
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గ్లామర్ ప్రపంచంలో సరికొత్త సంచలనం సృష్టిస్తోంది. తెలుగు, తమిళ లాంగ్వేజెస్ లో తన హవా చాటిన కాజల్ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను పెళ్లాడి, ఒక బాబుకి జన్మనిచ్చింది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త ఎనర్జీతో దూసుకుపోతున్న కాజల్, ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా మారింది.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 19 ఏళ్లు దాటుతున్నా, 40 ఏళ్ల వయసులోనూ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ నేటి తరం కుర్ర హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తోంది. తాజాగా కాజల్ అగర్వాల్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. ఈ లేటెస్ట్ ఫొటోషూట్‌లో ఆమె ఒక క్యూట్ లైట్ పింక్ కలర్ బాడీకాన్ పొట్టి డ్రెస్‌లో మెరిసిపోయింది. బెడ్‌పై కూర్చొని, చేతిలో వింటేజ్ కెమెరా పట్టుకుని స్టైలిష్‌గా ఇచ్చిన పోజులు అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తన ఫ్రీ ఫ్లోయింగ్ కురులని అందంగా ముందుకు వదిలేసి ఆమె పలికించిన హావభావాలు అభిమానులు,నెటిజన్ల మనసు దోచుకుంటున్నాయి.
Also read: Bhagyashri borse: ఎమోషనల్ అయిన భాగ్యశ్రీ బోర్సే.. కమల్ హాసన్ కి ప్రామిస్ చేసేసింది
ఈ గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలపై కాజల్ తోటి నటీమణులు తమన్నా భాటియా, హన్సిక మోత్వాని, రాకుల్ ప్రీత్ సింగ్, అలాగే ఆమె సోదరి నిషా అగర్వాల్ వంటి స్టార్ సెలబ్రిటీలు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తూ కాజల్ అందాన్ని ప్రశంసిస్తున్నారు. కాజల్ ఖాతాలో గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'NBK 111' చేరినట్టుగా టాక్.
.webp)








