Home

»

Latest News

ఎన్టీఆర్ నేషనల్ అవార్డు.. గద్దర్ అవార్డుల్లో చిరంజీవికి దక్కిన అరుదైన గౌరవం

Mar 07, 2026

టాలీవుడ్‌కి ఎంత మంది హీరోలు వచ్చినా మెగాస్టార్ చిరంజీవి స్థానం మాత్రం ఎంతో ప్రత్యేకం. దాదాపు 5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో చిరంజీవి సాధించిన విజయాలు ఎన్నో. ప్రేక్షకుల అభిమానం అంతకు మించి ఉంటుంది. తన కెరీర్‌లో అన్నిరకాల పాత్రలు పోషించి ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. 

తాజాగా ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు మెగాస్టార్ ఖాతాలోకి వచ్చి చేరింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గద్దర్ అవార్డ్స2025లో భాగంగా మెగాస్టార్‌కు ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డు ప్రదానం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భారతీయ సినీ రంగానికి ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని ప్రకటించడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. మెగాస్టార్ ఎంతో మంది యువ హీరోలకు స్ఫూర్తిగా నిలిచి కొత్త హీరోలు ఇండస్ట్రీకి రావడానికి కారణమయ్యారు. 1978లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన మెగాస్టార్ నటుడిగానే కాదు, సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పేరు మీద అవార్డులను ప్రవేశపెట్టడం ద్వారా ఆయన్ని గుర్తు చేసుకుంటూ కళాకారులను ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును కూడా ప్రకటిస్తూ చిరంజీవిని ఆ అవార్డుకు ఎంపిక చేయడం అందరికీ సంతోషాన్ని కలిగించే విషయం. చిరంజీవికి ఈ అవార్డు దక్కడంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పటికే చిరంజీవికి ఎన్నో అవార్డులు లభించాయి. ఇప్ప్పుడు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు ఆయన ఖాతాలో చేరింది. 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com