LATEST NEWS
ప్ర‌స్తుతం త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ గా రాజేంద్ర విశ్వ‌నాథ్ అర్లేక‌ర్ ఉన్నారు. ఈయ‌న గోవాలోని ప‌నాజీలో  1954 ఏప్రిల్ 23,న జన్మించారు. భారతీయ జనతా పార్టీలో  సుదీర్ఘ కాలం పనిచేశారు. గోవా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గోవా శాసనసభ స్పీకర్‌గా.. 2012-2015 మ‌ధ్య కాలంలో ప‌ని చేశారు. గోవా ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. భారతదేశంలోనే అసెంబ్లీని మొట్టమొదటిసారిగా పేపర్ లెస్ చేసిన ఘనత ఈయనకు దక్కుతుంది. ముందుగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా, ఆ తర్వాత బీహార్ గవర్నర్‌గానూ పనిచేశారు.  జనవరి 2025లో కేరళ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2026 మార్చి 12 నుంచి ఆయన తమిళనాడు గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వివాదం విష‌యానికి వ‌స్తే.. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.  అయితే  ప్రభుత్వ‌ ఏర్పాటుకు కావాల్సిన 118 మ్యాజిక్ మార్కుకు ఇంకా ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఆ మద్దతును  స్పష్టంగా చూపించాలని గవర్నర్  చెబుతున్నారు. బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీలైన కాంగ్రెస్ వంటి వాటి నుంచి రాతపూర్వక లేఖలు ఉంటేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తానని ఆయన స్పష్టం చేయడంతో తమిళనాట రాజకీయ హీటెక్కింది.  గోవా నుంచి వచ్చి తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుండటం వ‌ల్ల‌, గతంలో ఆయనకున్న బీజేపీ నేపథ్యం వల్ల.. స్థానిక నాయకులు, ఇత‌ర‌ సినీ ప్రముఖులు ఆయన తీరును విమర్శిస్తున్నారు. రజనీ, కమల్, ప్రకాష్ రాజ్ ఎందుకు గుర్రుగా ఉన్నారు? అని చూస్తే వీరందరూ గవర్నర్ తీరును విమర్శించడానికి ప్రధాన కారణం రాజ్యాంగ సంక్షోభం. కేంద్రం పంపిన గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వాలను, ప్రజల తీర్పును గౌరవించడం లేద‌ని బాహాటంగానే విమర్శిస్తున్నారు ప్ర‌కాష్ రాజ్. రజనీ, కమల్.. నేరుగా గవర్నర్‌పై యుద్ధం ప్రకటించకపోయినా.. తమిళనాడులో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. గవర్నర్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడుతోందని వీరి ఆందోళన. గవర్నర్ అర్లేకర్  తీసుకునే నిర్ణయాలు కేంద్రంలోని బీజేపీకి ప్రయోజనం చేకూర్చేలా ఉన్నాయనీ..  అందుకే ఆయన మెజారిటీ విషయంలో అంత కఠినంగా వ్యవహరిస్తున్నారని స్థానిక పార్టీలు ఆరోపిస్తున్నాయి. విజయ్ కి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా లేదా అనేదే ఇప్పుడు కీలకం. ఒకవేళ ఆయన మద్దతు లేఖలు సమర్పిస్తే, గవర్నర్ తప్పనిసరిగా ప్రమాణ స్వీకారానికి అనుమతించాల్సి ఉంటుంది. ఈ లోపు జరుగుతున్న ఈ తాత్కాలిక అడ్డంకులే ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశమయ్యాయి.
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జిగా వర్మ తొలగింపు నిజంగా ఒక అనూహ్య పరిణామమే. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను పీఠాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి నుండి తొలగిస్తూ తెలుగుదేశం హైకమాండ్ తీసుకున్న నిర్ణయం రాజకీయవర్గాలలో పెను సంచలనం రేపింది.  పిఠాపురం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో..  ఇక్కడ జరిగే ప్రతి చిన్న మార్పు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతుంది ఈ నేపథ్యంలోనే వర్మను బాధ్యతల నుంచి తప్పించడం చర్చనీయాంశమైంది. పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ   తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి..  క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం  మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.   గత అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీ సాధించడంలో వర్మదే కీలక పాత్ర అనడంలో సందేహం లేదు. పవన్ కల్యాణ్ కోసం తన సీటును వర్మ త్యాగం చేశారు.  వ్యక్తిగత ఆకాంక్షలను పక్కన పెట్టి మరీ  అధిష్టానం ఆదేశాల మేరకు జనసేన అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. అటువంటి నాయకుడిని ఇప్పుడు ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగించడం స్థానిక టీడీపీ శ్రేణులలో కూడా అసంతృప్తికి కారణమైంది.  గత కొద్దిరోజులుగా పిఠాపురంలో జనసేన,  టీడీపీ స్థానిక నాయకుల మధ్య ప్రోటోకాల్ విషయంలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంపై వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులతో   వాగ్వాదాలకు దిగారు. ఇప్పుడు అవే తెలుగుదేశం అధిష్ఠానం వర్మపై వేటు వేయడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అదే విషయంలో వర్మ తనను ఇన్ చార్జిగా తొలగించిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ  కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ బలోపేతానికి తన రక్తాన్ని ధారపోశాననీ..  ఏనాడు క్రమశిక్షణ తప్పలేదని చెబుతూ.. అర్ధంతరంగా మీడియా సమావేశాన్ని ముగించి కన్నీటిని ఆపుకుంటూ వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అయ్యాయి.  తెలుగుదేశం శ్రేణుల్లో వర్మ పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే వర్మను  నియోజకవర్గ బాధ్యతల నుంచే తప్పించి ముందు ముందు కీలకమైన నామినేటెడ్ పదవి ఇచ్చే ఉద్దేశంతో తెలుగుదేశం హైకమాండ్ ఉందని పార్టీ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది.   రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో.. ఆ కూటమిలోని ఇద్దరు ప్రధాన భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య కుదర్చడానికే అధిష్టానం ఈ  నిర్ణయం తీసుకుందని అంటున్నారు.  రాబోయే రోజుల్లో పిఠాపురం టీడీపీలో ఈ మార్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. వర్మ వంటి బలమైన నేతను పక్కన పెట్టడం వల్ల కేడర్‌లో అసమ్మతి రాకుండా చూసుకోవడం ఇప్పుడు టీడీపీ అధిష్టానం ముందు ఉన్న టాస్క్ గా చెబుతున్నారు.  
వ‌ర్మ‌ను పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గ తెలుగుదేశం ఇన్ ఛార్జ్ అనే ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం వెన‌క గ‌ల కార‌ణం.. ఆయ‌న చేష్ట‌లు, వాద‌న‌లు, విప‌రీత పోక‌డ‌లు ఎక్క‌డ కూట‌మి ధ‌ర్మానికి విఘాతం క‌లిగిస్తాయో అన్న‌ది మెయిన్ రీజ‌న్ గా తెలుస్తోంది. అంటే చంద్రబాబుకు కూటమి  ఎంత  క‌ల‌సికట్టుగా  ఉంటే  మ‌నం అంత బ‌లంగా  ఉండ‌గ‌లం అన్న‌ది    బాగా తెలుస‌న్న‌మాట‌. ఇది వ‌ర‌కు చంద్ర‌బాబు ఇలా ఉండేవారు కాదు. ఇలాంటి సున్నితాంశాల‌కు పెద్ద‌గా  విలువ‌నిచ్చేవారు కాదు.  ఈ విష‌యంపై సాధార‌ణ  కార్య‌క‌ర్త‌ల‌కు కూడా ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు వారు అనుభ‌విస్తున్న‌ది అదే కాబ‌ట్టి.. ఇందులో ఎవ‌రికీ ఎలాంటి అనుమానాలు లేవు కూడా.  బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా  భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని  కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే  క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న  అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం. ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల‌కు వ‌ర్మ రూపంలో మ‌రో ల‌డ్డూ దొరికింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌ర్మ‌గానీ పిఠాపురంలో ఇండిఎండెంట్ గా నిల‌బ‌డితే  చాలు.. ప‌వ‌న్  క‌ళ్యాణ్ కి డిపాజిట్లు రావ‌ని రెచ్చ‌గొట్టుడు కామెంట్లు చేస్తున్నారు. దానికి తోడు ప‌క్క రాష్ట్రం  విజ‌య్ వ్య‌వ‌హారం ఉండ‌నే ఉంది.  విజ‌య్ ఒంట‌రిగా  నిల‌బ‌డి  గెలిచాడ‌ని..  అదే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి అది సాధ్యం కావ‌డం లేద‌ని కావాల‌నే  ఊద‌ర‌గొట్టేస్తున్నారు మ‌రోప‌క్క‌.   ఇదే టైంలో వ‌ర్మ‌ను పిఠాపురం  ఇన్ ఛార్జి బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించ‌డంతో.. ఇపుడు ఫ్యాను గాలి ఇటు మ‌ళ్లింది. ఇక దంచి కొట్టుడు మొద‌లు పెట్టారు. ఇక వైసీపీ  ఇన్ ఫ్లూయెన్ష‌ర్ల‌లో కొంద‌రు అనే మాట ఏంటంటే కూట‌మి  నుంచి ప‌వ‌న్ ని అయినా వెళ్ల‌గొట్టండి  లేదా కొత్త కాపునాయ‌క‌త్వ‌మైనా  వైసీపీలోకి వ‌చ్చేలా చేయండ‌ని తెగ  స‌ల‌హాలు ఇచ్చేస్తున్నారు. అదృష్ట‌మో, దుర‌దృష్ట‌మో.. రంగా త‌ర్వాత అంత‌టి కాపు ట‌వ‌రింగ్  ప‌ర్స‌నాల్టీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గానే చెప్పాలి. ఆయ‌న కాకుండా క‌నుచూపు మేర‌లో కూడా ఎవ్వ‌రూ అలాంటి వారు లేనే లేరు. అందుకే విధిలేని ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ త‌మ పార్టీలోని కాపు నాయ‌కుడు అంబ‌టి  రాంబాబును హైలైట్ చేస్తున్నారు. కాపు టైగ‌ర్ అనే బిరుదులివ్వ‌డంతో పాటు కాపు నాయ‌క‌త్వం మొత్తాన్ని ఏకం  చేసి.. వారిలో ఒక చైత‌న్యం తీసుకొచ్చేందుకు తీవ్ర య‌త్నాలు సాగిస్తున్నారు.  దుర‌దృష్ట‌మేంటంటే, కాపు టైగ‌ర్ బిరుదాంకితుడైన  అంబ‌టికి అస‌లు కాపు కులమంటేనే గిట్ట‌దు..  క‌మ్మ‌ల‌ను ఇర‌వై నాలుగు గంట‌లు ఆడిపోసుకునే ఆయ‌న త‌న ముగ్గురు అల్లుళ్ల‌నూ క‌మ్మ‌ల‌నే చేసుకోవ‌డం ఇందులో కొస‌మెరుపు. ఎటు నుంచి ఎటు చూసినా.. జ‌గ‌న్ కి  కూట‌మిని చీల్చ‌డం ఎలాగో పాలు పోక‌, త‌న  పార్టీలోనే  కాపు టైగ‌ర్ ని ఎలా త‌యారు చేయాలో తెలీక..  నానా తంటాలు ప‌డుతున్నారు. స‌రే ఇదంతా ఇలా ఉంటే  కూట‌మి నానాటికీ   అల‌ర్ట్ అయ్యి.. త‌మ పొత్తుకు ఎవ‌రు విఘాతం క‌లిగిస్తున్నారో వారిని ప‌క్కాగా గుర్తించి ఏరిపారేస్తుండ‌టంతో.. దిక్కుతోచ‌ని  ప‌రిస్థితిలో ప‌డుతోంది పాపం వైసీపీ  అధిష్టానం. ఏ  మాట‌కామాట  ఈ  క‌ష్టం  ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దు. అంత‌గా విల‌విల‌లాడిపోతోంది. వైసీపీ యంత్రాంగ‌మంతా.  
వైసీపీలో ప్రస్తుతం ‘మావిగన్’ చిచ్చు రేపుతోంది. అమరావతికి బదులుగా రాష్ట్ర రాజధానిగా మావిగన్ అంటూ జగన్ చేసిన ప్రకటన వైసీపీలో నిట్టనిలువుగా చీలిక వచ్చేలా కనిపిస్తోందన్న అభిప్రాయం పరిశీలకులనుంచి వ్యక్తం అవుతోంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని ప్రాంతంగా ప్రకటించాలంటూ జగన్ చేసిన ప్రతిపాదన ప్రకంపనలు పార్టీలో ఇంకా కొనసాగుతున్నాయి. అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  గతంలో కూడా జగన్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు పార్టీకి నష్టాన్ని తెచ్చాయని.. ఇప్పుడు మావిగన్ అంతకు మించి నష్టం చేరుస్తుందని అంతర్గత సంభాషణల్లో గట్టిగా  చెబుతున్నారు.   ముఖ్యంగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ వైసీపీ నేతలు, మాజీ మంత్రులు ధర్మాన సోదరులు మావిగన్ తో విభేదిస్తున్నారు. జగన్ ప్రతిపాదనపై వారిరువురూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమచారం. జగన్ ఎవరితో చర్చించి మావిగన్ అన్నారని వారు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు.  ధర్మాన ప్రసాదరావు అయితే మావిగన్ విషయంలో తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. ఇటీవల ఆయన పాల్గొన్న ఒక కార్యక్రమంలో అయితే.. మావిగన్ పై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అలాగే అనంతపురం జిల్లాకు చెందిన ఓ సీనియర్ వైసీపీ నేత కూడా మావిగన్ ప్రకటనను తప్పుపట్టారు. పార్టీలో సీనియర్లతో కనీసం చర్చించకుండా జగన్ చేసిన ప్రకటేన సరికాదన్నారు.  సీనియర్లతో చర్చించాలన్న ఆలోచన కూడా జగన్ చేయకపోతే.. ఇక తాము పార్టీలో ఉండి ప్రయోజనమేంటన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 
  తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది. తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన ఈ చర్చలో ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తమిళనాడు రాజకీయాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నకు స్పందించిన డోలేంద్ర ప్రసాద్.. “తమిళనాడులో చిన్న భూకంపం వచ్చినా ఏపీలో ప్రకంపనలు కనిపిస్తాయి” అని వ్యాఖ్యానించారు.  దశాబ్దాలుగా ద్రవిడ రాజకీయాలను శాసించిన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలకు విజయ్ నేతృత్వంలోని టీవీకే గట్టి సవాల్ విసిరిందన్నారు. తమిళనాడులో జరిగిన ఎన్నికలను “జెన్-జీ ఎలక్షన్స్”గా అభివర్ణిస్తూ, యువ ఓటర్లు భారీగా విజయ్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే, యాక్సిస్ మై ఇండియా అంచనాలు చాలా వరకు కరెక్ట్‌గా ఉన్నాయని, విజయ్ పార్టీకి 100కు పైగా సీట్లు వచ్చే అవకాశాన్ని ముందుగానే సూచించిందని చెప్పారు. గతంలో తమిళనాడులో కరుణానిధి, జయలలిత మధ్య అధికార మార్పిడి కొనసాగేదని, ఇప్పుడు ఆ రాజకీయ సమీకరణాల్లో మార్పు కనిపిస్తోందన్నారు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ స్వతంత్రంగా గెలవలేదని, ఎన్నికల కమిషన్ సహకారంతో గెలిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయని ‘జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ముస్లిం ఓట్ల విభజన కారణంగా మమతా బెనర్జీకి నష్టం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మాట్లాడిన డోలేంద్ర ప్రసాద్.. కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని ప్రజలు పూర్తిగా అంగీకరించలేదని, అలాగే చంద్రబాబు తర్వాత నారా లోకేష్‌ను ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారో 2029 ఎన్నికల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు.  అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో లోకేష్ కీలక శక్తిగా ఎదుగుతున్నారని చెప్పారు. గత ఎన్నికల తర్వాత లోకేష్‌లో వచ్చిన పరిణతి, యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల్లో సంపాదించుకున్న ఆదరణ ఆయనను పార్టీ భవిష్యత్ నాయకుడిగా నిలబెడుతోందన్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ అనుభవంతో లోకేష్‌ను వ్యూహాత్మకంగా ముందుకు నడిపిస్తున్నారని అభిప్రాయపడ్డారు. బెంగాల్‌,  తమిళనాడు ఎన్నికల ఫలితాలపై  వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను తెలుగువన్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించవచ్చు.      
ALSO ON TELUGUONE N E W S
సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి, అలాగే ఊహించని విపత్తులు కూడా సంభవిస్తుంటాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం కొత్తేమీ కాదు. కానీ, పెట్టిన పెట్టుబడిలో కనీసం ఒక్క శాతం కూడా తిరిగి రాకపోతే అది ఆ చిత్ర యూనిట్‌కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. తాజాగా హాలీవుడ్‌లో ఒక సినిమా విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఏకంగా 1400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఓ చిత్రం, కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేసి ప్రపంచ సినిమా చరిత్రలోనే 'బిగ్గెస్ట్ డిజాస్టర్'గా నిలిచింది. ఆ సినిమా మరేదో కాదు.. హాలీవుడ్ స్టార్ నటుడు ఆంథోనీ మాకీ ప్రధాన పాత్రలో నటించిన 'డెసర్ట్ వారియర్' (Desert Warrior). సౌదీ అరేబియా, బ్రిటన్, అమెరికా దేశాల సంయుక్త నిర్మాణంలో 7వ శతాబ్దపు అరేబియా పీరియడ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు 150 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1400 కోట్లు) భారీ వ్యయంతో రూపొందిన ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, విడుదలయ్యాక సీన్ రివర్స్ అయింది. ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీసం ప్రభావం చూపలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం కేవలం 4.72 లక్షల డాలర్లు అంటే సుమారు 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. దీంతో నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు తప్పలేదు. నిర్మాణంలో జరిగిన జాప్యం, దర్శకుడికి మరియు నిర్మాణ సంస్థకు మధ్య వచ్చిన విభేదాలే ఈ దారుణ పరిస్థితికి కారణమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ, ఎడిటింగ్ దశలో చాలా కాలం పాటు పెండింగ్‌లో పడిపోయింది. దర్శకుడు రూపెర్ట్ వ్యాట్ అనుకున్న కథకు, చివరగా వెండితెరపై ప్రదర్శించిన వెర్షన్‌కు చాలా వ్యత్యాసం ఉండటంతో ప్రేక్షకులు దీనిని ఆదరించలేకపోయారు. సినిమాను పదే పదే రీ-షూట్ చేయడం వల్ల బడ్జెట్ అదుపు తప్పిందని, చివరకు అవుట్ పుట్ సరిగ్గా లేకపోవడంతో ప్రేక్షకుల నుంచి కనీస స్పందన కరువైందని తెలుస్తోంది. హాలీవుడ్ మేకింగ్ విలువల పరంగా సినిమా గ్రాండ్‌గా ఉన్నప్పటికీ, ప్రమోషన్లు లోపించడం కూడా మరో మైనస్ పాయింట్‌గా మారింది. సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఇంత భారీ బడ్జెట్ పెట్టి కనీసం ప్రమోషన్లు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆంథోనీ మాకీ వంటి నటుడు ఉన్నప్పటికీ, సరైన ప్లానింగ్ లేకపోవడం వల్ల ఈ చిత్రం ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ఫలితం హాలీవుడ్ నిర్మాణ సంస్థలను ఆందోళనలోకి నెట్టింది. ఎంత పెద్ద స్టార్లు ఉన్నా, ఎంత భారీ బడ్జెట్ పెట్టినా కథా కథనాలు మరియు పక్కా ప్లానింగ్ లేకపోతే ఫలితం ఎంత దారుణంగా ఉంటుందో 'డెసర్ట్ వారియర్' నిరూపించింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఓటిటిలో ఎలాంటి స్పందన పొందుతుందో వేచి చూడాలి.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ (Thaman) తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ఊరమాస్ లుక్‌లో కనిపిస్తున్న ఈ బ్లాక్ అండ్ వైట్ పిక్ చూసి నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' (Dragon) చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'గాడ్ ఆఫ్ వార్' (God Of War) చేయనున్నాడు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'డ్రాగన్' గ్లింప్స్ విడుదల కానుంది. అలాగే, 'గాడ్ ఆఫ్ వార్' అనౌన్స్ మెంట్ కూడా వచ్చే అవకాశముంది. ఈ సినిమాలకు సంబంధించిన వార్తలు ఫ్యాన్స్‌లో జోష్ నింపుతున్నాయి. ఈ తరుణంలో తమన్ షేర్ చేసిన ఎన్టీఆర్ ఫోటో హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ గుబురు గడ్డం, కోర మీసం, నోట్లో టూత్ పిక్ తో అత్యంత పవర్‌ఫుల్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. తమన్ ఈ ఫోటోను షేర్ చేస్తూ ఎమోజీలతో ఒక 'బాంబ్' హింట్ ఇచ్చాడు. దీంతో ఇది ప్రశాంత్ నీల్ సినిమాకి సంబందించిన బ్లాస్టింగ్ న్యూస్ కోసమా లేదా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కోసమా అనే సస్పెన్స్ మొదలైంది. ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే, అది నీల్ ప్రాజెక్ట్ లోదే అనిపిస్తోంది. దీంతో 'డ్రాగన్' గ్లింప్స్ ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పడం కోసం తమన్ ఈ ట్వీట్ చేసుంటాడు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ ఫోటో విషయంలో మరో చర్చ కూడా జరుగుతుంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు తమన్ సంగీతం అందించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ ను త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతుండటంతో.. బిగ్ బ్లాస్ట్ కి రెడీగా ఉండమని ఫ్యాన్స్ కి తమన్ హింట్ ఇచ్చాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏదైనా తమన్ షేర్ చేసిన ఫొటోలో మాత్రం ఎన్టీఆర్ లుక్ వేరే లెవెల్ లో ఉంది.  
తమిళనాడు రాజకీయాలు (Tamil Nadu Politics) క్షణక్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) పార్టీలకు షాకిస్తూ.. విజయ్ దళపతి స్థాపించిన 'టీవీకే' (TVK) సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 234 సీట్లకు గాను, 108 స్థానాల్లో విజయ్ పార్టీ విజయకేతనం ఎగరేసింది. 118 మ్యాజిక్ ఫిగర్ కి కాస్త దూరంలో ఆగిపోయినప్పటికీ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని భావించారంతా.  కానీ, థ్రిల్లర్ సినిమాలను తలపిస్తూ తమిళ్ పాలిటిక్స్ గంటకో ట్విస్ట్ ఇస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ ను సీఎం కుర్చీపై కుర్చోనివ్వకుండా చేయడం కోసం.. బద్ద శత్రువులైన డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాల్ సంచలన ట్వీట్ చేశాడు. ప్రభుత్వ ఏర్పాటులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై విశాల్ ఘాటుగా స్పందించాడు. అధికార పీఠంపై 'టీవీకే' కూర్చోకపోతే, రాష్ట్రానికి అది ఏమాత్రం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఒకవేళ డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలు జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తే.. అది అత్యంత వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి విచిత్రమైన పొత్తులు సామాన్య ప్రజల మనోభావాలను దెబ్బతీస్తాయని, ఓటరుగా తాను ఈ ప్రమాదకరమైన పరిస్థితిని ముందే ఊహిస్తున్నానని విశాల్ రాసుకొచ్చాడు. సాధారణంగా తమిళ రాజకీయాల్లో డీఎంకే, ఏఐఏడీఎంకేలు బద్ధ శత్రువులుగా ఉంటాయి. అందుకే ఈ రెండు పార్టీలు కలిస్తే రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఏర్పడతాయని విశాల్ అభిప్రాయపడ్డాడు.  విశాల్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. మరి తమిళనాడు నూతన ప్రభుత్వ ఏర్పాటులో చివరికి ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాలి.   https://x.com/VishalKOfficial/status/2052423297078567252
Cast: Sumanth Prabhas, Nidhi Pradeep, Jagapathi Babu, Laila, Sudharshan, Rajeev Kanakala   Crew:  Music Director: Naga Vamshi Krishna   Cinematography: Saai Santosh   Editing: Anil Kumar P. Writer-Director: Subash Chandra  Producer: Abhinav Rao    Godari Gattupaina Movie starring Sumanth Prabhas, who delivered a hit with his debut, Mem Famous, released Today in theatres. Nidhi Pradeep, Jagapathi Babu and Laila are playing prominent roles and Subash Chandra directed it. Let's discuss about the film in detail.    Plot:  An auto driver Raju (Sumanth Prabhas) falls in love with Maaya (Nidhi Pradeep). She respects and loves her father Shyam Babu (Jagapathi Babu). She doesn't accept Raju advances first but falls for his good heart. When their love story looks to progress well, suddenly, she breaks up with Raju. Why? What is the role of Shyam Babu in this? How will their clash resolve? Watch the movie to know more.  Analysis:  The makers have been keen on stating that watching the movie feels like experiencing fresh breeze on the banks of Godavari. But the movie story is so old that even Godavari river would find it too old for its liking. From nuances to scenes to execution, everything is text book level dated.  Sumanth Prabhas tried his best to fit into Godavari districts boy character but his natural flair in Telangana slang, came out at more occasions than less. As a performer also, he had very little to offer as character doesn't really shine. Nidhi Pradeep is good and she performs with her eyes.  Jagapathi Babu is regular but he carried weight of the film in last 20 minutes along with Rajeev Kanakala. Both veterans did their best to lift up the uninspiring written material. Music and BGM did not really help writer-director Subash Chandra either.  Cinematography, Editing lack finesse that we anticipate from talented technicians. Overall, the movie feels dated and jaded for audiences to find it inspiring to watch it. Still, for Nidhi Pradeep and Jagapathi Babu, if anyone wants to give a try, they may.  Positives: Nidhi Pradeep performance  Father - daughter scenes  Sumanth Prabhas efforts  Negatives:  Dated Story  Jaded Execution  Lethargic Writing  Old School Predictability  Lack of Novelty  Bottomline: This Godavari Breeze lacks freshness  Rating: 2.25/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
చిత్తూరు నగర వాసులకు సినిమా అంటే గుర్తొచ్చే పేరు 'రాఘవ థియేటర్' (Raghava Theatre). దశాబ్దాలుగా వేలాది మంది ప్రేక్షకులను అలరించిన ఈ ఐకానిక్ థియేటర్, ఇప్పుడు చరిత్ర పుటల్లో కలిసిపోతోంది. మారుతున్న కాలం, ఓటీటీల ప్రభావంతో ఈ థియేటర్ తన ప్రస్థానాన్ని ముగించుకోవడం అక్కడి సినీ ప్రేమికులను కలచివేస్తోంది. ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభం.. 1988లో అప్పటి ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు (NTR) చేతుల మీదుగా ఈ థియేటర్ ప్రారంభమైంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు చిత్తూరులో వినోదానికి ఇది చిరునామాగా నిలిచింది. పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే రోజుల్లో ఇక్కడ ఫ్యాన్స్ చేసే సందడి, కటౌట్లు, పాలాభిషేకలు ఒక పండుగ వాతావరణాన్ని తలపించేవి. రికార్డులు సృష్టించిన బ్లాక్ బస్టర్ హిట్లు రాఘవ థియేటర్ కేవలం ఒక సినిమా హాల్ మాత్రమే కాదు, ఎన్నో సంచలన విజయాలకు వేదిక. ఇక్కడ ప్రదర్శితమైన చిత్రాలు సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. శుభలగ్నం 200 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. పోకిరి 175 రోజుల పాటు బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని చూపింది. సీతారామయ్యగారి మనవరాలు, పెళ్లి చేసుకుందాం, అన్నమయ్య, హలో బ్రదర్ వంటి ఎన్నో సినిమాలు ఇక్కడ లాంగ్ రన్ పూర్తి చేసుకున్నాయి. పాత తరం నుండి నేటి తరం వరకు ప్రతి ఒక్కరికీ ఈ థియేటర్‌తో ఒక తీపి జ్ఞాపకం ముడిపడి ఉంది. ముగిసిన ప్రస్థానం ప్రస్తుత కాలంలో ఓటీటీలు, మల్టీప్లెక్స్ ల ప్రభావం పెరగడంతో, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే రాఘవ థియేటర్ యాజమాన్యం దీనిని మూసివేయాలని నిర్ణయించుకుంది. థియేటర్ స్థలాన్ని ఒక ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం థియేటర్ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. ఈ థియేటర్‌లో ప్రదర్శితమైన చివరి చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర'. ఎన్టీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ థియేటర్, ఆయన మనవడి సినిమాతో తన ప్రయాణాన్ని ముగించింది. అభిమానుల కేకలు, ఈలలు, సంతోషాల మధ్య అలరారిన రాఘవ థియేటర్ ఇప్పుడు శిథిలాల కుప్పగా మారుతుండటం చూసి సినీ ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు వాసుల సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ లు పెడుతూ, ఆ థియేటర్ తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.   https://www.instagram.com/reel/DYCBHxjoqG2/
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) బాక్సాఫీస్ వద్ద తన ప్రతాపాన్ని అప్పుడే మొదలుపెట్టింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీ, ఓవర్సీస్ మార్కెట్‌లో ఇప్పటికే ప్రభంజనం సృష్టిస్తోంది. తాజాగా నార్త్ అమెరికాలో ఓపెన్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్‌లో 'పెద్ది' సినిమా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'RRR' తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దీనికి నిదర్శనంగా నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే 'పెద్ది' ఊహించని రీతిలో స్పందనను రాబట్టింది. నార్త్ అమెరికాలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ సినిమా $100K (ఒక లక్ష డాలర్లు) మార్కును చేరుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 30 నిమిషాల్లోనే $50K పైగా వసూలు చేసి తన 'ర్యాంపేజ్'ను చాటిచెప్పింది. ప్రత్యంగిర సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో అత్యంత భారీ స్థాయిలో విడుదల చేస్తోంది. జూన్ 3న నార్త్ అమెరికా అంతటా గ్రాండ్ ప్రిమియర్ షోలు ప్రదర్శితం కానున్నాయి. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఇందులో రామ్ చరణ్ విభిన్నమైన లుక్‌లో పహిల్వాన్ గా కనిపించనున్నారు. చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బొమ్మన్ ఇరానీ, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. టాలీవుడ్‌లో ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్‌ను నమోదు చేసే దిశగా 'పెద్ది' దూసుకుపోతోంది. ప్రస్తుత ట్రెండ్‌ను చూస్తుంటే, విడుదల సమయానికి ఈ సినిమా మరిన్ని రికార్డులను కొల్లగొట్టడం ఖాయమనిపిస్తోంది.    https://x.com/PrathyangiraUS/status/2052585696569823503
సినిమా పేరు:  గోదారి గట్టుపైన  న‌టీన‌టులు:  సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, లైలా, సుదర్శన్ తదితరులు సినిమాటోగ్ర‌ఫీ: సాయి సంతోష్  ఎడిటింగ్: అనిల్ పసల  మ్యూజిక్:నాగవంశీ  నిర్మాత‌:అభినవ్ రావు  సమర్పణ: ఏషియన్ సినిమాస్  బ్యానర్  :రెడ్ పపేట్ ప్రొడక్షన్స్   రచన,దర్శకత్వం: సుభాష్ చంద్ర  రిలీజ్ డేట్ : మే 8 , 2026   అందమైన టైటిల్ తో తెరకెక్కిన 'గోదారి గట్టుపైన'  ఈ రోజు థియేటర్స్ లో తన సత్తా చాటడానికి అడుగుపెట్టింది. మూవీపై నమ్మకంతో మేకర్స్  నిన్న ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ రాజు (సుమంత్ ప్రభాస్) ఆటో నడుకునే మధ్య తరగతి యువకుడు. చదువు కూడా పెద్దగా అబ్బదు. మాయ (నిధి ప్రదీప్) కొంచం రాష్ గా ఉండే అమ్మాయి. తండ్రి శ్యామ్ బాబు (జగపతి బాబు) అంటే ప్రాణం. శ్యామ్ బాబుకి కూడా కూతురంటే ప్రాణం. సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తుంటాడు. తన కూతురు లైఫ్ లాంగ్ బాగుండాలంటే బాగా చదువుకున్న వాడు, స్థితిమంతుడు అల్లుడుగా రావాలనే బలమైన కోరికతో ఉంటాడు. మాయ, రాజు ఒకరికొకరు ప్రేమించుకుంటారు. కానీ హఠాత్తుగా మాయ బ్రేక్ అప్ చెప్తుంది. మాయ బ్రేక్ అప్ కి కారణమేంటి? మాయ నిర్ణయంతో  రాజు ఏం చేసాడు?  శ్యామ్ బాబు కోరిక నెరవేరిందా? లేక రాజు, మాయ ఒక్కటవుతారా లేదా? అనేదే గోదారి గట్టుపైన  ఎనాలసిస్  ఈ కథలో ఏం కొత్త పాయింట్ ఉందని తెరకెక్కించారో అర్ధం కాదు. ఇలాంటి కథలు రాని శుక్రవారం లేదు. సీన్స్ పరంగా చూసుకున్నా,క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నా ఏ ఒక్క అంశం మెప్పించలేదు. ఇలాంటి చిత్రాలకి కామెడి సూపర్ గా ఉండాలి. కానీ ఒక్క కామెడీ సీన్ కూడా పండదు. గోదారి గట్టుపైన అనే అందమైన టైటిల్ ని పెట్టుకొని గోదారి అందాలని కూడా చూపించలేదు. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే స్టార్టింగ్ సన్నివేశాలతో మంచి సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ సీన్ బై సీన్ వచ్చే కొద్దీ నీరుగారిపోతుంటాం. మాయ, రాజు మధ్య పరిచయం సీన్స్ కొత్తగా ఉన్నాయి. ఆ తర్వాత రొటీన్ గా సాగాయి. సాగడమే కాదు స్వచ్ఛమైన ప్రేమ కాకుండా ఆకర్షణ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయ్యింది. సుదర్శన్, రాజ్ కసిరెడ్డి, రాజు అండ్ బ్యాచ్ మధ్య వచ్చిన కామెడీ సీన్స్ వర్క్ అవుట్ కాలేదు. శ్యామ్ బాబు,మాయ మధ్య సీన్స్ కూడా రొటీన్. ఇంటర్వెల్ సీన్ పెద్దగా పేలింది లేదు. సెకండ్ హాఫ్ చూసుకుంటే శ్యామ్ బాబు కి మాయపై అనుమానం వచ్చిన తర్వాత కధనం స్పీడ్ గా వెళ్తుందని అనుకుంటాం.  కానీ ప్రతి సన్నివేశం చూస్తుంటే ఫస్ట్ హాఫ్ నే బెటర్ అనుకుంటాం. అనవసరమైన సీన్స్ కే  ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. రాజు చెల్లలి పెళ్లి ఎపిసోడ్ నే అంధుకు ఉదాహరణ. ప్రీ క్లైమాక్స్ లో రాజు మంచి తనాన్ని ఎలివేట్ చెయ్యడానికి వచ్చిన సీన్ మాత్రం సో సో. క్లైమాక్స్ మాత్రం సూపర్. తండ్రి,కూతురు డ్రామాలు ఆడుతున్నారనే సదరు క్లైమాక్స్ పాయింట్ నే బేస్ చేసుకొని గోదారి గట్టుని ప్రారంభం నుంచి  అందంగా మలుచుకోవాల్సింది నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు రాజుగా సుమంత్ ప్రభాస్ పెర్ఫార్మ్ లో పెద్దగా మెరుపులు లేవు. క్యారక్టర్ కి మాత్రం సెట్ అయ్యాడు. నిధి ప్రదీప్ తన క్యూట్ పెర్ఫార్మ్ తో  మెప్పించింది. కళ్ళతోనే తన భావాలు పలికించిన తీరుకి హాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. మూవీ మొత్తానికి తన నటనే హైలెట్. జగపతి బాబు, దేవిప్రసాద్ తమ పరిధి మేరకు బాగానే చేసారు. మిగతా వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఓవర్ యాక్టింగ్ అని అర్థమయ్యేలా తన పెర్ఫార్మ్ చూపించారు. సుభాష్ చంద్ర  దర్శకుడిగా, రచయితగా పర్ఫెక్ట్ గా ఫెయిల్ అయ్యాడు. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్, నిర్మాణ విలువలు  కూడా అదే పరిస్థితి.  బలాలు  1 . హీరో, హీరోయిన్ మధ్య నడిచిన కొన్ని సీన్స్  2 . తండ్రి విషయంలో హీరోయిన్ తీసుకునే నిర్ణయం  3 . హీరోయిన్ పెర్ ఫార్మెన్స్  4 . క్లైమాక్స్  బలహీనతలు  1 . కథ, కథనం 2 . దర్శకత్వం  3 . మ్యూజిక్  4 .ఫొటోగ్రఫీ  5 . హీరో క్యారక్టరేజేషన్  6 . కామెడీ  చివరిగా  చెప్పాలంటే గోదారి గట్టుకి అందరు కలిసి అన్యాయం చేసారు. ఒక్క హీరోయిన్ తప్ప . రేటింగ్ 2 .25 /5                                                                               అరుణాచలం 
Marking actor Sundeep Kishan’s birthday, the makers of his upcoming film Power Peta released a brief but impactful glimpse into its gritty world. Directed by Krishna Chaitanya, the project is shaping up to be an intense character-driven action drama, moving away from conventional hero tropes to explore morally grey territories. The newly released footage establishes Sundeep’s character through a distinct visual analogy, comparing his dominance to a wild lion ruling its territory. The narrative makes it clear that his character relies heavily on fear to maintain control over his enemies.  A standout moment in the teaser is the unconventional reveal of his name, Senapathy Ravi, spelled out through bursting firecrackers. This visual sequence is heavily anchored by veteran composer Mani Sharma’s background score, which effectively sets a dark and brutal tone for the film. Currently, the shoot for Power Peta is progressing at a brisk pace.  Backed by 70 MM Entertainment, the production appears to be investing in strong visual aesthetics and technical quality to match the heavy demands of the script. With Sundeep Kishan adopting a rugged body language for this role, the glimpse successfully builds curiosity around how Krishna Chaitanya will navigate this raw, grey-shaded drama.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం థియేటర్ల యజమానులకు (ఎగ్జిబిటర్లు) మరియు నిర్మాతలు/డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వివాదం ముదురుతోంది. ముఖ్యంగా 'రెంట్ వర్సెస్ పర్సంటేజ్' పద్ధతిపై జరుగుతున్న చర్చపై ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనదైన శైలిలో స్పందించారు. రామ్ చరణ్ నటించబోయే 'పెద్ది' సినిమా థియేటర్ల ఇష్యూపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవల మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన 'జెట్లీ' సినిమా విషయంలో కూడా ఇలాంటి ఇబ్బందులే ఎదురయ్యాయి. నైజాం ప్రాంతంలో థియేటర్ల అద్దె విషయంలో ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే, నిర్మాతలు మాత్రం పర్సంటేజ్ పద్ధతిని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి చిత్రం 'పెద్ది'కి కూడా థియేటర్ల సమస్య ఎదురవుతుందా అనే దానిపై నట్టి కుమార్ స్పష్టతనిచ్చారు.  నట్టి కుమార్ మాట్లాడుతూ, "సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ కంటెంట్ ఉన్నవాడే ఓనర్. చిన్న సినిమాలకు నిర్మాతలు థియేటర్ల దగ్గరకు వెళ్లాలి, కానీ పెద్ద సినిమాలకు ఎగ్జిబిటర్లే డిస్ట్రిబ్యూటర్ల దగ్గరకు వస్తారు" అని పేర్కొన్నారు. పెద్ద సినిమాల విషయంలో ఎగ్జిబిటర్లు డిక్టేట్ చేయడం కుదరదని, సినిమా వేయాలా వద్దా అనేది నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ ఇష్టమని ఆయన స్పష్టం చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు తమను మల్టీప్లెక్స్‌లతో పోల్చుకోవడం సరికాదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. మల్టీప్లెక్స్‌లలో నిర్వహణ ఖర్చు, టికెట్ ధరలు మరియు ఆక్యుపెన్సీ వేరుగా ఉంటాయని, అక్కడ కేవలం ఇద్దరు వ్యక్తులు ఉన్నా షో వేస్తారని, కానీ సింగిల్ స్క్రీన్స్‌లో 30 టికెట్లు తెగనిదే షో వేయని పరిస్థితి ఉంటుందని గుర్తు చేశారు. నిర్మాతలు వందల కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తే, అది ఫ్లాప్ అయితే నిర్మాత రోడ్డున పడతాడే తప్ప ఎగ్జిబిటర్లు వచ్చి ఆదుకోరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "మొన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' లాంటి సినిమాల విషయంలో కోట్లలో నష్టం వచ్చినప్పుడు ఏ ఎగ్జిబిటర్ అయినా డొనేషన్ ఇచ్చారా?" అని ప్రశ్నించారు. నిర్మాత విలువను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. చిన్న సినిమాను ఆదరించని థియేటర్లకు పెద్ద సినిమాలు ఇవ్వకూడదని, ఆ ధైర్యం నిర్మాతలు చూపాలని నట్టి కుమార్ సూచించారు. అప్పుడే పరిశ్రమలో సమతుల్యత ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆస‌క్తిక‌ర‌మైన ఇంట‌ర్యూల కోసం మా Teluguone cinemaను Subscribe చేసుకోండి. 
ప్రపంచ సినిమా చరిత్రలో అద్భుత సృష్టించిన ‘అవతార్’ సినిమా గురించి తెలియని వారు ఉండరు. దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే, ఇప్పుడు ఈ సెన్సేషనల్ మూవీ ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. అవతార్‌లోని ప్రధాన పాత్ర అయిన 'నైటిరి' రూపాన్ని తన అనుమతి లేకుండా వాడేశారంటూ ఒక నటి సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కిన వార్త ఇప్పుడు హాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. ప్రముఖ హాలీవుడ్ నటి క్వారియాంకా కిల్చర్ తాజాగా జేమ్స్ కామెరూన్‌తో పాటు డిస్నీ సంస్థపై చట్టపరమైన చర్యలకు దిగింది. 2005లో వచ్చిన ‘ద న్యూ వరల్డ్’ సినిమాలో తను నటించినప్పుడు తీసిన ఫోటోల ఆధారంగానే ‘అవతార్’ హీరోయిన్ పాత్రను డిజైన్ చేశారని ఆమె ఆరోపిస్తోంది. తన ముఖ కవళికలను, బయోమెట్రిక్ ఫీచర్లను ఎటువంటి అనుమతి తీసుకోకుండా వాణిజ్య పరంగా వాడుకున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ వివాదం మరింత ముదరడానికి కారణం గతంలో కామెరూన్ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్. అందులో ఆయన ఒక స్కెచ్ చూపిస్తూ, నైటిరి పాత్రను రూపొందించడానికి క్వారియాంకా కిల్చర్ ముఖమే ప్రేరణ అని చెప్పడం విశేషం. అయితే ఆమెకు ఎటువంటి క్రెడిట్ ఇవ్వకపోవడమే కాకుండా, కనీసం నష్టపరిహారం కూడా చెల్లించకుండా కోట్ల లాభాలు గడించారని ఆమె తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఒక చిన్న వయసున్న అమ్మాయి ముఖాన్ని డిజిటల్ పద్ధతిలో కాపీ చేయడం మోసమేనని వారు అంటున్నారు. జేమ్స్ కామెరూన్ అంటేనే భారీతనానికి మారుపేరు. టైటానిక్ నుంచి నేటి అవతార్ వరకు ఆయన తీసిన ప్రతి సినిమా ఒక రికార్డు. అవతార్ మొదటి భాగం దాదాపు 3 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయగా, రెండో భాగం కూడా సంచలనం సృష్టించింది. మూడో భాగం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కూడా రిలీజ్ అయింది. ఇలాంటి కీలక సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం చిత్ర యూనిట్‌ను కలవరపెడుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరు ఇది జస్ట్ ఇన్‌స్పిరేషన్ మాత్రమే అని కామెరూన్‌కు మద్దతు తెలుపుతుంటే, మరికొందరు మాత్రం అనుమతి లేకుండా ఒకరి రూపాన్ని వాడటం తప్పేనని ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తానికి ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసుపై జేమ్స్ కామెరూన్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే మాత్రం ‘అవతార్’ ఫ్రాంచైజీకి భారీ మూల్యం చెల్లించక తప్పదు. మరోవైపు వచ్చే ఏడాది విడుదల కాబోతున్న అవతార్ తదుపరి భాగాలపై ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందో వేచి చూడాలి.
ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద ఆరోగ్య సమస్య హార్మోన్ల అసమతుల్యత (Hormonal Imbalance). మనం ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం, ఎప్పుడూ అలసటగా అనిపించడం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ మీ హార్మోన్లు పంపే సంకేతాలు కావచ్చు. మీ ఆరోగ్యాన్ని తిరిగి మీ చేతుల్లోకి తెచ్చుకోవడానికి, ఈ VIDEO మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం హార్మోన్ల ఆరోగ్యంపై ఎందుకు దృష్టి పెట్టాలి? (Why Should We?) మన శరీరంలోని పిట్యూటరీ మరియు హైపోథాలమస్ వంటి గ్రంథులు సరిగ్గా పనిచేసినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. గ్లూకోజ్ నియంత్రణ: రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే (Hyperglycemia) అది శరీరంలో అనేక అనర్థాలకు దారితీస్తుంది. జీవనశైలి వ్యాధులు: దీర్ఘకాలిక హార్మోన్ల సమస్యలు కేవలం అలసటకే పరిమితం కావు, అవి పెద్ద ఆరోగ్య రుగ్మతలుగా మారుతాయి. సహజమైన శక్తి: హార్మోన్లు సమతుల్యంగా ఉంటే, కృత్రిమ ఉత్ప్రేరకాలు లేకుండానే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఏమి చేయకూడదు? (What Not to Do) మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు హార్మోన్లను దెబ్బతీస్తాయి: జంక్ ఫుడ్ మరియు ఇన్ఫ్లమేటరీ ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారాలు మరియు జంక్ ఫుడ్ గ్లూకోజ్ స్థాయిలను అస్తవ్యస్తం చేస్తాయి. కెమికల్ కాస్మెటిక్స్: ప్రతిరోజూ అధికంగా మేకప్ వాడటం మంచిది కాదు. వీటిలోని జీనోబయోటిక్స్ (Xenobiotics) మరియు జీనోఈస్ట్రోజెన్స్ (Xenoestrogens) హార్మోన్ల పనితీరును గందరగోళానికి గురిచేస్తాయి. నిద్రను నిర్లక్ష్యం చేయడం: రాత్రిపూట సినిమాలు చూడటం లేదా ఫోన్ చూడటం వల్ల మీ సర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) దెబ్బతింటుంది. వ్యసనాలు: ధూమపానం, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాలు మీ నాడీ వ్యవస్థను దెబ్బతీసి, హార్మోన్ల సమతుల్యతను పాడుచేస్తాయి. ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? (How to Balance) మీ హార్మోన్లను క్రమబద్ధీకరించడానికి ఈ 5 సూత్రాలను పాటించండి: వ్యాయామమే మందు: "Movement is medicine". ప్రతిరోజూ కనీసం ఒక గంట పాటు జిమ్ లేదా ఏరోబిక్ వ్యాయామాలు చేయండి. గ్లూకోజ్‌ను శరీరం సరిగ్గా వినియోగించుకోవడానికి ఇది అవసరం. ప్రకృతితో అనుసంధానం: ఉదయాన్నే ఎండలో గడపడం మరియు రాత్రి త్వరగా పడుకోవడం అలవాటు చేసుకోండి. సేంద్రీయ పద్ధతులు: రసాయనాలతో కూడిన క్లీనర్లు మరియు వంటపాత్రలకు బదులుగా ఆర్గానిక్ పద్ధతులకు మారడానికి ప్రయత్నించండి. ఒత్తిడి నిర్వహణ: శ్వాస వ్యాయామాలు (Breathwork), జర్నలింగ్ మరియు ప్రియమైన వారితో సమయం గడపడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. వ్యక్తిగత ప్రణాళిక: అందరికీ ఒకే రకమైన వ్యాయామం సరిపోదు. మీ శరీరానికి ఏది సరిపోతుందో (వెయిట్ ట్రైనింగ్ లేదా కార్డియో) నిపుణుల సమక్షంలో ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో తెలుసుకోండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: వ్యాయామం వల్ల హార్మోన్లు ఎలా మెరుగుపడతాయి?  జ: వ్యాయామం చేయడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ సరిగ్గా ఖర్చవుతుంది, దీనివల్ల హైపోగ్లైసీమియా వంటి సమస్యలు రావు మరియు హార్మోన్లు క్రమబద్ధీకరించబడతాయి. ప్ర: కాస్మెటిక్స్ నిజంగా హార్మోన్లను దెబ్బతీస్తాయా?  జ: అవును, చాలా సౌందర్య సాధనాలలో ఉండే రసాయనాలు ఈస్ట్రోజెన్ లాగా ప్రవర్తించి మెదడులోని గ్రంథులను గందరగోళానికి గురిచేస్తాయి. ప్ర: నైట్ షిఫ్ట్ చేసే వారికి హార్మోన్ల సమస్యలు వస్తాయా?  జ: ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన పగలు-రాత్రి చక్రానికి (Circadian Rhythm) విరుద్ధంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల హెచ్చుతగ్గులు వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మీ అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. హార్మోన్ల సమతుల్యత అనేది ఒక రోజులో వచ్చే మార్పు కాదు, ఇది ఒక జీవనశైలి. ఈ చిన్న చిన్న మార్పులతో మీ జీవితాన్ని మరింత ఉత్సాహంగా మార్చుకోండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు వ్యాయామ చిట్కాల కోసం మా TeluguOne Health ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే (సబ్‌స్క్రైబ్ చేసుకోండి.)
  పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది.  ఎంత వయసు పెరిగినా తల్లిదండ్రులకు పిల్లల గురించి ఆలోచన ఉంటుంది.  అబ్బాయిల విషయానికి వస్తే..  18 ఏళ్లలోకి వచ్చినప్పుడు వారి జీవితం చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది.  18 ఏళ్లకు మేజర్ గా గుర్తించబడతారు.  చట్ట ప్రకారం పిల్లల నుండి వయోజనులుగా మారుతారు.  అదే విధంగా మానసికంగా కలిగే మార్పులు కూడా వారిని బాధ్యతగా ఉండటంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేయడమే కాకుండా.. చాలా వరకు ఇండిపెండెంట్ గా ఉండటానికి కూడా ఇక్కడే కీలక మలుపు వస్తుంది. 18 ఏళ్ల వయసులో పిల్లలకు మార్గదర్శకత్వం చాలా అవసరం అవుతుంది. తల్లిదండ్రులు ఈ వయసు పిల్లలతో ఎంత సున్నితంగా, ఎంత ఆలోచించే విదంగా మాట్లాడగలుగుతారో.. పిల్లలతో విషయాలను షేర్ చేసుకోగలుగుతారో..  పిల్లల జీవితం కూడా అంత సరైన దిశలో నడవడానికి సహాయపడుతుంది.   18 ఏళ్లు నిండిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుంటే.. బాధ్యత.. 18 ఏళ్లు రాగానే నువ్వేం పెద్దాడివి కాదు అని తరచుగా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు.. 18 ఏళ్ల వయసు పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి అవకాశం దొరితే మొదటి దశ.. అయితే  తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలని వారు తెలుసుకోవాలి. తన ఖర్చులను తాను చూసుకోవడం, , సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, ఇంటి పనులలో పాలుపంచుకోవడం వంటి చిన్న చిన్న పనులు 18 ఏళ్ల వయసు పిల్లలకు నేర్పిస్తే.. అవి అతన్ని బాధ్యత గల వ్యక్తిని చేస్తాయి. డబ్బు విలువ.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. 18ఏళ్ల వయసులోనే పిల్లలకు స్నేహాలు, బయటటి ఖర్చులు వంటివి చాలా పెరుగుతాయి. నిజం చెప్పాలంటే.. డబ్బు కారణంగా పిల్లలు పాడైపోయే మొదటి దశ ఇదే.. అందుకే పిల్లలకు బడ్జెట్ రూపొందించుకోవడం, అనవసరమైన ఖర్చులను నివారించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి అలవాట్లు నేర్పించాలి. ఇవి వారిని ఆర్థికంగా బలంగా చేస్తాయి. సరైన స్నేహాలు.. ఈ వయసులో స్నేహాలు, సంబంధాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మంచి స్నేహాలు..  నమ్మకమైన వ్యక్తులతో ఎలా ఉండాలో, మంచి స్నేహాలు ఎలా ఉంటాయో.. , చెడు స్నేహాలకు ఎలా దూరంగా ఉండాలో చెబుతూ ఉండాలి.  దీని వల్ల జీవితంలో వారు దెబ్బ తినే చాలా పెద్ద నష్టం నుండి బయటపడవచ్చు. డిజిటల్ జీవితం.. చిన్న పిల్లల్లా వారిని తిట్టి, కొట్టి కంట్రోల్ చేసే వయసు కాదు 18 ఏళ్ల పిల్లలది. అందుకే సోషల్ మీడియా , ఇంటర్నెట్‌ను తెలివిగా, అవగాహనతో ఉపయోగించడం చాలా ముఖ్యం.  అలాగే ఎలాంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకోవాలి?  ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలి? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం జీవితం మీద ఎంత వరకు ఉండాలి వంటి విషయాలు వారికి అర్థమయ్యే లాగా వివరించి చెప్పాలి. మోటివేట్.. జీవితంలో ప్రతిఒక్కరూ వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. వైఫల్యం అనేది అంతం కాదని, అది నేర్చుకోవడానికి ఒక అవకాశమని వారికి వివరించాలి. ఎందుకంటే వైఫల్యాల కారణంగా తొందర పాటు నిర్ణయాలు తీసుకునే భావేద్వేగం వారిలో ఉంటుంది.  అందుకే ఎప్పుడూ స్పోర్టివ్ గా ఉండమని చెప్పాలి. ఈ ఆలోచన వారికి జీవితంలో ముందుకు  సాగడానికి బలాన్ని ఇస్తుంది.                             *రూపశ్రీ.
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి.  అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త,  తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించి చెప్పాడు.  లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ముఖ్యమైన పనులు.. ఒక మనిషి  సక్సెస్ ఫుల్  వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి.  తమకు ముఖ్యమైన పనుల విషయంలో  వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు ఏవైనా సరే.. మళ్లీ చేద్దాంలే అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు.  సమయం చాలా విలువైన ఆస్తి అని,  పనులను వాయిదా వేయడం వల్ల ఎంతో గొప్ప ఆస్తిని కోల్పోయినట్టేనని, దీని వల్ల  ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేర్చుకోవడం.. నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి  ప్రకారం, జ్ఞానమే మనిషి  నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు. కష్టం.. విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన  మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తీ చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి  పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు. తప్పులు.. తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం  వైఫల్యానికి ప్రదాన కారణం అవుతుంది.   తన తప్పుల గురించి తెలుసుకుని,  వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అవకాశాలు.. జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.                            *రూపశ్రీ.
ఈనాటి వేగవంతమైన జీవనశైలిలో మనకు తెలియకుండానే మనం అనేక ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాము. ముఖ్యంగా, నేటి యువతలో సెక్స్ పట్ల ఆసక్తి తగ్గడం అనేది ఒక ప్రధాన సమస్యగా మారుతోంది. డబ్బు సంపాదన, కార్పొరేట్ ఒత్తిడి, మరియు మారుతున్న సామాజిక విలువల మధ్య మన వ్యక్తిగత జీవితం చితికిపోతోంది. ఈ VIDEO ద్వారా మీకు సెక్స్ ఆరోగ్యం పట్ల సరైన అవగాహన కల్పించడమే మా లక్ష్యం. మనం ఎందుకు శ్రద్ధ వహించాలి? (Why Should We?) సెక్స్ అనేది కేవలం శారీరక కలయిక మాత్రమే కాదు, అది మన జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైన భాగం. మానసిక ప్రశాంతత: మనం సుఖంగా, ఆనందంగా ఉండాలన్నా, మన మెదడు చురుగ్గా పనిచేయాలన్నా సెక్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మెదడు: ఇది ప్రాథమిక అవసరాలలో ఒకటి. పశుపక్షాదులు కూడా తమ కుటుంబంతో సమయాన్ని గడుపుతూ ఆనందాన్ని పొందుతాయి, కానీ మనిషి మాత్రమే కంప్యూటర్ల ముందు కూర్చుని ఈ బేసిక్ ఫండమెంటల్స్‌ను మర్చిపోతున్నాడు. సంతానోత్పత్తి: సరైన హార్మోనల్ సెక్రేషన్ (ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రోన్) ఉండటం వల్ల సంతానోత్పత్తి మరియు నెలసరి సక్రమంగా ఉంటాయి. ఏమి చేయకూడదు? (What Not to Do?) చాలా మంది తమకు తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలకు దారితీస్తాయి: ఆఫీస్ టెన్షన్లను ఇంటికి తీసుకురావద్దు: ఆఫీసు ఆలోచనలు ఇంటికి తీసుకురావడం వల్ల భాగస్వామిపై ధ్యాస తగ్గుతుంది, ఇది జడత్వానికి (Inertia) దారితీస్తుంది. సొంత వైద్యం వద్దు: ఎటువంటి అవగాహన లేకుండా పిల్స్ లేదా పీరియడ్స్ ఆపుకోవడానికి టాబ్లెట్లు వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు: హార్మోన్ల మార్పుల వల్ల గడ్డం దగ్గర వెంట్రుకలు రావడం వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి, అంతేకానీ కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లి తాత్కాలిక పరిష్కారాలు వెతకకూడదు. జనరిక్ మందుల పట్ల అపోహలు: జనరిక్ మందులు తక్కువ నాణ్యత గలవి అని అనుకోవద్దు; అవి కూడా అదే ఫార్ములాతో పనిచేస్తాయి. సమస్యను ఎలా అధిగమించాలి? (How to Improve?) జీవనశైలి మార్పులు: పిజ్జాలు, పాస్తాల వంటి వెస్ట్రన్ ఫుడ్ కంటే మన స్వచ్ఛమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఫోర్ ప్లే (Foreplay) ప్రాముఖ్యత: భాగస్వామితో అనుబంధాన్ని పెంచుకోవడానికి మరియు ప్రేరేపించబడటానికి ఫోర్ ప్లే అనేది చాలా అవసరం. సరైన రోగ నిర్ధారణ: ఏదైనా సమస్య ఉన్నప్పుడు సీనియర్ ఫిజీషియన్‌ను కలిసి కనీసం అరగంట పాటు మీ కేస్ హిస్టరీని వివరించండి. సరైన డయాగ్నోసిస్ ద్వారా ఎటువంటి సుఖవ్యాధినైనా 15-20 రోజుల్లో నయం చేయవచ్చు. డైరీ నిర్వహణ: రోజూ పడుకునే ముందు ఆ రోజు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి అనేది ఒక డైరీలో రాసుకోవడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ప్రశ్నోత్తరాలు (Q&A) ప్ర: సెక్స్ పట్ల కోరికలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి?  జ: అధిక పని ఒత్తిడి (24 గంటలు పనిచేయడం), హార్మోన్ల అసమతుల్యత, మరియు వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మారిన మానసిక స్థితి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్ర: యువతులలో కనిపిస్తున్న హార్మోన్ల సమస్యల లక్షణాలు ఏమిటి?  జ: 18-19 ఏళ్లకే నెలసరి ఆలస్యం కావడం, ముఖంపై (గడ్డం దగ్గర) దట్టమైన వెంట్రుకలు రావడం వంటివి హార్మోన్ల లోపానికి సంకేతాలు. ప్ర: ఎయిడ్స్ (HIV) సోకితే నయం కాదా?  జ: ఒకప్పుడు అది మహమ్మారిగా ఉండేది, కానీ ఇప్పుడు దానికి రెట్రోవర్టెడ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచే మందుల ద్వారా దానిని కూడా నియంత్రించవచ్చు. ప్ర: సహజీవనం (Living Together) సెక్స్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?  జ: సహజీవనం వల్ల ఒకరి పట్ల ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గే అవకాశం ఉంది. పెళ్లి అనే బంధంలో ఉండే ఆకర్షణ, గౌరవం ఇక్కడ లోపించవచ్చు. డబ్బు వెనకాల పరిగెత్తే క్రమంలో మన శరీరానికి భగవంతుడు ప్రసాదించిన వరాన్ని (సెక్స్ మరియు ప్రేమ) నిర్లక్ష్యం చేయకండి. సమస్య చిన్నదైనా, పెద్దదైనా సరైన నిపుణులను సంప్రదించి సంతోషకరమైన జీవితాన్ని గడపండి. మరిన్ని ఆరోగ్య సూత్రాలు మరియు నిపుణుల సలహాల కోసం మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి.. (సబ్స్క్రైబ్ చేసుకోండి)
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.జి.వి. సత్య (Dr. SGV Satya) గారు ఈ వీడియోలో శాస్త్రీయమైన సమాధానాలు ఇచ్చారు.       ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించిన అంశాలు: 👇 అన్నం vs చపాతీ: రెండింటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మరియు గ్లైసీమిక్ ఇండెక్స్ మధ్య తేడాలు. సరైన ఆహార విధానం: షుగర్ ఉన్నవారు అన్నం తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యమైన సూచనలు: క్వాంటిటీ (పరిమాణం) మరియు క్వాలిటీ (నాణ్యత) విషయంలో మనం చేసే తప్పులేమిటి? షుగర్ కంట్రోల్ చిట్కాలు: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే భోజనంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి. ఆందోళన సహజమైనదే అయినప్పటికీ, దానిని కొనసాగనివ్వడం మానసిక,  శారీరక ఆరోగ్యానికి హానికరం.  నేటికాలంలో చాలా మంది ఈ ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకుంటున్నారు.  ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకున్నాక జీవితం చిన్నాభిన్నం అవుతుంది.  ఆందోళన ఉచ్చులో పడకుండా ఉండాలంటే.. కొన్నిమార్గాలు అనుసరించాలి.  దీని వల్ల  మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనకు గురి కాకుండా ఉండగలుగుతారు. లోతైన శ్వాస.. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రోజుకు 5-10 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడం అత్యంత సులభమైన మార్గం.  లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు, శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరిగి మనస్సు ప్రశాంతమవుతుంది.  ఇది గుండె కొట్టుకోవడాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి, శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది.  ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ద్యానం.. ప్రతిరోజూ 15-20 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.  ఇది మానసిక ఏకాగ్రతను పెంచి, ప్రతికూల ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది.  క్రమంగా సాధన చేయడం ద్వారా  మనస్సు మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా మారుతుంది. యోగా, వ్యాయామం.. యోగా మరియు తేలికపాటి వ్యాయామం శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లను పెంచుతాయి. ఈ హార్మోన్లు సహజంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా నడవడం, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్చింగ్ వ్యాయాలు లేదా సాధారణ యోగాసనాలు వేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయి. ప్రతికూల ఆలోచన.. ప్రతికూల ఆలోచనల స్థానంలో సానుకూల ఆలోచనలను నింపడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన మార్గం.  ఎవరికి వారు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకోవాలి,   దేనికి కృతజ్ఞతతో ఉన్నారో గమనించాలి.  ఇది ఆందోళనను,  భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర, ఆహారం.. మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  నిద్రలేమి ఆందోళనను పెంచుతుంది. కెఫీన్, చక్కెర అధికంగా తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వంటివి  మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటంలో సహాయపడతాయి. సహకారం.. మానసిక స్థితి చాలా బాగోలేదని అనిపించినప్పుడు, ఎప్పుడు ఆందోళనగా అనిపిస్తూ ఉన్నప్పుడు  కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడాలి. అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవాలి. ఒంటరిగా బాధపడటం కంటే నచ్చిన వారి దగ్గర మనసు విప్పి మాట్లాడటం ద్వారా ఊరట పొందవచ్చు.                              *రూపశ్రీ.