Home

»

Latest News

Jagapati Babu: తెలివైన నిర్ణయం తీసుకున్న జగపతిబాబు.. ఆ దర్శకుడితో ఏం చెప్పాడంటే?

Jul 4, 2026 10:53AM

 

అతిశయోక్తిగా అనిపించినా కూడా కొంత మంది నటులు సెల్యులాయిడ్ పై పెర్ఫార్మ్ చేస్తుంటే తెలుగు సినిమా ఎంతో పెట్టి పుట్టింది కదా అనిపిస్తుంది. అలాంటి వాళ్లలో జగపతి బాబు(Jagapathi Babu)ఒకరు. హీరోగా అన్ని రకాల వేరియేషన్స్ తో కూడిన క్యారెక్టర్స్ లో కనిపించి సిల్వర్ స్క్రీన్ కి సరికొత్త సువాసనలు అద్దాడు. గాయం, మావిచిగురు, హనుమాన్ జంక్షన్, అల్లరి ప్రేమికుడు వంటి చిత్రాలే సింపుల్ ఎగ్జామ్ ఫుల్.

ఇక ఒక్కోసారి తెలుగు చిత్రసీమలో ఒక్కోసారి నటీనటులు తీసుకునే నిర్ణయాలు వారి కెరీర్‌ని  ఊహించని మలుపు తిప్పుతాయి. అయితే ఆ నిర్ణయం ఎలాంటి సమయంలో తీసుకున్నామనేది చాలా ముఖ్యం. ఈ విషయంలో జగపతి బాబుని తిరుగులేని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హీరోగా అవకాశాలు తగ్గిపోయాయి. చేసిన ఒకటి రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ బరిలో సరిగ్గా ఆడలేదు. అలాంటి క్లిష్ట సమయంలో జగపతి బాబు తన రూట్ మార్చి, క్యారెక్టర్ రోల్స్ వైపు షిఫ్ట్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎవ్వరూ ఊహించని విధంగా లెజెండ్ మూవీతో విలన్ క్యారెక్టర్స్ కి  సై అన్నారు. అప్పట్లో ఆయన తీసుకున్న ఆ ఒక్క సాహసోపేతమైన నిర్ణయం కెరీర్‌ని మరో ఉన్నత శిఖరానికి తీసుకెళ్లింది.

హీరోగా  సంపాదించిన క్రేజ్ఒక ఎత్తయితే,విలన్‌గా మరియు పవర్‌ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత ఆయన అందుకున్న క్రేజ్ మరో ఎత్తు. నిజం చెప్పాలంటే, హీరోగా ఉన్నప్పటి కంటే ఇప్పుడున్న పొజిషన్ లోనే జగపతి బాబు యమ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ చేతినిండా ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. మరి ఇలాంటి టైమ్ లో, ఈ విపరీతమైన క్రేజ్ తో ఆయన మరోసారి సోలో హీరోగా మారితే ఎలా ఉంటుంది? గతంలోనే కొంతమంది దర్శకులకు ఈ ఆలోచన రాగా, తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒక ప్రముఖ దర్శక-నిర్మాతకు కూడా ఇదే తరహా ఆలోచన వచ్చింది. ఆ దర్శకుడి దగ్గరికి ఒక అద్భుతమైన, వైవిధ్యమైన స్టోరీలైన్ వచ్చింది. ఆ కథ విన్న వెంటనే, ఇందులో లీడ్ హీరోగా మన జగపతి బాబు అయితేనే వంద శాతం న్యాయం చేయగలరని ఆయన బలంగా ఫీల్ అయ్యారు. అనుకున్నదే తడవుగా జగపతి బాబును కలిసి కథను వివరంగా వివరించి, హీరోగా నటించాల్సిందిగా కోరారు. అయితే ఈసారి కూడా జగపతి బాబు తనదైన శైలిలో ఒక కీలకమైన మరియు అత్యంత తెలివైన నిర్ణయం తీసుకున్నారు. తాను మరోసారి హీరోగా మారే ఆలోచన లేదని సదరు దర్శక నిర్మాతకి  ముఖం మీదే తెగేసి చెప్పేశారు.


Also read: Rao bahadur: రావు బహదూర్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే!

ప్రస్తుతం తను ఉన్న పొజిషన్ కి, ఇండస్ట్రీలో తనకి  ఉన్న డిమాండ్‌కి  మళ్లీ సోలో హీరోగా ప్రయోగాలు చేయడం కరెక్ట్ కాదని ఆయన భావించారు. ఒకవేళ మళ్లీ హీరోగా మారి ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడకపోతే, ఇప్పుడు కష్టపడి సంపాదించుకున్న విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే వచ్చిన ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించారు. జగపతి బాబు తీసుకున్న ఈ నిర్ణయంపై చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఇగోలకు పోకుండా, ప్రాక్టికల్‌గా ఆలోచించి జగపతి బాబు తీసుకున్న ఈ డెసిషన్ నిజంగా ఎంతో తెలివైందని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.  జగపతి బాబు ప్రస్తుతం థియేటర్ లో  నాగబంధంతో సందడి చేస్తున్నాడు.

   

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com