Home

»

Latest News

ఓట్లు వెయ్యడానికి కూడా ఇలా వెళ్ళలేదు కదా!

Aug 28, 2026 10:36AM

 

మాస్ మహారాజా రవితేజ, మైత్రి మూవీ మేకర్స్, శివ నిర్వాణ ఏ ముహూర్తాన ఇరుముడిని స్టార్ట్ చేసారో గాని, వరల్డ్ వైడ్ గా ఉన్న తెలుగు ప్రేక్షకులు తమ పనులన్నీ పక్కన పెట్టి ఇరుముడికి క్యూ కడుతున్నారు. ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు కూడా ఇంత పెద్ద సంఖ్యలో జనం బయటకు రావడం చూడలేదేమో అనే రీతిలో ఏ, బి, సి సెంటర్లు అనే తేడా లేకుండా తాండోపతండాలుగా తరలివెళ్తున్నారు. దీంతో  బాక్సాఫీస్ చరిత్రలోనే ఇదొక అరుదైన దృశ్యంగా నిలుస్తోంది. 


 సార్వత్రిక ఎన్నికల రోజున  కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు ఖాళీగా కనిపించడం గమనిస్తూనే ఉంటాం. కానీ 'ఇరుముడి' సినిమా ప్రదర్శితమవుతున్న మల్టీప్లెక్స్‌ల నుండి మొదలుకొని పల్లెటూళ్లలోని సింగిల్ స్క్రీన్స్ వరకు అన్ని థియేటర్ల ముందు జనాలు నిండిపోయి క్యూ లైన్లలో నిలబడుతున్నారు. ఎవర్ గ్రీన్ ఆణిముత్యం లవకుశ తో కూడా ఇరుముడిని పోలుస్తున్నారంటే ప్రేక్షకుల ప్రేమ సునామీని అర్ధం చేసుకోవచ్చు. చాలా గ్యాప్ తర్వాత ఫ్యామిలీస్ తో నైట్ సెకండ్ షోస్ హౌస్ ఫుల్స్ తో కలకాలాడుతూ ఉండటం ఇరుముడి రూపంలో తెలుగు సినిమా అందుకున్న గౌరవం. 

Also Read: నారాయణ కోసం భావోద్వేగంతో మహాప్రస్థానానికి చిరంజీవి.. పది రోజుల క్రితమే కలిస్తే 

ముఖ్యంగా సినిమా పని మామూలుగానే అయిపోయింది, పైగా ఓటిటి రాకతో మరింత దారుణంగా తయారయ్యిందనుకునే వాళ్లకయితే ఇరుముడి విజయం మూర్ఛవచ్చినంత పని చేసింది. ఆ తర్వాత సినిమాని తక్కువ చేసినందుకు చెంపలేసుకుంటున్నారు. ఇరుముడి 150 కోట్ల క్లబ్ లోకి  అతి త్వరలోనే చేరబోతుంది.


Irumudi, Raviteja,TeluguCinema, TeluguCinema News, TeluguOneDotCom, Tollywood

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com