రెడ్ ఫ్లాగ్స్..  రిలేషన్‌లో ఇవి కనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం..!

posted on: Mar 6, 2026 2:27PM


ప్రతి సంబంధం నమ్మకం, గౌరవం,  అవగాహనపై ఆధారపడి బిల్డ్ అవుతుంది. కానీ కొన్నిసార్లు, ప్రేమ పేరుతో మొదలై ఆ తరువాత తీవ్రమైన సమస్యలుగా మారే పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలాంటి పరిస్థితులు ప్రతి సంబందంలో అక్కడక్కడా కనిపిస్తుంటాయి.  వీటిని రిలేషన్ లో రెడ్ ప్లాగ్స్ అని చెప్పవచ్చు. వీటిని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది.  ఇలాంటివి ఉన్నప్పుడు వాటి గురించి నిర్లక్ష్యం చేయడం లేదా, పట్టించుకోకుండా ఉండటం వంటివి జరిగితే.. చాలా నష్టపోతారు.  అందుకే ఈ పరిస్థితులు ఉన్నవారు రిలేషన్లో ఉన్నవారితో ఓపెన్ గా మాట్లాడాలి.  సమస్యను పరిష్కరించుకోవాలి.  అయితే రిలేషన్ ను దెబ్బతీసే ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏంటో తెలుసుకుంటే..

అధిక నియంత్రణ..

రిలేషన్ లో భాగస్వామి మీ ప్రతి కదలికను పర్యవేక్షిస్తే, స్నేహితులను కలవకుండా నిరోధిస్తే లేదా ప్రతి నిర్ణయంలో జోక్యం చేసుకుంటే, అది ఆరోగ్యకరమైన సంబంధం కాదు.

పదే పదే అబద్ధం చెప్పడం..

చిన్న చిన్న అబద్ధాలు కూడా సంబంధానికి పునాదిని బలహీనపరుస్తాయి. పదే పదే అబద్దాలు చెప్పడం,  అది బయటకు స్పష్టంగా కనిపిస్తున్నా తనకేమీ సంబందం లేదన్నట్టు ఉండటం రిలేషన్ ను దెబ్బతీస్తుంది.

కోపంతో అవమానించడం..

వాదన సమయంలో వ్యక్తిగత దాడులు, ఆధిపత్యం చూపించడం లేదా అవమానం చేయడం వంటివి చేస్తే అది భాగస్వామి వ్యక్తిత్వం సరిగా లేదని చెబుతుంది.

గ్యాస్‌లైటింగ్

మీ భాగస్వామి మీ భావాలను తప్పుగా నిరూపించడానికి ప్రయత్నించి మిమ్మల్ని నిందించినప్పుడు. ఎలాంటి సమస్య, లేదా తప్పు లేకపోయినా తప్పును క్రియేట్ చేసి నిందించాలని,  తప్పుగా నిరూపించాలని చూస్తే ఆ భాగస్వామి సరైన వారు కాదని అర్థం.


నమ్మకం లేకపోవడం

సంబంధంలో నమ్మకం చాలా అవసరం. ఎప్పుడూ  సందేహంగా, అనుమానంగా  ఉండటం వల్ల సంబంధం నెమ్మదిగా నాశనం అవుతుంది.


భావోద్వేగ మద్దతు లేకపోవడం..

కష్ట సమయాల్లో ఒకరికొకరు మద్దతు ఇవ్వకపోతే, ఆ సంబంధం అసంపూర్ణంగా ఉంటుంది. భావోద్వేగ మద్దతు లోపించినప్పుడు ఆ బంధాన్ని అర్థమే ఉండదు.

భవిష్యత్తు  గురించి ఆలోచన లేకపోవడం..

భవిష్యత్తు గురించి ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. ముఖ్యంగా వివాహం తర్వాత ఈ ఆలోచన మరింత ఎక్కువగా ఉంటుంది.  కానీ చాలామందికి భవిష్యత్తు గురించి కానీ,  వర్తమానం గురించి కానీ ఎలాంటి ఆలోచన,  ఎలాంటి చింత ఉండదు.  పూర్తీగా నిర్గక్ష్యంగా ఉంటారు.  ఇలాంటి వారితో జీవితం ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వదు.

                                      *రూపశ్రీ.

google-ad-img
    Related Sigment News
    • Loading...