Home

»

Latest News

Pawan Kalyan: ఆ పని చేస్తే నా ఆస్తులు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేస్తా

Jun 2, 2026 5:53PM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం తెలంగాణలోని శంకర్ పల్లి ఏరియాలోని కోడి చెరువుకి చెందిన పది ఎకరాల భూముల్ని ఆక్రమించాడనే వార్తలు గత కొంత కాలంగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ  నేపథ్యంలో హైదరాబాద్ లోని తన నివాసంలో పవన్ మాట్లాడుతు రాజకీయ లబ్ధి కోసం కొందరు పనిగట్టుకుని నాపై  బురద జల్లుతున్నారు. ఇలాంటి ఆరోపణలు నాకు కొత్తేమీ కాదు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచే ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లు, దాడులని  ఎదుర్కొని ఇక్కడి దాకా వచ్చాం. నేను కోడి చెరువుని ఆక్రమించుకున్నట్లు కనుక నిరూపిస్తే, ఆ మరుక్షణమే ఆ ఆస్తులన్నింటినీ ప్రభుత్వానికి రాసి ఇచ్చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ బహిరంగ సవాల్ విసిరారు.

తెలంగాణ మట్టితో తనకు ఉన్న అనుబంధం కేవలం రాజకీయాల కోసం పుట్టుకొచ్చింది కాదు. కొందరు విమర్శకులు తెలంగాణలో జనసేన ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. కానీ జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ నడిబొడ్డున అనే విషయాన్ని మరువరాదు. ప్రత్యేక రాష్ట్రం అనే ఆలోచన రాకముందే తాను ఈ నేల నుంచి పోరాట స్ఫూర్తిని పొందానని, తన సినిమాల్లో సైతం ఆ తెలంగాణ జెండా, స్ఫూర్తి స్పష్టంగా కనిపిస్తాయని  చెప్పుకొచ్చాడు.

Also read: Raghava lawrence: లారెన్స్ కుమార్తె రాఘవి సంచలన నిర్ణయం.. లారెన్స్ వెనక్కి తగ్గాల్సిందేనా!

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com