LATEST NEWS
తెలుగుదేశం   మహానాడు లో  బుధవారం (మే 27) ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ప్రధాన వేదిక వద్ద ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. ఉదయం  ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగంతో  కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ రెండు రోజుల వేడుకలో వివిధ అంశాలపై మొత్తం 20 తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. కాగా  మంత్రి నారా లోకేష్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఇప్పుడు అందరి దృష్టీ ఆయనపైనే ఉంది.  టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా  మహానాడు వేదికగా ఆయన   తొలి ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఆయన మధ్యాహ్నం 12 గంటలకు  ఓ  భారీ ప్రకటన చేయనున్నానంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన వ్యాఖ్యతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. అసలు లోకేష్ ఏం ప్రకటన చేయనున్నారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.  లోకేష్ పోస్టుపై నెటిజనులు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. లోకేష్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఆయన ప్రయాణం సక్సెస్ ఫుల్ గా జరగాలంటూ నెట్టింట లోకేష్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బుధవారం (మే 27) హస్తినలో పర్యటించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత విజయ్ ఢిల్లీ వెళ్లడం ఇదే మొదటి సారి.  విజయ్ హస్తిన పర్యటన రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతాయి. విజయ్ ఢిల్లీ పర్యటేన కేవలం ఒక మర్యాదపూర్వకంగా మాత్రమే కాకుండా,  తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా  సాగనుందని సమాచారం ప్రధాని మోదీతో జరిగే ఈ సమావేశంలో   రాష్ట్ర  అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చిం చే అవకాశం ఉన్నాయని అంటున్నారు.  ముఖ్యంగా  పారిశ్రామిక  రంగ అభివృద్ధి,  సంక్షేమ పథకాలు,   మౌలిక వసతుల విస్తరణకు సంబంధించి  కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సీఎం విజయ్ కోరే అవకాశం ఉందని అంటున్నారు.   ప్రధాని మోదీతోనే కాకుండా విజయ్ తన హస్తిన పర్యటనలో  కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా భేటీ కానున్నారు.  కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలపై నిర్మలాసీతారామన్ తో సీఎం విజయ్ చర్చించే అవకాశం ఉంది.  బుధవారం ( మే 28) ఉదయమే  చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విజయ్.. వరుస భేటీలతో బిజీబిజీగా ఉన్నారు. ఇదే రోజు రాత్రి ఆయన తిరిగి చెన్నై చేరుకుంటారు.  ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పెద్దలతో జరుపుతున్న తొలి అధికారిక భేటీ కావడంతో, తమిళనాడు ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్ర హక్కుల సాధనలో విజయ్ ఎలాంటి ముద్ర వేయబోతున్నారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
కర్ణాటక రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి.  ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.   కాంగ్రెస్ అధిష్ఠానంతో ఢిల్లీలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్  వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో..  సిద్దరామయ్య బుధవారం ( మే 28) బెంగళూరులో  ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.   నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాల నడుమ  సిద్దరామయ్య ప్రెస్ మీట్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.   అదలా ఉంటే..  ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తన ఢిల్లీ పర్యటనను ఎక్స్ టెండ్ చేసుకున్నారు.    గురువారం( మే 28) ఉదయం బెంగళూరులోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో సిద్ధరామయ్య ఏర్పాటు చేసిన బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌కు ఆయన హాజరుకావలసి ఉంది. కాంగ్రెస్  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్ణాటకకు చెందిన అగ్ర నాయకుల మధ్య సుమారు ఏడు గంటల పాటు సాగిన సుదీర్ఘ సమావేశం తర్వాత ఈ  పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే.. తాము కేవలం రాజ్యసభ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల గురించే చర్చించామని కాంగ్రెస్ పార్టీ  చెబుతున్నప్పటికీ..  కర్నాటక సీఎం మార్పుపైనే  ప్రధానంగా చర్చ సాగినట్లు రాజకీయవర్గాలలో గట్టిగా వినపడుతోంది. 
కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికైనా కష్టమే. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి పీఠం చుట్టూ తిరుగుతున్న అంతర్గత రాజకీయాలు ఇప్పుడు  కీలక మలుపు తిరిగాయి. కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు  ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్  విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. పార్టీ హైకమాండ్ మధ్యవర్తిత్వంతో రెండున్నరేళ్ల రొటేషనల్ పవర్ షేరింగ్   ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగానే సిద్ధరామయ్యకు మొదట అవకాశం ఇచ్చారని డీకే శివకుమార్ అనుచరులు గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కు అప్పగించాలనే డిమాండ్ జోరందుకుంది.  డీకే శివకుమార్ పార్టీ కోసం చేసిన కష్టాన్ని, ఆయనకున్న వ్యూహాత్మక చతురతను కాంగ్రెస్ అధిష్టానంలోని కొందరు ప్రముఖులు బలంగా సమర్థిస్తున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఇద్దరూ డీకే శివకుమార్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పోషించిన పాత్ర చాలా ముఖ్యమనీ,  ఒడుదొడుకులు ఎదురైన ప్రతిసారీ పార్టీని ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఆదుకున్న ట్రబుల్ షూటర్ ఆయనేనీ అంటున్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్‌కు రూ. 1,413.80 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2018లో ఈ ఆస్తుల విలువ రూ. 840.01 కోట్లుగా ఉండగా, అది ఐదేళ్లలో భారీగా పెరిగింది. ఇందులో రూ. 1,140.38 కోట్ల స్థిరాస్తులు, రూ. 273.41 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అలాగే ఆయనకు రూ. 265.06 కోట్ల అప్పులు, ఏడాదికి రూ. 14.4 కోట్ల వార్షిక ఆదాయం ఉంది. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా దాదాపు 19 కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన పార్టీ లైన్‌ను దాటకుండా నమ్మకంగా నిలబడ్డారు. అందుకే ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, సీఎం కుర్చీ ఆయనకే ఇవ్వాలని ప్రియాంకా గాంధీ గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ అధికార మార్పిడి అంత సులభంగా సాగేలా కనిపించడం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బలమైన ఓబీసీ నాయకుడు కావడంతో..  ఆయనను అకస్మాత్తుగా పదవి నుంచి తప్పిస్తే పార్టీ ఇమేజ్‌కు భంగం కలుగుతుందేమోనని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి, కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఒక సరికొత్త వ్యూహాన్ని అధిష్టానం పరిశీలిస్తోందంటున్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ సీఎం పదవి వదిలి రాజ్యసభకు వెళ్లిన తరహాలోనే, కర్ణాటకలోనూ అధికార బదిలీ ఫార్ములాను అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకులు భావిస్తున్నారు. కానీ సిద్ధరామయ్య మాత్రం తన స్థానంలో డీకే శివకుమార్ రావడాన్ని అంతగా ఇష్టపడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలోని బొక్కలిగ సామాజిక వర్గంలో డీకే శివకుమార్‌కు ఉన్న పట్టు, బూత్ స్థాయి కార్మికులను నడిపించే నైపుణ్యం పార్టీకి శ్రీరామరక్ష అని ప్రియాంక వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడు, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున, దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఎలాంటి అస్థిరత రాకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్  ఓపిక ఎల్లప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది  అని వ్యాఖ్యానించడం విశేషం. ప్రియాంకా గాంధీ అండతో డీకే శివకుమార్ అనుకున్నది సాధిస్తారా, లేదా సిద్ధరామయ్య తన పీఠాన్ని కాపాడుకుంటారా  అన్న చర్చ కర్నాటక రాజకీయాలలో జోరుగా సాగుతోంది. 
  తమిళనాడులో అన్నాడీఎంకేకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో తాజాగా అంబసముద్రం ఎమ్మెల్యే సుబ్బయ్య కూడా తన పదవికి రాజీనామా చేశారు. మంగళవారం ఆయన నేరుగా లోక్‌భవన్‌కు వెళ్లి అసెంబ్లీ స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిశారు. అనంతరం తన రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించారు. సుబ్బయ్య ఇచ్చిన రాజీనామా పత్రాన్ని పరిశీలించిన తర్వాత త్వరలోనే అధికారిక నిర్ణయం వెల్లడిస్తామని స్పీకర్ మీడియాకు తెలిపారు.  ఇటీవల రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే టీవీకే పార్టీలో చేరగా, సుబ్బయ్య కూడా త్వరలోనే ఆ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వరుస రాజీనామాలతో అన్నాడీఎంకేలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. అన్నాడీఎంకే ఎమ్మెల్యే వేలుమణి వర్గానికి చెందిన 25 మంది  ఎమ్మెల్యేలు టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు అసెంబ్లీలో మద్దతు తెలిపాయి.  
ALSO ON TELUGUONE N E W S
  టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గ్లామర్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. తెలుగు, తమిళ లాంగ్వేజెస్ లో తన హవా చాటిన కాజల్  కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడి, ఒక బాబుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తన  సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త ఎనర్జీతో దూసుకుపోతున్న కాజల్, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 19 ఏళ్లు దాటుతున్నా, 40 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ నేటి తరం కుర్ర హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో ఆమె ఒక క్యూట్ లైట్ పింక్ కలర్ బాడీకాన్ పొట్టి డ్రెస్‌లో మెరిసిపోయింది. బెడ్‌పై కూర్చొని, చేతిలో వింటేజ్ కెమెరా పట్టుకుని స్టైలిష్‌గా ఇచ్చిన పోజులు అభిమానులని  ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తన ఫ్రీ ఫ్లోయింగ్ కురులని  అందంగా ముందుకు వదిలేసి ఆమె పలికించిన హావభావాలు అభిమానులు,నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి. Also read: Bhagyashri borse: ఎమోషనల్ అయిన  భాగ్యశ్రీ బోర్సే.. కమల్ హాసన్ కి ప్రామిస్ చేసేసింది ఈ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలపై కాజల్ తోటి నటీమణులు తమన్నా భాటియా, హన్సిక మోత్వాని, రాకుల్ ప్రీత్ సింగ్, అలాగే ఆమె సోదరి నిషా అగర్వాల్ వంటి స్టార్ సెలబ్రిటీలు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తూ కాజల్ అందాన్ని ప్రశంసిస్తున్నారు. కాజల్ ఖాతాలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'NBK 111' చేరినట్టుగా  టాక్.         
  హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో కూడా భాగ్యశ్రీ బోర్సే తన మార్క్ చూపించేందుకు సిద్ధమైంది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'సేయాన్'  లో భాగ్యశ్రీ హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్' బ్యానర్‌పై ఆర్.మహేంద్రన్‌తో కలిసి విశ్వ కధానాయకుడు కమల్ హాసన్  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు రీసెంట్ గా  భాగ్యశ్రీ బోర్సే కమల్ హాసన్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. కమల్ తో పలు విషయాలు చర్చించిన తర్వాత ఆమె సోషల్ మీడియా వేదికగా కమల్‌తో దిగిన పిక్స్ ని షేర్ చెయ్యడంతో పాటు ఒక ఎమోషనల్ ట్వీట్ చేసింది. సదరు ట్వీట్ లో 'ప్రియమైన కమల్ హాసన్ సర్, చిన్నప్పటి నుండి మీ సినిమాలు చూస్తూ పెరిగాను.ఇప్పుడు ఆ చిన్న అమ్మాయి మీ సినిమాలో చేస్తుంది. మీరు నా భుజాలపై చేతులు వేసి ఆశీర్వదించి, ఆల్ ది బెస్ట్ చెప్పిన క్షణంలో ఆనందంతో గంతులు వేసింది. మీ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవ్వడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. మిమ్మల్ని, మీ నమ్మకాన్ని గర్వపడేలా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను" అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఒక సాధారణ నటిగా కెరీర్ ప్రారంభించి, నేడు భారత చలనచిత్ర రంగానికి మార్గదర్శకుడైన కమల్ హాసన్ ప్రొడక్షన్‌లో అవకాశం దక్కించుకోవడం, ఆయన నుండే నేరుగా ప్రశంసలు అందుకోవడం భాగ్యశ్రీ బోర్సే  సినీ ప్రయాణంలో అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు ,పోస్ట్ నెట్టింట  హల్‌చల్ చేస్తున్నాయి.  Also read: Trisha: నేను బ్లాక్ డ్రెస్ ధరిస్తే జరిగేది ఇదే...త్రిష ఆసక్తికర ట్వీట్    సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ గ్రాండ్ రూరల్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 2026 అక్టోబర్‌లో థియేటర్లలోకి రానుంది.మే 6, 2026 న భాగ్యశ్రీ  పుట్టినరోజు  సందర్భంగా 'సేయాన్' చిత్ర బృందం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ని అధికారికంగా విడుదల చేసింది. చేతిలో నెమలి ఈకని  పట్టుకుని ప్రశాంతమైన వదనంతో ఉన్న ఆమె లుక్ సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. శివకుమార్ మురుగేషన్ దర్శకుడు.       
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించిన రాకింగ్ స్టార్ యష్ (Yash) హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం 'టాక్సిక్' (Toxic). గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో సుమారు ₹700 కోట్ల నుంచి ₹800 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్ట్ సరిహద్దులను దాటి గేమింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతోంది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా(BGMI) గేమ్ మేకర్స్ క్రాఫ్టన్ ఇండియా, యష్ 'టాక్సిక్' చిత్రంతో ఒక భారీ కొలాబరేషన్‌ను ప్రకటించింది. ఈ అప్‌డేట్ గేమర్లతో పాటు యష్ అభిమానులలో పూనకాలు తెప్పిస్తోంది. ఈ మైండ్ బ్లోయింగ్ కొలాబరేషన్ కేవలం ప్రకటనకే పరిమితం కాకుండా సరికొత్త ఇన్-గేమ్ అప్‌డేట్స్‌తో రాబోతోంది. BGMI తన సరికొత్త 4.4 అప్‌డేట్‌లో భాగంగా ఈ 'టాక్సిక్' ప్రచారాన్ని ఆటగాళ్లకు పరిచయం చేయనుంది. ఇందులో భాగంగా మే 28 నుంచి గేమ్‌లో 'టాక్సిక్ ఎక్స్ఛేంజ్ ఈవెంట్' ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ ద్వారా ప్లేయర్స్ ప్రత్యేకమైన ఇన్-గేమ్ రివార్డులను సొంతం చేసుకోవచ్చు. ఆ తర్వాత జూన్ 2న అత్యంత ప్రతిష్టాత్మకంగా 'టాక్సిక్ వాయిస్ ప్యాక్ క్రేట్' విడుదల కానుంది. దీని ద్వారా రాకింగ్ స్టార్ యష్ ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ వాయిస్ లైన్స్, డైలాగులను ప్లేయర్స్ తమ గేమ్ ప్లే లో ఉపయోగించుకునే అద్భుతమైన అవకాశం లభించనుంది. కేవలం వాయిస్ ప్యాక్స్ మాత్రమే కాకుండా ఈ కొలాబరేషన్‌లో భాగంగా ప్రత్యేకమైన గన్ స్కిన్స్, అవుట్‌ఫిట్స్, కాస్ట్యూమ్స్ మరియు సరికొత్త ఎమోట్లను గేమ్‌లోకి తీసుకువస్తున్నారు. యష్ రగ్గడ్ మరియు మాస్ లుక్‌ను ప్రతిబింబించేలా ఈ స్కిన్స్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సుమారు ₹700-800 కోట్ల భారీ బడ్జెట్ సినిమాను ఈ విధంగా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయడం వల్ల సినిమా ప్రమోషన్లకు కొత్త రెక్కలు వచ్చినట్లయింది. యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న BGMI ద్వారా యష్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు యాటిట్యూడ్‌ను గేమర్స్ నేరుగా అనుభవించవచ్చు. మే 28 నుంచి ప్రారంభమయ్యే ఎక్స్ఛేంజ్ ఈవెంట్ మరియు జూన్ 2 నాటి వాయిస్ ప్యాక్ క్రేట్ కోసం భారతదేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పబ్‌జీ, బీజీఎమ్‌ఐ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   
సౌత్ చిత్ర పరిశ్రమలో త్రిష(Trisha)కి ఉన్న స్థానం గురించి తెలిసిందే. ఎన్నో హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. రీసెంట్ గా కరుప్పు(karuppu)ఉరఫ్ వీరభద్రుడుతో విజయాన్ని అందుకుంది. విజయాన్ని అందుకోవడమే కాదు సూర్య వరుస పరాజయాలకి విముక్తి కల్పించి నేను లక్కీ హీరోయిన్ ని బాబు  అని మరో సారి చాటి చెప్పింది.  రీసెంట్ గా త్రిషకి సంబంధించిన నలుపు రంగు సెంటిమెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది  త్రిష అభిమాని ఒకరు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఎక్స్ వేదికగా విజయ్, అజిత్, సూర్య తో  చేసిన గిల్లి, మంగత్తా, ఆరు చిత్రాల్లో త్రిష బ్లాక్ డ్రెస్ ధరించింది. ఆ చిత్రాలు ఆ హీరోల కెరీర్ కే మైలురాయిగా నిలిచాయి. ఇప్పుడు కరుప్పులో బ్లాక్ డ్రెస్ ధరించింది. సూపర్ హిట్ అయ్యాయని పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ కి త్రిష స్మైల్ ఎమోజి లని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ రెండు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Also read: Karuppu: కరుప్పు ఆ స్టార్ హీరోదా!.. వైరల్ అవుతున్న న్యూస్   
- మెగాస్టార్ చిరంజీవిపై అసత్య ప్రచారాలు - వ్యూస్ కోసం చిరంజీవి మార్ఫింగ్ వీడియోలు - లాయర్ రామకృష్ణ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు - యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులపై కేసు నమోదు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి అవాస్తవాలను ప్రచారం చేస్తున్న ఒక యూట్యూబ్ ఛానెల్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సమాజంలో ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం, ప్రతిష్ట కలిగిన చిరంజీవిపై సదరు ఛానెల్ పూర్తిగా బోగస్ కంటెంట్‌తో దుష్ప్రచారం చేస్తోందని, తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని పోలీసులు నిర్ధారించారు. మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలను వాడుతూ ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తున్న ఛానెల్ నిర్వాహకులను శిక్షించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసుకు సంబంధించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్, కమలాపురి కాలనీకి చెందిన ప్రముఖ న్యాయవాది రామకృష్ణ మిర్యాల జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదరు యూట్యూబ్ ఛానెల్ చిరంజీవి ఆరోగ్యంపై పూర్తిగా అభ్యంతరకరమైన, అవాస్తవమైన కంటెంట్‌ను క్రియేట్ చేసిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. చిరంజీవి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారంటూ కొన్ని మార్ఫింగ్ చేసిన విజువల్స్‌తో వీడియోలు రూపొందించి, వాటిని వ్యూస్ కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ చేశారని లాయర్ రామకృష్ణ ఫిర్యాదులో వెల్లడించారు. ఇలాంటి ఫేక్ వీడియోల వల్ల సమాజంలో అనవసర అలజడి సృష్టిస్తున్నారని, కోట్లాది మంది మెగా అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నారని లాయర్ రామకృష్ణ పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఫిర్యాదుతో పాటు సదరు యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లు, అభ్యంతరకరమైన వీడియో లింకులను పక్కా ఆధారాలుగా పోలీసులకు అందజేశారు. ఈ ఆధారాలను పరిశీలించిన జూబ్లీహిల్స్ పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, నిబంధనల ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని ఛానెల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ఇటీవలి కాలంలో వ్యూస్, లైక్స్ కోసం సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, ఆరోగ్యంపై థంబ్‌నైల్స్ మార్చి అడ్డగోలుగా అబద్ధాలు ప్రచారం చేసే యూట్యూబ్ ఛానెళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్‌పై జరిగిన ఈ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.   
  'కరుప్పు'(Karuppu)కొనసాగిస్తున్న వీరవిహారం కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. పరాజయాలని ఆప్త మిత్రులుగా చేసుకొని తిరుగుతున్న సూర్య(Surya)కెరీర్ కి మంచి బూస్టప్ ని ఇస్తూ రెండు వారాలు ఇంకా పూర్తి చేసుకోకుండానే 250 కోట్లకి పైగా గ్రాస్ తో దూసుకుపోతుంది. అయితే  ఒక బిగ్ హీరో కరుప్పు లో మొదట నటించాలని అనుకున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది డైరెక్టర్ ఆర్.జె. బాలాజీ కరుప్పుని  మొదట తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్(Vijay)కోసం రాసుకున్నాడని, 2023 ఆగస్టులో బాలాజీ, విజయ్‌ని కలిసి కథ వినిపించడంతో పాటు కథ వినగానే విజయ్ కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యారట. మనమే ఈ సినిమ చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారట. దీంతో విజయ్ లాంటి స్టార్ హీరో తన కథకి  ఓకే చెప్పడంతో బాలాజీ తెగ సంబరపడిపోయాడట. అయితే అసలు స్టోరీ ఇక్కడే మొదలైంది. బాలాజీ ఫుల్ స్క్రిప్ట్ కోసం చాలా టైమ్  తీసుకోవడంతో  విజయ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చేసాడు. దీంతో బాలాజీ విజయ్ కోసం రాసుకున్న కథతో సూర్యని  సంప్రదించారట. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ హోదాలో తన సత్తా చాటుతుంది. Also read: నందమూరి vs అక్కినేని.. 11 ఏళ్ళ తర్వాత బరిలోకి!      
-2027 సంక్రాంతి బరిలో బాలకృష్ణ, నాగార్జున సమరం తప్పదా  -శరవేగంగా ఇరు చిత్రాల షూటింగ్స్  -11 ఏళ్ళ తర్వాత పోటీ పడటంతో ఫ్యాన్స్, ప్రేక్షకుల్లో ఆసక్తి తెలుగు చిత్రసీమలో దశాబ్దాల చరిత్ర కలిగిన నందమూరి, అక్కినేని కుటుంబాల బాక్సాఫీస్ సమరం మరోసారి పునరావృతం కానుంది. గత నాలుగు దశాబ్దాలుగా టాలీవుడ్‌ని  ఏలుతున్న అగ్ర నటులు నందమూరి బాలకృష్ణ(Balakrishna),కింగ్ అక్కినేని నాగార్జున(Nagarjuna)రాబోయే 2027 సంక్రాంతి బరిలో నేరుగా తలపడనున్నారు. వెండితెరపై ఈ ఇద్దరి మధ్య సాగే బాక్సాఫీస్ పోటీ ప్రేక్షకులకి ఎప్పుడూ అసలైన వినోదాన్ని పంచుతుంది. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావుల కాలం నుంచే మొదలైన ఈ సాంప్రదాయం, వారి నటవారసులైన బాలయ్య, నాగ్ ల వరకు విజయవంతంగా కొనసాగుతోంది. గతంలో వీరిద్దరూ బాక్సాఫీస్ బరిలో దాదాపు 10 సార్లు తలపడగా సినీ పండగ సీజన్ సంక్రాంతి రేసులో మాత్రం మూడుసార్లు తలపడ్డారు. ఇప్పుడు సుమారు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ సంక్రాంతి రేసులో నిలవనున్నారనే న్యూస్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. కింగ్ నాగార్జున తన కెరీర్‌లో  ప్రతిష్టాత్మకమైన,100వ చిత్రం 'లాటరీ కింగ్'తో ఈ సంక్రాంతి రేసులోకి నిలవనున్నాడనే వార్తలు వస్తున్నాయి.  ఆర్ కార్తీక్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుండగా 'సోగ్గాడే చిన్ని నాయన', 'బంగార్రాజు' వంటి చిత్రాలతో సంక్రాంతి సీజన్ లో వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్న నాగార్జున, ఈసారి తన 100వ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాలని భావిస్తున్నాడు. మరోవైపు, ఫ్లాష్ స్పీడ్‌తో సినిమాలు పూర్తి చేసే గాడ్ ఆఫ్ మాసెస్  బాలకృష్ణ సైతం మరో సారి సంక్రాంతికి తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు.  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'NBK 111' ని  డిసెంబర్ కల్లా పూర్తి చేసి, పక్కాగా 2027 పొంగల్ రేసులో నిలపాలని చిత్రబృందం ప్రణాళికలు రచిస్తోంది.  Also read: Toxic: టాక్సిక్ కొత్త డేట్ ఇదేనా! సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న తాజా న్యూస్  ఈ ఇద్దరు అగ్ర హీరోల పోరుతో పాటు, 2027 సంక్రాంతి టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద "మహా సంగ్రామం"గా మారబోతోంది. ఎందుకంటే తెలుగు సినీ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా భావించే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కూడా ఇదే పండగ రేసులో జాయిన్ అవుతున్నారు. చిరంజీవి(Chiranjeevi)బాబీ కాంబోలో రాబోతున్న పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్, అనిల్ రావిపూడి, వెంకటేష్(venkatesh)కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు కూడా ఈ పండగ బరిలోనే నిలుస్తున్నాయి. టాలీవుడ్ చరిత్రలోనే ఈ నలుగురు సీనియర్ అగ్ర హీరోల సినిమాలు ఒకే సీజన్‌లో, ఒకేసారి విడుదల కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. మునుపెన్నడూ లేని విధంగా ఒకే పండక్కి 4 పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయనుండటంతో అభిమానులకి  కన్నుల పండుగగా మారనుంది. ముఖ్యంగా నందమూరి వర్సెస్ అక్కినేని పోరు 11 ఏళ్ల తర్వాత కుదరడంతో  ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.   
న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ది పారడైజ్' (The Paradise). 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ అంచనాలకు తగ్గట్టే, చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' (Aaya Sher) సోషల్ మీడియాను ఊపేస్తోంది. కేవలం యూట్యూబ్‌లోనే కాకుండా ప్రతి పబ్లిక్ ఈవెంట్, కాలేజ్ ఫెస్ట్‌లలోనూ ఈ సాంగ్ ఒక రేంజ్‌లో మారుమోగిపోతోంది. సికింద్రాబాద్ స్లమ్స్ నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలోని హీరో ఎలివేషన్ సాంగ్, ఇప్పుడు సరికొత్త రికార్డులను తిరగరాస్తూ టాలీవుడ్‌లోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మాస్ యాంథమ్ యూట్యూబ్‌లో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఏకంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. కేవలం వ్యూస్ పరంగానే కాకుండా, ఏకంగా 1.6 మిలియన్ల కంటే ఎక్కువ లైక్‌లతో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఈ పాట ప్రభంజనం సృష్టిస్తోంది.  నాని కెరీర్‌లోనే ఇంత తక్కువ సమయంలో 150 మిలియన్ల మార్కును దాటిన తొలి సాంగ్‌గా 'ఆయా షేర్' నిలిచింది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బీట్స్, కిల్లర్ బేస్ లైన్స్ శ్రోతలకు పూనకాలు తెప్పిస్తున్నాయి.  ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం, పాటలోని మాస్ ఆటిట్యూడ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకువెళ్లింది. దానికి తోడు జంగిరెడ్డి, అర్జున్ చండి తమ పవర్‌ఫుల్ వాయిస్‌తో ఈ పాటను పాడిన విధానం వింటుంటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయి. సుధన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో నాని వేసిన మాస్ స్టెప్పులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.  శ్రీకాంత్ ఓదెల మార్క్ రా అండ్ రస్టిక్ విజువల్స్, నాని ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మైలురాయిని అందుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. 1980ల నాటి యాటిట్యూడ్‌ను పక్కాగా ప్రజెంట్ చేస్తూ విజువల్స్ అదిరిపోయేలా ప్లాన్ చేశారు. సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా మూవీ ఆగస్ట్ 21, 2026 న థియేటర్లలో విడుదల కానుంది.   
    రాకింగ్ స్టార్ యష్(Yash)మోస్ట్ అవైటెడ్ వన్ మాన్ షో యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (TOXIC). మలయాళ టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్(Geethu MOhandas)దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా థియేట్రికల్ విడుదల విషయంలో మాత్రం వరుసగా బ్రేకులు పడుతుండటం అభిమానులను కలవరపెడుతోంది. ఇప్పటికే మూడు సార్లు విడుదల తేదీలని మార్చుకుంది.  జూన్ 4వ తేదీ కూడా అందులో ఉన్న విషయం తెలిసిందే. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న కధనాల ప్రకారం  ఈ సినిమా వాయిదా పడటం వెనుక బలమైన ఓటీటీ మరియు గ్లోబల్ బిజినెస్ కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, 'టాక్సిక్' చిత్ర డిజిటల్ రైట్స్  కోసం నిర్మాతలు ఆశిస్తున్న భారీ రేటుకి , ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆఫర్ చేస్తున్న మొత్తానికి మధ్య అస్సలు సింక్ కుదరడం లేదు. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిజిటల్ హక్కుల కోసం నిర్మాతలు భారీ ఆశలే పెట్టుకున్నారు. గతంలో 'కేజీఎఫ్' సాధించిన రికార్డు స్థాయి వసూళ్లు మరియు క్రేజ్‌ను ప్రాతిపదికగా తీసుకుని మేకర్స్ భారీ ధరను డిమాండ్ చేస్తుంటే, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు మాత్రం ప్రస్తుత మార్కెట్ మందగమనాన్ని చూపిస్తూ కేవలం 100 కోట్ల రూపాయలను మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ వంద కోట్ల ఆఫర్ నిర్మాతలకు ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడం మరియు ఓటీటీ సంస్థలు విధిస్తున్న కఠినమైన నిబంధనల వల్ల డిజిటల్ డీల్ ఒక కొలిక్కి రాలేదు. సాధారణంగా ఇలాంటి భారీ పాన్ ఇండియా చిత్రాలకు థియేటర్ల విడుదలకు ముందే డిజిటల్ మరియు శాటిలైట్ హక్కుల ద్వారా వచ్చే ముందస్తు ఆదాయం అత్యంత కీలకం. ఈ వ్యాపార ఒప్పందాలు ఆలస్యం కావడం వల్లే ప్రమోషన్స్ మరియు విడుదల తేదీలని  వెనక్కి నెట్టాల్సి వచ్చింది. Also read: Peddi: ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్... ఆ ఏరియాలో పెద్ది సంచలన రికార్డు  మరోవైపు, సినిమా మేకర్స్ అధికారికంగా వెల్లడించిన దాని ప్రకారం.. సినిమా షూటింగ్ పూర్తిగా పూర్తయింది. రీసెంట్‌గా ప్రతిష్టాత్మక 'సినిమాకాన్' ఈవెంట్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు అంతర్జాతీయ డిస్ట్రిబ్యూటర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ చిత్రాన్ని కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా, ఇంగ్లీష్‌తో పాటు పలు అంతర్జాతీయ భాషల్లో ఒకేసారి భారీ గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేయాలని యష్ భావిస్తున్నారు. అంతర్జాతీయ భాగస్వామ్యాలు, ప్రపంచవ్యాప్త పంపిణీ ఒప్పందాలని  చక్కదిద్దేందుకే ఈ సమయం తీసుకుంటున్నట్లు హీరో యష్ తన ప్రకటనలో తెలిపారు. అయితే, ఈ గ్లోబల్ బిజినెస్ ఇష్యూస్ , ఓటీటీ డీల్స్ గనుక త్వరగా సెటిల్ అవ్వకపోతే, కనీసం ఆగస్టు నాటికైనా 'టాక్సిక్' థియేటర్లలోకి రావడం కష్టమేనని ఇండస్ట్రీ టాక్. ఒకవేళ ఆగస్టు నెల కూడా మిస్ అయితే, ఈ మెగా ప్రాజెక్ట్ ఏకంగా వచ్చే ఏడాది అంటే 2027 కి షిఫ్ట్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి కీ రోల్స్   
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వన్ మాన్ షో  స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూ. 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్ మార్కెట్లలో 'పెద్ది' క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే నార్త్ అమెరికా, అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న ఈ చిత్రం, తాజాగా యూకే (United Kingdom) మార్కెట్లోనూ ఊహించని రేంజ్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. రామ్ చరణ్ గ్లోబల్ పాపులారిటీకి అద్దం పడుతూ యూకే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే ఏకంగా 12,500 పైగా టిక్కెట్లు అమ్ముడైపోవడం ట్రేడ్ వర్గాలని సైతం విస్మయానికి గురిచేస్తోంది. యూకేలో ఉన్న మెగా అభిమానులు, తెలుగు ప్రేక్షకులు థియేటర్ల వద్ద టికెట్ల కోసం ఎగబడుతుండటంతో చాలా చోట్ల షోలు ఇప్పటికే హౌస్‌ఫుల్ అయిపోయాయి. ఈ చిత్రం నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ అయిన కేవలం 5 గంటల్లోనే 1,00,000 డాలర్ల (100K USD) మార్కుని  దాటి అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఇండియన్ సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. మొదటి 24 గంటల్లోనే అమెరికాలో 5,035 టిక్కెట్లు అమ్ముడవడమే కాకుండా, 1,052 షోల ద్వారా 1,45,000 డాలర్ల గ్రాస్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ 'OG' పేరిట ఉన్న 82,000 డాలర్ల రికార్డును సులువుగా బ్రేక్ చేసింది. రామ్ చరణ్ గత చిత్రం 'గేమ్ ఛేంజర్' మొదటి 48 గంటల్లో సాధించిన 38,000 డాలర్ల వసూళ్లతో పోలిస్తే, 'పెద్ది' కేవలం ఒక్క రోజులోనే దానికి నాలుగు రెట్లు ఎక్కువ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలైన సత్తా చాటింది. Also read: Dhurandhar 2: ధురంధర్ 2 ప్రొడక్షన్ డిజైర్ పై లైంగిక వేధింపుల కేసు.. చేసింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు  దాదాపు 3 గంటల 9 నిమిషాల (189 నిమిషాలు) సుదీర్ఘ రన్‌టైమ్‌తో సెన్సార్ బోర్డ్ నుండి యు/ఎ (U/A 16+) సర్టిఫికేట్ పొందిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘హెల్లాళ్లాలో’, ‘మాస్ మాస్ మాస్’ పాటలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక యువకుడి ప్రతిభ, క్రికెట్, కుస్తీ, రన్నింగ్ వంటి క్రీడల్లో అతను ఎదుర్కొన్న సవాళ్లు, ఆపై సాధించిన విజయాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేయడం ఖాయంగా కనిపిస్తోంది. సరికొత్త 'ప్రమోషన్ ఆన్ వీల్స్' వ్యూహంతో పాటు యూకే, యూఎస్‌ఏ దేశాల్లో కనిపిస్తున్న ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే, జూన్ 3న పడబోయే ప్రీమియర్ షోలతోనే 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  చరణ్ తో పాటు చిత్ర బృందం మొత్తం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.       
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పుదీనా ఎంతో సువాసనగా, ఆహ్లాదాన్ని ఇచ్చే మొక్క.  ఎన్నో రకాల కూరల నుండి పచ్చళ్ల తయారీ  వరకు పుదీనాను  ఉపయోగిస్తారు.   ఇక వేసవి కాలంలో అయితే షర్బత్ నుండి నిమ్మరసం, ఆమ్ పన్నా, మసాలా మజ్జిగ ఇలా.. చాలా పానీయాల తయారీలో కూడా పుదీనాను ఉపయోగిస్తారు. పుదీనా పానీయాల రుచిని పెంచుతుంది. శరీరాన్ని చల్లబరుచుతుంది. అయితే వేడి ఎక్కువగా ఉంటే పుదీనా మొక్క చాలా తొందరగా వాడిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో మొక్కకు పచ్చదనాన్ని పెంచడానికి , మొక్క పచ్చగా ఎదగడానికి కొన్నిచిట్కాలు ఉపయోగించవచ్చు. వాటిలో ఎంతో ప్రబావవంతంగా పనిచేసే చిట్కా తెలుసుకుంటే.. పటిక నీరు.. పుదీనా మొక్కకు పటిక నీటిని కలపడం వల్ల మట్టి ఆమ్లంగా మారుతుంది. కుండీలోని మట్టి క్షారంగా మారినప్పుడు, పుదీనా పెరుగుదల కుంటుపడి, ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఇటువంటి పరిస్థితిలో, పటిక నీటిని ఉపయోగించడం మొక్కకు మేలు చేస్తుంది. పటిక నీరు మట్టి  pH స్థాయిని తగ్గిస్తుంది, దీనివల్ల అది పుదీనా మొక్కకు అనుకూలంగా మారి, పోషకాలను మరింత సులభంగా గ్రహించడానికి వీలు కలుగుతుంది. క్రిమినాశకం.. పుదీనా వాసన తరచుగా కీటకాలను దూరంగా ఉంచుతుంది, కానీ కొన్నిసార్లు చీమలు , బూజు దాని వేళ్ళను ఆశించి, మొక్క దెబ్బతినేలా చేస్తాయి. ఈ సమస్యలున్నప్పుడు   మొక్కపై పటిక నీటిని చల్లవచ్చు. పటికలో యాంటీ బాక్టీరియల్  యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి మొక్కను కీటకాలు, బూజు , చీమల నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుదల.. కొన్నిసార్లు, మొక్కలకు సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఆకుల పెరుగుదల మందగిస్తుంది. పటిక నీటిని కలపడం వల్ల ఆకులు పెద్దవిగా, పచ్చగా, , మరింత నిగనిగలాడేలా పెరగడానికి సహాయపడుతుంది. మొక్క  కొమ్మలను చిగురింపజేసి, మరింత దట్టంగా పెరగడం ప్రారంభిస్తుంది. ఎలా వాడాలి? ఒక లీటరు శుభ్రమైన నీటిని తీసుకుని, అందులో ఒక పటిక ముక్కను వేయాలి. అర టీస్పూన్ పటిక పొడి వచ్చేంత ముక్కను వాడాలి. దానిని 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. . నీరు మరీ చిక్కగా ఉండకూడదు. ఈ పటిక నీటిని పుదీనా వేర్లకు అందేలా  పోయాలి. నీటిని కేవలం మట్టికి మాత్రమే అందించాలి.                                 *రూపశ్రీ.
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే  వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో  ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి.  అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది.  మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే.. టీవి, పోన్.. చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది.  టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి.  టీవిలో ఛానెల్స్ కానీ,  స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు.  పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది.   జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి,  స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు. అలవాట్లు,  అభిరుచులు.. ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు,  అభిరుచులు ఉండవు.  అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు. లక్ష్యాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి.  లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం,  జ్ఞానాన్ని ఆర్జించడం,  ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది. కంఫర్ట్ జోన్.. చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం.  ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు. ఉన్న సంతోషం,  ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు.  కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు. అదృష్టం.. ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ,  గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు. ఇతరులను నిందించడం.. నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద  ఉద్యగం తెచ్చుకునేవాడిని,  నాకు  బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు.  తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు.  పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు.                            *రూపశ్రీ.
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా మంచి గ్రేడ్‌లు సాధించడం అని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలలో  మానసిక బలాన్ని పెంపొందించడం, వారు భవిష్యత్తులో గొప్పగా ఎదగడం మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలతో ఉండటం చాలా ముఖ్యం.  ఆత్మవిశ్వాసం అనేది ఏ బిడ్డ వ్యక్తిత్వానికైనా పునాది. అది వారికి తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని, అలాగే వైఫల్యాల నుండి నేర్చుకుని ఓపికతో ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు కాలక్రమేణా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఈ లక్షణాలు రాత్రికి రాత్రే పుట్టేవి కాదు.. వీటికి చిన్నతనం నుండే సరైన మార్గదర్శకత్వం అవసరం. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు లీడర్లుగా తయారవ్వాలంటే.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పెంచే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి నాయకత్వ లక్షణాలు పెంచే టిప్స్.. వ్యక్తీకరణ..  పిల్లలకు వారి అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడం వల్ల వారు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరచుకోవడానికి , వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. విజయాల గుర్తింపు.. పిల్లలు ఒక చిత్రాన్ని గీసినా లేదా ఒక పద్యాన్ని చదివినా, వారి కృషిని ప్రశంసించాలి. ఇలా మెచ్చుకోవడం వల్ల  పిల్లలలో తాము గౌరవించబడుతున్నామనే భావన కలుగుతుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను రెండింటినీ పెంచుతుంది. విలువలు,సంప్రదాయాలు.. పిల్లలను కుటుంబ సంప్రదాయాలు, పండుగలు , ఆచారాలతో అనుసంధానించడం వారిలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి , వారి గుర్తింపు పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. సహనం, ఓర్పు..  గెలవడం ఎల్లప్పుడూ అవసరం కాదని, వెంటనే  ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించడం ముఖ్యం. ఓర్పు, సహనం వారు పరిణతి చెందడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు..  సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రలేవడం , రాత్రి సమయానికి నిద్రపోవడం,  వంటివి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గతంగా బలపరుస్తాయి. ఇది క్రమశిక్షణ , ఆత్మనియంత్రణను కూడా నేర్పిస్తుంది. వైఫల్యాల నుండి నేర్చుకోవడం..  పిల్లలు చేసే  ఏదైనా పనిలో  విఫలమైతే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని వారికి వివరించాలి. ఇది వైఫల్యం  తర్వాత తిరిగి లేచి ముందుకు సాగడాన్ని వారికి నేర్పుతుంది, ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకం అవుతుంది. చెప్పేది వినాలి..   పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల, వారు తమ సమస్యలను, ప్రశ్నలను  పంచుకోగలరనే నమ్మకం వారిలో పెరుగుతుంది . వినయం..  ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే కృతజ్ఞత చూపడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పాలి. ఇవి వారు ఇతరులతో మమేకమవ్వడానికి, సమాజంలో గౌరవం సంపాదించుకోవడానికి సహాయపడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పైవన్నీ నేర్పిస్తూ ఉంటే.. పిల్లలు తప్పకుండా తమ జీవితంలో ఆత్మవిశ్వాసంలో ఉంటారు.  నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
ప్రస్తుత కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రజలను భయపెడుతున్న ఆరోగ్య సమస్యలలో ‘క్యాన్సర్’ ముందు వరుసలో ఉంది. ఒకప్పుడు వయసు పైబడిన వారిలోనే ఎక్కువగా కనిపించే ఈ మహమ్మారి, నేడు మారుతున్న జీవనశైలి, ఆహార అలవాట్ల వల్ల యువతలోనూ వేగంగా విస్తరిస్తోంది. అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? కుటుంబంలో ఒకరికి ఉంటే మిగతా వారికి కూడా వస్తుందా? (Family Cancer Syndromes). దీనికి గల కారణాలు, అధునాతన చికిత్సల గురించి నిమ్స్ (NIMS) హాస్పిటల్ మాజీ సీనియర్ ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ సర్జికల్ ఆంకాలజీ మరియు అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ జి. సూర్యనారాయణ రాజు (Dr. GSN Raju) గారు ఈ VIDEO లో అందించిన పూర్తి వివరాలు మీకోసం... క్యాన్సర్ అంటే ఏమిటి? (What is Cancer?) మన శరీరంలో కోట్లాది కణాలు ఉంటాయి. ఇవి క్రమపద్ధతిలో విభజన చెందుతూ, పాత కణాలు చనిపోయాక కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ, ఈ కణాల విభజన ప్రక్రియపై నియంత్రణ తప్పినప్పుడు, కణాలు అసాధారణంగా, అమితంగా పెరిగిపోతాయి. అలా పెరిగిన కణాల సమూహాన్నే గడ్డలు లేదా ‘ట్యూమర్లు’ అంటారు. ఇవి శరీరంలోని ఇతర భాగాలకు పాకినప్పుడు దానిని క్యాన్సర్ (Malignant) గా గుర్తిస్తారు. ఫ్యామిలీ క్యాన్సర్ సిండ్రోమ్స్ అంటే ఏమిటి? (Family Cancer Syndromes / Hereditary Cancer) చాలా మందిలో ఉండే పెద్ద అనుమానం—"మా కుటుంబంలో ఒకరికి క్యాన్సర్ ఉంది, అది మాకు కూడా వస్తుందా?". డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు గారి వివరణ ప్రకారం, అన్ని క్యాన్సర్లు వంశపారంపర్యంగా రావు. కేవలం 5 నుండి 10 శాతం క్యాన్సర్లు మాత్రమే జన్యుపరమైన లోపాలు (Genetic Mutations) తర్వాతి తరాలకు బదిలీ అవ్వడం వల్ల వస్తాయి. దీనినే 'ఫ్యామిలీ క్యాన్సర్ సిండ్రోమ్' అంటారు. ముఖ్య లక్షణాలు: కుటుంబంలో ఒకే తరానికి చెందిన ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్ రావడం, చాలా తక్కువ వయసులోనే (ఉదాహరణకు 30 లేదా 40 ఏళ్లకే) క్యాన్సర్ బారిన పడటం, లేదా ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ రకాల క్యాన్సర్లు (ఉదాహరణకు రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ రెండూ) రావడం వంటివి జరిగితే అది వంశపారంపర్య క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణలు: బ్రెస్ట్ క్యాన్సర్ (రొమ్ము క్యాన్సర్), ఒవేరియన్ క్యాన్సర్ (అండాశయ క్యాన్సర్), మరియు కోలోరెక్టల్ క్యాన్సర్ (ప్రేగు క్యాన్సర్) లలో ఈ వంశపారంపర్య ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు (Causes of Cancer) వంశపారంపర్య కారణాలు కాకుండా, మిగిలిన 90% క్యాన్సర్లకు మన చేతులారా చేసుకునే పొరపాట్లే కారణమని డాక్టర్ గారు హెచ్చరిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి: ధూమపానం మరియు మద్యపానం: సిగరెట్లు, బీడీలు తాగడం, గుట్కా నమలడం వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు వస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం: జంక్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం, మైదా, అతిగా వేయించిన మాంసాహారం తీసుకోవడం. స్థూలకాయం (Obesity): శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరిగి క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. రసాయనాలు & కాలుష్యం: ఫ్యాక్టరీల నుండి వచ్చే రసాయనాలు, పురుగుమందుల ప్రభావం ఉన్న ఆహార పదార్థాలు. వైరల్ ఇన్‌ఫెక్షన్లు: హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV), హెపటైటిస్-B వంటి వైరస్ల వల్ల కూడా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స (Diagnosis and Treatment) క్యాన్సర్‌ను మొదటి లేదా రెండో దశలోనే గుర్తిస్తే 100% నయం చేయవచ్చని డాక్టర్ జి.ఎస్.ఎన్. రాజు గారు స్పష్టం చేశారు. కుటుంబ చరిత్రలో క్యాన్సర్ ఉన్నవారు ముందుగానే 'జెనెటిక్ స్క్రీనింగ్' (Genetic Testing) మరియు క్రమంతప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం మంచిది. ప్రస్తుతం వైద్యరంగంలో అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి: సర్జరీ (Surgery): క్యాన్సర్ గడ్డను శస్త్రచికిత్స ద్వారా తొలగించడం. కీమోథెరపీ (Chemotherapy): శక్తివంతమైన మందుల ద్వారా క్యాన్సర్ కణాలను నిర్మూలించడం. రేడియేషన్ థెరపీ (Radiation Therapy): హై-ఎనర్జీ ఎక్స్-రేల ద్వారా క్యాన్సర్ కణాలను నాశనం చేయడం. ఇమ్యునోథెరపీ (Immunotherapy): శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్‌తో పోరాడేలా చేయడం. క్యాన్సర్ పట్ల భయం వద్దు... అవగాహన ముఖ్యం! సరైన జీవనశైలిని అలవర్చుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పు నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఒకప్పుడు వృద్దులలో కనిపించే ఆరోగ్య సమస్యలు అన్నీ నేటికాలంలో యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఎంతో మంది వెన్ను నొప్పి,  డయాబెటిస్,  బిపి, మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఇవి మాత్రమే కాకుండా చాలామంది యువతను కూడా ఇబ్బంది పెడుతున్న ఇంకొక సమస్య కీళ్ల వాతం. దీన్నే ఆర్థరైటిస్ అని కూడా పిలుస్తారు. జీవనశైలి సరిగా లేకపోవడం,  ఊబకాయం,  శారీరక శ్రమ తక్కువగా ఉండటం లేదా అసలు శారీరక శ్రమ లేకపోవడం కీళ్ల వాతానికి దారి తీస్తుంది.  కీళ్లవాతం దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండాలంటే.. కొన్ని పనులు చేయాలి.  అవేంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. సాధారణంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలని చెబుతూ ఉంటారు.  దీన్ని బిఎమ్ఐ అని చెబుతారు. అయితే ఎత్తుకు తగ్గ బరువు కాకుండా ఎక్కువ బరువు ఉండే అధిక బరువు అంటారు.  ఈ అధిక బరువు కంటే కూడా ఎక్కువ బరువు ఉంటే దాన్ని ఊబకాయం అని అంటారు.  కీళ్లవాతం సమస్య ఎక్కువగా ఊబకాయం ఉన్నవారికే వస్తుంది.  అందుకే కీళ్లవాతం రాకూడదంటే ఊబకాయం రాకుండా చూసుకోవాలి.  బరువును అదుపులో ఉంచుకోవాలి.  అదిక బరువు సమస్యలు.. అధిక బరువు ఉంటే మోకాళ్లు, కీళ్లపై ఒత్తిడిని పెంచి ఆర్థరైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. పరిష్కారం.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం చేయాలి. అలాగే వాకింగ్,  యోగా,  స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయాలి.  ఇది కీళ్లను బలపరుస్తుంది. కీళ్ల వాతం రాకుండా చేస్తుంది. ఎముకల బలం.. ఎముకలు బలంగా ఉంటే కీళ్ల వాతం కూడా అంత సులువుగా రాదు.  అందుకే ఎముకలను బలంగా ఉంచేందుకు కాల్షియం,  విటమిన్-డి ఉన్న ఆహారాలు చాలా బాగా తీసుకోవాలి. సిట్టింగ్ పొజిషన్.. నేటికాలంలో ఉద్యోగాలు అన్నీ ఒకేచోట కూర్చుని చేసేవే.  ఈ సిట్టింగ్ వర్క్ వల్ల కీళ్లు బిగుసుకుపోయి నొప్రి పెరగడానికి దారితీస్తుంది. అందుకే సిట్టింగ్ వర్క్ చేసేవారు కనీసం అరగంట లేదా గంటకు ఒకసారి లేచి కాస్త అటు ఇటు తిరుగుతూ ఉండాలి. దీనివల్ల కీళ్లు రిలాక్స్ అవుతాయి. ఆహారం.. చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు,  ప్రాసెస్ చేసిన ఆహారాలు శరీరంలో వాపును పెంచడం ద్వారా కీళ్ల సమస్యలకు కారణం అవుతాయి.  అందుకే చక్కెర అధికంగా ఉన్న ఆహారాలను, ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత తక్కువగా లేదా అసలు తీసుకోకుండా ఉండటం మంచిది.                                  *రూపశ్రీ.