Home

»

Latest News

Raghava lawrence: లారెన్స్ కుమార్తె రాఘవి సంచలన నిర్ణయం.. లారెన్స్ వెనక్కి తగ్గాల్సిందేనా!

Jun 2, 2026 5:26PM

 


కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి హీరోగా, దర్శకుడిగా అభిమాన, ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న వర్సటైల్ పర్సన్ రాఘవ లారెన్స్(Raghava lawrence). ప్రస్తుతం తన లిస్ట్ లో బెంజ్, బులెట్, కాలభైరవ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.ఇప్పుడు లారెన్స్ కుమార్తె రాఘవి సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుంది.

అవును.. లారెన్స్ కుమార్తె రాఘవి(Raghavi)త్వరలోనే చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. అయితే ఆమె కెమెరా ముందుకు రావడం లేదు, మెగాఫోన్ పట్టి డైరెక్టర్ సీట్లో కూర్చోబోతున్నారు. చిత్ర పరిశ్రమలో వారసులు అనగానే కేవలం నటనపైనే దృష్టి పెడతారనే పాత సంప్రదాయానికి స్వస్తి పలుకుతూ డైరెక్టర్ గా అడుగుపెడుతుండటం  సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. 

Also read: Vijay: విజయ్, త్రిష పెళ్లి!.. ఆ డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటి

రాఘవి(Raghavi)దర్శకత్వ బాధ్యతతో పాటు తన మొదటి చిత్రానికి స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చుకుంటున్నారు. ఎంతో కాలంగా ఆమె ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నారని, ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తయిందని సమాచారం. తండ్రి లారెన్స్ లాగే సినిమాలోని అన్ని విభాగాలపై అవగాహన పెంచుకున్న రాఘవి, తన స్క్రిప్ట్‌తో ఇండస్ట్రీలోని ప్రముఖులని మెప్పించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో సరికొత్త కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకోనుందని టాక్. మరి రాఘవి మొదటి మూవీ తెలుగులో ఉంటుందా లేక తమిళంలో ఉంటుందా చూడాలి. అదే టైం లో దర్శకురాలిగా లారెన్స్ ని మించిపోతుందేమో అనే ఆసక్తి కూడా అందరిలో ఉంది.

  

 

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com