LATEST NEWS
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా.. వారికి కావాల్సినవాటిని ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టాయి.  కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగులను హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే.. వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'కోవిడ్ హోమ్ క్వారంటైన్ కిట్' ను ఏపీ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'హోమ్ ఐసోలేషన్ కిట్' ను తెలంగాణ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో 17 రోజులకు సరిపడే మెడిసిన్ ఉంటుంది.  అలాగే, మాస్కులు, శానిటైజర్లతో పాటుగా కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను గురించి వివరించే ఓ చిన్న బుక్ కూడా అందులో ఉంటుందట.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా.. వారికి కావాల్సినవాటిని ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టాయి.  కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగులను హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే.. వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'కోవిడ్ హోమ్ క్వారంటైన్ కిట్' ను ఏపీ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'హోమ్ ఐసోలేషన్ కిట్' ను తెలంగాణ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో 17 రోజులకు సరిపడే మెడిసిన్ ఉంటుంది.  అలాగే, మాస్కులు, శానిటైజర్లతో పాటుగా కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను గురించి వివరించే ఓ చిన్న బుక్ కూడా అందులో ఉంటుందట.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్ లో ఉన్నవారు బయటకు రాకుండా.. వారికి కావాల్సినవాటిని ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టాయి.  కరోనా తీవ్రత తక్కువగా ఉన్న రోగులను హోమ్ క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, హోం క్వారంటైన్ లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే.. వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'కోవిడ్ హోమ్ క్వారంటైన్ కిట్' ను ఏపీ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్ లు, గ్లౌజ్ లు, ఆక్సీమీటర్ ఉంటాయి. హోం క్వారంటైన్ లో ఉన్న వారికి 'హోమ్ ఐసోలేషన్ కిట్' ను తెలంగాణ ప్రభుత్వం పంపించనుంది. ఈ కిట్ లో 17 రోజులకు సరిపడే మెడిసిన్ ఉంటుంది.  అలాగే, మాస్కులు, శానిటైజర్లతో పాటుగా కరోనా పాజిటివ్ వచ్చిన సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను గురించి వివరించే ఓ చిన్న బుక్ కూడా అందులో ఉంటుందట.
విఫలమైన అగ్రదేశాల అధినేతలు ప్రపంచవ్యాప్తంగా అన్నీ దేశాలను అతలాకుతలం చేసింది కోవిద్ 19 వైరస్. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి అత్యంత ఆధునిక దేశాలుగా ప్రపంచపటంలో గుర్తింపు పొందిన దేశాలు ప్రాణభయంతో పరుగులు పెట్టేలా చేస్తోంది. అగ్రదేశాల్లో మరణమృదంగం మోగిస్తోంది. అత్యంత ఎక్కువగా ప్రభావితమైన దేశాలను, అతి తక్కువ సమయంలో కోవిద్ 19ను అదుపు చేసిన దేశాలను పరిశీలిస్తే ఒక వాస్తవం స్పష్టమవుతోంది. కోవిద్ 19 బారిన పడుతున్న వారిలో మగవారి సంఖ్యనే ఎక్కువగా ఉన్నది ఒక సర్వే . అంతేకాదు పురుషాహంకార అధిపత్యధోరణి కనబరిచే వారి ఎలుబడిలో ఉన్న దేశాల్లో ఉగ్రరూపం దాల్చింది.  కోవిద్ 19ను అరికట్టడంలో విఫలమైన ఏడు దేశాలు.. ఆ దేశాల అధ్యక్ష, ప్రధానులు గమనిస్తే ఈ విషయం మరింత స్పష్టం అవుతుంది. కరోనా విజృంభణలో అమెరికాదే ప్రథమ స్థానం. ఆ దేశంలో కోవిద్ 19 కేసుల సంఖ్య మూడున్నర లక్షలకు చేరువలో ఉంది. మరణాల సంఖ్య1,36,671. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధిపత్యభావజాలం ప్రపంచ ప్రజలకు సుపరిచితమే. రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్ లో ఈ వైరస్ వ్యాప్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ ప్రధాని జైర్ బోల్సోనారో కోవిడ్ బారిన పడ్డారంటే అక్కడ నియంత్రణ చర్యలు ఏ మేరకు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  బ్రెజిల్లో కరోనా కోరల్లో చిక్కిన వారి సంఖ్య  1,804,338 అయితే మరణించిన వారి సంఖ్య 70,524. మాస్క్ కూడా ధరించను అంటూ నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన బోల్పోనారో అందుకు ప్రతిఫలంగా కోవిడ్ బారిన పడి క్వారంటైన్ లో ఉన్నారు. రాకెట్ వేగంతో మూడోస్థానంలోకి వచ్చిన మనదేశంలోనూ నిరంకుశ ధోరణిలో వ్యవహరించే దేశప్రధాని కనిపిస్తారు. ప్రజా సంక్షేమం కంటే కార్పోరేట్ సంస్థల ఖజానా నిండటమే ముఖ్యమన్న ధోరణితో వ్యవహరిస్తూ దేశంలో కరోనా కేసులు ఎనిమిది లక్షల 22వేలు దాటేలా చేశారు. మరణాలు 22వేలు దాటాయి. ప్రతిరోజూ వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నా సరైన వైద్యసదుపాయాలు అందించడంలో విఫలం అయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఆ దేశంలో కోవిద్ 19బారిన పడిన వారి సంఖ్య 713,936 ఉండగా పదివేలకు పైగా మరణాలు సంభవించాయి. పెరూ, చిలీ, స్పెయిన్, ఇటలీ దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ముంచుకొస్తున్న ముప్పును ఆయా దేశాల అధినేతలు సరైన అంచనా వేయలేకపోయారు. లక్షలాది మంది కరోనా బారిన పడేందుకు, వేలాది మంది ఈ వైరస్ కారణంగా మృత్యవాత పడేందుకు కారణమయ్యారు. విజృంభిస్తున్న కోవిడ్ 19ను సమర్థవంతగా ఎదుర్కొన్న దేశాలు మహిళాధినేతల పరిపాలనలో ఉండటం గమనించదగిన విషయం. విపత్కర పరిస్థితులను సరిగ్గా అంచన వేయగలగడం, ప్రజల ప్రాణాలుకు ముప్పు రాకుండా తగిన చర్యలు తీసుకోవడం ఇందుకు కారణం అని చెప్పవచ్చు. డెన్మార్క్ లోనూ కరోనా వ్యాప్తి చెందినప్పటికీ చాలా తక్కువ సమయంలో నియంత్రించారు. ఆ దేశ ప్రధాని మెట్టే ఫ్రెడెరిక్సెన్ ప్రజలందరికీ కోవిద్ వైరస్ పరీక్షల నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చాలా చోట్ల కోవిద్ 19 నెగిటివ్ రిపోర్ట్స్ చూయించిన వారికే అనుమతించారు. దాంతో కరోనాను కట్టడి చేయగలిగారు. ఆ దేశంలో 13,117 మంది ఈ వైరస్ బారిన పడగా 609 మంది మరణించారు. వైరస్ తమ దేశంలోకి రాకముందే వస్తే ఎలా ఎదుర్కోవాలో అన్న అంశంపై పటిష్టమైన విధానాన్ని రూపొందించారు ఐస్లాండ్ ప్రధాని కాట్రిన్ జాకోబ్స్డోట్టిర్. ఆమె తీసుకున్న ముందస్తు చర్యలతో ఆ దేశంలో ఒక కేసు కూడా నమోదు కాలేదు. దశలవారీగా లాక్ డౌన్ ఎత్తేయడంతో పాటు వైద్యపరీక్షలను పెంచుతూ కరోనా వ్యాప్తిని అరికట్టారు ఫిన్లాండ్ ప్రధాని సన్నా మారిన్. ఇప్పటికీ ఆ దేశంలో లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇప్పటి వరకు 7,279మంది కరోనా బారిన పడితే వారిలో 6,800మంది కోలుకున్నారు.  329మంది మరణించారు.   యూరప్ మొత్తంలో అత్యధిక పరీక్షలు నిర్వహించిన దేశం జర్మనీ. ఆ దేశ ప్రధాని ఏంజెలా మెర్కెల్ కోవిద్ వ్యాప్తి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ దేశంలో అధికంగా ఉన్న వృద్ధులకు వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఏప్రిల్ నుంచే దశలవారిగా లాక్ డౌన్ ఎత్తేశారు. దేశ జిడిపిలో 11శాతం ప్రజల ఆరోగ్యం కోసమే వినియోగిస్తారు. కరోనా బారిన పడిన వారి సంఖ్య లక్షల్లో ఉన్నా మరణాల రేటు ఎక్కువగా లేకుండా చర్యలు తీసుకున్నారు. న్యూజిలాండ్కు మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జాకిందా ఆర్డెర్స్ పరిపాలనా దక్షతను ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. 2017లో న్యూజిలాండ్ 40వ ప్రధానిగా పదవి చేప్పటిన ఆమె ఉగ్రదాడులను, ప్రకృతివైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. కరోనా వ్యాప్తిని ముందుగా గుర్తించారు. ఫిబ్రవరి 2న చైనా బయటి దేశంలో మొదటి కరోనా మరణం సంభవించిన అంశాన్ని గుర్తించి చైనా నుంచి వచ్చేవారిని అడ్డుకున్నారు. తమ దేశస్తులు వచ్చినా వారిని కచ్ఛితంగా క్వారంటైన్ లో ఉంచారు. జనాభా 80శాతం మంది ప్రభుత్వం నిబంధనలు వందశాతం పాటించేలా ప్రజలకు పరిస్థితులను వివరించారు. ఇప్పటివరకు 1,543 మంది కరోనా బారిన పడగా 1497మంది కోలుకున్నారు. 22మంది మరణించారు. కచ్ఛితమైన నిబంధనలతో నార్వేలో మార్చి 12 నుంచి పూర్తిగా లాక్ డౌన్ పాటించారు. నార్వేప్రధాని ఎర్నా సోల్బెర్గ్ తీసుకున్న కఠినమైన చర్యలే  ఆ దేశంలో కోవిద్ ను అరికట్టింది. ఫిబ్రవరి 27 తర్వాత  తమ దేశానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ లక్షణాలతో సంబంధం లేకుండా క్వారంటైన్ లో ఉంచారు. 8974 మంది కరోనా బారిన పడగా 252 మరణించారు. తాయ్ ఇవాన్-వెన్, తైవాన్ అధక్షురాలు తాయ్ ఇవాన్ వెన్ తీసుకున్న పటిష్టమైన నిర్ణయాలతో ఆ దేశంలో కరోనా వ్యాప్తిని నియంత్రించారు. 17ఏండ్ల కిందట సార్స్ ప్రబలినప్పుడు ఎదురైన తీవ్రమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కఠినమైన చర్యలు తీసుకున్నారు. జనవరి నుంచే చైనా నుంచి వచ్చేవారందరినీ క్యారంటైన్ చేశారు.  విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో మహిళలు తమ శక్తినే కాదు యుక్తి  ని ప్రదర్శిస్తారు అన్నది మరోసారి స్పష్టమైంది. ఆడవారికి అధికారం ఇవ్వడం అనవసరం అనుకునేవారు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను అదుపుచేసిన  ఈ మహిళానేతల గురించి తెలుసుకుని వారి అభిప్రాయాలు మార్చుకోవాలి.
భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ రావడానికి చాలా సమయం పడుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా కరోనా రోగులకు ఎమర్జెన్సీ సమయంలో వాడేందుకు ఇటోలిజుమాబ్ అనే ఇంజెక్షన్ కు అనుమతులు మంజూరు చేసింది. సొరియాసిస్ (psoriasis) అనే చర్మ వ్యాధిని తగ్గించేందుకు దీనిని ఇప్పటికే వాడుతున్నారు. ఐతే తాజాగా కరోనా పేషెంట్లపై ఈ మందును ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలుస్తోంది. బెంగళూరులోని బయోకాన్ ఇండియా లిమిటెడ్ ఈ మందును సొరియాసిస్ ట్రీట్ మెంట్ కోసం వాడేందుకు చాలా ఏళ్ల కిందట అనుమతి పొందింది. ఈ ఇటోలిజుమాబ్ అనే మందు చాలా పవర్‌ఫుల్. దీంతో కరోనా చాలా తీవ్రంగా ఉండి, ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషంట్లకు మాత్రమే దీన్ని ఇస్తారు. కరోనా వైరస్ అంతు చూసే యాంటీబాడీల ఉత్పత్తికి ఉపయోగపడే సైటోకిన్ల ను ఉత్పత్తి చేయడంలో ఇది బాగా పనిచేస్తోంది. ఎయిమ్స్‌కు చెందిన కొందరు నిపుణులు ఈ మందుతో చేసిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఐతే ఇది చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ మందును తీసుకోవాలనుకునేవారు ముందుగా తమ అంగీకారం తెలుపుతూ పేపర్‌పై సంతకం పెట్టాల్సి ఉంటుంది. ఈ ఇటోలిజుమాబ్‌ని మే నెలలో కరోనా ఉధృతంగా ఉన్న ముంబైలోని నాయిర్‌ హాస్పిటల్ వాడి చూసింది. వెంటిలేటర్‌తో ఉన్న ఇద్దరు రోగులకు ఇవ్వగా వాళ్లు కోలుకొన్నారు. ఈ మందు ఒక డోస్ ఇవ్వగానే రోగులు కోలుకుంటున్నారని ఐతే కొంత మందికి మాత్రం 3 డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని సమాచారం.
ALSO ON TELUGUONE N E W S
  పాన్ ఇండియా స్టార్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా న‌టిస్తోన్న 'రాధే శ్యామ్' మూవీ రికార్డుల‌ను ఇప్ప‌ట్నుంచే షురూ చేసింది. శుక్ర‌వారం వెల్ల‌డించిన ఆ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు సోష‌ల్ మీడియాలో అపూర్వ‌మైన స్పంద‌న ల‌భించింది. ట్విట్ట‌ర్ ప్లాట్‌ఫామ్‌పై టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఆ లుక్‌ తెలుగు సినిమాల్లో స‌రికొత్త రికార్డును సృష్టించింది. 24 గంట‌ల్లో 6.3 మిలియ‌న్ ట్వీట్స్‌తో అత్య‌ధిక ట్వీట్స్ సాధించిన రికార్డును సొంతం చేసుకుంది. ఇదివ‌ర‌కు మ‌హేశ్ మూవీ 'స‌ర్కారువారి పాట' 4.4 మిలియ‌న్ ట్వీట్స్‌తో సాధించిన రికార్డును అది బ‌ద్ద‌లు కొట్టింది. ప్ర‌భాస్ మేనియా ప్రేక్ష‌కుల్లో ఏ రీతిలో ఉందో ఇది తెలియ‌జేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు వివిధ భాష‌ల సినీ ప‌రిశ్ర‌మ‌ల వారు 'రాధే శ్యామ్' టీమ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేయ‌డంతో #RadheShyam హ్యాష్‌ట్యాగ్ స్వ‌ల్ప స‌మ‌యంలోనే ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. పైగా 'బాహుబ‌లి: ద బిగినింగ్' సినిమా విడుద‌లై జూలై 10 నాటికి ఐదేళ్ల పూర్త‌వ‌డం కూడా దానికి క‌లిసొచ్చింది. ఫ‌లితంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ హంగామా రోజంతా కొన‌సాగింది. లైక్స్‌, కామెంట్స్‌, రిట్వీట్స్‌, ఫొటోల షేరింగ్ వంటి వాటితో వాళ్లు చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఫ‌స్ట్ లుక్‌లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డే క‌నిపించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అది కాపీ లుక్ అంటూ స్పాయిల‌ర్లు ఎంత ప్ర‌య‌త్నించినా దాని హ‌వాను అడ్డుకోలేక‌పోయారు. గోపీకృష్ణా మూవీస్ బ్యాన‌ర్‌పై రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని టి సిరీస్‌, యువి క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "ఉన్నంత కాలం భూమి ఆకాశం, నిలిచేటి గాథే ఈ రాధే శ్యామ్" అంటూ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాధార‌ణంగా త‌న సినిమా గురించి ముందుగానే ఈ స్థాయి గొప్ప‌ల‌కు పోరు. కానీ అత‌ను చేసిన ట్వీట్‌లో 'రాధే శ్యామ్‌'పై అత‌నికున్న అంతులేని న‌మ్మ‌కం క‌నిపిస్తోంద‌ని చిత్ర బృందం అంటోంది. చూద్దాం.. రాధాకృష్ణ న‌మ్మ‌కం ఎంత‌గా నిజ‌మ‌వుతుందో!!
  పాన్ ఇండియా స్టార్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్ హీరోగా న‌టిస్తోన్న 'రాధే శ్యామ్' మూవీ రికార్డుల‌ను ఇప్ప‌ట్నుంచే షురూ చేసింది. శుక్ర‌వారం వెల్ల‌డించిన ఆ సినిమా ఫ‌స్ట్ లుక్‌కు సోష‌ల్ మీడియాలో అపూర్వ‌మైన స్పంద‌న ల‌భించింది. ట్విట్ట‌ర్ ప్లాట్‌ఫామ్‌పై టాప్ ట్రెండింగ్‌లో ఉన్న ఆ లుక్‌ తెలుగు సినిమాల్లో స‌రికొత్త రికార్డును సృష్టించింది. 24 గంట‌ల్లో 6.3 మిలియ‌న్ ట్వీట్స్‌తో అత్య‌ధిక ట్వీట్స్ సాధించిన రికార్డును సొంతం చేసుకుంది. ఇదివ‌ర‌కు మ‌హేశ్ మూవీ 'స‌ర్కారువారి పాట' 4.4 మిలియ‌న్ ట్వీట్స్‌తో సాధించిన రికార్డును అది బ‌ద్ద‌లు కొట్టింది. ప్ర‌భాస్ మేనియా ప్రేక్ష‌కుల్లో ఏ రీతిలో ఉందో ఇది తెలియ‌జేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు వివిధ భాష‌ల సినీ ప‌రిశ్ర‌మ‌ల వారు 'రాధే శ్యామ్' టీమ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేయ‌డంతో #RadheShyam హ్యాష్‌ట్యాగ్ స్వ‌ల్ప స‌మ‌యంలోనే ట్రెండింగ్‌లోకి వ‌చ్చేసింది. పైగా 'బాహుబ‌లి: ద బిగినింగ్' సినిమా విడుద‌లై జూలై 10 నాటికి ఐదేళ్ల పూర్త‌వ‌డం కూడా దానికి క‌లిసొచ్చింది. ఫ‌లితంగా ప్ర‌భాస్ ఫ్యాన్స్ హంగామా రోజంతా కొన‌సాగింది. లైక్స్‌, కామెంట్స్‌, రిట్వీట్స్‌, ఫొటోల షేరింగ్ వంటి వాటితో వాళ్లు చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఫ‌స్ట్ లుక్‌లో ప్ర‌భాస్‌, పూజా హెగ్డే క‌నిపించిన తీరు అంద‌రినీ ఆక‌ట్టుకుంది. అది కాపీ లుక్ అంటూ స్పాయిల‌ర్లు ఎంత ప్ర‌య‌త్నించినా దాని హ‌వాను అడ్డుకోలేక‌పోయారు. గోపీకృష్ణా మూవీస్ బ్యాన‌ర్‌పై రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు స‌మ‌ర్పిస్తోన్న ఈ చిత్రాన్ని టి సిరీస్‌, యువి క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "ఉన్నంత కాలం భూమి ఆకాశం, నిలిచేటి గాథే ఈ రాధే శ్యామ్" అంటూ డైరెక్ట‌ర్ రాధాకృష్ణ కుమార్ చేసిన ట్వీట్ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సాధార‌ణంగా త‌న సినిమా గురించి ముందుగానే ఈ స్థాయి గొప్ప‌ల‌కు పోరు. కానీ అత‌ను చేసిన ట్వీట్‌లో 'రాధే శ్యామ్‌'పై అత‌నికున్న అంతులేని న‌మ్మ‌కం క‌నిపిస్తోంద‌ని చిత్ర బృందం అంటోంది. చూద్దాం.. రాధాకృష్ణ న‌మ్మ‌కం ఎంత‌గా నిజ‌మ‌వుతుందో!!
అందం కంటే అభినయం పరంగా శ్రద్ధా శ్రీనాథ్ ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. 'జెర్సీ'లో నాని కి భార్య పాత్రలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతకుముందే కొంతమంది కన్నడ సినిమా 'యూటర్న్' చూసి... శ్రద్ధా శ్రీనాథ్ నటన గురించి గొప్పగా చెప్పారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు కూడా చేస్తోంది ఆమె. తమిళ్ హిట్ 'విక్రమ్ వేద'లో మాధవన్ భార్య పాత్రలో నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కి హోమ్లీ ఇమేజ్ వచ్చింది. అయితే... హాట్ ఇమేజ్ కోసం ఆమె ఆరాటపడుతోంది అని టాక్. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'కృష్ణ అండ్ హిజ్ లీల'లో శ్రద్ధా శ్రీనాథ్ బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ఎక్స్ పోజింగ్ చేయలేదు గానీ... దమ్ము కొడుతూ, మందు తాగే పాత్రలో నటించింది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పై అందాలను చూపిస్తూ ఫోటో పోస్ట్ చేసింది. హోమ్లీ ఇమేజ్, వైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో కొనసాగడానికి ఉపయోగపడవని ఆమెకు అర్థం అయిందట. ఇటీవల 'పెళ్ళయిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా?' అని ఆమె సోషల్ మీడియాలో ప్రశ్నించారు. తర్వాత తర్వాత హాట్ ఇమేజ్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేశారు. యంగ్ హీరోల పక్కన లవ్ స్టోరీస్ చేయడానికి హోమ్లీ ఇమేజ్ కంటే హాట్ ఇమేజ్ బెటర్ అని భావిస్తున్నారు ఏమో? సడన్ గా హాట్ ఫోటోలు పోస్ట్ చేయడానికి కారణం ఏమై ఉంటుందని డిస్కషన్స్ స్టార్ట్ అయింది.
'అర్జున్ రెడ్డి' ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యాడు. అంతకుముందు హీరోగా తొలి సినిమా 'పెళ్లి చూపులు'తోనూ మంచి విజయం అందుకొన్నాడు. ముఖ్యంగా తెలంగాణ యాసలో అతను చెప్పే డైలాగులు మిగతా హీరోలకు కాస్త భిన్నంగా అతడిని నిలబెట్టాయి. 'దొరసాని' సినిమాతో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అది. ప్రస్తుతం విజయ్ దేవరకొండను తెలంగాణ హీరోగా కొంత మంది చూస్తున్నారు.  తెలంగాణ ముద్ర ఆంధ్రాలో తమ సినిమా వసూళ్ల పై ప్రభావం చూపుతుంది అనుకున్నారో ఏమో... దాన్ని చెరిపేసుకునే ప్రయత్నం దేవరకొండ సోదరులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాకినాడ నేపథ్యంలో విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్' సినిమా చేశాడు. అందులో తెలంగాణ యాసలో కాకుండా తెలుగులో మామూలుగా మాట్లాడారు. 'గీత గోవిందం' సినిమా లోనూ తెలంగాణ యాస ఉండదు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ విషయానికి వస్తే... తెలంగాణ నేపథ్యంలో తొలి సినిమా చేసిన అతడు, ప్రస్తుతం గుంటూరు నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై v ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ 'మిడిల్ క్లాస్ మెలోడీస్'తో కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు పరిచయమవుతున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయింది. తెలంగాణ ప్రేక్షకులతో పాటు అటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం దేవరకొండ సోదరులు చేస్తుండడం అభినందనీయం. 
  సినిమాల్లో న‌టించాల‌నేది చాలామంది ఔత్సాహికుల క‌ల‌. దాని కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చి సినిమాల్లో చేరాల‌ని నానా పాట్లూ ప‌డుతుంటారు. అలాంటి వాళ్ల బ‌ల‌హీన‌త‌ను సొమ్ము చేసుకోవ‌డానికి త‌ర‌చూ మోస‌గాళ్లు ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు, హీరోల పేర్లు వాడుకొని, అమాయ‌కుల‌ను మోసం చేసి, డ‌బ్బు గుంజుతుంటారు. ఇటీవ‌ల ఇలాంటి ఘ‌ట‌న‌లు రెండు జ‌రిగాయి. సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ పేరును వాడుకొని కొంత‌మంది యువ‌కుల‌ను మోసం చేసిన ఉదంతం ఒక‌టి వెలుగులోకి రాగా, కొద్ది రోజుల క్రిత‌మే త‌న పేరును వాడుకొని జ‌నాల్ని మోసం చేస్తున్నారంటూ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి హైద‌రాబాద్ సైబ‌ర్‌క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. తాజాగా అలాంటి వ్య‌వ‌హార‌మే గీతా ఆర్ట్స్ పేరిట చోటు చేసుకుంది. అల్లు అర్జున్ త‌దుప‌రి సినిమాలో హీరోయిన్ రోల్ అవ‌కాశం అంటూ గీతా ఆర్ట్స్ పేరిట ఒక యువ‌కుడు ప‌లువురు అమ్మాయిల‌ను మోసం చేసి, డ‌బ్బు గుంజుతున్న‌ట్లు ఆ సంస్థ దృష్టికి వ‌చ్చింది. దాంతో వారు సైబ‌ర్‌క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ద‌ర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మోస‌గాడి కోసం వెతుకుతున్నారు. టాలీవుడ్‌లో ఈ త‌ర‌హా చీటింగ్ కేసులు పెరుగుతుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి మాయ‌గాళ్ల వ‌ల‌లో ప‌డొద్ద‌ని నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు యువ‌త‌ను కోరుతున్నారు. సినిమా అవ‌కాశాలు, ఆడిష‌న్స్‌కు సంబంధించి ఎప్పుడైనా ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌ను చూసినా, ఆయా నిర్మాణ సంస్థ‌ల అధికారిక సోష‌ల్ మీడియా అకౌంట్ల‌ను చెక్ చేయాల‌ని వారు సూచిస్తున్నారు.
  డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి ఎట్ట‌కేల‌కు త‌న క‌థ‌తో ఓ స్టార్ హీరోను క‌న్విన్స్ చేశాడు. అత‌ను డైరెక్ట్ చేసే త‌ర్వాతి సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టించ‌నున్నాడు. ఇటీవ‌లి కాలంలో ఇండ‌స్ట్రీలో ఇదో పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవ‌చ్చు. 'స‌రిలేరు నీకెవ్వ‌రు' త‌ర్వాత వంశీ డైరెక్ష‌న్‌లో చేయాల‌నుకున్నాడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌. అయితే వంశీ చెప్పిన ఫైన‌ల్ స్క్రిప్ట్ అత‌నికి న‌చ్చ‌లేదు. దానికి బ‌దులుగా ప‌ర‌శురామ్ 'స‌ర్కారువారి పాట' స్క్రిప్టుకు అత‌ను గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. దాంతో ఖంగుతిన్న వంశీ కొంత‌మంది స్టార్స్‌ను సంప్ర‌దించాడు. అయితే డేట్స్ ప్రాబ్లెమ్ వ‌ల్ల వాళ్లెవ‌రూ అత‌నితో ప‌నిచేయ‌డానికి ముందుకు రాలేదు. దాంతో అత‌ను లాభం లేద‌నుకొని ఆ స్క్రిప్టును ప‌క్క‌న‌పెట్టి, లాక్‌డౌన్ కాలంలో మ‌రో స్క్రిప్టు రాసుకున్నాడు. దాన్నిత‌న 'ఎవ‌డు' హీరో రామ్‌చ‌ర‌ణ్‌కు వినిపించాడు. 'ఆర్ ఆర్ ఆర్' త‌ర్వాత చేసే స‌రైన స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తోన్న చ‌ర‌ణ్‌కు అది బాగా న‌చ్చింద‌నీ, అందుకు ఓకే చెప్పాడ‌నీ వినిపిస్తోంది. అన్నీ అనుకూలిస్తే, 'ఆర్ ఆర్ ఆర్' త‌ర్వాత వంశీ డైరెక్ష‌న్‌లో చ‌ర‌ణ్ న‌టించే అవ‌కాశాలున్నాయి. ఈలోగా ఫాద‌ర్ చిరంజీవితో త‌ను నిర్మిస్తోన్న 'ఆచార్య' సినిమాలోని కీల‌క పాత్ర‌ను కూడా అత‌ను చేయ‌నున్నాడు. ఏదేమైనా 'మ‌హ‌ర్షి' వంటి కెరీర్ హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ సినిమా త‌ర్వాత ఖాళీగా ఉన్న వంశీ పైడిప‌ల్లికి ఊర‌ట ల‌భించిన‌ట్లే అంటున్నారు ఫిల్మ్‌న‌గ‌ర్ జ‌నాలు.
రేణు దేశాయ్ మల్టీ టాలెంటెడ్ పర్సన్. తెలుగులో 'బద్రి', 'జానీ' సినిమాల్లో కథానాయికగా నటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు కొన్నిటికి కాస్ట్యూమ్ డిజైనర్, ఎడిటర్ గా వర్క్ చేశారు. మరాఠీ సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ కూడా చేశారు. అయితే... తెలుగు సినిమా ప్రేక్షకుల్లో చాలామంది ఆమెను పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే చూస్తున్నారు. ఇది రేణు దేశాయ్ కి చికాకు తెప్పించే అంశమే. కానీ పవన్ ఎక్స్ వైఫ్ ట్యాగ్ భరించక తప్పడం లేదు.‌  పవన్ కళ్యాణ్ నుండి విడాకులు తీసుకున్న తర్వాత కొన్ని రోజులు రేణుదేశాయ్ ఒంటరిగా ఉన్నారు. తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు, నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఆమె నిర్ణయంపై పవన్ అభిమానులు కొంతమంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రోల్స్ వచ్చాయి. తర్వాత ఏమైందో తెలియదు... రేణు దేశాయ్ ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకు రాలేదు. మళ్లీ ఆమె పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది చాలామందిలో ఉన్న సందేహం. తాజాగా ఈ సందేహాలపై రేణుదేశాయ్ స్పందించారు. "ఎందుకో తెలియదు చాలా మందికి నా మారిటల్ స్టేటస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. నా పెళ్లి సమస్యలపై ఓ సినిమా తీయడానికి ట్రై చేస్తా. దానికి 'పెళ్లిగోల' అని టైటిల్ పెడతా" అని రేణుదేశాయ్ సరదాగా వ్యాఖ్యానించారు. నిజంగా సినిమా తీస్తే మాత్రం ఇది బంపర్ హిట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సందేశాత్మక కథలకు వాణిజ్య హంగులు అదే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆచార్య'. దీనికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ మూడు పాటలను రికార్డింగ్ చేశారు. ఇప్పటివరకూ కొరటాల చిత్రాలు అన్నిటికీ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. మెగాస్టార్ చెప్పడంతో మణిశర్మను తీసుకున్నారట‌. చిరంజీవి, మణి శర్మది హిట్ కాంబినేషన్. చిరంజీవి నటించిన బావగారూ బాగున్నారా, చూడాలని ఉంది, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, మృగరాజు, ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్ చిత్రాలకు మణిశర్మ మంచి బాణీలు ఇచ్చారు. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పదేళ్ల తర్వాత చిరంజీవి గారు చిత్రానికి, 'ఆచార్య'కు సంగీతం అందిస్తున్నానని మణిశర్మ చెప్పారు. "సినిమాలో మూడు పాటలు రికార్డింగ్ చేశా. మిగతా ట్యూన్స్ కూడా కంపోజ్ చేశా. రికార్డింగ్ చేసేలోగా కరోనా వచ్చింది. పనికి అంతరాయం ఏర్పడింది. సినిమాలో ఒక ఐటెం సాంగ్, ఇద్దరు హీరోల మీద ఒక సాంగ్, ఒక డ్యూయెట్, ఓ మెలోడీ, ఎమోషనల్ సాంగ్, మంచి డాన్స్ నెంబర్ ఉన్నాయి సన్నివేశాల పరంగా కొన్ని పాటలు వస్తాయి. పాటలన్నీ వేటికవే వైవిధ్యంగా ఉంటాయి‌. పాటల కంటే ఈ సినిమాలో నేపథ్య సంగీతానికి ఎంతో ప్రాధాన్యం ఉంది" అని మణి శర్మ తెలిపారు.
  సూర్య హీరోగా న‌టించే 40వ చిత్రాన్ని వెట్రిమార‌న్ డైరెక్ష‌న్‌లో నిర్మిస్తాన‌ని గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో పాపుల‌ర్ ప్రొడ్యూస‌ర్ క‌లైపులి ఎస్‌. థాను ప్ర‌క‌టించిన‌ప్పుడు సినిమా ప్రియులంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆ సినిమాకు 'వాడివాస‌ల్' అనే టైటిల్ ఖాయం చేశారు. ఇందులో సూర్య ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నాడు. అత‌ను తండ్రీకొడుకులుగా న‌టిస్తాడ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ మొద‌లైంది కూడా. కోలీవుడ్‌లో జ‌రుగుతున్న ప్ర‌చారం ప్ర‌కారం ఆ తండ్రీకొడుకులు జ‌ల్లిక‌ట్టు ఆట‌లో ప్ర‌వీణులుగా క‌నిపించ‌నున్నారు. జి.వి. ప్ర‌కాశ్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంపిక‌య్యాడు. ఈ సినిమాకు ప‌నిచేసే ఇత‌ర తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను చిత్ర బృందం ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఈ సంద‌ర్భంగా సూర్య ఇదివ‌ర‌కు తండ్రీ కొడుకులుగా గౌత‌మ్ మీన‌న్ సినిమా 'వార‌ణ‌మ్ ఆయిర‌మ్‌', విక్ర‌మ్ కుమార్ మూవీ '24'లో న‌టించిన విష‌యం ప్ర‌స్తావ‌నార్హం. 'వాడివాస‌ల్' మూవీకి అదే పేరుతో త‌మిళ ర‌చ‌యిత సిఎస్ చెల్ల‌ప్ప రాసిన న‌వ‌ల ఆధారమంటున్నారు. 2017లో ఆ న‌వ‌ల సినిమా హ‌క్కుల‌ను వెట్రిమార‌న్ పొందాడు. జ‌ల్లిక‌ట్టు ఆట నేప‌థ్యంలో ఆ న‌వ‌ల న‌డుస్తుంది.
  సెక్స్‌, న్యూడ్‌, క్రైమ్‌, పాలిటిక్స్‌.. ఇవీ రామ్‌గోపాల్ వ‌ర్మ ఇప్పుడు తీస్తున్న సినిమాల్లోని మెయిన్ ఎలిమెంట్స్‌. 'న‌గ్నం' అనే టైటిల్‌తోటే ఓ షార్ట్ ఫిలిమ్ తీసి త‌న ఆర్జీవీ థియేట‌ర్‌లో రిలీజ్ చేసి ఆయ‌న‌ సొమ్ము చేసుకొన్నాడు. దానికి ముందు ఆయ‌న తీసిన 'క్లైమాక్స్' మూవీ కూడా సెక్స్‌, న్యూడ్ ప్ర‌ధానంగా రూపొందిన‌దే. త‌న సినిమాల‌ను థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తుంటే జ‌నం ఆద‌రించ‌క‌పోవ‌డం, లాభాలు రాక‌పోతుండ‌టంతో, లాభం లేద‌ని ఆర్జీవీ థియేట‌ర్ అనే ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ను స్టార్ట్ చేశాడు. పైగా దీనివ‌ల్ల ఇంకో సౌల‌భ్యం కూడా ఉంది. అది.. సెన్సార్ స‌మ‌స్య లేక‌పోవ‌డం! 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌', 'క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌రెడ్లు' (త‌ర్వాత 'అమ్మ‌రాజ్యంలో క‌డ‌ప‌బిడ్డ‌లు'గా టైటిల్ మారింది) సినిమాల‌కు సెన్సార్ బోర్డుతో చిక్కులు రావ‌డంతో ఆ ఇబ్బందిలేని ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ను ఆయ‌న ఎంచుకున్నాడు. ఇప్పుడు మ‌రోసారి రాజ‌కీయాల‌పై దృష్టిపెట్టిన వ‌ర్మ‌.. లేటెస్ట్‌గా 'ప‌వ‌ర్‌స్టార్' అనే ఏటీటీ సినిమా తీస్తున్నాడు. త‌న‌దైన శైలిలో ఇది నిజ జీవితంలోని ఏ వ్య‌క్తి క‌థ కాద‌నీ, ఒక‌వేళ అలాంటి పోలిక‌లు క‌నిపిస్తే.. అది కేవ‌లం కాక‌తాళీయ‌మేన‌నీ అంటున్నా.. ఇది ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ఉద్దేశించి తీస్తున్న సినిమా అని చిన్న పిల్లాడికి కూడా తెలిసిపోతోంది. కాగా కొద్ది రోజులుగా ఈ సినిమాకు సంబంధించి ఆర్జీవీ త‌న సోష‌ల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తున్న ఫొటోలు క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఇప్ప‌టికే మెగాస్టార్ పోలిక‌లున్న క్యారెక్ట‌ర్ ఫొటోను రిలీజ్ చేసిన ఇప్పుడు ప‌వ‌ర్‌స్టార్ ఒక డైరెక్ట‌ర్‌ను కొడుతున్న ఫొటోను షేర్‌చేసి మ‌రింత క‌ల‌క‌లం రేపాడు. నాలుగేళ్ల క్రితం 'స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్' డైరెక్ట‌ర్ బాబీని ప‌వ‌న్ క‌ల్యాణ్ కొట్టాడంటూ ఆన్‌లైన్‌లో జోరుగా ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అందులో నిజం ఎంత ఉందో వాళ్ల‌కే తెలుసు. ఇప్పుడు ఆ విష‌యాన్ని గుర్తు చేసేలా వ‌ర్మ షేర్ చేసిన ఫొటోలున్నాయి. దీంతో నిజంగానే ఆ డైరెక్ట‌ర్‌ను ప‌వ‌ర్‌స్టార్ కొట్టాడా? అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్‌. "An angry heated moment between an actor and a director in POWER STAR" అంటూ త‌ను షేర్ చేసిన ఫొటోకు పోస్ట్ పెట్టాడు ఆర్జీవీ. ఏదేమైనా త‌ను అనుకున్న‌ది తీయ‌డం, అది నిజ జీవితంలో ఎవ‌రికైనా సంబంధించిన‌ట్లు క‌నిపిస్తే.. కేవ‌లం కాక‌తాళీయ‌మే త‌ప్ప‌, అందులో త‌న‌కు బాధ్య‌త లేద‌ని త‌ప్పించుకోవ‌డం ఆయ‌న నైజంగా మార‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ప‌వ‌ర్‌స్టార్‌తోనూ ఆయ‌న ఈ ఆటే ఆడుతున్నాడు.  
ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.   లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు. ఇప్పుడు ఏదైనా పొరపాటు చేసి క‌రోనా వ్యాప్తికి అవకాశం ఇస్తై భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం. కరోనా వ్యాప్తి అగిన తర్వతానే లాక్ డౌన్ ఎత్తేయాలి. కరోనా కట్టడికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. అభివృద్ది చెందిన దేశాలు సైతం కరోనా మహ్మమారిని ఎదుర్కోలేక కష్టాలు పడుతున్నాయ‌ని మంత్రి కెటి రామారావు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికి టెస్టులన్న అలోచన ఆచరణ సాద్యం కాదు. విచ్చలవిడి టెస్టులకు అనుమతిస్తే ప్రజల భయాందోళనల నేపధ్యంలో టెస్టు సెంటర్ల దోపిడీకి దారి తీస్తుంది. అవసరం అయిన వారీకీ టెస్టులు చేసే వీలుండని పరిస్ధితి ఏర్పడుతుంది. అందుకే విచ్చలవిడి టెస్టులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.     కరోనా ను ఎదుర్కోనేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్దంగాఉన్నది. అవసరం అయిన సౌకర్యాలు, వైద్యసామాగ్రిన సిద్దం చేసి ఉంచుతున్నాం. లాక్ డౌన్లో ఒక్క అకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నం. మద్యతరగతి, పేదల సమస్యలను పరిగణలోకి తీసుకుని పనిచేస్తున్నాం. పారిశ్రామిక వర్గాలు, కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామ‌ని మంత్రి కె.తారక రామారావు మీడియాతో మాట్లాడారు.     లాక్ డౌన్ పొడగించేందుకు సిద్దంగా ఉన్నామని ముఖ్యమంత్రి చెప్పారు. అమెరికా, యూరప్ లోని ఇటలీ, స్పెయిన్ లాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే లాక్ డౌన్, సామాజిక దూరం ఒక్కటే మార్గమని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. మూడు దశల్లో కరోనా వైరస్ ని ఎదుర్కోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని కెటిఆర్ అన్నారు.
* సఫాయన్న సేవకు చేతులెత్తి నమస్కరిస్తాడు  * బతుకుంటే బలుసాకైనా తినొచ్చంటడు  ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద రెండు రోజుల పాటు నిరంతరాయంగా సోషల్ మీడియా లో చర్చ..ఆయన నిరాఘాట, నిరుపమాన శబ్ద ప్రకటన మీద అన్ని సోషల్ మీడియా వేదికలు విస్మయం వ్యక్తం చేయటం... ఈ మధ్య కాలం లో ఎక్కడా చూడలేదు, వినలేదు కూడా.. సోషల్ మీడియా ను మోడీ మ్యానియా కమ్మేసిన వేళ, వాస్తవాల ప్రకటన తో, విస్తుపోయే నిజాలతో ఆయన విసిరిన మాటల మంత్రదండం ముందు చాలా మంది నాయకుల వాక్పటిమ వెలవెలపోయింది. ఎందుకంటే, ఆయన మాటల్లో నిజాయితీ ఉంది కాబట్టి, నిజముంది కాబట్టి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రులలో -టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్ టీ రామారావు ల తర్వాత, సామాన్యుడిని ఆకట్టుకునే నాయకత్వ పటిమను సాంతం సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిగా కె సి ఆర్ చరిత్ర సృష్టించారు. ఇది పొగడ్త కాదు, ప్రశంసా కాదు... సోషల్ మీడియా ఎనాలిసిస్.  సిబ్బందిని మోటివేట్ చేయడంలో, ప్రత్యర్థులకు వార్నింగ్ ఇవ్వడంలో, వినేవాళ్ళకి విసుగు రాకుండా మాట్లాడటంలో ఆయనకు పోటీ లేదు.... ఎదురు ఒక్క పేపర్ ఉండదు.., ఒక్క నోట్ ఉండదు.... తడబాటు ఉండదు... చెప్పాల్సింది సూటిగా, సుత్తి లేకుండా....జనానికి అర్థం అయ్యేలా....భరోసా ఇచ్చేలా....ఇంగ్లీష్, హిందీ, తెలుగు అన్ని భాషల్లో.... ఇంకో బైట్ అని అడిగే పని కూడా ఉండదు. అది ఆయన గొప్పతనం.. అది ఆయన దక్షత. ఇదేదో ఆయన్ను పొగిడే ప్రహసనం కాదు. కరోనా లాక్ డౌన్ విషయం లో మరో రెండు వారాలు కొనసాగించాలని కుండబద్దలు కొట్టిన కె సి ఆర్, బతికుంటే బలుసాకు తిందామంటూ చెప్పుకొచ్చిన తీరు, ఈ పదిహేను రోజుల్లో తెలంగాణ 435 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెపుతూనే, ప్రజల ప్రాణాల కాన ఆర్ధిక మాంద్యం తనకు లెక్క కాదని తేల్చిపారేశారు. ఈ 15 రోజుల్లో తెలంగాణ కు కేవలం రెండు కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అయినా కూడా జనాన్ని బతికుంచుకోవటమే తనకు ముఖ్యమని స్పష్టం చేసిన ఆయన నాయకత్వం దేశాన్ని ఆకట్టుకుంది. నరేంద్ర మోడీ వారాంతపు కార్యక్రమాలలో ఒవైసీ కి కనిపించిన ఎంటర్టైన్మెంట్, కె సి ఆర్ అనర్గళ ఉపన్యాసం లో కనిపించకపోవటానికి కారణం ఏమిటంటే, ఈయన జనం బాగు కోరుకుని లాక్ డౌన్ కొనసాగించాలని చెప్పటం. తాను మాట్లాడుతున్న అంశం మీద విపరీతమైన అధారిటీ, కాగితాలు చూసి చదివే అలవాటు ఏ మాత్రం లేని క్షుణ్ణమైన పరిజ్ఞానం, ఎదుటివాడు ప్రశ్నించటానికి ఏ మాత్రం అవకాశం ఇవ్వని కూలంకుష పరిశోధన కె సి ఆర్ కు పెట్టని ఆభరణాలు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయటానికి ఆయన వారి మీద ఎలాంటి ఒత్తిడీ చేయలేదు. ఉన్న వాస్తవాలను మాత్రమే అందరిముందూ పరిచారు. సామాన్యుడికి అర్ధమయ్యే భాషలో చెప్పారు.. ఈ సాహసోపేత కార్యక్రమంలో సేవలందిస్తున్న డాక్టర్లందరికీ, నర్సులు, పారిశుధ్య కార్మికులు అందరికీ మొక్కుతున్నానంటూ ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి కె సి ఆర్. కష్ట కాలంలో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని కె సి ఆర్ మోటివేట్ చేసిన తీరు తో దేశం యావత్తూ చకితమై చూసింది.  సోషల్ మీడియా అనలిటిక్స్ అంతా కూడా కె సి ఆర్ లోని వినూత్న కోణాన్ని తమకర్ధమైన భాషలో అనువదించే పనిలో బిజీ అయిపొయింది. ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక నవీన్ పట్నాయక్, ఒక మమతా  బెనర్జీ, ఒక అరవింద్ కేజ్రీ వాల్, ఒక  నితీష్ కుమార్..మీరందరూ కూడా అద్భుతంగా శ్రమిస్తూ ఉండవచ్చు గాక.. కానీ, ఒక కె సి ఆర్ దగ్గరున్న మోటివేషన్ టెక్నాలజీ మాత్రం మీ దగ్గర లేదనేది సోషల్ మీడియా ఎనాలిసిస్. అంతే కాదు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మీద సోషల్ మీడియా వేసిన సెటైర్ల పైన కూడా కె సి ఆర్ విరుచుకుపడటాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ విస్తారంగా చర్చించాయి. సంక్షోభ సమయం లో దేశ ప్రధాని కి దన్నుగా నిలబడటం ద్వారా కె సి ఆర్, సరైన రాజకీయ స్ఫూర్తిని ప్రదర్శించారని, సఫాయన్న నీకు సలామన్నా అంటూ వినమ్రపూర్వక విజ్ఞప్తి చేయటం ద్వారా జన హృదయాన్ని చూరగొన్నారని కూడా సోషల్ మీడియా వేదికలు ప్రశంసించాయి. భేష్ కె సి ఆర్.. మీ స్ఫూర్తి మా గుండెలకు ఊపిరినిచ్చింది. రేపటి మీద ఆశ చిగురింప చేసింది.
* ఐ సి యు లో ఉన్న టీ డీ పీ కి రోజూ ఆక్సిజన్ ఎక్కిస్తున్న వై ఎస్ ఆర్ సి పీ * నాయుడు అంతర్జాతీయ తీవ్రవాది అని తేల్చిన పేర్ని నాని * ఏజెంట్ పేర్ని నాని పరిశోధనలో బయటపడ్డ నాయుడు అంతర్రాష్ట్ర లింకులు పిచ్చ పీక్ కు వెళిపోతే, ఇలాంటి ఆరోపణలే చేస్తారు మరి. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు, ఉండాల్సిన కనీస మర్యాదను కరకట్ట దారిలో తొక్కేసి మరీ, కసిగా రాష్ట్ర రవాణా,సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి పేర్నినాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రం లో నిరుటి ఎన్నికల్లో పరువు కోల్పోయి, 23 సెగ్మెంట్స్ కు పరిమితమైన చంద్రబాబు నాయుడు, పార్టీ ఉనికి కోసం ఏదో తనదైన శైలిలో రోజు వారీ చేసే అనుగ్రహ భాషణాల్లో కూడా కుట్ర కోణాలు వెతికే పేర్ని నాని ని చూసి సోషల్ మీడియా జాలిపడుతోంది. ఐ సి యు లో ఉన్న తెలుగు దేశం పార్టీకి మూడు రాజధానుల ఇష్యూ తో తిరిగి ఆక్సిజన్ ఎక్కించిన పాలక వై ఎస్ ఆర్ సి పీ నాయకులు , తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పై ఒళ్ళు మరిచి చేస్తున్న విమర్శలూ, ఆరోపణలూ కూడా సోషల్ మీడియా కి కావాల్సినంత ఆహారం ఇస్తున్నాయి. ఈ కోవలోనే పేర్ని నాని సైంటిస్ట్, ఇంకా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవతారాలు ఎత్తారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు , ఎక్కడ, ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారనే మినిట్ to మినిట్ ప్రోగ్రాం వివరాలు తన దగ్గర ఉన్నాయంటూ విలేకర్ల సమావేశం లో వెల్లడించారు.  చంద్రబాబు పక్కరాష్ట్రం లో బతుకుతున్నారని కనుక్కున్న ఆయన, తన పరిశోధనలో చంద్రబాబుకు, అంతర్జాతీయ తీవ్రవాదులకు పెద్ద  తేడా కనిపించడం లేదనే విషయాన్ని కనుక్కున్నారు. చంద్రబాబు మనస్తత్త్వం చూస్తే అంతర్జాతీయ తీవ్రవాదిలా ఉన్నారన్న పేర్ని నాని, తన పరిశోధన లో వెల్లడైన మరిన్ని సంచలన విషాలను షేర్ చేశారు.  "తీవ్రవాదులు కూడా వేరే దేశంలో ఉంటూ ఇక్కడ బాంబులు పెడుతూ,రకరకాల వైరస్ లు పంపుతుంటారు. నాశనం కోరుకుంటారు. పాజిటివ్ కేసులు వచ్చినచోట్ల కూడా(రెడ్ జోన్లు) వైద్యులు,పారిశుధ్యకార్మికులు,రెవిన్యూ, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు వాలంటీర్లు వీరంతా చిరుద్యోగులు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారు.మిలటరీలో దేశాన్ని కాపాడటానికి ఏ విధంగా సైనికులు పోరాడుతున్నారో అదే విధంగా వారందరూ సేవలందిస్తున్నారు.విలేకరులను చూసైనా చంద్రబాబు సిగ్గుతెచ్చుకోవాలి.ఆర్దిక బాధలు దిగమింగి ప్రజలను అప్రమత్తం చేయడం లో, ప్రభుత్వసూచనలు ప్రజలకు చేరవేయడంలో ప్రజలను మేలుకొల్పుతూ వ్యాధిని అరికట్టడంలో విలేకరులు సేవలందిస్తున్నారు. మీడియా వారు సామాజిక బాధ్యతగా పనిచేస్తున్నారు. ఇంకా వ్యాధి ప్రబలుతుందని చంద్రబాబు చెబుతున్నారు.అంటే మీరు ఎవర్ని దెబ్బతీయదలుచుకున్నారు.ఎవరి ఆత్మస్దైర్యం దెబ్బతీస్తున్నారు.ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నవారిని వారి ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారా. కరోనా వ్యాధి వస్తుందనే ముందువరకు కూడా చాలా డిపార్ట్ మెంట్లను తిట్టుకునే పరిస్దితి నుంచి ఈరోజు ఆ యా డిపార్ట్ మెంట్లను,ఉద్యోగులను ప్రజలు నేడు వారి సేవలు చూసి వేనోళ్ల కొనియాడుతున్నారు. కరోనా లెక్కలు దాచామని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారు.చంద్రబాబు లెక్కలు చెబితే వారికి పరీక్షలు చేయిస్తాం," అని కూడా పేర్ని నాని సవాల్ చేశారు. ఆంధ్ర  రాష్ట్రంలో ఐదుకోట్ల మంది ఉంటే ఐదుకోట్ల మందికి పరీక్షలు చేస్తారా.ఎక్కడైతే వ్యాధిప్రబలుతుంటే అక్కడ పరీక్షలు చేస్తారు.14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన తనకు ఇవి తెలియవా, అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు.  దొంగలెక్కలు రాయడం చంద్రబాబుకే అలవాటు.దుర్మార్గమైన ఆలోచనలు చంద్రబాబు మానుకోవాలని సూచించిన పేర్ని నాని పరిశోధన లో తేలిన విషయాలేమిటంటే, చంద్రబాబు కు మానవత్వం లేదు.మానవీయకోణం లేవని. వేల సంఖ్యలో మరణాలు ఉన్నాయి కాని ప్రభుత్వం దాస్తుందనే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారంటే విలేకరులు వాస్తవాలు దాస్తున్నట్లుగా మాట్లాడుతున్నట్లేకదా అని కొత్త లాజిక్ ని కూడా పేర్ని నాని తీశారు. కరోనా సోకిందనే బాధ కంటే ఇలాంటి దిక్కుమాలిన వ్యక్తి మమ్మల్ని ఇన్నాళ్లు పాలించారా అని ప్రజలు బాధపడుతున్నారని కూడా పేర్ని నాని కనుగొన్నారు.  ఈ యుధ్ద వాతావరణంలోనే కాదు చంద్రబాబు పాలనలో రైతులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వకుండా, ధాన్యం కొని వారికి డబ్బులు చెల్లించకుండా, విత్తనాలు అందించకుండా అన్ని విధాలా బాధ పెట్టిన విషయాన్నీ కూడా పేర్ని నాని కనుగొన్నారు.
* క్వారంటైన్ ను ఎప్పటి నుంచో జీవన విధానంగా మలుచుకున్న యనమల కన్నా, వర్ల రామయ్య, బుద్ధా వెంకన్నలే బెటరని నేతల్లో అభిప్రాయం  * చంద్రబాబు నాయుడు 24X 7 ప్రజా క్షేత్రంలో ఉన్నా, యనమల మాత్రం పత్రికా ప్రకటనలకే  పరిమితం కావటం పై ఆక్షేపణ  ఎసెట్స్, లయబిలిటీస్ అని మనం చదువుకుంటూ ఉంటాం. ఆంధ్ర ప్రదేశ్ లో, ఆ మాట కొస్తే, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ కి లయబిలిటీ గా మారిన చాలామంది నేతల్లో మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఒకరు అనే భావన చాల మంది నాయకుల్లో బలంగా ఉంది.  పలుకే బంగారమాయెరా పద్ధతిలో ఆయన తనను తాను  ప్రెస్ నోట్స్ కు మాత్రమే పరిమితం చేసుకుని, సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోవటం ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్నప్పటి నించీ చూస్తూనే ఉన్నాం. అయితే ఆయన చాలా సీనియర్ మోస్ట్ కావటం వల్లనూ, పార్టీ లో ఆయనకు చంద్రబాబు నాయుడు అత్యంత ప్రయారిటీ ఇవ్వటం కారణం గానూ, ఎన్ఠీఆర్ ను పదవీచ్యుతుని చేసిన సమయం లో ఆయన అద్భుతమైన 'శ్రమదానం' చేసినందువల్లనూ --ఇప్పటికీ తెలుగు దేశం నాయకులు ఆయన్ను అరమోడ్పు కన్నులతో, ఆరాధ్య పూరిత దృక్కులతో చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అలా, తనదైన శైలిలో- పార్టీ లో 'సరిలేరు నాకెవ్వరు' టైటిల్ పెట్టుకుని మహరాజులా వెలిగిపోతున్న యనమల రామకృష్ణుడు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మీద ప్రెస్ రిలీజ్ లో చెడా మడా నిప్పులు చెరిగేశారు. అలా చెరిగిన నిప్పులలో-కొన్ని నిప్పురవ్వలను మీ కోసం ప్రత్యేకంగా అందచేస్తున్నాం.  రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నిరోధక చర్యల్లో వైసిపి ప్రభుత్వ వైఫల్యం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన యనమల, ఉపశమన చర్యలు శరవేగంగా చేపట్టాలని, ఒక ప్రకటనలో  డిమాండ్ చేశారు. "విపత్తుల్లో ప్రజలను కాపాడేవాడే పాలకుడు. ఆపదల్లో అండగా ఉండటం నాయకత్వ లక్షణం. అలాంటిది ప్రజలను కష్టాల్లో వదిలేయడం రాజ్యాంగంపై చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమే.  రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతం. పాలకుల ఉదాసీనత వల్లే  రాష్ట్రంలో కరోనా విస్తృతం. వైద్య ఆరోగ్యశాఖకు కేటాయించిన రూ 11,399కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు..? రూ 11,399కోట్ల బడ్జెట్ పెట్టి, కరోనా మాస్క్ లకు రూ 30కోట్లే ఇస్తారా," అంటూ ఆవేశంగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను నిలదీశారు.  ఇదేనా మీరు చెప్పిన ‘‘నాడు-నేడు’’..? నాడు సీఎంగా చంద్రబాబు ఇలాగే చేశారా..? నేడు సీఎంగా మీరెలా చేస్తున్నారో ప్రజలే చూస్తున్నారంటూ కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ను కడిగి పారేశారు. విపత్తుల్లో చంద్రబాబు పనితీరుకు, మీ పనితీరుకు ప్రజలే బేరీజు వేస్తున్నారంటూ కూడా హెచ్చరించారు. " టిడిపి ప్రభుత్వం మెడ్ టెక్ జోన్ పెట్టకపోతే ఇప్పుడు పరిస్థితి ఏమిటి..? డాక్లర్లు, వైద్య సిబ్బందికి రక్షణ ఉపకరణాలు ఉండేవేనా..? మెడ్ టెక్ జోన్ పై చేసిన ఆరోపణలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గత ఏడాది రూ 2,27,975కోట్ల బడ్జెట్ లో ఎంత ఖర్చు పెట్టారు. తొలి 6నెలల్లో 35%కూడా ఖర్చు చేయలేదు. రెవిన్యూ వ్యయమే తప్ప కేపిటల్ వ్యయం శూన్యం. 65% నిధులు మీవద్దే ఉంటే ఉద్యోగుల జీతాల్లో కోతలు ఎందుకు," అంటూ యనమల ఆ పత్రికాప్రకటనలోనే ఆగ్రహం తో ఊగిపోయారు.  కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరు..? డాక్టర్లు, సిబ్బందికి మాస్క్ లు, రక్షణ ఉపకరణాలు ఎందుకు కొనరు..?పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారు. అమరావతి సహా అభివృద్ది పనులన్నీ నిలిపేశారు.  విపత్తు నిర్వహణకు, నరేగా కు, 14వ ఆర్ధిక సంఘ నిధులు, డివల్యూషన్ నిధులు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేశారు..? 11నెలల్లో అభివృద్ది శూన్యం, పేదల సంక్షేమం నిల్.. కరోనా ఉపశమన చర్యలు కూడా మొక్కుబడిగానే.. డిసెంబర్ లోనే విదేశాల్లో కరోనా ప్రభావం ప్రారంభం. జనవరి 3వ వారంలో మనదేశంపై కరోనా ప్రభావం. నాలుగో క్వార్టర్ పై కరోనా ప్రభావం చూపింది. మరి మొదటి 3క్వార్టర్లలో మీరు చేసిన అభివృద్ది, సంక్షేమం ఏమిటి..? కరోనా రాకముందు ఏం చేయలేదు, కరోనా వచ్చాక చేసిందేమీ లేదని కూడా జగన్ మోహన్ రెడ్డి లెక్క తేల్చేశారు.  కరోనాపై కేంద్ర మార్గదర్శకాలు గాలికొదిలేశారు. లాక్ డౌన్ కు వైసిపి నేతలే తూట్లు పొడుస్తున్నారు. కరోనా వ్యాప్తి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రోత్సాహమా..? ఈ విపత్తులోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారా..?కరోనాలోనూ మీ అవినీతి,అక్రమాలు మానుకోరా, అంటూ నిప్పులు చెరిగారు. లోడింగ్ కార్మికులకు కరోనా సోకితే బాధ్యత ఎవరిది..? లాక్ డౌన్ పీరియడ్ లో వందల లారీల్లో ఇసుక తరలింపులా..? ట్రాక్టర్లలో గ్రావెల్, మట్టి తరలిస్తుంటే ఏం చేస్తున్నారు..? మద్యం అక్రమ విక్రయాలను ప్రోత్సహిస్తారా, అని కూడా తన ప్రెస్ రిలీజ్ లో ఆయన ప్రశ్నించారు.  ఏడాది గడుస్తున్నా పరిపాలనపై సీఎంకు అవగాహన లేదు. సంబంధిత శాఖలపై ఏ ఒక్కమంత్రికి పట్టు దొరకలేదు. స్వప్రయోజనాలే తప్ప ప్రజారోగ్యంపై వైసిపి నేతలకు శ్రద్ద లేదు. టిడిపి హయాంలో ఏ అభివృద్ది పని ఆగలేదు. ఏ సంక్షేమ పథకం రద్దు చేయలేదు. పైగా అనేక కొత్త సంక్షేమ పథకాలు ప్రారంభించాం. అనేక అభివృద్ది ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశాం. విపత్తుల్లో బాధిత ప్రజానీకాన్ని ఆదుకున్నాం. హుద్ హుద్ లో, తిత్లి తుపాన్ లో ఎలా ఆదుకున్నామో ప్రజలకు తెలుసునని కూడా యనమల గుర్తు చేశారు.  విపత్తులంటే సీఎం జగన్ కు భయం. ఎప్పుడు విపత్తులు వచ్చినా పత్తా ఉండరు. తిత్లి తుపాన్ లో, మొన్న గోదావరి, కృష్ణా వరదల్లో ఎక్కడ ఉన్నారో ప్రజలు మరిచిపోలేదు. పాలకుల నిర్లక్ష్యం  ప్రజలకు శాపం కారాదు. ఇప్పటికైనా కరోనా కట్టడి చర్యలు ముమ్మరం చేయాలి. ఫ్రంట్ లైన్ వారియర్లకు రక్షణ ఉపకరణాలు అందజేయాలి. వైద్య ఆరోగ్య శాఖకు నిధులు విడుదల చేయాలి. రైతుల వద్ద పంట ఉత్పత్తులు వెంటనే కొనుగోలు చేయాలి. ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇలా ఆయన ప్రెస్ రిలీజ్ సాంతం ఆయన జగన్ మోహన్ రెడ్డి ని కడిగేసి, నిప్పులు చెరిగి చంద్రబాబు నాయకత్వం పట్ల తన విధేయతను ను ఎప్పటిలాగానే-కాగితం రూపేణా తీర్చుకున్నారు. "జగన్ మోహన్ రెడ్డి ఈ ఎనిమిది నెలల నుంచే క్వారంటైన్ లో ఉన్నారు. మా యనమల వారు రాజ్యం చేసినంత కాలం ఎక్కువ సమయం క్వారంటైన్ లో గడిపిన సన్నివేశాలను, సందర్భాలను ఇప్పుడో సరి మేము గుర్తు చేసుకుంటున్నాం, ఎలాగూ కరోనా కారణంగా కాస్తంత వీలు చిక్కింది," అంటూ టీ డీ పీ నాయకులు నిట్టూరుస్తున్నారు.
  * మూడు శతాబ్దాలలో మూడు కరువుల ను ఎదుర్కున్న ఆంధ్ర ప్రదేశ్ * 1791-95, 1832-1833, 1929-39 మధ్య ఎదుర్కున్న కరువుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి * రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు శాసనాల్లో-ఇలాంటి కరువును ఎలా ఎదుర్కోవాలో స్పష్టం గా రాసి ఉంది * వెంకటాద్రి నాయుడు వంటి జనహిత పాలకుల విధానాలే ఇప్పుడు మనకి శ్రీరామ రక్ష మరో రెండు నెలలు కరోనా తన కోరలను, పంజాను ఇలాగే విసిరితే, ఆంద్ర ప్రాంతం లోనే కాదు, దేశం లోనే చాలా ప్రాంతం లో మూడు శతాబ్దాల నాటి డొక్కల కరువు పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆంధ్రదేశాన్ని గడగడలాడించిన అతి పెద్ద కరువులలో ఒకటైన పుర్రెల కరువులో (1791-95) ఒకటిన్నర కోటి మంది మరణించారని బ్రిటిష్ రికార్డులు చెప్తాయి. డొక్కల కరువుగా కూడా పేరు గడించిన ఈ కరువులో ఒక్క ఆంధ్ర ప్రాంతంలోనే యాభైలక్షల మంది బలయ్యారు. కరువు వల్ల ప్రాణ నష్టమే కాదు పశువులు, విత్తనాలూ నష్టమయ్యేవి. రైతులు, కూలీలు వలస పోవటం వల్ల గ్రామాలు నిర్మానుష్యమై మరలా కోలుకొనేందుకు చాలాకాలం పట్టేది. ఖననం చేయకుండా వదిలేసిన మనుషుల, జంతువుల కళేబరాల వల్ల కలరా, ప్లేగు వంటి అంటువ్యాధులు ప్రబలడం సర్వసాధారణం. తరచూ కరువు కాటకాల వల్ల మద్రాస్, బెంగాల్ ప్రెసిడెన్సీ ప్రాంతాల నుండి వేల కొలదీ సన్నకారు రైతులు, కూలీలు సుదూరమైన వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు వలసపోయారు. 1832-1833లో గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాలలో వచ్చిన మహా కరువును డొక్కల కరువు, నందన కరువు లేదా గుంటూరు కరువు అని పిలుస్తారు. 1831లో కురిసిన భారీ వర్షాల కారణంగా, కొత్త పంటలు వేయడానికి రైతులకు విత్తనాల కొరత ఏర్పడింది. దాని తరువాతి సంవత్సరంలో (1832) తుఫాను వచ్చి వేసిన కొద్ది పంటను నాశనం చేసింది. అలా కొనసాగి 1833లో అనావృష్టి పెరిగిపోయింది. ఆ సమయంలో ఒంగోలు-మచిలీపట్నం రహదారి పైనా, గోదావరి జిల్లాల నుండి చెన్నై వెళ్ళే రహదారి పైనా బోలెడన్ని శవాలు పడి ఉండేవి. కంపెనీ వారికి కరువును ఎదుర్కొనే శక్తి, ఆసక్తి లేక లక్షలాది మంది బలయ్యారు. కేవలం గుంటూరు జిల్లా లోనే 5 లక్షల జనాభాలో 2 లక్షల వరకూ చనిపోయారంటే, కరువు తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు. దాదాపు 20 ఏళ్ళ వరకు ప్రజలు, పొలాలు కూడా సాధారణ స్థితికి రాలేక పోయాయి. కరువు బీభత్సం గుంటూరు జిల్లాలో మరీ ఎక్కువగా ఉండటం చేత దీనిని గుంటూరు కరువు అని కూడా అన్నారు.     కరువు ఎంత తీవ్రంగా వచ్చిందంటే జనాలకు తినడానికి ఎక్కడా తిండి దొరక్క బాగా సన్నబడి, శరీరంలో కండమొత్తం పోయి డొక్కలు మాత్రమే కనపడేవి. ఇలా అందరికీ డొక్కలు (ఎముకలు) మాత్రమే కనపడటం వలన దీనిని డొక్కల కరువు అని పిలుస్తారు అంతేకాదు ఆ సమయంలో ప్రజలు ఆకలికి తట్టుకోలేక తినడానికి ఏది దొరికితే అది తినేసేవాళ్ళు. ఆఖరుకి విషపూరితమయిన కొన్ని మొక్కల వేర్లను కూడా తినేసేవాళ్ళు. పలువురు మహనీయులు డొక్కల కరువు నుంచి ప్రజలను కాపాడేందుకు తమవంతు కృషి చేసి చరిత్రలో నిలిచిపోయారు. వారిలో కొందరి పేర్లు:   సర్ సి.పి.బ్రౌన్ గా ఆంద్ర ప్రజానీకానికి సుపరిచితుడైన ఆంగ్ల అధికారి, 1832-33లో వచ్చిన గుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు చేసిన సేవలు, పలువురు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. అలాగే, ఏనుగుల వీరాస్వామయ్య అనే యాత్రాచరిత్రకారుడు, పుస్తకప్రియుడు కూడా పేదలకు ఆ సమయం లో అండగా నిలిచాడు వృత్తి రీత్యా చెన్నపట్టణం సుప్రీంకోర్టులో ఇంటర్‌ప్రిటర్ అయిన వీరాస్వామయ్య నందన కరువులో చాలామంది పేదలకు అన్నవస్త్రాలిచ్చి ఆదుకున్నారు.     కోమలేశ్వరం శ్రీనివాస పిళ్ళై గా చెన్నై ప్రాంతం లో పేరున్న సంపన్నుడు, విద్యాదాత, సంస్కరణాభిలాషి అయిన తన దాతృత్వంతో ఈ కరువు నుంచి కొందరిని కాపాడి చరిత్రలో నిలిచారు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, 1929-39 సంవత్సరాల మధ్య వచ్చిన మరో కరువు ను కూడా ఇక్కడ ప్రస్తావన చేసుకోవాలి. దీనివల్ల, గుంటూరు జిల్లా లోనూ , ఇప్పటి ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చిన కరువు వల్ల , దాదాపు 50 వేల అధికారిక మరణాలు నమోదైనట్టు ఆ సమయం లో గుంటూరు జిల్లాలో తహసీల్దార్ గా పని చేసిన పత్రి లక్ష్మీ నరసింహారావు రాసుకున్న డైరీ లో లభ్యమైన సమాచారం ద్వారా తెలుస్తోంది. ఆయన అప్పట్లో బ్రిటీష్ యంత్రాంగానికి రాసిన లేఖలు, తర్వాత అప్పటి బ్రిటీష్ అధికారులు తీసుకున్న నష్ట నివారణ చర్యల ప్రస్తావన కూడా ఆయన డైరీ లో ప్రముఖంగా ఉంది. అంటే, గడిచిన మూడు శతాబ్దాల కాలం లో ఆంధ్ర ప్రాంతం మూడు రకాల కరువును ఎదుర్కొని, చరిత్రలో నిలిచిపోయే విషాదాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు , కరోనా సన్నద్ధత చర్యల విషయం లో వెనుకంజ వేస్తె, ఎకానమీ రివర్సల్ జరుగుతుందని, దానివల్ల సంభవించే విపరిణామాలు వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమై, తిండి గింజలకు వెతుక్కునే పరిస్థితి వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సుప్రీంకోర్టు లో రాష్ట్ర  ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఈసీ నిర్ణయాన్ని సమర్థిస్తూ నిర్ణయం మరియు ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేయాలని ఆదేశాలు. ఎన్నికల వాయిదాని కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఆరు వారాల తర్వాత కూడా పరిస్తితిపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఈసి కి అప్పగించిన సుప్రీంకోర్టు. దీంతో పాలక వై ఎస్ ఆర్ సీ పీ నిరాశకు గురైంది.  ఏపీ స్థానిక ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టులో విచారణ విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం, స్థానిక ఎన్నికల వాయిదాను సవాలు చేస్తూ పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం వాదనలు విన్నది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులను కొట్టివేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన తెలిసిందే. ఎన్నికల కమిషనర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పిటిషన్లో పేర్కొన్న ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ పిటిషన్ లో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి . రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కమిషనర్ ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం తో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. ఎన్నికలకు నిర్వహణ కు సంబంధించి ఇది సుప్రీం తీర్పుకు విరుద్దం. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిదులు అవసరం. ఎన్నికలు జరిగితే కరోనా వైరస్ కట్టడి చర్యలకు మరింత ఊతం. ఈ వ్యవహారం పై చీఫ్ సెక్రటరీ కి, ఎన్నికల కమిషనర్ కు మధ్య లేఖల యుద్ధం కూడా నడిచింది. హైకోర్ట్ ఆదేశం మేరకు జరుగుతున్న ఎన్నికలను వారి సంప్రదించకుండా ఆపడం తగునా, అని కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వాదించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులు నిలిపివేయాల నీ కూడా కోరింది. పంతాని కి పోయినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రంకోర్టు లో చుక్కెదురైంది.
  బంగారు తెలంగాణ భ్రమల్లో జనాన్ని ముంచెత్తి రాష్ట్రాన్ని అప్పుల ఊబిగా మార్చేయడం మినహా రాష్ట్ర ఆర్థిక స్థితిని సరిదిద్దడానికీ, వనరుల సక్రమ వినియోగానికీ, పేదల దీనస్థితిని తొలగించడానికి చేపట్టిన చర్యలేమీ ఈ బ‌డ్జెట్‌లో లేవు. అవధులు లేని హామీలతో ప్రజలను నిరంతరం మభ్యపెట్టే కేసీఆర్‌ సర్కారు ఎత్తుగడలో భాగంగానే అంకెల గారడీ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను తీర్చిదిద్దారు. రాష్ట్రం ఏర్పడితే.. అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుం దనీ, సంపదను పెంచడమే కాదు, పంచడమూ జరుగుతుందనీ ఎంతగానో ఆశించిన ప్రజలకు ఈ బడ్జెట్లన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రణాళికలు, పథకాలు, ప్రకటనలు, నిధులు, వ్యూహాలు.. అన్నీ కాగితాలకూ, అంచనాలకూ, అంకెలకే పరిమితమ వుతున్నాయి తప్ప కార్యాచరణకు నోచుకోవడంలేదు. ప్రజలపై పన్నుపోటు ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనమంతా పరివర్తనా సూత్రాన్ని అంగీకరించా లంటూ ఎడ్మండ్‌ బర్క్‌ను ఆర్థికమంత్రి ఉటంకించారు. నిజమే ఈ పరివర్తన ఏమిటి? రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చడమా? వ్యవసా యాన్ని నీరుగార్చి రైతులను ఆత్మహత్యలకు గురిచేయడమా? గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, కుల వృత్తులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ రూపకల్పన జరిగినట్లు చెప్పిన మాటలు వినసొంపు గానే ఉన్నాయి. పల్లెల పరిపుష్టతకు ప్రాణాధారమైన వ్యవసాయం గాలిలో దీపంగా మారింది. రైతు జీవితం తెగిన గాలిపటమైంది. నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో నివేదిక ప్రకారం రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణది దేశంలోనే రెండో స్థానం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2750మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటే సర్కారు మాత్రం 340 ఆత్మహత్యలే జరిగినట్లు చెబుతూ కేవలం 40మందికే పరిహారం ఇచ్చింది. అసలు రైతుల బతుకులపై ప్రభుత్వ వైఖరి ఏమిటి? ఈ బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,942.97కోట్లు కేటాయించినా.. ఖర్చుచేసేది ఎంత అన్న ప్రశ్న తలెత్తుతున్నది. గత బడ్జెట్లలో నీటి ప్రాజెక్టులకు 25వేలకోట్లు కేటాయించి, 10వేలకోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టుల కన్నా ప్రచారానికే ఎక్కువ నిష్ఫత్తిలో దుర్వినియోగం చేస్తున్న ఘనత ఈ సర్కార్‌ది. అధికారం చేపట్టి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క ప్రాజెక్టును నిర్దిష్టంగా పూర్తిచేయలేదు. 2013-14లో 49,23,003 హెక్టార్లలో సాగు ఉండగా, 2015-16లో 41,74,532 హెక్టార్లలోనే సాగైనట్లు ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయి. సాగు ఎందుకు తగ్గింది? ఆర్థిక సర్వే లెక్కల ప్రకారం తెలంగాణలో 2013-14లో వచ్చిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు 6,844 కాగా, 2015-16లో కేవలం 3,779 మాత్రమే వచ్చాయి. పెట్టుబడులు రాక కూడా మూడువేల కోట్ల నుంచి పదిహేను వందల కోట్లకు తగ్గింది. పారిశ్రామికాభివృద్ధిరేటు గ్రాఫ్‌ పడిపోయిన విషయం సర్వే స్పష్టంగా వెల్లడించింది. ఈ ఏడాది టీఎస్‌ ఐపాస్‌ కింద 3,325 పరిశ్రమలకు అనుమతులిచ్చారు. కాబట్టి అవన్నీ వచ్చినట్లుగా భావించాలంటున్నారు. రూ.51,358 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లుగా ఊహించుకొంటూ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రకటిస్తున్నారు. ఇవన్నీ అంచనాలు మాత్రమేనని ఆర్థిక సర్వే చెప్పింది. మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లకు అయ్యే ఖర్చును బడ్జెట్‌లో చూపించలేదు. రైతుల ఆత్మహత్యల సమస్యకు పరిష్కారం చూపలేదు. ప్రయివేటు అప్పులు, పెట్టుబడి ఖర్చులు, విత్తన సమస్యలు, మద్దతు ధర వంటి సమస్యలే అన్నదాతల ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఈ అంశాలపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దృష్టిపెట్టిన సంకేతాలేవీ ఈ బడ్జెట్‌లో కనిపించడంలేదు. రాష్ట్రంలో అత్యధిక మందికి అత్యవసర మైన ఈ అంశాలను బడ్జెట్‌ పూర్తిగా విస్మరించింది. పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో ఉపాధి సమస్య వేధిస్తోంది. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులు దినదినగండంగా కాలం వెళ్లదీస్తున్నాయి. మద్యం మహమ్మారి పేదల ప్రాణాలను ఆబగా హరిస్తోంది. వీటిని పరిష్కరించే యోచన లేకుండా కలగూరగంపగా తయారుచేసిన ఈ బడ్డెట్‌తో ముందుముందు అప్పులు, పన్నులు, విద్యుత్‌ భారాలు ప్రజల నడ్డి విరిచేస్తాయని చెప్పకతప్పదు.
ఇండియన్ క్రికెట్‌లోనే కాకుండా వరల్డ్ క్రికెట్‌లోనే నంబర్ వన్ క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటూ వస్తున్న విరాట్ కోహ్లీ తాజా న్యూజిలాండ్ పర్యటనలో బ్యాట్స్‌మన్‌గా దారుణంగా విఫలమవడం ఇండియన్ క్రికెట్ ప్రేమికుల్నే కాకుండా అతని అభిమానుల్నీ తీవ్రంగా నిరాశపరచింది. టెస్టులు, వన్డేలు, టీ20లు అనే తేడా లేకుండా మూడు ఫార్మట్లలోనూ బ్యాట్స్‌మన్‌గా అతను విఫలమవడం విశ్లేషకుల్ని సైతం ఆశ్చర్యపరచింది. మూడు ఫార్మట్లలో కలిపి 11 ఇనింగ్స్ ఆడిన విరాట్ చేసిన మొత్తం పరుగులు కేవలం 218.  న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు టెస్ట్ ప్లేయర్‌గా నంబర్ వన్ పొజిషన్‌లో ఉన్న విరాట్, సిరీస్ ముగిసే సరికి రెండో ర్యాంకుకు దిగజారాడు. విరాట్ పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ మళ్లీ నంబర్ వన్ ర్యాంకును అందుకున్నాడు. టెస్టుల్లో ఓవరాల్‌గా 53.62 యావరేజ్ కలిగిన విరాట్, న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్ ఆడి సాధించిన యావరేజ్ ఎంతో తెలుసా? కేవలం 9.5.  ఈ నాలుగు ఇన్నింగ్స్‌లో ఒక్క హాఫ్ సెంచరీ సాధించడం మాట అటుంచి ఏ ఇన్నింగ్స్‌లోనూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లో అత్యని హయ్యెస్ట్ స్కోర్ 19 రన్స్. ఫస్ట్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో అతను ఈ స్కోర్ చేశాడు. అతను ఈ టెస్ట్ సిరీస్‌లో చేసిన పరుగులు వరుసగా.. 2, 19, 3, 14. మొత్తం రన్స్ 38. అతనికంటే ఎక్కువగా 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమి 44 పరుగులు చేయడం గమనార్హం. టెస్టుల్లో 2011లో అరంగేట్రం చేసిన విరాట్ ఇంత ఘోరంగా ఆడటం ఇది రెండోసారి మాత్రమే. ఇదివరకు 2016-17లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 9.2 యావరేజ్‌తో 46 పరుగులు చేశాడు. అతని కెరీర్ మొత్తమ్మీద అదే అతని పూరెస్ట్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌తో దాని దగ్గరకు వచ్చాడు. ఇక రెండో టెస్ట్ సందర్భంగా మైదానంలో కోహ్లీ ప్రవర్తన అతనికి చెడ్డపేరు తీసుకొచ్చింది. కెప్టెన్‌గానూ అతను టెస్ట్, వన్డే సిరీస్‌లో విఫలమయ్యాడు. మొదట వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన అతడు ఇప్పుడు 0-2 తేడాతో టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్‌కు సమర్పించుకున్నాడు. గుడ్డిలో మెల్లగా మొదటగా జరిగిన టీ20 సిరీస్‌ను మాత్రం 5-0తో వైట్ వాష్ చేయగలిగాడు. అయితే అందులోనూ బ్యాట్స్‌మన్‌గా అతను వైఫల్యం చెందాడు. అంతర్జాతీయంగా 82 టీ20 మ్యాచ్‌లు ఆడిన విరాట్ యావరేజ్ 50.80. కానీ ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన అతని సగటు 26.25 మాత్రమే. అతడి హయ్యెస్ట్ స్కోర్ 45. మిగతా మూడు మ్యాచ్‌లలో వరుసగా 11, 38, 11 స్కోర్లు చేశాడు. రోహిత్ శర్మ, కె.ఎల్. రాహుల్ పరుగుల వర్షం కురిపించడం వల్లే టీ20ల్లో భారత జట్టు విజేతగా నిలవగలిగింది. గాయం కారణంగా వన్డే, టెస్ట్ సిరీస్‌లలో రోహిత్ లేని లోటు సుస్పష్టంగా కనిపించింది. ఫాంలో ఉన్న కె.ఎల్. రాహుల్‌ను టెస్టుల్లోకి తీసుకోకుండా విరాట్ తీవ్ర తప్పిదం చేశాడని విశ్లేషకులంతా ముక్త కంఠంతో విమర్శిస్తున్నారు. ఇక మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో విరాట్ యావరేజ్ 25 మాత్రమే. టూర్ మొత్తం మీద అతడు హాఫ్ సెంచరీ చేసింది ఈ వన్డే సిరీస్‌లోనే. అది మొదటి వన్డేలో 51 పరుగులు చేశాడు. మూడు రకాల ఫార్మట్లలో ఒక ఇన్నింగ్స్‌లో అతడి హయ్యెస్ట్ స్కోర్ ఇది. ఆ తర్వాత రెండు వన్డేల్లో అతడు చేసిన రన్స్ వరుసగా 15, 9. ఇప్పటివరకూ 248 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ టోటల్ యావరేజ్ 59.33 కావడం గమనార్హం. ఈ గణాంకాలే న్యూజిలాండ్ టూర్‌లో అతడు ఏ స్థాయిలో వైఫల్యం చెందాడో తెలియజేస్తున్నాయి. బౌలర్ నుంచి వచ్చే బంతిని అతని కన్ను నిశితంగా గమనిస్తుందనీ, దాని గమనాన్ని కచ్చితంగా అంచనా వేసి, చాలా వేగంగా స్పందించి షాట్ కొడతాడనీ కోహ్లీని విశ్లేషకులతో పాటు సీనియర్ క్రికెటర్లు కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అయితే అతని చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందని, అందుకే అలవోకగా ఫోర్లు కొడతాడని అంటుంటారు. ఫ్రంట్ ఫుట్ ఆడటంలో విరాట్‌ని మించిన వాడు లేడని కూడా వాళ్లు కితాబునిస్తుంటారు. అంటే అనేకమంది ఇతర బ్యాట్స్‌మెన్ కంటే అతడు ఎక్కువగా కవర్ డ్రైవ్స్ ఆడతాడు. చాలామంది స్క్వేర్ కట్ కొట్టే బంతుల్ని అతడు కవర్ డ్రైవ్ కొడతాడు. అంతేకాదు, చాలామంది దూరంగా పోతుందని వదిలేసే బంతుల్ని కూడా విరాట్ కవర్ డ్రైవ్స్ ఆడతాడు. అంత లాఘవంగా ఆ షాట్లను ఆడతాడని అతను పేరుపొందాడు. అలాంటివాడు రెండో టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ అతడు ఎల్బీడబ్ల్యూ అయిన తీరు నిర్ఘాంతపరచింది. అయితే తన బ్యాటింగ్‌లో ఎలాంటి లోపమూ లేదని అతను ఘంటాపథంగా చెబుతున్నాడు. వెల్లింగ్టన్‌లో జరిగిన మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌లోనూ క్యాచ్ అవుట్ అయ్యాక, న్యూజిలాండ్ టూర్‌లో తన బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ గురించి అడిగినప్పుడు "నా బ్యాటింగ్ బాగానే ఉంది" అని జవాబిచ్చాడు విరాట్. కొన్నేసి సార్లు స్కోర్లు బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రతిబింబించవనీ, బంతిని సరిగా ఎగ్జిక్యూట్ చెయ్యకపోవడం వల్ల అవుటవ్వాల్సి వస్తుందనీ అతను చెప్పాడు. జట్టు గెలిస్తే.. 40 పరుగులు చేసినా గొప్పగానే ఉంటుందనీ, జట్టు ఓడితే.. సెంచరీ చేసినా వేస్టయిపోతుందనీ అతను వాదించాడు. కానీ న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ బాడీ లాంగ్వేజ్‌లోనే తేడా కనిపించిందనీ, బ్యాటింగ్ చేసేటప్పుడు మునుపటి ఈజ్ అతనిలో లోపించిందనీ క్రికెట్ అనలిస్టులు చెప్తున్న మాట. తదుపరి సిరీస్‌కైనా మనం మునుపటి గ్రేట్ బ్యాటింగ్ పర్ఫార్మర్‌ను విరాట్‌లో చూడగలమా? వెయిట్ చేద్దాం.
తెలంగాణలో ఖాళీ అవుతోన్న రెండు రాజ్యసభ సీట్లపై ఎప్పట్నుంచో రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లే ఈ రెండు స్థానాలపై పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే, మొదట్నుంచీ కవిత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. లోక్ సభలో గట్టిగా తెలంగాణ వాణి వినిపించి పేరు తెచ్చుకున్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్లో ఓటమిపాలు కావడంతో... రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. అంతలోనే రాజ్యసభకు కాదు ఏకంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకుంటారంటూ కథనాలు వచ్చాయి. అయితే, కవితను రాజ్యసభకు పంపడం ఖాయమైనట్లు తెలుస్తోంది.  టీఆర్ఎస్ కు దక్కనున్న రెండు రాజ్యసభ సీట్లలో ఒక స్థానానికి కవిత పేరు దాదాపు ఫైనల్ అంటున్నారు. ఢిల్లీ స్థాయిలో అన్ని రాజకీయ వర్గాలతో సత్సబంధాలు కలిగివుండటం... వాక్చాతుర్యం, హిందీ, ఇంగ్లీష్ మీద పట్టు ఉండటం.... తెలంగాణ సమస్యలు, అంశాల మీద సమగ్ర అవగాహన కలిగివున్న కవితను, రాజ్యసభకు పంపితే... హస్తినలో టీఆర్ఎస్ పాత్ర మరింత పెరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక, కేసీఆర్ కూతురుగా ఉండే ఇమేజ్ ఎలాగూ ఉండనుంది. ఇలా, అన్నీ కవితకు కలిసొస్తున్నందున రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు. ఇక, మిగిలిన మరో సీటుపైనే మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లు గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే హమీ లభించినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మం ఎంపీ టికెట్ నిరాకరించినా..పొంగులేటి పార్టీకి విధేయులుగానే ఉన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ.. పార్టీ అభ్యర్ధుల విజయం కోసం పనిచేశారు. దీంతో అన్నా నువ్వు రాజ్యసభకు వెళుతున్నావు..రెడీ అవ్వు అని కేటీఆర్..పొంగులేటికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పెద్దల సభకు పొంగులేటి అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదైనా, చివరి నిమిషంలో మార్పులు చేస్తే తప్ప, కవిత అండ్ పొంగులేటి రాజ్యసభకు వెళ్లడం ఖాయమంటున్నారు.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో... ఏ.బీ. వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ అదనపు డి.జి.పి. గా ఉన్న సమయంలో విశేషంగా సేవలందించిన ముగ్గురు డి.ఎస్.పి. లకు వై ఎస్ ఆర్ సి పీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇంటెలిజెన్స్ కే సేవలందించే భాగ్యాన్ని పోలీసు బాస్ లు కల్పించారు. ఇంతకీ, ఆ ముగ్గురూ కూడా ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు గానే నిజాయితీ తో కూడిన నివేదికలను ఏ.బి. కి ఇస్తూ వచ్చే వారు. నాయుడు పార్టీ గల్లంతవుతుందని, 50 కి మించి సీట్లు రావని మరీ ఢంకా బజాయించి సమగ్ర నివేదికలు, నియోజకవర్గాల వారీగా ఇచ్చారు. మిగిలిన డి.ఎస్.పి ల మాదిరి, ఏ.బి. అడుగులకు మడుగులు కొట్టకుండా...ఉన్న వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టు గా వివరించిన ఆ ముగ్గురు డి ఎస్ పి లకు ఆశ్చర్యకరంగా ఇప్పుడు లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బీ లో కానీ, విజిలెన్స్ ఎండ్ ఎంఫోర్సుమెంట్ లో కానీ అవకాశం ఇవ్వటానికి పోలీసు బాస్ లు ససేమిరా అంటున్నారు. ఆ ముగ్గురూ కూడా తెలుగు దేశం హయాం లో నిక్కచ్చిగా పనిచేశారు కాబట్టి, ఎలాంటి రాగ ద్వేషాలకు లొంగకుండా పని తీరు ప్రదర్శించారు కాబట్టి వారి సేవలు ఇంటెలిజెన్స్ కె అవసరం పడతాయని పోలీసు బాస్ లు సూత్రీకరించారు. దరిమిలా...వారి ముగ్గురికీ ఇంటెలిజెన్స్ లోనే కొనసాగాల్సిన గతి ఏర్పడింది. వాస్తవానికి లా ఎండ్ ఆర్డర్ లో కానీ, ఏ సి బి లో కానీ వారికి అవకాశం కల్పించటానికి దారులు ఉన్నప్పటికీ, వారిని మినహాయించి వేకెన్సీ రిజర్వ్ (వీ.ఆర్.) లో ఉన్న చాలా మందికి పోస్టింగులు ఇవ్వటానికి కూడా పోలీసు బాస్ లు ప్రయత్నిస్తున్నారు. విషయం తెలిసిన ఆ ముగ్గురు ఇంటెలిజెన్స్ డి ఎస్ పి లు ఇక తమకు కీలకమైన విభాగాల్లో అవకాశం రాదనీ నిర్ధారించుకుని, రాజీనామా ఇవ్వటానికి సింథ్పడినట్టు పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ భోగట్టా. ఈ విషయమై వారు ఇప్పటికే, పలువురు సీనియర్ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఎలాంటి ఫలితమూ కనపడక పోవటం తో , గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ ముగ్గురూ కూడా తమ పోస్టులకు రాజీనామా చేసేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు ఒక సీనియర్ మోస్ట్ పోలీస్ బాస్ తన ఆంతరంగికుల దగ్గర సమాచారాన్ని షేర్ చేసుకున్నట్టు వెలగపూడి సెక్రెటేరియట్ లో చెప్పుకుంటున్నారు. ఇదే గనుక జరిగితే, ప్రభుత్వానికి కొంత ఇబ్బందికర మైన పరిస్థితి ఏర్పడుతుందని, హోమ్ మంత్రి నేరుగాఈ వ్యవహారం పై దృష్టిపెట్టి , ముఖ్యమంత్రి దృష్టి లో సమస్యను ఉంచాలని సీనియర్ పోలీస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. డి ఎస్ పీ స్థాయి అధికారులు కూడా నైరాశ్యానికి లోనై, ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే, పోలీస్ శాఖపై ప్రజలకు తప్పు సంకేతాలు వెళతాయని ఆందోళనను పోలీసు అధికారులే వ్యక్తం చేస్తున్నారు. అసలు పోలీస్ శాఖపై హోమ్ మంత్రికి సమగ్ర అవగాహనా ఉండేలా ఇంతవరకూ ఒక కార్యాచరణ తో కూడిన ప్లాన్ ను ఏదైనా సీనియర్ అధికారులతో డిస్కస్ చేశారా, లేదా అనేది కూడా తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది.  వాస్తవానికి ఆ ముగ్గురు డి ఎస్ పి లు కూడా వాస్తవాలతో కూడిన నివేదికలు ఇవ్వటం అనేది, ఎన్నికల ముందు వై ఎస్ ఆర్ సి పీ కి కూడా కొంత నైతిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు పాలక పక్షం లో ఉన్న వై ఎస్ ఆర్ సి పీ ప్రస్తుతమ్ ఈ తరహా అన్యాయం పై నోరు మెదపకపోవటం తో ఆ ముగ్గురు డి ఎస్ పి లు అనివార్యంగా తమ రాజీనామా నిర్ణయాన్ని నేరుగా హోమ్ మంత్రి దృష్టి కె తీసుకెళ్లాలని  భావిస్తున్నారు. చిత్రం కాకపొతే, వారి నిక్కచ్చి తనమే ...వారికి ఇపుడు కీలక విభాగాల్లో పోస్టింగులు రాకుండా అడ్డు పడటమేమిటని సెక్రెటేరియేట్ సీనియర్లు ఆశ్చర్య పోతున్నారు. వాస్తవానికి అవినీతీ నిరోధక శాఖ (ఏ సి బీ) కి ఇప్పుడు 14 మంది డి ఎస్ పి ల అవసరం ఉన్నప్పటికీ, ఇటువంటి నిజాయితీ పరులైన అధికారులని ఏ సి బీ కోసం వదులుకోవటానికి ఇంటెలిజెన్స్ శాఖ సిద్ధంగా లేదని ఆ శాఖ లో ఒక పెద్ద ఆఫీసర్ వాక్రుచ్చారు. మరి ఎల్లా కాలమూ, వారు అక్కడే సేవలందించాలా అనే ప్రశ్నకు మాత్రం ఆ పెద్దాయన దగ్గర సమాధానం లేదు. మొత్తానికి, మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏమిటంటే--మరీ ముక్కు సూటిగా పొతే, ఒకో సారి అవసరాలకు కూడా వెతుక్కునే పరిస్థితి ఎదురవ్వచ్చు అని...
తెలంగాణ సీఎం కేసీఆర్ నిరంతర శ్రామికుడు. అలుపెరుగని పోరాట యోధుడు. ఎప్పుడూ ప్రజాకాంక్షే ప్రధానంగా ప్రజానురంజకంగా పాలన సాగించే ఓ మేధావి. గొప్ప రాజకీయ వేత్త. అసాధారణ పట్టుదల, అచంచలమైన ఆత్మవిశ్వాసం, సాధించాలనే తపన కలగలసి ప్రజల్లో ఓశక్తిగా ఎదిగాడు కేసీఆర్. ఎన్నింటినో అసాధ్యం అనుకున్న వాటిని చేపట్టి సుసాధ్యం చేసుకొనేలా వ్యూహాలను.. తెగింపుతో కూడిన పోరాట పటిమను ప్రదర్శించి ప్రజలతో హ్యాట్సాప్ అనిపించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధన కోసం అలుపెరుగని కృషి చేశారుడ. తెలంగాణ ఏర్పాటుతో తిరిగులేని నేతగా ప్రజల హృదయాలను గెలిచాడు. వరుసగా రెండోసారి కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి ప్రజానురంజకంగా పాలన చేస్తున్నాడు. దేశంలోని ఎన్నో రాష్ట్రాలకు కేసీఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టిన పథకాలు ఆదర్శంగా నిలిచాయి. రోల్ మోడల్ సీఎం కేసీఆర్ ను తీసుకొని ఇతర రాష్ట్రాలు పాలన సాగిస్తున్నాయి. సంక్షేమం, అభివృద్ధికి సముచిత ప్రాధాన్యం ఇస్తూ.. కేసీఆర్ పాలన సాగిస్తున్న తీరు అందర్నీ ఎంతో ఆకర్షిస్తుంది. తెలంగాణ చెరువులకు జలకళ తెచ్చాడు. అందుకోసం మిషన్ కాకతీయ.. ఇంటింటికి తాగునీటి కోసం మిషన్ భగీరథ ఎన్నో గొప్ప పథకాలతో దూసుకుపోతున్నారు. ముందు చూపున్న నేతగా కేసీఆర్ చేపట్టిన ఈ పథకాలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో అపర భగీరథుడుగా మారారు కేసీఆర్. అంతేకాకుండా సంక్షేమం విషయంలో కేసీఆర్ తనదైన శైలిని ఎంచుకున్నారు. కళ్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్, ఆసరా ఫించన్లు వంటి  పథకాలు పేదలకు భరోసాని కల్పించాయి. కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకమైతే.. కేంద్రానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. అలాగే.. కేసీఆర్ సంక్షేమానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో.. అంతకు మించి అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం కీలకంగా చెప్పవచ్చు. గత ఐదేళ్లలో హైదరాబాద్ ఐటీ రంగం భారీగా పుంజుకుంది. మళ్లీ బెంగళూరుకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇదంతా కేసీఆర్ సర్కారు అందిస్తోన్న సుస్థిర పాలన వల్లే సాధ్యమైందని చెప్పవచ్చు. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల గొంతుక. ఎవరికీ కష్టం వచ్చినా.. వారికి తెలిస్తే చాలు.. వెంటనే ఫోన్ చేసి ఆరా తీస్తాడు. పేద ధనిక అన్న తేడా లేకుండా అందరితో కలివిడిగా మాట్లాడతాడు. స్థానిక ప్రజలను నవ్వించాలన్నా.. ఏడిపించాలన్నా అది కేసీఆర్ కే సాధ్యం... కాదు కాదు.. ఆయన స్పీచ్ కు సాధ్యం. ప్రజల్లో ఊరమాస్ లెక్క ఉండే ఆయన స్పీచ్ లకు జనాలు దాసోహమౌతారు.  అక్షరం ముక్క రానోడి కూడా ఆయన మాటలకు పడిపోతాడు. అలాంటి కట్టిపడేసే నైజం కేసీఆర్ మాటకు ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే కేసీఆర్. ఆ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్న కేసీఆర్ నిజంగా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్. కాగా ఈరోజు కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేసీఆర్ గారికి మా తెలుగుఒన్.కామ్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ప్రశాంత్‌ కిశోర్ అలియాస్ పీకే. ఎన్నికల వ్యూహకర్తగా దేశంలో పాపులరైన పర్సన్. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా పనిచేసి ఆనాటి కమల విజయంలో కీలక పాత్ర పోషించడంతో మొదలైన పీకే ప్రస్థానం అప్రతిహాతంగా కొనసాగుతోంది. ఆ తర్వాత కాంగ్రెస్ తో కలిసి పనిచేసి పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో హస్తం పార్టీ విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. అలాగే, బీహార్లో జేడీయూ... ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ... ఢిల్లీలో ఆప్ కోసం పనిచేసి ఆ పార్టీల ఘన విజయానికి కారణమయ్యాడు. అయితే, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ తో వచ్చిన విభేదాలతో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ప్రశాంత్ కిశోర్.... మోడీ అండ్ నితీష్ లక్ష్యంగా కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న చర్చ ఢిల్లీ వీధుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముఖ్యంగా, తన సొంత రాష్ట్రంలో బీహార్ రాజకీయాల్లో కీ రోల్ పోషించేందుకు సిద్దమవుతున్నారన్న చర్చ జరుగుతోంది. జేడీయూ నుంచి బహిష్కృతుడైన పీకే, అటు జేడీయూ, ఇటు బీజేపీ మీద కసితో రగిలిపోతున్నారు. బీహార్‌లో ప్రాంతీయ పార్టీ పెట్టి, అదే వేదికగా, దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఏకంచేసి, మోడీ అండ్ అమిత్‌ షాలకు చెక్‌ పెట్టాలనుకుంటున్నారని, అందులో భాగంగా ప్రాంతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీల కూటమి ప్రకటించబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే, ఇప్పుడు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది.  అయితే, జగన్‌కు పీకే అత్యంత క్లోజ్. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమిలో చేరాల్సిందిగా జగన్‌ను కోరే అవకాశముంది. ఆమ్‌ ఆద్మీ ఎలాగూ ఓకే చెప్పొచ్చు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతోనూ పీకేకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఇక, తమిళనాడులో డీఎంకే అధినేత స్టాలిన్‌తోనూ ప్రశాంత్ పని చేయబోతున్నారు. ఇలా బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటితోనూ ప్రశాంత్‌ కిశోర్‌కు మంచి సంబంధాలున్నాయి. దాంతో, ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో మోడీ అండ్ షాకి తడాఖా చూపాలని స్కెచ్ వేస్తున్నారట పీకే. ఇందులో భాగంగానే తనకు అత్యంత సన్నిహితునిగా భావించే జగన్‌ను సైతం, ప్రాంతీయ కూటమిలో చేరాలని కోరాడని, అదే ఇప్పుడు కమలంలో అలజడి కారణమైందని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్‌ ఫ‌్రంట్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరొద్దని జగన్‌ పై బీజేపీ అధిష్టానం ఒత్తిడి తెస్తోందని అంటన్నారు. ఇప్పడున్నట్టే ఏ కూటమిలోనూ చేరకుండా, తటస్థంగా ఉండాలని సూచించిందట. అందుకే జగన్‌ను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతోందని అంటున్నారు. అటు కేసీఆర్‌ను సైతం పీకే ప్రతిపాదిత ఫ్రంట్‌లో చేరొద్దని సూచించబోతోందట. బీజేపీ బుజ్జగింపులకు జగన్‌ సైతం ఓకే చెప్పారని అంటున్నారు. అంతేకాదు, ఎన్డీఏ నుంచి శివసేన బయటికి వెళ్లిపోయినందున, మరో బలమైన మిత్రపక్షం కోసం చూస్తున్న బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో చేరాలని వైసీపీని ఒత్తిడి చేస్తున్నారట. విజయసాయిరెడ్డితోపాటు మరో కీలక వ్యక్తికి కేంద్రమంత్రి పదవులు ఇస్తామమని ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా వీటన్నింటిపైనా చర్చించేందుకే, జగన్ ఒక్కరోజు గ్యాప్ లో రెండుసార్లు ఢిల్లీ వెళ్లారని అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే దినుసుల్లో కొన్ని వంటింట్లో ఉండే పొపుల డబ్బాను ఔషధాల పెట్టెగా చెప్పవచ్చు. మన పూర్వీకులు ఎంతో అనుభవంతో కొన్ని రకాల గింజలను మన ఆహారంలో భాగంగా చేర్చారు. వాటిలో కొన్నింటి గురించి ... - నల్లమిరియాలు వీటినే క్వీన్ ఆఫ్ స్పెషల్ గా పిలుస్తారు. నల్లమిరియాల కి ఆయుర్వేదంలో చాలా విశిష్ట స్థానం ఉంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదం చేస్తాయి పాలల్లో చిటికెడు మిరియాలపొడి వేసుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫం అంతా పోతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు. వెల్లుల్లి మిరియాలు కాంబినేషన్ శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి. మిరియాల టీ, అల్లం మిరియాల టీ రోజూ తీసుకుంటే అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. - జీలకర్ర జీలకర్ర బెల్లం లేకుండా హిందూ సంప్రదాయంలో పెండ్లి జరగదు.  జీలకర్ర ఆవాలు పోపు లేనిదే చాలామందికి పప్పు అన్నం గొంతు దిగదు. శరీరంలోని ఉష్ణాన్ని తీసేసే శక్తి జీలకర్రకు ఉంది.దీనిలోని పాలీఫినాల్స్ అనే పదార్థం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది - నట్స్ శరీరానికి ఇమ్యూన్ బూస్టర్ గా నట్స్  పనిచేస్తాయి యాంటీఆక్సిడెంట్ గాను, రోగనిరోధక శక్తి పెంచడంలోనూ గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ గింజలు రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. - బాదం పప్పు ఇంలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. బాదం, గసగసాలు రెండు కలిపి పొడిగా చేసి పాలలో కలుపుకుని తాగితే శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది. - అవిసె గింజలు గింజల్లో కెల్ల చాలా ప్రత్యేకమైన స్థానం. ఇందులో ఉన్న ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం,  ఒమేగా-3 కొవ్వు కరిగించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. దీనిని ఫైటో ఈస్ట్రోజెన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన గ్రహించే శక్తి ని ఇవి ఇస్తాయి. ఇవి రోజూ తీసుకుంటే... శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంతో, రోగనిరోధక శక్తి పెంచడంలో లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, వెల్లుల్లి బాగా పనిచేస్తాయి. - లవంగాలు ఇందులో ఉండే ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ కె శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మెదడు పని తీరును చురుగ్గా చేస్తాయి. అంతేకాదు ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతాయి.  వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి,  విటమిన్ కె రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, కఫం, పంటినొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు లవంగాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. - దాల్చిన చెక్క శరీరంలోని కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క ది కీలక పాత్ర. ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.-  అంతేకాదు శరీరంలోని రక్త కణాలు ఆక్సిజన్ను గ్రహించే శక్తిని కూడా పెంచుతాయి. -అల్లం రోజూ అల్లం తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తోంది. రోజూ పరగడుపున అల్లం తేనెతో కలిపి తీసుకోవడం ఎంతో ఉత్తమం. అల్లం తినడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు ఇది మంచి ఔషధం. -వెల్లుల్లి అల్లము వెల్లుల్లి చాలా మంచి కాంబినేషన్. ఈ రెండింటి మిశ్రమం లేనిదే నాన్ వెజ్ కర్రీలకు రుచి రాదు. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్న వెల్లుల్లి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు దరిచేరవు. గుండె జబ్బులను వెల్లుల్లి నివారిస్తుంది.
గుమ్మడి, బొప్పాయ రోగనిరోధకశక్తి పెంచుతాయి ఎనర్జీ బూస్టర్ గా పనిచేసే సిట్రస్ జాతి పండ్లు కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఈ సమస్యను నివారించే ఉత్తమ మార్గం. మరి మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన పెంచుకోవాలి.  ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎన్నో పోషక విలువలతో పాటు అనారోగ్య సమస్యలను నివారించే గుణాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను మనం ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు శరీర భాగాల పని తీరు సక్రమంగా సాగుతుంది. సీజనల్ వచ్చే అనేక వ్యాధుల నుంచి,  కరోనా లాంటి భయంకర రోగాల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. నిత్యం మార్కెట్లో లభించే రకరకాల ఆహార పదార్ధాలు మనలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం...  గుమ్మడి కాయ గుమ్మడి కాయలో రెండు రకాలు బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే అనేక సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. గుమ్మడికాయ ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. బొప్పాయి బొప్పాయి గురించి మనందరికీ తెలుసు. ఇందులో ఉండే పాపినేని ఎంజాయ్ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బొప్పాయి రోజూ తినేవారిలో  విటమిన్ లోపాలు ఉండవు . అంతేకాదు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండు ఇస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతాయి. - కివి ఇటీవల మనకు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వీటిలో పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తాయి. - నిమ్మకాయ సహజంగానే సిట్రస్ జాతి పండ్లను బూస్టింగ్ ఫుడ్స్ అని అనొచ్చు. ఇక నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బుల నుంచి కాపాడటానికి అవసరమైన విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగితే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వలన వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. - నారింజ జ్వరం వచ్చిన వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు  ఆరెంజ్ రసం తాగితే  తక్షణం శక్తి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ పండు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.  - ఉసిరి ఔషధాల సిరి గా ఉసిరిని చెప్పవచ్చు. ఇందులో రెండు రకాలు పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి. ఈ రెండు రకాల ఉసిరి లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసే ఉసిరిలో అధిక రక్తస్రావాన్ని నివారించేలో లక్షణాలు ఉన్నాయి. దీన్ని కూరగాయలు లోనే కాకుండా ఔషధాలలో ఎక్కువగా వాడతారు. - అరటిపండు అరటిపండు, అప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. మన శరీరానికి కావలసిన పొటాషియం లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వలన బి.పి తగ్గుతుంది. అంతేకాదు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వాళ్లకి పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి. - పుచ్చకాయ ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఆకట్టుకునే పుచ్చకాయ సీజనల్ లోనే లభించేది. కానీ ఇప్పుడు ఏ సీజన్లోనైనా మనకు మార్కెట్లో కనిపిస్తుంది. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.  నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. - అల్ల నేరేడు సీజనల్ గా  వచ్చే ఈ పళ్ళు యాంటీఆక్సిడెంట్లు కు కేరాఫ్ అని చెప్పవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవడానికి ఈ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి.  చక్కెర వ్యాధితో బాధపడే వాళ్ళు నేరేడు పళ్ళ గింజలను ఎండబెట్టి పొడి చేసి ఒక చెంచా పొడిని నీటిలో వేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం.. రోజువారి ఆహారంలో ఇవి ఉన్నాయా.. ప్రతి రోజూ మన ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా క్యారెట్, బచ్చలి, తులసి, పాలకూర, నిమ్మకాయ, కోడిగుడ్లు మొదలైనవి. - ప్రతి ఇంట్లో తులసి తప్పనిసరిగా ఉండాలని మన పెద్దలు అంటారు పూజించడానికి కాదు ఆరోగ్యానికి తులసి ఆకులు ఎంతో మంచివి. రోజూ నాలుగు తులసి ఆకులు నమలడం వలన శరీరంలోని సూక్ష్మక్రిములు చనిపోతాయి ఎన్నో వ్యాధి కారకాలను తులసి నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజు ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల కూడా శరీరానికి కావలసిన శక్తి వస్తుంది. - మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రోజు ఉదయాన్నే మీ రోజుని గ్రీన్ టీతో ప్రారంభించండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్  మీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఎంతో సహాయపడుతుంది గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం కాకుండా శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.  - మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. వీటిలో ముఖ్యంగా బచ్చలి, పాలకూర. రోజూ ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. ఆకుకూరల్లో బచ్చలి కూరది విశిష్ట స్థానం. ఇందులో విటమిన్ సి తోపాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. - పాలకూర విటమిన్ సి ,బి 6 తో పాటు విటమిన్ కె ఇందులో అధికంగా ఉంటుంది క్యారెట్ ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్ జ్యూస్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ బి 6 యాంటీఆక్సిడెంట్లు ఉత్తేజపరుస్తాయి క్యారెట్ టమాటతో కలిపి తాగితే క్యాన్సర్ ను నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. - ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం పెరుగులో అనేక పోషక విలువలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేసే పెరుగును రాత్రి సమయాల్లో కాకుండా పగటి పూట అన్నంలో తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే పెరుగు తీసుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు పటిష్టమవుతాయి. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఈ పెరుగు రక్తపోటును నియంత్రిస్తుంది. -  ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం మరిచిపోవద్దు.గుడ్డు లోని ప్రోటీన్, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి రోజూ ఒక కోడి గుడ్డు తినడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు అందుతాయి. - శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్లు తిరిగి ఏర్పడ్డానికి జింక్ బాగా తోడ్పడుతుంది శరీరానికి కావాల్సిన జింక్ ఎక్కువగా కోడిగుడ్డు మాంసంతో పాటు సీఫుడ్ లో లభిస్తుంది వారానికి రెండుసార్లు తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన జింక్ విటమిన్-డి లభిస్తాయి వీటివలన శరీరం యొక్క రోగనిరోధక శక్తి తిరిగి ఏర్పడుతుంది. - ఎర్ర బియ్యం లోనూ అధిక యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ ఉంది రోగనిరోధకశక్తిని పెంచడానికి పళ్ళు కూరగాయలు మసాలా దినుసులతో పాటు ఎర్ర బియ్యం కూడా ఎంతో ఉపయోగపడతాయి.‌ వీటన్నింటితో పాటు ప్రతిరోజు మంచినీళ్లు ఎక్కువగా తాగడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.