
సాయిపల్లవి.. ఎనీ క్యారక్టర్ మెస్మరైజ్ చేసి పడేయగలదు. రామాయణలో సీతగా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసే పనిలో ఉన్న సాయి పల్లవి ఈ నెల 20న ధనుష్ తో కలిసి 'ఓం' తో తమిళంతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా అడుగుపెట్టనుంది.
సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా పోలీస్ ఆఫీసర్ గా ఇటీవల ఆమె లుక్ రిలీజ్ చేసినప్పుడు వైరల్ గా మారడంతో పాటు ఓం పై అంచనాలని పెంచేసింది.
ఆ క్యారక్టర్ వెనుక ఒక ఆసక్తికరమైన నిజం దాగుంది. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఓం దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి మాట్లాడుతు సాయిపల్లవి పోషించిన పోలీస్ క్యారక్టర్ పూర్తిగా కల్పితం కాదని, కేరళకు చెందిన రియల్ లైఫ్ ఐపీఎస్ ఆఫీసర్ మెరిన్ జోసెఫ్ జీవితం, ఆమె పనితీరు నుంచి స్ఫూర్తి పొంది సాయి పల్లవి క్యారెక్టర్‌ని డిజైన్ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
.webp)
కేరళ కేడర్‌కు చెందిన మెరిన్ జోసెఫ్ తన కెరీర్ ప్రారంభం నుంచే అత్యంత పిన్న వయస్సులో ఐపీఎస్ సాధించిన మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆమె 188వ ర్యాంకు సాధించారు. 2019లో కొల్లం పోలీస్ కమిషనర్‌గా ఉన్నప్పుడు ఆమె పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. లింగ వివక్షపై ఆమె బహిరంగంగానే గళం విప్పారు.
ఇది కూడా చదవండి:ఇట్లు అర్జున మూవీ రివ్యూ
2016లో మహిళా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని అందం ఆధారంగా ర్యాంకులు ఇస్తూ వచ్చిన ఒక పత్రికా కథనాన్ని ఆమె తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా, ఆమె ఎంచుకున్న కేసులు, విధి నిర్వహణలో చూపిన తెగింపు, రాజీ పడని తత్వం, ప్రజలతో మమేకమయ్యే విధానం ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలిచాయి.

దర్శకుడు రాజ్‌కుమార్ పెరిసామి మెరిన్ జోసెఫ్ పనితీరును నిశితంగా పరిశీలించి, ఒక మహిళా ఆఫీసర్ సమాజంలో ఎదుర్కొనే సవాళ్లను, వాటిని ధైర్యంగా ఎదుర్కొనే తీరును సాయిపల్లవి పాత్రలో ప్రతిబింబించేలా చేశారు. సినిమాలోని ప్రతి చిన్న సీన్‌లోనూ ఆ ఐపీఎస్ ఆఫీసర్ హావభావాలు, ఆమె నిలబడే తీరు, మాట్లాడే శైలిని సాయిపల్లవి అద్భుతంగా అనుకరించారు. దర్శకుడు కేవలం ఒక ఇన్స్పిరేషన్‌గా మాత్రమే తీసుకున్నప్పటికీ, సాయిపల్లవి తన అసాధారణమైన నటనతో ప్రాణం పోసినట్టుగా పరిశ్రమ వర్గాల టాక్.
మీకు నచ్చవచ్చు:మాయలేడి మూవీ రివ్యూ!
మీకు నచ్చవచ్చు:డిఎన్ కె రివ్యూ
[Sai Pallavi Om, Merin Joseph, rajkumar periasamy, Dhanush]





