LATEST NEWS
ఓటర్లు పోలింగ్ సందర్భంగా వైసీపీ నాయకులకు ఆల్రెడీ గుణపాఠాలు చెప్పేశారు. అయినా సరే, కౌంటింగ్ సందర్భంగా కుట్రలు చేసి పైచేయి సాధించాలని వైసీపీ నాయకులు ఆలోచిస్తు్న్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో రెచ్చిపొమ్మంటూ సజ్జల కార్యకర్తలకు చెబుతున్నారు. మాదే గెలుపు అంటూ వైసీపీ నాయకులు కోటలు దాటే మాటలు చెబుతున్నప్పటికీ, వీళ్ళ ఓటమికి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎప్పుడో బాటలు వేసేశారు.
అనారోగ్యంతో మంచాన పడిన కొడాలి నానికి ఏమీ కాకూడదని, అతను కోలుకోవాలని రాష్ట్ర వ్యా్ప్తంగా టీడీపీ శ్రేణులు భగవంతుణ్ణి కోరుకున్నాయి. ఎందుకంటే, పొరపాటున కొడాలి నానికి ఏమైనా అయితే, అతను చేసిన తప్పుల నుంచి శిక్ష అనుభవించకుండా తప్పించుకుంటాడు. అందుకే అతనికేమీ కాకూడదని రాష్ట్రమంతటా ప్రార్థనలే ప్రార్థనలు. ఆ ప్రార్థనలు ఫలించాయి. కొడాలి నాని కోలుకున్నాడు. జూన్ 4న ఓటమిని చవిచూడటానికి సిద్ధంగా వున్నాడు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చాడు. ఇక్కడకి నోటి దురద సమ్రాట్ వల్లభనేని వంశీ కూడా వచ్చాడు. ఈ ఇద్దరూ దండుపాళ్యం బ్యాచ్ మెంబర్లు పక్కపక్కనే కూర్చున్నారు. వల్లభనేని వంశీ కుమార్తె అరంగేట్రం సందర్భంగా ఈ ఇద్దరూ ఇక్కడ కలిశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికే వల్లభనేని అమెరికా నుంచి వచ్చాడు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ అమెరికా పారిపోతాడని సమాచారం. కౌంటింగ్ సందర్భంగా కూడా ఆయన రాష్ట్రంలో ఉండే అవకాశం లేదని ప్రస్తుతానికి ఉన్న సమాచారం. ఈ ఫొటోలో వున్న నాని సర్వీసు మొత్తం అయిపోయినట్టుగా ఫేస్ పెట్టుకుని వుంటే, వల్లభనేని వంశీ... నా బతుకు ఇలా అయిపోయిందేంటి దేవుడా అన్నట్టుగా ముఖం పెట్టుకుని వున్నాడు. 
వైసీపీ నాయకులలో ఓటమి భయం అలా ఇలా లేదు.. పోలింగ్ సందర్భంలోనే ఓడిపోతామని క్లారిటీ వచ్చేసినా, కౌంటింగ్ సందర్భంగా ఏదైనా జిమ్మిక్కులు చేస్తే గెలుస్తామని ప్రయత్నాలు ప్రారంభించారు. కౌంటింగ్ సందర్భంగా కార్యకర్తలు ఎలా రెచ్చిపోవాలో వైసీపీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి బోధిస్తున్నారు. కౌంటింగ్ సందర్భంగా నో రూల్స్.. రెచ్చిపోండి అని ఆయన కార్యకర్తలను రెచ్చగొట్టారు. కౌంటింగ్ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహం గురించి ఆయన కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘నో రూల్స్.. కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లు తిరగబడండి. ఈసీని కూడా లెక్కచేయాల్సిన అవసరం లేదు. తిరగబడే ధైర్యం వున్న ఏజెంట్లనే సెలెక్ట్ చేయండి. ఈసీ చెప్పే రూల్స్.కి తలాడించే ఏజెంట్లను పెట్టొద్దు. తిరగబడి గొడవచేసే గట్టి ఏజెంట్లను కౌంటింగ్ సెంటర్లలో నియమించాలి. తెలుగుదేశం, జనసేన ఏజెంట్లను ఎదిరించేలా వైసీపీ ఏజెంట్లు ఉండాలి. ఆ పార్టీలను అసలు లెక్క చేయాల్సిన అవసరమే లేదు. కౌంటింగ్ సెంటర్లలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం.  మీ వెంట మేమున్నాం’’ అని సజ్జల పోలింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టారు. ఇలా రెచ్చగొడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మీద ఈడీ ఉచ్చు బిగుస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌ను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. జూన్ 3న ఈ ఛార్జిషీట్‌పై కోర్టు విచారణ జరపనుంది. ఆ రోజున ఈ ఛార్జిషీట్ నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో కవితను జూన్ 3న ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. గోవా ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రచారం చేసిన దామోదర శర్మ, ప్రిన్స్ కుమార్, చన్ ప్రీత్ సింగ్, అరవింద్ సింగ్‌లను చార్జిషీట్‌లో ప్రస్తావించారు. ఈ అనుబంధ ఛార్జిషీట్‌లో అన్ని వివరాలు వెల్లడించారు. మద్యం పాలసీ కేసులో డబ్బు గోవాకు ఎలా చేరిందో ఇందులో ఈడీ పేర్కొంది
హిందుత్వ వాదాన్ని బలపరిచే గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఐసిస్ తీవ్రవాదుల నుంచి మళ్లీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ధృవీకరించారు.   తనకు వివిధ ఫోన్ నెంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని... తనను చంపుతామంటూ బెదిరిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తనకు ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదన్నారు.ఈ బెదిరింపులపై గతంలోనూ తాను ఫిర్యాదు చేశానని... కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తనకు వచ్చిన బెదిరింపులపై పోలీసులకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు.తనకు వచ్చిన బెదిరింపులకు సంబంధించిన ఫోన్ నెంబర్లను రాజాసింగ్ ట్వీట్‌లో వెల్లడించారు. ప్రధాని మోదీ, పీఎంవో ఇండియా, అమిత్ షా, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ సీఎంవోలను ఆయన ట్యాగ్ చేశారు.
ALSO ON TELUGUONE N E W S
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన 109వ సినిమాని బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. 'అఖండ', 'వీరసింహ రెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య నటిస్తున్న సినిమా కావడంతో 'NBK 109'పై భారీ అంచనాలే ఉన్నాయి. ఫార్చూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ లో బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా 'NBK109' నుండి చిత్ర బృందం ఫస్ట్‌ గ్లింప్స్ విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. "సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్" అంటూ పవర్ ఫుల్ డైలాగ్ తో బాలయ్య గూస్ బంప్స్ తెప్పించాడు. త్వరలోనే ఈ సినిమా నుంచి మరో సర్ ప్రైజ్ రాబోతుంది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు, స్పెషల్ గ్లింప్స్ ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నిర్మాత నాగవంశీ సైతం తాజాగా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ప్రీ రిలీజ్ ఈవెంట్ మాట్లాడుతూ.. జూన్ 10న 'NBK109' అప్డేట్ రానుందని తెలిపాడు. మొత్తానికి బాలయ్య పుట్టినరోజున టైటిల్ తో కూడిన పోస్టర్ తో పాటు, స్పెషల్ గ్లింప్స్ రానుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'వీర మాస్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, 'జైలర్' ఫేమ్ విజయ్ కార్తీక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ఎడిటర్ గా నిరంజన్, ప్రొడక్షన్ డిజైనర్ గా అవినాష్ కొల్లా వ్యవహరిస్తున్నారు.
టాలెంటెడ్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ (Satyadev) తాజా చిత్రం 'కృష్ణ‌మ్మ‌' (Krishnamma). ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ బూరుగుల‌, ల‌క్ష్మ‌ణ్ మీసాల‌, నంద గోపాల్‌, హ‌రిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌స్తుతం 240దేశాల‌కు పైగా అమెజాన్ ప్రైమ్‌లో ‘కృష్ణ‌మ్మ‌’ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.  కృష్ణా న‌ది ఒడ్డున ఉండే విజ‌య‌వాడ ప‌ట్టణంలో ముగ్గురు అనాథ‌లు శివ(కృష్ణ‌), భ‌ద్ర (స‌త్య‌దేవ్‌), కోటి (ల‌క్ష్మ‌ణ్ మీసాల‌) పెరిగి పెద్ద‌వుతారు. వీరి మ‌ధ్య చ‌క్క‌టి అనుబంధం ఉంటుంది. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఓ ఘ‌ట‌న కార‌ణంగా అనుకోని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. జీవితాలు ఎన్నో ఒడిదొడుకుల‌ను ఎదుర్కొంటాయి. చిన్న‌త‌నంలో జైలుకి వెళ్లిన శివ, అక్క‌డి నుంచి వ‌చ్చాక నిజాయ‌తీగా జీవితాన్ని వెల్ల‌దీయాల‌నుకుంటాడు. ముగ్గురి స్నేహితుల్లో భ‌ద్ర‌, కోటిల‌కు డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయి. దాంతో వాళ్లు గంజాయి స్మ‌గ్లింగ్ చేయాల‌నుకుని పోలీసుల‌కు చిక్కుతారు. అదే స‌మ‌యంలో ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌ని చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతారు. దీని కార‌ణంగా వాళ్ల జీవితాల్లో ఊహించ‌ని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. ఆ ప‌ర్యావ‌సానాల‌ను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు.. చివ‌ర‌కు ఏమైంద‌నేదే కృష్ణ‌మ్మ సినిమా. మే నెల‌లో థియేట‌ర్స్‌లో విడుద‌లైన ‘కృష్ణ‌మ్మ‌’ చిత్రం ప్రేక్షకులతో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియా స‌హా 240కి పైగా దేశాల్లో సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఈ ర‌స్టిక్ అండ్ రా యాక్ష‌న్ డ్రామాకు ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది.
ఒకప్పుడు వి. వి. వినాయక్ (VV Vinayak) దర్శకత్వంలో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. వినాయక్ దర్శకత్వంలో 'ఆది', 'దిల్', 'ఠాగూర్', 'బన్నీ', 'లక్ష్మి', 'కృష్ణ', 'అదుర్స్' వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అలాంటి వినాయక్ కొంతకాలంగా రేస్ లో వెనకబడిపోయారు. గత ఆరేళ్లలో ఆయన నుంచి రెండే సినిమాలు వచ్చాయి. 2018 వచ్చిన 'ఇంటిలిజెంట్' ఫ్లాప్ కాగా, కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన 'ఛత్రపతి' హిందీ రీమేక్ కూడా గతేడాది విడుదలై చేదు ఫలితాన్ని మిగిల్చింది. ఆ సినిమా వచ్చి ఏడాది అవుతున్నా.. వినాయక్ నెక్స్ట్ మూవీ గురించి అప్డేట్ లేదు. సినిమా సంగతి అటుంచితే.. కనీసం ఆయన బయట కూడా పెద్దగా కనిపించడం లేదు. దీంతో అసలు వినాయక్ కి ఏమైంది? ఎందుకు ఇతర సినిమా వేడుకల్లో కూడా కనిపించడం లేదు? అనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. వినాయక్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ప్రచారం జరుగుతోంది. లివర్ కి సంబంధించిన హెల్త్ ప్రాబ్లెమ్ తో ఆయన బాధపడుతున్నారట. అందుకే వినాయక్ పెద్దగా బయట కనిపించడం లేదని, ట్రీట్ మెంట్ తీసుకొని ప్రస్తుతం ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఎందుకంటే వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ కి హెల్త్ ప్రాబ్లెమ్ వస్తే.. సినీ ప్రముఖులకి, మీడియాకి ఇంతకాలం తెలియకుండా ఉంటుందా అనేది పెద్ద క్వశ్చన్. దీనిపై అధికారిక సమాచారం వచ్చేవరకు ఇప్పుడే ఓ అంచనాకు రాలేము.
ప్రస్తుత సినీ మార్కెట్ లో అగ్ర హీరోల సినిమా ఏదీ  లేదు.  అయితేనేం ఇతర హీరోల సినిమా బాధ్యతని తమ భుజ స్కందాల పై వేసుకుంటు  అభిమానుల టచ్ లోనే ఉంటు వస్తున్నారు. లేటెస్ట్ గా  నందమూరి  బాలకృష్ణ (balakrishna)యువ హీరో విశ్వక్ సేన్ (vishwak sen) ఫంక్షన్ కి హాజరయ్యి తన అభిమానులని ఖుషి చేసాడు. ఇప్పుడు ఈ కోవలో మహేష్ బాబు (mahesh babu) కూడా చేరబోతున్నాడు.   ప్రముఖ హీరో సుధీర్ బాబు (sudheer babu)లేటెస్ట్ మూవీ  హరోం హర (harom hara) షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని విడుదలకి సిద్ధం కాబోతుంది. ప్రెజంట్ ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. రేపు  ఈ మూవీ ట్రైలర్ సూపర్ స్టార్  మహేష్ బాబు  చేతుల మీదుగా జరగబోతుంది. ఉదయం 11:25 గంటలకు మహేష్ బాబు  లాంచ్ చేయనున్నాడు.  ఈ విషయాన్ని  మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సుధీర్ సరసన మాళవిక శర్మ (Malvika Sharma) హీరోయిన్ గా చేస్తుండగా సునీల్, జయ ప్రకాష్, అక్షర, అర్జున్ గౌడ్, లక్కీ లక్ష్మణ్, రవి కాలే తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  సుమంత్ జీ. నాయుడు నిర్మాతగా వ్యవహరిస్తుండగా  జ్ఞాన సాగర్ ద్వారక (Gnanasagar Dwaraka)దర్శకత్వం  వహిస్తున్నాడు. జూన్ 14 న  వరల్డ్ వైడ్ గా  రిలీజ్ కాబోతుంది.చైతన్ భరద్వాజ్  సంగీతాన్ని అందిస్తున్నాడు.   2012 లో వచ్చిన ఎస్ఎంఎస్ చిత్రం ద్వారా సుధీర్ బాబు  తెలుగు సిల్వర్ స్క్రీన్ కి  పరిచయమయ్యాడు. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ లో తిరుగులేదని అనిపించుకున్నాడు. కానీ కట్ అవుట్ కి తగ్గ హిట్ మాత్రం పడటం లేదు.ప్రేమ కథా చిత్రమ్  ఒక్కటే ఆయన కెరీర్ లో ఉన్న పెద్ద  హిట్. ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది సినిమాల దాకా చేసాడు. ఇక  సుధీర్ బాబు స్వయంగా మహేష్ కి బావ అనే విషయం అందరకి తెలిసిందే. మహేష్ చెల్లెలనే సుధీర్ పెళ్లి చేసుకున్నాడు. మరి ట్రైలర్ లాంచ్ చేస్తున్న మహేష్ ముందు ముందు హరోం హర కి తన వంతు ప్రమోట్  చెయ్యడం  ఖాయం.  
ఒకప్పుడు వంద కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందుతుందంటే గొప్పగా చెప్పుకునేవారు. అలాంటిది ఇప్పుడు హీరోల రెమ్యూనరేషనే వంద కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పటికే ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి పాన్ ఇండియా హీరోలు వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో మరో పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ (Ram Charan) చేరిపోయాడని తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ ఛేంజర్' (Game Changer) సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా (RC 16) చేయనున్నాడు. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా భారీ బడ్జెట్ తో రూపొందనుంది. అయితే ఈ మూవీ కోసం రామ్ చరణ్ దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఏకంగా రూ.125 కోట్ల రెమ్యూనరేషన్ చరణ్ తీసుకోబోతున్నాడని ఇన్ సైడ్ టాక్. 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో రామ్ చరణ్ మార్కెట్ పెరిగింది. పైగా శంకర్ తో చేస్తున్న 'గేమ్ ఛేంజర్' కూడా పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటితే.. చరణ్ మార్కెట్ మరింత పెరిగే అవకాశముంది. అందుకే భారీ పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం వెనకాడట్లేదు అంటున్నారు.  ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కేవలం చరణ్ పారితోషికమే రూ.125 కోట్లు అంటే.. భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ తో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది అన్నది హాట్ టాపిక్ గా మారింది.
భారతదేశాన్ని రక్షించడానికి పరమేశ్వరుడు భారతదేశం నలువైపులా జ్యోతిర్లింగాల రూపంలో స్వయంభూగా  కొలువు తీరాడు. వాటినే  ద్వాదశ జ్యోతిర్లింగాలుగా పిలుచుకుంటాం. అందులో  ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్  కూడా ఒకటి. మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయిని నగరంలో  ఉంది.ఇక్కడ  పరమేశ్వరుడు  మహాకాళేశ్వరుడు గా పూజలందుకుంటున్నాడు.  నిత్యం కొన్ని లక్షల మంది స్వామిని దర్శించుకొని ముక్తిని పొందుతారు.  సినిమా వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో  పాల్గొని స్వామి కృప తమపై ఉండాలని కోరుకుంటారు. తాజాగా  ఇద్దరు హీరోయిన్ లు స్వామిని దర్శించుకోవడం పాటు ప్రత్యేక పూజలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.     మహాకాళేశ్వర క్షేత్రంలో భస్మ హారతి ఎంతో ప్రత్యేకమైనది. తెల్ల వారు జామున మూడు గంటలకి స్వామికి  ఆ హారతిని ఇస్తారు. అందులో పాల్గొనడాన్ని చాలా అదృష్టంగా భావిస్తారు.దాంతో  సకల బాధలు తీరిపోయి మంచి జరుగుతుందని భావిస్తారు. ఇప్పుడు ఆ భస్మ హారతిలో ప్రముఖ హీరోయిన్ లు రాశి ఖన్నా( raashi khanna)వాణి కపూర్ (vaani kapoor)పాల్గొన్నారు. భస్మ హారతి జరుగుతున్నంత సేపు ఇద్దరు శివ పఠనం చేసారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం  పూజారులు వారికి తీర్ధ ప్రసాదాలు అందించారు. సుప్రీమ్, ప్రతి రోజు పండుగ, జై లవకుశ, హైపర్, తొలిప్రేమ, వరల్డ్ ఫేమస్ లవర్, థాంక్ యు, శ్రీనివాస కళ్యాణం లాంటి సినిమాల్లో నటించి రాశికన్నా మంచి గుర్తింపు ని పొందింది. తెలుసా కదా అనే మూవీతో త్వరలో రాబోతుంది.ఒక తమిళ సినిమాకి కూడా కమిట్ అయ్యింది. ఇక వాణి కపూర్ కూడా బాలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాల్లో చేసింది. బేఫిక్రి, వార్, బెల్ బాటమ్, షం షీరా, లాంటి సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చాయి.ప్రస్తుతం ఖేల్ ఖేల్ మెయిన్, రెయిడ్ 2 లలో చేస్తుంది. . గతంలో కూడా చాలా మంది తారలు మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు.  
తనను దారుణంగా మోసం చేసారని సినీనటుడు ఫ్యామిలీ స్టార్ జగపతిబాబు వాపోయారు.. తనతో యాడ్ షూట్ చేయించుకొని చెక్కు ఇచ్చారని ఆ చెక్కు బౌన్స్ అయ్యిందని జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు తెలియచేస్తూ వీడియో ని రిలీజ్ చేశారు.. ఐతే తరుచు రియల్ ఎస్టేట్ లో మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి అని ప్రజలు గగ్గోలు పెట్టటం చూశాము.. ఈ మధ్య ఇలాంటి సంఘటనలు ఎక్కువ అవ్వటం తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కూడా ఇలాంటి మోసాలకు పాల్పడేవాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలియచేసారు.. ల్యాండ్ కొనేటప్పుడు రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) నిబంధనలు తప్పనిసరిగా తెలుసుకొని జాగ్రత్త పడండి. జగపతి బాబు తాను ఎవరు చేతిలో మోసపోయాడు అనే విషయాన్ని త్వరలో ఆధారాలతో సహ బయట పెడతానని తెలియచేసాడు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ అయిన సలార్ మూవీలో కనిపించిన జగపతి బాబు... ఇప్పుడు సలార్ 2 ప్రాజెక్టులోనూ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే అటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.
''పుష్ప' చిత్రంలో "తగ్గేదేలే" అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. పాన్ ఇండియా షేకయింది. ఇప్పుడు ‘పుష్ప’కు కంటిన్యూగా రాబోతోన్న ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2 The Rule)పై భారీ అంచనాలున్నాయి. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న ‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే విడుదలైన ‘గ్లింప్స్, టీజర్, పుష్ప పుష్ప సాంగ్’ యూట్యూబ్‌ ని షేక్ చేశాయి. ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ‘పుష్ప 2’ నుంచి కపుల్ సాంగ్ (The Couple Song) ‘సూసేకి  అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామీ’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.  మేకింగ్ విజువల్స్‌తో ఈ కపుల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. ‘నా సామి’ పాటను బీట్ చేసేలా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఆస్కార్ విజేత చంద్రబోస్ ఆకట్టుకునే సాహిత్యం అందించారు. "సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి వుంటాడే నా సామి" అంటూ సాగిన ఈ పాటను ఐదు భాషల్లోనూ ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడటం విశేషం. ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారని అర్థమవుతోంది.  అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
రానున్న రోజుల్లో శ్రీదేవి ముద్దుల కూతురు  జాన్వీ కపూర్ (Janhvi kapoor)తెలుగు నాట టాప్ హీరోయిన్ అవ్వడం అనేది ఖాయం. ఎందుకంటే  ఆమె లిస్ట్ లో ఎన్టీఆర్ (ntr) దేవర (devara)తో పాటు చరణ్ (charan) కొత్త మూవీలు ఉన్నాయి. మరికొన్ని బిగ్ ప్రాజెక్ట్స్ కూడా చర్చల దశలో ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి.  జాన్వీ తాజాగా ఒక ఇంటర్వ్యూ వచ్చింది. అందులో ఆమె చెప్పిన కొన్ని విషయాలు వైరల్ గా మారాయి. ఎట్ ఏ టైం సోషల్ మీడియాలో జరిగిన డిస్కర్షన్ కూడా  చర్చినీయాంశమయ్యింది. జాన్వీ రీసెంట్ గా బాలీవుడ్ లో మిస్టర్ అండ్ మిసెస్ మహి (Mr and Mrs Mahi) అనే మూవీ  చేసింది. మే 31 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. రాజ్ కుమార్ రావ్  హీరోగా చేస్తున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూ లో  జాన్వీ మాట్లాడుతు  ఇటీవల నా పెళ్లికి సంబంధించి  సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని వార్తలని చదివాను. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు రాసారు. నేను రెండు మూడు ఇంటర్వ్యూ ల్లో చెప్పిన విషయాలని కలిపి  ఒక వార్తగా రాసారు. దీంతో చాలా మంది నాకు పెళ్లి అని ఫిక్స్ అయ్యారు .కానీ నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. ప్రస్తుతానికి నా దృష్టి అంతా కెరీర్ పైనే ఉందని చెప్పుకొచ్చింది. దీంతో కొన్ని రోజులుగా వినిపిస్తున్న  జాన్వీ  పెళ్లి న్యూస్ అబద్ధం అని అర్ధమయ్యింది అదే టైంలో సోషల్ మీడియా వెబ్ సైట్  రెడిట్ లో అభిమానులతో చిట్ చాట్ చేసింది.వాళ్ళు వేసిన పలు ప్రశ్నలకి చాలా ఓపిగ్గా రిప్లై లు ఇచ్చింది. ఒక అభిమాని డేట్ కి వెళ్దామా..మంచి స్టోరీ అవుతుంది అని అడిగాడు. నువ్వు గొడ్డలి తో నరికి చంపేసే హంతుకుడివి అయితే పరిస్థితి ఏంటి అని రిప్లై ఇచ్చింది. రెడిట్ ని నా కంటే నా చెల్లెలు  ఎక్కువ వాడుతుంది అని చెప్పుకొచ్చింది.పైగా నాకు సంబంధించిన ఎలాంటి  విషయాన్ని ఆయినా తన ద్వారానే తెలుసుకుంటానని ఎందుకంటే  సోషల్ మీడియా అంటే తనకి  భయమని చెప్పుకొచ్చింది. దీన్ని బట్టి జాన్వీ అభిమానులకి రిప్లై ఇచ్చినప్పుడు ఖుషి కపూర్ పక్కనే ఉండి ఉంటుంది. గొడ్డలి ఐడియా కూడా  ఆమెదే అయ్యి  ఉంటుందని నెటిజన్స్ అనుకుంటున్నారు.    
సమ్మర్ సీజన్ లో సినిమాల సందడి ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ ఈ ఏడాది మాత్రం ఎన్నికలు, ఐపీఎల్ దెబ్బకి సినిమాల సందడి పెద్దగా లేదు. చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. విడుదలైన కొన్ని సినిమాలు కూడా తేలిపోయాయి. దీంతో వేసవి అంతా దాదాపు సప్పగానే సాగింది. అయితే వేసవి ముగుస్తున్న సమయంలో కొన్ని సినిమాలు మేమున్నాం అంటూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈవారం మూడు చెప్పుకోదగ్గ సినిమాలు విడుదలవుతున్నాయి. మే 31న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs of Godavari), 'గం గం గణేశా' (Gam Gam Ganesha), 'భజే వాయు వేగం' (Bhaje Vaayu Vegam) సినిమాలు విడుదల కానున్నాయి. ఈ మూడు సినిమాలు దేనికదే ప్రత్యేకం. కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మాస్ జాతరలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. 'బేబీ' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ నటించిన చిత్రం 'గం గం గణేశా'. ఉదయ్‌ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ కామెడీ ఫిల్మ్ పై మంచి అంచనాలే ఉన్నాయి. గతేడాది 'బెదురులంక 2012'తో నవ్వులు పూయించిన కార్తికేయ.. ఇప్పుడు 'భజే వాయు వేగం' అనే యాక్షన్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి మే 31న జరుగుతున్న ఈ ట్రయాంగిల్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
ఆడుకోవడం అందరికీ ఇష్టం అయితే ఓ వయసు దాటిన తరువాత పిల్లల్లా ఆడుకోలేం. అయితేనేం ఆడుకోవాల్సినవి ఆడుకోవచ్చు. చక్కగా నెంబర్స్ తో కాలక్షేపం చేయచ్చు. సాధారణంగా దినపత్రికలు,  సండే స్పెషల్ బుక్స్ లో నెంబర్స్ తో మ్యాజిక్ చేసే సుడోకు చూసే ఉంటారు. కొందరికి ఈ సుడోకు పూర్తీ చేయడం ఎంతో ఇష్టం. 1నుండి 9 అంకెలను నిలువుగానూ, అడ్డుగానూ ఎటు కూడినా 9 వచ్చేలా, అంకెలు ఏ వరుసలోనూ రిపీట్ కాకుండా  ఉండటం దీని విశిష్టత. ఇది మెదడును చురుగ్గా మారుస్తుంది. తెలివితేటలు పెంచుతుంది. పిల్లలలో చదువుపట్ల ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో ఉపయోగాలున్న సుడోకుకు ఓ రోజును కేటాయించారు. ఈ రోజున సుడోకు గురించి చర్చిస్తారు.  అయితే ఈ సుడోకు ఎప్పుడు ఎక్కడ పుట్టింది? దీని వెనుక చరిత్ర ఏంటి?  పూర్తీగా తెలుసుకుంటే.. 1892లో ఫ్రెంచ్ వార్తాపత్రిక "La Siecle" సుడోకుకు సమానమైన గేమ్‌ను ముద్రించింది, అందులో ప్రతి అడ్డు వరుస,  నిలువు వరుస అన్ని నిర్దేశిత సంఖ్యలను కలిగి ఉండాలి, కానీ సుడోకులా కాకుండా, ఇది 9 కంటే ఎక్కువ సంఖ్యలను కలిగి ఉంటుంది. ఇందులో ఎన్నో గణితానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ క్లియర్ చెయ్యాల్సి ఉంటుంది.  ఇవి ఎంతో తర్కంతో కూడుకుని ఉంటాయి. ఆ తరువాతి సంవత్సరాల్లో ఇతర ఫ్రెంచ్ పేపర్‌లు ఇలాంటి గేమ్‌లతో ట్రెండ్‌ను వ్యాప్తి చేశాయి. కానీ ఏదీ సుడోకుతో సమానంగా లేదు.  మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో ఆ గేమ్‌ల ప్రజాదరణ క్షీణించింది. 1979లో  ఇండియానా ఆర్కిటెక్ట్ హోవార్డ్ గార్న్స్ "డెల్ మ్యాగజైన్"లో తన స్వంత ఆవిష్కరణ  ద్వారా పజిల్ ను రూపొందించారు. దీన్ని అప్పటిలో "నెంబర్ ప్లేస్" అని పిలిచారు. దాన్నే ఇప్పుడు  సుడోకు అని పిలుస్తున్నారు. అయితే గార్న్స్ తన కనుగొన్న ఆవిష్కరణ అంతర్జాతీయ సంచలనంగా మారడాన్ని చూడకుండానే కన్నుమూశారు.  మిలియన్ల మంది  సుడోకు ఆడే ఆటగాళ్ళతో  మొదటిసారి సుడోకు అనే పేరును పొందింది. 1997లో, హాంకాంగ్ న్యాయమూర్తి వేన్ గౌల్డ్ ప్రత్యేకమైన సుడోకు పజిల్‌లతో కూడిన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను కనుగొన్నారు. అతను UKలోని వార్తాపత్రికలకు రోజువారీ పజిల్ ఫీచర్‌గా గేమ్‌ను అందించాడు. దీని వల్ల  తొందరలోనే సుడోకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇప్పుడు సుడోకు స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో తక్షణమే అందుబాటులో ఉంది.  పేపర్లు మరియు మ్యాగజైన్‌లలో విస్తృతంగా అచ్చవుతోంది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అధికారిక అంతర్జాతీయ సుడోకు దినోత్సవంగా ప్రకటించింది.  అప్పటి నుండి  దీనిని జరుపుకుంటున్నారు. బ్రిటీష్ TV స్టేషన్ “ఛానల్ 4” తన టెలిటెక్స్ట్‌లో రోజువారీ సుడోకు పజిల్‌ను చేర్చడం 2005 నుండి ప్రారంభించింది.  ప్రోగ్రామ్ గైడ్ “రేడియో టైమ్స్” వారానికోసారి, 16x16 గ్రిడ్ లతో “సూపర్ సుడోకు”ను ప్రారంభించింది. 2006లో సుడోకు అనే అంశం పై నెంబర్లను చేర్చడం, వరుసలు కూర్చడం వంటి అంశాలను ప్రస్తావిస్తూ  పీటర్ లెవీ ఒక పాటను క్రియేట్ చేశారు. ఆస్ట్రేలియాలో మిలియన్ డాలర్ల డ్రగ్ ట్రయల్ పన్నెండు మంది జ్యూరీలలో ఐదుగురు సాక్ష్యాలను వినడానికి బదులుగా సుడోకు ఆడుతున్నట్లు కనుగొన్నారు. అప్పుడు ఈ ట్రయల్ రద్దు చేశారు. ఇది 2008లో జరిగింది. 2013లో వరల్డ్ పజిల్ ఫెడరేషన్ సెప్టెంబరు 9ని అంతర్జాతీయ సుడోకు దినోత్సవ వార్షిక తేదీగా నిర్ణయించింది.  ఇందులో  బోలెడు రౌండ్లతో కూడిన ఆన్‌లైన్ పోటీలను నిర్వహిస్తోంది.                                                  *నిశ్శబ్ద.  
చాలామంది సంకల్పబలం, క్రమశిక్షణల గురించి ఓ అరగంట ప్రసంగించమంటే తడుముకోకుండా మాట్లాడతారు. కానీ వాటిని పాటించే విషయంలోనే వస్తాయి చిక్కులన్నీ. తమ దాకా వచ్చేసరికి అవి అందరికీ సాధ్యం కాదని తేల్చేస్తారు. అది పుట్టుకతోనే రావాలని చల్లగా జారుకుంటారు. అలాంటి వారికి సమాధనమే ఈ కింది విషయాలు.. దృఢనిర్ణయాలు తీసుకోవాలంటే? ...  మీ మానసిక బలాన్ని పరీక్షించుకొని, పెంపొందించుకొనే మార్గాల్లో ముఖ్యంగా ప్రతి నిత్యం జీవితంలో కొన్ని ఇష్టం లేని, కష్టంగా కనిపించే పనుల్ని చేయడం ఒకటి. అలా తరచూ సాధన చేయాలి. వీటి వల్ల ప్రయోజనాలు కలుగుతాయని తెలిసినా మీ మనసు ఆ పనుల్ని ఏదో ఒక వంకతో వ్యతిరేకిస్తూనే ఉంటుంది. అయినా సరే ఆ పనులు చేయాలి. అలా చేయడం ద్వారా మీ మెదడులో నిక్షిప్తమైన వ్యతిరేక భావాలను అధిగమించగలుగుతారు. అంతర్గతంగా ఉన్న వ్యతిరేక శక్తులను అధిగమించడం ద్వారానే మనకు అవసరమైన అంతర్గత శక్తిని మేల్కొల్పగలం. ఉదాహరణకు మీరు బస్సులో ప్రయణిస్తున్నారనప్పుడు సీటు దొరికితే హాయిగా కూర్చుంటారు, లేకపోతే తప్పదు కాబట్టి నిలబడి ప్రయాణిస్తారు. ఒకవేళ మీకు సీటు దొరికినా సరే ఆ సీటును ఇంకొకరికి ఇవ్వండి. ఓ పదిహేను లేదా ఇరవై నిమిషాలు నిలబడి ప్రయాణించండి. ఈ చిన్న విషయంలో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, మీలోని మానసిక నిరోధ భావాలను గమనించండి. అయినా మనస్సు మాట వినకుండా ఇంకొకరికి ఆ సీటు ఇచ్చి, ప్రయాణం చేయండి. ఆ తరువాత చూడండి. మీరు ఈ నిరోధ భావాల నుంచి బయటపడడానికి చేసిన సంఘర్షణ, చివరికి సాధించడం చూస్తే మీలో మీకే తెలియని ఆత్మవిశ్వాసం, ధైర్యం కలుగుతాయి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు, అర్జునుడితో మానసిక దౌర్బల్యాన్ని జయించాలని చెబుతూ ఎవరికైనా మనస్సును అదుపులో ఉంచుకోవడం దుస్సాధ్యమే, కానీ అభ్యాస, వైరాగ్యాల ద్వారా దాన్ని సాధించవచ్చని బోధిస్తాడు. మీ ఇంట్లోని వారికి వారి పనుల్లో ఎప్పుడైనా సహాయం చేశారా?  ఈసారి ఈ విధంగా ప్రయత్నించండి! నేరుగా వంటింట్లోకి వెళ్ళి అమ్మతో "అమ్మా! నేను ఏదైనా సహాయం చేయనా?” అని అడగండి, ఎప్పుడూ ఆ మాట అడగని మీరు ఈ ప్రశ్న వేసేసరికి ఆవతలివారు కాస్త కంగారు పడి, మిమ్మల్ని కొత్తగా చూడడం సహజమే. అయినా సరే, వంటిల్లు సర్దడంలోనో, కూరలు తరగడంలోనో, గిన్నెలు కడగడంలోనో సహాయం చేయండి. అది చిన్న పనే అయినా, మీకిష్టం లేని పని చేసిన తరువాత ఒక్కసారి వారి కళ్ళలోని ఆ వెలుగును చూడండి. రెండూ మిమ్మల్ని సంకల్ప బలం వైపు నడిపిస్తాయి.  ఒక్కోసారి మీరు అలసిపోయి ఇంటికొస్తారు. రాగానే మీ శరీరాన్ని సోఫాలో పడేసి అందుబాటులో ఉన్న టీవీ రిమోట్ తీసుకొని, అలా ఎంతసేపు ఛానల్స్ మారుస్తూ కూర్చుంటారో మీకే తెలియదు. అప్పుడు స్నానం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ బద్దకం మీ కన్నా బలమైంది కాబట్టి, అది అక్కడ నుంచి లేవనీయదు. అయితే ఈ సారి మీ బద్ధకం మాట వినకండి. కష్టమైనా సరే లేచివెళ్ళండి. చేయాలనుకున్న పని వాయిదా వెయ్యకుండా చేయండి. అప్పుడు చూడండి మీపై మీకే తెలియని దృఢత్వం,  ఒక నమ్మకం, ధైర్యం కలుగుతాయి. ప్రయత్నిస్తే తప్పకుండా ఫలితం లభిస్తుంది. ఒకరోజు మీరు కాఫీ, టీ, పాలల్లో చక్కెర లేకుండా తాగేందుకో లేదా కనీసం పెరుగన్నంలో ఉప్పు లేకుండా తినేందుకో ప్రయత్నించండి. మీ కన్నా ముందు మీ నాలుక ఈ ప్రయోగానికి ఒప్పుకోదు. దాన్ని జయించడానికేగా ఈ ప్రయత్నమంతా! అలాగే వేడినీళ్ళ  స్నానం అలవాటున్న వాళ్ళు వరుసగా వారం రోజులు చన్నీటి స్నానం చేసి మీలోని శారీరక, మానసిక నిబ్బరాన్ని పరీక్షించి సాధించండి. చదువుకునేటప్పుడు కష్టమైన సబ్జెక్టుతో వాయిదా వేయకుండా పోరాడండి. కొన్ని మాటలు మాట్లాడే కన్నా మాట్లాడకుండా ఉంటేనే ఎక్కువ ప్రయోజనం ఉన్నప్పుడు మౌనాన్ని ఆశ్రయించండి. మీ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోండి.  ఇలా అన్నీ ఒక్కొక్కటిగా మీ జీవితంలో ఫాలో అయ్యారంటే మీ మీద మీరు విజయం సాధిస్తారు కచ్చితంగా.                                      ◆నిశ్శబ్ద.
నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉద్యోగ జీవితాలు కూడా అంతే వేగంగా ఉంటాయి. పోటీ దృష్ట్యా ప్రతి సంస్థ 24 గంటలు తమ కార్యకలాపాలు కొనసాగించాలని అనుకుంటుంది. ఈ కారణంగానే సాధారణ పనివేళలు మాత్రమే కాకుండా నైట్ షిఫ్టులు కూడా కొనసాగిస్తుంది.  వేతనం గురించో ఇతర కారణాల వల్లనో చాలామంది నైట్ షిప్టులో పనిచేస్తుంటారు.  అయితే సాధారణ పని వేళల్లో పనిచేసేవారి కంటే నైట్ షిప్టులో పనిచేసేవారిలో చురుకుదనం తక్కువగా ఉంటుంది. అంతేనా సాధారణంగా నిద్రపోవాల్సిన సమయంలో ఉద్యోగాలు చెయ్యడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నైట్ షిఫ్టు డ్యూటీ చేసేవారు  ఆరోగ్యంగా, యాక్టీవ్ గా ఉండటానికి  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే.. నిద్ర.. నైట్ షిఫ్టు లో పనిచేసేవారు నిద్ర షెడ్యూల్ ను కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి. నిద్రా చక్రమైన సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగించకుండా చూసుకోవాలి. సిర్కాడియన్ రిథమ్ కు అంతరాయం కలిగితే  నిద్ర ఆటంకాలు, అలసట కలుగుతాయి.  ఈ సిర్కాడియన్ రిథమ్ గడియారాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి సెలవు దినాలలో కూడా ఒకే సమయానికి పడుకోవాలి. ఆహారపు అలవాట్లు.. నైట్ షిఫ్టుల సమయంలో చాలామంది ఎనర్జీగా ఉండటం కోసం ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ తినడం మీద ఆసక్తి చూపిస్తారు. పైపెచ్చు సాధారణ భోజన సమయాలు కాకపోవడం వల్ల రాత్రి పూట ఆకలేసినప్పుడు ఇలాంటి ఆహారానికే ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రోటీన్లు, తృణధాన్యాలు అధికంగా ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. నైట్ షిఫ్ట్ అంతా చిన్న చిన్న మొత్తాలలో ఆహారం తీసుకోవాలి. నీరు బాగా త్రాగాలి. వ్యాయామం.. నైట్ షిప్టులలో పనిచేసేవారు ఉదయం సమయాల్లో పడుకుంటూ ఉంటారు. దీని వల్ల చాలామంది ఉదయం వేళ చెయ్యాల్సిన వ్యాయామాన్ని స్కిప్ చేస్తుంటారు. లేదా పగటి సమయాన్ని లేజీగా గడిపేస్తూ  ఉంటారు. కానీ వ్యాయామాన్ని తప్పనిసరిగా భాగం చేసుకోవాలి. జాకింగ్, వాకింగ్, యోగా, సైక్లింగ్ వంటివి మంచి ఎంపిక. ఒత్తిడి.. పనిచేసే సమయవేళలు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. ఇది ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒత్తిడి రాకుండా చూడటం కోసం  లోతైన శ్వాస, శ్వాస వ్యాయామాలు,  ధ్యానం,  తీరిక సమయాలలో స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటివి చేయాలి.  ఒకవేళ ఒత్తిడి సమస్య ఉంటే మానసిక నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోవాలి. ప్లానింగ్.. నైట్ షిఫ్టులలో పనిచేసేవారు తమ పనిని చాలా పక్కాగా ప్లాన్ చేసుకోవాలి. పని చేసేటప్పుడు అలసిపోకుండా పనిని ఏకధాటిగా కాకుండా చిన్నచిన్న భాగాలుగా విభజించుకొని ఫినిష్ చేయాలి. ఇది పక్కాగా అమలుకావడం కోసం కోలీగ్స్,  అధికారులతో సంప్రదించి వారి మద్దతు తీసుకోవాలి.                                     *నిశ్శబ్ద.  
టీ తాగడం  ఆరోగ్యానికి మేలు చేస్తుందా లేదా హానికరమా? అనే విషయం గురించి  చాలా కాలంగా చర్చ నడుస్తూనే ఉంది. టీని మితంగా తీసుకుంటే అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా బ్లాక్ టీ ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని అందరూ అంటుంటారు. పరిశోధకులు కూడా ఇప్పుడు ఇదే విషయం చెబుతున్నారు. బ్లాక్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.  గుండె నుండి గట్ వరకు ఇంకా  మధుమేహం నుండి బరువు నియంత్రణ వరకు చాలా సమస్యలలో బ్లాక్ టీ మంచి ప్రయోజనాలు చేకూరుస్తుంది.  కరోనా  సమయంలో బ్లాక్ టీ చాలా చర్చనీయాంశమైంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని తెలిసింది, ఇది  అంటు వ్యాధుల శరీరాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడుతుంది. బ్లాక్ టీలోని కెఫిన్.. బ్లాక్ టీ లో ఉండే కెఫిన్ మధుమేహం నుండి గుండె జబ్బుల వరకు ప్రతిదానికీ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే కెఫిన్ మూత్రపిండాలకు హానికరమని కొందరు చెబుతుంటారు.    టీ,  కాఫీలలో  కెఫీన్ ఉండటం సాధారణం. ఇది మూత్రపిండాలకు మంచితో పాటు చెడు కూడ చేస్తుంది. ఇదంతా ఎంత టీ తీసుకుంటున్నాం అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది.  మూత్రపిండాలపై కెఫీన్  దుష్ప్రభావాలు ఎంతంటే.. కెఫిన్ మూత్రపిండాలకు ప్రయోజనం చేకూరుస్తుందని పరిగణించబడుతున్నప్పటికీ, ఇది  దుష్ప్రభావాలను కూడా కలిగి ఉంటుంది. కెఫిన్  రక్తపోటును ప్రభావితం చేస్తుంది.  అధికంగా కెఫిన్ తీసుకోవడం సిస్టోలిక్,  డయాస్టొలిక్ రక్తపోటు రెండింటినీ పెంచుతుంది. కిడ్నీ వ్యాధికి అధిక రక్తపోటు ప్రధాన ప్రమాద కారకం కాబట్టి, కెఫిన్ అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాల సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. బ్లాక్-టీ లో ఆక్సలేట్ గురించి తెలుసా?? బ్లాక్ టీలో కనిపించే ఆక్సలేట్  మూత్రపిండాలకు చాలా హానికరమైనది.  బ్లాక్ టీలో   కరిగే ఆక్సలేట్  సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్సలేట్లు కాల్షియంతో కలుస్తాయి. ఇవి స్ఫటికాలను ఏర్పరుస్తాయి, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తుంది. ఈ కారణంగానే బ్లాక్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని చెబుతారు  నిపుణుల సలహా ఏమిటంటే.. బ్లాక్ టీ  ఆరోగ్యానికి మేలు చేసేదే, ఈ విషయం పరిశోధనల్లో కూడా తేలింది.   ఇది గుండె జబ్బులను తగ్గించడంలో,  కొలెస్ట్రాల్,  రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ ఇదంతా బ్లాక్ టీ ని మితంగా తీసుకోవడం వల్ల మాత్రమే కలిగే ప్రయోజనం. బ్లాక్ టీ ని  ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువ. రోజులో రెండు కప్పులకు మించి బ్లాక్ టీ తాగడం ప్రమాదం.                             *నిశ్శబ్ద.
కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రధాన  సమస్యగా మారుతోంది.  దీనికి సరైన ఆహారం, దిగజారుతున్న జీవనశైలి, ఒత్తిడి. కారణం అవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ విషయంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా బాధ్యత వహిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె  ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్‌లను తినకూడదని కొందరు హెచ్చరిస్తుంటారు. ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.  జీడిపప్పులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అవసరమైన 44 శాతం కొవ్వు, 30 శాతం కార్బోహైడ్రేట్స్, 18 శాతం ప్రోటీన్లను కలిగి ఉంటుంది. జీడిపప్పు పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. పోషకాలు అధికంగా ఉండే జీడిపప్పు వినియోగం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం.  జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.    బ్రెడ్ గులాబ్ జామూన్ తయారీ విధానం.. గులాబ్ జామున్ అనేది మన సాంప్రదాయ స్వీట్, భారతదేశంలో చాలా మంది అత్యంత ఇష్టపడే స్వీట్‌లలో గులాబ్ జామూన్ ఒకటి. ఈ ఇంట్లో తయారుచేసుకునే ఈ గులాబ్ జామూన్ ను మనం ఇప్పుడు బ్రెడ్, క్రీమ్, పాల పౌడర్‌తో తయారు చేయవచ్చు. ఇది రుచికరం మాత్రమే కాదు, తయారు చేయడం కూడా చాలా సులభం.   
కలబంద.. చర్మం, జుట్టు, ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.దీనిని రోజూ తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులు దూరంగా ఉంటాయి. కలబందలో ఉండే విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా చలికాలంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తిని, జీవక్రియను మెరుగుపరుస్తుంది.మలబద్ధకం, రక్తహీనత వంటి తీవ్రమైన వ్యాధులకు చెక్ పెడుతుంది. అనేక తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఆయుర్వేదంలో అలోవెరాను సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఈ సీజన్‌లో కలబంద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మీరు దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. చల్లటి వాతావరణంలో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో.. ఏయే వ్యాధులను దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం నుండి ఉపశమనం: ఆంత్రాక్వినోన్ అనే సమ్మేళనం కలబందలో ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా, కలబంద వినియోగం కడుపు తిమ్మిరిని నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో, మీరు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి  అలోవెరా జ్యూస్ తాగవచ్చు. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది: ఈ సీజన్‌లో, చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా, అటువంటి వ్యక్తులు అనేక సీజనల్ వ్యాధులకు గురవుతారు. అందువల్ల, ఈ సీజన్‌లో మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మీరు కలబంద జ్యూస్ తాగాలి. శరీరం నిర్విషీకరణ : అలోవెరా జ్యూస్ శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. వాస్తవానికి, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలను ఆహ్వానించే అనేక విష పదార్థాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో, కలబంద రసం తీసుకోవడం ఈ తొలగింపు ప్రక్రియలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్ ను క్రమం తప్పకుండా తాగుతే ఆరోగ్యంతోపాటు అందమైన చర్మం మీ సొంతం అవుతుంది. రక్తహీనత సమస్యకు చెక్: నేటికాలంలో చాలా మంది రక్తహీనతకు లోనవుతున్నారు. అటువంటి పరిస్థితిలో, ఒక గ్లాసు కలబంద రసం ఈ సమస్యను వదిలించుకోవడానికి మీకు సహాయపడుతుంది. నిజానికి కలబంద రసాన్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది. పొడి చర్మం నుండి ఉపశమనం: చలికాలంలో తరచుగా చర్మం పొడిబారుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో కూడా మీ ముఖం పోషణతో ఉండాలంటే, కలబంద రసాన్ని మీ ముఖానికి అప్లై చేయడమే కాకుండా, దాని జ్యూస్ తాగండి. నిత్యం ఈ జ్యూస్ తాగడం వల్ల మీ ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ఎప్పుడు తాగాలి? మీరు కలబంద జ్యూస్‌ని సాయంత్రం పూట కూడా తాగవచ్చు. అయితే ఉదయం పూట కలబంద జ్యూస్ తాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు.