LATEST NEWS
మాజీ ఎంపీ, మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా..’ మల్లారెడ్డి కబ్జాల పర్వం మీద ఒక పెద్ద గ్రంథమే రాయవచ్చని గిట్టనివారు అంటూ వుంటారు. మల్లారెడ్డికి వున్న వందలాది ఎకరాల ఆస్తుల్లో చాలాశాతం కబ్జాల పుణ్యమేనని కూడా అంటూ వుంటారు. అలా కబ్జాలకే ఆది గురువైన మల్లారెడ్డి స్థలాన్నే ఎవరో కబ్జా పెట్టారు. ఇది వింతల్లోకెల్లా వింత.. సరికొత్త ప్రపంచ వింత.  కుత్బుల్లాపూర్ - పేట్ బషీరాబాద్ పరిధిలోని మల్లారెడ్డికి, అతని అల్లుడు రాజశేఖరరెడ్డికి చెందిన స్థలంలో కొంతమంది బారికేడ్లు పెట్టి కబ్జా చేశారట. దాంతో మల్లారెడ్డి, ఆయన అల్లుడు, వాళ్ళ అనుచరులు  సదరు స్థలం దగ్గరకి వచ్చి హడావిడి చేశారు. అక్కడకి పోలీసులు కూడా రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు, మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. మల్లారెడ్డి స్థలాన్ని వేరేవాళ్ళు కబ్జా చేశారా.. వేరేవాళ్ళ స్థలాన్ని కబ్జా చేయడానికి మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారా అనేది నిలకడ మీద తెలుస్తుంది. 
మహాభారతంలో శకుని పాత్ర చాలా కీలకమైనది. తన దుష్టపన్నాగాలతో పాండవులను అంతమొందించాలని ప్రయత్నించి విఫలమై ఆ ప్రయత్నంలో కౌరవ నాశనానికి కారకుడైనాడు. సరిగ్గా వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే పాత్ర పోషించారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ మరణానంతరం ఏపీ రాజకీయాల్లో జరిగిన మార్పులు అందరూ చూశారు. వైఎస్ రాజకీయ వారసుడిగా జగన్ తెరపైకి వచ్చారు. కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ సంపాదనకు పాల్పడ్డారంటూ ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పటికీ ఆయన బెయిలుపైనే ఉన్నారు. సకుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్లడానికి కూడా కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవలసిన పరిస్థితి జగన్ ది. అది పక్కన పెడితే..   2019 ఎన్నికలలో జగన్ విజయం కోసం  తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రచారం చేశారు. , వైఎస్ సోదరుడు, జగన్ బాబాయ్ వివేకానంద రెడ్డి ఘోర హత్య కూడా సానుభూతిని ప్రోది చేసి జగన్ విజయానికి దోహదపడింది. అయితే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తన విజయం కోసం ఇల్లూ వాకిలీ వదిలి మరీ తిరిగిన సొంత చెల్లి షర్మిలను,  దూరం పెట్టారు.  షర్మిల తెలంగాణలో  సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడం,  తల్లి వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేసి కుమార్తె వద్దకే వెళ్లిపోవడం ఇదంతా జనానికి తెలిసిందే.  అయితే జనానికి తెలియనిది  వైఎస్ కుటుంబంలో ఏదో జరిగింది.  వివేకా హత్య ఎలా జరిగిందో ప్రజలకు తెలియదు. కానీ వైఎస్ కుటుంబానికి తెలుసు. ఈ హత్య ఎవరు చేశారో.. ఎందుకు చేయించారో కూడా  తెలుసు. అర్ధరాత్రి ఫోన్ కాల్ డేటా రహస్యం ఏంటో కూడా ఆ ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అలాగే అన్నా చెల్లెళ్ళ మధ్య వైరం ఏంటో కూడా ప్రజలకు తెలియదు. కడుపున మోసి కని పెంచిన తల్లి కూడా జగన్ కు ఎందుకు దూరంగా జరిగారో ఆ కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు.   ఆ ఇంటిగుట్లన్నీ, ప్రజలకు తెలియని ఆ కుటుంబ రహస్యాలన్నీ బయటకు వచ్చేలా చేసింది సజ్జలే. ఔను.. షర్మిల తెలంగాణలో సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తరువాత ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత కూడా జగన్ పై ప్రత్యక్షంగా విమర్శలకు దిగలేదు. అలాగే జగన్ కూడా చెల్లి షర్మిలపై నేరుగా విమర్శలు గుప్పించలేదు. వైసీపీ సోషల్ మీడియాలో షర్మిలపై కొన్ని అనుచిత పోస్టులు కనిపించినా జనం కానీ షర్మిల కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదు.  ఏపీలో షర్మిల పొలిటికల్ ఎంట్రీతోనే  విజయవాడలో పోలీసులు కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అప్పుడే మొదలు పెట్టారా సీఎం జగన్ రెడ్డి సార్ అంటూ షర్మిల సున్నితంగా రిటార్డ్ ఇచ్చారు.   జగన్ తిరుపతిలో ఎడ్యుకేషన్ కాంక్లేవ్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ ని నిందించారు. తమ కుటుంబంలో కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని, చీలిక తెస్తోందని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీపై జగన్ నిందలకు షర్మిల కౌంటర్ ఇచ్చారు. అక్కడితో ఆ ఎపిసోడ్ ఆగిపోయి ఉండేది. కానీ సజ్జల ఎంటరై  చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం షర్మిల అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్క్రిప్ట్ నే షర్మిల చదువుతున్నారనీ నిందలేశారు. అక్కడితో ఆగకుండా అసలు జగన్ షర్మిలకు చేసిన అన్యాయమేంటో చెప్పాలని రెచ్చగొట్టారు. దాంతో షర్మిల ఓపెన్ అయిపోయారు.  జగన్ తనకు చేసిన అన్యాయాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. తండ్రి ఆస్తిలో వాటాను ఎలా ఎగ్గొట్టారో, ఏదో కొంత ఇచ్చి దానిని అప్పుకింద ఎలా రాయించుకున్నారో జనం కళ్లకు కట్టారు. సొంత బాబాయ్ వివేకా హత్య నిందితులను వెనకేసుకువస్తున్న సంగతీ చెప్పారు. జగన్ వైఖరినీ, దుర్మార్గాన్నీ బహిరంగ వేదికలపైనే ఎండగట్టారు. కడపలో ఆమె జగన్ ప్రతిష్టను పాతాళానికి పాతేశారు. దీంతో మొత్తం వైసీపీయే డిఫెన్స్ లో పడే పరిస్థితి వచ్చింది. దీనికి అంతటికీ సజ్జలే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ఇక పోలింగ్ పూర్తయిన తరువాత వైసీపీ శ్రేణుల్లో ఏమూలో ఉన్న గెలుపు విశ్వాసాన్ని కూడా సజ్జల ఊదేశారు. మీడియా ముందకు వచ్చి గెలుస్తామంటూ ఓ పక్క చెబుతూనే ఎన్నికల సంఘం చంద్రబాబు ఆదేశాలను పాటించిందంటూ విమర్శలు చేయడం ద్వారా  ఎన్నిలక ఫలితం ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లోనే శకుని కౌరవులకు చేసిన మేలే సజ్జల వైసీపీకి చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. శకుని కౌరవ పతనానికి కారకుడైతే.. సజ్జల వైసీపీ ఓటమికి కారకుడౌతున్నారని అంటున్నారు. 
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బిచాణా ఎత్తేసే సూచనలు కనిపించడంతో ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రూటు మార్చాడు.  దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన చిత్రం వ్యూహం. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితంలో చోటు చేసుకొన్న సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.  ఏపీ రాజకీయాలపై తెరకెక్కించిన చిత్రమిది.వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత  తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జరిగిన పరిణామాలపై చిత్రం నిర్మించారు. పూర్తి అవాస్తవాలతో తెరకెక్కిన చిత్రం ఇది. .  జగన్ పెట్టుబడితో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరించలేదు. తాజాగా ఎపిలో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తేలిపోయింది. త్రికూటమి ప్రభుత్వం అధికారంలో వస్తుందన్న వార్తలు వస్తున్నాయి.  ఎలాంటి నైతిక విలువలు లేని రాంగోపాల్ వర్మ  డైరక్టర్ల అసోసియేషన్ అంటూ  ఈ కొత్త డ్రామాకు తెరతీశాడు.  కొంత మందితో కల్సి  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. పబ్లిసిటీ  పిచ్చిబాగా ఉన్న రాంగోపాల్ వర్మ రేవంత్ రెడ్డితో ఫోటో దిగి దాన్ని అన్ని మీడియాల్లో వచ్చేలా  చూసుకున్నారు. గతంలో  డైరక్టర్ల అసోసియేషన్ కార్యక్రమాల్లో కనిపించని వర్మ సడెన్ గా ప్రత్యక్షమవ్వడం చర్చనీయాంశమైంది.  డైరెక్టర్ల అసోసియేషన్ నుంచి వచ్చి  ఎవరైనా కలిస్తే కించ పరిచేవారు. మరి అలాంటిది ఎందుకు ఆర్జీవీ డైరక్టర్ల అసోసియేషన్ పేరుతో రేవంత్ వద్దకు ఎందుకు వెళ్లారు ?   ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందోనన్న టెన్షన్ ఆర్జీవీలో పెరిగిపోయిందని తెలుస్తోంది. 
పల్నాటి పౌరుషం గురించి మనం కథలు కథలుగా విని వుంటాం. పలనాటి వీర చరిత్రలో బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ, బాలచంద్రుడి పౌరుషం గురించి తెలుసుకుని పులకరించిపోయి వుంటాం. ‘పల్నాటి యుద్ధం’, ‘పల్నాటి పౌరుషం’ సినిమాలు చూసి మన తెలుగువారికి ఇంత గొప్ప చరిత్ర వుందని హ్యాపీగా ఫీలై వుంటాం. తెలుగువారందరి మనసులలో ‘పల్నాడు’ అనే మాట వింటేనే పౌరుషంతో పిడికిళ్ళు బిగుసుకునే ఒక ఫీల్....! ఆ ఫీల్ ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది.. అంతటి పౌరుషం గడ్డ మీద పుట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి అరెస్టు అయిపోతామనే భయంతో పిల్లిలాగా గోడ దూకి హైదరాబాద్ పారిపోయారన్న విషయం తెలుసుకుని, వీళ్ళిద్దరి విషయంలో ‘పల్నాటి పౌరుషం’ అనే మాటని పక్కన పెట్టి... ‘పల్నాటి పిరికితనం’ అనే మాటని ఉపయోగించాలని అనిపించడం న్యాయమే. ఈ బ్రదర్స్ ఇద్దరూ పోలింగ్ సందర్భంగా ఎన్ని దారుణాలు చేయాలో అన్ని దారుణాలూ చేశారు. రౌడీ మూకల సహకారంతో రక్తాన్ని పారించారు. ఎదుటి వారి మీద దాడి చేయడం పౌరుషం అవదు.. పిరికితనం అవుతుంది. పోలింగ్ సందర్భంగా వీరిద్దరూ భారీ స్థాయిలో పిరికితనం ప్రదర్శించారు. వీరి నేరాలు, ఘోరాలు బయటపడి హౌస్ అరెస్ట్ అయ్యారు. చివరికి అరెస్టు అయి జైల్లో పడే అవకాశం వుందని తెలుసుకుని, ఇంటి వెనుక గోడదూకి హైదరాబాద్‌కి పారిపోయారు. వీళ్ళిద్దరూ పిరికివాళ్ళని తెలుస్తుందిగానీ, మరీ ఇంత పిరికివాళ్ళని ఎవరూ అనుకోలేదు. వీళ్ళిద్దరి ఇంటి పేరు ‘పిన్నెల్లి’ అని కాకుండా ‘పిల్లి’ అని మార్చుకోవడం మంచిది. ఇలాంటి పిరికి పిల్లులు పల్నాటి గడ్డ మీద భవిష్యత్తులో పుడతారని తెలిసుంటే బ్రహ్మనాయుడు, నాగమ్మ, బాలచంద్రుడు ఈ ప్రాంతం వదిలి పారిపోయి వుండేవారు.. వీళ్ళ నాయకుడు జగన్ ఓడిపోతానని భయపడిపోయి లండన్ పారిపోయారు. వీళ్ళిద్దరూ అరెస్టు అవుతామని భయపడి హైదరాబాద్ పారిపోయారు. వీళ్ళిద్దరూ తిరిగి పల్నాడులో అడుగు పెట్టకుండా వుంటే ఆ ప్రాంతానికి గౌరవం. ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ‘పల్నాటి పిల్లి’ అనే బిరుదును, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి ‘పల్నాటి పిల్ల పిల్లి’ అనే బిరుదులు ప్రదానం చేయడమైనది.
ఏపీలో ఎన్నికల సందర్భంగా చెలరేగిన హింస దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా పల్నాడులో  ఎన్నికల అనంతరం కూడా కొనసాగుతున్న హింసాకాండ దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. కేంద్ర ఎన్నికల సంఘం పల్నాడు హింసాకాండపై చాలా సీరియస్ అయ్యింది. ఏపీ సీఎస్, డీజీపీలను ఢిల్లీ పిలిపించుకుని మరీ వివరణ కోరింది. వారిచ్చిన నివేదిక ఆధారంగా పలువురు ఎస్పీలు, పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంది. పల్నాడు కలెక్టర్ పై కూడా బదిలీ వేటు వేసింది. అంతటితో ఆగకుండా  ఏపీలో అల్లర్లపై ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వం 13 మంది సభ్యులతో   స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (సిట్) ఏర్పాటు చేసింది.  నేరుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కొందరు పోలీసులు తమ పై అధికారుల సూచనలు, ఆదేశాలు కూడా ఖాతరు చేయకుండా అల్లర్లను ప్రేరేపించే విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిట్ నివేదిక పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.  అధికార పార్టీతో అంటకాగుతున్న కొందరు పోలీసులు వైసీపీ మూకలు చెలరేగిపోవడానికి పరోక్షంగా కారణమయ్యారన్న అనుమానాలూ ఉన్నాయి.  పోలింగ్ అనంతరం పల్నాడు జిల్లాలో జరిగిన హింస, ప్రతిపక్షాలపై దాడుల వెనుక  జగన్ అనుకూల పోలీసు అధికారుల పాత్ర ఉందన్న చర్చ పోలీసు అధికారుల్లోనే జోరుగా సాగుతోంది. ఆ అధికారులు ఎన్నికల విధుల్లో లేరనీ, కానీ తమ పలుకుబడిని ఉపయోగించి కింది స్థాయి పోలీసు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేలా చేశారని అంటున్నారు.     ఇక సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు రాష్ట్రానికి కొత్త డీజీపీగా వచ్చిన హరీష్ కుమార్ గుప్తా పూర్తి క్రియారహితంగా వ్యవహరించారనీ, ఆయన సీఎస్ ఆదేశాల మేరకే పని చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి తన వైసీపీ అనుకూల వైఖరితో ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూల వాతావరణం ఏర్పడేలా చేశారని తెలుగుదేశం కూటమి విమర్శలు గుప్పిస్తోంది. ఇక తాజాగా ఏర్పాటైన సిట్ నివేదిక ఆధారంగా సీఎస్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే.. సిట్ పై తెలుగుదేశం కూటమి సభ్యులు మాత్రం పెదవి విరుస్తున్నారు. 13 మంది సిట్ బృందంలో అత్యధికులు ఏసీబీ నుంచే ఉన్నారనీ ఇటీవలే ఎన్నికల విధుల నుంచి ఉద్వాసనకు గురైన మాజీ డీజీపీ రవీంద్రనాథ్ రెడ్డి ఏసీబీ చీఫ్ గా ఉన్నారని కూటమి నేతలు అంటున్నారు. ఎన్నికల విధుల్లో లేని నిజాయితీ పరులైన పలువురు   పోలీసు అధికారులు ఉండగా సిట్ లో ఏసీబీ అధికారులకే ప్రాథాన్యత ఇవ్వడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
The Telugu Film Directors Association is organizing Director's Day celebrations tomorrow at Hyderabad's LB Stadium. The association members extended an invitation to Chief Minister Revanth Reddy for this ceremony. Association President Veerashankar, Vice President Vashishta, and Directors Anil Ravipudi and Harish Shankar handed over the invitation to Chief Minister Revanth Reddy yesterday evening. The association members mentioned that the Chief Minister would attend the ceremony. TFDA President Veerashankar highlighted that Chief Minister Revanth Reddy has a strong vision for the development of the Telugu film industry and believes that the CM will make Tollywood the hub of world cinema. TFDA President Veera Shankar stated, "I, along with Harish Shankar, Anil Ravipudi, Vashishta, and others, met Chief Minister Revanth Reddy yesterday evening. I was delighted that the CM spoke with us about the film industry for about an hour when he was initially supposed to speak for just five minutes. The CM's vision for the development of the film industry was surprising." "Chief Minister Revanth Reddy said that Tollywood should become the world's cinema hub and that the government will provide support in that direction. We suggested that it would be beneficial to establish a world-class film institute in Hyderabad. We are organizing this event to commemorate Director's Day worldwide. The Chief Minister confirmed that he would definitely attend."
We usually see content-based movies in Malayalam cinema. We hardly get to see movies with unique concepts in Telugu cinema. However, the audience always encourages movies that are rich in content. Ajay Ghosh who is one of the busiest character artists is making his debut as a lead actor in a unique emotional and entertaining drama Music Shop Murthy. The film is written and directed by Siva Paladugu and produced by Harsha Garapati and Ranga Rao Garapati on Fly High Cinemas banner. The makers began a huge promotional campaign recently by unveiling the teaser which won accolades of all. Interim, they released an electrifying song called Angrezi Beat. This song composed and penned by Pavan is going to be the Party Anthem for its thumping beats, lively signing, and grand visuals. Ajay Ghosh appeared as a DJ who is seen enjoying his profession to the core. He is also seen shaking his leg to the tune. The actor underwent a stylish makeover for the role of a DJ. Pavan’s lyrics are catchy, whereas the Oscar-award-winning singer Rahul Sipligunj sang it energetically. The song has got an instant response. Chandini Chowdary plays a pivotal role, while Amani, Amit Sharma, Bhanu Chandar, and Dayanandh Reddy will be seen in significant roles. Sreenivas Bejugam cranks the camera for the movie which is getting ready for release in June.
Working in the film industry is not everyone’s cup of tea. Particularly, women don’t really show interest in venturing into the glamor industry. Getting opportunities, and surviving here is not an easy task. The success rate is very low which is the reason not many dare to produce movies. Interestingly, a Telugu girl is handling different crafts in her debut film. We are talking about Sumaya Reddy, who became a producer in her very first film called 'Dear Uma'. Besides making her debut as a heroine and investing in the project, Sumaya Reddy also provided the story for the movie, showing her multi-tasking capabilities at a very young age. Like a Lady Boss, she is taking care of all aspects of the movie ‘Dear Uma’. Dear Uma made under the banner of Suma Chitra Arts banner features Prithvi Amber playing the male lead. The film is directed by Sai Rajesh Mahadev. The already-released posters, teaser, and lyrical video song of Navvuthuntane gave the impression that Dear Uma is a feel-good entertainer with a beautiful love story. Sumaya Reddy celebrates her birthday today (May 18). Dear Uma team extended birthday wishes to the actress. The shooting of the film has already been completed. The post-production activities are underway. The release date of the movie will be announced soon.
సీరియల్ నటుడు చందు నిన్న హైదరాబాద్ లో ఆత్మ హత్య చేసుకొని చనిపోయాడు. త్రినయని సీరియల్  నటి పవిత్ర  మరణాన్ని తట్టుకోలేకే  ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో చందు భార్య చెప్పిన మాటలు అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి చందు భార్య పేరు శిల్ప. 2015 లో వారివురికి వివాహం జరిగింది. స్కూల్ డేస్ నుంచే వాళ్ళ మధ్య ప్రేమ మొదలయ్యింది. తొలుత చందునే శిల్ప ని ప్రేమించమని వెంటపడ్డాడు. ఆ తర్వాత శిల్ప కూడా చందు ప్రేమకి ఓకే చెప్పింది. అలా 12  సంవత్సరాలు ప్రేమించుకొని  పెద్దలని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరకీ ఒక బాబు పాప కూడా ఉన్నారు. కొన్నాళ్ల వరకు చక్కగానే సాగిన వాళ్ల కాపురంలో చనిపోయిన  పవిత్ర రాకతో కలతలు మొదలయ్యాయి. ఫలితంగా  నాలుగు సంవత్సరాల నుంచి  దూరంగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య మాటలు కూడ లేవు. కేవలం పిల్లలతోనే కాంటాక్ట్ లో ఉండే వాడు. కానీ ఏ రోజుకైనా మారి తన దగ్గరకి వస్తాడు అని శిల్ప  అనుకుంది. చనిపోయే ముందు కూడా చందు కి  ఫోన్ చేసి మాట్లాడింది. ఇంటికి రమ్మని బతిమాలింది కూడా. ఇప్పుడు శిల్ప చెప్పిన ఈ మాటలన్నీ హాట్ టాపిక్ గా నిలిచాయి కార్తీక దీపం, రాధమ్మ పెళ్లి, త్రినయని లాంటి సీరియల్స్ చందుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. తాజాగా ప్రముఖ సినీ, టీవీ  నటి కరాటే కళ్యాణి తనకి  చందు కి మధ్య జరిగిన వాట్స్ అప్ చాట్ ని బయటపెట్టింది.నాకు ఇంక ఈ జన్మ చాలు. నేను చనిపోవడమే కరెక్ట్ అనే  చందు మెసేజ్ ఉంది   
తెలుగుతోపాటు పలు సౌతిండియన్‌ భాషల్లో సినిమాలతో, సీరియల్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న రాధిక కాలికి గాయం కావడంతో ప్రస్తుతం ఇంటి దగ్గరే ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది. తమిళ్‌లో సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో కూడా నటించారు రాధిక. అంతేకాదు, రాడాన్‌ పేరుతో ఓ సంస్థ స్థాపించి దాని ద్వారా ఎన్నో సీరియల్స్‌ నిర్మించారు. సినిమాల కంటే సీరియల్స్‌ ద్వారానే తమిళ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది రాధిక. ఇటీవల ఈమెను పరామర్శించేందుకు ప్రముఖ తమిళ నటుడు శివకుమార్‌ ఆమె నివాసానికి వెళ్లారు. తమిళ్‌ హీరోలు సూర్య, కార్తీ ఇద్దరూ శివకుమార్‌ తనయులేనన్న విషయం తెలిసిందే.  శివకుమార్‌ను అన్నయ్యగా భావించే రాధిక.. ఆయన తన ఇంటికి రావడంతో ఎంతో ఎమోషనల్‌ అయ్యారు. రాధిక తండ్రి ఎం.ఆర్‌.రాధ కూడా ప్రముఖ నటుడేనన్న విషయం తెలిసిందే. శివకుమార్‌కి సమకాలీనుడైన ఎం.ఆర్‌.రాధ కుమార్తె రాధిక అంటే శివకుమార్‌కి కూడా ఎంతో అభిమానం. ఈ ఇద్దరూ కలిసి ఎన్నో సీరియల్స్‌లో నటించారు. ఎక్కువగా అన్నాచెల్లెళ్ళ క్యారెక్టర్స్‌లోనే కలిసి నటించారు. దీంతో తనను కలిసేందుకు శివకుమార్‌ రావడంతో తన అన్న ఇంటికి వచ్చాడంటూ ట్వీట్‌ చేశారు రాధిక. ఆయన ఉన్న కాసేపు పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఫోటో ఆల్బమ్స్‌ చూస్తూ గడిపారు. దీనికి సంబంధించి రాధిక వేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.  
ఈషా రెబ్బా.. అచ్చ తెలుగు నటి .. అందానికి అందం, అంతే అందమైన నటనతో ప్రేక్షక హృదయాల్లో చాలా బలంగానే నాటుకుపోయింది. 2012 నుంచి సినిమాలు చేసుకుంటు వస్తుంది. సుమారు పద్దెనిమిది సినిమాల దాకా తన ఖాతాలో ఉన్నాయి.  ఈమె తాజాగా ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబో లో 2018 లో అరవింద సమేత వచ్చింది. ఎన్టీఆర్ నట విశ్వరూపానికి త్రివిక్రమ్ మ్యాజిక్ తోడవ్వడంతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో ఈషా నటించింది. హీరోయిన్ గా చేసిన పూజాహెగ్డే  చెల్లెలు సునంద క్యారక్టర్ ని పోషించింది. అంతగా ప్రాధాన్యత లేని ఆ క్యారక్టర్ లో తన వరకు బాగానే చేసింది. ఇప్పుడు ఆ విషయం మీదే ఒక ఇంటర్వ్యూ లో  మాట్లాడింది. అరవింద సమేత  లో యాక్ట్‌ చేసేందుకు తొలుత  ఆసక్తి చూపలేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఓకే చెప్పాను. నాది  ప్రధాన పాత్రే  అని దర్శక నిర్మాతలు చెప్పారు. పైగా సినిమాలో సెకండ్ లీడ్ క్యారక్టర్ అని చెప్పారు.ఈ విషయాన్ని  రిలీజ్ కి ముందు అనౌన్స్ కూడా చేస్తామన్నారు.ఆ విధంగా జరిగి ఉంటే నా కెరీర్ కి అరవింద హెల్ప్ అయ్యి ఉండేది. పైగా నాతో తెరకెక్కించిన కొన్ని సీన్స్ కూడా కట్ చేసారు. ఎన్టీఆర్ కి నాకు ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. అది కూడా జరగలేదని చెప్పింది.అయితే వీటన్నింటికి  కారణమేంటో తనకు తెలియదని, ఈ రోజుకి  బాధ పడుతున్నాను. అయితే ఎన్టీఆర్‌తో  త్రివిక్రమ్‌ లతో  పని చేయడం మాత్రం ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది   ఇక ఈషా రెబ్బా తన పన్నెండేళ్ల కెరీర్ లో చేసిన మొట్టమొదటి పెద్ద సినిమా అరవింద సమేత నే. మూవీ కోసం  బైక్‌ రైడింగ్‌ కూడా నేర్చుకుంది. మూవీ  చూస్తున్నంత సేపు కూడా పూజా చెల్లెలుగా ఈషా చెయ్యడం ఏంటని అనిపిస్తుంది.ఎందుకంటే హీరోయిన్ గా అప్పుడప్పుడే సినిమాలు చేసుకుంటు వెళ్తుంది. ఏది ఏమైనా ఒప్పుకొని  చేసింది తనే.గత సంవత్సరం మామ మచ్చింద్ర తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరికొన్ని అప్ కమింగ్ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. వెబ్ సిరీస్ లోను తన సత్తా చాటుతు ముందుకు దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్ లో ఉంది  
నిన్నగాక మొన్న బుల్లితెర నటి పవిత్ర జయరామ్ రోడ్ ఆక్సిడెంట్ లో మరణించిన విషయం తెలిసిందే. పవిత్ర చనిపోయిన ఐదు రోజులకే తన ప్రియుడు, సీరియల్ నటుడు చంద్రకాంత్ అల్కాపూర్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.  పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చంద్రకాంత్ కి  భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆరేళ్లుగా త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్‌తో సహజీవనం చేస్తున్నాడు . ఆదివారం  తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో  పవిత్ర జయరామ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన కారులో చంద్రకాంత్  కూడా ఉన్నాడు. ఐతే అతను గాయాలతో బయటపడ్డాడు. కానీ పవిత్ర తన కళ్ల ముందే ప్రాణాలు వదలటాన్ని జీర్ణించుకోలేక మనోవేదనకు గురయ్యాడు. అప్పటినుంచి డిప్రెషన్ లోకి వెళ్లిన చంద్రకాంత్ ఆమె ఎడబాటును తట్టుకోలేకపోయాడు. రెండు రోజుల కిందట పవిత్ర పుట్టినరోజు కావడంతో చంద్రకాంత్ డిప్రెషన్‌ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ ఆమె జ్ఞాపకాలను ఇన్ స్టాలో పోస్ట్ చేసి బాధపడుతూనే ఉన్నాడు చంద్రకాంత్. ఇక ఈరోజు కూడా.. "గుడ్ మార్నింగ్ నాన్న.. ఇట్స్ టైమ్ ఫర్ జిమ్.. మన జిమ్ కోచ్ ఇప్పుడే కాల్ చేశాడు.. లవ్ యూ పాపా.." అంటూ చందు వరుస పోస్టులు పెడుతూ వస్తున్నాడు.  పవిత్ర చనిపోలేదని.. తమ మధ్యే ఉందని ఎమోషనల్ అయ్యాడు ఒక ఇంటర్వ్యూలో . ఐదారేళ్లుగా పవిత్ర, చంద్రకాంత్ కలిసే ఉంటున్నారు. అయితే.. తమ మధ్య ఉన్న ఈ బంధాన్ని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేద్దామని ప్లాన్ చేసుకున్నామని.. ఐతే ఇంతలోనే ఇలా జరిగిందంటూ చంద్రకాంత్ భావోద్వేగానికి లోనయ్యాడు. 
  విజయ్ దేవరకొండ కి హిట్ లు ఎంత ఫాస్ట్ గా వచ్చాయో..ప్లాప్ లు కూడా అంతే ఫాస్ట్ గా వచ్చాయి. 2018 లో వచ్చిన గీత గోవిందం, టాక్సీ వాలా  తర్వాత నో హిట్స్. అంటే విజయ్ హిట్ కొట్టి సిక్స్ ఇయర్స్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా డిజప్పాయింట్  గా ఉన్నారు. ఎందుకు మా విజయ్ కి హిట్ రావడం లేదని మదన పడుతున్నారు. కొంత మంది అయితే నువ్వు పలానా  సినిమా చెయ్యి అని సలహాలు కూడా ఇస్తున్నారు. వాళ్ళ సలహాలకి తగ్గట్టే ఫుల్ మాస్ సబ్జట్స్ తో కూడిన  రెండు భారీ ప్రాజెక్ట్ లు అనౌన్స్ చేసాడు.వాటిల్లోని  ఒక మూవీ  హీరోయిన్ విషయం టూ డే టాక్ అఫ్ ది డే గా నిలిచింది రాహుల్ సంక్రుత్యన్, రవి కిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ సినిమాలు చేయబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన రెండు సినిమాల పోస్టర్స్ అయితే ఒక దానిని మించి ఒకటి ఉన్నాయి. దీంతో  ఎప్పుడెప్పుడు ఆ సినిమాలు కంప్లీట్ అవుతాయా అని  ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.ఇక  రవి కిరణ్ మూవీ పక్కా రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుంది. హీరోయిన్ కి ఎంతో ప్రాధాన్యత ఉండబోతుంది. సమంత, సాయి పల్లవి ల పేర్లు వినిపిస్తున్నాయి. దిల్ రాజు సమంత కి మాట ఇచ్చాడని ఖుషి కాంబో మళ్ళీ రిపీట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. పైగా సమంత కి రూరల్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిన రంగ స్థలంలో నటించిన అనుభవం కూడా  ఉదని అంటున్నారు. ఇక కొంత మంది అయితే సాయి పల్లవి అయితే బాగుంటుందని పైగా విజయ్, సాయి పల్లవి ఫస్ట్ కాంబో ఆడియెన్స్ కి ఫ్రెష్ నెస్ ని తెస్తుందని అంటున్నారు.  పైగా సాయిపల్లవి చేస్తున్న తండేల్ ,గతంలో చేసిన విరాట పర్వం  ఆ కోవలోకే వస్తాయని  అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు విజయ్ కి జోడి కడతారో చూడాలి.  మూవీ అయితే  తర్వలోనే షూటింగ్ కి వెళ్లనుంది.  విజయ్ కెరీర్లోనే అత్యంత భారీ  బడ్జట్ తో దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ ఇద్దరి కాంబోలో మొన్న ఏప్రిల్ లో వచ్చిన ఫ్యామిలీ స్టార్ పరాజయం పాలయ్యింది    
సీరియల్ నటుడు చందు నిన్న హైదరాబాద్ లోని త్రినయని నటి పవిత్ర ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.పవిత్ర చందు గత కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు. ఇక  పవిత్ర కొన్ని రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ లో చనిపోయింది. ఆమె మరణాన్ని తట్టుకోలేకే  చందు  ఆత్మహత్య చేసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో  తాజాగా ప్రముఖ నటి కరాటే కళ్యాణి చందు  వాట్స్ అప్ చాట్ ని బయటపెట్టింది రాత్రి పదకొండు గంటలకి చందు నుంచి కరాటే కల్యాణికి మెసేజ్ వచ్చింది.  నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడే ఉంటే పిచ్చొడ్ని అయిపోతాను.  ముందుకు అలవాటు పడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతాను. ఇంక  చాలు ఈ జన్మ.నా ఆత్మహత్య విషయం  ఎవరకి చెప్పకండి అని మెసేజ్ చేసాడు. కరాటే కళ్యాణి చందుకి దైర్యం చెప్పడానికి చాలా ట్రై చేసింది. మేమంతా నీకు ఉన్నాం. ఎలాంటి తొందర పాటు  నిర్ణయాలు తీసుకోవద్దు. ఆత్మహత్య చేసుకోవడం పాపం. యాదవ్ అంటేనే దైర్యం.. పవిత్ర పిల్లలు కూడా నీతో ఉన్నారుగా అని చెప్పింది. వాయిస్ కాల్ లో కూడా ఇద్దరు మాట్లాడారు చందు, కరాటే కళ్యాణి లు కలిసి కొన్ని సీరియల్స్ లో నటించారు. ఇద్దరి మధ్య అక్కా తమ్ముడి అనుఅంధం ఉంది.  చందు కి ఒక భార్య,  చిన్న వయసు కలిగిన  కూతురు,కొడుకు ఉన్నారు.     
NEELAM Productions is excited to unveil a pioneering cinematic collaboration between Papua New Guinea and India, aimed at showcasing the rich cultural heritage and exquisite landscapes of Papua New Guinea to a global audience. This film marks the first major co-production project between the two nations. NEELAM Productions along with SILICON MEDIA Co-Producing the film with NAFA productions in Papua New Guinea. The film will be directed by the acclaimed Indian Director Dr. Bijukumar Damodaran, a three-time recipient of India's National Film Award whose works have been celebrated at numerous international film festivals. Cathy Angeline Mereun Sike, Pa Ranjith and Prakash will be the producers of the film with the execution managed by Parul Agrawal and Adhya Prasad. The cast of the film includes celebrated Hindi/Bengali actress Ritabari Chakraborty and renowned South Indian actor Prakash Bare, alongside prominent talents from Papua New Guinea. The score will be composed by three-time Grammy Award winner Ricky Kej, further elevating the film's appeal. The project was officially announced by the Honorable Shri. Inbasekar Sundaramurti, High Commissioner to Papua New Guinea and Solomon Islands. Principal photography of the film is scheduled to commence in mid-July 2024 in Papua New Guinea.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పొగిడి చెడినవాడు లేడు. సమయోచితంగా పొగడలేని వారు అన్ని చోట్లా చెడిపోతారు. జీవితంలో కొందరికి జ్ఞానం ఒక దశలో వస్తుంది. అంతకు క్రితం నష్టమైపోయిన కాలాన్ని కూడదీసుకోవడానికి అన్నట్లుగా జ్ఞానోదయమైన మరుక్షణం నుండి అవతలివారిని అమితంగా, భరించలేనంతగా పొగడడం నేర్చుకుంటారు. ఇలాంటి వ్యక్తి తాను పొగిడేవాణ్ణి ఆకాశానికి ఎత్తేస్తాడు. 'ది స్కై ఈజ్ ది లిమిట్” అని రుజువు చేస్తాడు. అవతలి వ్యక్తి అలిసిపోయేంత వరకూ, లేక తాను అలిసేంత వరకూ పొగుడుతాడు.  ఒక్కొక్కసారి అక్కడ పొగడడానికి తగినంత విషయం లేనప్పుడు అతడి ఇంట్లో తనకు ఆతిథ్యమిచ్చిన ఆయన సతీమణి అమృతహస్తాన్ని, ఆవిడ వండి వడ్డించిన పదార్థాలు ఎంత రుచికరంగా వుంటాయో ఇలాంటి విషయాలను ఇరికించి మరీ చెప్తాడు. ఇలాంటి సబ్జక్టును గురించి ఎంతైనా చెప్పే వీలుంది. ఆ వంకాయ కూర, ఆ పాయసం, వారింటి నెయ్యి ఘుమఘుమలు, ఇట్లా చెప్పుకుపోతూ వుంటే దీనికి అంతుందా అనిపిస్తుంది. అక్కడ సన్మానంలో సన్మానితుడూ, ఉపన్యాసకుడూ అలసి పోయేలోగా శ్రోతలమైన మనం అలసిపోవడం ఖాయం. ఇలా ప్రసంగించేవాడికి సన్మానితుడు అసలెవరో తెలీని సందర్భాలు కూడా ఎదురావుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఈ ప్రాసంగికుడు ఏ మాత్రం జంకడు. ఎవర్ని సన్మానిస్తున్నారో వారిని గురించి చీటిమీద మూడు ముక్కలు వ్రాసి ఇలా ఇవ్వండి. మూడునిమిషాల్లో ప్రసంగ పాఠంతో రెడీ అయిపోతాను. మీరు వేదికమీద ఆహ్వానితులు నలుగురికీ పూలమాలలు వేసేలోగా నా చెవిలో నాలుగుముక్కలు ఊదితే దంచి పారేస్తాను. ఎవరిని గురించి చెప్పే వాక్యాలైనా నాకు కంఠస్థమే, తడుము కోవలసిన అవసరముండదు. రాజకీయ, పారిశ్రామిక, విద్యావేత్తలెవరైనా సరే, కళాకారులు, సినిమా స్టారులైనా సరే. ఎవరికి తగిన సన్మాన వాక్యాలు వారికి వప్పజెప్పడానికి ఎప్పటికప్పుడు సిద్ధంగానే వుంటాను. గుటికెడు కాఫీ సేవించి గొంతు సవరించానంటే ఇక ఆ తర్వాత ఉపన్యాసం అనర్గళంగా సాగిపోతుంది" అని హామీ ఇస్తాడు. అన్ని రంగాల్లోనూ స్పెషలైజేషన్ చోటు చేసుకున్న నేటి కాలంలో పొగిడే కళలో కొందర్ని తర్ఫీదు చేసి, వారికి లైసెన్స్ మంజూరు చేయడంలో తప్పేమీ కనిపించదు అనిపిస్తుంది. ఈ లలితకళను శాస్త్రీయంగా ఎక్కడా అభ్యసించకపోయినా, అనేక సంవత్సరాల అలవాటు కొద్దీ దీనిని క్షుణ్ణంగా నేర్చినవారు మన రాష్ట్రంలో ఎందరో వున్నారు. ఇలాంటివి నేర్పటానికి  నెలకొల్పే సంస్థల్లో ప్రస్తుతానికి వీరిని అధ్యాపకులు గానూ, శిక్షకులుగానూ నియమించవచ్చు. ఒక బాచ్ విద్యార్థులు శిక్షణ పొందితే ఇక ఆ తర్వాత కావలసినంత మంది అధ్యాపకులు. సమోవా అనే చిన్న రాజ్యానికి ఒక రాజుండేవాడు. అతడి రాజ్యంలో డాక్టర్ విన్సెంట్ హైనర్ అనే పెద్దమనిషి కొన్నాళ్ళుండి కొంత ప్రజాసేవ చేశాడు. డాక్టరు మహాశయుడు ఆ రాజ్యాన్ని వదలి వెళ్ళే తరుణంలో ఆ రాజుగారు ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేశాడు. ఆ సందర్భంగా రాజు డాక్టర్ను గురించి నాలుగు వాక్యాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కాని రాజు కుర్చీలో కదలకుండా కూచున్నాడు. రాజు లేచి నుంచోని ప్రసంగించకుండా అలానే కూచోనుండటం డాక్టర్ హైనర్కు ఆశ్చర్యం కలిగించింది. ఈలోగా పొగడ్తనే వృత్తిగా చేసుకున్న ఒక వక్త వచ్చి రాజు తరపున డాక్టర్ హైనర్ గురించి బ్రహ్మాండమైన వాక్యాలతో దంచి పారేశాడు. సుదీర్ఘమైన ఆ ప్రశంసా వాక్యాల తర్వాత హైనర్ కొంత కింధా మీదై. ఉచిత రీతిని సమాధానం చెప్పడానికి లేచి నుంచోబోయాడు. రాజుగారు హైనర్ను వారిస్తూ కూచోమంటూ సౌంజ్ఞ చేశాడు. "మీ తరపున ప్రసంగించటానికి కూడా ఒక వక్తను నియమించాను. ఇక్కడ మా రాజ్యంలో ఇలాంటి ప్రసంగాలు ఆ వృత్తి స్వీకరించిన వారే చేస్తారు. ఔత్సాహికుల్ని ప్రోత్సహించడం మా పద్ధతి కాదు" అని వివరించాడు. ఇది పొగడటానికి కూడా ఎంత ప్రతిభ ఉండాలో తెలియజేస్తుంది. వాక్చాతుర్యం మనిషికి ఎంత ముఖ్యమో స్పష్టపరుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.
ఎవరైనా తమ వ్యక్తిగత ఎదుగుదలపై దృష్టి పెట్టాలి అనుకున్నప్పుడు మనల్ని మనం కొంత మెరుగుపరచుకోవాల్సి వుంటుంది. ఒక పద్ధతిలో ప్రయత్నిస్తే అది అసాధ్యమేమీ కాదు. ‘కష్టపడటం’ ఒక్కటే కాదు.. ఒక క్రమపద్ధతిలో ప్రయత్నించడం అవసరం. అందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల్లో మొట్టమొదటి సూచన... సమాచార సేకరణ. కేవలం చదువుకునే విద్యార్థులు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికే ‘సమాచారాన్నిసేకరించే’ అవసరం వుంటుంది అనుకోవటం పొరపాటు అంటున్నారు నిపుణులు. పత్రికలు, ఇంటర్నెట్ వంటివి ‘విశ్వవ్యాప్త సమాచారాన్ని’ మన ముందు వుంచుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని తెలుసుకుంటూ అప్‌డేట్‌గా వుంటటం మనల్ని, మన వ్యక్తిత్వాన్ని, మన అవకాశాలని మెరుగుపరిచే మొట్టమొదటి అంశం అట. ‘అసాధ్యాలు’ అంటూ ప్రపంచం ముద్రవేసి వదిలేసిన వాటిని కూడా ఛాలెంజ్ చేసి సాధించినవారి కోసం వింటూంటాం. ఏంటి వాళ్ళ ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళ ధైర్యమల్లా వారి బలాలని వారు  కరక్టుగా అంచనా వేయటమే. ఎప్పుడూ మన బలాలు, బలహీనతల గురించి సరైన అవగాహన కలిగి వుండాలన్నది నిపుణులు చేస్తున్న రెండో సూచన. ఓ పేపర్ పైన మన బలం, సామర్థ్యం వంటి వాటిని రాసిపెట్టుకోవాలి. అలాగే మన బలహీనతలు, భయాలు వంటి వాటిని ఇంకో కాగితం మీద రాసి పెట్టుకోవాలి. దగ్గరి వ్యక్తులకి ఈ రెండు కాగితాలనీ చూపించి వారి సూచనలు అడగండి. అప్పుడు బలాలు, బలహీనలతని సమీక్షించుకుని... ఏం చేయొచ్చో.. ఏం చేయగలమో నిర్ణయించుకోవడం సులువవుతుంది. మనల్ని మనం మెరుగుపరచుకోవటానికి పెద్ద అడ్డంకి మన ‘భయాలు’. కొత్త వ్యక్తులతో మాట్లాడటమన్నా, నలుగురిలో తిరగడమన్నా, కొత్తపని మొదలుపెట్టడమన్నా భయపడేవాళ్ళు వుంటారు. ఆ భయాలని వదిలించుకోవటం ఏమాత్రం ఇష్టంలేదన్నట్టు పట్టుకుంటారు. అయితే మనల్ని మనం గెలవలేనప్పుడు ప్రపంచాన్ని ఏం గెలవగలం చెప్పండి? అందుకే ముందు మీలోని ఒక భయాన్ని గుర్తించి దాన్ని ఎదుర్కోవటం మొదలుపెట్టండి. నలుగురిలో తిరగటం భయమనుకోండి.. కష్టంగా అనిపించినా నలుగురిలో కలవటం మొదలుపెట్టాలి. కొన్ని రోజులపాటు ఇబ్బంది అనిపిస్తుంది. పారిపోవాలనిపిస్తుంది. అయినా వెనక్కి తగ్గక ప్రయత్నిస్తే ఒకరోజున అది అలవాటుగా మారిపోతుంది. ఒక భయాన్ని దాటగలిగినా చాలు- ఆ అనుభం, దాని నుంచి లభించిన ఆత్మవిశ్వాసం మిగిలిన భయాలని సులువుగా దాటేలా చేస్తాయి. మన మాటలు సూటిగా, స్పష్టంగా వుండాలి. అవి సూటిగా, స్పష్టంగా వుండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా వుండాలి. మన ఆలోచనలు గజిబిజిగా వున్నప్పుడు సూటిగా మాట్లాడలేం. సూటిగా మాట్లాడని వ్యక్తుల మాటలకు సమాజంలో గౌరవం వుండదు. అందుకే మన పరిసరాలని శుభ్రం చేసుకున్నట్టు మన ఆలోచనలనీ క్లియర్‌గా పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. అలాగే మన పనితీరు కూడా గజిబిజిగా కాకుండా ఒక పద్ధతిగా వుండాలి. అది మనల్ని రిలాక్స్‌గా వుంచుతుంది. అలాగే చూసేవారికీ మనపట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. నమ్మకం కుదురుతుంది. ఒత్తిడిని దూరంగా ఉంచగలిగితే చాలు... మన సామర్థ్యం రెండురెట్లు పెరుగుతుందట. అలా ఒత్తిడికి దూరంగా వుండాలంటే పనితీరు, సమయపాలన, పని విభజన వంటి వాటి పట్ల దృష్టి పెట్టాలి. అప్పుడు మన సామర్థ్యాన్ని వందశాతం వినియోగించుకోగలుగుతాం. అలాగే ఏ సమయంలోనైనా ఆత్మవిశ్వాసంతో, చెరగని చిరునవ్వుతో కనిపించే వ్యక్తులని ఇష్టపడని వారుండరు. చుట్టూ మనల్ని ఇష్టపడేవారి సంఖ్య పెరిగినకొద్దీ మన జీవితం ఆనందంగా మారిపోతుంది. కాబట్టి మనల్ని మనం ‘సరికొత్తగా’ ఆవిష్కరించుకోవడం అసాధ్యమేమీ కాదు. దీనికోసం నిపుణులు చేసిన సూచనలని తెలుసుకున్నారుగా.. ఇక ప్రయత్నించడమే మిగిలి వుంది. .....రమ  
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఎండుద్రాక్ష సాధారణంగా పాయసం, స్వీట్ల తయారీలో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల వంటకాలలోనూ, స్పైసీ స్నాక్స్ లో కూడా వీటిని జత చేస్తుంటారు. అయితే ఎండుద్రాక్షను నానబెట్టి తినమని అమ్మమ్మల మొదలు అమ్మలు కూడా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా మహిళలు ఎండుద్రాక్ష నానబెట్టుకుని తినడం వల్ల చాలా ఆరోగ్యమని అంటారు.  ఎండుద్రాక్షను నానబెట్టి ప్రతిరోజూ తింటే  కలిగే అద్భుత ఫలితాలు ఇవే.. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.. రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం   గుండెకు చాలా మంచిది.  నానబెట్టన ఎండు ద్రాక్ష  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి  మంచి కొలెస్ట్రాల్ ను  ప్రోత్సహిస్తుంది . ఇది  ధమనులలో ఏర్పడే  ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి ఇది స్ట్రోక్,  గుండె జబ్బుల నుండి  రక్షించడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.. యాంటీ ఆక్సిడెంట్లు  శరీరంలో ఫ్రీ రాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తాయి. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని నీటిలో నానబెట్టి తినడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు త్వరగా విడుదలవుతాయి. యాంటీ-ఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుండి  రక్షించడంలో సహాయపడతాయి. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.. ఎండు ద్రాక్ష  బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఎండుద్రాక్ష తినడం వల్ల  చాలా శక్తి లభిస్తుంది, దీని వల్ల  పదే పదే ఆకలి అనిపించదు.   ఆహారం ఎక్కువగా తినాలనే  కోరికలు కూడా తగ్గుతాయి. ఆహారం నియంత్రణ కారణంగా  బరువు పెరిగే అవకాశాలు తగ్గుతాయి.  తద్వారా  బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. రక్తపోటును నిర్వహిస్తుంది.. ఎండుద్రాక్షలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది రక్త నాళాలు గట్టిపడకుండా నిరోధిస్తుంది. దీని కారణంగా రక్తపోటు ఎక్కువగా ఉండదు. ఒకవేళ రక్తపోటు ఎక్కవగా ఉంటే దాని ప్రభావం తగ్గిస్తుంది.  అంతేకాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది, ఇది అధిక రక్తపోటును కూడా నివారిస్తుంది. కాబట్టి రాత్రంతా నీటిలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  రక్తపోటు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియకు ప్రయోజనకరం.. ఆహారం జీర్ణం కావడానికి,  మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి ఫైబర్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం వల్ల  పేగు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది ప్రేగులలో ఆహారాన్ని తరలించడంలో సహాయపడుతుంది, ఇది ఉబ్బరం,  మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాలేయానికి మంచిది.. బయోఫ్లావనాయిడ్స్ ఎండుద్రాక్షలో ఉంటాయి. ఇవి  రక్తం,  కాలేయాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి . యాంటీ-ఆక్సిడెంట్లు  కూడా ఎండుద్రాక్షలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కాలేయానికి మేలు చేస్తాయి. శరీరం నుండి విషాన్ని తొలగించడానికి ఆరోగ్యకరమైన కాలేయాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల ప్రతిరోజూ రాత్రిపూట ఎండుద్రాక్షలను నీటిలో నానబెట్టి తినడం  కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది.                                                     *నిశ్శబ్ద.
ఐస్ యాపిల్  అని ఇంగ్లీషులో అంటుంటారు.  వీటిని తెలుగు రాష్ట్రాలలో తాటిముంజలు అంటారు.  లేతగా ఉన్న తాటి ముంజలు తియ్యగా, మృదువుగా, లోపల కాసిన్ని తియ్యని నీళ్లలో తినడానికి ఎంతో బాగుంటాయి. వేసవి కాలంలో మాత్రమే అందుబాటులోకి రావడంతో అందరికీ వీటికి డిమాండ్ కూడా ఎక్కువే.. తాటిముంజలను ఈ వేసవి కాలంలో తప్పకుండా ఎందుకు తినాలో చెప్పే కారణాలు బోలెడు ఉన్నాయి. ఈ కారణాలు తెలిస్తే అస్సలు వదలకుండా తాటిముంజలను ఈ సీజన్ లో రుచి చూస్తారు. తాటిముంజలు తింటే శరీరానికి కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. హైడ్రేట్.. మండిపోతున్న ఎండల కారణంగా వేడి కూడా అధికంగా ఉంటుంది.  ఈ వేడి శరీరం మీద ప్రభావం చూపిస్తుంది.  దీని కారణంగా  శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీన్నే శరీరం డీహైడ్రేట్ అవ్వడం అంటారు. తాటిముంజలు  తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ నుండి బయటపడవచ్చు. తాటిముంజలు తింటే శరీరం కోల్పోయిన తేమ శాతం తిరిగి భర్తీ అవుతుంది. ఉదర సమస్యలు.. ఈ మండే వేసవి కాలంలో చాలామంది ఉదర సంబంధ సమస్యలు ఎదుర్కుంటారు. చాలామందికి కడుపులో వేడి పుట్టి అది కడుపు నొప్పి, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలకు దారితీస్తుంది.   అయితే తాటిముంజలు తింటే పొట్టకు చల్లదనాన్ని అందిస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల  జీర్ణవ్యవస్థ బలపడుతుంది.  మలబద్ధకం, అజీర్ణం,  గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.   రోగనిరోధక శక్తి.. చాలామందిలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే వ్యాధులు, జబ్బులు తొందరగా వస్తాయి. అంతేకాదు ఇలా వచ్చిన జబ్బులు అంత తొందరగా తగ్గవు కూడా. కానీ తాటి ముంజలు తింటే  రోగనిరోధక శక్తి  బలపడుతుంది. తాటిముంజలలో ఉండే  విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. జీవక్రియను..   జీవక్రియ బలహీనంగా ఉంటే ఆహారం సరిగా జీర్ణం కాక శరీరంలో కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని కారణంగా  బరువు పెరుగుతారు.   ఊబకాయం బాధితులుగా మారతారు. అయితే ఫైబర్ అధికంగా ఉండే తాటిముంజలను  తీసుకోవడం వల్ల జీవక్రియ వేగంగా పెరుగుతుంది.  ఇవి ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ను ఇస్తాయి. తద్వారా అధికంగా తినకుండా కూడా నివారిస్తుంది. డయాబెటిస్‌.. తాటిముంజలు  మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తుంది. ఇందులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్  ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను  నియంత్రిస్తుంది.                                                                   *రూపశ్రీ.  
ఉల్లిపాయ బోలెడు వంటకాల్లో కనిపించే ఒక ముఖ్యమైన పదార్ధం. ఉల్లిపాయ పసుపు, తెలుపు, ఎరుపు వంటి రంగులలో లభిస్తుంది. ఉల్లిపాయ రుచి మాత్రమే కాకుండా, ఇందులో ఉన్న పోషకాల కంటెంట్ కారణంగా ఆహారంలో ప్రముఖంగా నిలిచింది. పచ్చి ఉల్లిపాయను తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అలవాటు లేనివారు కూడా తినడం మొదలు పెడతారు. పచ్చి ఉల్లిపాయను తినడం వల్ల కలిగే 10 ప్రయోజనాలు.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు విటమిన్ సి కి అద్భుతమైన మూలం, ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. విటమిన్ సి బాక్టీరియా, వైరస్‌ల నుండి శరీరాన్ని రక్షించే తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించడంలో పచ్చి ఉల్లిపాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలలో క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది హృదయనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పచ్చి ఉల్లిపాయల తీసుకోవడం వల్ల  రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, అధిక రక్తపోటును తగ్గించడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించడంలో కూడా సహాయపడుతుంది. జీర్ణక్రియలో సహాయపడుతుంది.. పచ్చి ఉల్లిపాయలలో డైటరీ ఫైబర్ ఉంటుంది, ఇది సరైన జీర్ణక్రియకు మరియు శరీరం నుండి వ్యర్థాలను తొలగించడానికి అవసరమైనది. ఫైబర్ పోషకాల శోషణను పెంచుతుంది. మలబద్ధకం, ప్రకోప ప్రేగు సిండ్రోమ్, హేమోరాయిడ్స్ వంటి వ్యాధులను నివారిస్తుంది. వాపును తగ్గిస్తుంది.. క్వెర్సెటిన్ అధికంగా ఉండే పచ్చి ఉల్లిపాయల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇవి శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి పరిస్థితులను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఉల్లిపాయలు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో దోహదపడే సల్ఫర్-రిచ్ కాంపౌండ్స్ యొక్క బాగా కలిగి ఉంటాయి. ఈ సమ్మేళనాలు కాల్షియం శోషణను ప్రోత్సహించడంలో, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి. మెదడు పనితీరును పెంచుతుంది.. పచ్చి ఉల్లిపాయలు సల్ఫర్ సమ్మేళనాలను కలిగి ఉంటాయి, ఇవి మెదడులో న్యూరోట్రాన్స్మిటర్ల ఉత్పత్తిని పెంచుతాయి, ఇది మెరుగైన జ్ఞాపకశక్తి, శ్రద్ధ, ఏకాగ్రత స్థాయిలకు దారితీస్తుంది.  క్యాన్సర్ నివారిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలో సల్ఫర్ అధికంగా ఉండే సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను నివారించడంలో సహాయపడతాయి. క్వెర్సెటిన్, ఫ్లేవనాయిడ్స్ మరియు అల్లిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకునే యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.. పచ్చి ఉల్లిపాయలు అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి కలిగి ఉంటాయి, ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదం చేస్తాయి. పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల ముడతలు, వయస్సు మచ్చలు, పిగ్మెంటేషన్ స్థాయిలు తగ్గుతాయి.  ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి ఇది దోహదపడుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.. పచ్చి ఉల్లిపాయల్లో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కీలకమైన క్రోమియం అనే ఖనిజం ఉంటుంది. క్రోమియం ఇన్సులిన్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి దారితీస్తుంది, తద్వారా మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది పచ్చి ఉల్లిపాయలు తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కంటెంట్ కలిగి ఉంటాయి, ఇవి బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. అతిగా తినే పరిస్థితులను ఉల్లిపాయల్లో ఉండే ఫైబర్ తగ్గిస్తుంది. కేలరీలను భర్తీ చేస్తుంది.  చివరికి బరువు తగ్గడానికి. సహాయపడుతుంది.                                   ◆నిశ్శబ్ద.