Home

»

Latest News

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వైభవానికి ఈటీవీ రెడీ.. త్వరలోనే డేట్ వెల్లడి

May 28, 2026 3:54PM

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో 'ఓజి'(Og)సాధించిన విజయం, సృష్టించిన రికార్డులు తెలిసిందే. 350 కోట్లకి పైగా భారీ వసూళ్లని రాబట్టి పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది.ఫ్యాన్స్ కి కూడా స్పెషల్ మూవీ కేటగిరిలో చేరింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ శాటిలైట్ హక్కుల బిజినెస్ పై  గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమలో తీవ్ర ఉత్కంఠత రేపుతూ ఉంది. 

ఎట్టకేలకు ఈ సస్పెన్స్‌కి తెరదించుతూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఈటీవీ (ETV) భారీ ఫ్యాన్సీ రేటుతో  శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాని  టెలివిజన్ ప్రేక్షకులకు అందించేందుకు ఛానల్ యాజమాన్యం గ్రాండ్ లెవెల్‌లో ఏర్పాట్లు చేస్తోంది. ఓటీటీలో  రికార్డు వ్యూస్ సాధించిన  ఓజి ఇప్పుడు బుల్లితెరపై ఎలాంటి టీఆర్‌పీ (TRP) రికార్డులని సృష్టిస్తుందో చూడాలి. అతి త్వరలోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ని అధికారికంగా అనౌన్స్ చేసేందుకు ఛానల్ సిద్ధమవుతోంది. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆర్ ఆర్ ఆర్ దానయ్య  దానయ్య నిర్మించగా సుజీత్ దర్శకుడు.  ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీ రోల్స్ .

Also read: Drishyam 3: దృశ్యం 3 సంచలనం.. వారం రోజుల్లోనే ఆ సినిమాల కలెక్షన్స్ గల్లంతు 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com