Home

»

Latest News

రామాయణ సెట్ లో అగ్ని ప్రమాదం: అందుకు కారణం ఇదే!

Oct 5, 2026 6:44PM


ప్రస్తుతం రామాయణ రిలీజ్ డేట్ నవంబర్ 6 కోసం అభిమానులు, రామ భక్తులు కాచుకొని కూర్చొని ఉన్నారు. మేము కూడా అంటూ సినీ ట్రేడ్ సర్కిల్స్ సైతం రామాయణ వసూలు చేసే కలెక్షన్స్ పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు.ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో ఉన్న ప్రొడక్షన్ సెట్‌లో అగ్ని ప్రమాదం జరిగిందనే వార్త ఒక్కసారిగా నెట్టింట హల్‌‌చల్ చేసింది. 


ఫిల్మ్ సిటీలోని షూటింగ్ సెట్ పరిసరాల్లో ఉన్నట్టుండి ఒక్కసారిగా దట్టమైన పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. దట్టంగా అలుముకున్న నల్లటి పొగని చూసి సెట్‌లో ఉన్న సాంకేతిక నిపుణులు, కార్మికులు తీవ్ర ఆందోళనకు గురై అటుఇటు పరుగులు తీశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మరియు వీడియోలు క్షణాల్లో సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో, అసలు ప్రధాన నటీనటులకు ఏమైనా అయ్యిందా అని అభిమానులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) ప్రెసిడెంట్ బి.ఎన్. తివారీ తక్షణమే స్పందించి అసలు నిజాలను వెల్లడించారు. నిజానికి షూటింగ్ జరుగుతున్న ప్రధాన వేదికపై కాకుండా, స్టూడియో బయట నిర్మించిన ఒక చిన్న తాత్కాలిక టెంట్‌లో ప్రమాదవశాత్తూ  మంటలు అంటుకున్నాయని స్పష్టం చేశారు.  


 ఇది కూడా చదవండి: త్రిష పోస్ట్ వైరల్: ఆపరేషన్ 'డి' అంటే ఏంటి.. అసలు నిజం అదేనా!

 

 సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అత్యంత వేగంగా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేయడంతో ఒక పెద్ద విపత్తు తృటిలో తప్పినట్లయింది. అదృష్టవశాత్తూ ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం లేదా భారీ ఆస్తి నష్టం జరగలేదని నిర్ధారణ కావడంతో యూనిట్ సభ్యులు మరియు అభిమానులు హమ్మయ్యా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో మరో చిన్న ప్రమాదం జరిగిందని, షూటింగ్ సెట్లలో భద్రతా చర్యలు కఠినతరం చేయాలని నిర్మాతులకు ముందే సూచించినప్పటికీ ఈ నిర్లక్ష్యం పునరావృతమైందని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.  ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రాల సెట్స్‌పై ఇకనైనా కఠినమైన ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

 

[Ramayana Movie Set Fire Incident, Ramayana Movie Set Fire, Ranbir Kapoor, Sai Pallavi, Nitesh Tiwari, Mumbai Film City Fire Incident,Telugu Cinema  News, Telugu cinema, Tollywood News, Tollywood]

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com