలో పెద్దగా కాంటాక్ట్స్ లేవని, కేవలం ప్రతిభనే నమ్ముకుని ప్రయాణం చేస్తున్నానని తెలిపారు. నెట్‌వర్కింగ్ మరియు పబ్లిసిటీ పట్ల శ్రద్ధ చూపకపోవడం వల్లనే తనకు కొన్ని రకాల పెద్ద ప్రాజెక్టులు దూరమవుతున్నాయని తాప్సీ ఓపెన్‌గా చెప్పారు. షారూఖ్ ఖాన్ సరసన నటించిన 'డంకీ' వంటి భారీ విజయం సాధించిన చిత్రం తర్వాత కూడా తనకు బాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో కమర్షియల్ ఆఫర్లు రాలేదని ఆమె గుర్తుచేసుకున్నారు. 'డంకీ' చిత్రంలో అవకాశం రావడం వెనుక దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీకి తన నటనపై ఉన్న నమ్మకమే కారణమని, ఆయన పట్టుబట్టి ఆ పాత్రను తనకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. తెలుగులో 'ఝుమ్మంది నాదం' చిత్రంతో పలకరించి, ఆపై 'సాహసం', 'ఆనందో బ్రహ్మ' వంటి విజయవంతమైన సినిమాల్లో అలరించిన తాప్సీ, హిందీలో 'పింక్', 'థప్పడ్', ఇటీవల వచ్చిన 'గాంధారి' వంటి వైవిధ్యభరితమైన కాన్సెప్ట్ చిత్రాలతో లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాల్లో మెప్పించినా, రెగ్యులర్ కమర్షియల్ రోల్స్‌కు తాను దూరంగా ఉండటానికి కారణాలను ఈ విధంగా విశ్లేషించారు. తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ మరియు మార్కెట్ సమీకరణాల గురించిన నిజాలను తాప్సీ ధైర్యంగా బయటపెట్టారని నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సరైన కాన్సెప్ట్ ఉన్న కథల కోసం చూస్తున్న ఈ నటి, త్వరలోనే తన కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటనలతో ముందుకు రానున్నారు. నటనకు ప్రాధాన్యమున్న పాత్రల ద్వారానే వీలైనంత త్వరగా తాప్సీ మరోసారి ప్రేక్షకులను పలకరిస్తారని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజ్‌లు అందుతున్నాయి. కోలీవుడ్ విలక్షణ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ‘ఓమ్’ (Om - Chapter 1: Udhiram - The Blood Wood) నుంచి మేకర్స్ ఒక సాలిడ్ గ్లింప్స్ వీడియోను విడుదల చేసి ఫ్యాన్స్‌కు అద్భుతమైన బర్త్‌డే ట్రీట్ ఇచ్చారు. ఈ స్పెషల్ గ్లింప్స్‌లో మమ్ముట్టి ‘బుర్మా కార్తికేయన్’ (సియా) అనే పవర్ ఫుల్ మరియు గ్రే-షేడ్స్ ఉన్న ఇంటర్నేషనల్ స్మగ్లర్ పాత్రలో దర్శనమిచ్చారు. పోలీస్ స్టేషన్ మోస్ట్ వాంటెడ్ ఖైదీల లిస్ట్‌లో ఆయన ఫొటో ఉండటం, ఒకవైపు ఖాకీలు ఆయన కోసం గాలిస్తుంటే.. మరోవైపు పోలీసులు వెతుకుతున్న కార్తికేయన్ ఏమాత్రం భయం లేకుండా పోలీస్ స్టేషన్ లోపలే ప్రశాంతంగా కూర్చుని మ్యాచ్ ఎంజాయ్ చేసే సీన్ మమ్ముట్టి స్వాగ్‌ను వేరే లెవెల్‌కి తీసుకెళ్లింది. జైలు లోపల శత్రువుల పై విరుచుకుపడటం, బెయిల్ మీద బయటకు వచ్చి తన సొంత సామ్రాజ్యాన్ని నడిపించే సన్నివేశాల్లో ఆయన చూపించిన స్క్రీన్ ప్రెజెన్స్, నడవడిక మాస్ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ గ్లింప్స్‌కు సాయి అభ్యంకర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విపరీతమైన హైప్‌ను క్రియేట్ చేసింది. ‘అమరన్’ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని అందించిన డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, యంగ్ లీల శ్రీలీల కథానాయికలుగా నటిస్తుండగా, దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా కీలక పాత్ర పోషిస్తున్నారు. ధనుష్‌కు చెందిన 'వుండర్‌బార్ ఫిల్మ్స్' మరియు 'ఆర్‌టేక్ స్టూడియోస్' సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత మమ్ముట్టి మళ్లీ తమిళ చిత్రసీమలోకి రీ-ఎంట్రీ ఇస్తుండటంతో ఈ సినిమా కోసం సౌత్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.       [Mammootty Birthday Om Movie Glimpse, Mammootty Burma Karthikeyan Avatar, Dhanush Mammootty Om Tamil Movie, Rajkumar Periasamy Om Movie Updates, Om Chapter 1 Udhiram Release Date]
నాచురల్ స్టార్ నాని, మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా చిత్రం 'ది ప్యారడైజ్'. గతంలో వీరి కలయికలో వచ్చిన 'దాసరా' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడమే కాకుండా నాని కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. దీంతో ఈ సెకండ్ కాంబోపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత రెండు రోజులుగా 'ది ప్యారడైజ్' చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు (పోస్ట్ ప్రొడక్షన్ వర్క్) ఆలస్యం కావడం వల్ల సెప్టెంబర్ 24న విడుదల కావడం లేదని, అక్టోబర్‌కు వాయిదా పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. దీంతో నాని అభిమానులు తీవ్ర అయోమయంలో పడ్డారు. ఈ క్రమంలోనే వాయిదా రూమర్లకు చెక్ పెడుతూ ప్రొడక్షన్ హౌస్ ఎస్.ఎల్.వి సినిమాస్ (SLV Cinemas) స్పందించింది. సినిమా ముందస్తుగా ప్రకటించిన ప్రకారమే ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 24నే గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోందని మేకర్స్ మరోసారి అధికారికంగా స్పష్టం చేశారు. విడుదల తేదీతో కూడిన కొత్త పోస్టర్‌ను పంచుకుంటూ అభిమానుల్లో ఉన్న సందేహాలకు తెరదించారు. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, వర్సటైల్ యాక్టర్ మోహన్ బాబు, రాఘవ్ జుయల్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే సంపూర్ణేష్ బాబు ఒక కీలక పాత్రలో అలరించబోతున్నారు. యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఆడియో మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై భారీ హైప్ నెలకొంది. డైరెక్టర్ శ్రీకాంత్ ఒడెల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని చాలా రా అండ్ రస్టిక్ కాన్వాస్‌లో తెరకెక్కిస్తున్నారు. అనుకున్న సమయానికే సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనే పట్టుదలతో హీరో నాని కూడా చిత్రయూనిట్‌తో కలిసి కష్టపడుతున్నారు. సెప్టెంబర్ 24న నాని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తారో చూడాలి.       [Nani The Paradise Release Date Confirmed, Srikanth Odela Nani Movie The Paradise, Nani The Paradise September 24 Release, The Paradise Movie Postponement Rumours, SLV Cinemas Nani Latest Movie Updates]
Nani’s The Paradise is staying on course for its announced theatrical release on September 24. The makers have released a fresh set of release date posters, reaffirming that the film will arrive in cinemas as scheduled. The update comes at a time when reports had suggested that the film’s release could be moved to October. The speculation was attributed to the makers needing additional time to complete one song along with some patchwork and VFX-related work. However, the team did not directly address the reports or offer any specific clarification on the rumours. Instead, the latest posters once again carry September 24 as the release date, effectively putting the focus back on the planned schedule. While the makers have not issued a detailed statement regarding the production work that remains, the repeated confirmation indicates that the film is currently being positioned for the announced date. Directed by Srikanth Odela, The Paradise features Nani in the lead role and is backed by Sudhakar Cherukuri under SLV Cinemas. The film has been mounted on a large scale and has already generated attention through its promotional material. Mohan Babu, Raghav Juyal, Kayadu Lohar are cast in the film with Keerthy Suresh in a special song. Anirudh Ravichander is scoring music and his songs - Aaya Sher and Yasha Nagula, have become huge blockbusters, already.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
'నందూస్ వరల్డ్' యూట్యూబ్ ఛానల్‌ ద్వారా సోషల్ మీడియాలో ట్రావెల్, లైఫ్‌స్టైల్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి, ప్రముఖ యూట్యూబర్ రమా నందన తీవ్ర చిక్కుల్లో పడ్డారు. లండన్, యూకేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ స్థాయిలో నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అందించిన ప్రాథమిక వివరాల ప్రకారం.. నందన తన భర్త జగర్లమూడి మధుకర్‌తో కలిసి డెస్టినీ కన్సల్టెన్సీ పేరుతో వ్యవహారాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లండన్ సహా విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా స్పాన్సర్‌షిప్ (CoS) మరియు వీసా రెన్యూవల్ తదితర సేవలు అందిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు బాధితులు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడు మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. వీసా స్పాన్సర్‌షిప్ పేరుతో విడతల వారీగా రూ.15 లక్షలు తీసుకుని, నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చి మోసం చేశారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. సుమారు 100 మందికి పైగా నిరుద్యోగులను నమ్మించి వీరు భారీ మొత్తంలో డబ్బులు గుంజినట్లు సోషల్ మీడియాలోనూ బాధితులు వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు మధుకర్‌ను ఏ1గా, రమా నందనను ఏ2గా చేర్చుతూ కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా దంపతులు దేశం దాటి పారిపోకుండా అధికారులు ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ (LOC) జారీ చేశారు. విదేశాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న నందనను ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆర్‌జీఐఏ పోలీసులు ఆమెను తదుపరి చట్టపరమైన విచారణ నిమిత్తం ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. అయితే, ఈ ఆరోపణలను నందన గతంలోనే ఖండించారు. తమపై వ్యక్తిగత కక్షలతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అసలు డెస్టినీ కన్సల్టెన్సీతో తమకు నేరుగా సంబంధం లేదని స్పష్టం చేస్తూ కేసు కొట్టివేయాలని హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇటీవల చిరంజీవి నిర్మించిన 'మన శంకర వరప్రసాద్' సినిమాలోనూ చిన్న పాత్రలో నటించిన నందన.. ఇప్పుడు కేసులో అదుపులోకి రావడం సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.     [YouTuber Nandana Arrested News, Nandus World Rama Nandana Fraud Case, Shamshabad Airport YouTuber Arrest, UK Visa Fraud Case Telugu YouTuber, Telangana Police Arrest Youtuber Nandana]
  నేటి ఆధునిక కాలంలో యుక్తవయస్సు లేదా కౌమారదశ (Adolescence) లోకి అడుగుపెడుతున్న టీనేజర్ల మానసిక ఆరోగ్యం అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకరమైన విషయంగా మారింది. అయితే, మానసిక సమస్యలు లేదా ప్రవర్తనా వైపరీత్యాలు కేవలం ఒక నిర్దిష్ట సామాజిక వర్గానికో లేదా ఆర్థిక స్థాయికో పరిమితం కాలేదని, విభిన్న సామాజిక ఆర్థిక నేపథ్యాల (Socioeconomic Backgrounds) నుంచి వచ్చే టీనేజర్లలో ఇవి అత్యంత సాధారణంగా కనిపిస్తున్నాయని ఒక నూతన విస్తృత అధ్యయనం సంచలన నిజాలను బయటపెట్టింది. ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి సామాజిక వర్గంలోని కౌమారదశ పిల్లలు తమ వయస్సుకు తగిన మానసిక ఒత్తిళ్లు, ఆందోళన (Anxiety), డిప్రెషన్ (Depression) మరియు ఇతర ప్రవర్తనా రుగ్మతలను ఎదుర్కొంటున్నారని పరిశోధకులు గుర్తించారు. సాధారణంగా తక్కువ సామాజిక ఆర్థిక స్థాయి లేదా పేదరికంలో పెరిగే పిల్లలు ఆర్థిక ఇబ్బందులు, సరైన వనరులు లేకపోవడం మరియు కుటుంబ ఒత్తిళ్ల వల్ల ఎక్కువ మానసిక సమస్యలకు గురవుతారని సమాజంలో బలమైన నమ్మకం ఉండేది. కానీ, తాజా పరిశోధనల ప్రకారం ఉన్నత సామాజిక ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన టీనేజర్లు సైతం సమాన స్థాయిలో లేదా కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ మానసిక ఒత్తిళ్లకు గురవుతున్నారని స్పష్టమైంది. పేదరికంలో ఉన్న పిల్లలకు వనరుల కొరత మరియు భద్రతా లేమి ప్రధాన సమస్యలుగా మారితే, ఉన్నత వర్గాల పిల్లలకు తల్లిదండ్రుల నుండి వచ్చే విపరీతమైన విద్యా ప్రతిభ ఒత్తిడి (Academic Pressure), సామాజిక గుర్తింపు పోటీ మరియు విలాసవంతమైన జీవనశైలి తెచ్చిపెట్టే ఒంటరితనం మానసిక రుగ్మతలకు దారితీస్తున్నాయి. టీనేజర్లలో కనిపించే ఈ మానసిక సమస్యలకు కేవలం ఆర్థిక అంశాలే కాకుండా, డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వాడకం, కుటుంబ సంబంధాలలో క్షీణత, నాణ్యమైన నిద్ర లేకపోవడం మరియు తోటివారి ఒత్తిడి (Peer Pressure) ప్రధాన హేతువులుగా మారుతున్నాయి. నిరంతరం స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో గడపడం వల్ల ప్రతీ సామాజిక వర్గానికి చెందిన టీనేజర్లు తమ జీవితాలను ఇతరులతో పోల్చుకుంటూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. ఇది వారిలో ఆత్మన్యూనతా భావాన్ని పెంచి, డిప్రెషన్ మరియు మానసిక రుగ్మతలకు బీజం వేస్తోంది. అంతేకాకుండా, బడి మరియు కళాశాల వాతావరణంలో పోటీ తత్వాన్ని తట్టుకోలేకపోవడం కూడా వీరి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. ఈ భయానక పరిస్థితి నుంచి కౌమారదశ పిల్లలను కాపాడుకోవడానికి సమాజం మరియు తల్లిదండ్రులు తమ దృక్పథాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని మానసిక వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పిల్లల ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా, వారు చెప్పే మాటలను వినడం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం మరియు వారి ప్రవర్తనలో వచ్చే చిన్న చిన్న మార్పులను కూడా గమనించడం అత్యంత ముఖ్యం. పాఠశాలల్లో నాణ్యమైన కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయులకు టీనేజర్ల మానసిక ఆరోగ్య సం సంకేతాలను గుర్తించే శిక్షణ ఇవ్వడం ద్వారా మానసిక రుగ్మతలను ప్రారంభంలోనే నివారించవచ్చు. ప్రతి ఇంట్లోనూ సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం మరియు డిజిటల్ డిటాక్స్ అలవాటు చేయడం వల్ల టీనేజర్లు మానసికంగా దృఢంగా తయారవుతారని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.         Adolescent mental health study facts, causes of teen depression and anxiety.
  సిగరెట్ లేదా బీడీ కాల్చడం వల్ల కలిగే అనర్థాల గురించి నిరంతరం వింటూనే ఉంటాం. అయితే, మీరు పొగతాగకపోయినా సరే, పక్కన ఎవరైనా పొగ తాగుతుంటే ఆ పొగను పీల్చడం (Passive Smoking , Second hand Smoke) అంతకంటే తీవ్రమైన ప్రాణాంతక ముప్పుగా మారుతోందని ప్రఖ్యాత అంతర్జాతీయ వైద్య పత్రిక  లాన్సెట్  (The Lancet) ప్రచురించిన అధ్యయనంలో దిగ్భ్రాంతికర నిజాలు వెల్లడయ్యాయి. 1990 సంవత్సరం నుండి ఇప్పటివరకు భారతదేశంలో పరోక్ష ధూమపానం వల్ల సంభవిస్తున్న మరణాల సంఖ్య దాదాపు 50 శాతం పెరిగిపోవడం ఆరోగ్య నిపుణులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ధూమపానం చేసేవారు విడుదల చేసే విషపూరితమైన పొగను తెలియకుండానే పీల్చడం వల్ల ఎందరో అమాయకులు, ముఖ్యంగా మహిళలు మరియు చిన్నారులు అకాల మరణాల బారిన పడుతుండటం కలవరపెడుతోంది. తాజా గణాంకాల ప్రకారం, ఒక్క 2023 సంవత్సరంలోనే భారతదేశంలో పరోక్ష పొగతాగడం వల్ల కలిగే వివిధ ఆరోగ్య సమస్యలతో ఏకంగా 3,25,600 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా, భారతదేశంలో ఇదే సంవత్సరంలో సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల 9.28 మిలియన్ల డిసేబిలిటీ అడ్జస్టెడ్ లైఫ్ ఇయర్స్ (DALYs) నష్టం వాటిల్లింది. అంటే అనారోగ్యం, వైకల్యం లేదా అకాల మరణం కారణంగా ప్రజలు తమ జీవితంలో ఇన్ని మిలియన్ల ఆరోగ్యకరమైన సంవత్సరాలను కోల్పోయారని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే 2023 నాటికి ఏకంగా 2.71 బిలియన్ల మంది ప్రజలు పరోక్ష ధూమపానానికి గురవుతున్నారు. దీని ఫలితంగా ప్రపంచ స్థాయిలో ఏడాదికి 1.66 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతుండగా, 44.8 మిలియన్ల డాలీస్ నష్టం జరుగుతోంది. అంతర్జాతీయంగా చూస్తే చైనా, భారతదేశం మరియు ఇండోనేషియా దేశాల్లోనే అత్యధికంగా ప్రపంచ పరోక్ష ధూమపాన బాధితుల్లో సగం మంది ఉన్నారు. చైనాలో అత్యధికంగా 664 మిలియన్ల మంది ప్రజలు ఈ ప్రమాదకర పొగకు గురవుతుండడం గమనార్హం. పరోక్షంగా పీల్చే పొగ శరీరంలోని కీలక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని శ్వాసకోశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్‌హ్యాండ్ స్మోక్ వల్ల ప్రధానంగా ఇస్కీమిక్ గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్రోనిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD), రొమ్ము క్యాన్సర్, టైప్ 2 డయాబెటిస్, ఆస్తమా మరియు దిగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తాయని లాన్సెట్ అధ్యయనం తేల్చింది. ఇంట్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులు తాగే పొగను పీల్చడం వల్ల చిన్న పిల్లల ఊపిరితిత్తుల ఎదుగుదల దెబ్బతిని, వారిలో తీవ్రమైన నిమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. మహిళలు కూడా ఈ పొగ బారిన పడి తీవ్ర గుండె సంబంధిత మరియు క్యాన్సర్ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ భయానక పరిస్థితి నుంచి కాపాడుకోవడానికి ప్రజల్లో తీవ్రమైన అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పొగతాగే అలవాటు ఉన్నవారు తమ ఇల్లు, ఆఫీస్ మరియు బహిరంగ ప్రదేశాల్లో కాకుండా కేవలం నిర్దేశించిన ఓపెన్ ఎయిర్ ప్రాంగణాల్లో మాత్రమే స్మోకింగ్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు ఉన్న ఇళ్లల్లో పొగతాగడం పూర్తిగా నిషేధించాలి. ప్రభుత్వాలు కూడా బహిరంగ ప్రదేశాల్లో పొగతాగడంపై నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు, పరోక్ష ధూమపానం తెచ్చే ముప్పుపై చైతన్యాన్ని విస్తృతంగా తీసుకెళ్లినప్పుడే లక్షలాది అమాయకుల ప్రాణాలను కాపాడుకోగలమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.       How secondhand smoke affects women and children, Lancet report on passive smoking deaths in India.
  ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన మూలికల్లో శంఖుపువ్వు (Butterfly Pea Flower) ఒకటి. ఆయుర్వేదంలో దీనిని  అపరాజిత  అని కూడా పిలుస్తారు. నీలి రంగులో కంటికి ఇంపుగా కనిపిస్తూ, ఇంటి ప్రాంగణాల్లో పెరిగే ఈ పువ్వులు కేవలం అందానికే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శంఖుపువ్వులతో తయారుచేసే  బ్లూ టీ  (Blue Tea) ఇటీవల కాలంలో హెల్త్ కాన్షియస్ ఉన్నవారిలో ఎంతగానో ప్రాచుర్యం పొందుతోంది. ప్రతిరోజూ ఉదయాన్నే లేదా సాయంత్రం ఒక కప్పు శంఖుపువ్వు టీ తాగడం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ శంఖుపువ్వు టీలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాల నాశనాన్ని అరికడతాయి. ప్రతిరోజూ ఒక కప్పు ఈ హెర్బల్ టీ తీసుకోవడం వల్ల చర్మంపై ముడతలు తగ్గి, ముఖం కాంతివంతంగా మారుతుంది. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఆంటి ఏజింగ్ (Anti aging) ఏజెంట్‌గా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, జుట్టు రాలడం సమస్యను తగ్గించి, కుదుళ్లను బలంగా ఉంచడానికి శంఖుపువ్వులోని పోషకాలు తోడ్పడతాయి. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మరియు జ్ఞాపకశక్తిని పెంచడంలో శంఖుపువ్వు ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం మరియు ఆధునిక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఈ టీ తాగడం వల్ల మెదడులో  అసిటైల్ కోలైన్  అనే న్యూరోట్రాన్స్మిటర్ స్థాయిలు పెరుగుతాయి, ఇది ఏకాగ్రతను పెంచి, మానసిక ఒత్తిడి మరియు ఆందోళన (Stress and Anxiety) నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజంతా తీవ్రమైన పనిఒత్తిడితో బాధపడేవారు సాయంత్రం వేళ ఈ టీ తాగితే క్షణాల్లో మనసు తేలికపడి, నిద్రలేమి సమస్య తగ్గుతుంది. కంటి చూపును మెరుగుపరచడంలో కూడా శంఖుపువ్వు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే  ఆంథోసైనిన్  (Anthocyanin) అనే కాంపౌండ్ కంటికి రక్తప్రసరణను పెంచుతుంది. రోజూ కంప్యూటర్లు, మొబైల్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడిపే వారికి కంటి అలసట, పొడిబారడం వంటి సమస్యల నుంచి ఈ టీ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలోనూ, శరీరంలో జీవక్రియలను (Metabolism) వేగవంతం చేసి బరువు తగ్గడంలోనూ శంఖుపువ్వు టీ సహాయపడుతుంది. శంఖుపువ్వు టీని ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఒక పాత్రలో నీటిని మరిగించి, అందులో 4 నుండి 5 శంఖుపువ్వులను (తాజావి లేదా ఎండినవి) వేసి 3 నుండి 5 నిమిషాల పాటు నానబెట్టాలి. నీరు నీలి రంగులోకి మారిన తర్వాత వడకట్టుకుని, అందులో కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకుని తాగవచ్చు. నిమ్మరసం పిండగానే ఈ టీ రంగు నీలి నుంచి ఉదా (Purple) రంగులోకి మారడం ప్రత్యేకం. రోజూ ఒకకప్పు ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరం లోపల నుంచి శుభ్రపడి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.       Butterfly pea tea anti aging and weight loss, Ayurvedic benefits of butterfly pea flower tea.
వాతావరణ మార్పులు, జలుబు, ఇన్ఫెక్షన్లు లేదా సైనస్ సమస్యల వల్ల శ్వాసనాళాల్లో చిక్కటి కఫం పేరుకుపోతుంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారడమే కాకుండా నీరసం, గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా దీని ఉపశమనం కోసం యాంటీబయోటిక్స్ లేదా ఇతర మందులు వాడుతుంటారు, కానీ ఇవి ప్రతిసారీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంది. ఔషధాల ప్రమేయం లేకుండా, ఇంట్లోనే  రెండు  ప్రభావవంతమైన పద్ధతుల ద్వారా కొన్ని నిమిషాల్లోనే కఫం నుంచి ఉపశమనం పొందవచ్చు. వైద్యులు రికమెండ్ చేస్తున్న ఈ చిట్కాలు ఏమిటో తెలుసుకుంటే.. హెర్బల్ స్టీమ్.. సాధారణ నీటి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాసనాళాలు కాసేపు రిలాక్స్ అవుతాయి కానీ.. గట్టిగా ఉన్న కఫం కరగదు. నీటిలో కొన్ని రకాల సహజ మూలికలను చేర్చి ఆవిరి పట్టినప్పుడు, ఆ ఆవిరి ఊపిరితిత్తుల లోతుల్లోకి వెళ్లి కఫాన్ని సులభంగా కరిగిస్తుంది. కావాల్సిన పదార్థాలు.. పుదీనా ఆకులు.. 10 నుండి 12 తులసి ఆకులు..  10 నుండి 12 హిమాలయన్ పింక్ సాల్ట్..  1 టీస్పూన్ తురిమిన అల్లం..  అర అంగుళం నీరు.. ఆవిరి రావడానికి సరిపడా ఇందులోని పదార్థాల ప్రత్యేకత..  పుదీనాలో ఉండే మెంతోల్ శ్వాసనాళాలను తెరిచి కఫాన్ని పలుచన చేస్తుంది.  తులసిలోని యాంటీమైక్రోబయల్ గుణాలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను నశింపజేసి, వాపును తగ్గిస్తాయి.  హిమాలయన్ ఉప్పు కఫాన్ని కరిగించడానికి తోడ్పడతుంది.   అల్లం గొంతు మంటను తగ్గించి శ్వాసకోశాల్లోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది. తయారీ , ఉపయోగించే విధానం.. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరిగించాలి. స్టవ్ ఆపివేసిన తర్వాత, ఆ వేడి నీటిలో పుదీనా, తులసి ఆకులు, హిమాలయన్ సాల్ట్ , తురిమిన అల్లం వేయాలి. వెంటనే పాత్రపై ఒక టవల్ మూసి రెండు నిమిషాల పాటు ఉంచాలి. దీనివల్ల ఆ మూలికలలోని ఆరోమాటిక్ ఆయిల్స్ నీటిలోకి విడుదలవుతాయి. ఆ తర్వాత పాత్ర మూత తీసి, ముఖాన్ని   తగినంత దూరంలో ఉంచి, తలను టవల్‌తో లేదా దుప్పటితో  కప్పుకోవాలి. ముక్కు , నోటి ద్వారా లోతుగా శ్వాస తీసుకుంటూ 5 నుండి 10 నిమిషాల పాటు ఆవిరిని పీల్చాలి. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల శ్వాసకోశాల్లో పేరుకుపోయిన కఫం త్వరగా కరిగిపోతుంది. డీప్ ఎక్స్‌పాన్షన్ బ్రీతింగ్ వ్యాయామం.. ఆవిరి పద్ధతితో పాటు డీప్  ఎక్స్‌పాన్షన్ ప్రత్యేక శ్వాస వ్యాయామాన్ని కలిపి చేసినప్పుడు ఫలితం మరింత వేగంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల లోపలి భాగాల్లో చిక్కుకున్న కఫాన్ని పైకి నెట్టి, సులభంగా బయటకు వచ్చేలా చేస్తుంది. చేసే విధానం.. మొదట ఒక కుర్చీలో నిటారుగా, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి కూర్చోవాలి. ముక్కు ద్వారా శ్వాసను ఎంత వీలైతే అంత లోతుగా లోపలికి తీసుకోవాలి. శ్వాస తీసుకున్న తర్వాత, దానిని 3 నుండి 4 సెకన్ల పాటు ఊపిరితిత్తుల్లోనే పట్టి ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి, నాళాలకు అతుక్కుపోయిన కఫం వదులవుతుంది. తరువాత పెదవులను కొవ్వొత్తిని ఊదుతున్నట్లుగా చిన్నగా చేసి, నోటి ద్వారా గాలిని బలంగా బయటకు వదలాలి. ఈ పద్ధతిని వరుసగా 5 నుండి 7 సార్లు పునరావృతం చేయాలి. ఇది ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా శ్వాసనాళాలను శుభ్రపరుస్తుంది. ముగింపు.. జలుబు, దగ్గు లేదా మొండి కఫంతో బాధపడుతున్నప్పుడు ఈ రెండు సహజ పద్ధతులను క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి మందుల అవసరం లేకుండానే ఊపిరితిత్తులు శుభ్రపడి, హాయిగా శ్వాస తీసుకోగలుగుతారు.                           *రూపశ్రీ.    
రోజూ తినే ఆహారం సరిగ్గా జీర్ణం కావడం లేదా? గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయా? అలాంటి వారికి శొంఠి పొడి (ఎండు అల్లం పొడి) ఉపయోగకరంగా ఉంటుందని ఆయుర్వేదంలో చెబుతారు. అయితే శొంఠిని సరైన మోతాదులో, సరైన విధంగా తీసుకోవడం చాలా ముఖ్యం. తాజా అల్లంతో పోలిస్తే ఎండు అల్లం లేదా శొంఠికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా జీర్ణక్రియకు శొంఠి ఎలా సహాయపడుతుంది? మజ్జిగలో పావు టీస్పూన్ శొంఠి పొడిని కలిపి తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? పిల్లల నుంచి పెద్దల వరకు శొంఠిని ఎలా ఉపయోగించాలి? ఏ ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మంచిది? ఈ విషయాలపై ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ వివరించారు. శొంఠి పొడి వల్ల కలిగే ప్రయోజనాలు, తీసుకునే సరైన విధానం, మోతాదు వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి. గ్యాస్, అజీర్తి, బ్లోటింగ్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు శొంఠిని ఆహారంలో ఎలా చేర్చుకోవచ్చో తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. గమనిక: ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఏదైనా ఇంటి చిట్కా లేదా ఆయుర్వేద పదార్థాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)