Home

»

Latest News

social media influencer: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ దారుణ హత్య 

Jul 4, 2026 11:28AM


సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా  ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది నిషా చౌహాన్. నిన్న తన భర్త ప్రదీప్ కుమార్ చేతిలోనే దారుణ హత్యకి గురైంది.ప్రదీప్, నిషాకి  దాదాపు 18 ఏళ్ల క్రితం వివాహం కాగా ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రదీప్  గతంలో దుబాయ్‌లో ఏసీ మెకానిక్‌గా పనిచేసి ఏడాది క్రితమే భారతదేశానికి తిరిగి వచ్చాడు. అప్పటినుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలోనే వారు కొత్తగా కొనుగోలు చేసిన ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ విషయంలో ఇద్దరి మధ్య మొదలైన గొడవ చివరకి  ప్రాణం తీసేవరకు వెళ్ళింది.

నిషా చౌహాన్ సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. భూమి కొనుగోలులో మెజారిటీ వాటా డబ్బును తానే చెల్లించినందున, ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ తన పేరిట జరగాలని నిషా పట్టుబట్టింది. దీనికి ప్రదీప్ అంగీకరించలేదు. నిషా ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ప్రదీప్, ఒకవేళ ఆస్తి ఆమె పేరిట ఉంటే దాన్ని తీసుకుని తనని  వదిలేసి వెళ్ళిపోతుందేమోననే భయంతో ఉన్నాడు. ఈ విషయమై గురువారం రాత్రి ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఆ వివాదం మరుసటి రోజు కత్తితో పొడిచి చంపేశాడు. 17 ఏళ్ల పెద్ద కుమారుడుకి ఈ దాడిలో స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆ అబ్బాయి సాయం కోసం కేకలు వేస్తూ పొరుగువారిని పిలవడానికి బయటకు పరుగెత్తాడు.


Also read: Jagapati Babu: తెలివైన నిర్ణయం తీసుకున్న జగపతిబాబు.. ఆ దర్శకుడితో ఏం చెప్పాడంటే?

పొరుగువారు సంఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగకూడని ఘోరం జరిగిపోయింది. భార్యను రక్తపు మడుగులో పడేసిన ప్రదీప్, ఆ తర్వాత అదే కత్తితో తన ఛాతిపై, పొట్టపై పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించి, తీవ్రంగా గాయపడిన ప్రదీప్‌ను మరియు అతని కుమారుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రదీప్ పరిస్థితి విషమంగానే ఉందని, అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు. నిషా వయసు 45 ఏళ్ళు కాగా బ్యూటీషియన్ గా వర్క్ చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్టున్నారు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com