Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..!
posted on: Jul 2, 2026 5:51PM
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..!

ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని, ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది. కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి, లేదా శరీరం బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు. ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే..
బ్లూ జోన్స్..
ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు, వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది.
వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు. కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు, జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.
*రూపశ్రీ.





