సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో థియేటర్లలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సరికొత్త సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “M4M (మోటివ్ ఫర్ మర్డర్)” ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సందడి చేయడానికి సిద్ధమైంది. వెండితెరపై ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు ఇళ్లల్లో కూర్చుని వీక్షించేందుకు ఓటీటీ వేదికగా రాబోతోంది.
ఈ క్రేజీ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా రాబోయే జూన్ 19 నుండి డిజిటల్ వీక్షకులను అలరించనుంది. అయితే ఈ సినిమా కేవలం ఒక్క ప్లాట్‌ఫామ్‌కు మాత్రమే పరిమితం కాకుండా, మల్టిపుల్ ఓటీటీ వేదికలపై ఒకేసారి స్ట్రీమింగ్ కానుండటం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియో, లయన్స్‌గేట్ ప్లే మరియు జియోటీవీ వంటి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ చిత్రం ఒకేరోజు విడుదల కాబోతోంది.
హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఒక సీరియల్ కిల్లర్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. నగరంలో జరిగే వరుస హత్యలు, ఆ శవాలను ప్రముఖ పెయింటింగ్స్ తరహాలో అమర్చే కిల్లర్ మైండ్ గేమ్ చుట్టూ కథ నడుస్తుంది. ఇందులో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధా పాత్రలో ఇండో-అమెరికన్ నటి జో శర్మ నటించగా, ఏసీపీ కృష్ణగా సమ్బీత్ ఆచార్య కీలక పాత్ర పోషించారు.
దర్శకుడు, నిర్మాత మోహన్ వడ్లపట్ల.. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ చిత్రాన్ని మలిచారు. హాలీవుడ్ స్థాయిలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, క్లైమాక్స్ వరకు హూ ఈజ్ ద కిల్లర్ అనే ఉత్కంఠను రేకెత్తించడంలో దర్శకుడు విజయం సాధించారనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జో శర్మ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో మంచి రన్ సాధించింది. ముఖ్యంగా ఇసై పెట్టై అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని సినీ ప్రియులు అప్పట్లో సోషల్ మీడియాలో కొనియాడారు. థియేటర్లలో ఈ విజువల్ మిస్టరీని మిస్ అయిన థ్రిల్లర్ జోనర్ లవర్స్, జూన్ 19 నుండి తమకు నచ్చిన ఓటీటీ యాప్స్‌లో ఈ మైండ్ గేమ్ రైడ్‌ను హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.






