LATEST NEWS
జనసేన ఎమ్మెల్యే  అరవ శ్రీధర్ ప్రభుత్వ విప్ పదవికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించింది.  రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన అరవ శ్రీధర్ ఇటీవల తన విప్ పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే.  ఇటీవల తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అరవ శ్రీధర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఆ భేటీ అనంతరం వ్యక్తిగత కారణాలతో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొంటూ రాజీనామా చేశారు.   అరవ శ్రీధర్‌పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  అయితే ఆ కమిటీ అరవ శ్రీధర్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తి చేసిందా, ఒక వేళ పూర్తి చేస్తే.. పార్టీ హైకమాండ్ కు ఇచ్చిన నివేదికలో ఏముంది? అన్న విషయాలపై క్లారిటీ లేదు. అయితే.. అరవ శ్రీధర్ జనసేనానితో భేటీ అనంతరం విఫ్ పదవికి రాజీనామా చేయడం, ఆ రాజీనామా ఆమోదం పొందటం జరిగిపోయాయి.   
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌ వేదికగా తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తెలంగాణలో జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడమే లక్ష్యంగా  తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం పేరిట ఈ భారీ సభను ఏర్పాటు చేశారు. మంగళవారం (జూన్ 2) మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని జనసేన శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే, రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండటం, అదే సమయంలో శాంతిభద్రతల పరిరక్షణ,  ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. పోలీసుల నిర్ణయంతో ఏమాత్రం వెనక్కి తగ్గని జనసేనాని పవన్ కళ్యాణ్, తక్షణమే ప్రత్యామ్నాయ వ్యూహానికి తెరలేపారు. సభకు బ్రేక్ పడినా, తన గళాన్ని వినిపించేందుకు   సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే అత్యవసరంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలంగాణలో జనసేన భవిష్యత్ యాక్షన్ ప్లాన్, పార్టీ పటిష్టతకు తీసుకోబోయే   కీలక నిర్ణయాలను ఆయన నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. పోలీసులు సభను అడ్డుకున్నా, ప్రెస్ మీట్ ద్వారా తన పొలిటికల్ ఎజెండాను బలంగా చాటాలని పవన్ భావిస్తున్నారు. మరోవైపు, పోలీసుల నిరాకరణ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జనసేన లీగల్ టీమ్ ఇప్పటికే కోర్టును ఆశ్రయించింది. రేపు మధ్యాహ్నం లోగా కోర్టు నుంచి అనుకూల తీర్పు వస్తుందని పార్టీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి. కోర్టు తీర్పుపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో యువత టార్గెట్‌గా, దాదాపు 50 శాతం కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌ను యాక్టివ్ చేయాలనేది పవన్ ప్రధాన ఉద్దేశం. కేవలం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితం కాకుండా, తెలంగాణలోనూ జనసేన సత్తా చాటాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా జరగాల్సిన సభకు బ్రేక్ పడటం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వానికి   కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టేలా ఉంది. పవన్ కళ్యాణ్ సభకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో  అనూహ్య పరిణామం సంభవించింది. నిన్న మొన్నటివరకు తిరుగులేని శక్తిగా వెలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అస్థిత్వం కోసం  పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే..  పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు   భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత..  భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు  ఏర్పాటు చేసిన   కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు   గైర్హాజరు  అయ్యారు.  ఈ పరిణామం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తిని,  ముఠా రాజకీయాలనుబహిర్గతం చేసింది. ముఖ్యంగా మమతా బెనర్జీ వారసుడిగా చలామణి అవుతున్న అభిషేక్ బెనర్జీ ఒంటెద్దు పోకడలపై పార్టీ సీనియర్లలో  ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇటీవలే ఎన్నికల ఫలితాల అనంతరం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లిన అభిషేక్ బెనర్జీపై సోనార్‌పూర్‌లో దాడి జరిగింది. ఈ దాడిలో ఆయన కంటికి  గాయమై ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా హుగ్లీలో మరో కీలక నేత కల్యాణ్ బెనర్జీపై కూడా దాడి జరిగింది. ఈ దాడుల నేపథ్యంలో పార్టీ నేతల్లో ధైర్యం నింపేందుకు దీదీ ఏర్పాటు చేసిన సమావేశానికి మెజారిటీ ఎమ్మెల్యేలు గైర్హాజర్ కావడం తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీని దిగ్భ్రాంతికి గురి చేసింది.    తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధంగా బెంగాల్ రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరుగుతోంది.   వీరంతా మమతా బెనర్జీ,  అభిషేక్ బెనర్జీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ..  సరికొత్త రాజకీయ కూటమిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.  ఈ తాజా సంక్షోభంపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నాయకులపై దాడులు జరుగుతుంటే ఆసుపత్రులు కూడా చికిత్స అందించవద్దంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారని, బెంగాల్‌  ప్రస్తుతం   నియంతృత్వ ధోరణి నడుస్తోందని ఆరోపించారు.  కాగా 80 మందిలో 60 మంది ఎమ్మెల్యేలు కీలక సమావేశానికి గైర్హాజర్ కావడం చూస్తుంటే.. టీఎంసీలో  మమతా బెనర్జీ పట్టు   సడలినట్లే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని అటు సొంత సామాజికవర్గం, ఇటు రాజకీయ ప్రత్యర్థుల నుంచి ముప్పేట దాడి మొదలైంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చుట్టూ ఇప్పుడు సరికొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. అటు తెలంగాణలో భూముల వ్యవహారాలు, ఇటు ఆంధ్రాలో కాపు సామాజికవర్గ నేతల నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు జనసేనానిని రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై  సీనియర్ రాజకీయ విశ్లేషకుడు  భరద్వాజ తో  తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.   పవన్ కళ్యాణ్‌ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.  ముఖ్యంగా కాపు సామాజికవర్గానికి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటూ దాసరి రాము వంటి నేతలు టోన్ పెంచి విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ పవన్ ఓడిపోవడానికి ఆ సామాజికవర్గమే బాధ్యత వహించాలంటూ గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రత్యర్థులు ఆయుధంగా మలుచుకుంటున్నారు. జనసేన కేవలం ఒక కులానికి పరిమితమైన పార్టీ కాదని పవన్ స్పష్టం చేస్తున్నప్పటికీ, ఆయనను టార్గెట్ చేయడం ఆపడం లేదు. మరోవైపు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని వంటి  కాంగ్రెస్ పార్టీ కాపు నేతలు కూడా పవన్‌పై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. వంగవీటి మోహన రంగా హత్యోదంతాన్ని మళ్లీ తెరపైకి తెస్తూ, ఆనాటి రాజకీయ పరిస్థితులను ప్రస్తుత కూటమితో ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రంగా అభిమానులు, కాపు సామాజికవర్గం విస్తృతంగా ఉన్న ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ కళ్యాణ్ బలాన్ని తగ్గించడమే ఈ విమర్శల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అందుకే రంగా హత్యను తెరపైకి తీసుకువచ్చి.. ఆ హత్యకు కారకులతో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఉన్నారంటూ విమర్శిస్తున్నారు. ఈ వ్యూహాత్మక ఒత్తిడి ద్వారా పవన్ కళ్యాణ్ చేత ఏదైనా భావోద్వేగ ప్రకటన చేయించాలని ప్రత్యర్థులు భావిస్తున్నారు. ఆ ప్రకటన గనుక కూటమి ప్రభుత్వ ఐక్యతకు భంగం కలిగించేలా ఉంటే..  దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది శత్రు పక్షాల ప్లాన్. ఈ ముప్పేట దాడిని తిప్పికొట్టేందుకు పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్యాడర్ మద్దతును కూడగడుతున్నారు. ఇందులో భాగంగానే రాజమండ్రి, విజయవాడ, మంగళగిరి పార్టీ కార్యాలయాల్లో వరుసగా కీలక సమావేశాలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఈ పొలిటికల్ ప్రెజర్‌ను పవన్ కళ్యాణ్ ఎంత నిగ్రహంతో, శాంతియుతంగా హ్యాండిల్ చేస్తారనేది అత్యంత కీలకంగా మారింది. ఆయన భావోద్వేగానికి లోనై కూటమికి ఇబ్బంది కలిగిస్తారా? లేక చాకచక్యంగా ఈ వ్యూహాల నుంచి బయటపడి తన రాజకీయ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? అనేది వేచి చూడాలి.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన ప్రముఖ న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, వివాదానికి దారితీశాయి. సామాజిక మాధ్యమాల్లో, సమాజంలో ప్రశ్నించే హక్కును వాడుకుంటున్న నిరుద్యోగ యువతను, ఆర్టీఐ  యాక్టివిస్టులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో  తీవ్ర  విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠంనేని, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ స్పందించారు. ఈ అంశంపై  తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో  రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను  పారసైట్లు,  కాక్రోచ్‌లు  అనడం  అత్యంత దురదృష్టకరమని   అభిప్రాయపడ్డారు.   గత కొన్నేళ్లుగా దేశంలో సాగుతున్న కమ్యూనల్, కుల పోలరైజేషన్ ప్రభావం దురదృష్టవశాత్తూ అత్యున్నత స్థానాల్లో ఉన్నవారి మెదడుపై కూడా పడుతోందనే ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో విమర్శకులను  అర్బన్ నక్సలైట్లు  అని ముద్రవేసిన పాలకులు..  ఇప్పుడు సరికొత్తగా బ్రాండింగ్ చేయడం ప్రారంభించారని, దానికి ఈ వ్యాఖ్యలే ఉదాహరణని విశ్లేషించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికీ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. అలాగే ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవంతో జీవించే హక్కును కల్పిస్తోంది. ఈ హక్కులను కాపాడాల్సిన న్యాయమూర్తి, ప్రశ్నించే వారిని అణచివేసేలా మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని  అన్నారు. దేశంలో  నెలకొన్న ప్రధాన సమస్య నిరుద్యోగం కాదు..  చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లేకపోవడం అంటే అండర్ ఎంప్లాయ్‌మెంట్. పీహెచ్‌డీ  చేసిన అభ్యర్థులు, ఎంబీఏ   చదివిన యువకులు   డ్రైవర్లుగా, గిగ్ వర్కర్లుగా స్థిరపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వాల విద్యా విధానాల, ఉపాధి కల్పన వైఫల్యమే అని డోలేంద్రప్రసాద్ అన్నారు.  న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించాల్సింది ప్రభుత్వాల వైఫల్యాలను, ఆదేశించాల్సింది నిరుద్యోగ యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించమని.అయితే ఆయన అందుకు భిన్నంగా యువత సోషల్ మీడియాలో, ఆర్టీఐ అప్లికేషన్లతో సమయం వృథా చేస్తోందంటూ  కించపరచడం సమంజసం కాదన్నారు. మీడియా తన వ్యాఖ్యలను తప్పుదారి పట్టించిందంటూ న్యాయమూర్తి వివరణ ఇవ్వడంపై  ఆయన..  ఒక కార్పొరేటర్ లేదా ఎమ్మెల్యే స్థాయిలో కాకుండా, దేశ అత్యున్నత న్యాయస్థానంలో కూర్చున్న వ్యక్తి తప్పుడు సంజాయిషీలు ఇచ్చుకోవడం కరెక్ట్ కాదన్నారు.  ఆయన వెంటనే దేశ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు మాట్లాడే ప్రతి మాట సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు యువతలో తీవ్ర తిరుగుబాటు ధోరణికి కారణమవుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా పౌర సమాజం, న్యాయవ్యవస్థ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డోలేంద్రప్రసాద్, రవిశంకర్ కంఠంనేని అన్నారు. 
ALSO ON TELUGUONE N E W S
Nandamuri Balakrishna is currently busy shooting for his upcoming film, tentatively titled NBK111. Directed by Gopichand Malineni and produced by Vriddhi Cinemas, the film is gearing up for a special announcement on June 10 to mark the actor’s birthday. The makers recently released a pre-look poster that offered the first glimpse into the film’s tone. Carrying the tagline, “No More Vintage, Only New Age,” the poster features a dark visual design with elements like a heavy metal chain and bullets. While it does not reveal much about the story, it hints at a more contemporary action setting compared to what audiences may usually associate with Balakrishna’s on-screen image. Meanwhile, production is progressing at a steady pace. The team is currently shooting important portions in Mumbai as part of an extended schedule. The film has huge generated curiosity with the confirmation of Manchu Manoj playing a powerful antagonist role in the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణలోని శంకర్ పల్లి ఏరియాలోని కోడి చెరువుకి చెందిన పది ఎకరాల భూముల్ని ఆక్రమించాడనే వార్తలు గత కొంత కాలంగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ మాట్లాడుతు రాజకీయ లబ్ధి కోసం కొందరు పనిగట్టుకుని నాపై  బురద జల్లుతున్నారు. ఇలాంటి ఆరోపణలు నాకు కొత్తేమీ కాదు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లు, దాడులని  ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చాం. నేను కోడి చెరువుని ఆక్రమించుకున్నట్లు కనుక నిరూపిస్తే, ఆ మరుక్షణమే ఆ ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ బహిరంగ సవాల్ విసిరారు. తెలంగాణ మట్టితో తనకు ఉన్న అనుబంధం కేవలం రాజకీయాల కోసం పుట్టుకొచ్చింది కాదు. కొందరు విమర్శకులు తెలంగాణలో జనసేన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కానీ జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అనే విషయాన్ని మరువరాదు. ప్రత్యేక రాష్ట్రం అనే ఆలోచన రాకముందే తాను ఈ నేల నుంచి పోరాట స్ఫూర్తిని పొందానని, తన సినిమాల్లో సైతం ఆ తెలంగాణ జెండా, స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తాయని  చెప్పుకొచ్చాడు. Also read: Raghava lawrence: లారెన్స్ కుమార్తె రాఘవి సంచలన నిర్ణయం.. లారెన్స్ వెనక్కి తగ్గాల్సిందేనా!  
Vishnu Vishal has delivered a memorable blockbuster with his family entertainer Gatta Kusthi, winning the hearts of the audiences. Now, he is getting ready to recreate that magic with its highly anticipated sequel, Gatta Kusthi 2. The makers have officially unveiled a hilarious teaser today, locking the grand theatrical release for July 3. Directed by Chella Ayyavu, the movie promises to take the fun to the next level with a fresh concept. While the teaser showcases a funny role reversal with the hero handling household chores, the real novelty of the sequel is the inclusion of their little daughter. This kid character promises a lot more fun and comedy, adding a completely fresh dynamic to the central theme as she clearly inherits her family's fighting traits. Aishwarya Lekshmi returns in her fierce sportswoman avatar, but the father-daughter duo completely steals the show in the teaser. It is packed with non-stop comedy, especially a hilarious sequence where the school complains that their daughter beat up two people, only for the father to go there and beat up four more. This perfectly sets the tone for a full-length family laugh riot driven by this new addition. Vels Film International and Vishnu Vishal Studioz are jointly producing this exciting project without compromising on quality. Sean Roldan is composing the music for this sports comedy drama. With such a highly entertaining teaser out, the team is confident about delivering a huge success at the theaters. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సరికొత్త సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. వెండితెరపై ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఇళ్లల్లో కూర్చుని వీక్షించేందుకు ఓటీటీ వేదికగా రాబోతోంది. ఈ క్రేజీ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా రాబోయే జూన్ 19 నుండి డిజిటల్ వీక్షకులను అలరించనుంది. అయితే ఈ సినిమా కేవలం ఒక్క ప్లాట్‌ఫామ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, మల్టిపుల్ ఓటీటీ వేదికలపై ఒకేసారి స్ట్రీమింగ్ కానుండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్‌గేట్ ప్లే మరియు జియోటీవీ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ చిత్రం ఒకేరోజు విడుదల కాబోతోంది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఒక సీరియల్ కిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. నగరంలో జరిగే వరుస హత్యలు, ఆ శవాలను ప్రముఖ పెయింటింగ్స్ తరహాలో అమర్చే కిల్లర్ మైండ్ గేమ్ చుట్టూ కథ నడుస్తుంది. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధా పాత్రలో ఇండో-అమెరికన్ నటి జో శర్మ నటించగా, ఏసీపీ కృష్ణగా సమ్బీత్ ఆచార్య కీలక పాత్ర పోషించారు. దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల.. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ చిత్రాన్ని మలిచారు. హాలీవుడ్ స్థాయిలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, క్లైమాక్స్ వరకు హూ ఈజ్ ద కిల్లర్ అనే ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు విజయం సాధించారనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జో శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో మంచి రన్ సాధించింది. ముఖ్యంగా ఇసై పెట్టై అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని సినీ ప్రియులు అప్పట్లో సోషల్ మీడియాలో కొనియాడారు. థియేటర్లలో ఈ విజువల్ మిస్టరీని మిస్ అయిన థ్రిల్లర్ జోనర్ లవర్స్, జూన్ 19 నుండి తమకు నచ్చిన ఓటీటీ యాప్స్‌లో ఈ మైండ్ గేమ్ రైడ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
  కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి హీరోగా, దర్శకుడిగా అభిమాన, ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న వర్సటైల్ పర్సన్ రాఘవ లారెన్స్(Raghava lawrence). ప్రస్తుతం తన లిస్ట్ లో బెంజ్, బులెట్, కాలభైరవ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.ఇప్పుడు లారెన్స్ కుమార్తె రాఘవి సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది. అవును.. లారెన్స్ కుమార్తె రాఘవి(Raghavi)త్వరలోనే చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఆమె కెమెరా ముందుకు రావడం లేదు, మెగాఫోన్ పట్టి డైరెక్టర్ సీట్లో కూర్చోబోతున్నారు. చిత్ర పరిశ్రమలో వారసులు అనగానే కేవలం నటనపైనే దృష్టి పెడతారనే పాత సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ డైరెక్టర్ గా అడుగుపెడుతుండటం  సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.  Also read: Vijay: విజయ్, త్రిష పెళ్లి!.. ఆ డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటి రాఘవి(Raghavi)దర్శకత్వ బాధ్యతతో పాటు తన మొదటి చిత్రానికి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చుకుంటున్నారు. ఎంతో కాలంగా ఆమె ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారని, ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తయిందని సమాచారం. తండ్రి లారెన్స్ లాగే సినిమాలోని అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్న రాఘవి, తన స్క్రిప్ట్‌తో ఇండస్ట్రీలోని ప్రముఖులని మెప్పించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో సరికొత్త కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకోనుందని టాక్. మరి రాఘవి మొదటి మూవీ తెలుగులో ఉంటుందా లేక తమిళంలో ఉంటుందా చూడాలి. అదే టైం లో దర్శకురాలిగా లారెన్స్ ని మించిపోతుందేమో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.     
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. తాజాగా రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' (Peddi) ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఒక అరుదైన, హృదయాన్ని హత్తుకునే సంఘటన చోటుచేసుకుంది. ఒక వీరాభిమాని చరణ్‌ను కలవడానికి పడ్డ ఆరాటం, దానికి మెగా హీరో స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వేడుక జరుగుతున్న సమయంలో ఒక డైహార్డ్ ఫ్యాన్ సెక్యూరిటీ వలయాన్ని దాటుకుని నేరుగా రామ్ చరణ్ దగ్గరకు దూసుకొచ్చాడు. చరణ్‌ను చూడగానే ఆనందంతో భావోద్వేగానికి లోనైన ఆ అభిమాని, ఒక్కసారిగా మెగా పవర్‌స్టార్ కాళ్ళపై పడిపోయి గట్టిగా పట్టుకుని ఏడవడం ప్రారంభించాడు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయి, ఆ అభిమానిని పక్కకు లాగేందుకు ప్రయత్నించారు. అయితే, రామ్ చరణ్ మాత్రం సెక్యూరిటీని వారించారు. ఆ అభిమానిని పక్కకు తోసేయకుండా, ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. కిందపడి ఏడుస్తున్న అతడిని స్వయంగా చేతులతో పైకి లేపి, ఓదార్చారు. అంతటితో ఆగకుండా ఆ అభిమానిని ఆత్మీయంగా కౌగిలించుకుని, బుజ్జగిస్తూ మాట్లాడారు. దాంతో ఆ ఫ్యాన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రామ్ చరణ్ చూపించిన ఈ గొప్ప మనసును, ఆయన డౌన్-టు-ఎర్త్ స్వభావాన్ని మెగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా కొనియాడుతున్నారు.  
దక్షిణాది చిత్ర పరిశ్రమలో 'యాక్షన్ కింగ్'గా తనదైన ముద్ర వేసుకున్న సీనియర్ హీరో, దర్శకుడు అర్జున్ సర్జా తాజాగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు. సినిమాల విజయాలను చూపించుకోవడానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న ఫేక్ కలెక్షన్ల సంస్కృతిపై ఆయన ముక్కుసూటిగా స్పందించారు. తన నైతిక విలువలను పణంగా పెట్టి అబద్ధపు ప్రచారాలు చేయనని స్పష్టం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అర్జున్ సర్జా స్వయంగా దర్శకత్వం వహిస్తూ, తన సొంత నిర్మాణ సంస్థ 'శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్‌పై 'సీతా పయనం' అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ఎమోషనల్ రోడ్ రొమాంటిక్ డ్రామాతో ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ టాలీవుడ్‌కు కథానాయికగా పరిచయం కాగా, నిరంజన్ సుధీంద్ర హీరోగా నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి ఫీల్-గుడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో భారీ వసూళ్లను సాధించలేకపోయింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ రన్ సమయంలో ప్రమోషన్ల బాధ్యతలు చూసుకునే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ అర్జున్‌ను కలిసి ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన పెట్టింది. సినిమా విడుదలై నాలుగు రోజులు దాటిన నేపథ్యంలో.. ఈ చిత్రం ఏకంగా రూ. 4 కోట్లు వసూలు చేసినట్లు ఒక కలెక్షన్ పోస్టర్‌ను అధికారికంగా విడుదల చేద్దామని వారు సలహా ఇచ్చారు. దీనివల్ల మార్కెట్‌లో సినిమాపై హైప్ పెరుగుతుందని వారు నమ్మబలికారు. కానీ ఆ ఏజెన్సీ ఐడియా వినగానే అర్జున్ తీవ్రంగా మండిపడ్డారు. తనకు రాని సొమ్మును వచ్చినట్లుగా చూపిస్తూ, కేవలం పబ్లిసిటీ కోసం అబద్ధపు వసూళ్లతో కూడిన ఫేక్ పోస్టర్లను వేసే ప్రసక్తే లేదని ముక్కుసూటిగా తిరస్కరించారు. మన సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంతో అందరికీ తెలుసని, మోసపూరిత ప్రచారాలతో ప్రేక్షకులను తప్పుదోవ పట్టించలేనని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ మీడియా వేదికగా పంచుకోవడంతో నెటిజన్లు ఆయన నిజాయితీకి ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అర్జున్ తీసుకున్న స్టాండ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతీ సినిమాకు వందల కోట్ల ఫేక్ కలెక్షన్ల పోస్టర్లు వేస్తూ మైలేజ్ పెంచుకోవాలని చూస్తుంటే, ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకున్న అర్జున్ నిజమైన 'కింగ్' అని సినీ విశ్లేషకులు సైతం కొనియాడుతున్నారు. తప్పుడు ప్రచారాలకు తావివ్వకుండా విలువలను కాపాడే ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి ఎంతో అవసరమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు నటుడిగా అర్జున్ సర్జా ఖాతాలో ప్రస్తుతం మరో భారీ విజయం చేరింది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బ్లాస్ట్ జోన్' (Blast Zone) మే 28న విడుదలై థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 'అర్జున్ సర్కార్'గా ఆయన చేసిన యాక్షన్ విన్యాసాలు మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దర్శకుడిగా తన కుమార్తె సినిమాకు ఆశించిన విజయం దక్కకపోయినా, నటుడిగా 'బ్లాస్ట్ జోన్'తో అర్జున్ బాక్సాఫీస్ వద్ద మళ్లీ తన పవర్ ఏంటో నిరూపిస్తున్నారు. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం, కేవలం ₹7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘బ్లాస్ట్ జోన్’ తొలి ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.28 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో ఇండియా వైడ్‌గానే దాదాపు రూ.19.4 కోట్ల గ్రాస్ నమోదైంది. కేవలం మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.58 కోట్ల నుండి రూ.25 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూలు చేసి ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఊహించని విధంగా రూ.5.55 కోట్లు కొల్లగొట్టడం విశేషం. ప్రస్తుత రన్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం లాంగ్ రన్‌లో సులభంగా రూ.50 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
  విజయ్,(Vijay)త్రిష(Trisha)మధ్య ఉన్న అనుబంధం ఏ పాటిదో ఆ ఇద్దరు చెప్పకపోయినా పబ్లిక్ లోకి  మాత్రం కలిసి వస్తూనే ఉన్నారు. నిన్న అజిత్ మదర్ చనిపోయినప్పుడు పరామర్శకి విజయ్ వచ్చాడు. ఆ సమయంలో కూడా విజయ్ తో పాటు  త్రిష ఉంది.  దీంతో విజయ్, త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. కొంత మంది అయితే తన భార్య సంగీత నుంచి విడాకులు వచ్చిన మరుక్షణం త్రిషని విజయ్ పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు. పనిలో పనిగా కొంత ముందైతే వివాహం డేట్ ని కూడా చెప్తు పోస్ట్ లు చేస్తున్నారు. Also read: Faria Abdullah: వైరల్ గా మారిన ఫరియా అబ్దుల్లా.. జాసన్ సంజయ్ సిగ్మా   
బాలీవుడ్ యంగ్ బ్యూటీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం టాలీవుడ్‌లో బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సరసన 'దేవర' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi) చిత్రంలో అచ్చమైన పల్లెటూరి పిల్లగా అలరించనుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో జాన్వీ కపూర్ చురుగ్గా పాల్గొంటోంది. ఈ క్రమంలోనే ఒక తాజా ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీ, ముఖ్యంగా టాలీవుడ్ వర్క్ కల్చర్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ముంబై ఫిల్మ్ సెట్స్‌కు, టాలీవుడ్ షూటింగ్ వాతావరణానికి మధ్య ఉన్న స్పష్టమైన తేడాలను వివరిస్తూ ఆమె బాలీవుడ్ మేకింగ్ విధానంపై కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగు సినిమా పరిశ్రమకు సినిమా పట్ల ఎనలేని ప్యాషన్, అంకితభావం మరియు గౌరవం ఉంటాయని జాన్వీ కపూర్ కొనియాడింది. టాలీవుడ్‌లో కేవలం ఒక ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలనో లేదా డెడ్‌లైన్లను రీచ్ అవ్వాలనో మాత్రమే పని చేయరని, ప్రతి సీన్ అద్భుతంగా రావడం కోసం ఎంత సమయమైనా కేటాయించడానికి సిద్ధపడతారని ప్రశంసించింది. దీనికి భిన్నంగా బాలీవుడ్‌లో కేవలం 'ఎక్సెల్ షీట్' మేనేజ్‌మెంట్‌కు, బడ్జెట్ అంచనాలకు, టైమ్‌లైన్స్‌కు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని విమర్శించింది. ముంబైలో అంతా రూల్ ప్రకారం, పక్కా ప్రణాళికలతో కార్పొరేట్ స్టైల్లో జరుగుతుందని, ఆ అతిజాగ్రత్తల వల్ల కొన్నిసార్లు క్రియేటివిటీ విషయంలో తీవ్రంగా రాజీ పడాల్సి వస్తుందని జాన్వీ కపూర్ తన అసహనాన్ని వెళ్లగక్కింది. సౌత్ మేకర్స్ డైరెక్టర్ ఆలోచనలకు, కథలోని ఎమోషన్‌కు ఇచ్చే స్వేచ్ఛ హిందీ పరిశ్రమలో కొన్నిసార్లు లోపిస్తుందని ఘాటుగానే వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం నటీనటులకే కాకుండా సాంకేతిక నిపుణులకు, సెట్‌లో పనిచేసే ప్రతి ఒక్క క్రూ మెంబర్ పని గంటలకు ఇచ్చే గౌరవం తనను ఎంతగానో ఆకట్టుకుందని జాన్వీ పేర్కొంది. టాలీవుడ్ సెట్స్‌లో బ్రేక్ టైమింగ్స్ చాలా పక్కాగా ఉంటాయని, లంచ్ బ్రేక్ ఇస్తే ప్రతీ ఒక్కరూ కంగారు పడకుండా సుమారు 40 నిమిషాల పాటు ప్రశాంతంగా భోజనం చేయడానికి వీలవుతుందని చెప్పింది. ఆ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చే ముందు మైండ్ ఫ్రెష్ అవ్వడం కోసం కనీసం ఒక 20 నిమిషాల పాటు చిన్నపాటి నిద్ర తీసేందుకు కూడా ఇక్కడ అనుకూలమైన వాతావరణం ఉంటుందని, ఇలాంటి సౌకర్యాలు ముంబైలో చాలా అరుదుగా ఉంటాయని స్పష్టం చేసింది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ విషయంలో తెలుగు ఇండస్ట్రీ చాలా పర్టిక్యులర్‌గా ఉంటుందని, నైట్ షూట్స్ కూడా కరెక్ట్‌గా తెల్లవారుజామున 2 గంటలకే ముగించి అందరికీ సరైన రెస్ట్ దొరికేలా చూస్తారని వెల్లడించింది. తాను తెలుగులో చేసిన సినిమాల షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ఇక్కడ ఎప్పుడూ లాంగ్ షిఫ్ట్‌లు చేయాల్సిన అవసరం రాలేదని, తన మొత్తం షూటింగ్ రోజుల్లో కేవలం ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే 12 గంటల పాటు కంటిన్యూస్‌గా షూటింగ్‌లో పాల్గొనాల్సి వచ్చిందని జాన్వీ కపూర్ వివరించింది. మిగతా అన్ని రోజుల్లో కేవలం 9 నుండి 10 గంటల లోపే పక్కాగా ప్లాన్ చేసి ప్యాకప్ చెప్పేసేవారని, ఈ క్రమశిక్షణే టాలీవుడ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుందని అభినందించింది. రామ్ చరణ్ 'పెద్ది' సినిమా ఏకంగా రెండు సంవత్సరాల పాటు 285 రోజుల సుదీర్ఘ కాలం షూటింగ్ జరుపుకుందని, ఇంత టైమ్ పట్టినా ఎక్కడా క్వాలిటీ విషయంలో మేకర్స్ రాజీ పడలేదని ఎగ్జాంపుల్ గా చెప్పింది.   
Raghava Lawrence's daughter, Raghavi, is all set to make her debut in the film industry, not in front of the camera, but behind it as a director. Stepping away from the traditional path often taken by star kids, she is preparing to launch her career with her own script. Unlike many aspiring directors who begin their journey by assisting established filmmakers, Raghavi chose a different route. She did not work as an assistant director under anyone. Instead, she chose to formally study the craft and learned filmmaking internationally. With her training complete, she has now locked the script for her first feature film. To support his daughter's vision, Raghava Lawrence will be stepping in to produce her debut project. The team is currently busy conducting location recces to find the perfect setting for the film. Official details regarding the movie's title, cast, and crew will be announced very soon. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
వివాహం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. వివాహ వయస్సు కాలక్రమేణా పెరుగుతోంది. చదువు పూర్తయిన తర్వాత అబ్బాయి అయినా  అమ్మాయి అయినా  కెరీర్‌లో స్థిరపడిన సెటిల్ అయిన తర్వాత  మాత్రమే వివాహం చేసుకోవాలనుకుంటారు. అబ్బాయిలు ఆలస్యంగా వివాహం చేసుకోవడం పెద్దగా సమస్య కాదు, కానీ పెద్ద వయసులో అమ్మాయిలకు మంచి సంబందాలు రావడం లేదన్నది ఒప్పుకోవాల్సిన నిజం.  అమ్మాయిలకు వివాహానికి సరైన వయస్సు ఏమిటి అనే  విషయంపై సరైన స్పష్టత ఎక్కడా లేదు. అబ్బాయిల మాదిరిగానే అమ్మాయిలు కూడా మొదట తమ కెరీర్‌ను నిర్మించుకోవాలని, ఆ తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నారు. కానీ 30ఏళ్ల  తర్వాత ఆడపిల్లల తల్లిదండ్రులకు పెద్ద సవాల్ ఎదురవుతోంది. దీనిగురించి రెలేషన్షపి నిపుణులు చెబుతున్న విషయాలు ఏంటో తెలుసుకుంటే.. కెరీర్ అడ్డంకి.. గతంలో ఆడపిల్లల చదువు, కెరీర్ కు ఇంత ప్రాముఖ్యత లేదు.  టెంత్,  ఇంటర్,  డిగ్ర లాంటివి పూర్తవ్వగానే ఆడపిల్లలకు పెళ్ళి చేసేవారు. పెళ్లి తర్వాత మహిళలు కూడా ఇంటిని,  భర్త,  పిల్లలు, అత్తమామలను చూసుకుంటూ ఉండే వారు. కానీ నేటికాలంలో అలా లేదు.. తల్లిదండ్రులు ఆడపిల్లలను కూడా కొడుకులతో సమానంగా చదివిస్తున్నారు. ఆడపిల్లలు తమ కెరీర్ ను అద్బుతంగా మలుచుకోవడంలో సపోర్ట్ చేస్తున్నారు. దీని వల్ల ఆడపిల్లలు కూడా తమ కెరీర్ ను బిల్డ్ చేసుకుని సెటిల్ కావడానికి సమయం పడుతోంది.  అది కాస్తా 30 ఏళ్ల వరకు వివాహానికి దూరం ఉండేలా చేస్తోంది. ఇదే తల్లిదండ్రులకు పెద్ద సవాల్ గా మారుతోంది.  ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదించిన కూతురికి పెళ్లి చేయడం చాలా కష్టతరంగా మారింది. అబ్బాయిలకు కాస్త బెటర్.. అమ్మాయిల మాదిరిగానే పెద్ద వయసు అబ్బాయిలకు  కూడా వివాహం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయితే అబ్బాయి బాగా సంపాదిస్తే చిన్న వయసు అమ్మాయిల నుండి సంబంధాలు వస్తుంటాయి.  తల్లిదండ్రులు  తమ కూతురికి  ఆర్థిక భద్రత కల్పించే వ్యక్తికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటారు. అయితే అమ్మాయిల విషయంలో అలా కాదు. ఒక అమ్మాయి ఎంత సంపాదించినా, ఆమె పెద్దది అయితే మంచి జత దొరకడం కష్టంగా ఉంటుంది. అబ్బాయిలు ఆశించడమే పెద్ద సమస్య.. కాలం ఎంత మారినా అది మగవారి ఆలోచనలు మార్చలేకపోతోంది.  మగవాళ్లకు తమ భార్యల పట్ల ఉన్న అవగాహన పెద్దగా మారలేదు. చాలా మంది మగవాళ్లు ఎక్కువగా ఆశిస్తున్నారనే మాట చాలా నిజం.  భార్య అటు ఉద్యోగం చేసి సంపాదించాలి,  అలాగే ఇటు ఇంటికి రాగానే ఇంటి పనులు అన్నీ ఆమె చేసి భర్తకు సేవలు చేస్తూ పిల్లలను కూడా చూసుకోవాలని కోరుకుంటారు.  చాలా సార్లు తమ తల్లితో భార్యను పోలుస్తారు,  వస్త్రధారణ నుండి అమ్మాయి పరిచయాల వరకు, స్నేహితులు, వ్యక్తిగత స్పేస్ వంటి విషయాలలో కూడా ఆబ్బాయిలు అమ్మాయిలను చికాకు పెడతారు. ఇలాంటివి అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఇవి కాస్తా వైవాహిక జీవితంలో అడ్డంకులకు కారణం అవుతున్నాయి. అమ్మాయిల వయసు పెరిగితే ఇదే సమస్య.. 30ఏళ్ళ తర్వాత అమ్మాయిలకు వివాహం విషయంలో ఎదురయ్యే అతి పెద్ద సమస్య అమ్మాయి సంతానోత్పత్తి ఆమె వయస్సుతో ముడి పడి  ఉంటుంది. వయస్సు పెరిగే కొద్దీ అమ్మాయి సంతానోత్పత్తి తగ్గుతుంది. అమ్మాయి పెద్దదైతే ఆ జంట పిల్లల కోసం ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. ఇది వైవాహిక జీవితాన్ని సరిగ్గా ఆస్వాదించకుండా చేస్తుంది. నేటి కాలంలో అమ్మాయిలు ఆర్థిక విషయం నుండి చాలా వరకు స్వతంత్రత కలిగి ఉన్నారు.  తన సొంత ఆలోచన ఉంటుంది. ఆమె తన భర్త లేదా కుటుంబం చెప్పే ప్రతిదానితో ఏకీభవించలేదు. ఆమె తన సొంత ఆలోచనకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే భార్యభర్తల మధ్య సమస్యలు సృష్టిస్తోంది. సరైన వయసు.. మేజర్ అయితే చాలు అమ్మాయిలు, అబ్బాయిలు వివాహానికి అర్హత పొందుతారు. కానీ వివాహానికి  సరైన వయసు అనేది వ్యక్తిగతంగా ఉంటుంది.  అమ్మాయిలు కెరీర్ ను సీరియస్ గా తీసుకోవడం వివాహానికి ఇబ్బంది కలిగించే విషయమే అయినప్పటికీ చాలా మంది మహిళలు తమ కెరీర్ ను తొందరగా సెటిల్ చేసుకుని సరైన జోడి వెతుక్కుని హాయిగా సెటిల్ అవుతున్నారు.  అంటే.. వివాహం విషయంలో అబ్బాయిల  ఆలోచన కూడా ముఖ్యం.  వారు కూడా మారితేనే భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుంటుంది.                           *రూపశ్రీ.  
భార్యాభర్తల బంధం ఈ ప్రపంచంలో చాలా విభిన్నమైనది,  ఎంతో విశిష్టమైనది. భార్యాభర్తల బంధం నేటికాలంలో చాలా సున్నితంగా మారిపోయింది. ఏ విషయానికి ఎప్పుడు ఎలా గొడవలు వచ్చి, బంధం విచ్చిన్నమవుతుందో చెప్పలేం.  ఇలాంటి పరిస్థితిలో అతిగా మాట్లాడం లేదా ఎక్కువ మాట్లాడటం కూడా భార్యాభర్తల బంధాన్ని విచ్చిన్నం చేస్తుందని అంటున్నారు రెలేషన్షిప్ నిపుణులు. జరిగే ప్రతి విషయాన్ని తమ భాగస్వామితో పంచుకోవడం, ప్రతి విషయాన్ని చర్చించడం, అన్ని విషయాలు తమకు తెలిసి జరగాలి అనుకోవడం, ప్రతి చిన్న విషయం గురించి మాట్లాడటం.. ఇలా ప్రతిదీ భాగస్వామితో మాట్లాడం వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుంది అంటున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఇది తెలుసుకోవాలి.. ఒక సంబంధాన్ని బలపరచడంలో  ముఖ్యమైనది ఎక్కువ మాట్లాడటం కాదు.. ఏదైనా మాట్లాడినప్పుడు ఆ మాటలలో నిజాయితీ,  మాట్లాడే విషయం పట్ల అవగాహన,  దాని ప్రాముఖ్యత చాలా ముఖ్యమైనవి.  ఏదో ఒకటి మాట్లాడాలి అని  కబుర్లు చెప్పుకోవడంలో బంధం బలపడటం అనేది జరగదు. ఇద్దరి ఆలోచనలు, ప్రవర్తనలు, ఇద్దరూ ఏదైనా విషయం గురించి మాట్లాడటం.. ఇలాంటి సందర్బాలు చాలా కొన్నే ఉన్నా అది బంధాన్ని బలపరుస్తుంది.  ఏదో ఒకటి మాట్లాడాలనే కారణంతో అవసరం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే.. భాగస్వామి విసుగు చెంది  ఇలా కబుర్లు చెప్పడం అనే మంచి సమయానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సమయం ముఖ్యమే..  భార్యాభర్తలు రోజులో కొంత సమయం గడపడం చాలా కీలకమని నిపుణులే చెబుతున్నారు. ఇద్దరు కలిసి కొంత సమయం గడిపినప్పుడు, వారి మధ్య ఒకరి పట్ల ఒకరికి ఆసక్తి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ఎప్పుడూ ఒకరితో మరొకరు అప్యాయత, అనురాగం,  ఇద్దరి మధ్య బంధం బలపడే  అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు ఎందుకు మాట్లాడకూడదు.. కొందరు భాగస్వాములు చిన్న చిన్న విషయాలను కూడా చెబుతూ ఉంటారు. ఏ విషయాన్ని దాచుకోవడం లేదని, తాము బంధంలో ఎంతో నిజాయితీగా ఉంటున్నామని కూడా అంటుంటారు. కానీ ఇది చాలా పొరపాటు.  ప్రాముఖ్యత లేని విషయాల గురించి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య ఆసక్తి తగ్గి, అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు కలిసి గడిపే సమయం నాణ్యంగా మార్చుకోవాలి. అంచనాలకు పోవద్దు.. టీవి, సినిమా, సీరియల్, చుట్టూ ఉండే కొందరు వ్యక్తులు భార్యాభర్తల బందాలలో కొన్ని సంఘటనలు, సందర్భాలు చాలా సంతోషంగా, ఎంతో అపురూపంగా గడుపుతూ ఉంటారు.  ఇలాంటి బంధాలను చూసి తాము అలా ఉండాలని అనుకుంటారు చాలామంది. కానీ ఇలాంటి అంచనాలు పెట్టుకోవడం వల్ల చాలా అసంతృప్తి ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాస్తా భాగస్వామి విషయంలో ఒకరంటే ఒకరి పట్ల ఇష్టం,  ఆసక్తి తగ్గి,  చిరాకు, కోపం పెరిగేలా చేస్తుంది. మనిషిని బట్టే.. కొందరు ఎక్కువ మాట్లాడేవారు ఉంటారు. మరికొందరు తక్కువ మాట్లాడేవారు ఉంటారు. కాబట్టి మనిషిని బట్టి ముందుకెళ్లాలి.  బాగా మాట్లాడేవారితో ఏం మాట్లాడినా సరదాగా తీసుకుంటారు. కానీ ఎక్కువ మాట్లాడని వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు చాలా చిరాగ్గా ఫీలవుతారు.  కాబట్టి మనిషిని బట్టి సాగితేనే బంధాలు బాగుంటాయి.                                    *రూపశ్రీ.
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  "ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు. మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.                                  *నిశ్శబ్ద.
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం, చెడు  ఆహారపు అలవాట్లు శరీర రోగనిరోధక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి.. ఈ కారణంగానే పదే పదే   జలుబు, అలసట, ఇన్ఫెక్షన్లు , నీరసం వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవడానికి చాలామంది  విటమిన్ సి , విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు  తీసుకుంటూ ఉంటారు. ఇవి రెండూ రోగనిరోధక శక్తికి చాలా కీలకమైనవే. అయితే రోగనిరోధక శక్తిని బలంగా మార్చడానికి విటమిన్-సి, విటమిన్-డి.. ఈ రెండు విటమిన్లలో ఏది ముఖ్యమైనది?  వివరంగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి ఎందుకు అవసరం.. రోగనిరోధక వ్యవస్థ శరీరానికి రక్షణ కవచం వంటిది. ఇది శరీరంలోకి ప్రవేశించే వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర హానికరమైన పదార్థాలను గుర్తించి, నిర్మూలిస్తుంది. శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తే, రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది. వైద్య నివేదికల ప్రకారం విటమిన్ సి శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది , యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో , వాపును నియంత్రించడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం ఉన్నవారికి ఇన్ఫెక్షన్లు , శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కేవలం సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మాత్రమే రోగనిరోధక శక్తి బలపడదని, సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, సరైన పోషకాహారం కూడా చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ సి , డి రెండూ అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటికీ వేర్వేరు విధులు ఉన్నాయి, కాబట్టి వీటిలో దేని లోపమైనా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. విటమిన్-సి.. విటమిన్ సి ఆరోగ్యానికి అత్యవసరం, ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావిస్తారు.   ఇది శరీరంలో నిల్వ ఉండని, నీటిలో కరిగే విటమిన్, కాబట్టి ఇది ప్రతిరోజూ అవసరం. విటమిన్ సి శరీరంలోని తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది, దీనివల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో మరింత మెరుగ్గా పోరాడగలుగుతుంది.  విటమిన్ సి ఒక సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ కూడా, ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. తగినంత మోతాదులో విటమిన్ సి తీసుకోవడం వల్ల జలుబు కాలవ్యవధిని కొంత మేరకు తగ్గించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. విటమిన్-డి.. సూర్యరశ్మికి గురికావడం వల్ల విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. విటమిన్ డి ఎముకలకు మాత్రమే కాకుండా రోగనిరోధక శక్తికి కూడా అవసరం విటమిన్ డి శరీరంలోని టి-కణాలను , ఇతర రోగనిరోధక కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది.  ఈ కణాలు వైరస్‌లు , బ్యాక్టీరియాలతో పోరాడటంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. విటమిన్ డి వాపును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా శరీర రోగనిరోధక ప్రతిస్పందనను  బాలెన్స్ విటమిన్ డి లోపం ఉన్నవారికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఫ్లూ , ఇతర అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ సమయం ఇంట్లో గడుపుతూ, తక్కువ సూర్యరశ్మిని పొందే వ్యక్తులలో ఈ లోపం సర్వసాధారణం. పోషకాలను ఎలా పొందాలి? శరీరానికి అవసరమైన విటమిన్ సి , డి అందాలంటే, సరైన ఆహారం , జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం.   సిట్రస్ పండ్లు విటమిన్ సి కి మంచి వనరులు. నారింజ, ఉసిరి, నిమ్మకాయలు, జామకాయలు, క్యాప్సికమ్ , స్ట్రాబెర్రీలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి కోసం, గుడ్డు పచ్చసొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు, పుట్టగొడుగులు , పాల ఉత్పత్తులను తినడం మంచిది.                             *రూపశ్రీ.
       ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు.  మరికొందరు దీన్ని కేవలం అలసట లేదా నీరసం అని కొట్టిపారేస్తుంటారు.  అయితే ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు. . ఇది  శరీరంలో ఒక నిర్దిష్ట వ్యాధికి తొలి సంకేతం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు, దీనిని వైద్యపరంగా ప్లాంటార్ ఫాసైటిస్ అని పిలుస్తారు. ఈ వ్యాధి గురించి , దానిని నివారించడానికి ఎలాంటి జాగ్రత్తలు  తీసుకోవాలో తెలుసుకుంటే.. ఉదయం పూట చీలమండలు ఎందుకు నొప్పిస్తాయి? పాదం అరికాలి భాగం మడమ ఎముక నుండి కాలివేళ్ల వరకు ఉంటుంది. ఇది ప్లాంటార్ ఫాసియా అనే మందపాటి, బలమైన కణజాలపు పొరతో కప్పబడి ఉంటుంది. మనం నడిచేటప్పుడు లేదా పరిగెత్తేటప్పుడు ఈ పొర మన పాదాలను కుదుపుల నుండి కాపాడుతుంది. ఈ కండర పట్టీపై ఎక్కువ  ఒత్తిడి పడినప్పుడు, అది చిన్న చిన్న చిరుగులకు , వాపుకు కారణమవుతుంది. రాత్రిపూట మన పాదాలు విశ్రాంతిగా ఉన్నప్పుడు, ఈ కణజాలం సంకోచిస్తుంది. ఉదయం నిద్రలేచి నేలపై మొదటి అడుగు వేయగానే, సంకోచించిన ఈ కణజాలం అకస్మాత్తుగా మళ్లీ సాగి, తీవ్రమైన నొప్పిని కలుగజేస్తుంది. కారణాలు.. శరీరంలో పెరిగిన కొవ్వు మడమలపై నేరుగా అధికంగా ఒత్తిడిని కలుగజేస్తుంది.  చాలా పలుచగా ఉండే లేదా ఆర్చ్ సపోర్ట్ లేని చెప్పులు, బూట్లు ధరించడం వల్ల కూడా అరికాళ్ళు దెబ్బతింటాయి.  పనిలో భాగంగా  గంటల తరబడి చాలాసేపు నిలబడవలసి వస్తే.. అలాంటి వారు కూడా ఈ సమస్యను ఎదుర్కోవచ్చు.  శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం, ఎముకలు బలహీనపడటం లేదా విటమిన్ డి లోపం కూడా మడమ నొప్పిని పెంచుతాయి. ఇంటి చిట్కాలు..  మడమకు రోజుకు రెండు నుండి మూడు సార్లు 15 నిమిషాల పాటు ఐస్ పెట్టాలి. దీనివల్ల వాపు తగ్గుతుంది. మంచం దిగే ముందు కాళ్లు ఉన్నట్టుండి చాపకుండా  కాళ్లను , కాలివేళ్లను ముందుకు వెనుకకు సాగదీయాలి. ఎల్లప్పుడూ మందపాటి కుషన్ ఉన్న సౌకర్యవంతమైన పాదరక్షలను ధరించాలి. ఇంట్లో కూడా చెప్పులు లేకుండా నడవడం మానుకోవాలి. నొప్పి కొన్ని రోజుల పాటు కొనసాగితే , నడవడంలో మరింత ఇబ్బంది ఉంటే వెంటనే ఎముకల వైద్యుడిని సంప్రదించాలి.                              *రూపశ్రీ.