LATEST NEWS
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడుగా వెళుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి మద్దతు కూడగడుతున్నారు. అయితే షర్మిల సమావేశాలు వివాాదాస్పదం కూడా అవుతున్నాయి. ఎంపిక చేసిన కొందరు నేతలను పిలిపించి.. ఏదో జరుగుతున్నట్లు మీడియాలో ప్రచారం చేస్తూ హంగామా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల లోటస్ పాండ్ లో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఓ విద్యార్థి ఉద్వేగంగా ప్రసగించాడు. ఆ విద్యార్థిని వేదికపైకి పిలిచి ఓదార్చారు షర్మిల. అతనికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.      షర్మిల సమావేశానికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని చెప్పారు. ఆ యువకుడు విద్యార్థి కాదు, నిరుద్యోగి కాదని అన్నారు. కల్వరి టెంపుల్ లో అర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని చెప్పారు రేవంత్ రెడ్డి. జోసెఫ్ తండ్రి  వైయస్ చనిపోవడానికి ముందే చాలా ఏళ్ల క్రితమే మరణించాడని తెలిపారు.కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ డ్రామా ఆడారని విమర్శించారు. స్టేజి మీద డ్రామాను రక్తికట్టించారని... ఈ డ్రామాకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ డ్రామాకు తెర లేపారని చెప్పారు. షర్మిలతో కనిపించిన యువకుడి ఫేస్ బుక్ ప్రొఫైల్ లో హరీశ్ రావుతో దిగిన ఫొటోలను చూడొచ్చని అన్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్ షర్మిల అసలు బండారం బయటపడిందనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ పేరుతో జరుగుతున్న డ్రామాలను ఇప్పటికైనా ఆపాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. షర్మిల పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. 
ప్రపంచ దేశాలలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న ఏకైక అగ్ర రాజ్యం అమెరికా. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ అమెరికా పెద్దనకు కూడా అప్పులు .విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో అమెరికా భారత్‌కు ఏకంగా 216బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారుగా రూ. 15లక్షల కోట్లు రుణపడి ఉందని సమాచారం. ఇదేదో గాలి వార్త కానే కాదు. ఆ దేశ చట్టసభల సభ్యుడు స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు సంవత్సరం క్రితం అమెరికాపై కరోనా వైరస్ పంజా విసరడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ 1.9 ట్రిలియన్ డాలర్ల భారీ ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. తాజాగా అక్కడి చట్టసభల సభ్యులు ఈ ఉద్దీపన ప్యాకేజీపై చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ దేశ దిగువసభ సభ్యుడు అలెక్స్ మూనీ ఈ వివరాలు వెల్లడించారు. అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోతోందంటూ ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2020 నాటికె అమెరికా అప్పులు 23.4 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయని.. అవి ప్రస్తుతం 29 ట్రిలియన్ డాలర్లకు చేరాయని అయన తెలిపారు. మరోపక్క చైనా, జపాన్ దేశాలకు కూడా అమెరికా ట్రిలియన్ డాలర్లపైన బాకీ పడిందని అయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో 1.9ట్రిలియన్ డాలర్ల కొత్త ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించే ముందు.. దేశ అప్పులను దృష్టిలో పెట్టుకోవాలని ఆయన జో బైడెన్ కు సూచించారు.    
వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు, పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించారు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు జరుపుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఆయన లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాత  టీడీపీ సానుభూతిపరులపై ఓ వర్గం వారు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. బిక్కవోలు మండలం ఇల్లాపల్లి పంచాయతీలో సర్పంచ్‌గా గెలిచిన వైసీపీ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి టీడీపీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేయటంతో పాటు వారిపై తప్పుడు కేసులు పెట్టించారని చంద్రబాబు ఆరోపించారు.  పాలు తాగే బిడ్డ భయపడుతున్నందున ఇంటి ముందు టపాసులు కాల్చవద్దని టీడీపీ కార్యకర్త రాఘవ కోరినందుకు వైసీపీ నేతలు రాఘవ పైనా, అతని కుటుంబ సభ్యులపైనా దాడికి పాల్పడ్డారని లేఖలో చంద్రబాబు చెప్పారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా గాయపడిన బాధితులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డి విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై కేసు నమోదయ్యేలా చూశారని తెలిపారు చంద్రబాబు. తమ‌పై కేసు ఉపసంహరించుకోవాలంటూ బాధితులను పోలీసులు, వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని  ఆరోపించారు. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించేలా చూడాల్సిన బాధ్యత డీజీపీగా మీపై ఉందని చంద్రబాబు లేఖలో గుర్తు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా డీజీపీ చూస్తారని ఆశిస్తున్నానని ఆ లేఖలో చంద్రబాబు రాశారు.   
పవన్ స్టేట్ రౌడీ. జన సైనికులు ఆకు రౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అంటూ భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మరోసారి జనసేనానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమలో వైసీపీ, జనసేన మధ్య వివాదం రోజురోజుకీ ముదురుతోంది. మత్స్యపురి దళితుల వివాదం కాక రేపుతుండటంతో స్వయంగా పవన్ కల్యాణే రంగంలోకి దిగారు. వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను ఉద్దేశించి.. ఆకు రౌడీ, బ్యాంకులను దోచేసిన వ్యక్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీధిలో కొన్ని కుక్కలు అరుస్తాయి.. కొన్ని పిచ్చికుక్కలు కరుస్తాయి. కరిచినంత మాత్రాన ఆ కుక్కను మనం కరవం కదా. మున్సిపాలిటీ వాళ్లకు ఫోన్ చేస్తాం. వచ్చే వరకు ఆగుతాం. మీకు మాటిస్తున్నాను. మున్సిపాలిటి వ్యాన్ వస్తుంది.. అప్పటి వరకు సంయమనం పాటించండి’ అంటూ పీకే తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. జనసేనాని కామెంట్లకు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘పవన్ స్టేట్‌రౌడీ. జనసైనికులు ఆకురౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అన్నారు. రాష్టంలో పార్టీ పెట్టి అవగాహనా లోపంతో, అజ్ఙానంతో మాట్లాడుతున్న పవన్‌ను చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. మీకు మానసిక జాఢ్యం ఉంది. మానసిక రోగి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. నన్ను పిచ్చి కుక్కల వ్యాన్‌లో వేసి పంపుతానన్నారు. రెండు చోట్ల అదే వ్యాన్‌లో మిమ్మల్ని వేసి పంపించారు’అంటూ ఘాటైన విమర్శలు చేశారు గ్రంధి శ్రీనివాస్. పవన్ కల్యాణ్, గ్రంధి శ్రీనివాస్ ల డైలాగ్ వార్ తో పశ్చిమలో రాజకీయ రచ్చ రగులుతోంది.
అప్పు తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వ్యక్తి భార్యకు గాలం వేశాడు. మెళ్లగా ముగ్గులోకి దింపాడు. ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె సైతం భర్తను కాదని ప్రియుడికి బాగా దగ్గరైంది. వన్ ఫైన్ డే.. ఆ విషయం భర్తకి తెలిసింది. ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు. ఇక తమ అక్రమ యవ్వారం సాగదనుకుంది ఆ భార్య. ఇక అంతే. తన భర్తను చంపేయమంటూ లవర్ ను రెచ్చగొట్టింది. ప్రేయసి డైరెక్షన్ లో.. ఆమె భర్తకు ఫుల్ గా తాగించి.. గొంతు పిసికి చంపేసి.. కాలువలో పడేశాడు. కట్ చేస్తే, పోలీసుల ఎంట్రీతో విషయం మొత్తం బయటకు వచ్చింది. వారి అక్రమ సంబంధం గుట్టు రట్టైంది. భర్తను చంపించిన భార్య, చంపిన లవర్.. ఇద్దరూ కటకటాల పాలయ్యారు.  కరీంనగర్ జిల్లాలో జరిగిందీ మర్డర్. కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన మానుపాటి రాజయ్య నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ వర్కర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం మడద గ్రామానికి చెందిన ఎనగందుల బాబు మేస్త్రీ పని చేస్తుంటాడు. ఏడాది క్రితం మధ్యవర్తి సాయంతో రాజయ్య దగ్గర బాబు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి పరిచయం మరింత పెరిగింది. అప్పు చెల్లించే విషయమై తరుచూ రాజయ్య ఇంటికి వచ్చేవాడు బాబు. ఆ సమయంలో రాజయ్య భార్య బాబుకు చాలా క్లోజ్ అయింది. తన భార్య బాబుతో సన్నిహితంగా ఉండటం గమనించిన రాజయ్య వారిద్దరినీ మందలించాడు. అప్పటి నుంచీ భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరిగేవి. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డంకి అని భావించిన భార్య.. రాజయ్యను అడ్డు తొలగించాలని బాబును పురికొల్పింది. ఇద్దరూ కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారం.. పార్టీ ఇస్తానంటూ రాజయ్యను ఆటోలో మడద తీసుకెళ్లాడు బాబు. అక్కడ మద్యం తాగించి స్పృహలో లేకుండా చేశాడు. అటు నుంచి, మానకొండూర్‌ మండలం ముంజంపల్లి కాకతీయ కెనాల్‌ దగ్గర ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక.. రాజయ్య మెడ నులిమి చంపేశాడు. డెడ్ బాడీని కెనాల్‌లో పడేశాడు. ఏమీ తెలీనట్టు ఇంటికి తిరిగెళ్లిపోయాడు బాబు.  భర్త ఇంటికి రాలేదని పోలీస్ స్టేషన్లో రాజయ్య భార్య ఫిర్యాదు చేసింది. రెండు వారాల తర్వాత మహబూబాబాద్‌ జిల్లా కొరివి పీఎస్ పరిధిలోని కాకతీయ కెనాల్‌లో రాజయ్య మృతదేహం లభించింది. విచారణలో భాగంగా పోలీసులకు రాజయ్య భార్యపై అనుమానం వచ్చింది. గట్టిగా ప్రశ్నిస్తే నిజం ఒప్పుకుంది. పోలీసుల దర్యాప్తులో భార్యే హత్య చేయించిందని తేలింది. హత్య చేసిన బాబును, భర్త హత్యకు ఉసిగొల్పిన భార్యను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు పోలీసులు. ఇలా.. వారి అక్రమ సంబంధం విషాదాంతమైంది.
ALSO ON TELUGUONE N E W S
న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌కి అచ్చొచ్చిన క‌థానాయిక‌ల్లో ర‌మ్య‌కృష్ణ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన తొలి, మ‌లి చిత్రాలు `బంగారు బుల్లోడు`, `వంశానికొక్క‌డు` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ఆ త‌రువాత వ‌చ్చిన `దేవుడు` నిరాశ‌ప‌ర‌చ‌గా.. `వంశోద్ధార‌కుడు` ఫ‌ర్లేద‌నిపించింది. క‌ట్ చేస్తే.. మ‌రోమారు బాల‌య్య‌తో క‌లిసి న‌టించ‌బోతున్నార‌ట ర‌మ్య‌. అయితే, ఈ సారి హీరోయిన్ గా కాదు.. నెగ‌టివ్ ట‌చ్ ఉన్న రోల్ లో. ఆ వివ‌రాల్లోకి వెళితే..  గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ భారీ బ‌డ్జెట్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ మే నుంచి సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. కాగా, ఈ సినిమాలో కీల‌క పాత్ర కోసం ర‌మ్య‌కృష్ణతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. గోపీచంద్ గ‌త చిత్రం `క్రాక్`లో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ పోషించిన జ‌య‌మ్మ పాత్ర త‌ర‌హాలో ఈ క్యారెక్ట‌ర్ ఉంటుంద‌ని టాక్. త్వ‌ర‌లోనే బాల‌య్య - గోపీచంద్ కాంబో మూవీలో ర‌మ్య‌కృష్ణ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది.
  వ‌ర్మ స్కూల్ నుంచి వ‌చ్చిన జేడీ చ‌క్ర‌వ‌ర్తి ముక్కు సూటిగా మాట్లాడుతుంటారు. 'శివ' వంటి ట్రెండ్ సెట్ట‌ర్‌తో జేడీ ప‌రిచ‌య‌మైన ఈ హీరో గ‌త కొంత కాలంగా త‌న‌కు న‌చ్చిన‌, త‌న దాకా వ‌చ్చిన చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తున్నారు. తాజాగా ఆయ‌న న‌టించిన థ్రిల్ల‌ర్ '70 ఎంఎం'. అంతా కొత్త వాళ్లు నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌లే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో దివంగ‌త న‌టి సౌంద‌ర్య‌తో త‌న‌కున్న అనుబంధాన్ని, ఆమెతో జ‌ర‌గాల్సిన త‌న పెళ్లి గురించి వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రితో పంచుకోని ఈ విష‌యాన్ని తాజాగా వెల్ల‌డించి షాకిచ్చారు. మాట‌ల మ‌ధ్య‌లో సౌంద‌ర్య టాపిక్ రావ‌డంలో త‌న‌కు ఆమెకు పెళ్లి జ‌ర‌గాల్సింద‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు. సౌంద‌ర్య‌, జేడీ చ‌క్ర‌వ‌ర్తి క‌లిసి ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందించిన 'ప్రేమ‌కు వేళాయెరా' చిత్రంలో న‌టించారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ఎస్వీ కృష్ణారెడ్డి, చంద్ర‌బోస్‌, సుచిత్ర అంతా క‌లిసి జేడీకి పెళ్లి చేయాల‌నుకున్నార‌ట‌. అదీ సౌంద‌ర్య‌తో చేయాల‌ని ప్లాన్ చేశార‌ట‌. అయితే ఆ ప్ర‌పోజ‌ల్‌కి తాను అంగీక‌రించ‌లేద‌ని, దాని వ‌ల్ల త‌మ ప్రొఫెష‌న్ దెబ్బ‌తింటుంద‌ని జేడీ స‌ర్తిచెప్పి పెళ్లికి ఫుల్ స్టాప్ పెట్టార‌ట‌.  ఆ త‌రువాత సౌంద‌ర్య‌కు త‌న‌కు మ‌ధ్య విభేధాలు త‌లెత్తాయ‌ని, ఆ త‌రువాత కొంత కాలం తాను సౌంద‌ర్య మాట్లాడుకోలేద‌ని చెప్పాడు. అయితే ఆ త‌రువాతే ఇద్ద‌రం మంచి క్లోజ్ ఫ్రెండ్స్‌మి అయ్యామ‌ని జేడీ చ‌క్ర‌వ‌ర్తి తెలిపాడు.
యువ క‌థానాయ‌కుడు నితిన్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎంత‌లా అంటే.. ఎన్న‌డూ లేని విధంగా ఒకే క్యాలెండ‌ర్ ఇయ‌ర్ లో ఏకంగా నాలుగు చిత్రాల‌ను రిలీజ్ చేసే దిశ‌గా స్కెచ్ వేశారాయ‌న‌. తాజాగా `చెక్`తో ప‌ల‌క‌రించిన ఈ యంగ్ హీరో.. మార్చి 26న రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `రంగ్ దే`తో ఎంట‌ర్ టైన్ చేయ‌బోతున్నారు. ఇక జూన్ 11న `అంధాధున్` రీమేక్ తో వినోదాలు పంచ‌నున్నారు. అలా.. ఫ‌స్టాఫ్ లో మూడు చిత్రాల‌ను ప‌క్కాగా సెట్ చేసుకున్నారు. అంతేకాదు.. వీలైతే ఇదే ఏడాది మ‌రో సినిమాని రిలీజ్ చేసే ప్లాన్ లో కూడా ఉన్నార‌ట నితిన్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` త‌రువాత కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వంలో `ప‌వ‌ర్ పేట‌` పేరుతో నితిన్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. మే నెల‌లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ లో విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నారట‌. మ‌రి.. `నితిన్ 31`గా తెర‌కెక్క‌నున్న `ప‌వ‌ర్ పేట‌` స‌కాలంలో థియేట‌ర్లలోకి వ‌స్తుందో లేదో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న పిరియ‌డ్ డ్రామా `శ్యామ్ సింగ రాయ్`. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సాయిపల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టెయిన్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కుతోంద‌ని టాక్. ఇదిలా ఉంటే.. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని నాని ల‌క్కీ మంత్  సెప్టెంబ‌ర్ లో విడుద‌ల చేయ‌డానికి   స‌న్నాహాలు చేస్తున్నారట‌.  నాని తొలి చిత్రం `అష్టా చ‌మ్మా` (2008), నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒక‌టిగా నిలిచిన `భ‌లే భ‌లే మ‌గాడివోయ్`(2015), స‌క్సెస్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `మ‌జ్ను` (2016).. ఇదే నెల‌లో రిలీజ‌య్యాయి. త్వ‌ర‌లోనే `శ్యామ్ సింగ రాయ్` రిలీజ్ డేట్ పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. `శ్యామ్ సింగ రాయ్`లో నాని బెంగాలీ బాబుగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. నాని పుట్టిన రోజున విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ కి మంచి స్పంద‌న వ‌చ్చిన నేప‌థ్యంలో.. చిత్రంపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. కాగా, నాని తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్` ఏప్రిల్ 23న థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నుంది.
  నితిన్ హీరోగా చంద్ర‌శేఖ‌ర్ యేలేటి రూపొందించిన 'చెక్' మూవీ తొలిరోజు అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఫిబ్ర‌వ‌రి 26 శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.38 కోట్ల షేర్ సాధించింది. నితిన్ మునుప‌టి సినిమా 'భీష్మ' తొలి రోజు సాధించిన వ‌సూళ్ల‌తో పోలిస్తే ఇది చాలా త‌క్కువ కావ‌డం గ‌మ‌నార్హం. 'భీష్మ‌'కు ఫ‌స్ట్ డే రూ. 6.28 కోట్ల షేర్ వ‌చ్చింది! అంటే 'భీష్మ‌'తో పోలిస్తే 'చెక్‌'కు వ‌చ్చిన ఓపెనింగ్ డే క‌లెక్ష‌న్స్ 54 శాత‌మే. ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టించిన 'చెక్' మూవీకి తొలిరోజు నైజాంలో రూ. 1.46 కోట్లు, ఆంధ్రాలో రూ. 1.45 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 0.47 కోట్లు షేర్ వ‌చ్చాయి. అదే 'భీష్మ‌'కు చూసుకుంటే, నైజాంలో రూ. 2.2 కోట్లు, ఆంధ్రాలో రూ. 3.28 కోట్లు, రాయ‌ల‌సీమ‌లో రూ. 0.8 కోట్ల షేర్ వ‌చ్చింది. దీన్ని బ‌ట్టి అన్ని ఏరియాల్లోనూ 'భీష్మ' కంటే 'చెక్' ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో వెన‌క‌బ‌డింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఓవ‌రాల్‌గా ప్రి బిజినెస్‌తో పోలిస్తే 'చెక్' మొద‌టి రోజు 23 శాత‌మే రిక‌వ‌ర్ అయ్యింద‌ని ట్రేట్ వ‌ర్గాలు తెలిపాయి. రాసిన క‌థ‌కు క్లైమాక్స్‌లో జ‌స్టిఫికేష‌న్ ఇవ్వ‌క‌పోవ‌డం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చ‌లేద‌నీ, నితిన్ నిర్దోషిగా నిరూప‌ణ కాకుండా, జైలు నుంచి త‌ప్పించుకోవ‌డం ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చెయ్య‌లేద‌నీ చెప్పాలి. ఓవ‌రాల్‌గా ఈ మూవీ బ్రేకీవెన్ కావ‌డం క‌ష్ట‌సాధ్య‌మంటున్నారు. ఏదేమైనా సోమ‌వారం వ‌చ్చే క‌లెక్ష‌న్లు ఈ సినిమా ఫేట్‌ను డిసైడ్‌ చేయ‌నున్నాయి.
  "ప్రస్తుతం హైదరాబాద్‌లో లేను. ముంబైలో ఉన్నాను. హిందీ సినిమా చిత్రీకరణ చేస్తున్నా. అందువల్ల, నేనింకా సినిమా చూడలేదు. నేరుగా ప్రేక్షకుల స్పందన తెలుసుకోలేకపోయా. అయితే, నాకు తెలిసిన కొంతమంది సినిమా చూశారు. వాళ్లకు నచ్చింది." అని చెప్పారు ర‌కుల్‌ప్రీత్ సింగ్‌. నితిన్ హీరోగా చంద్రశేఖ‌ర్ యేలేటి డైరెక్ట్ చేసిన 'చెక్' మూవీ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 26) విడుద‌లైంది. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి. ఆనంద‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మించారు. చిత్రంలో లాయ‌ర్ మాన‌స‌గా న‌టించిన ర‌కుల్‌ప్రీత్ సింగ్ తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆ సినిమా గురించీ, త‌న పాత్రకు వ‌స్తున్న స్పంద‌న గురించీ మాట్లాడారు. ఆ విశేషాలు... ‘చెక్‌’ సినిమాకు ఎటువంటి స్పందన లభిస్తోంది? సోషల్‌ మీడియాలో చాలామంది పోస్టులు చేశారు. అవి చూశా. ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో ‘చెక్‌’ బావుందని చాలామంది కాంప్లిమెంట్స్‌ ఇస్తున్నారు. సినిమాతో పాటు నా పాత్ర మానస ప్రేక్షకులకు బాగా నచ్చింది. జైలులో ఓ ఖైదీపై నేను అరిచే సన్నివేశం, పతాక సన్నివేశాల్లో జైలులో నితిన్‌ను కలిసి ఎమోషనల్‌ అయ్యే సన్నివేశం గురించి ప్రేక్షకులు మాట్లాడుతున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కరోనాకి ముందు ప్రారంభించిన సినిమా. లాక్‌డౌన్‌ వల్ల కాస్త ఆలస్యమైంది. యూనిట్‌ అంతా కష్టపడి చేశాం. ప్రేక్షకుల మద్దతు ఉంటుందని ఆశిస్తున్నా. మీరు స్టార్‌ హీరోయిన్‌. ఈ సినిమాలో మీకు పాటలేవీ లేవు. మానస పాత్ర గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? కథ వినేటప్పుడు... ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలకు కొంచెం భిన్నంగా ఉందా? లేదా? అని ఆలోచిస్తా. మాసన పాత్ర విన్నప్పుడు... తనొక సాధారణ న్యాయవాది కాదు. జైలుకు వెళ్లడానికి ఆమె భయపడుతుంది. క్రిమినల్‌ను చూసి హార్ట్‌బీట్‌ పెరుగుతుంది. భయాన్ని దాటి ఆ కేసును టేకప్‌ చేసి వాదిస్తుంది. మానస క్యారెక్టర్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్‌ నాకు నచ్చింది. ఆవిడలో మార్పు వస్తుంది. ఎప్పుడైనా సరే సినిమా ప్రారంభంలో క్యారెక్టర్‌ ఓ విధంగా ఉండి, పోను పోనూ మార్పు వస్తే... అటువంటి క్యారెక్టర్లలో నటించేటప్పుడు ఎంజాయ్‌ చేయవచ్చు. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో తొలిసారి నటించారు. డిఫరెంట్‌ ఫిల్మ్స్‌ తీశారు. ఇంతకు ముందు ఆయన సినిమాలు చూశారా? రెండు చిత్రాలు చూశా. సార్‌ నుంచి ఫోన్‌ వచ్చినప్పుడు హీరోయిన్‌ క్యారెక్టరైజేషన్‌ చాలా బావుంటుందని ముందే ఊహించా. తర్వాత ఆయన్ను కలిసి కథ విన్నాను. చంద్రశేఖర్‌గారు ముందే ‘ఇది రెగ్యులర్‌ హీరోయిన్‌ రోల్‌ కాదు. ఎక్కువ మేకప్‌ ఉండదు. సాంగ్స్‌ ఉండవు’ అన్నారు. ‘ఏం పర్వాలేదు. మంచి వెయిట్‌ ఉన్న క్యారెక్టర్‌ అయితే చేస్తాను’ అని చెప్పా. రోజూ సెట్‌కి వెళ్లేటప్పుడు నాకు ఎగ్జైట్‌మెంట్‌ ఉండాలి. ఇంతకు ముందు చేసిన క్యారెక్టర్‌ను రిపీట్‌ చేయడం లేదని! కొత్తగా ప్రయత్నిస్తున్నానని! ప్రయత్నం చేసినప్పుడే నేర్చుకోగలుగుతాం. యేలేటిగారు షూట్‌ చేసిన విధానం గానీ, క్యారెక్టరైజేషన్‌ గానీ, సెట్‌లో వాతావరణం గానీ నచ్చాయి. మీరు సినిమాలో నితిన్‌ను చూస్తే... అతను ఇంతకు ముందు చేసిన సినిమాలకు, ఈ సినిమాకు బాడీ లాంగ్వేజ్‌లో చాలా మార్పు ఉంటుంది. ఈ మూవీలో నితిన్‌ క్యారెక్టరైజేషన్‌ డిఫరెంట్‌గా ఉంది. యేలేటిగారు వెరీ వెరీ స్వీట్‌. డెడికేటెడ్‌ డైరెక్టర్‌. ‘చెక్‌’ వంటి కొత్త తరహా చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. మీరూ కొత్త తరహా పాత్రలు చేయడానికి ముందడుగు వేశారనుకోవచ్చా? నేను అంత ఆలోచించలేదు. నాకు స్ర్కిప్ట్‌ నచ్చింది. మేం ఓ ప్రయత్నం చేశాం. నాతోనే నాకు పోటీ. నా లాస్ట్‌ సినిమాకి, ప్రజెంట్‌ సినిమాకి కంపేర్‌ చేస్తే... నా పర్ఫార్మెన్స్‌ మెరుగవ్వాలి. నేనెప్పుడూ ఆలోచించేది అదే. ఈ సినిమా తర్వాత తెలుగులో క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో సినిమా చేశా. అందులో వైష్ణవ్‌ తేజ్‌ హీరో. మేమిద్దం గ్రామీణ యువతీయువకుల పాత్రల్లో నటించాం. డిఫరెంట్‌ రోల్‌ కాబట్టి ఎగ్జైట్‌ అయ్యా. ప్రస్తుతం హిందీలో నాలుగైదు సినిమాలు చేస్తున్నా. అందులో నాలుగు కమర్షియల్‌ సినిమాలే. ఇంకొకటి డిఫరెంట్‌ సినిమా. ఏ సినిమాలను అయితే ఐదేళ్ల క్రితం కమర్షియల్‌ కాదని అన్నారో... ఇప్పుడు అవే కమర్షియల్‌ సినిమాలు అయ్యాయి. ఐదేళ్ల క్రితం ఒక సెక్షన్‌/సెగ్మెంట్‌ ఆఫ్‌ ఆడియన్స్‌ కోసం తీసే సినిమాలు అని వేటిని అనుకున్నావో... ఇప్పుడు ఆ సినిమాలను అందరూ చూస్తున్నారు. ప్రేక్షకులు హాలీవుడ్‌ సినిమాలు, ఓటీటీల్లో మంచి కంటెంట్‌ చూస్తున్నారు. అందువల్ల, ఎప్పుడూ డిఫరెంట్‌ సినిమాలు ప్రయత్నిస్తూ ఉండాలి. మళ్లీ సేమ్‌ సినిమాలు రిపీట్‌ చేస్తే... ఆడియన్స్‌కి బోర్‌ కొడుతుంది. మీరు కరోనా బారిన పడ్డారు. పూర్తిగా కోలుకున్నారు. లాక్‌డౌన్‌, కరోనా తర్వాత చిత్రీకరణ చేయడం ఎలా ఉంది? ‘మే డే’ చిత్రీకరణ చేస్తున్నప్పుడు కొవిడ్‌19 వచ్చింది. 12వ రోజుల్లో కోలుకున్నా. క్వారంటైన్‌ ఉన్నప్పుడు సమస్యలేవీ లేవు. మొదటి నాలుగు రోజులు నిద్రపోయా. ఐదో రోజు నుంచి యోగా, ప్రాణాయామ, బ్రీతింగ్‌ వర్కవుట్స్‌ చేశా. నా వల్ల చిత్రీకరణ ఆగకూడదని 13వ రోజు నుంచి సెట్స్‌కి వెళ్లా. అప్పుడు బాడీలో అలసట వచ్చింది. కరోనా వల్ల వర్కవుట్స్‌ చేసేటప్పుడు... బాడీ పెయిన్స్‌ వచ్చాయి. చేయకపోతే బాగానే ఉండేది. నాకు కరోనా రాక ముందు సెట్స్‌కి వెళ్లడానికి కాస్త భయపడ్డా. వచ్చిన తర్వాత ధైర్యంగా వెళ్లి షూట్‌ చేశా. నాలో యాంటీబాడీస్‌ ఉన్నాయని! కరోనా నేపథ్యంలో ప్రస్తుతం అందరూ బాధ్యతగా ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించండి. జాగ్రత్తలు పాటించండి. మీరు తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారు. బాలీవుడ్‌ సినిమా సెట్‌లోనూ తెలుగు మాట్లాడేస్తున్నారా? అవును. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ నుంచి నా అసిస్టెంట్స్‌ సేమ్‌. తెలుగువాళ్లే. వాళ్లతో నేను తెలుగులో మాట్లాడతాను. అర్జున్‌ కపూర్‌తో నేను నటించిన ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ రీసెంట్‌గా ఆ సినిమా కోసం ప్రమోషనల్‌ సాంగ్‌ షూట్‌ చేశాం. దానికి సినిమాటోగ్రాఫర్‌ తెలుగు వ్యక్తి. మేం తెలుగులో మాట్లాడుకున్నాం. తెలుగువాళ్లు ఎవరైనా కనిపిస్తే... నేను తెలుగులో మాట్లాడతా. పంజాబీ కన్నా తెలుగుమ్మాయి అయిపోయా. ‘నీ పేరులో ప్రీత్‌ సింగ్‌ లేదంటే... నిన్ను తెలుగమ్మాయి అనుకుంటారు’ అని అర్జున్‌ కపూర్‌ చెప్పారు. విశేషం ఏంటంటే... ఆ సినిమాలో నేను సౌతిండియన్‌ అమ్మాయి రాధ పాత్రలో నటించా. ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాలు? అజయ్‌ దేవగణ్‌, అమితాబ్‌ బచ్చన్‌తో ‘మే డే’ చిత్రీకరణ పూర్తి చేశా. ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’ మూవీ మేలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుంది. జాన్‌ అబ్రహంతో ‘ఎటాక్‌’ చేశా. ఆగస్టులో విడుదలవుతుంది. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో ‘థాంక్‌ గాడ్‌’ చేస్తున్నా. ఆయుష్మాన్‌ ఖురానాతో ‘డాక్టర్‌ బి’ చేస్తున్నా. ఇంకో హిందీ సినిమాలు ఉన్నాయి. మార్చిలో ప్రకటిస్తారు. తమిళంలో శివ కార్తికేయన్‌తో చేసిన ‘అయలాన్‌’ సినిమా ఈ ఏడాదే విడుదలవుతుంది. తెలుగులో వైష్ణవ్ తేజ్ సినిమా కూడా ఈ ఏడాది విడుదల అవుతుంది.
మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఓ భారీ బ‌డ్జెట్ మూవీని తెర‌కెక్కించ‌నున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప్రొడ్యూస్ చేయ‌నున్న ఈ పాన్ ఇండియా వెంచ‌ర్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంద‌ని టాక్. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే ఓ స్పెష‌ల్ రోల్ ఉంద‌ట‌. అందులో కోలీవుడ్ స్టార్ సూర్య‌ని న‌టింప‌జేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట శంక‌ర్. త‌నకు ప‌లు క‌మిట్ మెంట్స్ ఉన్న‌ప్పటికీ.. శంక‌ర్ మీద అభిమానంతో ఈ పాత్ర చేయ‌డానికి సూర్య కూడా ఆస‌క్తి చూపిస్తున్నార‌ని వినికిడి. త్వ‌ర‌లోనే రామ్ చ‌ర‌ణ్ 15లో సూర్య ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. కాగా, సూర్య న‌టించిన `సూర‌రై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హ‌ద్దురా`) ఓటీటీలో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు.. ఆస్కార్ బ‌రిలోనూ ఈ సినిమా నిలిచింది.  సుధ కొంగ‌ర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సూర్య కి జంట‌గా అపర్ణ బాల‌ముర‌ళి న‌టించింది.
  శేఖర్ కమ్ముల మొదలుకొని శివ నిర్వాణ వరకు... పలువురు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు మన తెలుగు సినిమా రంగంలో దర్శకులుగా అసాధారణ విజయాలు అలవోకగా కైవశం చేసుకుంటూ... తెలుగు సినిమా ప్రమాణాలను పెంచడంలో విశేష కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో తాజాగా ముఖేష్ కుమార్ చేరుతున్నాడు. ఏకసంథాగ్రాహి అయిన ముఖేష్ కుమార్ ఎమ్మెస్సీలో గోల్డ్ మెడలిస్ట్. మన భారతీయ ముఖ్య భాషలన్నింటితో పాటు.. ఫ్రెంచ్, అరబిక్ వంటి విదేశీ భాషల్లోనూ ప్రవేశముండడం గమనార్హం. చిన్నప్పటి నుంచి సినిమాలపట్ల అనురక్తి పెంచుకున్న ఈ బహుముఖ ప్రతిభాశాలి.. సినిమాల కోసం విదేశంలో లక్షల రూపాయల వేతనం కలిగిన ఉద్యోగాన్ని వదులుకుని.. హైద్రాబాద్ వచ్చేసి, 'సమంత' పేరుతో ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ రూపొందించాడు.   హిప్నాటిజం నేపథ్యంలో... హీరోయిన్ ఓరియంటెడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన 'సమంత' చిత్రంలో సిరి కనకన్ టైటిల్ రోల్ పోషించగా... లిరిన్, రమేష్ నీల్ (యాంకర్ రమేష్), చరణ్, శ్రీకాంత్, పృథ్వి కీలక పాత్రలు పోషించారు.  ఇప్పటికే పలు ఇండియన్- ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ కి ఎంపికైన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఆద్యంతం అత్యంత ఆసక్తికర కథనంతో రూపొందిన "సమంత" చిత్రం దర్శకుడిగా తనకు మంచి పేరు తీసుకురావడంతో పాటు.. ఇందులో నటించిన, పని చేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు తీసుకువస్తుందని ముఖేష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ చిత్రానికి సంగీతం: వి.ఆర్.ఎ. ప్రదీప్, ఎడిటింగ్: సాయికుమార్ ఆకుల, కెమెరా: అశోక్ రత్నం, పి.ఆర్.ఓ: ధీరజ అప్పాజీ, నిర్మాణం: లియో ఫిల్మ్ కంపెనీ, రచన-ద‌ర్శ‌క‌త్వం: ముఖేష్ కుమార్.
`మ‌హాన‌టి`తో న‌టిగా ఎన‌లేని గుర్తింపుని సంపాదించుకుంది కీర్తి సురేశ్. అయితే ఆ త‌రువాత ఆ స్థాయి విజ‌యాన్ని మ‌ళ్ళీ అందుకోలేకపోయింది. ఈ నేప‌థ్యంలో.. రాబోయే చిత్రాల‌పైనే త‌న ఆశ‌ల‌ను పెట్టుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్. ప్ర‌స్తుతం కీర్తి చేతిలో ఏడు చిత్రాలు ఉండ‌గా.. వాటిలో మూడు సినిమాలు రిలీజ్ డేట్స్ ని క‌న్ఫామ్ చేసుకున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విషయ‌మేమిటంటే.. స‌ద‌రు మూడు చిత్రాలు కూడా పండ‌గ‌ల స‌మ‌యంలోనే థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌నున్నాయి. ఆ వివ‌రాల్లోకి వెళితే.. నితిన్ కి జోడీగా కీర్తి న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ `రంగ్ దే` హోలీ కానుక‌గా మార్చి 26న రిలీజ్ కానుంది. ఇక సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ కూతురిగా కీర్తి న‌టిస్తున్న `అణ్ణాత్తే` దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న రాబోతోంది. అలాగే సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుకి జంట‌గా కీర్తి క‌నువిందు చేయ‌నున్న `స‌ర్కారు వారి పాట‌` 2022 సంక్రాంతికి వినోదాలు పంచ‌నుంది. మొత్త‌మ్మీద‌.. ఫెస్టివ‌ల్ సీజ‌న్స్ లో కీర్తి సురేశ్ బాగానే సంద‌డి చేయ‌బోతోంద‌న్న‌మాట‌. అన్న‌ట్టు కీర్తి ఓ కీల‌క పాత్ర‌లో న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `మ‌ర‌క్క‌ర్` కూడా మార్చి 26న విడుద‌ల కాబోతోంది. కొన్నాళ్ళ క్రితం రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసింది యూనిట్. కాక‌పోతే, ఈ మ‌ధ్య ఎలాంటి అప్ డేట్ లేక‌పోవ‌డంతో.. వాయిదా ప‌డిందేమోన‌న్న మాట‌లు వినిపిస్తున్నాయి.
  బాహుబ‌లి, బ‌జ్‌రంగీ భాయిజాన్, మ‌ణిక‌ర్ణిక‌ సినిమాల స్క్రిప్టుల‌తో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ పేరు దేశ‌వ్యాప్తంగా మారుమోగింది. ఆయ‌న స్వ‌యానా య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి క‌న్న‌తండ్రి. ప్ర‌స్తుతం రాజ‌మౌళి రూపొందిస్తోన్న 'ఆర్ఆర్ఆర్‌: రౌద్రం ర‌ణం రుధిరం' మూవీకి స్క్రిప్ట్ రైట‌ర్ ఆయనే. అలాగే కంగ‌నా ర‌నౌత్ టైటిల్ రోల్ చేస్తోన్న 'త‌లైవి'కి స్క్రిప్ట్ చేకూర్చింది విజ‌యేంద్ర‌ప్ర‌సాదే. ఇప్పుడాయ‌న మ‌రో ప్యాన్ ఇండియా మూవీకి, అందునా ఒక మైథ‌లాజిక‌ల్ మూవీకి స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఆ సినిమా పేరు 'సీత‌.. ది ఇన్‌కార్నేష‌న్'‌.  మ‌ల్టీలింగ్యువ‌ల్‌గా ఇది రూపొంద‌నుంది. ప్ర‌ధానంగా క‌న్న‌డంలో తీసే ఈ సినిమాని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌నున్నారు. హ్యూమ‌న్ బీయింగ్ స్టూడియో బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌య్యే ఈ మూవీకి అలౌకిక్ దేశాయ్ ద‌ర్శ‌కుడు. క‌థ‌, స్క్రీన్‌ప్లేల‌ను విజ‌యేంద్ర‌ప్ర‌సాద్‌, అలౌకిక్ క‌లిసి త‌యారుచేస్తున్నారు. మేక‌ర్స్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్ట‌ర్‌లో "యాన్ అన్‌టోల్డ్ స్టోరీ" అనే క్యాప్ష‌న్ క‌నిపించ‌డం గ‌మ‌నార్హం. శ్రీ‌రామ‌చంద్రుని ఇల్లాలిగా, మ‌హాసాధ్విగా భార‌తీయులు కొలిచే సీత గురించి తెలియ‌నిదెవ‌రికి? మ‌రి ఈ క్యాప్ష‌న్‌కు అర్థ‌మేమిటి? అనేది ఆస‌క్తిక‌రం. టైటిల్ డిజైన్‌లో డేగ కూడా క‌నిపిస్తోంది. వీఎఫ్ఎక్స్ ప్ర‌ధానంగా భార‌త‌దేశ‌పు మైథ‌లాజిక‌ల్ మాగ్న‌మ్ ఓప‌స్‌గా ఆడియెన్స్‌కు ఈ సినిమా ఓ అద్భుత అనుభ‌వాన్నిస్తుంద‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో ఎవ‌రు టైటిల్ రోల్ చేస్తున్నారు, ఎప్పుడు షూటింగ్ మొద‌ల‌వుతుంద‌నే విష‌యాలు త్వ‌ర‌లో వెల్ల‌డి కానున్నాయి.
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  
రోడ్లన్నీ రద్దీ. గుంపులు గుంపులుగా జనం. ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు, గుళ్లు, పండగలూ ఇలా జనజీవనం మళ్లీ మామూలు స్థితికి వచ్చేసింది. కరోనా లేదు. గిరోనా లేదు. ఇండియన్ల ముందు చైనీస్ వైరస్ తోకముడిచిందంటూ గొప్పలు. మాస్కులు పెట్టుకోవడం తగ్గించేశారు. శానిటైజర్లు రాసుకోవడం మానేశారు. మనకేం కాదులే అనే ధీమా. అందుకు తగ్గట్టే కొంతకాలం పాటు కొవిడ్ పాజిటివ్ కేసులు బాగా తగ్గిపోయాయి. ప్రజల్లో కరోనా భయం ఇప్పుడు అస్సలు లేదు. ఇదే అంతా చేస్తున్న తప్పు. కరోనా ఎక్కడికీ పోలేదు. మనతోనే ఉంది. మనమధ్యే మాటు వేసి ఉంది. వేటాడే పులి రెండు అడుగులు వెనకకు వేసినట్టు.. కాస్త సైలెంట్ అయింది అంతే. ఇప్పుడు అదును చూసి సెకండ్ వేవ్ తో మళ్లీ విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది.  ఆ మేరకు రాష్ట్రాలను అలర్ట్ చేసింది కేంద్రం. మార్చి మొదటి వారం నుంచి కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య  హడలెత్తిస్తోంది. మహారాష్ట్రలో నైతే మళ్లీ లాక్ డౌన్ పెట్టారు. ముంబైలో మాస్కులు లేకపోతే ఫైన్లు వేస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడులో కొవిడ్ కేసులు భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ అనూహ్యంగా కరోనా ముంచెత్తుతోంది. కరీంనగర్‌ జిల్లాలో అంత్యక్రియలకు హాజరైన 33 మంది కొవిడ్‌ బారినపడటం షాక్ కు గురి చేసింది. పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్ లో 10 మందికి కరోనా సోకడం కలకలంగా మారింది. ఇలా వేగంగా మహమ్మారి వ్యాపిస్తుండటం పొంచి ఉన్న సెకండ్ వేవ్ కు ముందస్తు సిగ్నల్ అంటున్నారు. దేశవ్యాప్తంగా మరోమారు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 14 వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 27 రోజుల తరువాత మరోమారు అత్యధిక కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పెరగడం చూస్తుంటే.. దేశంలో సెకండ్‌ వేవ్‌ మొదలైందా..? ఇది కొత్త స్ట్రెయినా? ముందుముందు మరింత ప్రమాదం తప్పదా? అనే భయాందోళనలు అందరిలోనూ. అందుకే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ పరిస్థితుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుగు రాష్ట్రాలను ప్రత్యేకంగా హెచ్చరించింది. మొదటి విడతలో మహారాష్ట్ర తర్వాత ఎక్కువ కేసులు ఏపీలోనే నమోదయ్యాయి. తెలంగాణలో సడెన్ గా కేసులు నమోదవడం కంగారు పెట్టిస్తోంది. తెలంగాణ, ఏపీలో మళ్లీ కొవిడ్‌ నిబంధనలను గట్టిగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. ప్రభుత్వ రికార్డుల్లో నమోదవుతున్న కేసుల కంటే క్షేత్రస్థాయిలో పాజిటివ్ కేసులు మరింత అధికం. నవంబరు చివరి వారం నుంచి కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. గత వారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. చలి పెరిగి వైరస్ కు వాతావరణం అనుకూలంగా మారింది. అందుకే.. కేసులు భారీగా నమోదవుతున్నాయని అంటున్నారు. దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఆ లెక్కన మార్చి నెలలో సెకండ్‌ వేవ్‌ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే లక్షలాది మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ చేశారు. వారికి అందించిన టీకా మొదటి విడత వైరస్ ను సమర్థవంతంగా కట్టడి చేస్తుంది. అయితే.. సెకండ్‌ వేవ్‌లో కొత్త స్ట్రెయిన్‌ వస్తే ఇప్పుడు వేయించుకున్న వ్యాక్సిన్‌ పనిచేస్తుందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్య వేత్తలకే కొత్త స్ట్రెయిన్ మీద సరైన అవగాహన లేని ప్రస్తుత తరుణంలో ఇక సామాన్య ప్రజలు ఛాన్స్ తీసుకోవడం అత్యంత ప్రమాదకరమే. అందుకే, ఎవరి జాగ్రత్తల్లో వాళ్లు ఉంటే మంచిది. కరోనా లేదని బిందాస్ గా ఉండకుండా.. కొవిడ్ ఎలాగైనా రావొచ్చనే అనుమానంతో అప్రమత్తంగా ఉంటే బెటర్. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. జాగ్రత్తే.. కొవిడ్ నుంచి రక్ష.   
నడిరోడ్డుపై కత్తులతో స్వైర విహారం. పట్టపగలు దారుణ హత్యలు. తల్వార్లు, వేట కొడవళ్లతో మనుషులను నరకడమేంటి? ఈ తెలంగాణకు ఏమైంది? ఏమిటీ అరాచకాలు?  పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది? ఖాకీలంటే భయం పోయిందా? కొందరు ఎందుకింతలా బరితెగిస్తున్నారు?. వరుసగా జరుగుతున్న ఘటనలు తెలంగాణను షేక్ చేస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు  అదుపు తప్పుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్న తెలంగాణ కాప్స్ కు.. పట్టపగలే జరుగుతున్నమర్డర్లు  మచ్చగా మారుతున్నాయి. అంతేకాదు ఫ్రెండ్లీ పోలీసింగ్  విఫల ప్రయోగమా? తెలంగాణ మరో బీహార్ లా మారుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఫిబ్రవరి 17న జరిగిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్య కేసు సంచలనం. అంతకు మించి దారుణం. పట్టబగలు, నడిరోడ్డుపై, ప్రజలంతా చూస్తుండగా నరికి నరికి చంపేశారు దుండగులు. హత్య చేసిన తీరు మాత్రం అత్యంత హేయనీయం. విచక్షణారహితంగా కత్తి పోట్లతో విరుచుకుపడ్డారు. ఆ మనుషులు మృగాళ్లలా  ప్రవర్తించారు. మహిళను సైతం అత్యంత పైశాచికంగా చంపేశారు. ఆ మారణకాండను అక్కడున్న జనమంతా నోరెళ్లి బెట్టి చూశారే కానీ, ఒక్కరు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. నడిరోడ్డు మీదే మర్డర్ జరగడంతో.. అటుగా వెళుతున్న వాహనాలన్నీ నిలిచిపోయాయి. రెండు ఆర్టీసీ బస్సులు ఆగి పోయాయి. వాటి నిండా జనం ఉన్నారు. అయినా.. ఎవరూ ముందుకు రాలేదు. అటుగా వెళ్తున్న వాహనదారులు ఆగి.. ఆ మర్డర్ సీన్ ను తమ మొబైల్ లో వీడియో తీశారే కానీ, కనీసం అరవడమో, ఆపడమో, అడ్డుకోవడమో చేయలేదు. నడిరోడ్డుపై కత్తులతో మర్డర్ జరగడం తెలంగాణలో ఇదే తొలిసారేమీ కాదు. గతంలోనూ అనేక ఘటనలు. 2018 సెప్టెంబర్ 26న హైదరాబాద్ అత్తాపూర్ లోనూ అచ్చం ఇలాంటి దారుణమే జరిగింది. కిషన్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్ లు కలిసి రమేశ్ అనే వ్యక్తిని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. మెట్రో పిల్లర్ కు సమీపంలోనే, పట్టబగలే, వందలాది మంది జనం చూస్తుండగానే జరిగిన ఈ మర్డర్ అప్పట్లో సంచలనం స్పష్టించింది. ఆ సమయంలోనూ జనమంతా ఆ మర్డర్ ను కళ్లప్పగించి చూశారే కానీ ఎవరూ అడ్డుకోలేదు. కసిగా గొడ్డలితో నరికి చంపి.. ఆ తర్వాత తీరిగ్గా నిందితులు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. బీహార్ తరహా హత్య అంటూ అప్పట్లోనే ఆ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు లాయర్ దంపతుల మర్డర్ తో మరోసారి తెలంగాణలో బీహార్ తరహా హత్యలంటూ చర్చ జరుగుతోంది. 2018 సెప్టెంబర్‌ 14న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యను కూడా ఈ కోవలోనే చూస్తున్నారు. కూతురుని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్ష్యతో ప్రణయ్ ను కిరాతకంగా మర్డర్ చేయించాడు అమృతరావు.  సుపారీ గ్యాంగ్ వేట కొడవలితో ప్రణయ్ ను ఆసుపత్రి ప్రాంగణంలో నరికి చంపేసింది. ఆ కేసు తెలంగాణను షేక్ చేసింది. 2021 జనవరి 28న జనగామ జిల్లా కేంద్రంలో  దారుణం చోటుచేసుకుంది.  జనగామ మాజీ కౌన్సిలర్ పులిస్వామిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఉదయం వాకింగ్ చేస్తుండగా.. అక్కడే మాటువేసిన ఇద్దరు వ్యక్తులు పులిస్వామిని కిరాతకంగా దాడిచేసి హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ నాలుగు ఘటనలే కాదు.. కెమెరాలకు చిక్కని కేసులు ఇంకా అనేకం. ఏ ఘటనకు అదే అత్యంత దారుణం. లా అండ్ ఆర్డర్ లో తెలంగాణ భేష్ అంటూ సీఎం కేసీఆర్ పదే పదే స్టేట్ మెంట్లు ఇస్తుంటారు. అలాంటిది ఆయన పార్టీ మండల స్థాయి నేత ఇలా నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపడం చిన్న విషయమేమీ కాదు. అందులోనూ.. ఏకంగా హైకోర్టు లాయర్లను హత్య చేయడం వారి బరితెగింపునకు నిదర్శనం. ఇది ఒక విధంగా న్యాయ వ్యవస్థపైనే పరోక్ష దాడి అని అంటున్నారు. అందుకే, హైకోర్టు సైతం ఘటనపై సీరియస్ గా స్పందించి ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది. న్యాయవాది దంపతుల కేసులో పోలీసుల ఉదాసీన వైఖరిపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీహారులోనే ఇలా జరుగుతుందని.. తమకు వ్యతిరేకంగా కేసులు వేసిన వారిని బెదిరించడం, చంపడం అక్కడ కామనేనని.. ఇప్పుడు తెలంగాణలోనూ బీహార్ లాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయని అంటున్నారు. బంగారు తెలంగాణ తెస్తామని.. ఆటవిక తెలంగాణ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శాంతిభద్రతల నిర్వహణలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అంటున్నారు. భూముల ఆక్రమణలు, నడిరోడ్డుపై మర్డర్లతో తెలంగాణ బీహార్ నే మించేసి దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విఫల ప్రయోగమని.. పాలకుల చేతగాని తనం వల్లే ఇలాంటి దారుణ హత్యలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వరుస ఘటనలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలంగాణ మరో బీహార్ లా మారిపోతోంది.
మరో పక్షం రోజుల్లో ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రి వర్గాన్ని విస్తరించే ఆలోచనలో ఉన్నారా? అందుకోసం వచ్చే నెల మొదటి వారంలో ముహూర్తం ఖరారు అయిందా అంటే ఢిల్లీ రాజకీయ వర్గాలు అవుననే అంటున్నాయి. “మార్చి మొదటివారంలో మంత్రి వర్గ విస్తరణ ఖాయంగా ఉంటుంది, ఇదులో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అక్కర లేదు” అని పేరు చెప్పేందుకు ఇష్టపడని  పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు. నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ లేదా పునఃవ్యవస్తీకరణ ఉంటుందని వార్తలు వచ్చినా, ఓ వంక ఢిల్లీ సరిహద్దుల్లో సాగుతున్న రైతు ఆందోళన, రిపబ్లిక్ డే రోజున చోటు చేసుకున్న సంఘటనలు,  మరో వంక కొవిడ్ కారణంగా అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలు ఇంకా పూర్తిగా సర్డుకోక పోవడం వంటి అనేక కారణాల చేత మంత్రి వర్గవిస్తరణ అప్పట్లో వాయిదా పడిందని అంటున్నారు. ఈ నెల 15తో బడ్జెట్ తొలి విడత సమావేశాలు ముగిసాయి. విశ్రాంతి అనంతరం మలివిడత సమావేశాలు మార్చి 8 తేదీన ప్రారభమవుతాయి. ఈనేపధ్యంలో మార్చి మొదటి వారంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే, ఈసారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో ఉభయ తెలుగు రాష్టాల నుంచి కనీసం ఒక్కొక్కరికి అయినా మంత్రి వర్గంలో స్థానం లభించడం ఖాయమని తెలుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి సిఎం రమేష్, టీజీ వెంకటేష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుంటే, తెలంగాణలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్,నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్  పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న,సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి శాఖ మార్చే అవకశం ఉందని తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసుకుని, వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యాన్మాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కమల దళం, అటు ఏపీలో ఇటు తెలంగాణలో కూడా బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగాగానే మున్నూరు కాపు వర్గానికి చెందిన బండి సంజయ్’ కి, తెలంగాణ పార్టీ పగ్గాలు అప్పగించింది. అలాగే ఎపీలోనూ కాపు వర్గానికి చెందిన సోము వీర్రజును పార్టీ అధ్యక్షునిగా నియమించడంతో పాటుగా, కాపు సామాజిక వర్గానికే చెందిన పవన్ కళ్యాణ్ (జన సేన)తో పార్టీ పొత్తు పెట్టుకుంది. ఈ నేపధ్యంలో జరుగనున్న మంత్రి వర్గ విస్తరణలోనూ అదే ఫార్ములాను అనుసరించే పక్షంలో ఏపీలో సీఎం రమేష్’కు మంత్రి వర్గంలో స్థానం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.టీజీ వెంకటేష్ పేరుకూడా పరిశీలనలో ఉన్నప్పటికీ, సీఎం రమేష్’ వైపుకే క్యాస్ట్ కాటా మొగ్గుచూపుతోందని, సో .. ఇతర పరిణామాలు ఏవీ ప్రతిబంధకం కానీ పక్షంలో ‘సీఎం బనేగా మినిస్టర్’ అనుకోవచ్చని అంటున్నారు. ఇక తెలంగాణ విషయానికివస్తే, ధర్మపురి అరవింద్’ పేరుతొ పాటుగా బండి సంజయ్ పేరు వినిపిస్తున్నపప్పటికీ, అయన ఇప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఎక్సెప్షనల్ కేసులలో తప్పించి ఒకే వ్యక్తి రెండు పదవులు అనేది పార్టీ  విధానాలకు విరుద్ధం. కాబట్టి,ధర్మపురినే అదృష్టం వరిస్తుందని పార్టీ వర్గాల సమాచారం. కిషన్ రెడ్డి శాఖ మార్పు ? ఉభయ తెలుగు రాష్ట్రాలకు కలిపి ఏకైక మంత్రిగా ఉన్న హోం శాఖ సహాయ మంత్రి క్రిషన్ రెడ్డి, పని తీరు పట్ల హోం మంత్రి అమిత్ షా అంత సంతృప్తి కరంగా లేరని అంటున్నారు. అత్యంత కీలక శాఖలో సహాయ మంత్రిగా ఉన్న ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్’లో గడపడం కూడా ఆయనకు నచ్చడం లేదని, కాబట్టి కిషన్ రెడ్డి శాఖ మార్పు ఖాయమని అంటున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు కిషన్ రెడ్డిని ఇన్చార్జిగా నియమించడం కారణంగా చూపింఛి ఆయన శాఖను మార్చే అవకాశం ఉందని అంటున్నారు.  
ఒక్కడు కదిలాడు. ఒక్కో అడుగు ముందుకేశాడు. ఉప్పెనలా ఉప్పొంగాడు. రైతు కోసం రావిరాలలో రణభేరి మోగించాడు. రేవంత్ రెడ్డి సత్తా ఏంటో మరోసారి ఎలుగెత్తి చాటాడు. త్వరలోనే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రను ప్రకటించాడు. సునామీలా తిరిగి ఉప్పెన సృష్టిస్తానని.. ఆ ఉప్పెనలో కేసీఆర్‌ను కప్పేస్తానని, టీఆర్‌ఎస్ ను గద్దె దించుతానని.. సమరశంఖం పూరించాడు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ భుజం మీదుగా మోదీపై గురి.. రావిరాల సభతో రేవంత్ రెడ్డి భవిష్యత్ రాజకీయంపై ఓ అంచనాకు రావొచ్చు. కేసీఆర్ భుజాల మీదుగా కేంద్రంపై వ్యవసాయ చట్టాలపై ఫిరంగి పేల్చిన తీరుకు విమర్శకుల నుంచే ప్రశంసలు వస్తున్నాయి. కేంద్ర చట్టాలను సవరించుకునే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని గుర్తుచేస్తూ.. కేంద్ర బంతిని రాష్ట్ర కోర్టులోకి నెట్టారు. కేసీఆర్ మోదీ జట్టు వీడి.. సాగు చట్టాలపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలంటూ గులాబీ బాస్ ను బోనులో నిలబెట్టే ప్రయత్నం చేశారు.  రావిరాల వేదికగా కేంద్ర, రాష్ట్రాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పంపిన మెసేజ్ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లిపోయింది. ఢిల్లీ డైరెక్షన్ లోనే.. చెప్పేశారు. రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. పాదయాత్రతో తన రాజకీయ బాటను మరింత సుస్థిరం చేసుకోనున్నట్టు రావిరాల సభలో రాష్ట్ర వ్యాప్త పాదయాత్రను ప్రకటించి రేవంత్ రెడ్డి సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ అధినాయకత్వం ఆదేశం మేరకే రూట్‌ మ్యాప్‌ ఉంటుందని స్పష్టం చేసి తన గాడ్ ఫాదర్ ఢిల్లీనే అంటూ సంకేతాలు పంపించేశారు. 10 జన్ పథ్ అనుమతితోనే కాంగ్రెస్ లో తన రాజకీయ ప్రస్థానం కొనసాగుతుందని.. లోకల్ సీనియర్లకు చెప్పకనే చెప్పేశారు. నాతో వచ్చేదెవరు.. నాతో నడిచేదెవరు.. తేలిపోయింది. రావిరాల సభతో రేవంత్ రెడ్డితో కలిసి నడిచేదెవరో తేలిపోయింది. కాంగ్రెస్ లో  ఎవరు ఏ గ్రూపో పాలు, నీళ్లలా తేలిపోయింది. నో డౌట్. సీతక్కే ఆ లిస్ట్ లో అందరికన్నా ముందున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్‌, కుసుమ్‌కుమార్‌, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌, మాజీ మంత్రులు చిన్నారెడ్డి, కొండా సురేఖ, మాజీ ఎంపీలు సురేష్‌ షెట్కార్‌, సిరిసిల్ల రాజయ్య, మల్లు రవి, కూన శ్రీశైలం గౌడ్‌, టి.రామ్మెహన్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, దాసోజు శ్రావణ్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డితో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి సభకు హాజరు కావడంతో వీరంతా ఆయన బ్యాచ్ అంటూ ప్రచారం మొదలైపోయింది. ఇక.. సభకు రాని వారిలో హేమాహేమీలే ఉన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హన్మంతరావు, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నాల లక్ష్యయ్య, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు మీటింగ్ కు అటెండ్ అవలేదు. అయితే.. రణభేరి సభ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన ప్రొగ్రామ్ కాదని వారంతా బయటకు చెబుతున్నా.. ఆ సో కాల్డ్ సీనియర్లంతా రేవంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేని వారేనంటున్నారు ఆయన అభిమానులు. ఆసక్తిరేపిన సురీడు.. రేవంత్ రెడ్డి నిర్వహించిన రణభేరి సభలో జరిగిన రెండు ఆసక్తికర అంశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నిత్యం ఆయన వెన్నంటే ఉండేవాడు వ్యక్తిగత అనుచరుడు సురీడు. వైఎస్ మరణం తర్వాత బహిరంగంగా సురీడు కనిపించింది లేదు. అలాంటిది రేవంత్ రెడ్డి సభలో అనూహ్యంగా ప్రత్యక్షమయ్యాడు ఆ సురీడు. ఇప్పటి వరకూ ఏ జగన్ సభలోనూ, ఏ షర్మిల మీటింగ్ లోనూ జాడ లేని సూరీడు సడెన్ గా రేవంత్ రెడ్డి రణభేరిలో ఎందుకు ఎంట్రీ ఇచ్చాడనే దానిపై పొలిటికల్ ఇంట్రెస్ట్ పెరిగింది. నాడు వైఎస్.. నేడు రేవంత్ -కొండా సురేఖ కామెంట్స్ రణభేరి సభలో కీలక నేత కొండా సురేఖ చేసిన కామెంట్స్ భవిష్యత్ పరిణామాలపై ఓ అంచనాకు వచ్చేలా చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి పాదయాత్రను.. గతంలో వైఎస్సార్ చేసిన యాత్రతో పోల్చారు కొండా సురేఖ. తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తొస్తున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ సైతం వ్యూహాత్మకమే అంటున్నారు. ఆనాడు కాంగ్రెస్ కు వైఎస్ ఎలానో.. ఈనాడు హస్తం పార్టీలో రేవంత్ రెడ్డి స్థాయి కూడా అలాంటిదేనంటూ పరోక్షంగా ప్రస్తావించారని చెబుతున్నారు. అప్పట్లో వైఎస్సార్ కు బలమైన మద్దతుదారుగా ఉన్న కొండా దంపతులు.. ఫ్యూచర్ లో రేవంత్ రెడ్డికి సైతం స్ట్రాంగ్ సపోర్టర్స్ గా నిలిచే ఛాన్స్ ఉందని విశ్లేషిస్తున్నారు. రావిరాల సభతో  కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి స్ట్రామినా ఏంటో.. అది ఉప్పెనలా ఉప్పొంగి, తెలంగాణలో సృష్టించే పొలిటికల్ సునామీ ఎంతో స్పష్టమైంది. రేవంత్ రెడ్డి బలం, బలగం, భవిష్యత్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ సభ జస్ట్ టీజర్ మాత్రమే. ట్రైలర్ మరింత అదిరిపోతుందని..  పిక్చర్ అబీ బాకీ హై అంటున్నారు ఫ్యాన్స్.    
భారతీయ జనతా పార్టీ కి లోక్ సభలో 303 మంది సభ్యులున్నారు, మిత్ర పక్షాలను కలుపుకుంటే ఆ సంఖ్య 350 దాటుతుంది. రాజ్య సభలో సెంచరీకి చేరువలో ఉంది.అన్ని రాష్టాలలో కలిపి దేశం మొత్తంలో కమలం గుర్తుమీద గెలిచిన  ఎమ్మెల్ల్యేలు1374 మంది ఉన్నారు. దేశం మొత్తంలో ఉన్న రాష్ట్రాలు 29 అయితే అందులో 12 రాష్ట్రాలలో బీజేపీ సొంత ప్రభుత్వాలున్నాయి. మరో ఆరు రాష్ట్రాలలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వామ్య పక్షంగా ఉంది. దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం ఉన్న పార్టీ బీజేపీ ... అంతే కాదు, పార్టీ సభ్యత్వం లేకుండా ఐడియాలజికల్ కమిట్మెంట్’తో పనిచేసే అదృశ్య కార్యకర్తలు దేశ విదేశాల్లో లక్షల్లో ఉన్నారు.  అయితే, ఇంత బలం, బలగం ఉన్న బీజేపీ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో మాత్రం ఆటలో అరటి పండుగానే మిగిలిపోతోంది. గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. కనీసం కాసింత గౌరవప్రదమైన ఓట్లయినావచ్చాయా,అంటే అదీలేదు.నిండా ఒక శాతం ఓట్లు రాలేదు.  చివరకు ‘నోటా’ కు వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదు.  అలాగని, రాష్ట్రంలో పార్టీకి పునాదులు లేవా ... అంటే రాష్ట్ర విభజనకు ముందు, ఒంటరిగా పోటీచేసిన సందర్భాలలో కూడా బీజేపీకి ఓట్లే కాదు సీట్లు కూడా వచ్చాయి. 1999 లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్’లో బీజేపీ ఏడు సీట్లు గెలిస్తే అందులో మూడు (రాజమండ్రి, నరసాపురం, తిరుపతి) స్థానాలు ఆంధ్రాలోనే ఉన్నాయి. అప్పట్లో ఆంధ్ర ప్రాంతంలో బీజేపీకి 18 శాతానికి పైగానే ఓట్లు వచ్చాయి. అలాంటి పార్టీ 2019 ఎన్నికల్లో ఎందుకు అలా తుడిచి పెట్టుకు పోయింది. ఎందుకు తిరిగి  పుంజుకోలేక పోతోంది ? అందుకు రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల పునాదులు పటిష్టంగా ఉండడం ఒక ప్రధాన కారణం అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కమల దళం ఎదగకుండా చేస్తున్నాయని, పార్టీ నాయకులే వాపోతున్నారు.రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదాను ఇవ్వలేదు. చివరకు అందుకు ప్రత్యాన్మాయంగా ఇస్తామని వాగ్దానం చేసిన ప్రత్యేక ప్యాకేజికి కేంద్రం పంగనామాలు పెట్టింది. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా శంఖుస్థాపన చేసిన రాజధాని నిర్మాణానికి గానీ,లోటు బడ్జెట్ భర్తీకి  వెనక బడిన ప్రాంతాల అభివృద్ధికి ఇలా ఇస్తామన్న నిధులేవీ తొలి ఐదేళ్ళలో ఇవ్వలేదు. ఆకారణంగానే తెలుగు దేశం పార్టీ, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుంది. దీంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో,రాష్ట్ర ప్రజల్లో కూడా బీజేపీ పట్ల విశ్వాసం పూర్తిగా సన్నగిల్లింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో బీజీపీ ‘నోటా’ తో పోటీపడి ఓడిపోయింది. ఒకప్పుడు ఒంటరిగా ఒంటరిగా పోటీ చేసి 18 శాతం వరకు ఓట్లు, మూడు లోక్ సభ స్థానాలు గెలుచుకున్న బీజేపీ 0.8 శాతం ఓట్లకు పడిపోయింది.  అందుకే, రాష్ట్రంలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉండడం, కార్యకర్తలు, స్థానిక నాయకుల అభీష్టానికి వ్యతిరేకంగా  సుదీర్ఘ కాలం పాటు తెలుగు దేశం పార్టీతో పొత్తు కొనసాగించడం,సమర్ధ నాయకత్వం లేక పోవడం ఇలా ఇంకా అనేక ఇతర  కారణాలున్నా  కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకంగా నిలుస్తున్నాయని పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు.   ప్రస్తుత విషయాన్నే తీసుకుంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు, అన్యమత ప్రచారం, మత మార్పిడులు, క్రైస్తవీకరణ ఆగడాలు పెరిగిపోవడంతో రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా వంటి పాత గాయాలను మరిచి పోయి బీజేపీ వైపు కొంత మొగ్గు చూపారు. అయితే, ఇంతలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన తెర మీదకు రావడంతో కథ మళ్ళీ కథ మొదటికి వచ్చింది. అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు,విశాఖ ఉక్క ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కేంద్ర నాయకత్వం వద్ద మొర పెట్టుకున్నారు. పార్టీ రాష్ట్ర్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో ఢిల్లీ వెళ్ళిన ప్రతినిధి బృదం కేంద్ర ఉక్కు మంత్రి  ధర్మేంద్ర  ప్రధాన్ ‘ను కలిసి వినప్తి పత్రం సంర్పించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు.  అయితే అప్పటికే జరగవలసిన నష్టం జరిగి పోయింది. ప్రధాన ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని, ఇందుకు సంబంధించి ప్రజల సెంటిమెంట్’ను కార్మికులు ఆందోళనను చాల చాకచక్యంగా తమకు అనుకూలంగా మలచుకుంది. ముందుగా స్థానిక ఎమ్మెల్ల్యే, మాజీ మంత్రి   మాజీ మంత్రి, ఎమ్మెల్ల్యే గంటా శ్రీనివాస రావు ఎమ్మెల్ల్యే పదవికి రాజీనామా  చేశారు. మరో వంక టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్ల్యే పల్లా శ్రీనివాస ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.  ఆయన దీక్షను పోలీసులు భగ్నం చేసినా, పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే చేస్తే...ప్రతిపక్షంగా తాము కూడా ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఉక్కు పరిరక్షణ కోసం ముందుండి ఉద్యమాన్ని నడిపించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందనడంతో పాటుగా ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేసేందుకు కుడా సిద్దమని ప్రకటించడం ద్వారా చంద్రబాబు నాయుడు, బంతిని వైసీపీ కోర్టులోకి డ్రైవ్ చేశారు. అంతే కాకుండా స్టీల్‌ప్లాంట్‌ లేకపోతే విశాఖపట్నం ఉనికే లేదని, అటువంటి కర్మాగారాన్ని అమ్మేస్తుంటే...ముఖ్యమంత్రి తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నారా?...అంటూ ముఖ్యమంత్రి జగన్‌పై మరో సెంటిమెంటల్ బాణాన్ని సందించారు.అలాగే, స్టీల్ ప్లాంట్ బేరం వెనక జగన్ రెడ్డి, విజయసాయి రెడ్డి స్టీల్ ప్లాంట్ ను అమ్మేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని రాష్ట్ర్ర వయ్పితం చేసే లక్ష్యంతో ఈనెల 18న స్టీల్‌ప్లాంట్‌ ఆవిర్భావ దినోత్సవం రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చామన్నారు.  ఈ నేపధ్యంలోనే అధికార వైసీపీలోనూ కదలిక వచ్చింది. పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ నెల 20 న స్టీల్ ప్లాంట్ పరిరక్షన యాత్ర చేస్తానని ప్రకటించారు. అలాగే ముఖ్యంత్రి కార్మిక నాయకులతో సమావేసమవుతారని, ఇదే విషయాన్ని చర్చించేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రధాని అప్పాయింట్మెంట్ కోరరాని కూడా విజయసాయి చెప్పారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. .సో .. విశాఖ ఉక్కు ఉద్యమం వేడెక్కుతోంది. ఈ దశలో కేంద్రం సానుకూలంగా స్పదించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా .. బీజేపీకివచ్చే ప్రయోజనం శూన్యంగానీ కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలే ఆంధ్ర ప్రదేశ్’లో పార్టీ ఎదుగుదలకు ప్రతిబంధకం అవుతున్నాయని.. రాష్ట్ర బీజేపీ నాయకులు అంతరంగిక సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     
అంతా బాగున్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీలో ఎవరి దారి వారిది ..ఎవరి గ్రూపు వారిది అన్నట్లుగా కథ నడిచింది.అంతర్గత కుమ్ములాటలు,జుట్టూ జుట్టూ పట్టుకోవడాలు,ఒకరిపై ఒకరు దుమ్మెతి పోసుకోవడాలు,ఒకటని కాదు అలాంటి లక్షణాలన్నీ కాంగ్రెస్ కల్చర్’గా, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పేటెంట్ ఉన్న ‘సుగుణాలు’గా ముద్ర పడిపోయింది.అదే మంటే, ‘మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం కొంచెం ఎక్కువండీ’ అంటూ కాంగ్రెస్ నాయకులు తప్పించుకోవడం,అందరికీ తెలిసిన గతం.  అయినా అప్పట్లో పార్టీ అధిష్టానం బలంగా ఉండేది కాబట్టి పార్టీలో ఎన్ని గ్రూపులున్నా, నాయకుల మధ్య ఎన్ని విబేధాలున్నా, కొట్టుకున్నా, తిట్టుకున్నా చివరకు అధిష్టానం మాటే వేదంగా చెలామణి అయింది.నిజానికి,అప్పట్లో బలమైన ప్రాతీయ నాయకులను తమ గుప్పిట్లో ఉంచుకునేందుకు పార్టీ అధిష్టానమే రాష్ట్రాల్లో గ్రూపులను ప్రోత్సహించేదని కూడా ఆనాటి మాటగా అంటారు.  సరే  అదంతా గతం. ప్రస్తుతం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో, పార్టీ అధినాయకత్వం ఎంత బలహీనంగా వుందో వేరే చెప్పనక్కర లేదు. కేంద్రంలో అధికారం లేదు. లోక్ సభలో కనీసం ప్రతిపక్ష హోదా లేదు. చివరకు సుమారు, రెండు సంవత్సరాలుగా పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు లేరు. పార్టీ సీనియర్ నాయకులు ‘తిరుగుబాటు బావుటా’ ఎగరేశారు. ఏకంగా 21 మంది అధిష్టానానికి అసమ్మతి లేఖ  రాశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని,తక్షణమే పూర్తి  స్థాయి అధ్యక్షుని ఎన్నుకోవాలని వత్తిడి తెచ్చారు. అయినా, తూతూమంత్రంగా సీడబ్ల్యూ సమావేశం నిర్వహించి, అధ్యక్షుని ఎన్నిక క్రతువును జూన్’ వరకు వాయిదా వేశారు. ప్రస్తుత తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ.   దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డిటో డిటోగా ఇంచుమించుగా అంతే అధ్వాన్నంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన పార్టీ ఎమ్మెల్ల్యేలలో ఇంచుమించుగా సగం మంది అధికార తెరాసలోకి వెళ్లి పోయారు.దుబ్బాక,జీహెచ్ఎంసీ పరాభవం తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి, రాహుల్ గాంధీ అడుగుజాడల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవికి రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షుని ఎన్నికకు పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్’ కొంత కసరత్తు చేశారు. కొన్ని పేర్లను పైకి తీసారు. రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క ... మరి కొని పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చాయి. మాణిక్ ఠాగూర్ జాబితాలో పేరు లేని జగ్గా రెడ్డి లాంటి వారు నొచ్చుకున్నారు. ‘మా సేవలకు గుర్తింపు ఏదని వాపోయారు. ఇంతమంది పార్టీలో పుట్టి,పార్టీలో పెరిగిన సీనియర్లు ఉండగా, నిన్నగాక మొన్న వచ్చిన రేవంత్ రెడ్డి’ని ఎలా అధ్యక్షుని చేస్తారని వీహెచ్ లాంటి కొందరు సీనియర్లు చిందులేశారు... అయినా మాణిక్ ఠాగూర్ ఎంపిక చేసిన జాబితా సోనియా గాంధీ టేబుల్ మీదకు చేరింది. ఆమె టిక్’  కూడా పెట్టేశారుయ  ఏ క్షణంలో అయినా కొత్త అధ్యక్షుని నియామక ప్రకటన వెలువడుతుందని అనుకున్నారు. ఇంతలో నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక తెర మీదకు వచ్చింది. ఆ స్థానం నుంచి పోటీ చేసే పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అభ్యర్ధన మేరకు, ఉప ఎన్నికల వరకు పార్టీలో  ఐక్యతను కాపాడేందుకు పీసీసీ అధ్యక్షుని ఎన్నిక వాయిదా పడింది.ఉత్తమ కుమార్ రెడ్డి అందాకా తాత్కాలిక అధ్యక్షునిగా కొనసాగుతారు. అంటే,ఎంతో ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయిలలో తల లేని మొండెం లాగా అధ్యక్షుడు లేని పార్టీగా మిగిలింది. అదొకటి అలా ఉంటే, పార్టీలో ఐక్యత ఆశించి అధ్యక్ష ఎంపికను వాయిదావేస్తే, అధ్యక్ష పదవి పోటీలో ఉన్న వారు ఎవరికీ వారు పోటాపోటీగా పాదయాత్రల బాట పట్టారు. ఇప్పటికే, రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఎవరి దారిన వారు పాదయాత్రల సాగిస్తున్నారు.ఈ నెల 20 నుంచి కోమటి రెడ్డి తమ స్వగ్రామం నల్గొండ జిల్లా బ్రహ్మనవెళ్ళం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టున పూర్తి చేయాలన్న డిమాండ్’తో పాద యాత్ర ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.అలాగే సిద్ధిపేట ఎమ్మల్యే జగ్గ రెడ్డి కూడా ఈ నెల 22 నుంచి పాదయాత్రకు సిద్దమయ్యారు.   అయితే కాంగ్రెస్ నాయకుల పాద యాత్రలు విమర్శలు ఎదుర్కుంటున్నాయి. ప్రత్యర్ధి పార్టీలు, తెరాస, బీజేపీ టీపీసీసీ అధ్యక్ష పదవి కోసమే కాంగ్రెస్ నాయకులు పాదయత్రాలు  చేస్తున్నారని ఆరోపిస్తుంటే, సొంత పార్టీ కార్యకర్తలు క్రింది స్థాయి నాయకులు ఇలా పార్టీ సీనియర్ నాయకులు ఎవరి దారిన వారు పాదయాత్రలు చేయడం వలన పార్టీకి మేలుకంటే కీడే ఎక్కువ జరుగుతుందని  ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్త చేస్తున్నారు. ఓ వంక తెరాస, బీజేపీ ఎమ్మెల్సీ, ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అదే విధంగా  నాగార్జున సాగర్ ఉపఎన్నికకు సిద్డంవుతుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పాదయాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇలా ఎవరికి  వారు కాకుండా అందరూ కలిసి కార్యకరమాలు నిర్వహిస్తే కార్యకర్తలు ప్రజల్లో విశ్వాసం ఏర్పడుతుందని, అలా కాకుండా ఇలా ఎవరి దారినవారు పొతే ప్రయోజనం ఉండదని అంటున్నారు. అయితే పార్టీ నాయకులు మాత్రం యాత్రలు వేరైనా అందరి గమ్యం,లక్ష్యం ఒక్కటే అని, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాన్ని, కేంద్రంలో బీజీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని పేర్కొంటున్నారు. మరో వంక ఈ పాద యాత్రలు చివరకు కాంగ్రెస్ పార్టీని ఈ గమ్యం చేరుస్తాయో ... కాలమే నిర్ణయిస్తుంది అనుకోవడమే కాంగ్రెస్ కార్యకర్తల విధి ...  దట్స్ ఇట్ .
ఇప్పుడే కాదు  గతంలో కూడా ఇలాంటి పుకార్లు చాలానే షికారు చేశాయి. రాష్ట్ర విభజనకు ముందు అప్పటి కేంద్ర మంత్రి, సినిమా హీరో చిరంజీవి, హైదరాబాద్’ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన తెర మీదకు తెచ్చారు. ఇదే విధయాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళారు. అయితే, కాంగ్రెస్ అధిష్టానం చిరంజీవి ప్రతిపాదనను పట్టించుకోలేదు. అలాగే, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ నాయకులు కూడా ‘తాము  పట్టిన కుందేటికి మూడే కాళ్ళు’అన్నట్లుగా సమైక్యాంధ్ర రాష్ట్రం డిమాండ్ నుంచి ఒక్క అంగుళం అయినా కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు.మరో వంక తెలంగాణ ప్రాంత నాయకత్వం సహజంగానే ఆ ప్రతిపాదనను నిర్ద్విధంగా తిరస్కరించారు.ఆ విధంగా, చిరంజీవి  ప్రతిపాదన రిలీజ్’కు నోచుకోని సినిమాలా తెరచాటుకు వెళ్లి పోయింది.  ఆ తర్వాత కూడా అడపాతడపా హైదరాబాద్’ను కేంద్రపాలిత ప్రాంతం (యూటీ) చేయాలనే డిమాండ్, ఆకాంక్ష అక్కడా ఇక్కడా వినవస్తూనే ఉంది. అలాగే, ఇందుకు సంబంధించి మీడియాలో ఉహాగానాలు, వ్యూహాగానాలు,  కూడా అప్పడప్పుడు వినవస్తున్నాయి. ఇప్పుడు ఇదే క్రమంలో, అధికార తెరాస మిత్ర పక్షం ఎంఐఎం అధ్యక్షుడు, హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిన్న లోక్ సభలో, కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్’ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే ప్రమాదం ఉందని, ఒక పాసింగ్ కామెంట్ చేశారు. అలాంటి ఆలోచన ఏదీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్’లో స్పష్టం చేశారు. అయితే అంత సీరియస్ కామెంట్ లేదా ఆరోపణ చేసిన అసదుద్దీన్’ ప్రభుత్వం సమాధానం చెప్పేవరకు ఆగకుండా సభలోంచి వెళ్ళిపోయారు. అంటే, అసదుద్దీన్ ప్రభుత్వం నుంచి సమాధానం ఆశించి యూటీ అంశాన్ని ప్రస్తావించే లేదనే విషయం తేలిపోయింది. మరి ఎందుకు ఈ అసందర్భ ప్రస్తావన చేశారు, అని చూస్తే, కొత్తగా మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కిన తెరాస, ఎంఐఎం కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగానే అసదుద్దీన్ ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారని అనుకోవచ్చునని రాజకీయ వర్గాల్లో వినవస్తోంది.   రాష్ట్రంలో దినదిన ప్రవర్థమానంగా దిగజారిపోతున్న పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా అధికార తెరాస నాయకత్వం తెలంగాణా సెంటిమెంట్’ను మరో మారు నిద్ర లేపే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల పలు సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇతర నాయకులు, మంత్రులు, తరిమి కొడతాం, ఆప్టి పెడతాం, ఆంధ్రా పాలకులు అవీఇవీ అనే   సెంటిమెంటును రగిల్చే ఉద్యమకాలం నాటి బాషను వాడుతున్నారు. ఇందులో భాగంగానే వరసగా నిలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉపఎన్నిక,అదే విధంగా ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సెంటిమెంట్’ ప్రయత్నాలను అధికార పార్టీ ముమ్మరం చేసింది. ఆ వ్యూహంలో భాగంగానే అసదుద్దీన్ అసందర్భ ప్రస్తావన చేశారని అంటున్నారు. అయితే రాష్ట్రం ఏర్పడి ఏడేళ్ళు అయిన తర్వాత ఇంకా  సెంటిమెంట్  ఏ మేరకు పనిచేస్తుంది .. అనేది చూడవలసి ఉంది..
తెలంగాణలో తెరాసకు తిరుగులేదు.. ఇది నిన్నటి మాట. తెరాస’లో కేసీఆర్’కు ఎదురు లేదు ఇది కూడా అంతే.. పార్టీ అంతర్గత వ్యవహారాలు, కేసీఆర్ అంతరంగం అంతో ఇంతో తెలిసిన వారిని ఎవరిని కదిల్చినా ఇదే మాట అంటున్నారు. నిజానికి ఎవరూ చెప్పవలసిన అవసరం లేకుండానే, వాస్తవ పరిస్థితి ఏమిటో ప్రతి ఒక్కరికీ కారులో కల్లోలం బుల్లి తెరపై బొమ్మలా అందరికీ కనిపిస్తూనే వుంది. అందుకే  రాజకీయ విశ్లేషకులు మొదలు సామాన్య ప్రజల వరకు అందరిలో తెరాసలో ఏమి జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో  ‘ఆల్ ఈజ్ నాట్ వెల్’, ‘అంతా ఏమంత బాగోలేదు’ అన్న నిజం అందరికి అర్థమైపోయింది. ఇప్పుడదో బహిరంగ రహస్యం. దాచేస్తే దాగని సత్యంగా అందిరి నోళ్ళలో నలుగుతోంది.     ఓ వంక కుటుంబంలో అంతర్గత విబేధాలు, వారసత్వం కుమ్ములాటలు, మరో వంక పార్టీలో,ప్రభుత్వంలో లుకలుకలు పార్టీ మీద కేసీఆర్ పట్టు సడలుతున్న వైనాన్ని స్పష్టం చేస్తోందని రాజకీయ వర్గాల్లో, మీడియాలో వార్తలు  గుప్పుమంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే, అంతర్గత కుమ్ములాటలు బహిరంగ హెచ్చరికల స్థాయికి చేరాయి. అది కూడా వారో వీరో కాదు, స్వయంగా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్’ పార్టీ వేదిక నుంచి పార్టీ నాయకులను తాట తీస్తా, తోలు వలుస్తా అని హెచ్చరించడం గమనిస్తే ఆయనలో అసహనం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా  రెండు రోజుల క్రితం నాగార్జున సాగర్ లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి, ప్రతిపక్షాలను స్థాయి మరిచి దుర్భాషలు ఆడడమే కాకుండా, తమకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చినగిరిజన మహిళలను ‘కుక్కలు’ అంటూ దూషించడం ఆయనలో పెరుగతున్న అసహనానికి నిదర్శనంగా రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ మాత్రమే కాదు కేటీఆర్ కూడా అదే ధోరణిలో మాట్లాడుతున్నారు. అదే విధంగా పార్టీలో మొదటినుంచి ఉన్న కీలక నేతలు చాపకింద నీరుల అసమ్మతిని రాజేసే ప్రయత్నంలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే ముఖ్య నేతల మధ్య కూడా కీలక నిర్ణయాల  విషయంలో విబేధాలు తీవ్ర స్థాయికి చేరిన సంకేతాలు స్పష్టమవుతున్నాయి.    అయితే  ముఖ్యమంత్రిలో ప్రతి ముఖ్య నేతలో ఇంతటి అసహనానికి కారణం ఏమిటని అలోచిస్తే, ప్రధానంగా ఇంటి పోరు కారణంగానే కేసీఆర్’లో రోజురోజుకు అసహనం పెరిగిపోతోందని తెలుస్తోంది. దానికి తోడు రెండుమూడు నెలల క్రితం దుబ్భాక అసెంబ్లీ స్థానికి జరిగిన ఉపన్నికలో, ఆ తర్వాత హైదరాబాద్ నగర పాలక సంస్థ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం ఇప్పటికీ ఆయనకు మింగుడు పడడంలేదని రాజకీయ వర్గాల్లో వినపిస్తోంది. అలాగే త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లోనూ గెలుపు విషయంలోనూ,ఇంటల్జెన్సీ నివేదికలు హెచ్చరికలు చేస్తున్నాయని చెబుతున్నారు. అందుకే మొన్నటి సాగర్ సభలో ముఖ్యమంత్రి గిరిజన మహిళలను ‘కుక్కలు’ అనే వరకు వెళ్ళారని, పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతే కాదు కాలు జారితే తీసుకోవచ్చు కానీ.. నోరు జారితే వెనక్కి తీసుకోలేమని, ముఖ్యంగా రాజకీయాల్లో నోరు జారితే అందుకు మూల్యం చేల్లిచుకోవలసి వస్తుందని, పార్టీ స్థానిక నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలోని గుర్రంపోడు తండాలో తమ భూములు  కబ్జాకు గురయ్యాయంటూ గత కొంతకాలంగా గిరిజనులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గిరిజన మహిళలను ‘కుక్కలు’లతో పోలుస్తూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లేనని స్థానిక తెరాస నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ గిరిజనుల పక్షాన ఆందోళన చేపట్టింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇటీవల పార్టీలో చేరిన విజయ శాంతి ఇతర నాయకులు గుర్రంపోడు తండాలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజీపీ, తెరాస కార్యకర్తల మధ్య తోపులాటలు. పోలీసుల లాఠీ ఛార్జ్ వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారం పది  రోజులుగా  ఉద్రిక్త వాతావరణ నెలకొని ఉంది. ఆ నేపధ్యంలో ముఖ్యమంత్రి  జిల్లా పర్యటన  సందర్భంగా బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం, గృహ నిర్భందంలో ఉంచడంతో  పరిస్థితి మరింత వేడెక్కింది. ఇలాంటి పరిస్థితిలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రేపటి నాగార్జున సాగర ఎన్నికల్లో పార్టీకి మేలు కంటే కీడే ఎక్కవ చేస్తాయని ఇటు పార్టీ నాయకులు, అటు రాజకీయ విశ్లేషకులు కూడా పేర్కొంటున్నారు.  ఇటీవల పార్టీ ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ఎస్సీ, ఎస్టీలను చులకన చేస్తూ వారికీ అక్షరం ముక్క రాదని అవహేళన చేయడం రచ్చ రచ్చైంది. తర్వాత ఆయన క్షమాపణలు చెప్పి,చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. త్వరలో ఉప ఎన్నికల జరగనున్న నాగార్జున సాగర్ నియోజక వర్గంలో దళిత, గిరిజన, ఎస్సీ,ఎస్టీ ఓట్లు కీలకం కానున్న నేపధ్యంలో ఆయా కులాలను కించపరిచే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా, అందుకు మూల్యం చెల్లించక తప్పదని, అందుకు అధికార పార్టీ, ముఖ్యమంత్రి మినహాయింపు కాదని విశ్లేషకులు భావిస్తున్నారు.  నాగార్జున సాగర్, హాలియా బహిరంగ సభలో ముఖ్యమంత్రి కురిపించిన వరాల జల్లుపై కూడా ప్రజలు పెదవి విరుస్తున్నారు.ఈ వరాలు ప్రజలపై అంతగా ప్రభావం చూపదని, లోపాయికారి చర్చల్లో అధికార పార్టీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారు. అదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి ఇదే విధమైన వాగ్దానాలు చేసారని, అయితే, అందులో ఏ ఒక్క వాగ్దానం కూడా అమలుకాలేదని  విపక్షాలు విమర్శిస్తున్నాయి. మరో వంక సోషల్ మీడియాలో అప్పటి, ఇప్పటి క్లిప్పింగులతో ప్రచారం అవుతున్న వార్తలు వాగ్దానాల డొల్లతనాన్ని చూపుతోంది. దీంతో అప్పటి వాగ్దానాలను  మరిచి పోయినట్లుగానే ఈ వాగ్దానాలను మరిచి పోతారని సామాన్య ప్రజలు కూడా భావిస్తున్నారు. అలాగే  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నాగార్జున సాగర్ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే  జానారెడ్డి అయితే  ఎన్నికల సమయంలో ఉత్తుత్తి వాగ్దానాలు చేయడం తెరాస పార్టీకి, ముఖ్యమంత్రి కేసీఆర్’కు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. అయితే అన్నిసందర్భాలలో అందరినీ మోసం చేయడం ఎవరికీ సాధ్యం కాదని కూడా జానా పేర్కొన్నారు... అది నిజం కూడా.. 
తల దాచుకోవడానికి చిన్న గూడైన ఉండాలనుకుంటారు సగటు మనుషులు. అయితే ప్రపంచంలోనే కుబేరుల జాబితాలో చేరిన కొందరి ఇళ్లు చూస్తే ఇంద్ర భవనమా.. దేవంద్ర భవనమా.. మయుడి వాస్తు కళా నైపుణ్యామా అన్న ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి కొన్ని ఇళ్ల విశేషాలు చూద్దాం... అంటిలియా - ముఖేశ్ అంబానీ ప్రపంచంలోనే లక్షలాది ఇండ్ల మాదిరిగా  అంటిలియా ను చూడలేం. వాటిలో ఒకటిగా లెక్కించలేం. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండవది. దక్షిణ ముంబయిలో ఉండే ఈ ఇంటికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇది భారతీయ బిలీయనీర్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యుల రెడిడెన్సీ.  ఆంటీలియాను  డిజైన్ చేసింది చికాగో ఆర్కిటెక్ట్ పార్కిన్సన్ విల్. ఈ భవనాన్ని ఆస్ట్రేలియన్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ హోల్డింగ్స్  నిర్మించారు. ఈ భవనంలో 27 అంతస్తులు ఉంటాయి.  అనేక ఆధునిక హంగులతో దీన్ని రూపొందించారు. ఇందులో సెలూన్, న్యూ మూవీ థియేటర్ ఐస్ క్రీమ్ పార్లర్, స్విమ్మింగ్ ఫూల్, జిమ్ ,స్పా లాంటివి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. ఇంటి ఖరీదు రెండు బిలియన్ డాలర్లు. ప్రపంచంలోనే అతి ఖరీదైన గృహాల్లో రెండోవ స్థానం సాధించిన ఈ ఇల్లు భారతదేశంలో అతి ఖరీదైన మొదటి గృహం. జెకె హౌస్,  గౌతమ్ సింఘానియా ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంటి టైటిల్‌ను అంటిలియా  సొంతం చేసుకుంది.  ఇప్పుడు భారతదేశానికి చెందిన మరో బిలియనీర్ కుటుంబం సింఘానియా  నివాసగృహం వెలుగులోకి వచ్చింది.   j.k కంపెనీ అధినేత విలాసవంతమైన, ఆధునిక హంగులు ఉన్న ఇంటిని నిర్మించుకున్నారు.  భారతీయ వ్యాపార సంస్థలలో అతి పెద్దదైన  jk పరిశ్రమల పేరుతో నిర్మించిన ఈ ఇల్లు అంటీలియా తర్వాత అత్యంత ఖరీదైన గృహంగా రికార్డు సొంతం చేసుకుంది.   16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిలో ఐదు ఫ్లోర్ల వరకు కార్ల పార్కింగ్ కోసమే వినియోగిస్తున్నారు.  పట్టణంలో ఉన్న ఉత్తమ కార్లను పార్క్ చేయడానికి మాత్రమే ఐదు ఫ్లోర్ల స్థలం ఉపయోగిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు.. ఈ ఇల్లు, ఇంటిలోని వారు ఎంత రిచో.. మిగతా అంతస్తుల్లో  స్పా, స్విమింగ్ ఫూల్, జిమ్ వంటి వసతులతో పాటు  ఎంటర్ టైన్ మెంట్ కోసం ప్రత్యేక స్థలం ఉంది. అంతేకాదు సొంత హెలిప్యాడ్ కూడా ఉన్నాయి. జెకే సంస్థకు గౌతమ్ సింఘానియా, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్.  ఈ సంస్థ  రేమండ్ గ్రూప్ గా ప్రసిద్ధి చెందింది. ఆయనకు  ఫాస్ట్ కార్లు,  ఆధునిక పడవలు,  లగ్జరీ రివేట్ జెట్‌లపై అమితమైన ఆసక్తి.  ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ ఖరీదైన భవనం విలువ  సుమారు 6000 కోట్ల రూపాయలు ఈ ఖరీదైన గృహం  అంటిలియా తరువాత భారతదేశంలో రెండవ ఎత్తైన ప్రైవేట్ భవనం. అడోబ్, అనిల్ అంబానీ ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో ఉన్న అనిల్ అంబానీ ఇల్లు భారతదేశంలో అత్యంత ఖరీదైన  గృహాలలో ఒకటిగా  చెప్పవచ్చు. ఈ  ఎత్తైన భవనం ఫాన్సీ హెలిప్యాడ్ వంటి అత్యంత ఆధునిక సదుపాయాలతో నిర్మించారు.  ఈ భవనం 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ,  దాదాపు 70 మీటర్ల ఎత్తులో ఉంది.  ఈ విలాసవంతమైన ఇంటి విలువ సుమారు 5000 కోట్ల రూపాయలకు పైగా ఉంది.  అయితే ఈ విలాసవంతమైన భవనంలో నివసించే అనిల్ అంబానీ  జీవనశైలి మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది.  మన్నాట్, షారుఖ్ ఖాన్ ముంబయిలో ఉన్న మరో ఖరీదైన భవనం మన్నాట్. ఈ భవనం వార్తల్లోకి రావడానికి కారణం ఈ ఇంటి యజమాని ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ కావడం.  ఈ భవనం పై నుంచి  అరేబియా సముద్రం అందాలను వీక్షించే సదుపాయం ఉంది.  ఇది ముంబైలోని బాంద్రాలోని బ్యాండ్‌స్టాండ్ వద్ద ఉంది.  గ్రామీణ ప్రాంతంలోని ఇంటి సగటు పరిమాణం 497 చదరపు అడుగులు, ఇది వ్యక్తికి 103 చదరపు అడుగులు. అయితే మన్నాట్ లో మాత్రం సుమారు 225 మంది  నివసించవచ్చు. షారూఖ్ డ్రీమ్ హోమ్ అయిన ఈ భవనం ప్రపంచంలోని ఖరీదైన  గృహాల జాబితాలో 10 వ స్థానంలో ఉంది.  13.32 కోట్లతో షారూఖ్ ఈ ఇంటిని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దాని  విలువ 200 కోట్ల రూపాయలు.  స్కై హౌస్, విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా   పెంట్ హౌస్ ఖరీదైన గృహాల జాబితాలో చోటు సాధించింది.  40,000 చదరపు అడుగుల స్థలంలో తన డ్రీమ్ హౌస్ ను  విజయ్ మాల్యా  నిర్మించుకున్నారు.  35 అంతస్తుల ఎత్తైన భవనంపై నిర్మించిన పెంట్ హౌస్ ఇది.   బెంగళూరు సిటీ నడిబొడ్డున ఉన్న ఈ భవనాన్ని కింగ్‌ఫిషర్ టవర్స్ -  నివాసం అంటారు. ఎత్తైన టవర్ల పైభాగంలో  నిర్మించిన ఆకాశ హర్మ్యం ఇది. దీన్ని  మాల్యా  వైట్ హౌస్, స్కై హౌస్ గా కూడా పిలుస్తారు.  ఎత్తైన టవర్ల పై స్విమింగ్ ఫూల్,  వైన్ సెల్లార్,  సెలూన్ , స్పా, జిమ్ తో పాటు అనేక ఇతర విలాసవంతమైన  సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. హెలిప్యాడ్ కూడా తప్పనిసరిగా ఉంటుంది. వాస్తవానికి పెంట్ హౌస్ లా కనిపించినప్పటికీ ఇది  ఒక పెంట్ హౌస్ కాదు, ఇది విల్లా కన్నా ఎక్కువ.  స్కై హౌస్ విలువ గతంలో   135 కోట్ల రూపాయలు. ఇప్పుడు విలువ 150 కోట్ల రూపాయలు.
తేనెటీగలు అనగానే శ్రమ గుర్తుకువస్తుంది. చిటికెడు తేనె కోసం వందలాది తేనెటీగలు పడే కష్టం గుర్తుకువస్తుంది. కానీ తేనెటీగలు అంతకు మించిన పాఠాలెన్నింటినో నేర్పుతాయంటున్నారు. జీవితానికి ఉపయోగపడే సూచనలు ఎన్నింటినో ఇస్తాయని చెబుతున్నారు. వాటిలో కొన్ని...   కలిసికట్టుగా శ్రమ విభజన గురించి చెప్పుకోవాలంటే తేనెటీగల గురించే చెప్పుకోవాలి. తేనెపట్టుని నిర్మించడం దగ్గర నుంచీ, అందులో భద్రపరచిన తేనెని రక్షించుకోవడం వరకూ... ప్రతీ తేనెటీగా తనదైన బాధ్యతను నిర్వర్తిస్తుంది. ఇది ఎక్కువ పని, ఇది తక్కువ పని అని తేనెటీగలు చూసుకోవు. తాము ఉన్న జట్టుకి మేలు జరగడమే వాటి ఆశయంగా ఉంటుంది.   పరిస్థితులకు అనుకూలంగా తేనెటీగల పని తేనెని సేకరించి భద్రపరచుకోవడమే కావచ్చు. అలాగని అవి కేవలం దట్టమైన అడవులలో మాత్రమే నివాసాన్ని ఏర్పరుచుకోవు. ఫలానా పూల దగ్గర తేనె ఎక్కువగా దొరుకుతుంది కదా అని అక్కడే తచ్చాడవు. ఏదో ఒక చోట తేనెపట్టుని ఏర్పరుచుకోవడం. అందులోకి తేనెని నింపేందుకు దూరదూరాల వరకూ తిరిగిరావడం... ఇదే వాటి పనిగా ఉంటుంది!   ప్రకృతికి సాయం తేనెటీగలు తేనెని తీసుకోవడమే కాదు... అవి వాలిన పువ్వుల మీద ఉన్న పుప్పొడిని మరో మొక్క దగ్గరకు చేరవేస్తాయి. అలా పరాగసంపర్కానికి (pollination) దోహదపడతాయి. మనం తినే ఆహారంలో దాదాపు మూడో వంతు ఇలా pollination వల్లనే ఉత్పత్తి జరుగుతుందన్న విషయం మీకు తెలుసా! అలా తను ప్రకృతి మీద ఆధారపడుతూ, తిరిగి ఆ ప్రకృతికి ఎంతో కొంత ఉపకారం చేస్తూ జీవించేస్తుంటాయి తేనెటీగలు.   జ్ఞానాన్ని సంపాదించడం తేనెటీగలు తేనె కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. ఓ రెండు చుక్కల కోసం ఎన్ని పూలనైనా చేరుకుంటాయి. జ్ఞానం కోసం తపించే వ్యక్తి కూడా జ్ఞానం ఉంటే అక్కడికి చేరుకోవాలని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలా కాకుండా అహంకారంతో మంకుపట్టు పట్టి నాలుగు గోడల మధ్యే ఉండిపోతే జీవితం నూతిలో కప్పలాగా నిరర్థకమైపోతుంది.   ఆత్మరక్షణకు సాటిలేదు తేనెటీగలు వాటంతట అవి ఎవరి జోలికి వెళ్లి దాడి చేయవు. కానీ తేనెపట్టుని కదిపితే మాత్రం వాటిని ఎదుర్కోవడం మానవుడి తరం కూడా కాదు. మరీ తేనెటీగలలాగా వేటాడి వెంటాడి దాడి చేయనవసరం లేదు కానీ, అనవసరంగా తమ జోలికి రావద్దన్న హెచ్చరికను మాత్రం శత్రువులకు అందించాల్సి ఉంటుంది. - నిర్జర.  
నిద్రే కదా ఏముందిలే అనుకుంటే పొరపాటే. చక్కటి ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యమట. నిద్రకు కోపానికి దగ్గరి సంబంధం ఉందట.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=aBxjhGIQdP4  
మకో రోబోటిక్ ఆర్మడ్ అసిస్టెడ్ సర్జరీతో కీళ్ళమార్పిడి సులభంగా లుధియానా వైద్యుల అవిష్క రణ. కీళ్ళమార్పిడి మకో రోబోటిక్ ఆర్మ్ అసిస్టేడ్ టెక్నాలజీతో సర్జరీ పద్దతిని లుధియానాలోని హ్యుజన్ ఆసుపత్రి అదునతన విధానాన్ని కనుకున్నది . రోబోట్ ఆర్మ్ ఆసిస్టేడ్ విధానంలో సర్జన్లు లేకుండానే  కీళ్ళమార్పిడి శాస్త్ర చికిత్స చేయవచ్చని ఈ విధానంలో ఊహించినదానికన్నా ఎక్కువ సమయంలోనే సమర్దవంతంగా సర్జరీలు నిర్వహించినట్లు లుదియానకు చెందిన వైద్యులు విజయం సాధించారు. మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్ స్టెద్ విధానంతో లుధియానా ఆసుపత్రి వైద్యరంగంలో  మైలురాయిని అధిగమించినట్లయ్యింది. కీళ్ళమార్పిడి పద్దతిలో అదునాతాన సాంకేతికతను వినియోగించిన  ఉత్తరాదిలో మొట్టమొదటి ఆసుపత్రిగా పేరుగాంచింది. మాకో రోబో టిక్ ఆర్మ్ అసిస్టేడ్  విధానాన్ని ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎఫ్ డి ఎ  సైతం అనుమతించింది. స్ట్రైకర్ ఇండియా హ్యుంజన్ ఆసుపత్రి సంయుక్తంగా విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో ఈ విషయం వెల్లడించారు. శాస్త్రీయ సంప్రదాయ సర్జరీలకన్న భిన్నంగా ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  కీళ్ళ నొప్పులు , కీలు అరిగిపోయిన వారికీ చేసే కీళ్ళ మార్పిడికి మాకో రోబో ఆర్మ్ ఆసిస్టెడ్ సర్జరీ ఒకరకమని స్ట్రైకర్ ఇండియా వైస్ ప్రెసిడెంట్  మీనాక్షి  నేవతియా అన్నారు. భవిష్యత్తులో హ్యుజన్ ఆసుపత్రితో కలిసి మరిన్నికొత్త పద్దతులు అమలు చేస్తామని ఆమె చెప్పారు. రోగులకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని మీనాక్షి పేర్కొన్నారు. రోగుల అవసరాలను తీర్చగలిగినందుకు ఆనందంగా ఉందని ఆమె హార్షం వ్యక్తం చేసారు. లుదియానాకు చెందిన హ్యుజన్ ఆసుపత్రి డైరెక్టర్ నీరీప్లేస్మేంట్ సర్జన్ డాక్టర్ బి ఎస్  హ్యుజన్  మాట్లాడుతూ సంప్రదాయ శస్త్ర చికిత్స లకు ఒక సవాల్ వంటిదని ఆయన అన్నారు. ఇందులో సర్జన్ ప్రతిభ ఆధారపది ఉంటుందని అన్నారు. పాత పద్దతిలో బోన్స్  ను ప్రతిసారీ కోయాల్సి వచ్చేదని కొత్తగా వచ్చిన రోబోటిక్ సర్జరీ ప్రోత్సాహాన్ని ఇచ్చిందని అన్నారు. ఎనిమిది మంది పైజరిపిన శస్త్ర చికిత్స  మంచి ఫలితాలు ఇచ్చిందని అన్నారు. సర్జరీకి ముందుగానే ఆ పేషంట్ల గురించి అవగాహన ఉండడం వల్ల  తక్కువ కోతలు ఉండవచ్చని సాఫ్ట్ టి ష్యు డేమేజ్ కాకుండా నివారించవచ్చని ఎముకను కాపాడవచ్చని హ్యుజన్ వివరించారు. హ్యుజన్ ఆసుపత్రి ఆర్తో కన్సల్టెంట్  జైవీర్ హ్యుజాన్ మాట్లాడుతూ అధునాతన రోబోటిక్ ఆర్మ్ అసిస్టెడ్  టెక్నాలజీతో రోగుల జీవన ప్రమాణాలు పెంచవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పద్దతిలో రోగులకు మరిన్ని లాభాలున్నాయని అన్నారు. అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ విధానం అమలు చేస్తామని జైవీర్ తెలిపారు. ఒక్కోక్కరిలో బోన్స్ అనాటమీ వేరువేరుగా ఉంటుందని కీళ్ళ మార్పిడి లేదా హిప్ సర్జరీ చేయడంలో మాకో రోబోటిక్ సర్జరీలో త్రీ డి మోడల్ గుర్తించేందుకు సి డి స్కాన్ ఆధారంగా వర్చువల్ సర్గికల్ ప్రొసీజర్ అమలుచేస్తామని జైవీర్ తెలిపారు. ఇందుకోసం 1౦౦౦ మాకో సిస్టంలో 35,౦౦౦ పద్దతులు ఇప్పటిక్ పరిశీలించమని   మాకో రోబోటిక్ ఆర్మ్ ఆసిస్టెడ్ సాంకేతికత క్లినికల్ గా నిరూపించామన్నారు.
  కూరగాయలలో అందరూ ఇష్టపడి అన్నిటిలోనూ వాడుకునే తియ్యటి క్యారెట్ లో ఉన్నన్ని గుణాలు మరే కూరగాయలలోను కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. మన దైనందిన ఆహారపు అలవాట్లలలో క్యారెట్ ను బాగా ఉపయోగించుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. క్యారెట్ వాడకం  ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో ఉపయోగ పడుతుందని  వైద్యులు చెబుతారు. ఈ క్యారెట్‌లోనున్న గుణాలు మరెందులోను ఉండవంటున్నారు వైద్యులు.   సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండితే మాత్రం ఇష్టపడరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందులోని అధిక క్యాలరీలు పిల్లలు శారీరకంగా, మానసికంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యారెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపంలోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకున్నట్లయితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లభిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.   క్యారెట్ వినియోగం వల్ల హైపర్ టెన్షన్ ను మ్యానేజ్ చేయవచ్చు. క్యారెట్స్ లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. అదే కాకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు సహాయపడుతూ బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి క్యారెట్ సహాయపడుతుంది. మన శరీరంలోని రోగ నిరోధక శక్తిని కాపాడటంలో ప్రముఖ పాత్ర వహించే ఈ క్యారెట్ ను ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే మనం మన అనారోగ్య సమస్యల నుండి అంత త్వరగా బయట పడవచ్చు..
శాఖాహరం తీసుకుంటేనే మనిషి కొన్నాళ్ళు అయినా భూమిపై మనుగడ అని ప్రముఖ శాస్త్రజ్ఞుడు ఆల్ల్బెర్ట్ ఐన్స్టైన్ అన్నారు. అలా ఉండాలంటే మనం ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం. సహజంగా కాయగూరలు, పళ్ళు, చిక్కుళ్ళు, బంగాళా దుంపలు, తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు, మూలికలు మసాలాలు, నెయ్యి, మజ్జిగ, రిఫైండ్ చేయని నూనెలు తీసుకోవాలి.                             కూరాగాయాలలో:  తాజా కూరగాయాలు, ఆకూ కూరలు, తదితరాలు.  పళ్ళలో:  నారింజ,అనాస పండు, ద్రాక్ష పళ్ళు, డేట్స్, అత్తి పండ్లు, పుచ్చ కాయ.  చిక్కుళ్ళు:  బీన్స్, పచ్చి బటానీ, కాయ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, కోడి గుడ్లు తదితరాలు. దుంపలు: బీట్ రూట్, క్యారెట్, బంగాళదుంపలు, కలోకాసియా తదితరాలు. తృణ ధాన్యాలు: మిల్లెట్స్, ఫొక్ష్ టైల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, బర్న్ యార్డ్ మిల్లెట్, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ తదితర ధాన్యాలు. పాల పదార్ధాలు: నెయ్యి, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ.   మూలికలు, సుగంధ ద్రవ్యాలు: తులసి, పుదీనా, పసుపు, జీల కర్ర, జాజి కాయ, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, వెల్లుల్లి తదితరాలు. కొవ్వు పదార్ధాలు: రీఫైండ్ చెయ్యని నూనెలు, నువ్వుల నూనె, పొద్దు తిరుగుడు పువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆవ నూనె తదితరాలు.  మన రోటీన్ జీవితంలో సరైన సమయంలో సమతౌల్యమైన ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు.