
నిన్న థియేటర్స్ లో మరో మారు సినీ సందడి
నాలుగు చిత్రాలకి టాక్ పర్లేదు
మరి కలెక్షన్స్ ఎంత!
సిటీకి ఎంతో మంది పోలీస్ కమిషనర్లు వస్తుంటారు, పోతుంటారు. కానీ చంటి గాడు లోకల్ అనే సినీ డైలాగ్ ఎంత ఫేమస్సో తెలిసిందే. అదే రీతిలో ప్రతి సంవత్సరం ఎన్నో పండగలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ సినీ పండగ మాత్రం ప్రతి శుక్రవారం ఉంటుందన్నట్టుగా నిన్న మృత్యుంజయ్(Mrithyunjay),ఎస్. సరస్వతి(S Saraswathi),మెన్షన్ హౌస్ మల్లేష్(Mension House mallesh),సాంప్రదాయినీ, సుప్పిని, సుద్దపూసిని(sampradayini suppini suddaposani)చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఈ చిత్రాలు తొలి రోజు ఏ మేర కలెక్షన్స్ సాధించాయో చూద్దాం.
మృత్యుంజయ్ చూసుకుంటే కోటి రూపాయల నెట్ కలెక్షన్స్ ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. శ్రీ విష్ణు(Sreevishnu)నుంచి గత వారమే వచ్చిన మరో మూవీ విష్ణు విన్యాసం తొలి రోజు రెండు కోట్ల నెట్ ని సాధించింది. శివాజీ, లయల సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసిని తొలి రోజు 0 .20 కోట్ల నెట్ కలెక్షన్స్ ని రాబట్టినట్టుగా టాక్. మెన్షన్ హౌస్ మల్లేష్ 0 .65 కోట్ల గ్రాస్ అని చెప్తున్నారు. సరస్వతి కలెక్షన్స్ వివరాలు రాలేదు. ద్వీబాషా చిత్రం కావడమే ఇందుకు కారణం.
also read: s.saraswathi: వైరల్ గా నిలిచిన సరస్వతి.. ఆ లెజండ్రీ కథతో తెరకెక్కిందా!
ఇక ఈ నాలుగు చిత్రాలు దేనికవే డిఫరెంట్ సబ్జెట్స్ తో తెరకెక్కడం జరిగింది. టాక్ కూడా అన్నిటికి పర్వాలేదనే స్థాయిలో వస్తుండంతో పాటు మీ అభిమాన నటులు తమ పెర్ ఫార్మెన్స్ తో కనువిందు చేస్తున్నారు. థియేటర్ కి వెళ్లి చూసి ఆనందించండి. ఈ నాలుగు చిత్రాల రివ్యూస్ మా తెలుగు వన్ సినిమా సైట్ లో ఉంచడం జరిగింది.







