LATEST NEWS
  రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో  నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సీఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ  ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల రెండు మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.  కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో వాగులు వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కృష్ణా నదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ నుంచి 3.09 లక్షల క్యూసెక్కుల నీరు 35 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువలకు 5 వేల క్యూసెక్కుల మేర నీరు విడిచిపెట్టినట్టు అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజికి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను కూడా ఎత్తినట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణం తొలగించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.  వరద నీటిని సద్వినియోగం చేయండి ఎగువ నుంచి వస్తున్న నీటిని  సద్వినియోగం చేసుకునేలా రోజుకు నాలుగు టీఎంసీల చొప్పున తరలించి సోమశిల, కండలేరు ప్రాజెక్టులను నింపాలని సీఎం ఆదేశించారు. వరద నీటిని వృధాగా సముద్రంలోకి పోనీయకుండా సద్వినియోగం చేసుకునేలా సమర్ధ నీటి నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. మైలవరం సహా ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షం బుడమేరు, వెలగలేరులకు పెద్ద ఎత్తున వస్తోందని.. ఈ నీరు కృష్ణా నదిలోకి డిశ్చార్జి చేస్తున్నట్టు తెలిపారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు వివరించారు. వరద నిర్వహణా పనుల్లో భాగంగా రూ.40 కోట్లతో బుడమేరు- వెలగలేరు యూటీ నిర్మాణాన్ని చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు.  గండ్లు పడకుండా గట్లు పటిష్ట పర్చాలి మరోవైపు భారీవర్షం కారణంగా కొండవీటి వాగు, పాల వాగులకు వస్తున్న నీటిని కృష్ణా నదిలోకి నాలుగు పంపుల ద్వారా నీటిని ఎత్తి పోస్తున్నామని  అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షకాల సీజన్ లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలువల్లో నీటి ప్రవాహాలు సక్రమంగా వెళ్లేందుకు వీలుగా గుర్రపు డెక్క, తూడును తొలగించాలని ముఖ్యమంత్రి జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.  అలాగే కాలువలు, చెరువులకు గండ్లు పడకుండా గట్లను పటిష్టం చేయాలని సీఎం సూచించారు. జిల్లాల్లో వర్షాల పరిస్థితిపై ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండి రైతులకు తక్షణ సమాచారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో భూగర్భ జలాలను రీఛార్జి చేసేలా నిర్మాణాలను చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు ఆయా ట్రెంచ్ లను ఎక్కడెక్కడ చేపట్టాలో ప్రణాళిక చేసుకోవాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ట్రెంచ్ లను తవ్వేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
  మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి  సీబీఐ అధికారులు షాక్ ఇచ్చారు.. ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు  నిర్దోషిగా ప్రకటించింది. సిబిఐ కోర్టు తీర్పుని సవాల్ చేస్తూ.. సీబీఐ అధికారులు హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది..  సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఆమెపై విచారణకు ఆదేశించాలని హైకోర్టుని కోరింది.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది..ఓఎంసీ కేసులో సబితను నిర్దోషిగా ప్రకటించడాన్ని   హైకోర్టు లో సీబీఐ సవాల్ చేసింది.. సబితతోపాటు మాజీ ఐఎస్ఐ అధికారి కృపానందంపైనా కూడా సీబీఐ పిటిషన్‌ వేసింది.  సిబిఐ వేసిన పిటిషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.. కేసు విచారణ వాయిదా వేసింది..ఓఎంసీ కేసులో సబిత, కృపానందంలను గతంలో నిర్దోషులు గా ప్రకటించిన సీబీఐ కోర్టు..గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతర నిందితులను దోషులుగా నిర్ధారిస్తూ సీబీఐ కోర్టు గతంలోనే తీర్పించింది..  ఇప్పటికే ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై మళ్లీ విచారణ జరపాలని గతంలో హైకోర్టు ఆదేశం జారీ చేసింది.. ఇప్పుడు సబిత, కృపానందం ల కేసు పైన హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.  
  తమిళనాడులోని ఎంఎస్‌యూ విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్సలర్ ఆర్.ఎన్. రవి చేతుల మీదుగా పీహెచ్‌డీ పట్టా స్వీకరించేందుకు ఓ విద్యార్థిని నిరాకరించారు. గవర్నర్‌ను దాటుకుని నేరుగా వైస్-ఛాన్సలర్ వద్దకు వెళ్లి ఆమె డిగ్రీని స్వీకరించారు. ఈ ఘటన ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.  తిరునల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 32వ స్నాతకోత్సవం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి 650 మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. వేదికపై ఉన్న గవర్నర్ ఆర్.ఎన్. రవి నుంచి విద్యార్థులు ఒక్కొక్కరిగా పట్టాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నాగర్‌కోయిల్‌కు చెందిన పరిశోధక విద్యార్థిని జీన్ జోసెఫ్ వంతు వచ్చింది. ఆమె వేదికపైకి వెళ్లి గవర్నర్‌ను పట్టించుకోకుండా దాటి వెళ్లిపోయారు.  నేరుగా వైస్-ఛాన్సలర్ ఎన్. చంద్రశేఖర్ వద్దకు వెళ్లి ఆయన చేతుల మీదుగా తన పీహెచ్‌డీ పట్టాను స్వీకరించారు.తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం, గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి మధ్య పెండింగ్‌ బిల్లులతోపాటు పలు అంశాలపై విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డీఎంకే నాగర్‌కోయిల్ డిప్యూటీ సెక్రటరీ ఎం రాజన్ భార్య అయిన పీహెచ్డీ విద్యార్థిని జీన్ జోసెఫ్ ఇలా వ్యవహరించింది. గవర్నర్‌ చేతుల మీదుగా డిగ్రీ పట్టా అందుకునేందుకు ఆమె తిరస్కరించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.
  శంషాబాద్ ఎయిర్‌ఫోర్టులో పలు విమానలు అధికారులు దారి మళ్లించారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎనిమిది విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు రావాల్సిన విమానాలను విజయవాడ, బెంగళూరు, తిరుపతికి మళ్లించినట్లు పేర్కొన్నారు. విజయవాడకు ఐదుకు, బెంగళూరుకు మూడు, తిరుపతికి ఒక విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు.  హైదరాబాద్‌ నుంచి బయలుదేరాల్సిన విమానాలను తాత్కాలికంగా రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ వ్యాప్తం పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నగరాన్ని మొత్తం కారు మేఘాలు కమ్మేశాయి. ఈ క్రమంలోనే విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.  
  దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ కేసులో ఈడి విచారణ కొనసాగుతున్నది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన ప్రముఖులందరికీ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండ , ప్రకాష్ రాజ్ లను ఈడి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈరోజు సినీనటి మంచు లక్ష్మి ని కూడా ఈడి విచారణ చేస్తు న్నారు. మంచు లక్ష్మి గేమింగ్ యాప్లను ప్రమోట్ చేసినట్లుగా అధికా రులు గుర్తించారు. ఈజీగా డబ్బు సంపాదించుకో వచ్చు అంటూ సోషల్ మీడియాలో మంచు లక్ష్మి ప్రమో షన్లు చేసినట్టుగా గుర్తించిన ఈ డి ఆమెకు నోటీసులు జారీ చేశారు.  ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఈరోజు ఉదయం 11:30 గంటల ప్రాంతం లో ఈడి కార్యాల యానికి చేరుకు న్నారు. ఇంకా విచారణ కొనసా గుతున్నది. మంచు లక్ష్మి yolo 247 బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసిన ట్లుగా ఆరోపణలు నేపథ్యంలో అధికారులు వాటి ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల వివ రాలు సేకరిస్తు న్నారు.. మంచు లక్ష్మిపై పలు ప్రశ్నల వర్షం కురిపిస్తు న్నారు. ఇదిలా ఉండగా మరోవైపు దేశ వ్యాప్తంగా ఉన్న పలు బెట్టింగ్ యాప్ సంస్థల కార్యాల యాల్లో ఈడి సోదాలు చేసింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, జైపూర్, మదురై తదితర 15 ప్రాంతాల్లో సోదాలు చేసి....అంతర్జాతీయ స్పోర్ట్స్, బెట్టింగ్ సంస్థ పరిమ్యాచ్ పేరుట అక్రమంగా బెట్టింగ్ నిర్వహిస్తు న్నట్లుగా ఈడి గుర్తించింది.  దాదాపు 2000 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నట్లుగా ఈడి ప్రాథమిక దర్యాప్తులో వెల్ల డైంది.దీంతో ఈడి దేశవ్యాప్తంగా బెట్టింగ్ ఆప్ కేసులో పలువురిని  విచారణ చేస్తుంది..  ఈ క్రమంలోనే 1XBET యాప్ ప్రమోట్ చేసినం దుకు క్రికెటర్ సురేష్ రైనాను అధికారులు ఢిల్లీలో విచారిస్తు న్నారు. ఇప్పటికీ రణధీర కపూర్, కపిల్ వర్మ, హుమా ఖురేషి, హీనా ఖాన్ లతోపాటు పలు వురు సెలబ్రిటీలకు సమన్లు జారీ చేసింది. అధికారులు క్రికెటర్ యువరాజ్ సింగ్,  హర్భజన్ సింగ్ , సినీ నటుడు సోను సూద్ లను త్వరలో విచారించనున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రకటనలో అనుమతించినందుకు ఫేస్బుక్ (మెటా) గూగుల్ సంస్థలకు కూడా ఈడి సమన్లు జారీ చేసింది.
ALSO ON TELUGUONE N E W S
మరికొన్నిగంటల్లో రజనీకాంత్(Rajinikanth)నాగార్జున(Nagarajuna),అమీర్ ఖాన్(Amir Khan),ఉపేంద్ర(Upendra),లోకేష్ కనగరాజ్(lOkesh Kanagaraj)ల 'కూలీ'(Coolie)మూవీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనుంది. దీంతో కూలీ మూవీ రిజల్ట్ పై అభిమానులతో పాటుప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా అయితే అన్ని చోట్ల రికార్డు బుకింగ్స్ ని సొంతం చేసుకుంది. రీసెంట్ గా  తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)ఎక్స్(X)వేదిపైగా 'కూలీ మూవీ ముందుగా చూసే అవకాశం లభించినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ లో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్ చేశాను.విడుదలైన ప్రతి చోట కూలీ ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. చిత్ర బృందానికి ప్రత్యేక శుభాకాంక్షలు అని ట్వీట్ చేసాడు.  ఉదయనిధి స్టాలిన్  సినీ రంగంలో తన సత్తా చాటిన విషయం తెలిసిందే. 2012 లో 'ఒరు కల్ ఒరు కన్నడి' అనే చిత్రంతో హీరోగా పరిచయమైన స్టాలిన్ మొదటి సినిమాతోనే బెస్ట్ మేల్ డెబ్యూ గా ఫిలింఫేర్ ని అందుకున్నాడు. ఆ తర్వాత సుమారు పద్నాలుగు చిత్రాల వరకు చేసి ఎంతో మంది అభిమానులని సంపాదించాడు. చివరగా 2023 లో మామన్నన్‌ లో కనిపించగా, కొన్ని చిత్రాలు తెలుగులో కూడా రిలీజయ్యాయి.     
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)అప్ కమింగ్ మూవీ 'ది రాజాసాబ్(The Raja Saab).హర్రర్ కామెడీగా తెరకెక్కుతున్న రాజాసాబ్ నుంచి ఇప్పటికే  టీజర్ వచ్చి, అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో రాజాసాబ్ పై  ఉన్న అంచనాల్ని రెట్టింపు చేసింది. ప్రభాస్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో  నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ(People Media Factory)పై 'టిజి విశ్వప్రసాద్'(Tg Vishwa Prasad)నిర్మిస్తుండగా, మారుతీ(Maruthi)దర్శకుడు. రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై 'ఢిల్లీ'(Delhi)కి చెందిన 'ఐవివై'(Ivy)సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. సదరు పిటిషన్ లో 'రాజాసాబ్ మూవీ నిర్మాణం కోసం 218 కోట్ల రూపాయిలు పెట్టుబడి పెట్టాం. కానీ మూవీ అప్ డేట్స్ ని  పీపుల్ మీడియా ఇవ్వడం లేదు. పదే పదే సినిమా వాయిదా వేస్తున్నారు. పద్దెనిమిది శాతం వడ్డీతో కలిపి మా డబ్బులు మాకు చెల్లించాలి. అప్పటి వరకు పీపుల్ మీడియాకి రాజా సాబ్ పై ఎలాంటి హక్కులు ఉండవని తమ పిటిషన్ లో  పేర్కొంది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ గా మారింది.   ఢిల్లీ కేంద్రంగా ఉన్న 'ఐవివై' సంస్థ గురించి పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది.  పీపుల్ మీడియా  ప్రస్తుతం రాజాసాబ్ తో పాటు 'మిరాయ్' అనే మరో చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ రెండు చిత్రాలు అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంటున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉండగా, సెప్టెంబర్ 5 న మిరాయ్(Mirai)డిసెంబర్ 5 న రాజాసాబ్ విడుదల కానున్నాయి. 2018 లో సినీ రంగ ప్రవేశం చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆనతికాలంలోనే నెంబర్ ఆఫ్ సినిమాలని నిర్మించి ,అగ్ర నిర్మాణ సంస్థగా గుర్తింపు పొందింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో 'బ్రో' ని కూడా నిర్మించిన విషయం తెలిసిందే.      
సౌత్ చిత్ర పరిశ్రమ నుంచి కూలీ(Coolie),నార్త్ చిత్ర పరిశ్రమ నుంచి 'వార్ 2'(War 2)చిత్రాలు, పాన్ ఇండియా స్థాయిలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద పోటీపడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెండిటిలో ఏ చిత్రం ముందు వరుసలో ఉంటుందనే ఆసక్తి  అందరిలో ఉంది. ఈ రెండు భారీ చిత్రాల ముందు పాన్ ఇండియా వ్యాప్తంగా ఉన్న ఇతర సినీ మేకర్స్ తమ కొత్త సినిమాలని రిలీజ్ చేయలేని పరిస్థితి. అంతలా వార్ 2 , కూలీ చిత్రాలు ప్రభంజనాన్ని సృష్టిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఈ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.   కానీ 'పశ్చిమ బెంగాల్' లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఆగష్టు 14 న పశ్చిమ బెంగాల్ లో 'ధూమకేతు'(Dhumketu)అనే లోకల్ బెంగాలీ మూవీ విడుదల కాబోతుంది. అడ్వాన్స్ బుకింగ్ పరంగా ధూమకేతు ఇప్పటి వరకు 21 వేల టికెట్స్ సేల్ అవ్వగా, వార్ 2 కేవలం ఆరువేల టికెట్స్ బుక్ అయ్యాయి. కూలీని బెంగాలీలు  పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ మేరకు సోషల్ మీడియాలో విసృతంగా వార్తలు వస్తున్నాయి. తొలి రోజు వార్ 2 , కూలీ ని తలదన్నేలా నాలుగు వందల షో లు పడనున్నాయని కూడా తెలుస్తుంది.  ఇంతవరకు ఏ బెంగాలీ చిత్రానికి అంత ఆదరణ లభించలేదని సినీ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.   'ధూమకేతు' లో బెంగాల్ సూపర్ స్టార్ దేవ్(Dev),శుభశ్రీ గంగూలీ(Subhashree Ganguly)జంటగా నటించారు. గతంలో ఈ ఇద్దరు నటించిన చిత్రాలు సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా, ఇద్దరి ఫెయిర్ కి మంచి పేరు వచ్చింది. దీంతో ధూమకేతుకి బెంగాల్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వచ్చినట్టుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి. పది సంవత్సరాల క్రితం మొదలైన ధూమకేతు, ఎనిమిది సంవత్సరాల క్రితమే షూటింగ్ ని పూర్తి చేసుకుంది. ఎన్నో వాయిదాల అనంతరం రేపు విడుదల కాబోతుంది.    
Prabhas has become one of the biggest bonafide superstars of Indian Cinema. Post Baahubali, in these ten years, his films have been creating huge expectations and collecting big collections at the box office. His last release, Kalki 2898 AD, collected more than Rs.1200 crores at the box office.  Now, his fans and movie-lovers are waiting eagerly for his next film, The Raja Saab. The movie has been delayed from originally planned 2024 release to 5th December 2025, release. But the delays have not just frustrated fans but IVY Entertainment, a film rights holding and monetising company, that specializes in acquring South films rights in Hindi, have gone to court against producer, People Media Factory.  Apparently, the delays have cost them Rs.216 crores and they are asking the producer to pay the amount, immediately. People Media Factory have attributed delays to bring quality content to public and also, Prabhas knee injury and recovery. The actor started his next, Prabhas-Hanu film also but The Raja Saab shoot is still pending. In fact, rumors have stated that Prabhas saw the film and asked for re-shoots, hence, the release is being delayed further. Sanjay Dutt is playing a prominent role in the film with Niddhi Agerwal, Malvika Mohanan in leading roles. The movie is directed by Maruthi Dasari and it is the first time Prabhas doing a Horror Comedy. Let's wait for producer reaction to these accusations and rumors.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్ స్టార్ 'రజనీకాంత్'(Rajinikanth)రేపు వరల్డ్ వైడ్ గా 'కూలీ'(Coolie)తో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన కూలీ, రజనీ సినీ కెరీర్ యాభై సంవత్సరాలని పూర్తి చేసుకున్న సందర్భంగా రిలీజ్ కావడం, నాగార్జున(Nagarjuna)వంటి బిగ్ స్టార్ ఫస్ట్ టైం విలన్ గా, లియో తర్వాత కొంత గ్యాప్ తీసుకొని లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తెరకెక్కించడంతో కూలీపై భారీ అంచనాలు ఉన్నాయి. హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్(Ntr)కలిసి చేసిన ప్రెస్టేజియస్ట్ మూవీ 'వార్ 2 'కూడా రేపు వరల్డ్ వైడ్ గా విడుదల కానుండటంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది.      రీసెంట్ గా బాలీవుడ్ అగ్ర హీరో 'హృతిక్ రోషన్'(Hrithik Roshan)ఎక్స్(X)వేదికగా స్పందిస్తు 'రజినీకాంత్ సార్, మీ పక్కన నటుడిగా నా తొలి అడుగులు వేశాను. మీరు నా మొదటి గురువులలో ఒకరు. మీరు నాకు ఎప్పుడూ ఆదర్శం అవ్వాలి. 50 సంవత్సరాల ఆన్ స్క్రీన్ మ్యాజిక్ పూర్తి చేసుకున్నందుకు అభినందనలు అని పోస్ట్ చేసాడు. పాన్ ఇండియా లెవల్లో వార్ 2 , కూలీలో ఏ మూవీ ముందు వరుసలో నిలుస్తుందని అభిమానులు, సినీ ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తికగా ఎదురుచూస్తున్న వేళ, హృతిక్ చేసిన పోస్ట్ ఇండియన్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.  1986 లో హిందీలో విడుదలైన 'భగవాన్ దాదా' అనే చిత్రంలో రజనీ కాంత్, హృతిక్ రోషన్ కలిసి నటించారు. ఈ చిత్రంలో 'భగవాన్ దాదా'(Bhagwan Dada)టైటిల్ రోల్ లో రజనీ చెయ్యగా, పన్నెండు సంవత్సరాల వయసు గల హృతిక్, రజనీ పెంపుకు కొడుకు గోవిందాదాదాగా కనిపించాడు. ఈ చిత్రంకి ముందు హృతిక్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగు సినిమాలు చేసినా, అవి కేవలం అప్పీరియన్స్ చిత్రాలగానే మిగిలిపోయాయి. నటుడుగా 'భగవాన్ దాదా'నే మంచి గుర్తింపు ఇచ్చింది. ఈ చిత్రం తర్వాత  అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని సినిమాలకి పని చేసిన హృతిక్ 2000 వ సంవత్సరంలో 'కహోనా ప్యార్ హో'తో హీరోగా తెరంగ్రేటం చేసాడు.           
హీరోగా సుదీర్ఘ కాలంపాటు రాణించి, సినీ రంగంలో తనకంటు ఒక ప్రత్యేక పేజీని ఏర్పాటు చేసుకున్నాడు జగపతిబాబు(Jagapathi Babu). ఫ్యామిలీ, యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, ఇలా అన్ని జోనర్స్ కి సంబంధించిన చిత్రాల్లో, ఎటువంటి క్యారక్టర్ ని అయినా అవలీలగా పోషించి,ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించగల సత్తా ఆయన సొంతం. ప్రస్తుతం ప్రతి నాయకుడుగా తన సత్తా చాటుతు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు జగపతిబాబు ఫస్ట్ టైం ప్రముఖ ఛానల్ 'జీ'(Zee Tv)వేదికగా ప్రసారం కాబోయే 'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి'(Jayammu Nischayammu raa with Jagapathi Babu)అనే టాక్ షో తో  'స్మాల్ స్క్రీన్'పై హోస్ట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.   ఈ షో కి 'కింగ్ నాగార్జున'(Nagarjuna)ఫస్ట్  గెస్టుగా రాబోతున్నాడు. రీసెంట్ గా 'షో' కి సంబంధించిన ప్రోమో రిలీజై అభిమానులతో పాటు బుల్లి తెర ప్రేక్షకులని విశేషంగా ఆకర్షిస్తుంది. ప్రోమోలో 'నాగార్జున సినీ కెరీర్ తో పాటు, తండ్రి లెజెండ్రీ యాక్టర్ నాగేశ్వరరావుగారితో ఉన్న అనుబందం, భావోద్వేగాలు, వ్యక్తిగత జీవితం, నాగార్జున గురించి సోదరుడు వెంకట్, సోదరి నాగసుశీల చెప్పిన విషయాలు, నాగార్జున, జగపతి బాబు మధ్య ఉన్న స్నేహబంధం, ఇద్దరి మధ్య జరిగిన కొన్ని ఫన్నీ సంగతులు  'షో'లో ఉండబోతున్నాయని అర్ధమవుతుంది.  దీంతో అక్కినేని అభిమానులు, జగపతి బాబు అభిమానులు ఎప్పుడెప్పుడు  'జయమ్ము నిశ్చయమ్మురా విత్ జగపతి' టాక్ షో చూస్తామా అని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్  చేస్తున్నారు. ఆగస్టు 15 న  ఓటిటి వేదికగా జీ5(Zee 5)లో, ఆగస్టు 17 న ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.    
Coolie starring Superstar Rajinikanth, King Nagarjuna, Satyaraj, Upendra, Aamir Khan, Soubin Shahir, Shruti Haasan is releasing on 14th August. worldwide with enormous hype and buzz. Lokesh Kanagaraj directing Rajini for the first time and bringing so many huge stars on board as create mass euphoria all over.  The Coolie storm at the box office is sweeping away all existing records. Already, the movie pre-sales for the opening day have crossed Rs.100 crores gross worldwide and the mania is not stopping anywhere. Even in Telugu States - Andhra Pradesh and Telangana, the movie took huge advantage over WAR 2.  In Tamil strong Overseas territories - Malaysia, Singapore, Indonesia, the hype is phenomenal. Even in North America, the movie has decimated all previous records of Tamil heroes, and crossed Kabali premiere gross by miles. Currently, it has grossed US$2.6 Million and the hype is unreal.  Lokesh Kanagaraj's brand value has contributed immensely along with the star power of all the legends in the cast. Already, Overseas pre-sales have yielded US$8.5 Million and total Worldwide number stands at Rs.103 crores for the opening day. We have to wait and see, how high the final numbers will be after offline bookings are also revealed.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
సినిమా పరిశ్రమలో పని చేస్తున్న 24 క్రాఫ్ట్స్ కి సంబంధించిన వాళ్ళ కోసం సినీ పెద్దలు, ప్రభుత్వ అనుమతితో ఏర్పాటు చేసుకున్న నివాస సముదాయమే హైదరాబాద్ లోని ఖాజాగూడ సమీపంలో ఉన్న చిత్రపురి కాలనీ(Chithrapuri Colony).ఈ కాలనీ అభ్యున్నతి కోసం ఏర్పడిందే చిత్రపురి హౌసింగ్ సొసైటీ. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చిత్రపురిలో సుమారు 300 కోట్ల రూపాయల మేర భారీ కుంభకోణం జరిగింది. ఈ అవినీతి ఇంకా పెరిగిపోతోందని ఆరోపిస్తూ పలువురు సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) కార్యాలయం ముందు బుధవారం మహాధర్నా చేపట్టారు. .ఈ సందర్భంగా చిత్రపురి పోరాట సమితి, సీఐటీయూ నాయకులు మాట్లాడుతు నిజమైన సినిమా కార్మికులకి ఇళ్లు దక్కకుండా  ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకి అమ్ముకుంటున్నారు. వల్లభనేని అనిల్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలి. కార్మికుల కోసం కేటాయించిన స్థలంలో వారిని మోసం చేసే కుట్ర జరుగుతుంది. చిత్రపురిలో మిగిలిన 2.5 ఎకరాలలో, కార్మికులు అడుగుతున్న సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లని కాదని, 1200 నుండి 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ నిర్మాణాలు చేపట్టి, బయటి వ్యక్తులకి అమ్ముకోవడానికి కమిటీ ప్లాన్ చేసింది. ఇందుకు HMDA, CMO కార్యాలయ అధికారులతో కుమ్మక్కై అక్రమాలకి పాల్పడుతున్నారు. వల్లభనేని అనిల్ పై ఇప్పటికే 15 FIRలు, 10 ఛార్జ్‌షీట్‌లు నమోదయ్యాయి. రెండుసార్లు జైలుకు వెళ్లి వచ్చినా తన అక్రమాలు ఆపడం లేదు. తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రిట్ పిటిషన్ నెం. 18225/2021, 7642/2024, 9335/2025 ద్వారా ప్రస్తుత కమిటీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినా, అధికారులు పట్టించుకోవడం లేదు.దీనివల్లే అనిల్ కుమార్ అవినీతికి అడ్డు లేకుండా పోయింది. గత ప్రభుత్వం అవినీతిపరులను కాపాడి మూల్యం చెల్లించుకుందని, మరి ఈ ప్రభుత్వం ఎందుకు వారిని రక్షిస్తోంది. కొందరు ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఈ అవినీతిలో కూరుకుపోయారు. అందుకే ముఖ్యమంత్రి గారే స్వయంగా జోక్యం చేసుకోవాలి.  అధికారులు  కోట్ల రూపాయల ఫ్రాడ్‌లో భాగస్వామిగా ఉంటూ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తప్పుదోవ పట్టిస్తున్నారు," అని ఆరోపించారు. ప్రధాన డిమాండ్లు 20-25 ఏళ్లుగా డబ్బులు చెల్లించి ఎదురుచూస్తున్న 6,000 మంది సభ్యులకు న్యాయం చేయాలి.  కొత్తగా మరో వెయ్యి సభ్యత్వాలు ఇవ్వాలనే నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలి.  వల్లభనేని అనిల్ కుమార్ నేతృత్వంలోని ప్రస్తుత కమిటీని రద్దు చేసి, వెంటనే అడ్-హాక్ కమిటీని నియమించాలి. కొత్తగా కట్టబోయే ట్విన్ టవర్స్‌లో కేవలం సింగిల్, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు మాత్రమే నిర్మించి, అర్హులైన సినీ కార్మికులకే కేటాయించాలి. కోర్టు ఆదేశాలను అమలు చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని  ఈ ధర్నా కార్యక్రమంలో చిత్రపురి పోరాట సమితి అధ్యక్షులు కస్తూరి శ్రీనివాస్, జూనియర్ ఆర్టిస్ట్ సీఐటీయూ నాయకులు సంకూరి రవీందర్, తెలంగాణ పోరాట మేధావి నాయకులు భద్ర, నవోదయం పార్టీ అధ్యక్షులు శివశంకర్ పటేల్, ఆప్ పార్టీ నాయకురాలు హేమ సుదర్శన్, గాదం లలిత, రమేష్ వర్మ, శ్రీను, సి.హెచ్. ప్రకాష్, ఓం ప్రకాష్, గోపాల కృష్ణ, మద్దినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.    
మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)రేపు హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి 'వార్ 2'(War 2)తో థియేటర్స్ లో అడుగుపెడుతున్నాడు. పైగా ఈ చిత్రం ఎన్టీఆర్ కి బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడంతో ,బాలీవుడ్ లో కూడా ఎన్టీఆర్ సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే హృతిక్ రోషన్ పలు రకాల ఇంటర్వ్యూలతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సైతం మాట్లాడుతు 'ఎన్టీఆర్ యాక్టింగ్ నుంచి చాలా నేర్చుకున్నానని చెప్పడంతో వార్ 2 లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. వార్ 2 కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్స్ తో పాటు అదనపు షో లకి అనుమతి ఇస్తు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తు వార్ 2 కి సంబంధించిన షోస్, ధరల విషయంలో ప్రత్యేక జీవో జారీ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)గారు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan)గారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh)గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసాడు.    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో 'వార్ 2 కి రిలీజ్ రోజు ఉదయం 5 గంటల షోకి పర్మిషన్, టికెట్ ధర 500 కి మించి ఉండకూడదు. రిలీజ్ రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో జిఎస్ టి తో కలుపుకొని ప్రస్తుతం ఉన్న ధరలకి  100 రూపాయిలు, సింగిల్ స్క్రీన్స్‌లో 75 రూపాయలు అదనంగా పెంచుకోవచ్చు.  డైలీ ఐదు షో లకి మించి ప్రదర్శించకూడదని పేర్కొంది.     
రేపు ఎన్టీఆర్(Ntr),హృతిక్ రోషన్(Hrithik Roshan)వార్ 2 (War 2)తో, రజినీకాంత్(Rajinikanth),నాగార్జున(Nagarjuna)లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)'కూలీ'(Coolie)తో  థియేటర్స్ లో అడుగుపెడుతుండటంతో ఇండియా వ్యాప్తంగా సినీ ప్రియుల్లో సందడి వాతావరణం నెలకొని ఉంది. ముఖ్యంగా అభిమానుల్లో అయితే పండుగ వాతావరణం నెలకొని ఉందని చెప్పవచ్చు. రెండు చిత్రాలు కూడా భారీ కాస్టింగ్, భారీ బడ్జెట్ తో వస్తుండటంతో, ఆన్ లైన్ వేదికగా బుకింగ్స్ ఓపెన్ చెయ్యగానే విత్ ఇన్ సెకన్లలోనే  టికెట్స్ అయిపోయాయి. దీన్ని బట్టి ఆ రెండు చిత్రాలకి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు.  కూలీ రిలీజ్ సందర్భంగా తమిళనాడు(Tamilanadu)లో కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకి సెలవలు ప్రకటించాయి.  'యూనో ఆక్వా కేర్‌'(Uno Aqua Care)అనే సంస్థ ఇంకో అడుగు ముందుకేసి తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వడంతో పాటు ఉచితంగా 'కూలీ' టికెట్స్ ని కూడా అందించింది. చెన్నై తో పాటు బెంగుళూరు, తిరుచ్చి, తిరునల్వేలి, చెంగల్పట్టు, మాట్టుత్తావణి, ఆరప్పాళెయం బ్రాంచ్‌ల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Apgovt)కూలీ మొదటి రోజు ఉదయం 5 గంటల షోకి  అనుమతి ఇవ్వడంతో పాటు, సినిమా విడుదల రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో ప్రస్తుతం ఉన్న రేట్స్ కి జిఎస్ టి కలుపుకొని 100 రూపాయిలు,  సింగిల్ స్క్రీన్స్‌లో 75 రూపాయలు అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. వార్ 2 కి రిలీజ్ రోజు ఉదయం 5 గంటల షోకి పర్మిషన్ ఇస్తు,టికెట్ ధర 500 కి మించి ఉండకూడదని, రిలీజ్ రోజు నుండి పది రోజుల వరకు మల్టీప్లెక్స్‌లలో జిఎస్ టి తో  ప్రస్తుతం ఉన్న రేట్స్ కి  100 రూపాయిలు, సింగిల్ స్క్రీన్స్‌లో 75 రూపాయలు అదనంగా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. డైలీ ఐదు షో లకి మించి ప్రదర్శించకూడదని కూడా తన ఉత్తర్వులలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు.     
  నేటి డిజిటల్ యుగంలో పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచడం ప్రతి తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారింది. ఆటలు, యూట్యూబ్, సోషల్ మీడియా, ఇవన్నీ పిల్లలను ఎంతగా ఆకర్షిస్తాయంటే వారు బయటి ప్రపంచం నుండి దూరమైపోతారు. ఇది వారి చదువులను ప్రభావితం చేయడమే కాకుండా  కళ్ళకు కూడా చాలా ప్రమాదం. మరీ ముఖ్యంగా ఇలా ఫోన్ కు బానిస అయిపోవడం అనేది పిల్లల సామాజిక అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల జరుగుతున్న నష్టాలేంటి? ఫోన్ నుండి పిల్లలను దూరం ఉంచడం ఎలా? తెలుసుకుంటే.. నష్టాలు.. ఫోన్ చేతిలో ఉంటే చాలు.. పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోవడానికి ఇష్టపడరు. బదులుగా వారు ఎక్కువ సమయం మొబైల్‌లోనే గడుపుతారు. ఈ రోజుల్లో ఒక సంవత్సరం పిల్లవాడు కూడా మొబైల్‌లో వీడియోలు చూపిస్తేనే  ఆహారం తింటాడు, లేకుంటే ఏడుస్తూనే ఉంటాడు. మరోవైపు, 14 ఏళ్ల టీనేజర్ బాలుడు కూడా పాఠశాల నుండి వచ్చిన తర్వాత మొబైల్‌తో బిజీగా ఉంటాడు. ఫోన్ లో గేమ్స్.. ఆటలు,  యూట్యూబ్‌లో గంటల తరబడి గడుపుతాడు.  మొబైల్ ఫోన్ వాడటం వల్ల వారి సామాజిక, శారీరక,  మానసిక అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుంది. ఇది ఆందోళన చెందాల్సిన విషయమే అయినా..  కొన్ని చిన్న మార్పులు,  స్మార్ట్ ట్రిక్స్‌తో పిల్లలు మొబైల్‌కు బానిసల్లా మారడాన్ని  చాలా వరకు తగ్గించవచ్చు. ఇందుకోసం కింది టిప్స్ పాటించవచ్చు. స్క్రీన్ టైమ్ ఫిక్స్ చేయాలి.. మొబైల్ వ్యసనాన్ని తగ్గించడానికి, పిల్లల స్క్రీన్ టైమ్ కోసం ఒక నియమాన్ని రూపొందించాలి.  ప్రతిరోజూ మొబైల్ వాడకానికి ఒక సమయాన్ని ఫిక్స్ చేయాలి. తద్వారా పిల్లవాడు రోజంతా మొబైల్ వాడకుండా ఆ సమయానికి మాత్రమే దాన్ని ఉపయోగిస్తాడు. ఇది క్రమంగా  మొబైల్ వ్యసనం నుండి బయటపడేలా చేస్తుంది. యాక్టివిటీస్.. పెయింటింగ్, కథలు, బయటకు వెళ్లి ఆడుకోవడం, ఆర్ట్స్,క్రాప్ట్స్ ద్వారా పిల్లల దృష్టిని మొబైల్ ఫోన్ల నుండి మళ్లించవచ్చు. వారి మొబైల్ వినియోగాన్ని తగ్గించడానికి వారిని ఇంటరాక్టివ్ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. కుటుంబం.. పిల్లలలో ఉన్న మొబైల్ వ్యసనాన్ని మాన్పించడానికి పిల్లలతో ఆడుకోవాలి. వారితో మాట్లాడాలి, మొబైల్ కంటే కుటుంబంతో ఎక్కువ ఆనందం ఉందని వారికి అనిపించేలా చేయాలి. ఒక పిల్లవాడు బోర్ కొట్టినప్పుడు లేదా ఒంటరిగా అనిపించినప్పుడు, అతను మొబైల్ వాడటం ఒక వ్యసనంగా మారుతుంది. కానీ అతను తన పరిసరాలతో లేదా కుటుంబంతో ఆనందించడం ప్రారంభించినప్పుడు మొబైల్‌ను మరచిపోయి కుటుంబంతో సమయం గడుపుతాడు.  ఎంపిక.. పిల్లలు వినోదం కోసం లేదా సమయం గడపడానికి మొబైల్‌ను ఉపయోగిస్తారు. ఈ కారణాన్ని అర్థం చేసుకుని వారికి మొబైల్‌కు ఇతర ప్రత్యామ్నాయాలను అందించాలి. ఉదాహరణకు.. పజిల్స్, బోర్డ్ గేమ్‌లు, పుస్తకాలు,  పిల్లల కోసం సంగీతం వంటి ఎంపికలను ఉండేలా చూడాలి. ఇది పిల్లలలో ఉత్సుకతను రేకెత్తిస్తుంది,  మొబైల్ వ్యసనాన్ని తగ్గిస్తుంది. రోల్ మోడల్స్.. పిల్లలు తాము చూసేది నేర్చుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు  రోజంతా మొబైల్‌లో గడుపుతూ ఉంటే  పిల్లలు కూడా అలాగే చేస్తారు. కాబట్టి  మొబైల్ వాడకాన్ని  పరిమితం చేసుకోవాలి. తల్లిదండ్రుల దినచర్య, తల్లిదండ్రులు చేసే పనుల దృష్ట్యా పిల్లలు కూడా చక్కని దినచర్య అలవర్చుకుంటారు.  పిల్లలకు తల్లిదండ్రులే మంచి రోల్ మోడల్స్ కావాలి.                                       *రూపశ్రీ.
ప్రతి సంవత్సరం ఆగస్టు 12న భారతదేశంలో గ్రంథాలయ దినోత్సవం (National Librarians’ Day)ని ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజును "భారత పబ్లిక్ లైబ్రరీ ఉద్యమ పితామహుడు"గా పేరుపొందిన డా. ఎస్.ఆర్. రంగనాథన్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటారు. అసలు రంగనాథన్ గారు ఎవరు? అయన జయంతినీ లైబ్రరీ దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? అయన గ్రంథాలయాల గురించి చేసిన కృషి ఏమిటి? తెలుసుకుంటే.. డా. ఎస్.ఆర్. రంగనాథన్ ఎవరు? రంగనాథన్ గారి పూర్తిపేరు శియాలి రామం రంగా నాథన్ ఈయన ఆగస్టు 12, 1892,  తమిళనాడులో జన్మించారు. ఈయన గణిత శాస్త్రవేత్త, పుస్తక శాస్త్రవేత్త, భారత పబ్లిక్ లైబ్రరీ వ్యవస్థకు పునాది వేసిన మహనీయుడు. "Library Science"లో ఆధునిక సూత్రాలను ప్రతిపాదించి, భారతదేశంలో పుస్తకాలను, గ్రంథాలయాలను సమాజానికి చేరువ చేశాడు. ఆయన రూపొందించిన ‘పంచ సూత్రాలు’ ఈ రోజు కూడా ప్రపంచవ్యాప్తంగా లైబ్రరీ రంగానికి మార్గదర్శకాలుగా ఉన్నాయి.  పంచ సూత్రాలు..  రంగనాథన్ గారు రూపొందించిన పంచ సూత్రాలు ఇవే.. 1 . Books are for use – పుస్తకాలు వినియోగం కోసం. 2 .Every reader his/her book – ప్రతి పాఠకుడికి తన పుస్తకం. 3. Every book its reader – ప్రతి పుస్తకానికి తన పాఠకుడు. 4. Save the time of the reader – పాఠకుడి సమయాన్ని ఆదా చేయాలి. 5. The library is a growing organism – గ్రంథాలయం ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందే జీవంతమైన వ్యవస్థ. ఎందుకు జరుపుకుంటారు? డా. రంగనాథన్ గారు గ్రంథాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అయన  కృషిని స్మరించుకోవడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.  పుస్తకాల ప్రాముఖ్యతను, లైబ్రరీల అవసరాన్ని ప్రజల్లో మళ్లీ గుర్తు చేయడం కూడా ఈ రోజు ముఖ్య ఉద్దేశమే.  డిజిటల్ యుగంలో కూడా గ్రంథాలయాల విలువను ప్రోత్సహించడం. దాన్ని గుర్తించడం కోసం ఈరోజు ఎంతో సహాయపడుతుంది.  పాఠకులు, విద్యార్థులు, పరిశోధకులు లైబ్రరీలను ఎక్కువగా వినియోగించేలా ప్రేరేపించడం వల్ల లైబ్రరీలు ఆదరణ పెరుగుతోంది, పుస్తక పఠనం మెరుగవుతుంది. అన్నిటి కంటే ముఖ్యంగా జ్ఞానార్జన పెరుగుతుంది.  ఈ రోజున జరిగే కార్యక్రమాలు పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పుస్తక ప్రదర్శనలు జరుగుతాయి. ఇది పుస్తకాల నిలయమైన లైబ్రరీల ఆదరణకు పునాది అవుతుంది.  గ్రంథాలయాల పర్యటనలు చేయడం కూడా ఇందులో భాగంగా. దేశంలో ఎన్నో గొప్ప గ్రంధాలయాలు ఉన్నాయి. లక్షలాది పుస్తకాలను తమలో నిక్షిప్తం చేసుకుని జ్ఞాన బాండాగారాలుగా నిలుస్తున్నాయి.  పఠన పోటీలు, సాహిత్య చర్చలు చేయడం ద్వారా పుస్తకాలను, వాటిని భద్రపరిచే గ్రంథాలయాల అవశ్యకతను కూడా తెలుసుకోవచ్చు  పుస్తక దానం కార్యక్రమాలు చేయడం వల్ల పుస్తక సంపద పెరుగుతుంది. కొన్ని ప్రైవేట్ గ్రంధాలయాలు కు పుస్తకాలను విరాళాలు గా ఇవ్వడం వల్ల వాటిని అభివృద్ధి చేసిన వాళ్ళు అవుతాం.  లైబ్రేరియన్లను ఈ సందర్భంగా సన్మానించవచ్చు. లైబ్రరీకి వచ్చిన ప్రతి వ్యక్తికి అవసరమైన పుస్తకాలను ఇస్తూ లైబ్రరీని నడిపే వారి కృషి గుర్తించాలి.  గ్రంథాలయాల ప్రాముఖ్యత గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాల గది కాదు అది ఒక జ్ఞానాలయం. పాఠకుడికి చదవడానికి వేదిక అవుతుంది.  పరిశోధనలుంచేసేవారికి మంచి సమాచారం అందిస్తుంది.  విద్యార్తులలో ప్రేరణను నింపేవి గ్రంధాలయాలు. ఎంపిక చేసుకుని చదివితే గొప్ప పుస్తకాలు అక్కడ విద్యార్థులను గొప్ప వాళ్ళుగా మారుస్తాయి.  సమాజానికి అభివృద్ధి మార్గం పుస్తక పఠనం వల్ల జరుగుతుంది.  "గ్రంథాలయం అనేది నిశ్శబ్దంలో జ్ఞాన విప్లవం జరిగే స్థలం" అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.                     *రూపశ్రీ.
  వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య బంధం. కొత్త సంబంధాలకు సర్దుబాటు కావడానికి సమయం పడుతుందనేది అంగీకరించాల్సిన వాస్తవం. సాధారణంగా తల్లిదండ్రులు తమ కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు  ఆమె అత్తమామల ఇంట్లో ఎలా ఉండాలో.. మంచి భార్యగా,  కోడలుగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెబుతారు. అలాగే అత్తారింట్లో పనులన్నీ ఎలా చేయాలో కూడా నేర్పించి మరీ పంపుతారు. కానీ వివాహం తర్వాత మంచి భర్తగా,  అల్లుడిగా ఎలా ఉండాలో అబ్బాయిలకు నేర్పించే తల్లిదండ్రులు బహుశా చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. పెళ్లి తర్వాత అమ్మాయిలు మానసికంగా,  ఆచరణాత్మకంగా తమ అత్తమామల ఇంట్లో సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అబ్బాయిలు ఈ పరిస్థితికి సిద్ధంగా ఉండరు.  అయితే పెళ్లికి ముందు కూతుళ్లకు ఎన్నో విషయాలు నేర్పించే తల్లిదండ్రులు,  పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి అనే విషయం గురించి కొడుకుకు కూడా కొన్ని నేర్పించాల్సి ఉంటుంది.  ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత  అబ్బాయి మంచి భర్తగా మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన  అల్లుడుగా కూడా మారతాడు. అర్థం చేసుకునే కొడుకు మాత్రమే రెండు కుటుంబాలను కలిపి ఉంచగలడుయ  కోడలికి తన అత్తమామల ఇల్లు తన  'ఇల్లు' అని అనిపించేలా చేయగలడు. ఇందుకోసం పెళ్లికి ముందు కొడుకులకు తల్లిదండ్రులు ఏం చెప్పాలో.. ఏం నేర్పించాలో తెలుసుకుంటే.. సమానత్వం.. వివాహం తర్వాత భార్య తన బాధ్యత మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామి కూడా అని  కొడుకుకు చెప్పాలి. ఇంటి ప్రతి నిర్ణయంలో ఆమెను అభిప్రాయం తీసుకోవాలని చెప్పాలి.  భార్య భావాలను,  అభిప్రాయాలను గౌరవించడం, కోడలు ఆ ఇంట్లో గెస్ట్ లేదా పని మనిషి లాంటిది కాదని  ఇంట్లో ఆమెకు శాశ్వత స్థానం ఉంటుందని చెప్పాలి. సమతుల్యత.. వివాహం తర్వాత కొడుకు తరచుగా తన తల్లి,  భార్య మధ్య చిక్కుకుపోతాడు. సంబంధాలలో సామరస్యం ముఖ్యమని, పోలిక కాదని కొడుకులకు  వివరించి చెప్పాలి. కొడుకు సమతుల్యతను కాపాడుకుంటే కోడలికి ఇంట్లో ఎటువంటి సమస్య ఉండదు.  లేదా తల్లికి ఎటువంటి ఫిర్యాదు ఉండదు. అతని భార్య,  తల్లి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే ఇద్దరి మధ్య తేడాలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.  అంతే తప్ప ఒకరికే సపోర్ట్ చేస్తూ ఏకపక్షంగా ఉండకూడదు.   సహాయం.. ఇంటి పనులు కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదని పెళ్లికి ముందు  కొడుకుకు వివరించాలి. కొన్నిసార్లు  భార్యకు చిన్న విషయాలలో సహాయం చేయడం,  ఆమెను మానసికంగా  మరియు ాలా ఊరట ఇస్తుంది. భార్యతో సంబంధాన్ని బలపరుస్తుంది.  కూతుళ్ల లాగే  కొడుకు కూడా ఇంటి పనులలో సహాయం చేయమని చెప్పాలి. తద్వారా అతను తన భార్యకు సహాయం చేయడంలో సిగ్గుపడడు,  అతను ఇంటి పనులపై అవగాహన పెంచుకుంటాడు. అత్తవారిల్లు.. పెళ్లి తర్వాత కోడలు తన అత్తామామలను తన తల్లిదండ్రులుగా భావించి కుటుంబంలో కలిసిపోవాలంటే..  తన భార్య తల్లిదండ్రులను గౌరవించడం కూడా అంతే బాధ్యత అని  కొడుకుకు చెప్పాలి. కోడలు తల్లిదండ్రులను, ఆమె కుటుంబాన్ని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించాలి. ఇలా ఉంటే కోడలు కూడా తన అత్తామామలను తన తల్లిదండ్రుల లాగే చూసుకోవడం జరుగుతుంది.   రెండు కుటుంబాలను ఏకం చేయడం కొడుకు బాధ్యత కూడా. ప్రైవసీ.. భార్యాభర్తల మధ్య విషయాలు వ్యక్తిగతమైనవి. చిన్న చిన్న విషయాలను బయట పంచుకోవడం లేదా తల్లిదండ్రులతో ప్రతిదీ పంచుకోవడం,  అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములతో ప్రతీది చెప్పడం  వల్ల అపార్థాలు వస్తాయని  కొడుకుకు నేర్పాలి. మంచి భర్త లక్షణం ఏమిటంటే అతను తన సంబంధం  గౌరవాన్ని కాపాడుకోవడం. అతను ఆ గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తే భార్య కూడా అతనికి సహకారంగా వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకుండా ఉంటుంది.                           *రూపశ్రీ.
  భారతీయులు  ఆహార ప్రియులు. భారతదేశంలో ఉండే అన్ని వంటకాలు, అన్ని పదార్థాలు మరెక్కడా లభించవని కూడా చెప్పవచ్చు. అయితే భారతదేశంలో ఎక్కువ భాగం ఆహారం నూనె వినియోగం తోనే జరుగుతుంది. నూనె లేకుండా చాలా వంటకాలను అస్సలు తయారు చేయలేరు కూడా.  నూనె భారతీయ  వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. కానీ నూనెను ఎక్కువగా ఉపయోగిస్తే అది ఆరోగ్యానికి విషంగా మారుతుంది. ఆహారంలో ఎక్కువ నూనెను ఉపయోగిస్తే అది ఊబకాయం, గుండె జబ్బులు,  అనేక ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. నూనెలో ఉండే అధిక కేలరీలు శరీరానికి  అనేక విధాలుగా హాని కలిగిస్తాయి. అందుకే ఇప్పుడు  నూనె లేని ఆహారం అనే ట్రెండ్‌ని  చాలామంది అనుసరిస్తున్నారు. ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  అసలు నో ఆయిల్ డైట్ అంటే ఏమిటి? దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుంటే.. నూనె లేని ఆహారం అంటే.. నో ఆయిల్ డైట్‌లో ఆహారంలో  నూనె పూర్తిగా తొలగించబడుతుంది. బదులుగా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, డ్రై ఫ్రూట్స్,  విత్తనాలు వంటి తృణధాన్యాలు  సహజమైనవిగా  తింటారు. వీటిలో ఇప్పటికే కొంత సహజ కొవ్వు ఉంటుంది. అది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. నూనె లేని ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు.. ఆహారం నుండి నూనెను పూర్తిగా తొలగించినప్పుడు బరువు తగ్గడం సులభం అవుతుంది. ఉడికించిన పప్పులు, కాల్చిన కూరగాయలు,  నూనె లేకుండా చేసిన వాటిని ఆహారంలో చేర్చడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుంది. శుద్ధి చేసిన నూనెలో ఒమేగా-6 కొవ్వులు అధికంగా ఉంటాయి.  దీన్ని  ఆహారం నుండి తొలగిస్తే, శరీరంలో మంట తగ్గుతుంది,  కొలెస్ట్రాల్,  రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నూనె లేని ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇది కడుపు, కాలేయం,  క్లోమంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది గ్యాస్, ఆమ్లతత్వం,  అపానవాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం ఇస్తుంది. ఆహారంలో నూనె వాడకపోవడం ద్వారా ముఖంపై మొటిమలు,  మచ్చలు తగ్గుతాయి. దీనితో పాటు శరీరం కూడా డీటాక్స్ అవుతుంది. ఇది ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది. నూనె పదార్థాలు తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.  ఇది తరచుగా ఆకలి, మానసిక స్థితిలో మార్పులు,  అతిగా తినే అలవాటును తగ్గిస్తుంది.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
   నేటి బిజీ జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. ఆహారపు అలవాట్లు,  అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా  ఊబకాయం సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనితో పాటు మధుమేహం,  గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతోంది. మధుమేహం గురించి చెప్పాలంటే నేటి కాలంలో ఇది ఒక సాధారణ వ్యాధిగా మారింది. గతంలో ఈ వ్యాధి వృద్ధులలో కనిపించేది, కానీ ఇప్పుడు మధుమేహం చిన్నవారిని కూడా ప్రభావితం చేస్తోంది. సాధారణంగా చాలామందికి టైప్ 1, 2,  3 డయాబెటిస్ గురించి మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు టైప్ 5 డయాబెటిస్ కూడా  పెద్ద ముప్పుగా మారింది.  అధిక శాతం మందికి అసలు ఇన్ని టైప్ ల డయాబెటిస్ ఉంటుందని కూడా తెలియదు. అయితే టైప్-5 డయాబెటిస్ ఇతర రకాల డయాబెటిస్ కంటే చాలా ప్రమాదకరమైనది అంటున్నారు వైద్యులు. ఇతర రకాల డయాబెటిస్ లాగానే టైప్ 5 డయాబెటిస్ రాకముందే  శరీరంలో అనేక లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.  ఈ లక్షణాలను గుర్తించినట్టైతే సకాలంలో చికిత్స పొందవచ్చు.  ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. టైప్-5 డయాబెటిస్ అంటే ఏమిటి?  బాల్యంలో పోషకాహారం లేకపోవడం వల్ల క్లోమం సరిగ్గా అభివృద్ధి చెందనప్పుడు టైప్ 5 డయాబెటిస్ వస్తుంది. దీని కారణంగా శరీరం తగినంత మొత్తంలో ఇన్సులిన్ (హార్మోన్) ఉత్పత్తి చేయలేకపోతుంది. దీనిని పోషకాహార లోపానికి సంబంధించిన డయాబెటిస్ మెల్లిటస్ (MRDM) అని కూడా అంటారు. ఇన్సులిన్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.  అంటే డయాబెటిస్ వస్తుంది. 30 ఏళ్లలోపు వారికి ఎక్కువ ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సాధారణంగా 30 ఏళ్లలోపు వారిలో కనిపిస్తుంది. 2025 సంవత్సరంలో అంతర్జాతీయ డయాబెటిస్ సమాఖ్య దీనిని టైప్ 5  డయాబెటిస్‌గా అధికారికంగా ప్రకటించింది . ప్రపంచవ్యాప్తంగా 2 నుండి 2.5 కోట్ల మంది దీని బారిన పడవచ్చని అంచనా. పోషకాహార లోపం సాధారణంగా ఉన్న ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఆసియా,  ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో  వంటి దేశాలలో ఇది రావచ్చు.  దీనికి ఇంకా చికిత్స కనుగొనబడలేదు. టైప్ 5 డయాబెటిస్ లక్షణాలు? ఎక్కువ దాహం వేస్తున్నట్లు అనిపిస్తుంది తరచుగా మూత్రవిసర్జన తలనొప్పి మసక దృష్టి అలసిపోయినట్లు అనిపిస్తుంది  గాయం నెమ్మదిగా నయం కావడం. బరువు తగ్గడం  ఎముక పెరుగుదల నెమ్మదిగా ఉండటం లాలాజల గ్రంథుల విస్తరణ చర్మం,  జుట్టులో మార్పులు. టైప్ 5 డయాబెటిస్ రావడానికి కారణాలు ఏమిటి? బాల్యంలో లేదా గర్భధారణ సమయంలో ఎక్కువ కాలం పోషకాహారం లేకపోవడం వల్ల క్లోమం పూర్తిగా అభివృద్ధి చెందలేకపోతుందని వైద్యులు ఊహిస్తున్నారు. పోషకాలు లేకపోవడం శరీరంలోని అనేక భాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇందులో క్లోమం కూడా ఉంటుంది.  రక్తంలో చక్కెరను అదుపులో  ఉంచడానికి అవసరమైన ఇన్సులిన్‌ను క్లోమం ఉత్పత్తి చేస్తుంది. టైప్ 5 డయాబెటిస్‌కు ప్రమాద కారకాలు? గుండె జబ్బులు మూత్రపిండాల నష్టం కంటి (రెటీనా) సమస్యలు నరాలకు నష్టం.                              *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  
  శరీరాన్ని శుద్ది చేసే పానీయాలను డీటాక్స్ జ్యూసులు అని అంటుంటారు. ఈ  డీటాక్స్ జ్యూస్లు లేదా పానీయాలు ఫ్యాటీ లివర్ వ్యాధి లేదా దీర్ఘకాలిక కాలేయ వ్యాధి వంటి తీవ్రమైన కాలేయ సమస్యలను నయం చేయగలవని నమ్ముతారు.  ఈ కారణంగానే డిటాక్స్ పానీయాలకు చాలా ఆదరణ ఉంది. కొందరైతే రోజు మొత్తం డిటాక్స్ నీటినే తాగుతూ ఉంటారు.  సుమారు ఒకటి నుండి రెండు లీటర్ల డీటాక్స్ నీటిని లేదా పానీయాలను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం, శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గడం వంటివి జరుగుతాయని నమ్ముతారు. కానీ ఈ డిటాక్స్ జ్యూసుల గురించి దిమ్మతిరిగే నిజాలను వెలిబుచ్చుతున్నారు వైద్యులు.  దీని గురించి తెలుసుకుంటే.. డిటాక్స్ జ్యూస్లు  కాలేయ సంబంధిత సమస్యలను తొలగించడంలో లేదా నయం చేయడంలో పెద్దగా సహాయపడవట. బయట అమ్మే డిటాక్స్ జ్యూస్లు లేదా హెర్బల్ డ్రింక్స్  తయారీలో ఉపయోగించే పదార్థాలు,  వాటి కూర్పు గురించి స్పష్టమైన సమాచారం ఉండదు. ఈ ద్రవాలలో కాలేయానికి హానికరమైన భారీ లోహాలు లేదా ఇతర పదార్థాలు ఉండవచ్చు. అందువల్ల వీటిని తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే కాలేయానికి ఎక్కువ హాని కలిగే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. డీటాక్స్ పానీయాలు కొవ్వు కాలేయ సమస్యలను పెంచుతాయి.. నిజానికి ఈ జ్యూస్లను తీసుకోవడం వల్ల ఇప్పటికే ఉన్న కాలేయ సమస్య మరింత దిగజారిపోతుందట. ఫ్యాటీ లివర్ వ్యాధి నుండి క్రానిక్ లివర్ డిసీజ్,  క్రానిక్ లివర్ డిసీజ్ నుండి ఎండ్-స్టేజ్ లివర్ డిసీజ్ మారవచ్చట. కాబట్టి ఈ జ్యూస్లను తీసుకోకుండా ఉండటం మంచిది. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏం తినాలి.. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి లేదా కాలేయ సమస్యలను నయం చేయడానికి  డీటాక్స్ జ్యూస్లను ఆశ్రయించే బదులు, ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను అనుసరించడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. ఆరోగ్యకరమైన, పోషకమైన, సమతుల్య ఆహారం తీసుకోవడం. ప్రాసెస్ చేసిన,  కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడాన్ని నివారించడం, తరచుగా బయట తినడాన్ని నిషేధించడం చేయాలి.  వీటికి బదులు  ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన భోజనాన్ని ఎంచుకోవాలి. రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసం మానేయాలి.  లేదా వీటిని  పరిమితం చేయాలి.  మాంసాహారం తినాలని ఉంటే   లీన్ మాంసాలను ఎంచుకోవడం ఉత్తమమట. ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి.. ధూమపానం,  అధికంగా  మద్యం సేవించడం వంటి అలవాట్లను నివారించడం కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కాలేయాన్ని రక్షించడంలో చాలా సహాయపడుతుంది. దీనితో పాటు కాలేయ ఆరోగ్యానికి హాని కలిగించే మధుమేహం,  కొలెస్ట్రాల్ వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం కూడా చాలా ముఖ్యం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు, శారీరక వ్యాయామం,  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం ఈ ప్రమాద కారకాలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి.  కాలేయానికి నిజమైన 'డిటాక్స్' అంటే శుభ్రమైన,  పోషకమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి, సకాలంలో వైద్య సలహా.  రోజువారీ ఎంపికలలో చిన్న మార్పులు కూడా దీర్ఘకాలంలో  కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చాలా సహాయపడతాయి. కాలేయ ఆరోగ్యం కోసం డీటాక్స్ జ్యూస్లపై ఆధారపడటానికి బదులుగా, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం మరింత ప్రభావవంతమైన,  సురక్షితమైన విధానం.                               *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...