
-బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
-నా ఆస్తిని అన్యాయంగా విక్రయించారంటు వేదన
-సుప్రీంకోర్టుకి సైతం వెళ్తానంటూ ట్వీట్
ప్రముఖ నిర్మాత, నటుడు బండ్ల గణేష్(Bandla Ganesh)కి తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్‌లో ఉన్న ఆయన కుటుంబానికి చెందిన విలువైన నివాస ఆస్తి వేలాన్ని సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పునిచ్చింది. గతంలో ఈ వేలాన్ని రద్దు చేస్తూ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలని జస్టిస్ మౌషమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. గణేష్ ఆస్థి విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిపిన వేలం ప్రక్రియ చట్టబద్ధమేనని స్పష్టం చేస్తూ, బ్యాంకు రికవరీ చర్యలని కూడా హైకోర్టు పునరుద్ధరించింది. ఈ పరిణామం టాలీవుడ్‌తో పాటు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఆస్థి వేలం వివాదంపై గణేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. తన ట్వీట్ లో బ్యాంకు వాళ్ళు అన్యాయంగా, లోపాయికారి ఒప్పందంతో నా ఆస్తిని తక్కువ ధరకి విక్రయించారు. ఈ అన్యాయాన్ని సవాలు చేస్తూ 2022 లో నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. డిఆర్ టిలో నాకు అనుకూలంగా తీర్పు కూడా వచ్చింది. కానీ హైకోర్టులో వ్యతిరేకతీర్పు రావడం బాధాకరం. నాకు న్యాయవ్యవస్థలపై ఇంకా నమ్మకం ఉంది. కాబట్టి సుప్రీం కోర్టుని ఆశ్రయించి నాకున్న హక్కుల ద్వారా న్యాయం సాధిస్తాననే నమ్మకం నాకుందని ట్వీట్ లో పేర్కొన్నాడు.
Also read: Trisha: త్రిష పోస్ట్ వైరల్.. ఆ విధమైన తపన తగ్గిపోయింది
గణేష్ ఇటీవల వరంగల్ లోని హనుమకొండకి చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని, ఆరోగ్య అవసరాల కోసం పది లక్షలు అందించిన విషయం తెలిసిందే.






