LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి అత్యంత బలమైన అనుకూల ప్రాంతంగా ఉంటూ వచ్చిన రాయలసీమలో 2024 ఎన్నికలలో ఆ పార్టీ దెబ్బతింది.  ముఖ్యంగా వైసీపీకి కొండంత అండగా నిలుస్తూ, ఆ పార్టీకి పెట్టని కోట లాంటి కడన జిల్లాలో కూడా వైసీపీ వెనుక బడింది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని  మొత్తం పది అసెంబ్లీ స్ధానాలలో ఏడింటిని తెలుగుదేశం కూటమి కైవశం చసుకుంది.  ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వైపీనీ కడప లోక్ సభ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోగలిగింది.  అయితే ఇండియా టుడే ,  సి-వోటర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు కడప లోక్ సభ స్థానానికి జగన్, ఆయన పార్టీ తిలోదకాలొదిలేయడం ఖాయమని పేర్కొంది.  ఏపీలో ఇప్పుడు గనక  ఎన్నికలు జరిగితే వైసీపీ  కడప పార్లమెంట్ స్థానంలో సైతం పరాజయం పాలౌతుందని సర్వే పేర్కొంది.  ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 4 ఎంపీ స్థానాల సంఖ్య మరో స్థానం పెరిగి 5 కి చేరుకునే అవకాశం ఉందదని సర్వే పేర్కొన్నప్పటికీ, వైసీపీ కంచుకోట అయిన కడపలో ఓటమి మూటకట్టుకోవడం ఖాయమని ఇండియాటుడే సర్వే పేర్కింది,   {India Today survey, Kadapa MP seat, YCP Kadapa Lok Sabha, India Today C Voter AP survey, TDP AP Lok Sabha seats,  AP politics news, Telugu One}
వైసీపీ లో క్రమశిక్షణా చర్యలు, సస్పెన్షన్లు కేవలం ప్రజాక్షేత్రంలో పరువు కాపాడుకోవడానికి వేసే ఉత్తుత్తి డ్రామాలు మాత్రమేనని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.  పార్టీకీ, పార్టీ ప్రతిష్ఠకు తీరని నష్టం జరిగే వివాదాలలో, ఆరోపణలలో నాయకులు చిక్కుకున్నప్పుడు మాత్రమే.. ప్రజాగ్రహం నుంచి దృష్టి మళ్లించడానికి కంటి తుడుపు చర్యగా వైసీపీలో సస్పెన్షన్లు ఉంటాయని అంటున్నారు. పేరుకే సస్పెన్షన్ తప్ప ఆ నేతలకు పార్టీలో ఉన్న స్థానం, వారి హోదాలు అలాగే కొనసాగుతుంటాయి. ఇందుకు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్సీలు అనంతబాబు, దువ్వాడ శ్రీనివాస్ ల ఉదంతాలే నిలువెత్తు నిదర్శనం అని చెబుతున్నారు.   అనంతబాబు విషయానికి వస్తే... తన వద్ద కారు డ్రైవర్ గా పని చేసి మానేసిన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో హతమైతే, అతడి మృతదేహాన్ని తన సొంత కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు డోర్ డెలివరీ చేశారు ఎమ్మెల్సీఅనంతబాబు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనంతబాబు అరెస్టై జైలుకు కూడా వెళ్లారు. ఇప్పుడు బెయిలుపై బయట తిరుగుతున్నారు అది వేరే సంగతి. కాగా మృతదేహం డోర్ డెలివరీ విషయంలో సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోవైసీపీ ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండైనా ఆయన జగన్ పర్యటనల్లో, పార్టీ సమావేశాలలో యాక్టివ్ గా తిరుగుతూనే ఉన్నారు.  ఒక హత్య కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై శాశ్వత బహిష్కరణ లేదా శాసనమండలి సభ్యత్వ రద్దు దిశగా వైసీపీ ఎటువంటి చర్యా తీసుకోలేదు. కేవలం సస్పెన్షన్ ప్రకటనతో సరిపెట్టి చేతులు దులుపుకుంది.  ఇక దువ్వాడ శ్రీనివాస్ విషయానికి వస్తే.. ఆయన సస్పెన్షన్ కూడా ఉత్తుత్తిదే అని పరిశీలకులు అంటున్నారు.  దువ్వాడ కుటుంబ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి రావడంతో వైసీపీ అధినేత జగన్ తప్పని సరిపరిస్థితుల్లో  దువ్వాడ శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు వేశారు.   అయితే పేరుకే సస్పెన్షన్ తప్ప ఆయన ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్సీగానే చెలామణి అవుతున్నారు. ఇటీవల శాసనమండలిలో వైసీపీ పక్ష సభ్యుడిగా చర్చల్లో పాల్గొని అనుచిత వ్యాఖ్యలతో మరో సారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు.  ఇలా ఉత్తుత్తి సస్పెన్షన్లతో వైసీపీ ప్రజల దృష్టిలో మరింత పలుచన అవుతోందని పరిశీలకులు అంటున్నారు.  {Token Gesture Suspenssions in YCP, MLC Anantha Babu, Duvvada Srinivas}
రాజకీయాల్లో మళ్లీ సర్వేల వేడి రాజుకుంది. మూడ్ ఆఫ్ నేషన్ పేరిట ఇటీవల ఇండియా టుడే సర్వే నిర్వహించింది. అందులో భాగంగా మూడ్ ఆప్ ఆంధ్రప్రదేశ్ సర్వే కూడా ఉంది. ఆ సర్వే ఫలితం వైసీపీకి దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది. ఎందుకంటే.. ఇటీవలే.. వైసీపీకి  అనుకూలంగా ఉన్న ఓ సర్వేను ఆ పార్టీ తన సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది. ఆ సర్వే ప్రకారం.. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందనీ, జగన్ మళ్లీ సీఎం అవుతారనీ వైసీపీ చెప్పుకుని తన భుజాలను తానే చరుచుకుని సంబరాలు చేసుకుంది. అయతే..  ఆ సర్వే కు స్పష్టమైన ఆధారాలు గానీ, విశ్వసనీయత గానీ లేవన్న అభిప్రాయం రాజకీయవర్గాలతో పాటు.. వైసీపీ శ్రేణుల్లో కూడా వ్యక్తమైంది. అది పక్కన పెడితే..    ఇండియా టుడే  సర్వే..   ఏపీలో  ప్రస్తుతం ఉన్న  రాజకీయ పరిస్థితులుకి, ప్రజల మనోభావాలకు అద్దం పట్టేలా ఉందంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఇండియా టుడే మూడ్ ఆఫ్ ఆంధ్ర ఏం చెప్పిందంటే.. ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికిప్రజాదరణ ఇసుమంతైనా తగ్గలేదనీ, ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం కూటమి మరో సారి ఘన విజయం సాధించి అధికారం చేపడుతుందనీ కుండబద్దలు కొట్టింది. అదే సమయంలో వైసీపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోయిందని పేర్కొంది.   ఆ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం పాతిక లోక్ సభ స్థానాలలో  తెలుగుదేశం కూటమి సునాయాసంగా 20 స్థానాలను కైవసం చేసుకుంటుంది.   2024 ఎన్నికల ఫలితాలు పునరావృతమౌతాయిని ఇండియా టుడే సర్వే పేర్కొంది.  రాష్ట్ర ప్రజలలో  తెలుగుదేశం కూటమి నాయకత్వంపై ఇసుమంతైనా నమ్మకం సడలలేదని సర్వేఫలితం పేర్కొంది.  తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లయినప్పటికీ.. ఆ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న సానుకూలత చెక్కు చెదరలేదని ఇండియా టుడే.. సీవోటర్ సర్వే విస్పష్టంగా తేల్చి చెప్పింది.    ఇక వైసీపీ విషయానికి వస్తే.. ఆ సర్వే మేరకు ఆ పార్టీ గ్రాఫ్ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పెరగలేదు సరికదా మరింత కిందకు దిగజారింది.  గత ఎన్నికల్లో 4 లోక్‌సభ స్థానాలకే పరిమితమైన వైసీపీకి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అంతకు మించి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని పేర్కొంది.   రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం కూటమి పాలన పట్ల ప్రజలలో  పూర్తిస్థాయి విశ్వాసం కనిపిస్తోందన్నది సర్వే సారాంశంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం, అమరావతి, పోలవరం పనులను పరుగులు పెట్టించడం, అలాగే..  వైసీపీ  హయాంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను పునఃప్రారంభించి ముందుకు తీసుకెళ్లడం  ప్రజల్లో చంద్రబాబు సర్కార్ పట్ల సానుకూలతను పెంచిందని సర్వే ఫలితం చెబుతోంది.    {Mood of AP. Andhra Pradesh Political Survey, India Today Mood of the Nation AP,  YCP MP Seats, Chandrababu  Governance}  
తెలంగాణ రాజకీయాల్లో  సంచలనం... మజ్లీస్ పార్టీ  అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సొంత పార్టీ ఎమ్మెల్సీనే పార్టీ నుంచి సస్సెండ్ చేశారు. ఏఐఎమ్ఐఎమ్ ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి  సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.  .ఇటీవలి కాలంలో హిజాబ్ వ్యవహారానికి సంబంధించి న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బాహాటంగానే  అసంతృప్తి అసహనం వ్యక్తి చేసిన సంగతి విదితమే.   మహిళల ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ, ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని ప్రకటనలుచేశారు. పలు వేదికలపై మహిళలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత గురించి మాట్లాడారు. అయితే అదే సమయంలో..  సొంత పార్టీ శాసనమండలి సభ్యుడిపై  మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన మరియు వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఎమ్మెల్సీ రహమత్ బేగ్‌పై వేటు వేశారు. ముఖ్యంగా మహిళా సంక్షేమం, గౌరవం గురించి  రహమత్ బేగ్ వ్యవహారంపై పార్టీకి స్పష్టమైన ఆధారాలు లభించడంతోనే అధినేత ఓవైసీ ఈ   చర్య తీసుకున్నారని మజ్లిస్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఇమేజ్‌కు భంగం కలిగించే ఏ చర్యలనైనా ఉపేక్షించేది లేదన్న స్పష్టమైన సందేశాన్నీ, సంకేతాన్ని అసదుద్దీన్ ఈ సస్పెన్షన్ వేటు ద్వారా ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.     {AIMIM MLC Suspended, Asaduddin Owaisi, Mirza Rahmath Baig,  Hyderabad AIMIM Controversy, AIMIM Action on MLC, Telugu One}
  వైసీపీలో  ఆ పార్టీ అధినేత జగన్ కు  సన్నిహితుడిగా  గుర్తింపు పొందిన నెల్లూరు ఫైర్‌బ్రాండ్ లీడర్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్  రాజకీయ సన్యాసం స్వీకరించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది.   ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే అనిల్ కుమార్ యాదవ్, తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి రాజకీయవర్గాలలో ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నారా అన్న చర్చ జోరందుకుంది.   తాను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా గెలిచే అవకాశాలు లేవనీ,  తన రాజకీయ ప్రయాణం అకాలంగా లేదా త్వరలోనే ముగిసిపోయినా  తనకు ఎలాంటి రిగ్రెట్ ఉండదనీ అనిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. నెల్లూరు రాజకీయంలో తనకంటూ ఒక శాశ్వత ముద్ర పడిందన్న అనిల్ కుమార్ యాదవ్.., తన రాజకీయ వారసత్వం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. ఆయన అన్న'తన పొలిటికల్ కెరీర్ కు ప్రీమెచ్యూర్ ఎండ్ అన్న వ్యాఖ్యలు పొలిటికల్ రిటైర్మెంట్ నే సూచిస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నెల్లూరు అర్బన్ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు  విజయం సాధించిన అనిల్ కుమార్ యాదవ్..  జగన్ కేబినెట్‌లో రెండేళ్ల పాటు మంత్రిగా  ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్‌కు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో  జగన్ చేపట్టిన టిక్కెట్ల మార్పుల ప్రక్రియలో భాగంగా,   నెల్లూరు నుంచి తప్పించి నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఈ మార్పు ఆయన రాజకీయ ప్రయాణంలో కోలుకోలేని దెబ్బ తీసింది. నరసరావుపేటలో ఘోర పరాజయాన్ని చవిచూసిన నాటి నుంచి అనిల్ రాజకీయాలకు క్రమంగా దూరమవుతూ వస్తున్నారు. గతంలో పార్టీకి సంబంధించి ప్రతి విషయంలోనూ ముందుండి మాట్లాడే అనిల్ కుమార్ యాదవ్ ఆ ఓటమి తరువాత దాదాపుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో వైసీపీలో కీలక పాత్ర పోషించిన పలువురు సీనియర్ నేతలలాగే.. అనిల్ కుమార్ యాదవ్ కూడా సైలెంటైపోయారు.  ఇప్పుడు ఏకంగా రాజకీయ సన్యాసం సంకేతాలు ఇచ్చారు.    (Anil Kumar Yadav Political Retirement, YCP Leader, Former Minister, Nellore politics,  AP political updates, Telugu One)
ALSO ON TELUGUONE N E W S
శబరిమల అయ్యప్ప స్వామి నేపథ్యంతో తెరకెక్కుతున్న లేటెస్ట్ డివోషనల్ ఎంటర్‌టైనర్ మూవీ 'హరివరాసనం' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన నూతన షెడ్యూల్ పంబ మరియు నిలక్కల్ ప్రాంతాలలో ప్రారంభమైంది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది. రాజేష్ నాయర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో తమిళ పాపులర్ కమెడియన్ యోగి బాబు, వర్సటైల్ నటుడు షైజు కురుప్ మరియు సంపత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా పంబ లోయలు, నిలక్కల్ అటవీ ప్రాంతాల్లోని సహజసిద్ధమైన లొకేషన్లలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అటవీ శాఖ మరియు సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతులు పొందిన చిత్రయూనిట్, అన్ని నిబంధనలను పాటిస్తూ చిత్రీకరణ కొనసాగిస్తోంది. ప్రారంభంలో అనుమతుల విషయమై చిన్నపాటి అయోమయం నెలకొన్నప్పటికీ, అధికారులు మరియు ప్రొడక్షన్ టీమ్ చర్చల అనంతరం షూటింగ్‌ను సాఫీగా సాగిస్తున్నారు. ఈ చిత్రానికి డాక్టర్ అంబాడి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, అయ్యప్ప స్వామి భక్తి భావనలు మరియు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో కథను మలచినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నెల రోజులకు పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తాజా షెడ్యూల్‌తో ప్రధాన ఘట్టాల చిత్రీకరణను ముగించనుంది. యోగి బాబు తన నటనతో అటు తమిళంతో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకోగా, షైజు కురుప్ తనదైన శైలిలో వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై సౌత్ సినీ ప్రియుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా శబరిమల లొకేషన్లలో జరుగుతున్న ఈ షూటింగ్ విశేషాలు వైరల్ అవుతున్నాయి. అయ్యప్ప స్వామికి అత్యంత ప్రియమైన 'హరివరాసనం' శీర్షికతో వస్తుండటంతో భక్తులు మరియు సినీ ప్రేక్షకులు ఈ ప్రాజెక్ట్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించనుంది.
తెలుగు సినీ రంగానికి చెందిన డాన్స్ యూనియన్‌లో ఒక ఆసక్తికరమైన మరియూ కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ పేరును సభ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు యూనియన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా డ్యాన్సర్స్ యూనియన్‌లో సభ్యుల సంక్షేమం, వేతనాలు, అలాగే వర్కింగ్ కండిషన్స్‌కి సంబంధించి పలు అంశాలు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో పరిశ్రమలోని సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న రఘు మాస్టర్ అయితే యూనియన్‌ను సరైన బాటలో నడిపించగలరని మెజారిటీ డ్యాన్సర్లు భావిస్తున్నారు. అందుకే ఆయనను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాల్సిందిగా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. రియాలిటీ డ్యాన్స్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకొని, ఆ తర్వాత వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ పాటలకు అద్భుతమైన స్టెప్పులు సమకూర్చిన రఘు మాస్టర్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అగ్ర హీరోల సినిమాలతో పాటు యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లకు కొరియోగ్రఫీ చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన, టెలివిజన్ రంగంలోనూ న్యాయ నిర్ణేతగా అలరించారు. యూనియన్‌లోని సీనియర్ మరియు జూనియర్ డ్యాన్సర్లతో మంచి అనుబంధం కలిగిన రఘు మాస్టర్, ఎల్లప్పుడూ వారి సమస్యల పరిష్కారానికి ముందుంటారనే పేరుంది. ఈ కారణంగానే ఆయనకు అధ్యక్ష పీఠం అప్పగించేందుకు యూనియన్ వర్గాలు మొగ్గు చూపుతున్నాయి. తాజాగా వెలువడిన ఈ వార్తలపై ఇటు సినీ వర్గాల్లోనూ, అటు సోషల్ మీడియాలోనూ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రఘు మాస్టర్ ఈ బాధ్యతలను స్వీకరిస్తే యూనియన్‌కు సరికొత్త ఊపు వస్తుందని డ్యాన్సర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనపై రఘు మాస్టర్ త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆయన అధ్యక్ష బాధ్యతలను స్వీకరించి యూనియన్ ఎన్నికలు లేదా ఏకగ్రీవ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.       [Raghu Master, Telugu Film Dancers Union, Choreographer Raghu Master, Tollywood Dance Masters, TeluguOne TMDB]
టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 100వ చిత్రం 'కింగ్ 100' ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. ఈ ల్యాండ్‌మార్క్ మూవీకి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను ఇటీవల నాగార్జున పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని చిత్రబృందం విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలైన స్వల్ప వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై విధ్వంసం సృష్టిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ గ్లింప్స్ విడుదలైన కొద్ది గంటల్లోనే 8 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్‌ను సాధించి సరికొత్త రికార్డులను నమోదు చేసింది. 'The REIGN continues to grow. The KING continues to rule' అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ వీడియోలో నాగార్జున వింటేజ్ కింగ్ లుక్‌లో అదరగొట్టారు. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్, నాగ్ బాడీ లాంగ్వేజ్ అక్కినేని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గ్లింప్స్ చివర్లో 'లాంగ్ లివ్ ది కింగ్' అంటూ వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ మైలురాయి చిత్రానికి కోలీవుడ్ విలక్షణ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా నాగార్జున సరసన సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ క్రేజీ కాంబినేషన్ చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ మరియు టీ-సిరీస్ సౌత్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నాగార్జున సినీ ప్రస్థానంలోనే ఇది ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నాగార్జునకు అభిమానులు ఎంతో ఇష్టంగా పిలుచుకునే 'కింగ్' పేరుతోనే 100వ సినిమా రావడం విశేషం. గ్లింప్స్‌కి వచ్చిన ఈ రికార్డు స్థాయి స్పందనతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర ఆనందంలో ఉన్నారు. నెట్టింట 'కింగ్ 100' హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. ఈ క్రేజీ మూవీ విడుదల తేదీపై కూడా చిత్రబృందం స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది చివరిలో 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ పండుగ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గ్లింప్స్‌తోనే ఈ స్థాయి సంచలనం సృష్టించిన నాగార్జున, థియేటర్లలో ఏ రేంజ్ రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.     [Nagarjuna King 100, Akkineni Nagarjuna 100th film, King 100 Glimpse Views, R Karthik, TeluguOne TMDB]
స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో ఎవరు అనేది నిన్నటిదాకా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ సస్పెన్స్ కు తెర దించుతూ మేకర్స్ ఆ యంగ్ హీరో ఎవరు ?, ఆయన సినిమా ఏంటి ? అనేది అనౌన్స్ చేశారు. స్లీప్ వాకింగ్ చేస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్, ఆయన నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్" అంటూ మేకర్స్ ఈ రోజు ప్రకటించారు. ఈ మూవీ టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "టార్టాయిస్" సినిమాను ఎస్ కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎన్ వీ ఎల్ క్రియేషన్స్ బ్యానర్స్ పై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. "టార్టాయిస్" సినిమాను సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్, సంతోష్ ఇమ్మడి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తన్నారు. "టార్టాయిస్" సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో ఒక డెడ్ బాడీ పక్కన హీరో రాజ్ తరుణ్ రక్తపు మరకలతో కూర్చుని ఉండటం, ఆయన పక్కనే ఒక కత్తి పడి ఉండటం ఆసక్తి రేపుతోంది. రాజ్ తరుణ్ తన కెరీర్ లో ఇప్పటిదాకా చేయని ఒక కొత్త తరహా ఇంటెన్స్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్ తో తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు. నటీనటులు - రాజ్ తరుణ్, అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్, తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్ - బెమనొల శ్రీకాంత్, కొరియోగ్రఫీ - రాజ్ కృష్ణ, వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ - దేవర మధుకర్, ఎడిటర్ - గుళ్లపల్లి మాధవ్ కుమార్, డీవోపీ - శబరి విగ్నేష్, మ్యూజిక్ - అనూప్ రూబెన్స్, కో ప్రొడ్యూసర్స్ - మానస కుమార్, సంతోష్ ఇమ్మడి, ప్రొడ్యూసర్స్ - విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రిత్విక్ కుమార్. 
సినిమా వైఫల్యం ఎడిటింగ్ టేబుల్‌పై మొదలవదు.కథ పుట్టిన క్షణంలోనే మొదలవుతుంది. “బ్యాడ్ ఐడియాతో కథను ఎంత గొప్పగా అభివృద్ధి చేసి, షూటింగ్‌కు సిద్ధం చేసినా, బూడిదలో పన్నీరు పోసినట్టే.”సినిమా నిర్మాణంలో అత్యంత ఖరీదైన తప్పు ఏమిటి?బడ్జెట్ కొంత పెరగడం కాదు.కొన్ని షూటింగ్ రోజులు వృథా కావడం కాదు.పోస్ట్‌ప్రొడక్షన్‌లో ప్యాచ్‌వర్క్‌లు, రీషూట్‌లు రావడం కాదు.అన్నింటికంటే ఖరీదైన తప్పు,మొదటి నుంచే బలహీనమైన కథా ఆలోచనను ప్రేమించడం.ఒక బలహీనమైన ఐడియాను పట్టుకుని దర్శకుడు, రచయిత నెలల తరబడి ప్రయాణిస్తారు. దానికి కథను కడతారు. కథనాన్ని అల్లుతారు. పాత్రలను సృష్టిస్తారు. బౌండెడ్ స్క్రిప్ట్ రాస్తారు. హీరో, హీరోయిన్, విలన్‌లను ఖరారు చేస్తారు. లొకేషన్లు వెతుకుతారు. బడ్జెట్ వేస్తారు. క్రూను సమీకరిస్తారు. చివరకు షూటింగ్ ప్రారంభిస్తారు.అన్నీ పూర్తయ్యాక ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని,“ఏదో మిస్ అయింది”అంటారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయి ఉంటుంది.ఎందుకంటే అప్పటికి సినిమా శరీరం మాత్రమే మిగిలి ఉంటుంది. ప్రాణం మాత్రం కథ పుట్టినప్పుడే పోయి ఉంటుంది.ఐడియా అంటే కథ కాదు.సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు మనం తరచుగా అంటుంటాం.“ఐడియా చాలా బాగుంది!”కానీ అసలు ప్రశ్న?బాగున్న ఐడియా అంటే ఏమిటి?ఒకే వాక్యంలో చెప్పగలిగే కాన్సెప్టా?కొత్తదనమున్న పాయింటా?షాకింగ్ ట్విస్టా?హీరోకు ఉన్న పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషనా?లేక ప్రేక్షకుడిలో భావోద్వేగాన్ని రగిలించగలిగే అవకాశమా?నిజానికి సినిమా ఐడియా వీటిలో ఏ ఒక్కటి కాదు.ఒక ఐడియాలో పూర్తి సినిమా దాగి ఉందా లేదా అన్నదే అసలు ప్రశ్న.ఉదాహరణకు:“ఒక పోలీస్ తన సొంత అన్నను అరెస్ట్ చేయాల్సి వస్తుంది.”ఇది వినడానికి ఆసక్తికరమైన ఐడియా. కానీ ఇక్కడి నుంచే నిజమైన కథ మొదలవుతుంది.ఎందుకు అరెస్ట్ చేయాలి?అన్న చేసిన నేరం ఏమిటి?అతను నిజంగానే నేరస్థుడా?పోలీసు తన అన్నను అరెస్ట్ చేయాల్సిన పరిస్థితికి ఎందుకు వస్తాడు?అరెస్ట్ చేస్తే కుటుంబం ఏం కోల్పోతుంది?అరెస్ట్ చేయకపోతే పోలీసు ఏం కోల్పోతాడు?అతని వృత్తి ప్రమాదంలో పడుతుందా?అతని కుటుంబం చీలిపోతుందా?అన్నను కాపాడటం ధర్మమా?చట్టాన్ని కాపాడటం ధర్మమా?కాన్ఫ్లిక్ట్, స్టేక్స్, ఎమోషన్, క్యారెక్టర్ జర్నీ, థీమ్ ఇవన్నీ ఆ ఐడియాలోనే విత్తనాలుగా ఉండాలి.అవి లేకపోతే అది సినిమా ఐడియా కాదు.అది కేవలం ఒక సంఘటన.“నా ఐడియా గొప్పది” అనే ప్రమాదకరమైన అహంకారంసినిమా ప్రపంచంలో ఒక విచిత్రమైన మానసిక స్థితి తరచూ కనిపిస్తుంది.“ఈ ఐడియా నాదే.”“ఇలాంటి కథ ఇంతవరకు ఎవరూ చెప్పలేదు.”“నాకు ఈ కథ చాలా నచ్చింది.”“ఈ పాత్రను నేను చాలాప్రేమిస్తున్నాను.”“ప్రేక్షకులకు అర్థం కాకపోయినా పర్లేదు.” ఇలాంటి మాటలు వినిపించినప్పుడు ఒక సృజనకర్త అప్రమత్తం కావాలి.ఎందుకంటే రచయితకు నచ్చినది ప్రేక్షకుడికి నచ్చుతుందనే గ్యారెంటీ లేదు.దర్శకుడికి కొత్తగా అనిపించినది ప్రేక్షకుడికి కొత్తగా అనిపించకపోవచ్చు.రచయితకు అత్యంత భావోద్వేగంగా అనిపించిన సన్నివేశం ప్రేక్షకుడి కళ్లలో నీళ్లు తెప్పించాలంటే, ఆ భావోద్వేగానికి స్క్రీన్‌ప్లే కారణాన్ని నిర్మించాలి.అందుకే రచయిత తనను తాను అడగాల్సిన ప్రశ్న?“నేను ఈ కథను ఎందుకు ప్రేమిస్తున్నాను?”కాదు. “ప్రేక్షకుడు ఈ కథను ఎందుకు ప్రేమించాలి?”అనేదే. ‘The Good Dinosaur’ చెప్పే గొప్ప పాఠం ఇక్కడ అవసరం.“The Good Dinosaur” కథా అభివృద్ధి కూడా ఐడియా నుంచి సినిమాగా మారే ప్రయాణంలో ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతుంది.“ఆస్టరాయిడ్ భూమిని ఢీకొనకపోతే?”అనే ఒక ఆసక్తికరమైన What If? ఆలోచనతో సినిమా ప్రయాణం మొదలైంది.ఇది చెడ్డ ప్రశ్న కాదు. నిజానికి అద్భుతమైన ప్రిమైజ్. కానీ ప్రిమైజ్ నుంచి పూర్తి సినిమాగా మారే క్రమంలో కథ అనేక మలుపులు తిరిగింది. కథ తన సహజమైన దారిని కోల్పోతోందనే భావనతో భారీ స్థాయిలో అభివృద్ధి, మార్పులు అవసరమయ్యాయి.ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా స్పష్టంగా ఉంది.గుడ్ ఐడియా కూడా బ్యాడ్ డెవలప్‌మెంట్ వల్ల చనిపోవచ్చు. అదే సమయంలో,బ్యాడ్ ఐడియాను ఎంత గొప్పగా డెవలప్ చేసినా దానికి ఒక పరిమితి ఉంటుంది. అందుకే దర్శకుడు తనను తాను ఒక దశలో ఆపుకుని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే?“నేను ఈ కథను రక్షిస్తున్నానా? లేక సినిమాను రక్షిస్తున్నానా?”“ఇంత చేశాం కదా…” ఇదే అసలు ఉచ్చు అని చెప్పవచ్చు.ఒక దర్శకుడు ఆరు నెలలు కథపై పనిచేస్తాడు.మూడు నెలలు బౌండెడ్ స్క్రిప్ట్‌పై కష్టపడతాడు,మరో నెల క్యాస్టింగ్‌పై వెచ్చిస్తాడు,లొకేషన్లు చూస్తాడు,ప్రొడక్షన్ డిజైన్ మొదలవుతుంది.బడ్జెట్ ఖరారవుతుంది.అప్పుడొక రోజు మనసులో చిన్న అనుమానం మొదలవుతుంది.“ఎక్కడో తేడా కొడుతోంది అని.అప్పుడు చాలామంది చేసే పొరపాటు,“ఇంత చేశాం కదా, ఇంకొంచెం చేస్తే బాగుపడుతుంది.”ఇదే ప్రమాదకరమైన మలుపు. ఇక్కడే ‘Sunk Cost Fallacy’మొదలవుతుంది. అప్పటికే ఖర్చు చేసిన సమయం, డబ్బు, శ్రమను కాపాడుకోవడానికి మరింత సమయం, మరింత డబ్బు ఖర్చు చేస్తారు.చివరికి,చెడ్డ సినిమాను కాపాడటానికి పెద్ద మొత్తాన డబ్బును ఖర్చు చేస్తారు.నిర్మాతకు నష్టం అక్కడ మొదలవుతుంది.అందుకే కథను ఐడియా దశలోనే వదిలేయడం వైఫల్యం కాదు.అది తెలివైన ఆర్థిక నిర్ణయం. “Kill Your Darlings” ఎందుకు అవసరం?రచయితకు ఎంతో ఇష్టమైన సన్నివేశాన్ని అవసరమైతే తొలగించగలిగే ధైర్యం ఉండాలి.దర్శకుడు తనకు ఎంతో నచ్చిన పాత్రను కథ నుంచి తొలగించగలగాలి.హీరో తనకు నచ్చిన ఎలివేషన్ సీన్‌ను వదులుకోగలగాలి.ఎందుకంటే? సినిమాకు ఉపయోగపడనిదేదైనా, ఎంత అందంగా ఉన్నా చివరికి అది చెత్తే.ఒక అద్భుతమైన సన్నివేశం కథను ముందుకు తీసుకెళ్లకపోతే, అది స్క్రీన్‌ప్లేకు అలంకారం కాదు,భారం.ఒక అద్భుతమైన పాత్ర కథానాయకుడి ప్రయాణాన్ని మార్చకపోతే, అది పాత్ర కాదు,స్క్రీన్‌ప్లేలో అదనపు బరువు.సినిమా అంటే మనకు నచ్చినవన్నీ తెరపై పెట్టడం కాదు.సినిమా అంటే కథకు అవసరమైనవాటిని మాత్రమే మిగిల్చడం.కథను ఓకే చేయడం కాదు,కథను పరీక్షించడం ముఖ్యం సినిమా వ్యాపార విజయానికి మొదటి మెట్టు కథను తొందరగా ఓకే చేయడం కాదు.కథలోని బలహీనతలను షూటింగ్‌కు ముందే గుర్తించడం.ఒక మంచి దర్శకుడు, ఒక మంచి నిర్మాత కొన్ని అసౌకర్యమైన ప్రశ్నలను కథపై విసరాలి.ఈ సినిమా ఎందుకు తీయాలి?ఇది ఇప్పుడే ఎందుకు చెప్పాలి?ప్రేక్షకుడు ఈ కథ కోసం థియేటర్‌కు ఎందుకు రావాలి?ఈ కథలో మనకు తెలియని కొత్త విషయం ఏమిటి?హీరో ఈ కథలో ఏం కోల్పోతున్నాడు?ఈ కథను తీసేస్తే మనం ఏం కోల్పోతాం? ఇవన్నింటికంటే భయంకరమైన ప్రశ్న ఒకటి ఉంది. “ఈ సినిమా లేకపోతే ప్రపంచానికి ఏమి నష్టం?” ఆ ప్రశ్నకు నిజాయితీగా సమాధానం దొరకకపోతే,సినిమా చేయకపోవడమే బహుశా తెలివైన నిర్ణయం. నిర్మాతకు “సినిమా చేయకండి” అని చెప్పగలిగే వ్యక్తి కూడా కావాలినిర్మాత పెట్టుబడి పెట్టేది కేవలం షూటింగ్‌లో కాదు.స్టోరీ డెవలప్‌మెంట్,రైటర్ ఖర్చు,డైరెక్టర్ ఖర్చు,క్యాస్టింగ్,లొకేషన్లు,ఎక్విప్‌మెంట్,క్రూ, ట్రావెల్,పోస్ట్‌ప్రొడక్షన్,మార్కెటింగ్,ఒక్కో దశలో పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది.అందుకే కథను ఐడియా దశలోనే చంపడం ఖరీదైన నిర్ణయం కాదు.నిజానికిఅది అత్యంత చవకైన నిర్ణయం.పది రోజులకు ఒక కథను వదిలేయడం చవక.పది నెలల తర్వాత వదిలేయడం ఖరీదు.షూటింగ్ పూర్తయ్యాక వదిలేయడం అత్యంత దారుణం.ఎందుకంటే కథను చంపే ధైర్యం లేకపోతే, చివరికి సినిమా నిర్మాతను చంపుతుంది.ప్రతి దర్శకుడు, ప్రతి రచయిత చేయాల్సిన “10 పరీక్షలు” 1. నాలుగు పేజీల ఒక వాక్య పరీక్ష నాలుగు పేజీల కథను  ఒక వాక్యంలో స్పష్టంగా చెప్పగలమా? 2. ఐదు వాక్యాల పరీక్ష ఐదు వాక్యాల్లో కథ యొక్క ఆత్మను చెప్పగలమా? 3. హీరో పరీక్ష హీరో ఎవరు? అతనికి నిజంగా ఏం కావాలి? 4. సంఘర్షణ పరీక్ష హీరోకు అడ్డుగా ఎవరు ఉన్నారు? అతని ప్రయాణాన్ని ఏ శక్తి ఆపుతోంది? 5. స్టేక్స్ పరీక్ష హీరో ఓడిపోతే ఏం కోల్పోతాడు? కోల్పోయేది ఏమీ లేకపోతే ప్రేక్షకుడికి టెన్షన్ ఎందుకు వస్తుంది? 6. ఎమోషన్ పరీక్ష ప్రేక్షకుడు ఎక్కడ ఏడవాలి? ఎక్కడ నవ్వాలి? ఎక్కడ భయపడాలి? ఎక్కడ ఉత్కంఠకు గురికావాలి? ఎక్కడ హీరోతో కలిసి ప్రయాణించాలి? 7. సన్నివేశాల పరీక్ష ఈ కథ నుంచి కనీసం పది గుర్తుండిపోయే గొప్ప సన్నివేశాలు పుడుతున్నాయా? ఐడియా గొప్పదా కాదా అన్నది ఒక లైన్ చెప్పదు. అది ఎన్ని గొప్ప సన్నివేశాలకు జన్మనిస్తుందో చెబుతుంది. 8. సెకండాఫ్ పరీక్ష ఇంటర్వెల్ తర్వాత కథకు కొత్త సమస్య పుడుతుందా? లేక మొదటి భాగంలో మొదలైన సమస్యనే సాగదీస్తున్నామా? 9. క్లైమాక్స్ పరీక్ష క్లైమాక్స్ హీరో నిర్ణయం వల్ల వస్తుందా? లేక కథ అతన్ని అక్కడికి లాక్కెళ్లిందా? గొప్ప క్లైమాక్స్ అనేది సంఘటన కాదు—హీరో తీసుకున్న అనివార్యమైన నిర్ణయం. 10. “Why This Film?” పరీక్ష చివరగా ఒక్క ప్రశ్న? “ఈ కథను నేను ఎందుకు చెప్పాలి?”ఈ ఒక్క ప్రశ్నకు కూడా రచయిత నిజాయితీగా సమాధానం చెప్పలేకపోతే…స్క్రిప్ట్ రాయడం ప్రారంభించకపోవడమే మంచిది.ఎందుకంటే మంచి సినిమా రాయడం కంటే, తీయకూడని సినిమాను ముందుగానే గుర్తించడం గొప్ప సృజనాత్మక విజ్ఞానం.కథ పుట్టిన క్షణంలోనే సినిమా భవిష్యత్తు రాయబడుతుంది.అక్కడే దానికి ప్రాణం పోయవచ్చు.అక్కడే దాని ప్రాణం తీయవచ్చు. కాబట్టి షూటింగ్‌కు ముందు కథను చంపడానికి భయపడకండి.ఎందుకంటే?“బ్యాడ్ ఐడియాతో సినిమా తీయడం  అంటే బూడిదలో పన్నీరు పోసినట్టే!” By Prakash Surya is a distinguished Writer and Award-winning Filmmaker, honored with two Nandi Awards. A rigorous D.F.Tech academic background shapes his expertise as a dedicated researcher and Screenwriter focused on contemporary Cinema. His writings aim to deepen Film appreciation and foster meaningful scholarly dialogue in the Cinematic arts. courtesy: Prakash Surya     [Screenplay writing tips, Movie story development process, Filmmaking common mistakes, Film production decision making, Concept vs Story in filmmaking, Cinematic storytelling guide]
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47'. హారిక హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, అక్టోబర్ 2న థియేటర్లలో అడుగుపెట్టాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీ వాయిదా పడినట్లు తెలుస్తోంది. 'ఆదర్శ కుటుంబం' సినిమా ఒక వారం లేదా రెండు వారాలు ఆలస్యంగా రానుందని సమాచారం. అక్టోబర్ 9, అక్టోబర్ 16.. ఈ రెండిట్లో ఏదో ఒక తేదీని లాక్ చేసే పనిలో ప్రస్తుతం మూవీ టీమ్ ఉందట. దసరా సెలవులను దృష్టిలో ఉంచుకొని.. అక్టోబర్ 16 వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇప్పటికే అక్టోబర్ 16 పై విజయ్ దేవరకొండ 'రణబాలి' మూవీ కర్చీఫ్ వేసింది. ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' కూడా అదే డేట్ ను లాక్ చేస్తే.. ఓ వైపు పీరియడ్ యాక్షన్ డ్రామా, మరోవైపు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తో దసరా బాక్సాఫీస్ ఫైట్ ఆసక్తికరంగా మారనుంది. కాగా, 'ఆదర్శ కుటుంబం'లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.        [Aadarsha Kutumbam, Postponed, Venkatesh, Trivikram, Vijay Deverakonda, Ranabaali, Telugu Cinema News, Telugu News]
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ హీరోగా నటించి, బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించిన 'DC' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వామికా గబ్బి ప్రధాన పాత్రలో నటించగా, అనిరుధ్ సంగీతం అందించారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్లాక్‌బస్టర్ సినిమా సెప్టెంబర్ 4 నుండి 'సన్ నెక్ట్స్'లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. మామూలుగా లోకేశ్ కనగరాజ్ అంటేనే స్క్రీన్ మీద పవర్‌ఫుల్ హీరోలు, ఎలివేషన్లు, గూస్‌బంప్స్ యాక్షన్ సీన్లు గుర్తుకొస్తాయి. కానీ ఈసారి ఆయన కెమెరా వెనుక కాదు.. కెమెరా ముందు నిలబడి, ఒక రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాతో అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఆయనకు జోడీగా వామికా గబ్బి పర్‌ఫార్మెన్స్, అరుణ్ మాథేశ్వరన్ టేకింగ్, అన్నిటికీ మించి అనిరుధ్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాను వేరే లెవెల్‌కి తీసుకెళ్లాయి. అందుకే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిసింది. https://x.com/sunnxt/status/2093677584777199618       [DC Movie, OTT Release, Lokesh Kanagaraj, Arun Matheswaran, Wamiqa Gabbi, Anirudh Ravichander, Telugu Cinema, Telugu News, Tollywood]  
  మాటకి మహాత్యమే కాదు బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడిస్తు కలెక్షన్ల వర్షాన్ని కురిపించే శక్తీ కూడా ఉందని నిరూపించిన త్రివిక్రమ్, దర్శకుడుగా కూడా అదే పంధాని అనుకరిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ తో ఆదర్శ కుటుంబాన్ని సెట్స్ పై ఉంచి ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ పనిలో కూడా ఉన్నాడు.   రీసెంట్ గా సోషల్ మీడియాలో త్రివిక్రమ్ గతంలో 'అజ్ఞాతవాసి' మూవీ గురించి చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి. త్రివిక్రమ్ మాట్లాడుతు 'అజ్ఞాతవాసి వల్ల వచ్చిన నష్టాలని క్లియర్ చేయడానికి నిర్మాత రాధాకృష్ణతో కలిసి రెండు రోజుల్లోనే ఆర్థిక సమస్యలని క్లోజ్ చేసాం. నా రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేయడంతో పాటు ఆ సమయంలో జూబ్లీ హిల్స్ లో కొత్త ఇంటిని నిర్మిస్తున్నాను. దీంతో నష్టాల నుంచి గట్టెక్కడానికి నిర్మాణంలో ఉన్న ఇల్లుని అమ్మేయాలనుకున్నాను. ఈ విషయం నా భార్య పిల్లలకి చెప్తే నా ఇష్టం అన్నారని త్రివిక్రమ్ చెప్పాడు. ఇప్పుడు ఈ న్యూస్ అనే కాదు చాలా పాత సినిమా న్యూస్ వైరల్ గా మారుతున్నాయి. ఇందుకు కారణం టాక్సిక్ పరాజయం ఒడిలో షికారు చేస్తుంది కాబట్టి. Also read: టాక్సిక్: మూవీ చూసిన జపాన్ లేడీ ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్.. ఫ్యాన్స్ హడావిడి   పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో' జల్సా, అత్తారింటికి దారేది తర్వాత  'అజ్ఞాతవాసి' వచ్చింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించగా నాగ వంశీ సహా నిర్మాత. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో వచ్చిన 'జులాయి' తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ స్టార్ట్ అవ్వగా, త్రివిక్రమ్ దర్శకత్వంలోనే వచ్చిన    జులాయి నుంచి ప్రస్తుత ఆదర్శ కుటుంబం, నెక్స్ట్ గాడ్ ఆఫ్ వార్ వరకు అన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నే నిర్మించింది. ఆ బ్యానర్ కూడా త్రివిక్రమ్ తో తప్ప ఇంకెవరి తో సినిమాలు చెయ్యలేదు.      [Trivikram Srinivas, Agnyaathavaasi, Pawan Kalyan, Radhakrishna, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]    
మొదట్లో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' లాంటి కామెడీ సినిమాలతో అలరించిన దర్శకుడు మేర్లపాక గాంధీ, ఇటీవల 'కొరియన్ కనకరాజు' అనే హారర్ కామెడీ ఫిల్మ్ తో ఆకట్టుకున్నారు. అయితే తన నెక్స్ట్ మూవీ కోసం కంప్లీట్ రూట్ మార్చబోతున్నారు. కామెడీ పక్కన పెట్టి, ప్రేక్షకులను థియేటర్లలో సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే ఒక మైండ్ బ్లోయింగ్ సీరియస్ హారర్ కథను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రముఖ హీరోయిన్‌ తాప్సీ పన్ను లీడ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.  తాప్సీ గతంలో 'ఆనందో బ్రహ్మ' లాంటి హార్రర్ కామెడీతో నవ్వించి భయపెట్టారు. కానీ ఈసారి కాన్సెప్ట్ పూర్తిగా వేరు. ఇది కామెడీ కాంబినేషన్ అసలే కాదు.. పక్కా డార్క్, సీరియస్ అండ్ ఇంటెన్స్ హారర్ ఫిల్మ్ అని సమాచారం. దర్శకుడు మేర్లపాక గాంధీ రాసుకున్న ఈ స్క్రిప్ట్‌లో ఉండే సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తాప్సీని బాగా ఆకట్టుకున్నాయట. కథ వినగానే తాప్సీ ఎంతో ఎక్సైట్ అయి వెంటనే ప్రాజెక్ట్‌కి ఒకే చెప్పేశారనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక వైపు కంటెంట్ బేస్డ్ రోల్స్ ఎంచుకునే తాప్సీ, మరోవైపు డిఫరెంట్ టేకింగ్ ఉన్న గాంధీ జతకడితే బాక్సాఫీస్ వద్ద విజిల్స్ పడాల్సిందే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన  అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.       [Merlapaka Gandhi, Taapsee Pannu, Horror Film, Korean Kanakaraju, Telugu Horror Movie, Telugu Cinema, Tollywood, Telugu News]  
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతం ఒక్కటే పేరు మారుమోగిపోతోంది.. అదే 'ఇరుముడి'. మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూలు చేసి రవితేజ కెరీర్‌లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. అసలు ఎటువంటి హంగులు లేని ఒక ప్యూర్ ఎమోషనల్ అండ్ డివైన్ కంటెంట్‌తో ఈ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సీలేరు ప్రాంతంలో ఆటో నడుపుకునే త్రినాథ్ అనే సగటు తండ్రి పాత్రలో రవితేజ జీవించేశారు. తన కూతురు మణెమ్మే తన ప్రపంచంగా భావించే త్రినాథ్, ఊరిలో ఏ ఆడపిల్లకు కష్టం వచ్చినా తన బిడ్డలాగే అండగా నిలబడతాడు. కార్తీక మాసంలో అయ్యప్ప మాల ధరించి ఆయన పాటించే నిష్ఠ, అలాగే ఊరి గురుస్వామి కూతురు మిస్ అయినప్పుడు త్రినాథ్ పడే తపన ప్రతి ఒక్కరి గుండెల్ని పిండేస్తుంది. 'మల్లెపూల పల్లకి' పాట నుండి క్లైమాక్స్ వరకు దర్శకుడు శివ నిర్వాణ డివైన్ ఎలిమెంట్స్‌ని, ఫాదర్-డాటర్ ఎమోషన్‌ని బ్లెండ్ చేసిన తీరు థియేటర్లలో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఫస్ట్ వీకెండ్ మాత్రమే కాదు.. వీక్‌డేస్‌లో కూడా హౌస్‌ఫుల్ బోర్డులతో 'ఇరుముడి' అన్-స్టాపబుల్ రన్ కొనసాగిస్తోంది. కేవలం నైజాం రీజియన్‌లోనే 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డులు తిరగరాసింది. తక్కువ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా, బయ్యర్లకు లాభాల వర్షం కురిపిస్తోంది. రవితేజ ఎమోషనల్ పర్ఫార్మెన్స్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సోల్‌ఫుల్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. మాస్ మహారాజాలోని కంప్లీట్ యాక్టర్‌ని బయటకు తీసి, కుటుంబ ప్రేక్షకులు, అయ్యప్ప భక్తులు, యూత్ అందరూ కలసి చూసేలా శివ నిర్వాణ తీర్చిదిద్దిన విధానమే ఈ 150 కోట్ల హిస్టారిక్ సక్సెస్‌కు అసలైన కారణం. సెకండ్ వీకెండ్ పూర్తయ్యే సరికి రూ.200 కోట్లకు చేరువై.. ఫుల్ రన్ లో రూ.300 కోట్ల క్లబ్ లో చేరినా ఆశ్చర్యంలేదు.       [Irumudi Movie, Box Office, Collection, 150 Crores Gross, Ravi Teja, Shiva Nirvana, Telugu Cinema News, Telugu News, Tollywood]  
ఇంట్లో ఇనా బయటకు వెళ్ళినప్పుడు అయినప్పుడు అయినా దాహం వేయగానే మొదట నీరు తాగుతారు. వర్షాకాలంలో అయితే బయటకు వెళ్ళినప్పుడు నీరు తాగడం తక్కువే అయినా ప్రయాణాల్లో, ఏదైనా ఆహారం తిన్నప్పుడో తప్పనిసరిగా కొన్నిసార్లు బయట నీరు తాగాల్సి వస్తుంది. వర్షాకాలంలో దాహం వేసినప్పుడు బయట దొరికే నీటిని తాగడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో బ్యాక్టీరియా, వైరస్‌లు నీటి ద్వారా వేగంగా వ్యాపిస్తాయి. అందువల్ల ఈ కాలంలో తాగే నీటి విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో బయటి నీరు తాగడం వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే.. మురుగు నీరు కలవడం.. వర్షాల వల్ల బయట డ్రైనేజీ వ్యవస్థలు పొంగిపొర్లుతాయి. పైప్‌లైన్లలో లీకేజీల వల్ల తాగునీటిలో మురుగు నీరు కలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బయట హోటళ్లు, రోడ్డు పక్కన బండ్ల వద్ద ఇచ్చే నీరు ఇలా కలుషితమైనదే అయి ఉండవచ్చు. ప్రమాదకర వ్యాధులు.. కలుషిత నీటిని తాగడం వల్ల కలరా, టైఫాయిడ్, కామెర్లుగా పిలుచుకునే  జాండీస్, గ్యాస్ట్రోఎంటరైటిస్, విరేచనాలు వంటి నీటి ద్వారా వ్యాపించే తీవ్రమైన రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఐస్ క్యూబ్స్ తో జాగ్రత్త..  చాలామంది బయట పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తాగేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేయించుకుంటారు. కానీ ఆ ఐస్ తయారీకి ఏ నీటిని వాడారో తెలియదు. తరచుగా పరిశుభ్రంగా లేని నీటితోనే ఐస్ తయారు చేస్తారు కాబట్టి బయట తాగే పానీయాల్లో ఐస్ తీసుకోకపోవడమే మంచిది. ఫిల్టర్ నీరు అని నమ్మకండి.. బయట బోర్డు మీద ఫిల్టర్ వాటర్ అని రాసి ఉన్నంత మాత్రాన అది పూర్తిగా సురక్షితం కాకపోవచ్చు. నీటిని శుభ్రం చేసే యంత్రాల నిర్వహణ సరిగ్గా లేకపోయినా అందులో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ ఇంట్లో కాచి చల్లార్చిన నీటిని  బాటిల్ లో వెంట తీసుకెళ్లడం చాలా మంచిది.  ఒకవేళ బయట నీరు తాగాల్సి వస్తే, నాణ్యమైన సీల్ చేసిన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ మాత్రమే కొనుగోలు చేయడం మంచిది. 10,20 ఖర్చు ఎందుకని ఎక్కడంటే అక్కడ నీరు తాగితే.. ఆ తర్వాత హాస్పిటల్స్ కోసం వందలు, వేలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. వాటర్ బాటిల్ వన్ ముందు.. బాటిల్ సీల్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. హోటళ్ళు లేదా రెస్టారెంట్లలో నీరు తాగాల్సి వస్తే వేడి నీటిని ఇమ్మని అడగడం మంచిది. వర్షాకాలంలో ఏ చిన్న నిర్లక్ష్యం కూడా ఆసుపత్రి పాలు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి బయట దొరికే సాధారణ నీటిని తాగే పొరపాటు అస్సలు చేయకూడదు.                      *రూపశ్రీ.
జ్ఞానాన్ని సేకరించండి.. అదే మీ అసలైన ఆయుధం..! మనిషి జీవితంలో సంపద కంటే విలువైనది జ్ఞానం. చాణక్య నీతి ప్రకారం జ్ఞానం మనకు ఎప్పటికీ తోడుగా ఉండే శక్తివంతమైన ఆయుధం. సంపదను కోల్పోవచ్చు, కానీ మనం సంపాదించిన జ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేరు. అందుకే ప్రతి ఒక్కరూ జీవితాంతం జ్ఞానాన్ని సేకరిస్తూనే ఉండాలి. మనం చదివే ప్రతి పుస్తకం, తెలుసుకునే ప్రతి కొత్త విషయం మన ఆలోచనా శక్తిని పెంచుతుంది. అలాగే మనం ఎదుర్కొనే ప్రతి అనుభవం కూడా ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ఇతరులు చేసిన తప్పుల నుంచి నేర్చుకోవడం ద్వారా కూడా మన జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం ఉన్న వ్యక్తి సమస్యలను చూసి భయపడడు, వాటికి కారణాలను అర్థం చేసుకుని సరైన పరిష్కారం కోసం ప్రయత్నిస్తాడు. అందుకే జ్ఞానవంతుడికి కష్టాలు కూడా అవకాశాలుగా మారతాయి. కేవలం పుస్తకాలు చదవడమే జ్ఞానం కాదు, నేర్చుకున్న విషయాలను జీవితంలో ఆచరించడం కూడా ఎంతో ముఖ్యం. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి మనలో ఉండాలి. ప్రశ్నించడం, పరిశీలించడం, ఆలోచించడం ద్వారా జ్ఞానం మరింత పెరుగుతుంది. జ్ఞానం పెరిగే కొద్దీ మనలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే శక్తిని జ్ఞానం అందిస్తుంది. కష్టకాలంలో మనకు సరైన దారి చూపించేది కూడా జ్ఞానమే. అందుకే పరిస్థితులు ఎలా ఉన్నా నేర్చుకోవడం మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. మనం సంపాదించిన జ్ఞానం మన జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. చాణక్యుడు చెప్పినట్లుగా, జ్ఞానం ఉన్న వ్యక్తిని పరిస్థితులు సులభంగా ఓడించలేవు. కాబట్టి ప్రతి రోజూ జ్ఞానాన్ని సేకరించండి, దాన్ని ఆచరణలో పెట్టండి. ఎందుకంటే మన దగ్గర ఎంత ఎక్కువ జ్ఞానం ఉంటే, జీవితంలో మనం అంత బలమైన ఆయుధాన్ని కలిగి ఉన్నట్టే.  
ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గడం అనేది అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి లేదా ఫిట్‌నెస్‌ సాధించడానికి చాలామంది మహిళలు సరదాగా ఆడే సోషల్ స్పోర్ట్స్ వైపు అడుగులు వేస్తున్నారు. కానీ, దీర్ఘకాలంగా శారీరక శ్రమకు దూరంగా ఉండి ఒక్కసారిగా ఆటల మైదానంలోకి అడుగుపెట్టే మహిళలకు ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గాయాలు, నొప్పులు వారి క్రీడా భాగస్వామ్యానికి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయని ఆస్ట్రేలియాలోని లా ట్రోబ్ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన నూతన అధ్యయనం స్పష్టం చేస్తోంది. జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ మెడిసిన్ ఇన్ స్పోర్ట్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రకారం, సోషల్ స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లలో పాల్గొనే శారీరక శ్రమ లేని ప్రతి ఐదుగురు మహిళల్లో ఒకరు (20.8 శాతం మంది) గాయాలు లేదా తీవ్రమైన నొప్పుల వల్ల తమ ఆటను సరిగ్గా కొనసాగించలేకపోతున్నారు.లా ట్రోబ్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ స్పోర్ట్ అండ్ సోషల్ ఇంపాక్ట్‌కు చెందిన పరిశోధకురాలు కీరా స్టాలే నాయకత్వంలో విక్టోరియా పరిధిలోని 1,339 మంది శారీరక శ్రమ లేని మహిళలపై ఈ విస్తృత సర్వే నిర్వహించారు. వారంలో కనీసం 150 నిమిషాల మోస్తరు వ్యాయామం లేదా 75 నిమిషాల తీవ్రమైన వ్యాయామం చేయని వారిని శారీరక శ్రమ లేని వారిగా పరిగణించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ప్రతి 10 మంది పెద్దలలో దాదాపు 8 మంది కనీస వ్యాయామ ప్రమాణాలను అందుకోవడంలో విఫలమవుతున్నారు. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళలే మరింత వెనుకబడి ఉన్నారు. కుటుంబ బాధ్యతలు, సమయాభావం, ఆర్థిక పరిమితులు మరియు తగిన క్రీడా వసతులు లేకపోవడం వల్ల మహిళల్లో శారీరక శ్రమ లోపిస్తోంది. ఈ క్రమంలో వారు సోషల్ స్పోర్ట్స్‌లో చేరినప్పుడు, శరీరం ఒక్కసారిగా ఆ ఒత్తిడిని తట్టుకోలేక గాయాల బారిన పడుతోందని ఈ డేటా చెబుతోంది. ఈ అధ్యయనంలో వ్యక్తమైన మరో సంచలనాత్మక విషయం ఏమిటంటే, శరీరంలో కొన్ని నిర్దిష్ట భాగాలు మాత్రమే ఎక్కువగా ఈ గాయాలకు గురవుతున్నాయి. గాయాల పాలైన మహిళల్లో అత్యధికంగా 39 శాతం మంది మోకాలి నొప్పులు లేదా గాయాలతో బాధపడుతుండగా, 29.9 శాతం మంది నడుము కింద భాగంలో నొప్పితో, మరో 24.7 శాతం మంది మడమల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా, ఈ గాయాల బారిన పడటంలో ఆర్థిక అసమానతలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని పరిశోధన ఆధార సహితంగా వెల్లడించింది. సంవత్సరానికి లక్ష డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు చెందిన మహిళలు, రెండు లక్షల డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల మహిళలతో పోలిస్తే గాయాల పాలయ్యే అవకాశం మూడు రెట్లు (1.84 నుండి 3.28 రెట్ల ఎక్కువ అవకాశం) ఎక్కువగా ఉందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.       inactive women fitness injury risks,social sports health hurdles women.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.  
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.  వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ  వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.  నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.                         *రూపశ్రీ.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.