Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆమంచి చూపు.. జనసేన వైపు.!
posted on: Jul 4, 2026 2:36PM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ జనసేన గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలలో క్రీయాశీలంగా ఉండకుండా మౌనం వహించిన ఆమంచి ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి కరణం బలరాం చేతిలోపరాజయం పాలయ్యారు. ఆ ఓటమి తరువాత వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ ను ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కలేదు.
దీంతో 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్ వైసీపీని వీడి.. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది. దీంతో ఆమంచి రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలలో చీరాలలో తన పట్టు నిలుపుకోవాలన్నా, రాజకీయంగామనుగడ సాగించాలన్న జనసేనలో చేరడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు.
ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే మార్గమని భవించిన.. ఆమంచి నేడో రేపు ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ దిశగా ఇప్పటికే జనసేన ముఖ్యులతో ఆమంచి చర్చలు జరిపారనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పాయింట్ మెంట్ ఖరారైన తరువాత ఆయన జనసేన చేరిక ప్రకనట చేసే అవకాశం ఉందనీ, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.
Amanchi Krishna Mohan, Janasena Party, Pawan Kalyan, Chirala Politics, Teluguone


.webp)



