Home

»

Latest News

ప్రముఖ నటుడు బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్. . కమిట్ మెంట్ పై సరికొత్త వాదన  

Aug 27, 2026 7:19PM

 

బండి సరోజ్ కుమార్.. సరికొత్త నటనకి కేర్ ఆఫ్ అడ్రస్.. మంచి అవకాశాలు వస్తే తెలుగు సినిమాపై తనదైన ముద్రవేయడం గ్యారంటీ. కానీ హిట్ సినిమా పడటం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసే వ్యాఖ్యలు,  పోస్టులు వైరల్ గా మారడం ఆనవాయితీగా మారింది.  తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా  ఆయన చేసిన ఒక సంచలన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది. 


సినీ రంగంలో ప్రతిభ లేని వ్యక్తులే కమిట్‌మెంట్లు, ఎఫైర్లు లాంటి  అడ్డదారులని  ఎంచుకుంటారు. అవకాశాల పేరుతో జరిగే ఈ వ్యవహారాల వెనుక ఉన్న అసలు కోణాన్ని ఎవరూ చూడటం లేదు. మగవాళ్లతో ఆడవాళ్లు సమానం అని బిగ్గరగా వాదించే ఫెమినిస్టులు, అవకాశాలు ఇస్తామంటే పడుకున్నాం, మమ్మల్ని దారుణంగా వాడుకున్నారని చెప్పే మాటలను అసలు ఎలా సమర్థిస్తారు?" ."నువ్వే నీ బ్రతుకుదెరువు కోసం అవతలివాడిని వాడుకున్నావ్ అనే కోణంలో ఈ ఫెమినిస్టులు ఎందుకు ఆలోచించరు?. ఇండస్ట్రీలోకి వచ్చే ఎక్కువమంది మగవారిలో అమ్మాయిల కోసం వచ్చే చిల్లరగాళ్లే ఉంటారు. అదే సమయంలో అమ్మాయిలలో కూడా అలాంటి వాళ్లే ఉంటారు  . వీళ్లంతా సమాజానికి పరాన్నజీవులు (పారాసైట్స్) , సొంతంగా ఏ రకమైన కళాత్మక ప్రతిభా లేనివాళ్లు మాత్రమే ఇలాంటి ఎఫైర్లు, కమిట్‌మెంట్లకు పాల్పడతారు. నిజమైన ప్రొఫెషనల్ ఫిలిం మేకర్స్ ఎప్పుడూ ఇలాంటి నీచమైన పనులకి పాల్పడతారు. ఇలాంటి వ్యక్తులు చేసే సినిమాలు థియేటర్లకు వచ్చినట్టు కానీ, పోయినట్టు కానీ ఎవరికీ తెలియ దు. ఇండస్ట్రీలో కొందరు పగ, ప్రతీకారంతోనే వ్యక్తిగత కేసులు పెడుతూ, పబ్లిసిటీ కోసం ఎదుటివారి ప్రతిష్టని నాశనం చేసి, కుటుంబాలని రోడ్డుపైకి ఈడుస్తున్నారు. కొత్తగా సక్సెస్ లోకి వచ్చి మెరుస్తున్న వారిని టార్గెట్ చేయడానికి రాబందుల్లా కాచుకుని కూర్చుంటారని  తన ట్వీట్ లో పేర్కొన్నాడు. 

Also Read: కొరియన్ కనకరాజు ఓటీటీ విడుదలపై క్రేజీ అప్‌డేట్!

Bandi Saroj Kumar, Tollywood, TeluguCinema,TeluguNews,TeluguCinemaNews, TeluguOneDotCom

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com