Home

»

Latest News

టాలీవుడ్ నెక్స్ట్ నంబర్ వన్ అనశ్వర రాజనేనా? ఆ హీరో మాట నిజం కాబోతుందా!

Nov 13, 2026 3:28PM


సెల్యులాయిడ్ పై మలయాళ భామ అనశ్వర రాజన్  పెర్ఫార్మ్ చూస్తుంటే మండే ఎండ సైతం నిండు జాబిలిని తలపిస్తుంది. అంతలా తన క్యారక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి మెస్మరైజ్ చేసి పడేస్తుంది. ప్రెజెంట్ థియేటర్ లో రన్ అవుతున్న ఇట్లు అర్జున ఒక ఉదాహరణ. ఈ నేపథ్యంలో రీసెంట్ గా అనశ్వర రాజన్ గురించి సినీ సర్కిల్స్ లో ,అభిమానుల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.  

2025 చివర్లో విడుదలైన ‘ఛాంపియన్’ తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అనశ్వర, తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను తన క్యూట్ లుక్స్, అద్భుతమైన అభినయంతో కట్టిపడేసింది.  బాక్సాఫీస్ వద్ద ఛాంపియన్  ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, అనశ్వర నటనకి మాత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.‘ఇట్లు అర్జున’ లో అనశ్వర నటనకి మంచి స్పందన లభిస్తోంది.

 ప్రమోషన్లలో భాగంగా అనశ్వర ధరించిన చీరకట్టు, సంప్రదాయ దుస్తులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. నెటిజన్లు అనశ్వరని 'టాలీవుడ్ న్యూ క్రష్’ అనే  ట్యాగ్‌లైన్‌ ని అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఆమె టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదగడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

 ఇది కూడా చదవండి: ఓంలో సాయి పల్లవి క్యారక్టర్ కి ఇన్ స్పిరేషన్ ఎవరో తెలుసా!

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’లో అనశ్వర అమ్ములు’ గా కీ రోల్ పోషిస్తుంది.   నెక్స్ట్ ఇయర్  జనవరి 13న సంక్రాంతి కానుకగా  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాకుండా, తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘7/జి రెయిన్‌బో కాలనీ 2’ చిత్రంలోనూ  హీరోయిన్‌గా  దక్షిణాది ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.


 ఇక్కడే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని అభిమానులు చర్చించుకుంటున్నారు. 2025 డిసెంబర్‌లో జరిగిన ‘ఛాంపియన్’ ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామ్ చరణ్, అనశ్వర డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయారు. పరభాషా నటి అయినప్పటికీ తెలుగు నేర్చుకుని, తన రోల్ కి  తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. "ఈ సినిమా తర్వాత పెద్ద నిర్మాణ సంస్థలు, అగ్ర దర్శకుల నుంచి మీకు వరుస అవకాశాలు వస్తాయి, టాలీవుడ్‌లో మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది" అని రామ్ చరణ్ అప్పట్లోనే జోస్యం చెప్పారు. అంతేకాదు, ఇటీవల జరిగిన ‘ఇట్లు అర్జున’మ్యూజికల్ కాన్సర్ట్‌లోనూ  చరణ్ పాల్గొని, ‘కాకా’ సినిమాలో అనశ్వర నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.

 ఒకవైపు అభినయానికి ప్రాధాన్యమున్న రోల్స్  ఎంచుకుంటూనే, మరోవైపు చిరంజీవి వంటి అగ్ర హీరోల సినిమాల్లో భాగం కావడం అనశ్వర రాజన్ కెరీర్‌కు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. భాషపై పట్టు సాధించడం, సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం, గ్లామర్ కంటే నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వంటి లక్షణాలు ఆమెను మిగతా హీరోయిన్ల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. ఇదే జోరు కొనసాగితే, రామ్ చరణ్ అన్నట్లుగానే రాబోయే రెండేళ్లలో అనశ్వర రాజన్ టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ రేసులో అగ్రస్థానంలో నిలవడం ఖాయమని సినీ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. 


ప్రస్తుతం ఆమె చేతిలో రవితేజ తులాభారం తో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ లు ఉన్నాయి.ఏది ఏమైనా కాలం కలిసొస్తే అనశ్వర రాజన్  నెంబర్ వన్ చైర్ లో కూర్చోవడం పెద్ద కష్టమైన పని కాదు. ఎందుకంటే కాలాన్ని సైతం తన పెర్ఫార్మ్ తో తన ఆధీనంలోనే ఉంచుకోగలదు. 

 

మీకు నచ్చవచ్చు: ఇట్లు అర్జున మూవీ రివ్యూ!
మీకు నచ్చవచ్చు: మాయ లేడీ మూవీ రివ్యూ!

 

[Anaswara Rajan, Itlu Arjuna, Chiranjeevi, Ram Charan, Aneesh]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com