LATEST NEWS
  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ సారథ్యంలో నిర్వహించిన వాస్తవ వేదికలో దేశ రాజకీయ పరిస్థితులపై జమీన్ రైతు’ సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ పాల్గొని సమకాలీన రాజకీయాలపై ఆసక్తికరమైన  విశ్లేషణాత్మక చర్చ జరిగింది. భారతీయ రాజకీయ ముఖచిత్రంలో ఒకప్పుడు ప్రజా సమస్యలు, సిద్ధాంతాలపై జరిగే చర్చలే ప్రధానంగా ఉండేవి. కానీ, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రం గమనిస్తే ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తోందని డోలేంద్ర ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవల అత్యున్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తులు దేశ యువతను, ఆర్టీఐ కార్యకర్తలను ఉద్దేశించి "కాక్రోచెస్" (బొద్దింకలు), "పారాసైట్స్" (పరాన్నజీవులు) వంటి అగౌరవ పదాలను ఉపయోగించడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ప్రశ్నించే హక్కును ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా భావించాల్సింది పోయి, అలా ప్రశ్నించే వారిని "అర్బన్ నక్సలైట్లు" అని ముద్రవేయడం ప్రస్తుత రాజకీయాలలోని అసహనానికి నిదర్శనంగా నిలుస్తోందని  జమీన్ రైతు సంపాదకుడు విశ్లేషించారు. దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, నైరాస్యం వంటి తీవ్రమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి. యువత తమ ప్రతిభకు మరియు నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించక తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అయితే, ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాలకులు విమర్శకులను అణచివేసే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.  ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి, రోజులో 24 గంటలూ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడే తత్వం పెరిగిపోయింది. సమాజంలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు సాయం చేయడం కంటే, అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ సామాజిక బాధ్యత లేకుండా ప్రవర్తించే యువతను కూడా మనం చూస్తున్నాం. ఇది యువతలో నైతిక విలువల క్షీణతను సూచిస్తోంది. ప్రస్తుత రాజకీయ పార్టీలైన తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మరియు దేశవ్యాప్తంగా బీజేపీ వంటి పార్టీలు యువతను లేదా సరికొత్త తరం (జెన్-జీ) ను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయి. ప్రజల్లో ఈ పార్టీల పట్ల నమ్మకం పూర్తిగా సన్నగిల్లింది. ఏ ఒక్క ప్రజా సమస్యపైనా సరైన చర్చ గానీ, కఠినమైన చర్యలు గానీ లేకపోవడం వల్ల ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులలో ఒక రకమైన తీవ్ర నిరాశ, ఫ్రస్ట్రేషన్ నెలకొంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో దేశ రాజకీయాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నాయి. సమాజంలో పేరుకుపోతున్న ఈ అసంతృప్తి ఒక అగ్నిపర్వతం లాంటిది, ఇది ఏ క్షణంలోనైనా బద్దలు కావచ్చు. ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుని, యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రజాస్వామ్య విలువలను రక్షించకపోతే, భవిష్యత్తులో రాజకీయ పార్టీలపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చే ప్రమాదం ఉంది. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం కాకుండా, ప్రజాస్వామ్యంపై ప్రజలకు మళ్లీ విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత పాలకులపై ఎంతైనా ఉందని డోలేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇలాంటి వివరాలు కంఠంనేని రవిశంకర్ – డోలేంద్ర ప్రసాద్ మధ్య జరిగిన పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.    
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ భారతదేశ రాజకీయాల్లో,  సోషల్ మీడియా వేదికల్లో ఈ మధ్య కాలంలో  కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు మార్మోగిపోతున్నది. గ్రామ స్థాయి నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా ఈ పేరు మారుమోగిపోతోంది. రోజురోజుకీ ఈ వినూత్న డిజిటల్ ఉద్యమానికి ఫాలోవర్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అసలు ఏమిటీ కాక్రోచ్ జనతా పార్టీ? దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? దీనివల్ల ఇండియాలో  కూడా శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో వచ్చినట్లు ప్రజా విప్లవాలు వస్తాయా అనే చర్చలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ తీవ్రమైన రాజకీయ పరిణామాలపై ప్రముఖ థింక్ ట్యాంక్  సెంటర్ ఫర్ లిబర్టీ అధినేత నలమోతు చక్రవర్తి  తెలుగువన్  ఇంటర్వ్యూలో అనేక లోతైన విశ్లేషణ చేశారు.  ఆయన మాటల్లో చెప్పాలంటే..  కాక్రోచ్ జనతా పార్టీ అనేది కేవలం ఒక బాహ్య లక్షణం మాత్రమే..  దీని వెనుక  చాలా లోతైన, మౌలికమైన వ్యవస్థాపక సమస్యలు  ఉన్నాయి. ఇండియాను  చాలా సంవత్సరాలుగా ముందుకు సాగకుండా అడ్డుకుంటున్న నిరుద్యోగం, క్రోనీ క్యాపిటలిజం,  విపరీతమైన పన్నుల విధానాల వల్ల నేటి యువతలో ఉన్న తీవ్రమైన ఫ్రస్ట్రేషన్, నిస్తేజం,  నిరుత్సాహానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఒక ప్రతిరూపంగా నిలుస్తోంది. ఇదొక వ్యంగ్యాస్త్రం లాంటిది. అంతే తప్ప వ్యవస్థీకృత రాజకీయ ఉద్యమం కాదని  నల్లమోతు చక్రవర్తి అన్నారు.   నేడు దేశంలో యువతకు కావాల్సింది  గౌరవప్రదమైన ఉపాధి,   మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు. మన పక్కనే ఉన్న చిన్న దేశాలు అనూహ్యమైన ఆర్థిక ప్రగతిని సాధిస్తుంటే.. భారతదేశం మాత్రం వెనకబడిపోతోందన్న బాధ యువతను వేధిస్తోంది.  చైనా మనకంటే 5 నుంచి 6  రెట్లు ఆర్థికంగా ఎదిగింది,  దక్షిణ కొరియా జపాన్ కంటే సంపన్న దేశంగా మారింది. తైవాన్, హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాలు అద్భుతమైన అభివృద్ధిని కనబరుస్తున్నాయి. కానీ ప్రపంచంలోనే అతి పెద్ద యువశక్తి ఉన్న ఇండియా మాత్రం వెనుకబడిపోయింది. యువశక్తిని సరిగా ఉపయోగించుకోవడంలో  ఇండియా  రాజకీయ నాయకులు, పాలకులు, సమాజం విఫలమేనని చెప్పక తప్పదని నల్లమోతు అన్నారు.  ఇండియా ప్రస్తుతం ప్రపంచంలో 5  లేదా 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చలామణి అవుతున్నప్పటికీ..  సగటు తలసరి ఆదాయం విషయానికి వస్తే మనం ప్రపంచంలో 140వ స్థానంలో ఉన్నామనే చేదు నిజం , మన ఆర్థిక విధానాల వైఫల్యానికి అద్దం పడుతోంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వాలు అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలు, అలాగే  ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాలు. దేశంలో బ్యాంకుల దగ్గర ఉన్న మొత్తం ధనం దాదాపు 640 లక్షల కోట్లు. ఈ డబ్బే దేశంలో కొత్త పరిశ్రమల స్థాపనకు,  ఉపాధి కల్పనకు పెట్టుబడిగా మారాలి. కానీ.. మన ప్రభుత్వాలు దాదాపు 300 లక్షల కోట్లను వివిధ రకాల ఉచిత పథకాలకు, ఉచిత బస్సు ప్రయాణాలకు, ఉచిత సిలిండర్లకు,  అవినీతిమయమైన ప్రాజెక్టులకు మళ్లించి పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి.  ఉదాహరణకు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ఏకంగా 1.5 లక్షల కోట్లు తగలబెట్టారని..  దీనివల్ల మార్కెట్లో ఉపాధి పెంచేందుకు అవసరమైన క్యాపిటల్ లేకుండా పోయిందని చక్రవర్తి   గణాంకాలతో వివరించారు.  చైనా వంటి దేశాలు మౌలిక సదుపాయాలు, సోలార్ ప్రాజెక్టులు, పరిశ్రమలకు విద్యుత్ అందించడంపై ఖర్చు పెడితే, మన దేశంలో అప్పులు తెచ్చి మరీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం, ఉచితాలు పంచడం అలవాటుగా మార్చారు. డిగ్రీలు పూర్తి చేసి 4 నుంచి 5 ఏళ్లు దాటినా యువత రోడ్ల మీద తిరుగుతున్నారు. ఏదైనా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వచ్చినా కూడా..  4 ఏళ్ల అనుభవం ఉన్న వారికి కూడా కేవలం 4 లక్షల వార్షిక ప్యాకేజీ మాత్రమే లభిస్తోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దేశంలో క్రోనీ క్యాపిటలిజం తారస్థాయికి చేరింది. కేంద్రంలో కొద్దిమంది కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తే, రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి వాటి  సొంత వ్యాపార సంస్థలు ఉన్నాయి. పాలకులు,  వారి అనుకూల వ్యాపారవేత్తలు మాత్రమే సంపన్నులుగా మారుతున్నారు  సామాన్య ప్రజలకు ఆ సంపద అందడం లేదు. దేశంలో పన్నుల దోపిడీ విపరీతంగా పెరిగిపోయింది. పెట్రోల్ మీద దాదాపు 100 శాతం పన్నులు విధిస్తున్నారు, నిత్యావసర వస్తువులపై ఏకంగా 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. సామాన్యుడు కష్టపడి సంపాదించే ప్రతి 10 రూపాయలలో మెజారిటీ వాటా ప్రభుత్వం పన్నుల రూపంలో లాక్కుంటోంది.  ఒక వ్యక్తి తన సొంత ఫ్లాట్‌ను మరొకరికి అమ్ముకోవాలన్నా ప్రభుత్వానికి లక్షల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజులు కట్టాల్సి వస్తోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ ఫీజులను ఏకంగా నాలుగు రెట్లు పెంచేందుకు   ప్రతిపాదనలు సిద్ధం చేయడం ఈ దోపిడీకి పరాకాష్ట. ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచం ఇవ్వకుండా పని చేసే ఒక్క తాహసిల్దార్ ఆఫీస్ కానీ, ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఒక్క పోలీస్ స్టేషన్ కానీ, బిల్డింగ్ పర్మిషన్, కరెంట్, వాటర్ కనెక్షన్ ఇచ్చే ఒక్క విభాగం కూడా దేశంలో ఎక్కడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు ప్రతి ఇసుక రీచ్, మైనింగ్, వైన్ షాప్,  కాంట్రాక్టర్ల దగ్గర పర్సంటేజీలు,  కమిషన్లు వసూలు చేస్తూ కోట్లు గడిస్తున్నారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారినా..  మరమ్మతులకు ప్రభుత్వాల దగ్గర పైసా నిధులు లేవని చేతులెత్తేస్తున్నారు. ఈ వ్యవస్థాగత దోపిడీ వల్లే ప్రజలు తీవ్రంగా విసిగిపోయి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఇక ఈ కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం భయపడి వారి ఎక్స్   ఖాతాను నిలిపివేసింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలా గొంతు నొక్కడం, ఖాతాలను బ్యాన్ చేయడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తిగా వ్యతిరేకం. శాంతిభద్రతల సమస్య  సాకుతో అకౌంట్లు మూసివేయడం పాలకుల చేతగానితనమే అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రజల నిరసనలను నేరుగా ఎదుర్కొని, చర్చల ద్వారా వారి కోపాన్ని డిఫ్యూజ్ చేయాలి తప్ప..  ఇలా పారిపోవడం దొంగతనానికి సమానమని నల్లమోతు చక్రవర్తి అన్నారు.  దేశంలో ఎన్నికల కమిషన్ లాంటి ఎంపైర్ వ్యవస్థలపై కూడా ప్రజల్లో నమ్మకం పోయింది.   2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లకు పడిపోయి మెజారిటీ కోల్పోవడానికి ప్రజల్లో ఉన్న ఈ తీవ్ర వ్యతిరేకతే కారణం. తమిళనాడులో నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమే అయినా..  ఆయన కూడా పాత ఉచితాల విధానాలనే నమ్ముకోవడం నిరాశకలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, 2019 నుంచి 2024 వరకు వైసీపీ సాగించిన అరాచక, అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్ల భారీ మెజారిటీ ఇచ్చారు. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా అవినీతి, లంచగొండితనం కొనసాగుతుండటంపై ప్రజల్లో మళ్లీ అసంతృప్తి మొదలైంది. జయప్రకాష్ నారాయణ , వీవీ లక్ష్మీనారాయణ, ప్రవీణ్ కుమార్ వంటి మేధావులు ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రయత్నించి విఫలమవడంతో ప్రజల్లో కొంత నమ్మకం సడలింది. ఏది ఏమైనప్పటికీ.. కాక్రోచ్ జనతా పార్టీ లాంటి చిన్న చిన్న విత్తనాలు భవిష్యత్తులో పెద్ద విప్లవాలుగా మారతాయా లేదా అనేది కాలమే నిర్ణయించాలి, కానీ పాలకుల గుండెల్లో మాత్రం ఇవి వణుకు పుట్టిస్తున్నాయనేది పచ్చి నిజం.  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రజాదరణ కలిగిన రాజకీయ నాయకులలో ఒకరు. నాలుగు దశాబ్దాలకు  రాజకీయాల్లో ఆయన క్రియాశీలంగా ఉన్నారు.చంద్రబాబు అందరితో కలిసిపోయి..   వారి మాటలను సావధానంగా వింటారు. ప్రస్తుతం జరుగుతున్న మహానాడు విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపించింది.   చంద్రబాబు నాయుడు ఎంతోమంది సామాన్యులకు తనను కలవడానికి, తనతో మాట్లాడటానికి మహానాడును వేదికగా మార్చారు.  చంద్రబాబు తన పక్కన సామాన్యులైన పలువురికి చోటు కల్పించారు.  వారికి చంద్రబాబుతో కూర్చుని మాట్లాడే అవకాశం లభించింది. ఇదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విషయంలో  మచ్చుకైనా  కనిపించదు. ఎందుకంటే ఆయన సాధారణంగా పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులతో  కూడా సంభాషించడానికి సుముఖంగా ఉండరు.  ఆయనకు ప్రజల్లో ప్రజలతో స్పష్టమైన అనుబంధం ఉండవచ్చు, కానీ రాజకీయ కార్యక్రమాల సమయంలో వేదికపై  కలుపుగోలుతనం  కలికానిక్కూడా కనిపించదు. వైఎస్ జగన్‌తో సహా మిగతా వారందరి నుండి చంద్రబాబును వేరుచేసేది చంద్రబాబులోని ఈ కలుపుగోలు తనమేనని పరిశీలకులు విశ్లేషిస్తునారు.    ఇక తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ మహానాడు 2026 విషయానికి వస్తే.. ఈ సారి మహానాడు సరికొత్త రాజకీయ ఒరవడికి వేదికైంది. నెల్లూరులో భారీ ఎత్తున ఏర్పాటు చేయాలనుకున్న ఈ వేదికను, మోడీ ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో   మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా హైబ్రిడ్ మోడల్‌లోకి  మార్చారు. ఆధునిక సాంకేతికతను జోడించి డిజిటల్ పద్ధతిలో నిర్వహించిన ఈ సరికొత్త మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సమ్మిళిత రాజకీయాల విధానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ వేదికపై నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాజంలోని అన్ని వర్గాలను కలుపుకొనిపోయే విధంగా నూతన పాలనా సంస్కరణలను ప్రకటించారు. సంక్షేమం,  అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించే చంద్రబాబు.. ఈ మహానాడు ద్వారా  వృద్ధులు, చేతివృత్తుల వారికి అండగా నిలిచేందుకు సామాజిక పెన్షన్ మొత్తాన్ని  పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ స్థాయిలో పెన్షన్ అందించడం ద్వారా పేదరిక నిర్మూలన దిశగా అడుగులు వేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేవలం పెన్షన్లకే పరిమితం కాకుండా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి అన్నదాతలను ఆదుకునేందుకు ప్రతి రైతుకు ఏటా పెట్టుబడి సాయాన్ని అందిస్తామని ప్రకటించడం పట్ల రైతాంగంలో హర్షం వ్యక్తం అవుతోంది. మహానాడు వేదికగా కూటమి రాజకీయాల ప్రాముఖ్యతను చంద్రబాబు నాయుడు నొక్కి చెప్పారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలిసి నడుస్తున్న ఈ ప్రయాణం కేవలం తాత్కాలిక రాజకీయ అవసరం కాదని, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ఒక చారిత్రాత్మక మైలురాయిగా చంద్రబాబు అభివర్ణించారు.   వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో  కలిసే పోటీ చేస్తామని ప్రకటించి కూటమిలో విభేదాలపై విపక్షాల ఊహాగానాలకు చెక్ పెట్టారు.   
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  కొడాలి నాని మళ్లీ వార్తల్లో నిలిచారు. గత సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత దాదాపు   క్రియాశీల రాజకీయాలకు,  దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల ఆయన మళ్లీ ప్రజల ముందుకు రావడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆయన తాను సుదీర్ఘ కాలం రాజకీయాలకు దూరంగా ఉండటానికి కారణం వెల్లడించారు.   తన రాజకీయ అజ్ఞాతవాసానికి   తనకు జరిగిన బైపాస్ సర్జరీయే కారణమన్నారు. సర్జరీ తరువాత  కనీసం 6 నెలలు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం వల్లనే తాను గుడివాడకు, రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు.   ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే తాను బయటకు రాలేకపోయానని, రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని  కొడాలి నాని చెప్పారు.   వైసీపీ అధినేత జగన్ తో తాడేపల్లి ప్యాలెస్ లో భేటీ అనంతరం బుధవారం (మే 27) మీడియాతో మాట్లాడిన ఆయన యథాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై పరుష పదజాలంతో విమర్శలు గుప్పించారు. అయితే.. ఆ సందర్భంగా ఆయన  శైలి గతానికి పూర్తి భిన్నంగా కనిపించింది. సాధారణంగా కొడాలి నాని,  చంద్రబాబు,  ఆయన కుటుంబ సభ్యుల పట్ల తీవ్రమైన ద్వేషంతో  మాట్లాడతారు. చంద్రబాబు తనకు వ్యక్తిగత శత్రువు అన్నట్లుగా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. చంద్రబాబుపై విమర్శలకు ఆయన అభ్యంతరకరమైన భాషను ఉపయోగిస్తుంటారు. కానీ బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అటువంటిదేదీ కనిపించలేదు. ఎవరో ఒత్తిడి చేయడం వల్ల మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారా అనిపించేలా ఆయన బాడీ లాంగ్వేజ్ ఉంది.  ఏదో నామ్ కే వాస్తే విమర్శలు చేసినట్లుగా అనిపించింది తప్ప.. గతంలో ఆయన మాటల్లో ఉన్న కసి, ఆవేశం ఇసుమంతైనా కనిపించలేదు.  జగన్ లేదా వైసీపీ అగ్రనేతల ఒత్తిడి కారణంగానే ఆయన మీడియా ముందుకు వచ్చి చంద్రబాబుపై విమర్శలు చేసినట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాలుగు రాష్ట్రాలకు  కొత్త సారథులను ప్రకటించింది.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.  ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా,  ఈశాన్య రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రాలకు కొత్త రాష్ట్ర అధ్యక్షులను నియమించారు.   రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహాలను దృష్టిలో ఉంచుకుని ఈ  మార్పులు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఢిల్లీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర సహాయ మంత్రి, తూర్పు ఢిల్లీ  ఎంపీ హర్ష్ మల్హోత్రా నియమితులయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఎంపీగా గెలుపొందిన హర్ష్ మల్హోత్రా.. ప్రస్తుతం కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు,   రవాణా,  రహదారుల శాఖల సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించనున్నారు.  అలాగే  పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, కేవల్ సింగ్ థిల్లాన్‌కు అప్పగించారు. గతంలో 2012 నుండి 2017 వరకు బర్నాలా నియోజకవర్గం నుండి పంజాబ్ అసెంబ్లీ సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడైన థిల్లాన్, 2022 జూన్ 4న బీజేపీలో చేరారు. శిరోమణి అకాలీదళ్‌తో తెగదెంపులు చేసుకున్న తర్వాత పంజాబ్‌లో ఒంటరిగా తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి, థిల్లాన్ అనుభవం,  క్షేత్రస్థాయి వ్యూహాలు ఎంతగానో కలిసి రానున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.    హర్యానా రాష్ట్ర బీజేపీ అధ్యక్సురాలిగా  సీనియర్ మహిళా నాయకురాలు డాక్టర్ అర్చనా గుప్తాను కమలం అధిష్ఠానం నియమించింది. ఇక ఈశాన్య భారతంపై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ, త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడిగా అభిషేక్ దెబ్రాయ్‌ను ఎంపిక చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాతాబారి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన అభిషేక్, ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పట్టును మరింత బిగించడానికి కృషి చేయనున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
తెలుగు సినిమా చరిత్రను శాసించిన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు జ్ఞాపకాలు మరోసారి భాగ్యనగరంలో ఘనంగా ఆవిష్కృతమయ్యాయి. తెలుగువారి గుండెల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్‌లో అత్యంత వైభవంగా ప్రారంభించారు. టాలీవుడ్ లెజెండ్‌గా, ప్రజానాయకుడిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న అన్నగారి విగ్రహం ఇప్పుడు నగర నడిబొడ్డున ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్‌లోని ప్రముఖ వ్యాపార కేంద్రమైన అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ 23 అడుగుల భారీ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఘనంగా ఆవిష్కరించారు. గతంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచార సమయంలో మైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ నగరంలోని సినీ అభిమానుల చిరకాల వాంఛను ఆయన నెరవేర్చారు. ఈ అద్భుతమైన విగ్రహ ఏర్పాటు ప్రక్రియ వెనుక స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, విగ్రహ స్థాపన పనులను ఆయనే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించారు. అత్యంత కళాత్మకంగా రూపొందించిన ఈ విగ్రహం అమీర్‌పేట గుండా వెళ్లే ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకట్టుకుంటోంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్ చేసిన సేవలు అనన్యం. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు ఇప్పటికీ నటీనటులకు పాఠ్యపుస్తకాలుగా నిలుస్తాయి. రాముడు, కృష్ణుడు అనగానే ఇప్పటికీ తెలుగు సమాజానికి ఎన్టీఆర్ రూపమే గుర్తొస్తుంది. వెండితెరపైనే కాకుండా రాజకీయాల్లోనూ ఆయన సృష్టించిన ప్రభంజనం చరిత్రలో లిఖించబడింది. ఈ విగ్రహ ఆవిష్కరణ వార్త తెలియగానే నందమూరి అభిమానులు, టాలీవుడ్ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా "జై ఎన్టీఆర్" అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. విగ్రహం వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్ పూలమాలలు వేసి, నినాదాలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన మైత్రీవనంలో ఈ విగ్రహం కొలువుదీరడం సినీ రంగానికి దక్కిన గౌరవంగా ఇండస్ట్రీ పెద్దలు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కూడలి నందమూరి అభిమానులకు ఒక ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కోలీవుడ్ వైవిధ్యభరిత హీరో సూర్య ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన‌ క్రేజీ ప్రాజెక్ట్ ‘కరుప్పు’. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఎంత‌టి ఘ‌న‌విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సమాచారం ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి, తమిళనాడు సీఎం విజయ్‌కు మధ్య ఒక విడదీయరాని అనుబంధం ఉందనే విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నిజానికి ఈ కథ సూర్య కంటే ముందే దళపతి విజయ్ దగ్గరకు వెళ్ళింది. దాదాపు రెండేళ్ల క్రితం విజయ్ తన సినీ కెరీర్‌కు గుడ్ బై చెప్పే క్రమంలో.. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఆయన కోసం ఈ లైన్ సిద్ధం చేశారు. విజయ్ చివరి సినిమాగా ఇదే ఉండాలని ఇరువురి మధ్య రెండు మూడు సార్లు సుదీర్ఘమైన కథా చర్చలు కూడా జరిగాయి. కానీ, పొలిటికల్ ఎంట్రీ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్‌ను సున్నితంగా తిరస్కరించారు. అయితే విజయ్ ఈ సినిమా చేయకపోయినప్పటికీ, కథా చర్చల సమయంలో ఆయన ఇచ్చిన ఇన్‌పుట్స్‌, అడిగిన ప్రశ్నలు స్క్రిప్ట్‌ను మరింత పదును పెట్టడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని దర్శకుడు ఆర్జే బాలాజీ స్వయంగా వెల్లడించారు. విజయ్ ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ వల్లే ఈ స్క్రిప్ట్ మరింత మెరుగ్గా మారిందని, ఆ తర్వాత సూర్యకు ఈ కథ చెప్పగానే ఆయన సింగిల్ సిట్టింగ్‌లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలాజీ పేర్కొన్నారు. గతంలో సూర్య, విజయ్ ఇద్దరూ కలిసి ‘ఫ్రెండ్స్’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరి మధ్య రియల్ లైఫ్‌లోనూ మంచి సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు విజయ్ వదిలేసిన ప్రాజెక్ట్‌ను సూర్య ఓకే చేయడం, దానికి విజయ్ బ్యాక్‌గ్రౌండ్ సపోర్ట్ ఉండడం అభిమానుల్లో సరికొత్త జోష్ నింపుతోంది. అంతేకాకుండా, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో విజయ్ చేసిన సహాయానికి గుర్తింపుగా చిత్ర యూనిట్ సినిమా ప్రారంభంలో ఆయనకు ప్రత్యేకంగా ‘థ్యాంక్స్ కార్డ్’ కూడా వేసింది. విశేషం ఏంటంటే, ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయ్.. ఈ చిత్రం విడుదల తర్వాత ప్రత్యేకంగా చిత్ర యూనిట్‌ను అభినందించడమే కాకుండా, తన పదవీ కాలంలో ఈ సినిమాకు కొన్ని ప్రత్యేక అనుమతులు కూడా మంజూరు చేయడం గమనార్హం. ఈ బ్యాక్ స్టోరీ విన్న సినీ అభిమానులు, ముఖ్యంగా దళపతి మరియు సూర్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ కనెక్షన్ గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. కథను అంతలా మార్పించిన విజయ్ జడ్జిమెంట్, దాన్ని అంతే పవర్‌ఫుల్‌గా స్క్రీన్ పైకి తెస్తున్న సూర్య పట్టుదలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' ప్రమోషన్స్ దేశవ్యాప్తంగా జోరందుకున్నాయి. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా చరణ్ దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేస్తూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో చరణ్ తనదైన శైలిలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఈసారి ఢిల్లీ వేదికపై రామ్‌చరణ్ ఒక సరికొత్త వ్యూహాన్ని అమలు చేశారు. గతంలో భోపాల్‌ లో జరిగిన ప్రచార వేడుకల్లో చరణ్ హిందీలో మాట్లాడటానికి ప్రయత్నించి కొద్దిగా తడబడ్డారు. తనకు హిందీ అంతగా రాదంటూనే ప్రసంగించిన క్రమంలో భోపాల్ బదులు బిహార్ అనడం, క్రికెటర్ బుమ్రాను ఫుట్‌బాల్ ప్లేయర్‌గా పేర్కొనడం వంటి చిన్న పొరపాట్లు జరిగాయి. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు కొంతవరకు ట్రోల్స్ చేశారు. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ఈవెంట్‌లో హిందీ జోలికి వెళ్లకుండా పూర్తిగా ఇంగ్లీష్‌లోనే అనర్గళంగా మాట్లాడారు. అంతేకాదు, ప్రసంగం మధ్యలో ఒకరి పేరు గుర్తుకురాకపోతే వెంటనే తన టీమ్‌ను అడిగి కన్ఫర్మ్ చేసుకుని మరీ మైక్ ముందుకు వచ్చారు. దీంతో ట్రోలర్స్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చరణ్ ఈ ఈవెంట్‌ను సూపర్ సక్సెస్ చేశారు. ఈ వేడుకలో సినిమా గురించి చరణ్ మాట్లాడుతూ.. 'పెద్ది' సినిమా ముఖ్యంగా పిల్లలకు ఎంతగానో నచ్చుతుందని, తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి థియేటర్లకు వచ్చి చూడదగ్గ అద్భుతమైన చిత్రమని భరోసా ఇచ్చారు. ఈ సినిమా చూసిన ఏ ఒక్క పేరెంట్ కూడా నిరాశ చెందరని నమ్మకంగా చెప్పారు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు 'పెద్ది' చిత్రయూనిట్‌కు మద్రాస్ హైకోర్టు నుండి ఒక బిగ్ రిలీఫ్ లభించింది. సినిమా విడుదలకు ముందే లీకులు, పైరసీ ఇబ్బందులను అరికట్టేందుకు కోర్టు యాంటీ పైరసీ ఇంజెక్షన్ ఆర్డర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం సినిమా క్లిప్స్ లీక్ చేసినా లేదా అనధికారికంగా స్ట్రీమింగ్ చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే హక్కును మేకర్స్‌కు కల్పించింది. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి లీగల్ ప్రొటెక్షన్ లభించడం పట్ల ట్రేడ్ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో చరణ్ ఢిల్లీ స్పీచ్ వీడియో తెగ వైరల్ అవుతోంది. భోపాల్ ఇన్సిడెంట్ తర్వాత చరణ్ చాలా స్మార్ట్ గా వ్యవహరించారంటూ ఫ్యాన్స్ మరియు సినీ విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi),గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)తో అదిరిపోయే స్టెప్స్ వేసి తన కంటు ఒక బ్రాండ్ సృష్టించుకున్న పాన్ ఇండియా భామ 'ఊర్వశి రౌతేలా'(urvashi rautela). రీసెంట్ గా జరిగిన 'కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026 వేడుకల్లో వరుసగా 5వ సారి తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో సన్సేషన్ సృష్టించింది. రీసెంట్ గా  ఊర్వశికి  సంబంధించిన ఒక షాకింగ్ ఏఐ చిత్రం ఇంటర్నెట్‌ని  కుదిపేస్తోంది. ఈ ఫోటోలో ఊర్వశి రౌతేలా ఇతర సీనియర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ల సింహాసనాల ముందు మోకాళ్లపై కూర్చుని, వారి కాళ్లు పట్టుకున్నట్లుగా చూపించడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ వివాదాస్పద ఏఐ చిత్రం బాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్ల గ్లోబల్ స్టార్‌డమ్, వారి స్థానాలని  ఒక క్రమపద్ధతిలో ర్యాంకింగ్ ఇస్తూ రూపొందించబడింది.  అగ్ర నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ఒక పెద్ద సింహాసనంపై సుప్రీం స్థానంలో కూర్చుని ఉండగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా  దాని పక్కనే ఉన్న మరొక చిన్న సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు చూపించారు. ఇక వారి ఇరువైపులా స్టార్ హీరోయిన్లు మాధురీ దీక్షిత్, దీపికా పదుకొణె నిలబడి ఉండగా.. కింద నేలపై మోకాళ్లపై కూర్చుని వారి పాదాలని  తాకుతున్నట్లుగా ఊర్వశి రౌతేలా, అలియా భట్, కత్రినా కైఫ్, కరీనా కపూర్ ల చిత్రాలని  ఏఐ సాయంతో సృష్టించారు. గ్లోబల్ గుర్తింపులో ఊర్వశి రౌతేలా తక్కువ స్థానంలో ఉందనే అర్థం వచ్చేలా ఈ మార్ఫింగ్ చిత్రాన్ని రూపొందించడం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఒకవైపు అంతర్జాతీయ వేదికపై ఇంతటి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో, తనని  తోటి నటీమణుల కాళ్ల వద్ద మోకరిల్లినట్లు చూపించడంపై ఊర్వశి తీవ్రంగా స్పందించింది.  తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో  వైరల్ ఏఐ పిక్‌ని షేర్ చేస్తూ  సుదీర్ఘమైన, భావోద్వేగభరితమైన పోస్ట్‌ను పెట్టింది. "ఇలాంటి విషపూరితమైన సంస్కృతిని ఇకనైనా ఆపండి. చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్క హీరోయిన్‌కి  తనదైన స్వంత ప్రయాణం, కఠిన శ్రమ, మరియు విధి ఉంటాయి. మహిళల మధ్య లేనిపోని విభేదాలు సృష్టించడం, ఫ్యాన్ వార్స్‌ని  ప్రోత్సహించడం వల్ల సమాజంలో కేవలం ప్రతికూలత మాత్రమే పెరుగుతుంది. సినిమా రంగంలో ఉన్న మహిళలందరినీ సమానంగా గౌరవించాలి. ఒకరి ప్రతిభని  మరొకరితో పోల్చకుండా ప్రతి ఒక్కరి ఎదుగుదలని , కష్టాన్ని, వారిలోని దయాగుణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఊర్వశి పిలుపునిచ్చింది.  రీసెంట్‌గా రణదీప్ హుడాతో కలిసి 'ఇన్‌స్పెక్టర్ అవినాష్ 2' అనే వెబ్ సిరీస్‌లో నటించిన ఊర్వశి, ఈ ఏఐ వివాదంతో మరోసారి వార్తల్లో నిలిచింది. Also read: Pawan Kalyan: భేటీకి మమ్మల్ని పిలవలేదంటు యువ నిర్మాత సంచలనం.. పవన్ ఏమంటారో సెలబ్రిటీల మధ్య ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పట్నుంచో ఉన్నాయి. ఎవరి అభిమాన నటుడు లేదా నటి వారికే గొప్ప. అయితే, ఈ మధ్యకాలంలో  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ వార్స్ సరికొత్త రూపాన్ని సంతరించుకున్నాయి. సెలబ్రిటీల ముఖాలని  మార్ఫింగ్ చేస్తూ, విచిత్రమైన ఊహాజనిత చిత్రాలని  సృష్టిస్తూ వైరల్ చేయడం నెటిజన్లకి ఒక అలవాటుగా మారింది.    
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటీవల జరిగిన ఒక కీలక పరిణామం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ అగ్ర నిర్మాతలు, ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా భావించే చిరు నివాసంలో జరిగిన ఈ భేటీపై సీపీఐ జాతీయ నేత నారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించడం సంచలనం రేపుతోంది. ఈ సమావేశం వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై నారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఈ భేటీలో పరిశ్రమ బాగు కోసం చర్చించారా, లేక లాభాల వాటాలు పంచుకోవడంపై మాట్లాడుకున్నారా? అంటూ ఆయన ఘాటుగా ప్రశ్నించారు. భారీ బడ్జెట్ సినిమాల పేరుతో సామాన్య ప్రేక్షకుల జేబులకు చిల్లులు పెట్టేలా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఇటీవల కాలంలో టికెట్ ధ‌ర‌లు పెంపు, అర్ధరాత్రి బెనిఫిట్ షోల అనుమతులపై నారాయణ మండిపడ్డారు. పెద్ద సినిమాలు వస్తున్నాయనే నెపంతో నిర్మాతలు పదేపదే రేట్లు పెంచుకుంటూ పోతుంటే, ప్రభుత్వాలు కూడా అడిగిందే తడవుగా జీవోలు జారీ చేయడంపై ఆయన దుయ్యబట్టారు. సినిమా అనేది కేవలం సామాన్యుడి వినోద సాధనమని, దాన్ని వ్యాపార దోపిడీగా మార్చవద్దని హితవు పలికారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వాల వద్ద సరైన విధివిధానాలు లేకపోవడాన్ని నారాయణ తప్పుబట్టారు. ఒక స్పష్టమైన పాలసీ లేకపోవడం వల్లే సామాన్య కుటుంబాలపై మోయలేని భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా సినిమా రంగంలోని పలు సమస్యలపై, సెలబ్రిటీల వ్యవహారాలపై నారాయణ స్పందిస్తూ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మరోసారి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. సామాన్య ప్రేక్షకుల పక్షాన నారాయణ మాట్లాడిన మాటల్లో నిజం ఉందంటూ కొందరు మద్దతు తెలుపుతుండగా, సినిమా మేకింగ్ ఖర్చులు విపరీతంగా పెరిగిన తరుణంలో టికెట్ ధరల పెంపు తప్పదంటూ పరిశ్రమ వర్గాల వాదనను మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో జరిగిన ఈ నిర్మాతల సమావేశం రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో ఎలాంటి మార్పులకు శ్రీకారం చుడుతుందోన‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అటు ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల విషయంలో ఎలాంటి స్పష్టత వస్తుందో, ఇండస్ట్రీ పెద్దలు దీనిపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
మలయాళ సినీ పరిశ్రమ నుంచి వచ్చే వినూత్న చిత్రాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. థియేటర్లలో మిస్ అయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా వాటిని చూసేందుకు మన సినిమా లవర్స్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లోకి సరికొత్త మలయాళ క్యాంపస్ డ్రామా ‘డెర్బీ’ రీసెంట్ గా అడుగుపెట్టింది. యువ నటీనటులతో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం. ఈ చిత్ర కథాంశం విషయానికి వస్తే.. ఇదొక పూర్తి స్థాయి కాలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ. ఒకే కళాశాలలో చదివే సీనియర్స్, జూనియర్స్ మధ్య జరిగే ప్రతీకారాలు, గొడవలు, సస్పెన్షన్లు, వాటి మధ్యే సాగే ప్రేమకథల చుట్టూ దర్శకుడు సజిల్ మాంప్యాడ్ ఈ కథను నడిపించారు. నూతనత్వాన్ని కోరుకునే నేటి తరం ప్రేక్షకులకు ఈ తరహా రొటీన్ క్యాంపస్ కథ పెద్దగా కనెక్ట్ కాలేదనే చెప్పాలి. మొదటి భాగం కొంతవరకు కాలేజ్ వాతావరణాన్ని గుర్తు చేసినప్పటికీ, ద్వితీయార్ధంలో కథనం గాడి తప్పడం మైనస్‌గా మారింది. ఇక నటీనటుల ప్రదర్శన విషయానికి వస్తే.. ‘అబ్రహం ఓజ్లర్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ఆడమ్ సాబిక్ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. సాగర్ సూర్య, అల్ అమీన్, జస్న్యా జయదీష్ తదితరులు తమ పాత్రల పరిధి మేర నటించారు. అయితే బలహీనమైన క్యారెక్టరైజేషన్ వల్ల ఏ పాత్ర కూడా ప్రేక్షకుడిపై బలమైన ముద్ర వేయలేకపోయింది. షైన్ టామ్ చాకో, శబరీష్ వర్మ వంటి సీనియర్ నటులు ఉన్నప్పటికీ స్క్రిప్ట్ లో బలం లేకపోవడంతో వారు కూడా సినిమాను కాపాడలేకపోయారు. దర్శకుడు పాతకాలపు క్యాంపస్ డ్రామాల్లోని రొటీన్ సన్నివేశాలను, ట్విస్టులను నమ్ముకోవడం వల్ల సినిమాలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. సినిమాటోగ్రఫీ మరియు గోపి సుందర్ అందించిన సంగీతం కూడా యావరేజ్‌గానే నిలిచాయి. పాటలు మరియు ఫైట్ సీక్వెన్సులు ఆడియన్స్‌లో ఎలాంటి ఎమోషన్‌ను కలిగించలేకపోయాయి. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాపై నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఒకే తరహా సీన్లు పదే పదే రావడం వల్ల విసుగు తెప్పించిందని, ఎలాంటి ముగింపు లేకుండా సాగిన ఈ చిత్రంలో కేవలం కామెడీ కోణంలో వచ్చే కొన్ని సీన్లు మాత్రమే కాస్త ఊరటనిస్తాయని టాక్ నడుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే, రొటీన్ గా సాగే కాలేజ్ గొడవలు మరియు ప్రేమకథలను ఇష్టపడే వారికి ఈ సినిమా డిజిటల్ వేదికపై టైమ్ పాస్‌గా అనిపించవచ్చు. అయితే కొత్తదనాన్ని ఆశించే ఓటీటీ ప్రియులకు మాత్రం ఈ ‘డెర్బీ’ అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వీకెండ్‌లో ఒకసారి అమెజాన్ ప్రైమ్‌లో దీనిని ట్రై చేయవచ్చు.
Ram Charan's upcoming sports drama, Peddi marks a significant shift from standard commercial cinema, focusing instead on the untold survival stories of India's rural athletes. Directed by Buchi Babu Sana with music by AR Rahman, the film moves away from urban backdrops to explore the grassroots realities of tribal and village sports. During a recent media interaction in New Delhi, Ram Charan emphasized that the film is a deeply rooted reflection of the true Indian spirit. Highlighting the film's core theme of empowerment, he shared a poignant conversation he had with Prime Minister Narendra Modi about a grassroots talent from West Bengal who ended up inspiring an entire village to pursue athletics. Charan noted that Peddi aims to capture that exact kind of rural resilience on a global canvas. The project demanded intense dedication from its cast to bring these raw stories to life. Ram Charan, who portrays a crossover athlete, described his physical transformation into a wrestler as the most grueling challenge of his career. Co-star Janhvi Kapoor highlighted Charan’s unique approach to the craft, expressing awe at how he conserved his calm energy off-camera only to deliver explosive performances during takes.  For her own part, Kapoor revealed that she modeled her boldly unapologetic character directly after the director's own fierce conviction. Shifting the focus from mere entertainment to lasting impact, the team urged parents to experience the June 4 release in theaters with their children, hoping the journey of these unsung heroes will inspire the next generation to dream beyond their circumstances. Venkata Satish Kilaru produced the film on a massive scale.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  చిత్ర పరిశ్రమలో గత కొన్ని రోజులుగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య నడుస్తున్న 'పర్సంటేజీ విధానం' వివాదం ఒక కొలిక్కి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)జోక్యంతో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరపడం, ఆ తర్వాత ఈ సమస్య పూర్తిగా సర్దుమణగడం టాలీవుడ్‌లో పెద్ద ఊరటనిచ్చింది. అయితే ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ గారితో  టాలీవుడ్‌కి చెందిన కొందరు ప్రముఖ నిర్మాతలు హఠాత్తుగా భేటీ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ రవి శంకర్‌, వృద్ధి సినిమాస్ వెంకట్ సతీశ్ కిలారు, షైన్ స్క్రీన్స్ సాహు గారపాటి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సూర్యదేవర నాగవంశీ, ఎస్ఎల్వీ సినిమాస్ చెరుకూరి సుధాకర్ వంటి బిగ్ ప్రొడ్యూసర్స్ అంతా కలిసి పవన్ ని కలిశారు. ఈ కీలకమైన సమావేశంపై యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని తాజాగా చేసిన ఓపెన్ కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ధీరజ్ కి  పవన్ కళ్యాణ్‌ గారితో జరిగిన నిర్మాతల భేటీ గురించి మీడియా నుండి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ధీరజ్ స్పందిస్తు ఆ మీటింగ్‌కి తమలాంటి చిన్న, మీడియం రేంజ్ నిర్మాతలని ఎవరు పిలవలేదు. కేవలం వంద కోట్ల రూపాయల బడ్జెట్‌తో సినిమాలు తీసే పెద్ద పెద్ద నిర్మాతలు మాత్రమే పవన్ కళ్యాణ్‌(Pawan kalyan)గారిని కలిశారు. మా సమస్యలు మాకు ఉన్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే జూబ్లీ హిల్స్ లో 1000 గజాల ప్లాట్ కొనుక్కొని 10 కోట్లతో ఇళ్లు కట్టుకునేవారి సమస్యలు ఒకలా ఉంటాయి. మణికొండలో 250 గజాల ప్లాట్ తీసుకొని ఇళ్లు కట్టుకునేవాడి సమస్యలు వేరే ఉంటాయి. ఇద్దరూ ఇళ్లే కట్టుకుంటున్నా, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్లకి ఉన్నాయి. అదే విధంగా చిన్న, మీడియం రేంజ్ సినిమాల సమస్యలు కూడా వేరే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో మేము ఇది చెప్పినా ఎవరికీ అర్థం కావడం లేదు.  'పెద్ది' రిలీజ్  తర్వాత, ఒక నెల లోపల చిన్న మిడ్ రేంజ్ సినిమాలు తీసే నిర్మాతలందరం చర్చించుకుని పవన్ కళ్యాణ్ గారిని  కలిసి మాట్లాడతామని  ధీరజ్ మొగిలినేని అన్నారు. Also read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వైభవానికి ఈటీవీ రెడీ.. త్వరలోనే డేట్ వెల్లడి ధీరజ్ మొగిలినేని విషయానికి వస్తే ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ పై ది గర్ల్ ఫ్రెండ్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, ఉర్వశివో రాక్షసీవో, శ్రీరంగ నీతులు వంటి చిత్రాలు నిర్మించి టాలీవుడ్ లో రెగ్యులర్ ప్రొడ్యూసర్ గా మారాడు.        
  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(Og)సాధించిన విజయం, సృష్టించిన రికార్డులు తెలిసిందే. 350 కోట్లకి పైగా భారీ వసూళ్లని రాబట్టి పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ మూవీ కేటగిరిలో చేరింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ శాటిలైట్ హక్కుల బిజినెస్ పై  గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠత రేపుతూ ఉంది.  ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కి తెరదించుతూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీ (ETV) భారీ ఫ్యాన్సీ రేటుతో  శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాని  టెలివిజన్ ప్రేక్షకులకు అందించేందుకు ఛానల్ యాజమాన్యం గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఓటీటీలో  రికార్డు వ్యూస్ సాధించిన  ఓజి ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి టీఆర్‌పీ (TRP) రికార్డులని సృష్టిస్తుందో చూడాలి. అతి త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ని అధికారికంగా అనౌన్స్ చేసేందుకు ఛానల్ సిద్ధమవుతోంది. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ ఆర్ ఆర్ దానయ్య  దానయ్య నిర్మించగా సుజీత్ దర్శకుడు.  ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీ రోల్స్ . Also read: Drishyam 3: దృశ్యం 3 సంచలనం.. వారం రోజుల్లోనే ఆ సినిమాల కలెక్షన్స్ గల్లంతు     
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్(Mohanlal),దర్శకుడు జీతూ జోసెఫ్(Jeethu Joseph)ల దృశ్యం 3(Drishyam 3) సరికొత్త చరిత్రని సృష్టించే విధంగా దుకుకెళ్తుంది. సరిగ్గా వారం క్రితం మే 21 న విడుదలైన ఈ మూవీ    రికార్డులే తన లక్ష్యం అన్నట్టుగా 7 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. చిత్ర బృందం కూడా సదరు కలెక్షన్స్ పై  ఒక మలయాళ చిత్రం ఈ స్థాయిలో వారం రోజుల్లోనే అంతర్జాతీయంగా ప్రభావం చూపించడం ట్రేడ్ వర్గాలని  సైతం ఆశ్చర్యపరుస్తోంది. జార్జ్‌కుట్టి, అతని కుటుంబం చుట్టూ తిరిగే ఈ భావోద్వేగపూరిత క్రైమ్ థ్రిల్లర్ ప్రయాణం థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల అంచులపై కూర్చోబెడుతోంది. ఈ అద్భుతమైన విజయంపై మోహన్‌లాల్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. "మూడు సినిమాలు.. మూడు అధ్యాయాలు.. ఒక విడదీయరాని బంధం. జార్జ్‌కుట్టి మరియు అతని కుటుంబంతో కలిసి ప్రయాణించినందుకు అందరికీ ధన్యవాదాలు" అంటూ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవలం వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడం ద్వారా ఈ ఫ్రాంచైజీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'దృశ్యం 3' సరికొత్త రికార్డుని  నెలకొల్పింది. మోహన్‌లాల్ కెరీర్‌లో ఇప్పటికే 'L2: ఎంపూరాన్', 'తుడరుమ్' వంటి చిత్రాలు .200 కోట్ల మార్కును అందుకోగా, ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక జాబితాలోకి ఈ సినిమా కూడా చేరిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలను నిశితంగా గమనిస్తే, ఏడో రోజైన బుధవారం కూడా ఇండియాలో 6.65 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఈ సినిమా తన సత్తా చాటింది. దీంతో దేశీయంగా మొత్తం నెట్ కలెక్షన్లు రూ.75.30 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ.87.38 కోట్లను తాకాయి. ప్రపంచవ్యాప్తంగా బుధవారం రోజున 4,721 షోలలో ఈ సినిమా ప్రదర్శితమైంది. కేవలం మలయాళ వెర్షన్ నుంచే ఏడో రోజున .5.85 కోట్ల నెట్ వసూళ్లు రాగా, 40.35 శాతం థియేటర్ అక్యుపెన్సీ నమోదైంది. ఇతర భాషల విషయానికి వస్తే, తెలుగు వెర్షన్ రూ.50 లక్షలు (14.19% అక్యుపెన్సీ), తమిళ వెర్షన్ రూ.20 లక్షలు (17.09% అక్యుపెన్సీ), కన్నడ వెర్షన్ రూ.10 లక్షల వసూళ్లను సాధించాయి. Also read: Peddi: హైకోర్టుని ఆశ్రయించిన పెద్ది నిర్మాత.. ఇక సినీ ఆట మొదలైనట్లేనా! ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా జార్జ్‌కుట్టి హవా గట్టిగానే నడుస్తోంది. బుధవారం ఒక్క రోజే 5 కోట్ల గ్రాస్ వసూలు అయ్యాయి. దీంతో  ఓవర్సీస్ కలెక్షన్లు .95.70 కోట్లకి  చేరాయి. దేశీయ, అంతర్జాతీయ వసూళ్లను కలుపుకుని కేవలం 7 రోజుల్లోనే ఈ క్రైమ్ థ్రిల్లర్ .200 కోట్ల మార్కును విజయవంతంగా అధిగమించింది. మరి ఈ లెక్కన 300 కోట్లు పెద్ద కష్టమేమి కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వివాహం తర్వాత అమ్మాయిల జీవితం తమ చేతుల్లో నుండి జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలు తరచుగా ఇతరులను సంతోషపెట్టడానికి తమ కోరికలను, భావోద్వేగాలను అణచివేసుకుంటారు. ఈ అలవాటు క్రమంగా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే అమ్మాయిలకు విలువలు,  మంచి విద్య మాత్రమే కాదు.. ఎంత కష్టంలో అయినా నిలబడాలంటే.. ప్రతి తల్లి తన కూతురికి కొన్ని నేర్పించాలి. వాటిలో  ముఖ్యమైనది.. ఏదైనా కరెక్ట్ కాని విషయానికి " నో " చెప్పడం.  ఇలా ఏదైనా సరికాని విషయానికి నో చెప్పడం అమ్మాయిలను ఎందుకు బలంగా ఉంచుతుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. "నో" అని చెబితే.. ఒక అమ్మాయి 'కాదు' అని చెప్పడం నేర్చుకున్నప్పుడు, ఆమె సంబంధాలలో, వృత్తిలో , సమాజంలో తనను తాను గౌరవించుకోవడం కూడా నేర్చుకుంటుంది. ఈ ఒక్క అలవాటే ఆమెను మానసికంగా దృఢంగా, స్వయం సమృద్ధిగా , ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. ఇది  జీవితంలో ముందుకు సాగడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది.. ఆడపిల్ల తన ఇష్టాయిష్టాలను బయటకు  వ్యక్తపరిచినప్పుడు, ఆమె తన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుంది. దీనివల్ల ఆమెకు ఆత్మగౌరవం పెరుగుతుంది. తప్పుడు వ్యక్తుల నుండి దూరం.. మొహమాటంతోనో లేక ఇతరులను సంతోషపెట్టాలనో ప్రతి దానికి సరే అని చెప్పే అలవాటు.. ఎదుటివారు అమ్మాయిలను  స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. 'కాదు' అని చెప్పడం  భద్రతను ఇస్తుంది. అమ్మాయిలకు ఏదైనా సరికాదు అనిపిస్తే మొహమాటం లేకుండా నో చెప్పడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. నిర్ణయాలలో ఆత్మవిశ్వాసం.. తన మనసులోని మాటను చెప్పడానికి భయపడని అమ్మాయి జీవితంలోని అతిపెద్ద నిర్ణయాలను కూడా ఆత్మవిశ్వాసంతో తీసుకోగలదు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నించడం ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ప్రతి అమ్మాయి తన  స్వంత బౌండరీస్ ను నిర్దేశించుకోవడం మనశ్శాంతిని ఇస్తుంది. బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది.. స్పష్టమైన ఆలోచన , ముక్కుసూటితనం ఉన్న అమ్మాయిలు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తారు. పొగరు, లెక్కలేనితనం.. ఇలాంటి మాటలు అనుకునేవారు కూడా ఉంటారు.  కానీ వ్యక్తిత్వం, మంచితనం,  నిర్ణయాలు సరిగా తీసుకోవడం వంటివి జరుగుతూ ఉంటే.. విమర్శించిన వారే మెచ్చుకునే రోజులు వస్తాయి. దీని వల్ల వ్యక్తిత్వం బలంగా మారుతుంది. ఎలా నేర్పాలి.. ఏదైనా విషయం సరికాదు అనిపిస్తే దానికి నో చెప్పడం ఎలా అనే విషయాన్ని తల్లులు తమ కూతురికి నేర్పాలి.  కానీ ఎలా నేర్పాలో కొందరికి అర్థం కాదు. తల్లి కూతురి దగ్గర స్నేహితురాలిగా ఉండి మనసు విప్పి మాట్లాడాలి.  దీనివల్ల కూతురి ఏ విషయాన్ని అయినా మనసు విప్పి పంచుకోగలుగుతుంది. అందరినీ సంతోషపెట్టడం కోసం అన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదని అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆడపిల్ల అభిప్రాయానికి, నిర్ణయాలకు విలువ ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.  తీసుకున్న నిర్ణయాలు సరిగా లేకపోయినా,  వాటిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని వివరించి చెప్పాలి. తప్పు చేసినప్పుడు లేదా తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తిట్టడానికి బదులుగా వాటి పర్యావసానాలు వివరించి చెప్పాలి.  ఎలా నిర్ణయం తీసుకుంటే బాగుండేదో.. ఎలా ఉండాలో చెప్పాలి. ఆడపిల్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పు విషయం కాదని,  అది తన వ్యక్తిత్వాన్ని  తెలియజేస్తుందని వివరించాలి.  అప్పుడే అబిప్రాయాలు, నిర్ణయాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండే తన వ్యక్తిత్వం మంచిగా ఉంటుందో వారికి అర్థమవుతుంది.                           *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా  ఎక్కువ సేపు బయట ఉండాల్సి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడిలో పని చేస్తున్నప్పుడు, శరీర దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది.  చాలా మంది ఖరీదైన డియోడరెంట్లు , పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు, కానీ వాటి ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. శరీరంలోని బ్యాక్టీరియా చెమటతో కలిసి దుర్వాసనను ఉత్పత్తి చేసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ ఖర్చు పెట్టకుండా శరీర దుర్వాసనను వదిలించుకోవాలనుకుంటే, కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి.  ఆ సులభమైన ఇంటి చిట్కాలేంటో తెలుసుకుంటే.. వేసవిలో శరీర దుర్వాసన ఎందుకు పెరుగుతుంది? వేసవిలో శరీరానికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమట చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో సంపర్కంలోకి వచ్చినప్పుడు, దుర్వాసన వెలువడుతుంది. శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే లేదా చెమట ఎక్కువసేపు శరీరంపై ఉండిపోతే, శరీర దుర్వాసన సమస్య పెరుగుతుంది. శరీర దుర్వాసన రాకూడదంటే.. స్నానం నీటిలో వీటిని కలపాలి.. నిమ్మరసం.. బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరానికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. చెమట వాసనను తగ్గించవచ్చు ఒక బకెట్ నీటిలో ఒకటి రెండు స్పూన్ల నిమ్మ రసం కలుపుకుని స్నానం చేయడం వల్ల రిఫ్రెషింగ్  అనుభూతి కలుగుతుంది. రోజ్ వాటర్.. గులాబీ నీరు చల్లదనాన్ని, తేలికపాటి సహజ సువాసనను అందిస్తుంది.  స్నానపు నీటిలో 3-4 టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి.  ఇది చర్మానికి తాజా అనుభూతిని కూడా కలిగిస్తుంది. వేసవిలో శరీర జిగట తగ్గిస్తుంది. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా శరీర దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది.  అయితే దీన్ని అధిక పరిమాణంలో ఉపయోగించకూడదు.  సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వాడాలి. పటిక.. పటికలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఇది చెమట వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. వేప నీరు.. వేప నీరు చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. దురద , బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.  వేప ఆకులను ఉడకబెట్టి, ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు.                                  *రూపశ్రీ.  
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా.. చాలా పానీయాల తయారీలో కూడా పుదీనాను ఉపయోగిస్తారు. పుదీనా పానీయాల రుచిని పెంచుతుంది. శరీరాన్ని చల్లబరుచుతుంది. అయితే వేడి ఎక్కువగా ఉంటే పుదీనా మొక్క చాలా తొందరగా వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మొక్కకు పచ్చదనాన్ని పెంచడానికి , మొక్క పచ్చగా ఎదగడానికి కొన్నిచిట్కాలు ఉపయోగించవచ్చు. వాటిలో ఎంతో ప్రబావవంతంగా పనిచేసే చిట్కా తెలుసుకుంటే.. పటిక నీరు.. పుదీనా మొక్కకు పటిక నీటిని కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారంగా మారినప్పుడు, పుదీనా పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలో, పటిక నీటిని ఉపయోగించడం మొక్కకు మేలు చేస్తుంది. పటిక నీరు మట్టి  pH స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల అది పుదీనా మొక్కకు అనుకూలంగా మారి, పోషకాలను మరింత సులభంగా గ్రహించడానికి వీలు కలుగుతుంది. క్రిమినాశకం.. పుదీనా వాసన తరచుగా కీటకాలను దూరంగా ఉంచుతుంది, కానీ కొన్నిసార్లు చీమలు , బూజు దాని వేళ్ళను ఆశించి, మొక్క దెబ్బతినేలా చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు   మొక్కపై పటిక నీటిని చల్లవచ్చు. పటికలో యాంటీ బాక్టీరియల్  యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి మొక్కను కీటకాలు, బూజు , చీమల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుదల.. కొన్నిసార్లు, మొక్కలకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకుల పెరుగుదల మందగిస్తుంది. పటిక నీటిని కలపడం వల్ల ఆకులు పెద్దవిగా, పచ్చగా, , మరింత నిగనిగలాడేలా పెరగడానికి సహాయపడుతుంది. మొక్క  కొమ్మలను చిగురింపజేసి, మరింత దట్టంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎలా వాడాలి? ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో ఒక పటిక ముక్కను వేయాలి. అర టీస్పూన్ పటిక పొడి వచ్చేంత ముక్కను వాడాలి. దానిని 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. . నీరు మరీ చిక్కగా ఉండకూడదు. ఈ పటిక నీటిని పుదీనా వేర్లకు అందేలా  పోయాలి. నీటిని కేవలం మట్టికి మాత్రమే అందించాలి.                                 *రూపశ్రీ.
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై.. క్రమంగా ముక్కు మూసుకుపోవడం, ముఖంపై ఒత్తిడి, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో ఇది నరకం చూపిస్తుంది. చాలా మంది దీనిని కేవలం మామూలు జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు సైనస్ అంటే ఏమిటి? ఇది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీని నుంచి ఉపశమనం పొందడం ఎలా? అనే విషయాలపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఈఎన్‌టీ సర్జన్, రావుస్ ఈఎన్‌టీ హాస్పిటల్ (Rao's ENT Hospital) అధినేత డాక్టర్ జి.వి.ఎస్. రావు (Dr. GVS Rao) గారు ఈ VIDEO ద్వారా అందించిన పూర్తి వివరాలు మీకోసం.. అసలు సైనస్ అంటే ఏమిటి? మన పుర్రె ఎముకలలో ఉండే గాలితో కూడిన ఖాళీ గదులనే సైనసెస్ (Sinuses) అంటారు. ఇవి మనం పీల్చే గాలిని వేడి చేయడానికి, ముక్కులో తడి ఆరిపోకుండా జిగురు లాంటి పదార్థాన్ని (Mucus) ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. అయితే, ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అలర్జీ వల్ల ఈ గదుల లోపలి పొర వాచిపోయి, ఆ జిగురు పదార్థం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. దీనినే 'సైనసైటిస్' లేదా 'సైనస్ ఇన్ఫెక్షన్' అంటారు. సైనస్ ప్రధాన లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి: ముఖ్యంగా నుదురు, కళ్ల కింద, ముక్కు ఇరువైపులా విపరీతమైన నొప్పి లేదా ఒత్తిడి ఉంటుంది. తల ముందుకు వంచినప్పుడు నొప్పి మరింత పెరుగుతుంది. ముక్కు బ్లాక్ అవ్వడం: ముక్కు దిబ్బడ వేయడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ముక్కు కారడం: ముక్కు నుండి పచ్చగా లేదా పసుపు రంగులో గట్టి ద్రవం కారుతుంటుంది. వాసన తెలియకపోవడం: సైనస్ తీవ్రత ఎక్కువైతే ఆహార పదార్థాల వాసన, రుచి కూడా తెలియకుండా పోతుంది. దగ్గు మరియు గొంతు నొప్పి: ముక్కు వెనుక భాగం నుండి ద్రవం గొంతులోకి చేరడం (Post-nasal drip) వల్ల రాత్రి వేళల్లో దగ్గు ఎక్కువగా వస్తుంది. సైనస్ రావడానికి కారణాలు: వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు: సాధారణ జలుబు ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే అది సైనస్‌గా మారే ప్రమాదం ఉంది. అలర్జీలు: దుమ్ము, ధూళి, పొగ, పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల వచ్చే అలర్జీలు. ముక్కు ఎముక వంకరగా ఉండటం: ముక్కు లోపలి మధ్య ఎముక వంకరగా (Deviated Nasal Septum) ఉండటం వల్ల కూడా గాలి రాకపోకలకు ఆటంకం కలిగి సైనస్ వస్తుంది. ముక్కులో కండలు పెరగడం: ముక్కు లోపల పాలిప్స్ (Nasal Polyps) అనబడే చిన్న చిన్న మాంసపు ముద్దలు పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇంటి వద్దే లభించే తక్షణ ఉపశమనాలు (Home Relief): ఆవిరి పట్టడం: రోజుకు రెండు మూడు సార్లు వేడి నీటి ఆవిరి పట్టడం వల్ల ముక్కులో పేరుకుపోయిన ద్రవం కరిగి శ్వాస సులువవుతుంది. సెలైన్ నాసల్ స్ప్రే: ఉప్పు నీటి స్ప్రేలు ఉపయోగించడం ద్వారా ముక్కు మార్గాలను శుభ్రం చేసుకోవచ్చు. గోరువెచ్చని నీరు తాగడం: నిరంతరం గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది మరియు లోపలి జిగురు పలుచబడుతుంది. వైద్య చికిత్సలు మరియు శాశ్వత పరిష్కారం: సైనస్ సమస్య ప్రాథమిక దశలో ఉన్నప్పుడు వైద్యులు యాంటీబయాటిక్స్, యాంటీ-అలర్జీ మందులు మరియు నాసల్ స్ప్రేల ద్వారా నయం చేస్తారు. ఒకవేళ సమస్య దీర్ఘకాలికంగా మారి (Chronic Sinusitis), ముక్కులో కండలు పెరగడం లేదా ఎముక వంకర వంటి కారణాలు ఉంటే.. అధునాతన 'ఫెస్' (FESS - Functional Endoscopic Sinus Surgery) విధానం ద్వారా ఎలాంటి కుట్లు, గాయాలు లేకుండా లోపలి బ్లాక్‌లను తొలగించి శాశ్వత ఉపశమనం కలిగిస్తారు. గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు నిపుణులైన వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
వేసవి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లో కూలర్‌ను ఉపయోగిస్తారు, ఏసీ పెట్టించుకోలేని మధ్యతరగతి,  దిగువ తరగతి వారికి కూలర్ వాడకం ఎంతో ఉపయోగకరంగా, వేసవి నుండి ఎంతో ఉపశమనంగా కూడా ఉంటుంది.  చాలా మంది కూలర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడాన్ని నిర్లక్ష్యం చేస్తారు, దీనివల్ల సౌకర్యం చేకూరకపోగా ఆరోగ్య ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కూలర్ వాడేవారు చేసే ఒకే ఒక తప్పు కుటుంబ సభ్యులకు మొత్తం ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. అదేంటో.. ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుంటే.. కూలర్ ప్యాడ్లు.. కూలర్ ప్యాడ్‌ల మీద చాలా తొందరగా దుమ్ము,  ధూళి పేరుకుపోతుంది.  చాలామంది వేసవి అవ్వగానే కూలర్ ను అలా ఒకమూల పెట్టేయడం,  తిరిగి వేసవి రాగానే దాన్ని మళ్లీ వాడటం మొదలుపెడతారు. అంతేకానీ కూలర్ ప్యాడ్ ల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోరు. మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్‌లు దుమ్ము, బ్యాక్టీరియా , ఫంగస్‌కు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ కలుషితమైన గాలి గది అంతటా వ్యాపించినప్పుడు, అది అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఎవరికి ప్రమాదమంటే.. కూలర్ ప్యాడ్ లు ఇలా మురికిగా మారడం ముఖ్యంగా పిల్లలకు , వృద్ధులకు ప్రమాదకరంగా ఉంటుంది. అందువల్ల, వేసవి కాలంలో కూలర్‌లను సరిగ్గా శుభ్రపరచడం , వాటి నిర్వహణ అత్యంత ముఖ్యం. కూలర్ ప్యాడ్ లు మురికిగా మారితే కలిగే ప్రమాదాలు.. శ్వాసకోశ సమస్యలు.. మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్‌లపై దుమ్ము, ధూళి , బ్యాక్టీరియా పేరుకుపోతాయి, ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించగలవు.  దీనివల్ల దగ్గు, జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు పెరగవచ్చు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఊపిరితిత్తులపై కూడా ప్రభావం పడవచ్చు. అలెర్జీల ప్రమాదం.. మురికిగా ఉన్న కూలర్ ప్యాడ్‌లపై త్వరగా బూజు, శిలీంధ్రాలు పెరుగుతాయి. ఇది చర్మం , కంటిలో చికాకు, దురద ,  అలెర్జీ రియాక్షన్స్ వంటి వాటికి  కారణం అవుతాయి.  ఇప్పటికే అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు. దుర్వాసన, గాలి కాలుష్యం.. కూలర్‌ను చాలా కాలం పాటు శుభ్రం చేయకపోతే, దాని నుండి వచ్చే గాలిలో ఒక వింత వాసన వస్తుంది.  ఈ వాసన గది వాతావరణాన్ని అనారోగ్యకరంగా మార్చడమే కాకుండా, తలనొప్పి లేదా ఇతర అనారోగ్యాలకు కూడా కారణం కావచ్చు. ఇన్పెక్షన్.. మురికి నీరు , కలుషితమైన ప్యాడ్‌ల వల్ల కూలర్‌లో బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి, దీంతో జ్వరం , ఇతర వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఎవరికి ఎక్కువ ప్రమాదం.. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన పిల్లలు , వృద్ధులు,  అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారు  మురికిగా ఉండే చల్లని గాలి వల్ల ఎక్కువగా ప్రభావితమవుతారు. దీనివల్ల వారికి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వారి గదిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.                    *రూపశ్రీ.