
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'లెనిన్' (LENIN) సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది. ఈ మూవీ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ రేపు అత్యంత వైభవంగా నిర్వహించబోతోంది.
తిరుపతిలోని ప్రముఖ నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్ ఈ ఈవెంట్ కు వేదిక కానుంది. రేపు సాయంత్రం 5:00 గంటల నుండి ప్రారంభం కానున్న ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ప్రకటనతో పాటు ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
'లెనిన్' ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అక్కినేని నాగార్జునతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మాస్ యాక్షన్ డ్రామాను మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్నారు. అఖిల్ నటనను సరికొత్త కోణంలో ఆవిష్కరించేలా ఆయన ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కింగ్ నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
'లెనిన్' మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదల కానుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన సాంగ్స్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. జూలై 10 రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. అందులో భాగంగానే తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్స్‌లో రేపు సాయంత్రం 5 గంటల నుండి నిర్వహించబోయే ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సినిమాపై అంచనాలను మరింత స్కై హైకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అఖిల్ కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ మాస్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.






