Home

»

Latest News

Trisha: నేను బ్లాక్ డ్రెస్ ధరిస్తే జరిగేది ఇదే...త్రిష ఆసక్తికర ట్వీట్   

May 27, 2026 11:28AM

సౌత్ చిత్ర పరిశ్రమలో త్రిష(Trisha)కి ఉన్న స్థానం గురించి తెలిసిందే. ఎన్నో హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. రీసెంట్ గా కరుప్పు(karuppu)ఉరఫ్ వీరభద్రుడుతో విజయాన్ని అందుకుంది. విజయాన్ని అందుకోవడమే కాదు సూర్య వరుస పరాజయాలకి విముక్తి కల్పించి నేను లక్కీ హీరోయిన్ ని బాబు  అని మరో సారి చాటి చెప్పింది.  రీసెంట్ గా త్రిషకి సంబంధించిన నలుపు రంగు సెంటిమెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది 

త్రిష అభిమాని ఒకరు సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఎక్స్ వేదికగా విజయ్, అజిత్, సూర్య తో  చేసిన గిల్లి, మంగత్తా, ఆరు చిత్రాల్లో త్రిష బ్లాక్ డ్రెస్ ధరించింది. ఆ చిత్రాలు ఆ హీరోల కెరీర్ కే మైలురాయిగా నిలిచాయి. ఇప్పుడు కరుప్పులో బ్లాక్ డ్రెస్ ధరించింది. సూపర్ హిట్ అయ్యాయని పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ కి త్రిష స్మైల్ ఎమోజి లని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ రెండు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also read: Karuppu: కరుప్పు ఆ స్టార్ హీరోదా!.. వైరల్ అవుతున్న న్యూస్ 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com