LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి, సంక్షేమాలను జోడుద్దులుగా సమానంగా అమలు చేస్తూ ప్రజాదరణ పెంచుకుంటోంది. అదే సమయంలో రాష్ట్రంలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ పరిస్థితి మాత్రం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా ఉంది.  వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.  కేవలం రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు పరిమితం కాకుండా, కాకుండా, అభివృద్ధి కేంద్రీకృత పాలిటిక్స్ తో ప్రజలకు చేరువ కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.  రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.  వైసీపీకి పెట్టని కోట లాంటి రాయలసీమలో  ప్రస్తుతం  ప్రగతి వెలుగులు తెలుగుదేశం పార్టీకి కొండంత అండగా మారుతున్నాయి.  తిరుపతి జిల్లాలో  శ్రీ సిటీని  విస్తరించడం, అనంతపురం జిల్లాలో తయారీ రంగ పరిశ్రమలను  ప్రోత్సహించడం,  కడప మరియు కర్నూలు జిల్లాలలో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా సీమను ప్రగతి బాటలో పరుగులు పెట్టిస్తోంది చంద్రబాబు సర్కార్.  ఈ ప్రాంతంలో నూతన పరిశ్రమల ఏర్పాటు ద్వారా  స్థానిక యువతకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇది సీమలో తెలుగుదేశం కూటమి పట్ల ప్రజా బాహుల్యంలో సానుకూలతను పెంచుతోంది. అదే సమయంలో..  వైసీపీ ఆదరణ రోజు రోజుకూ తగ్గుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాయలసీమలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత వైసీపీకి  తిరుగులేని పట్టు ఉండేది.  తెలుగుదేశం పార్టీకి అక్కడక్కడా కొన్ని నియోజకవర్గాల్లో పట్టు ఉన్నప్పటికీ,  మొత్తంగా  సీమలో వైసీపీదే అధ్యప్యం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. అయితే తెలుగుదేశం కూటమి 2024 ఎన్నికలలో ఘన విజయం సాధించి  అధికారపగ్గాలు చేపట్టినప్పటి నుంచీ వ్యూహాత్మకంగా ఈ ప్రాంతంలో పట్టు సాధించడమే లక్ష్యంగా పావులు కదిపింది. ఎన్నికల ఫలితాలు వెలువడి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ తెలుగుదేశం కూటమి రాజకీయాలు కాకుండా అభివృద్ధిని మెయిన్ అజెండాగా తీసుకుని ముందుకు సాగింది.   రాజకీయంగా దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా ముందుకు సాగడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొంటున్న పరిస్థితి.   AP Coalition Government, Rayalaseema Development Strategy,  Chandrababu Naidu Political Strategy, Telugu One  
  తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేట్‌ ఆపరేటర్ల ఇంటర్నెట్‌ సేవలను వినియోగించకుండా, పూర్తిగా టీ-ఫైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ అందేలా చర్యలు చేపట్టాలని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీ-ఫైబర్‌ సేవలపై మంత్రి శ్రీధర్‌బాబు కీలక సమీక్ష నిర్వహించారు. సీఎస్‌ సంజయ్‌ జాజు, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్‌ దురిశెట్టి, టీ-ఫైబర్‌ ఎండీ వేణు ప్రసాద్‌ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.  రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ టీ-ఫైబర్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానించే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. సెప్టెంబర్‌ 1 తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్‌ సేవల కోసం ప్రైవేట్‌ ఆపరేటర్లకు ఎలాంటి బిల్లులు చెల్లించవద్దని అధికారులను శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అన్ని కార్యాలయాలకు అంతరాయం లేకుండా టీ-ఫైబర్‌ కనెక్టివిటీ అందేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలకు సేవలందిస్తున్న ‘టీ-స్వాన్‌’ (T-SWAN) నెట్‌వర్క్‌ను నెల రోజుల్లోగా టీ-ఫైబర్‌కు బదిలీ చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విభాగాల డిజిటల్‌ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ మార్పిడి ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్‌ సిటీ ప్రాజెక్టుకు కూడా పూర్తిస్థాయిలో టీ-ఫైబర్‌ ఇంటర్నెట్‌ సేవలు అందేలా అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధికి అనుగుణంగా అత్యుత్తమ డిజిటల్‌ కనెక్టివిటీ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికి ఇంటర్నెట్‌’ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటికీ నాణ్యమైన, అందుబాటులో ఉండే ఇంటర్నెట్‌ సేవలను చేరువ చేయడమే లక్ష్యంగా పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. Minister Sridhar Babu key review on T-Fiber, T-SWAN, Minister Sridhar , T-Fiber Connectivity, CS Sanjay 
బీహార్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో రెండు నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలతాలు బీజేపీకి పీడ కలనే మిగిల్చాయి.  బీజేపీకి కంచుకోటలు, అత్యంత సురక్షిత స్థానాలుగా గుర్తింపు పొందిన రెండు స్థానాలలోనూ కూడా ఉప ఎన్నికలో బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకుంది.  ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.    బీహార్‌లోని బంకిపూర్  అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జన సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ దాదాపు 20 వేల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. ప్రశాంత్ కిషోర్‌కు 64,151 ఓట్లు రాగా, సిన్హా 44,827 ఓట్లు సాధించారు. ఇక మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  కాంగ్రెస్ అభ్యర్థి ఘనశ్యామ్ సింగ్, బీజేపీ అభ్యర్థి అశుతోష్ తివారీపై  ఆరు వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. తివారీకి 60,741 ఓట్లు రాగా, సింగ్‌కు 66,757 ఓట్లు వచ్చాయి. ఈ రెండు ఫలితాలూ కూడా బీజేపీ ప్రజాదరణ కోల్పోతోందన్న సంకేతాలను బలంగా ఇచ్చాయి.   ముందుగా బంకీపూర్ విషయాన్ని తీసుకుంటే.. ఈ నియోజకవర్గం.. కమలం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నితిన్ నబిన్సొంత నియోజకవర్గం.అంతే కాదు  బీజేపీకి అత్యంత సురక్షితమైన సీట్లలో ఒకటి. 1995 నుంచి బీజేపీ ఈ సీటు గెలుచుకుంటూనే వస్తోంది. అటువంటి స్థానంలో బీజేపీ ఓటమి.. మోడీ పాలనపై ప్రజావ్యతిరేకతకు బలమైన సందేశంగా నిస్సందేహంగా చెప్పవచ్చంటున్నారు పరిశీలకులు.  ఇలా ఎందుకు చెప్పొచ్చంటూ.. బంకీపూర్ లో కానీ, దతియా నియోజకవర్గంలో కానీ జరిగినది ఉప ఎన్నిక. సాధారణంగా ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల పార్టీలు సునాయాసంగా గెలిచేస్తాయి. బీహార్, మధ్య ప్రదేశ్ లో  బీజేపీయే అధికారంలో ఉంది.      హస్తినలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, పోరాటం వల్ల మోడీ ప్రతిష్టకు కలిగిన నష్టం ప్రభావం కూడా బంకీపూర్, దతియా ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమికి కారణమైందని చెప్పొచ్చు. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ ల ఆందోళన, నిరసనల సమయంలో  ప్రధాని మోదీపై బహిరంగ విమర్శలు బ్రాండ్ ను మసకబార్చాయి.   అలాగే.. బంకిపూర్,  దతియా  ఫలితాలు నిరుద్యోగం, విద్య, విద్యార్థులపై పోలీసుల చర్యలపై ప్రజలో వెల్లువెత్తిన ఆగ్రహజ్వాలలకు దర్పణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  Bankipur and Datia defeats nightmare to BJP, Modi, Pride, Diminish
కాక్రోచ్ జనతా పార్టీ  వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే నీట్ పరీక్షాపత్రాల లీకేజీ, విద్యావ్యవస్థలోని అక్రమాలపై దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కారణమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ యువ నాయకుడి విదేశీ విద్యానిధులపై  బీజేపీ, దాని మద్దతు దారులు ప్రశ్నలు కురిపిస్తూ, విమర్శలు గుప్పిస్తున్నారు.  అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య  ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే..  సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన  1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.  సామాజిక మాధ్యమాల వేదికగా అభిజీత్ దిప్కేను  పాకిస్తానీ ఏజెంట్ అని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేయాలనే డిమాండ్లు కూడా వెలువడ్డాయి. కాగా తనపై వస్తున్న   ఆరోపణలు, విచారణ డిమాండ్లపై అభిజీత్ దిప్కే స్పందించారు. ఈ విషయంలో ఆయన  నేరుగా ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో షేర్ చేసిన వీడియో ద్వారా అభిజీత్ దీప్కే.. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు బోస్టన్ లాంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో చదువుకుంటే ఈ ప్రభుత్వానికి అంత కడుపుమంట ఎందుకని నిలదీశారు. తన విద్యార్హతలూ, ఆర్థిక లావాదేవీలలో ఎటువంటి దాపరికంలేనన్న అభిజీత్ దిప్కే.. తాను పొందిన   స్కాలర్‌షిప్ పత్రాలు, విద్యారుణం మంజూరు లేఖలను బహిరంగంగా ప్రజల ముందు ఉంచడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అదే సమయంలో   ప్రధాని నరేంద్ర మోదీ తన   డిగ్రీ సర్టిఫికేట్‌ను దేశ ప్రజలకు చూపిస్తారా? అంటూ సవాల్ చేశారు.  ఈ వివాదంలో అభిజీత్ దిప్కే తన విద్యాభ్యాసం,  దానికి అయిన ఖర్చులకు సంబంధించిన  గణాంకాలను  వెల్లడించారు. బోస్టన్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కమ్యూనికేషన్ నుండి మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ పబ్లిక్ రిలేషన్స్  పూర్తి చేసిన ఆయన, జూన్ నెలలో భారత్‌కు తిరిగి వచ్చారు. తన చదువు కోసం బోస్టన్ విశ్వవిద్యాలయం ప్రతీ సెమిస్టర్‌కు 12,వేల 500 డాలర్ల చొప్పున మొత్తం 3 సెమిస్టర్లకు  37 వేల500 డాలర్లు అంటే భారత కరెన్సీలో   రూ. 31 లక్షలకు పైగా)  డీన్స్ స్కాలర్‌షిప్ మంజూరు చేసిందని దీప్కే వివరించారు.  ఇక మిగిలిన విద్యా వ్యయం కోసం బ్యాంకు నుండి ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నానని, ఆ అప్పును తాను ఇప్పటికీ వాయిదాల పద్ధతిలో తీరుస్తున్నానని వెల్లడించారు.తప  అర్హత,  ప్రతిభ ఆధారంగానే ఈ స్కాలర్‌షిప్ లభించిందన్న ఆయన  ఈ విషయంలో కావాలంటే దర్యాప్తు చేసుకోవచ్చన్నారు.   ఈ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిపై వెంటనే ఈడీ (ఈడీ), సీబీఐవంటి దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం పరిపాటిగా మారిందన్న అభిజీత్ దిప్కే..    ప్రధాని నరేంద్ర మోదీ తన ఇంటికి  ఈడీని పంపినా తనకు అభ్యంతరం లేదనీ, దర్యాప్తు కోసం వచ్చే అధికారుల చేతికి మోడీ..  తన డిగ్రీ సర్టిఫికేట్ కాపీని   ఇచ్చి పంపాన్నారు. అప్పుడే నేను నా లోన్ పేపర్లు, స్కాలర్‌షిప్ లెటర్లు, డిగ్రీ కాపీలను అధికారులకు అందిస్తానని చెప్పారు.    Abhijeet Dipke, Narendra Modi Degree, Cockroach Janta Party, Boston University Scholarship, CJP Youth Movement, Education Loan Row
తమిళనాడు మాజీ ఉప ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయ నిథి స్టాలిన్ ను పోలీసులు అరెస్టు చేశారు.  ముఖ్యమంత్రి విజయ్, ప్రముఖ నటి త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ సోమవారం (ఆగస్టు 3) చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు వెలువడిన కేవలం 24 గంటల వ్యవధిలోనే చెన్నై పోలీసులు  ఉదయనిథి స్టాలిన్ ను అదుపులోనికి తీసుకున్నారు.  అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి  ఉదయనిధి స్టాలిన్‌పై   ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు, మంగళవారం (ఆగస్టు 4)ఉదయం ఉదయనిథి స్టాలిన్ ను ఆయన నివాసంలోనే అరెస్టు చేసి తీసుకెళ్లారు.  నివాసం నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అసలు వివాదం ఏమిటంటే.. సోమవారం (ఆగస్టు 3) తంజావూరులో కావేరి  జలాల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన   బహిరంగ  సభలో ఉదయనిథి స్టాలిన్     ముఖ్యమంత్రి  విజయ్ పాలనపై, ఆయన రాజకీయ విధానాలపై విమర్శలు చేశారు. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కొందరు డీఎంకే  కార్యకర్తలు..   విజయ్ వ్యక్తిగత విషయాలు, సినిమాలను ప్రస్తావిస్తూ..  త్రిష అంటూ నినాదాలు చేశారు. వాటికి స్పందనగా.. ఉదయ నిథి స్టాలిన్  నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు.  ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించినా.. ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  సోషల్ మీడియా వేదికగా ఉదయనిథి స్టాలిన్   వ్యాఖ్యల వీడి యోలు  తెగ వైరల్ అవ్వడంతో వివాదం మరింత ముదిరింది.  ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో తమిళనాడు హోంశాఖ,  చెన్నై పోలీసులు చట్టపరమైన చర్యలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకారం చుట్టారు.  కాగా ఉదయనిథి స్టాలిన్ అరెస్టును డీఎంకే తీవ్రంగా ఖండించింది.   డీఎంకే లీగల్ సెల్  మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. డీఎంకే తరఫు న్యాయవాదులు మద్రాస్ హైకోర్టులో బెయిలు పిటిషన్ దాఖలు చేశారు. అదలా ఉంటే..  డీఎంకే నేతలు ఉదయనిథి స్టాలిన్ అరెస్టును రాజకీయ కక్షసాధింపుగా అభివర్ణిస్తుంటే..   ప్రభుత్వం  చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఎవరూ  చట్టానికి అతీతులు కారని అంటోంది.  రాజకీయ పరిశీలకులైతే.. ప్రజా క్షేత్రంలో ఉండే నాయకులు బాధ్యతా యుతంగా మాట్లాడాలనీ, అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయనీ అంటున్నారు.   Udayanithi Stalin arrested, Tamilnadu, Former, Deputy CM, Untoward, Comments, Actress, Trisha
ALSO ON TELUGUONE N E W S
తెలుగు చిత్ర పరిశ్రమలో గత కొంతకాలంగా అత్యంత తీవ్రంగా నలుగుతున్న ప్రధాన సమస్యల్లో సినిమా టికెట్ల ధరలు, అలాగే నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య ఉండే పర్సంటేజ్ వివాదం ముఖ్యమైనవి. భారీ బడ్జెట్ సినిమాల విడుదల సమయాల్లో టికెట్ రేట్లు ఎంతవరకు పెంచాలి, సింగిల్ స్క్రీన్లు మరియు మల్టీప్లెక్స్ థియేటర్లలో వసూలయ్యే రాబడిలో ఎవరికి ఎంత శాతం వాటా దక్కాలనే అంశంపై పరిశ్రమ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ సవాళ్లకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు ఫిలిం ఛాంబర్ గతంలో ఒక కమిటీని నియమించినప్పటికీ, ఆశించిన స్థాయిలో పురోగతి సాధించకపోవడంతో చిత్ర పరిశ్రమలో అయోమయం నెలకొంది. అయితే, తాజాగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ విషయంలో ఒక అనూహ్యమైన మరియు కీలకమైన షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. గత కొద్ది రోజులుగా సుదీర్ఘంగా సాగిన చర్చల అనంతరం, ఫిలిం ఛాంబర్ పాత కమిటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పాత కమిటీ నిర్వహించిన సమీక్షలు, ప్రతిపాదనలు సమస్య తీవ్రతను తగ్గించలేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. అదే సమయంలో, ఈ వివాదానికి పారదర్శకమైన మరియు అందరికీ ఆమోదయోగ్యమైన ముగింపు పలికేందుకు సీనియర్ ప్రముఖ నిర్మాత కె.ఎల్. నారాయణ అధ్యక్షతన ఒక కొత్త కమిటీని రంగంలోకి దించింది. ఈ నూతన కమిటీలో టాలీవుడ్‌కు చెందిన విభిన్న విభాగాల ప్రతినిధులుగా మొత్తం 9 మంది సభ్యులను నియమించడం విశేషం. నిర్మాతల ప్రయోజనాలను కాపాడుతూనే, ఎగ్జిబిటర్లు, థియేటర్ యజమానుల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకునేలా ఈ 9 మంది సభ్యుల బృందం పని చేయనుంది. ఈ కొత్త కమిటీ ఏర్పాటుతో పాటు ఫిలిం ఛాంబర్ మరొక ఆసక్తికరమైన విషయాన్ని స్పష్టం చేసింది. ఈ 9 మంది సభ్యుల కమిటీ ఇచ్చే తుది నివేదికకు ఎలాంటి నిర్దిష్ట కాల పరిమితిని విధింలేదు. గతంలో తొందరపాటు నిర్ణయాల వల్ల అనేక చిక్కులు ఎదురైన నేపథ్యంలో, ఈసారి అత్యంత పక్కాగా, అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే నివేదికను రూపొందించాలని నిర్ణయించారు. టికెట్ ధరల విధివిధానాలు, వినోద పన్నుల సర్దుబాటు, ప్రదర్శనల సమయాలు, మరియు థియేటర్ల పర్సంటేజ్ షేరింగ్ సిస్టమ్‌పై విస్తృతమైన అధ్యయనం చేయడానికి ఈ కమిటీకి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఏ ఒక్క వర్గానికి అన్యాయం జరగకుండా, సుదీర్ఘకాలం పాటు అమలయ్యే విధంగా ప్రతిపాదనలు తయారు కానున్నాయి. టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో భారీ చిత్రాలు వరుసగా థియేటర్లలోకి వస్తుండటంతో, టికెట్ రేట్ల పెంపు సాధారణ ప్రేక్షకులపై పెను భారంగా మారుతోందనే విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు, పెరిగిన నిర్వహణ ఖర్చులు మరియు ఓటీటీల పోటీ కారణంగా థియేటర్ల రన్ టైమ్ తగ్గిపోతోందని ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు విరుద్ధమైన కోణాలను సమతుల్యం చేయడం కె.ఎల్. నారాయణ నాయకత్వంలోని 9 మంది సభ్యుల కమిటీకి అతిపెద్ద సవాలుగా మారనుంది. సామాన్య సినిమా ప్రేక్షకుడికి టికెట్ అందుబాటులో ఉంటూనే, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు నష్టపోకుండా ఉండే మధ్యేమార్గాన్ని ఈ కొత్త కమిటీ అన్వేషించాల్సి ఉంది. ఈ నూతన కమిటీ ఇచ్చే సిఫార్సుల ఆధారంగానే రాబోయే రోజుల్లో తెలుగు సినిమా టికెట్ ధరల భవిష్యత్తు మరియు థియేటర్ల బిజినెస్ మోడల్ ఆధారపడి ఉంటుంది. కాల పరిమితి లేకుండా సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించేందుకు సిద్ధమవుతున్న ఈ 9 మంది సభ్యుల కమిటీ ఏ విధమైన కీలక నిర్ణయాలు తీసుకోబోతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, సినీ ప్రియుల్లోనూ విపరీతమైన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరి కె.ఎల్. నారాయణ సారథ్యంలోని ఈ కొత్త కమిటీ టాలీవుడ్‌ను వేధిస్తున్న ఈ తీవ్రమైన టికెట్ల పంచాయితీకి స్వస్తి పలికి, పరిశ్రమలోని అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపుతుందో లేదో వేచి చూడాలి.
మలయాళ సినిమా పరిశ్రమ నుంచి వచ్చే ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు భారతీయ ఆడియన్స్ లో ఎల్లప్పుడూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. నేచురల్ మేకింగ్, ఉత్కంఠ రేకెత్తించే కథనంతో ప్రేక్షకులను కట్టిపడేయడంలో అక్కడ దర్శకులు సిద్ధహస్తులు. అదే కోవలో ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచిన తాజా మలయాళ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం 'ఉయిర్'. గతంలో జూన్ 26వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఈ రోజే అంటే ఆగస్టు 4వ తేదీన ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్ స్టార్'లో డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలతో కలిపి మొత్తం 5 విభిన్న భాషలలో అందుబాటులోకి రావడం విశేషం. ప్రముఖ నటుడు రోషన్ మాథ్యూ కథానాయకుడిగా నటించగా, ప్రతిభావంతుడైన దర్శకుడు ఎం. పద్మకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులకు ఎలాంటి థ్రిల్ అందించింది, దీని రేటింగ్ 5కి 3.00 గా ఎందుకు నిలిచింది అనేది ఇప్పుడు సమగ్రంగా తెలుసుకుందాం. కథలోకి వెళితే, కేరళలోని కన్నూర్ జిల్లా పరిధిలోని 'ధర్మడం' పోలీస్ స్టేషన్ కి ప్రొబేషనరీ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ గా అజీబ్ (రోషన్ మాథ్యూ) బాధ్యతలు స్వీకరిస్తాడు. అతని పైఅధికారిగా నందకుమార్ విధులు నిర్వహిస్తుండగా, జాయ్, మోహన్, మధు అనే ముగ్గురు కానిస్టేబుళ్లు సహచరులుగా ఉంటారు. బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ధర్మడం పోలీస్ స్టేషన్ పరిధిలోని 'కొడువల్లి' గ్రామంలోని ఒక పాడుబడిన బావిలో ఒక స్త్రీ డెడ్ బాడీ ఉందనే అత్యవసర సమాచారం పోలీసులకు అందుతుంది. వెంటనే ఎస్సై అజీబ్ తన టీమ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని, బావిలో నుంచి కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న ఆ మహిళ మృతదేహాన్ని బయటికి తీయిస్తాడు. ఆ మహిళ చనిపోయి కొన్ని రోజులు అయి ఉంటుందని ప్రాథమికంగా గుర్తించి విచారణ ప్రారంభించగా, ఆ యువతి పేరు శోభ అని, ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని అజీబ్ తెలుసుకుంటాడు. ఇన్వెస్టిగేషన్ వేగవంతం చేసిన క్రమంలో శోభ చేతిపై 'రాజు' అనే పచ్చబొట్టు పోలీసుల కంటపడుతుంది. అది ఆమె భర్త పేరు అని పోలీసులు నిర్ధారించుకుంటారు. శోభ ఇంట్లో లభించిన ఒక ఫ్యామిలీ ఫొటో ఆధారంగా స్థానికులు ఆ వ్యక్తిని గుర్తుపట్టడంతో, పోలీసులు వేగంగా గాలించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుంటారు. విచారణలో ఆ వ్యక్తి, తన భార్య శోభ తన స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అది భరించలేకే తాను తన ఇద్దరు పిల్లలను తీసుకుని దూరంగా వెళ్లిపోయానని చెబుతాడు. ఆ తర్వాత ఆమెకు ఏం జరిగిందో తనకు తెలియదని రాజు స్పష్టం చేస్తాడు. శోభతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పడంతో పాటు శవాన్ని తీసుకెళ్లడానికి కూడా నిరాకరిస్తాడు. దీంతో పోలీసులు కేసును ఆత్మహత్యగా భావించి, రాజు సమక్షంలోనే శోభ అంత్యక్రియలు పూర్తి చేసి అతడిని పంపించేస్తారు. అయితే అసలు కథ ఇక్కడే ఊహించని మలుపు తిరుగుతుంది. శోభ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత ఆమె సొంత బంధువులు కొందరు పోలీస్ స్టేషన్‌కు వస్తారు. భర్త రాజు సమక్షంలోనే అంత్యక్రియలు పూర్తి చేశామని అజీబ్ చెప్పి ఆ ఫొటోను వారికి చూపిస్తాడు. కానీ ఆ ఫొటో చూసిన బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతారు. ఫొటోలో ఉన్న వ్యక్తి రాజు కాదని, అతడి పేరు భువనేశ్ అని, అతడు శోభ భర్త కానే కాదని బాంబు పేలుస్తారు. రాజు పేరుతో భువనేశ్ అనే వ్యక్తి తమను పక్కదారి పట్టించాడని, ఇది కేవలం ఆత్మహత్య కాదని పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన ఘోరమైన హత్య అని అజీబ్ గ్రహిస్తాడు. తమ కళ్లముందే నిందితుడు తప్పుదోవ పట్టించి తప్పించుకోవడంతో పైఅధికారులు సీరియస్ అయి, కేవలం 24 గంటల వ్యవధిలో భువనేశ్ ను ఏ క్షణంలో ఉన్నా పట్టుకోవాలని అజీబ్ ను ఆదేశిస్తారు. మరి ఆ 24 గంటలలో అజీబ్ భువనేశ్ ను పట్టుకున్నాడా? అసలు శోభ భర్త, ఆమె ఇద్దరు పిల్లలు ఏమయ్యారు? ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఒక పోలీస్ ఆఫీసర్ తన కెరియర్ లో ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు ఎం. పద్మకుమార్ ఈ చిత్రాన్ని చాలా సహజంగా తెరకెక్కించారు. నాటకీయత, అనవసరమైన మాస్ హంగామా లేకుండా వాస్తవ సంఘటనలకు అద్దం పట్టేలా ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచారు. ముఖ్యంగా హీరో అజీబ్ కి ఈ కేసు పర్సనల్ గా మారడానికి ఉన్న ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ప్రేక్షకాదరణ పొందుతుంది. సాంకేతికంగా అజయ్ డేవిడ్ ఫోటోగ్రఫీ, మణికందన్ అయ్యప్ప బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రంజన్ అబ్రహం షార్ప్ ఎడిటింగ్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సహజత్వంతో కూడిన క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఆస్వాదించే వారికి 3.00/5 రేటింగ్ సాధించిన 'ఉయిర్' జియో హాట్ స్టార్ లో కచ్చితంగా చూడదగిన చిత్రంగా నిలుస్తుంది.  
చిత్ర పరిశ్రమలో కథానాయికల వ్యక్తిగత జీవితాలపై వచ్చే రూమర్లు, సోషల్ మీడియా వేదికగా సాగే ట్రోలింగ్స్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి. తాజాగా కుర్రకారు కలల రాణి, యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న కొన్ని సందేశాలు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అనుపమ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్న ఆవేదనతో కూడిన, భావోద్వేగమైన క్యాప్షన్లు చూసి రకరకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్‌తో అనుపమ ప్రేమాయణం నడిపిందని, ఇటీవల వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి లవ్ బ్రేకప్ అయిందంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రకరకాల రూమర్లను పుట్టించారు. బ్రేకప్ బాధలోనే ఆమె ఇటువంటి ఎమోషనల్ పోస్టులు పెడుతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తన వ్యక్తిగత జీవితంపై, సోషల్ మీడియా పోస్టులపై వస్తున్న ఈ కథనాలపై అనుపమ పరమేశ్వరన్ ఎట్టకేలకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందిస్తూ నెటిజన్లకు, రూమర్ రాయుళ్లకు ఘాటుగా సమాధానమిచ్చింది. "నా అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఏం పోస్ట్ చేయాలనేది పూర్తిగా నా వ్యక్తిగత హక్కు, నా సొంత నిర్ణయం. ఏదో బాధపడి, ఇతరుల ముందు నా ఆవేదనను ప్రదర్శించి సానుభూతి పొందాల్సిన అవసరం నాకు ఏమాత్రం లేదు" అని ఆమె స్పష్టం చేసింది. సాధారణంగా ఏ మహిళ అయినా తన జీవిత ప్రయాణంలో అనేక మార్పులను, హెచ్చుతగ్గులను ఎదుర్కొంటుంది. ఒక సాధారణ మహిళగా తన జీవితంలో చూస్తున్న ఆ మార్పుల గురించే తాను మాట్లాడానని, ఆ భావాలను సమాజంతో ధైర్యంగా పంచుకోవడం తనకు ఎంతో గర్వంగా అనిపిస్తోందని అనుపమ బల్లగుద్ది చెప్పింది. తన పర్సనల్ లైఫ్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్న వారికి సూటిగా హెచ్చరిక జారీ చేస్తూ, "నా జీవితం గురించి, నా పర్సనల్ లైఫ్ గురించి బయట ఉన్న మీకేం తెలుసు? ఇది నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్, నా మనసుకు నచ్చిన విషయాలను నేను పోస్ట్ చేసుకుంటాను. ఇందులో నన్ను ప్రశ్నించడానికి అసలు మీరెవరు?" అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సానుభూతి కోసం తాను ఎలాంటి డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదని, తన భావ ప్రకటన స్వేచ్ఛను ఇతరులు వంకర్లు తిప్పడాన్ని సహించేది లేదని అనుపమ ఖచ్చితమైన ధోరణితో తేల్చిచెప్పింది. ఈ ఘాటు వ్యాఖ్యలతో అనుపమ తనపై వస్తున్న ప్రేమ, బ్రేకప్ పుకార్లకు ఒకే దెబ్బతో గట్టి చెక్ పెట్టింది. ఒకవైపు రూమర్లను తిప్పికొడుతూనే, మరోవైపు తన నటనతో, విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడానికి అనుపమ నిరంతరం శ్రమిస్తోంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా రొటీన్ కథలకు భిన్నంగా ఉండే సవాలుతో కూడిన ప్రాజెక్టులను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ప్రస్తుతం ఆమె 'క్రేజీ కల్యాణం' అనే ఆసక్తికరమైన చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు బద్రప్ప సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్, సీనియర్ నటుడు నరేష్, అఖిల్ ఉడ్డెమారి కీలక పాత్రలు పోషిస్తున్నారు. పర్సనల్ లైఫ్‌పై వచ్చిన వదంతులకు సూటిగా సమాధానమిస్తూ, కెరీర్‌పై దృష్టి సారించిన అనుపమ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ అత్యంత హాట్ టాపిక్‌గా మారాయి.   Anupama Parameswaran, Anupama Breakup Rumors, Dhruv Vikram, Crazy Kalyanam Movie, Anupama Parameswaran Interview, Tollywood News
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో, చలాకీతనంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న కథానాయిక అదితి శంకర్. ప్రముఖ సంచలన దర్శకుడు శంకర్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ, తన సొంత ప్రతిభతో నటిగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అదితి శంకర్ ప్రధాన పాత్రలో నటించిన తాజా రొమాంటిక్ డ్రామా మూవీ 'వన్స్ మోర్'. ఎంతోకాలంగా సినీ అభిమానులు, యూత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ విడుదల తేదీని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అత్యంత వైభవంగా తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఈ సినిమాలో అదితి శంకర్ సరసన వైవిధ్యమైన గొంతు, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకునే అర్జున్ దాస్ కథానాయకుడిగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ తెరపై కొత్తదనాన్ని, ఫ్రెష్ ఫీల్‌ను అందిస్తుందని టాక్ వస్తోంది. విఘ్నేశ్ శ్రీకాంత్ దర్శకత్వంలో లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 28 విడుదల ఖరారైనట్లు మేకర్స్ ప్రకటించడంతో సోషల్ మీడియాలో సినీ ప్రియుల సందడి మొదలైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మిలియన్ డాలర్ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా ఈ విశేషాన్ని పంచుకుంటూ ప్రత్యేక పోస్ట్ పెట్టింది. "పండగ రోజు ఇదే! సుదీర్ఘ నిరీక్షణకు తెరపడి ప్రేమ చిగురించే అద్భుత క్షణం ఆసన్నమైంది. మా ప్రేమ క్యాలెండర్‌లో మాకు అత్యంత ఇష్టమైన మ్యాజికల్ డే దొరికింది. 'వన్స్ మోర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 28న గ్రాండ్‌గా థియేటర్లలోకి వస్తోంది" అని ప్రకటించి సినీ ప్రేక్షకుల్లో ఎగ్జైట్‌మెంట్‌ను పెంచేశారు. ఈ సినిమాకు ముఖ్యాకర్షణగా పలు విశేషాలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా, మలయాళంలో బ్లాక్‌బస్టర్ సాధించిన 'హృదయం', తెలుగులో యూత్‌ను ఎంతగానో అలరించిన 'హాయ్ నాన్న' వంటి చిత్రాలకు చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందించి సంగీత ప్రపంచంలో సరికొత్త అలలు సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతుండటం విశేషం. హేషమ్ అందించిన మధురమైన స్వరాలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ రొమాంటిక్ కథకు ప్రధాన బలంగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన కొన్ని సింగిల్స్ సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటూ మ్యూజిక్ చార్ట్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. అర్జున్ దాస్, అదితి శంకర్ ప్రధాన జంటగా అలరించనున్న ఈ చిత్రంలో గ్లామరస్ మోడల్, నటి సోనా ఒలికల్ ఒక కీలకమైన మరియు ప్రభావవంతమైన పాత్రలో కనిపిస్తున్నారు. సాంకేతిక పరంగా కూడా ఈ సినిమా ఎంతో ఉన్నతంగా ఉండబోతోంది. అరవింద్ విశ్వనాథన్ ప్రతిష్ఠాత్మకంగా సినిమాటోగ్రఫీ అందించగా, క్రిస్ప్ కథనంతో నాష్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. రాజ్ కమల్ ఆర్ట్ డైరెక్టర్‌గా విశేషమైన విజువల్స్ డిజైన్ చేశారు. మిలియన్ డాలర్ స్టూడియోస్ పతాకంపై యువరాజ్ గణేశన్ ఈ చిత్రాన్ని అట్టహాసంగా నిర్మిస్తున్నారు. హరీశ్ దురైరాజ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, విజయ్ ఎంపీ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన లవ్ ట్రాక్, మనసును తాకే యూత్‌ఫుల్ ఎమోషన్స్‌తో రాబోతున్న ఈ చిత్రం థియేటర్లలో ఆగస్టు 28న ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది.
For nearly two decades, Tamannaah Bhatia has been one of Indian cinema's most recognizable stars. From chartbuster dance numbers to glamorous commercial entertainers, she has built an enviable career across Telugu, Tamil and Hindi cinema. But now, the actress says she wants audiences to look beyond her glamour quotient and recognize her as a performer first. In recent interactions, Tamannaah reflected on how her journey in South cinema transformed her into the actor she is today. She revealed that she had no formal classical dance training when she entered the industry, but the demanding nature of Telugu and Tamil films forced her to learn quickly. What started as a "survival skill" eventually became one of her biggest strengths, helping her become one of the industry's most dependable commercial heroines. However, Tamannaah now believes her body of work deserves recognition beyond hit songs and glamorous appearances. Having appeared in close to 90 films over a career spanning more than 20 years, she feels audiences often associate her with beauty and dance while overlooking the range she has displayed in films and web series. Projects such as November Story, Aakhri Sach, Jee Karda, and more recently Do You Wanna Partner, showcased a different side of the actress, proving she can carry performance-driven roles just as convincingly. The shift also reflects a broader change in Tamannaah's career choices. Instead of limiting herself to conventional commercial roles, she has increasingly explored thrillers, OTT dramas and character-driven stories. While glamorous songs continue to remain a part of her career, the actress appears determined to strike a balance between mass entertainers and content-oriented cinema, building a legacy that extends beyond star appeal. With upcoming projects continuing to span multiple languages and genres, Tamannaah seems focused on reinventing herself rather than staying confined to an image that made her famous. After spending years proving she could be one of Indian cinema's biggest glamour icons, the actress is now on a mission to ensure she is remembered equally for her performances. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న హీరో విజ‌య్ ఆంటోని ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ ఎమోష‌న‌ల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’. త‌మిళంలో ‘నూరు సామి’గా రిలీజైంది. జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రశంసలు అందుకుంది.  ‘బిచ్చ‌గాడు’(పిచ్చైకార‌ణ్‌) సినిమా త‌ర్వాత విజ‌య్ ఆంటోని, డైరెక్ట‌ర్ శ‌శి కాంబోలో వ‌చ్చిన సినిమా ఇది. భావోద్వేగ కుటుంబ క‌థా చిత్రంగా ఇది తెర‌కెక్కింది. విజ‌య్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేష‌న్ బ్యాన‌ర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 7 నుంచి ఈ చిత్రం Zee5లో తెలుగు, త‌మిళ‌, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ‘వంద దేవుళ్లు’లో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్ దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.  నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన 'వంద దేవుళ్ళు' చిత్రం వింతతువు, ఆమె ఇద్దరి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. మధ్య వయస్సుకి వచ్చిన అమ్మని మళ్లీ పెళ్లి చేయాలని కొడుకు అనుకోవడం, ఆ తల్లి సైతం తోడును వెతుక్కోవాలని ఆలోచించినప్పుడు, ఆమె నిర్ణయం బంధువులు, గ్రామస్తులు, మొత్తం సమాజం నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తల్లీకొడుకుల అద్భుతమైన బంధాన్ని తెరపై అంతే అద్బుతంగా చూపించారు.   Vandha Devullu, OTT Release, Vijay Antony
After emerging as the Family Blockbuster of the Year and winning hearts in theatres with its heartfelt storytelling and emotionally resonant narrative, Vijay Antony’s Vandha Devullu is all set to make its digital premiere on Telugu ZEE5 from August 7. Written and directed by acclaimed filmmaker Sasi, the film marks his reunion with Vijay Antony nearly a decade after the blockbuster Bichagadu, bringing another emotionally driven story that celebrates family, relationships and second chances. Inspired by true events, Vandha Devullu tells the story of a widowed mother who has devoted her life to raising her family. When she decides to embrace a new phase of life, she finds herself battling deep-rooted social expectations and difficult personal choices. With its emotionally layered narrative, the film explores motherhood, dignity, acceptance and the courage to choose happiness while staying rooted in family values. Vandha Devullu stands apart for its refreshing portrayal of the mother-son relationship. Instead of celebrating sacrifice alone, the film focuses on understanding, compassion and the emotional strength that binds a family together. Director Sasi brings his signature storytelling style to a subject that is both socially relevant and universally relatable, making it an emotional experience that stays with audiences long after the credits roll. The film stars Vijay Antony, Swasika, Ajay Dhishan, Lijomol Jose, Karunas, Kavya Anil, Balaji Sakthivel and Aruldoss in pivotal roles. Produced under the Vijay Antony Film Corporation banner, Vandha Devullu features music by Balaji Sriram, cinematography by S.P. Darshan Girlosh and editing by Harish Yuvaraj, with every department contributing to the film’s emotionally immersive storytelling. Speaking about the film’s digital premiere, director Sasi said, “Vandha Devullu is a story born out of real emotions and real lives. I wanted to tell a story about love, acceptance and the freedom to choose happiness beyond society’s expectations. I’m grateful for the love the film received in theatres, and I’m delighted that it will now reach many more families through Telugu ZEE5.” Vijay Antony added, “Every film has a purpose, and Vandha Devullu is special because of the emotions it carries. The relationship between the mother and her son is the heart of this story, and I believe audiences will connect deeply with its message. I’m happy that Telugu audiences can now experience this emotional journey with their families on Telugu ZEE5.” Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Karthi's much-awaited Marshal has been in the news for its prolonged delay, and the latest buzz from Kollywood circles suggests that financial hurdles could be one of the key reasons behind the film's slow progress. Kalyani Priyadarshan accepted to be part of the film post her Lokah Industry Hit success.  According to industry grapevine, Dream Warrior Pictures is reportedly facing financial pressure despite the blockbuster success of Karuppu. The speculation is that a portion of the theatrical share from the previous release is yet to reach the production house, with reports claiming that certain theatre owners have allegedly withheld around Rs.30 crore share due to unresolved financial disputes from earlier business dealings. While there has been no official confirmation from either the producers or exhibitors, the ongoing uncertainty is said to have impacted the production timeline of Marshal. With the project remaining on hold, Karthi has reportedly shifted his focus to his next film, which will be directed by Mohan Raja and produced by Prince Pictures. The official announcement has been made about the film, recently.  Industry insiders further claim that Marshall has not been shelved. Instead, the makers are said to be planning to resume production once the financial issues are sorted out. There is also speculation that the ambitious project could eventually be released as a two-part film, allowing the makers to realize its intended scale. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.  
కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా 'చిరంజీవి'. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, తనికెళ్ల భరణి,శ్రీకాంత్  భరత్, వైవా రాఘవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మిస్తున్నారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు.  'చిరంజీవి' సినిమా ఈ నెల 28న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్ ఎలా ఉందో చూస్తే.. చిరంజీవి అనే యువకుడు డెక్స్ట్రోకార్డియా (కుడివైపు గుండె ఉండే అరుదైన పరిస్థితి)తో బాధపడుతుంటాడు. అతన్ని ప్రాణంగా ప్రేమిస్తుంది హీరోయిన్. ఈ జంట వారి గదిలో సన్నిహితంగా ఉన్న సమయంలో కుడివైపు గుండె కొట్టుకునే చిరంజీవికి సాధారణంగా అందరిలాగే ఎడమవైపుకి గుండె కొట్టుకోవడం గమనించి ఆశ్చర్యపోతుంది హీరోయిన్. చిరంజీవి ప్లేస్ లో ఎవరో ఉన్నారని ఆమెకు అర్థమవుతోంది. ఈ ట్విస్ట్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. చివరలో గ్రే షేడ్ లో హీరోను చూపిస్తూ టీజర్ ను ముగించిన తీరు ఆకట్టుకుంది.  ప్రేక్షకులను ఎంగేజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో ఈ నెల 28న తెరపైకి రాబోతోంది 'చిరంజీవి' సినిమా.     Chiranjeevi, Telugu Cinema, Tollywood  
  అభిమానులకి, సినీ ప్రియులకి అత్యంత ఇష్టమైన పదం ఏదైనా ఉంది అంటే ప్రీమియర్ షో. తమ అభిమాన హీరో ప్రీమియర్ షో చూసీ చదువులో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళలాగా  గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది. మరి అలాంటి ప్రీమియర్ వల్ల సినిమాకి లాభమా, నష్టమా? ఏ చిత్రాలు పోటీలో ఉన్నాయనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుంది. మరి ఆ డిస్కర్షన్ తాలూకు మాటర్  చూద్దాం. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'ఫౌజీ' కి ప్రీమియర్స్ వేస్తామని మేకర్స్ అధికారకంగా చెప్పేసారు ఫౌజీ విడుదలైన మరుసటి రోజే బాలీవుడ్ అగ్ర నటులు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్ నటించిన రెండు భారీ హిందీ చిత్రాలు థియేటర్లలోకి అడుగుపెడుతుండడం విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి తోడు విడుదలైన కేవలం 2 వారాల వ్యవధిలోనే హాలీవుడ్ విజువల్ వండర్స్ 'అవెంజర్స్', 'డ్యూన్' సీక్వెల్స్ కూడా బరిలోకి దిగుతుండటంతో ప్రీమియం 4DX, ఐమ్యాక్స్ స్క్రీన్ల షేరింగ్ విషయంలో తీవ్రమైన పోటీ ఎదురుకానుంది.  మరోవైపు న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న 'ది పారడైజ్' సినిమాపై కూడా ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. మొదటిసారిగా ఆయన నటిస్తున్న ఒక సినిమా బడ్జెట్ 200 కోట్ల మార్కు  దాటిపోయింది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, క్వాలిటీ కోసం నిర్మాణ పనుల్లో జాప్యం జరగడంతో, తొలుత ప్రకటించిన ఆగస్టు 21 తేదీ నుండి ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25కు వాయిదా వేశారు. సినిమా నాణ్యతపై మేకర్స్‌కు పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ, భారీగా పెరిగిన బడ్జెట్ మరియు వాయిదా పడ్డ విడుదల తేదీ నిర్మాతలపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. 'ది పారడైజ్' బాక్సాఫీస్ వద్ద సాధారణ హిట్ సాధిస్తే సరిపోదు, నిర్మాతలకు లాభాలు రావాలంటే ఓపెనింగ్ డే నుంచే కలెక్షన్ల సునామీ సృష్టించాల్సి ఉంటుంది.  నేటి డిజిటల్ యుగంలో ఒక సినిమా విజయాన్ని తొలి రోజు ప్రీమియర్ షోల టాక్, అర్ధరాత్రి షోల కలెక్షన్లే శాసిస్తున్నాయి.  also read: మదురై లో త్రిష కలకలం..  త్రిష నర్పణి మన్త్రమ్ అంటూ పోస్టర్స్  గతంలో వారాంతం వరకు సాగే బాక్సాఫీస్ ప్రయాణం, ఇప్పుడు గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయం ప్రీమియర్ షోల వరకే పరిమితమైంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ప్రీమియర్ కలెక్షన్లను రాబట్టడానికి నిర్మాతలు వినూత్న వ్యూహాలు వేస్తున్నారు. విదేశాలలో గురువారం సాయంత్రం వేసే ప్రీమియం స్క్రీనింగ్స్ ద్వారా వందల కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ సాధించడం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారింది. ఒకవేళ మొదటి షోకే పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లు 300 కోట్లకు పైగా మార్కును సునాయాసంగా అందుకుంటున్నాయి. అదే సమయంలో తేడా వస్తే ఊహించని నష్టాలు తప్పవు. అందుకే ప్రీమియర్స్ అనేవి కత్తి మీద సాము లాంటివనే అభిప్రాయం కొందరిలో ఉంది. డిసెంబర్ రేసులో ప్రభాస్ 'ఫౌజీ'కి బాలీవుడ్ నుండి మాత్రమే కాకుండా స్వదేశీ దిగ్గజాల నుంచి కూడా సవాళ్లు ఎదురవుతున్నాయి. బిగ్ బడ్జెట్ సినిమాలైన ఫౌజీ, ది పారడైజ్ మాత్రమే కాదు, 2026 సెకండాఫ్‌లో రాబోతున్న ప్రతీ పాన్-ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద తన సత్తా నిరూపించుకోవాలంటే సరైన పబ్లిసిటీ వ్యూహం, కచ్చితమైన ప్రీమియర్ టైమింగ్స్, ప్రచార కంటెంట్ అత్యంత కీలకం కానున్నాయి.   Fauji, The Paradise, Tollywood  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సహాయం.. మనిషికి ఉండాల్సిన మంచి గుణాలలో సహాయం చేయడం కూడా ఒకటి. ఆపదలో ఉన్నవారికి,  అవసరం లో ఉన్నవారికి,  ఇబ్బందులలో ఉన్నవారికి సహాయం చేయడం చాలామంచి లక్షణం.కానీ కొన్నిసార్లు, ఆలోచించకుండా చేసే సహాయం పెద్ద తలనొప్పిగా మారవచ్చు. చాణక్య నీతి ప్రకారం.. కొందరు వ్యక్తులకు సహాయం చేయడం వల్ల ఇబ్బందులు పడతారని, అంతే కాకుండా కొందరు వ్యక్తులకు సహాయం చేస్తే.. సహాయం చేసిన వారే నాశనం అవుతారని, తీవ్ర సమస్యలో చిక్కుకుంటారని చెబుతారు. అలాంటి మూడు రకాల వ్యక్తుల గురించి కూడా ఆచార్య చాణక్యుడు చెప్పాడు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దుర్మార్గులు, చెడ్డ గుణం కలిగిన స్త్రీ, పురుషులు.. చెడ్డ మనసు లేదా చెడు గుణం కలిగిన , కోపిష్టి స్వభావం ఉన్నవారికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేయడం అంటే మన కాళ్ళను  మనమే కాల్చుకోవడం లాంటిది. చెడ్డ   స్వభావం ఉన్నవారు ఎవరికీ స్నేహితులు కారు.  వారికి ఎంత దయ చూపినా,  అవకాశం దొరకగానే తిరిగి హాని చేయడానికి  వెనుకాడరు. అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడం  వల్ల సామాజిక హోదా , ప్రతిష్టపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అందువల్ల అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఏ విషయాలకు అయినా దూరంగా ఉండాలి. ఎప్పుడూ విచారంగా ఉండేవారు.. ఈ ప్రపంచంలో కొందరు ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అన్నీ ఉన్నప్పటికీ, వారు తమ విధిని, పరిస్థితులను ఎప్పుడూ  నిందించుకుంటూ ఉంటారు. ఇలాంటి నెది నెగిటివ్  మనస్తత్వం ఉన్నవారికి సహాయం చేయడం మానుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి వారు తమ జీవితంలో ఎప్పటికీ సంతోషంగా లేదా సంతృప్తిగా ఉండలేరు.  అలాంటి  వారికి సహాయం చేస్తే, వారి ప్రతికూల శక్తి  జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. క్రమంగా వారికి సహాయం చేసేవారు కూడా మానసిక ఒత్తిడికి గురై  సంతోషాన్ని కోల్పోతారు. మూర్ఖుడు.. మూర్ఖుడికి , బుద్ధిహీనుడికి ఏదైనా చెప్పడం,  మూర్ఖుడికి సలహా ఇవ్వడం లేదా సహాయం చేయడం అత్యంత మూర్ఖపు పనిగా చెబుతారు. తమ మంచి చెడులను తాము తెలుసుకోలేని వ్యక్తికి ఏదైనా వివరించడం పూర్తిగా సమయం వృధా చేసినట్టే. అలాంటి   సరైన మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నించినప్పుడు, వారు తరచుగా  చెప్పేదాన్ని అపార్థం చేసుకుంటారు. అలాంటి వ్యక్తులు సహాయం అందించే వ్యక్తిని తమ శత్రువుగా భావిస్తారు. వారితో వాదించడం లేదా వారికి సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల  మనశ్శాంతిని పూర్తిగా కోల్పోవాల్సి వస్తుంది. సహాయం చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.. ఇతరులకు సహాయం చేయడం అంటే తప్పనిసరిగా మిమ్మల్ని మీరు ప్రమాదంలో పడేసుకోవడం కాదు. సహాయం చేసే గుణం మంచిదే అయినప్పటికీ, ,తెలివిని  ఉపయోగించడం కూడా అంతే ముఖ్యం. ఎవరికైనా సహాయం చేసే ముందు, వారి ఉద్దేశాలను, ప్రవర్తనను జాగ్రత్తగా అంచనా వేయాలి. ఎదుటి వ్యక్తి మీ సహాయం చేసే గుణాన్ని  దుర్వినియోగం చేయవచ్చని మీకు అనుమానం వస్తే, వెంటనే వెనక్కి తగ్గడం మంచిది. మీ దయా గుణాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకుండా ఉండేలా మీ హద్దులను మీరే ఏర్పరచుకోవడం నేర్చుకోవాలి. సరైన వ్యక్తికి సహాయం చేయడం సరైన వ్యక్తి సహాయం చేయడం చాలా మంచిది. మీరు అవసరంలో ఉన్న, నిజాయితీపరుడైన, నిష్కపటమైన వ్యక్తికి సహాయం చేసినప్పుడు,  తప్పకుండా ప్రతిఫలాన్ని పొందుతారు. సరైన వ్యక్తికి సహాయం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది , సమాజంలో  గౌరవాన్ని పెంచుతుంది. మన సహాయ గుణాన్ని సరైన చోట ఉపయోగించాలని చాణక్య నీతి  బోధిస్తుంది. మీరు మీ శక్తిని, ధనాన్ని సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద పెట్టుబడిగా పెట్టినప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుందని అంటున్నాడు ఆచార్య చాణక్యుడు. అందువల్ల, ఎల్లప్పుడూ  మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకున్న తర్వాతే ఇతరులకు సహాయం చేయాలి.                                    *రూపశ్రీ.  
 తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి..!++ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలోని ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు, తల్లిదండ్రులకు తెలియకుండానే వారి కొన్ని అలవాట్లు, వారి పిల్లల ఆత్మవిశ్వాసాన్ని బలహీనపరుస్తాయి. ఏ తల్లిదండ్రులు కూడా ఉద్దేశపూర్వకంగా తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని కోరుకోరు.. పిల్లల మనసు చాలా సున్నితంగా ఉంటుంది,  వారు తమ పరిసరాల నుండి త్వరగా నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఏమైనా మాట్లాడితే అది వారి భవిష్యత్తును చాలా గందరగోళంగా మారుస్తుంది.  చిన్నతనంలో పిల్లలకు ఎమోషనల్ గా సపోర్ట్ చేస్తేనే వారు భవిష్యత్తులో ఆత్మవిశ్వాసంగా ఉండగలుగుతారు. తాము కూడా తెలియకుండానే తమ పిల్లల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసి, ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేని స్థితికి తీసుకెళ్లే పరిస్థితి రాకుండా ఉండాలంటే.. తల్లిదండ్రులు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.. పిల్లల తప్పుకు పోల్చి తిట్టడం.. చాలా మంది తల్లిదండ్రులు, తమ పిల్లల తప్పుకు కోపం తెచ్చుకుని, వారిని ఇతర పిల్లలతో పోల్చడం మొదలు పెడతారు.  ఇలా పోల్చడం ఎప్పుడైతై  మొదలవుతుందో అప్పుడు పిల్లలు ఇతరులను చూపించి, వారితో పోల్చి తిడతారు కూడా.  మార్కుల విషయంలో కావచ్చు,  తెలివి తేటల విషయంలో కావచ్చు, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడంలో కావచ్చు,  చురుగ్గా ఉండే విషయంలో కావచ్చు..  ఇలా  ప్రతిదానికి తల్లిదండ్రులు పిల్లలను పోల్చి మాట్లాడితే..  పిల్లలు చాలా బాధపడతారు, తమను తాము పనికిరానివారిగా భావిస్తారు. ఇక్కడే వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం మొదలవుతుంది. తిట్టడం.. తల్లిదండ్రులు తరచుగా తమ పిల్లలను తప్పులు చేసినందుకు కఠినంగా తిడతారు. కానీ తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సినది.. వారు పిల్లలని, ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారని, అలాంటప్పుడు  తరచుగా తప్పులు జరుగుతాయని అర్థం చేసుకోవాలి.   పిల్లలను తప్పులకు పదేపదే తిడితే, వారు కొత్తగా ఏదైనా ప్రయత్నించడానికి భయపడతారు. తప్పు చేయడం చెడ్డ విషయమని, మళ్ళీ తిట్లు పడతాయని భావించి, ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి, లేదా ప్రయత్నించడానికి కూడా భయపడి ప్రయత్నాలు మానేస్తారు. ఎమోషన్స్ ను లైట్ తీసుకోవడం.. పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు.  వారు భయపడినప్పుడు, బాధపడినప్పుడు లేదా కలత చెందినప్పుడు,  "ఇంత చిన్న విషయానికి ఏడవకు"  అనడం లేదా "ఇది పెద్ద విషయమేమీ కాదు" అని తోసిపుచ్చేయడం.. వంటివి తల్లిదండ్రులు చేస్తుంటారు.  దీనివల్ల  తమ భావాలకు విలువ లేదని  పిల్లలు భావిస్తారు. దీనివల్ల, తమను ఎవరూ అర్థం చేసుకోరనే భావనతో వారు తమ భావాలను, ఆలోచనలను దాచుకుంటారు. ఇది వారి నమ్మకాన్ని బలహీనపరుస్తుంది, దాని ప్రభావం వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా పడుతుంది ఓవర్ ప్రొటెక్షన్,  హెల్పింగ్.. చాలామంది తల్లిదండ్రులు, తమ పిల్లలకు సహాయం చేసే నెపంతో, వారి స్కూల్ బ్యాగులు సర్దడం, పిల్లల ఇష్టాలతో పని లేకుండా  తామే బట్టలు షాపింగ్ చేయడం లేదా నిర్ణయాలు తీసుకోవడం వంటి ప్రతి పనిని తామే చేస్తారు. దీనివల్ల పిల్లలు తమ పనులు తాము చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు. పిల్లలు ఏదైనా పనిని  తామే చేసినప్పుడు వారికి తమ సామర్థ్యం పెరుగుతుంది. అలా కాకుండా అన్నీ తల్లిదండ్రులే చేస్తుంటే పిల్లలకు వారి సామర్థ్యం గురించి తెలియదు.  క్రమంగా, వారు చిన్న చిన్న విషయాలకు కూడా తమ తల్లిదండ్రులపై ఆధారపడతారు తక్కువ చేసి మాట్లాడటం.. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను తిడతారు లేదా బంధువులు, స్నేహితులు లేదా అతిథుల ముందు వారి బలహీనతలను  బయటపెడతారు. దీనివల్ల పిల్లలు చాలా షేమ్ గా ఫీలవుతారు. తమను తాము తక్కువగా భావించుకుంటారు. పదేపదే అందరి ముందు  అవమానపడటం వల్ల,  అందరి ముందు ఓపెన్ మాట్లాడటానికి , ఏదైనా చెప్పడానికి భయపడతారు. అది వారి ఆత్మవిశ్వాసంపై నేరుగా ప్రభావం చూపుతుంది. అభిరుచులు రుద్దడం.. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువు విషయంలో గానీ, అభిరుచుల విషయంలో గానీ తమకు నచ్చినది చేయాలని కోరుకుంటారు. పిల్లల సొంత ఇష్టాయిష్టాలను, అభిప్రాయాలను  పట్టించుకోరు. పిల్లలకు తమకు నచ్చింది ఎంచుకోవడం,  నచ్చిన పని చేయడం వంటి అవకాశాలు లేనప్పుడు తమ నిర్ణయాలకు విలువ లేదని పిల్లలు భావిస్తారు. ఇది వారిలో ఆత్మవిశ్వాసం లోపించడానికి, అలాగే దృఢమైన నిర్ణయాలు తీసుకోవడంలో వెనకడుగు వేయడానికి  దారితీస్తుంది.                                *రూపశ్రీ  
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
ప్రతిరోజూ ఉదయం కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు భస్త్రిక ప్రాణాయామం చేస్తే శరీరానికి, మనసుకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్రాణాయామం వల్ల ఊపిరితిత్తులు బలపడటమే కాకుండా, గుండె పనితీరు మెరుగుపడుతుంది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందడంతో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా పెరుగుతాయి. రోజూ అలసట, ఒత్తిడి, ఆందోళన, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడేవారికి భస్త్రిక ప్రాణాయామం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. లోతుగా, వేగంగా శ్వాస తీసుకోవడం, విడిచిపెట్టడం ద్వారా శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ మెరుగుపడి శక్తి పెరుగుతుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను సహజంగా బయటకు పంపే శరీర ప్రక్రియలకు కూడా ఇది తోడ్పడుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్ స్రవంతి రఘు భస్త్రిక ప్రాణాయామాన్ని సరైన విధంగా ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అనే అంశాలను సులభంగా వివరించారు. మీ ఆరోగ్యాన్ని సహజంగా మెరుగుపరుచుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసి, నిపుణుల సూచనల ప్రకారం భస్త్రిక ప్రాణాయామాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా కొత్త యోగా సాధన ప్రారంభించే ముందు వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పిల్లలు తమ మనసులో ఉన్న ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో స్వేచ్ఛగా పంచుకుంటున్నారా? లేక కొన్ని విషయాలను దాచిపెడుతున్నారా? పిల్లలు తమ సమస్యలు, భయాలు, సందేహాలు, విజయాలు, అపజయాలు అన్నింటినీ తల్లిదండ్రులతో నమ్మకంగా చెప్పుకోవడం వారి మానసిక ఎదుగుదలకు ఎంతో అవసరం.  ఈ వీడియోలో ప్రముఖ నిపుణురాలు డా. పూర్ణిమ నాగరాజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా స్నేహపూర్వకంగా ఉండాలి, పిల్లల్లో నమ్మకాన్ని ఎలా పెంచాలి, వారు ఏ పరిస్థితిలోనైనా తమ మనసులోని మాటను చెప్పేలా ఎలా ప్రోత్సహించాలి అనే అంశాలను సులభంగా వివరించారు. అలాగే పిల్లల మాటలను మధ్యలో అడ్డుకోకుండా వినడం, విమర్శించకుండా స్పందించడం, భయపెట్టకుండా మార్గనిర్దేశం చేయడం, కుటుంబంలో ఓపెన్ కమ్యూనికేషన్‌ను పెంపొందించడం వంటి ముఖ్యమైన పేరెంటింగ్ సూచనలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రి తప్పకుండా చూడాల్సిన ఈ వీడియో పిల్లలతో బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.