ప్రధాని నరేంద్ర మోదీ తన 76వ పుట్టినరోజు  సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల అధినేతల నుంచీ  రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల అగ్రనేతలు ఆయనకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాజకీయ విభేదాలను పక్కనబెట్టి ప్రతిపక్ష నేతలు కూడా ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షించారు. మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే..  మోదీకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. వీరితో పాటు కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ  చీఫ్‌ శరద్‌ పవార్‌, శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది తదితరులు మోదీకి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత  స్టాలిన్‌  తదితరులు కూడా మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  అలాగే    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా మోదీ సేవలందిస్తున్న తీరు  చరిత్రాత్మకమని ముఖ్యమంత్రి చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.  గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని పదవి వరకు సాగిన సుమారు రెండున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణం దేశ ప్రగతికి దోహదం చేసిందన్నారు. సేవ, సంకల్ప్, సుశాసన్  అనే నినాదంతో ఆయన చేపడుతున్న కార్యక్రమాలు కోట్లాది మంది పౌరులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.  సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని ప్రస్థానం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని మంత్రి నారాలోకేష్ పేర్కొన్నారు.  క్రమశిక్షణ, అంకితభావం రాజకీయాల్లో పనిచేసే యువ నాయకులకు ప్రధాని మోడీ ఆదర్శమని లోకేష్ ప్రస్తుతించారు.  [Narendra Modi Birthday, Rahul Gandhi, Mallikarjun Kharge, Nara Chandrababu, Lokesh, Modi 76th birthday Wishes, Telugu One]
కోవూరు: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీఏ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. కోవూరు నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే కార్యకర్తలకు మరింత న్యాయం చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని లోకేష్ అన్నారు. వైసీపీ నాయకులు కుల, మతాల పేరుతో విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి వైసీపీ దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. గతంలో జరిగిన వివిధ రాజకీయ పరిణామాలను ప్రస్తావిస్తూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని లోకేష్ సూచించారు. పెన్షన్లు, తల్లికి వందనం, స్త్రీశక్తి, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో పాటు రైతులు, చేనేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, మత్స్యకారులకు అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించాలని అన్నారు. 16 వేల టీచర్ పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేశామని తెలిపారు. రాష్ట్రానికి గూగుల్, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి సంస్థల పెట్టుబడులు రావడాన్ని ప్రస్తావించిన లోకేష్.. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రభుత్వం చేసిన పనులతో పాటు వైసీపీ ప్రచారాన్ని కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. డీఎస్సీపై జగన్‌కు లోకేష్ సవాల్.. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు తనను ప్రశ్నిస్తున్నారని లోకేష్ విమర్శించారు. డీఎస్సీ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. టీచర్ పోస్టుల భర్తీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టులను ఆశ్రయించినా వెనక్కి తగ్గాల్సి వచ్చిందని అన్నారు. డీఎస్సీపై తనతో బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కుటుంబం వేరు.. రాజకీయం వేరు.. కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని లోకేష్ అన్నారు. రాజకీయాలను, కుటుంబ సంబంధాలను వేర్వేరుగా చూడాలని సూచించారు. తన కుటుంబ సభ్యులపై గతంలో జరిగిన వ్యక్తిత్వ హనన వ్యాఖ్యలను ప్రస్తావించారు. ప్రత్యర్థి నాయకుల కుటుంబ సభ్యుల గురించి తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని తెలిపారు. కార్యకర్తే అధినేత.. ‘కార్యకర్తే అధినేత’ అనే నినాదాన్ని ఆచరణలో చూపిస్తున్నామని లోకేష్ అన్నారు. కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ నిధి ద్వారా ఇప్పటివరకు రూ.175 కోట్లు అందించామని తెలిపారు. కార్యకర్తలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలోపేతం కావాలన్నదే లక్ష్యమన్నారు. మైటీడీపీ, మైహెల్త్ యాప్‌లను వినియోగించాలని సూచించారు.నా తెలుగుదేశం–నా బాధ్యత’ నినాదానికి ప్రతి కార్యకర్త కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ అంతర్గత సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యకర్తలు నాయకుల చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరగాలని, ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. ప్రభుత్వ కొనసాగింపు అవసరం.. ప్రభుత్వాలు తరచూ మారడం వల్ల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో తమపై కేసులు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. కోవూరు టీడీపీకి బలమైన నియోజకవర్గమని పేర్కొన్న లోకేష్.. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేసి నియోజకవర్గాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తదితరులు మాట్లాడుతూ కోవూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని లోకేష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతం కోసం లోకేష్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. సమావేశంలో బీద మస్తాన్‌రావు, మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్, బీద రవిచంద్ర, మద్దిపాటి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.       [ Nara Lokesh, TDP, Telugu Desam Party, Kovur, Nellore, Local Body Elections, NDA Alliance, Andhra Pradesh Politics, YSRCP, YS Jagan Mohan Reddy, Mega DSC, DSC Recruitment, Teacher Jobs, TDP Cadre, Political Controversy, AP Politics, Chandrababu Naidu, Coalition Government, TDP Workers, Welfare Schemes, Development, Veemireddy Prashanthi Reddy, Veemireddy Prabhakar Reddy, NTR Statue, Kovur TDP, Local Elections AP ]
తెలంగాణ రాజకీయాలు మరో సారి హీటెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కన్నెర్ర చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని  సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూముల బాగోతంపై  30 రోజుల్లోగా పూర్తిస్థాయిలో విచారణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని కల్వకుంట్ల కుటుంబం భారీగా ఆస్తులను కూడబెట్టిందని, రాష్ట్రంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని వారి అధీనంలోకి తెచ్చుకున్నారని సీఎం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కుటుంబానికి చెందిన స్థిరాస్తుల వివరాలను సర్వే నంబర్లతో సహా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చదివి వినిపించడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. నిబంధనల ప్రకారం కేసీఆర్ దంపతుల పేరు మీద కేవలం 27 ఎకరాలు మాత్రమే ఉండాల్సి ఉండగా..  ప్రస్తుతం వారి వద్ద  67 ఎకరాల భూమి ఉన్నట్లు రేవంత్ పేర్కొన్నారు. అంతేకాకుండా కేటీఆర్ కుటుంబానికి సంబంధించి నలుగురి పేర్ల మీద మొత్తంగా 123 ఎకరాల భూములు ఉన్నాయని లెక్కలతో సహా వివరించారు. కేటీఆర్ పేరు మీద 49.5 ఎకరాలు, ఆయన భార్య శైలిమ పేరు మీద 17.5 ఎకరాలు, అలేఖ్య పేరు మీద 9.38 ఎకరాలు, అలాగే హిమాన్ష్ పేరు మీద 46.3 ఎకరాల భూమి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని, ధరణి పోอร์టల్‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల విలువైన ఆస్తులను దోచుకున్నారని ఆరోపించారు. మొత్తంగా దాదాపు 340 ఎకరాల ప్రభుత్వ భూమి కేవలం కేసీఆర్ ఫామ్‌హౌస్ అధీనంలోనే ఉందనీ, ఈ ఫామ్‌హౌస్ భూముల అసలు నిజాలు తేల్చాలని జిల్లా కలెక్టర్‌ను  ఆదేశించారు. ఈ విచారణలో ఆ భూములు పూర్తిగా ప్రభుత్వానివేనని తేలితే, ఆ భూములన్నింటినీ స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పంచుతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రెవెన్యూ అధికారులు తక్షణమే కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణ వేగవంతం చేయాలన్నారు. ఒకవేళ నిర్దేశిత 30 రోజుల్లోగా విచారణ పూర్తి చేయకపోతే బాధ్యులైన అధికారులపై  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ఈ తాజా పరిణామంతో తెలంగాణలో భూ ఆక్రమణల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.  కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే అధికారిక రికార్డుల ప్రకారం కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేరిట   440 ఎకరాల భూములు ఉన్నాయని సర్వే నంబర్ల వారీగా వివరించారు. తెలంగాణ రాష్ట్రం   వేలాది మంది అమరులు ప్రాణాలర్పించి, ఉద్యమకారులు సర్వస్వం కోల్పోతే.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం పాలన ముసుగులో భూములను పోగేసుకుందని ఆరోపించారు.  రేవంత్ అసెంబ్లీ వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్ లో కేసీఆర్ దంపతుల పేరిట 67 ఎకరాలు, కేటీఆర్ కుటుంబం పేరిట  123 ఎకరాల భూమి ఉంది.  ఇందులో కేటీఆర్ పేరిట 49 ఎకరాలు, ఆయన కుమారుడు హిమాన్షు పేరిట 46 ఎకరాలు, కుమార్తె అలేఖ్య పేరిట 9 ఎకరాలు, భార్య శైలిమ పేరిట మరో 17 ఎకరాలు ఉన్నాయి. ఇక మాజీ మంత్రి హరీశ్ రావు పేరిట 30 ఎకరాలు, ఎమ్మెల్సీ కవిత పేరిట 35 ఎకరాలు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు పేరిట 79 ఎకరాల భూములు అధికారిక రికార్డుల్లోనే స్పష్టంగా ఉన్నాయి. సభ ముందు ఉంచిన ఈ 440 ఎకరాలు కేవలం అధికారిక పత్రాల్లో నమోదైన లెక్కలు మాత్రమేనన్న రేవంత్ రెడ్డి.. తెరవెనుక బినామీల పేర్ల మీద ఇంకా వేల ఎకరాల విలువైన భూములు దాగి ఉన్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను, రెవెన్యూ యంత్రాంగాన్ని ఆయుధాలుగా మార్చుకుని అసైన్డ్, ప్రభుత్వ, పేదల భూములను చేజిక్కించుకున్నారని విమర్శించారు. దశాబ్ద కాలంలో ఈ భూములు ఏ విధంగా సమకూరాయి, మార్కెట్ విలువలను ఎలా ప్రభావితం చేశారు, ప్రభుత్వ భూములు ఏమైనా వీటిలో కలిసిపోయాయా అనే కోణాలపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెప్పారు.  ఒకవైపు పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు దక్కక అల్లాడుతుంటే.. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉండి ఒకే కుటుంబం వందలాది ఎకరాలను కబ్జా తరహాలో కూడబెట్టుకోవడం ప్రజాద్రోహమేనని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. [KCR Farmhouse, Cm Revanth reddy, Erravelli Earmhouse Lands, KCR Family Assets, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
Dulquer Salmaan’s Aakasamlo Oka Taara is set to arrive in theatres on November 20. The release date has been announced with a new poster featuring Dulquer in a simple, everyday look, adding to the curiosity around the film. Directed by Pavan Sadineni, the movie stars debutant Satvika Veeravalli as leading lady.  The story is said to be  Dulquer helping the leading lady achieve her astronaut dream even though they hail from a remote village in Andhra Pradesh. Shruti Haasan is playing a key character who is a scientist and helps the couple in their impossible journey.  The film has been carrying good buzz, particularly after the teaser and its first single, “Chitti Chitti Cheema” has struck a chord with listeners. GV Prakash Kumar is composing the music for the film. According to inside reports, as an actress filed cheating case on director Pavan Sadineni, the makers have decided to push the release from October to November. But there is a catch in this too. Dulquer's romantic drama with Pooja Hegde, Sri Sri, has been locked to release for 4th December. If this movie is locked for 20th November, then it would be Dulquer releasing two movies in gap of two weeks. With I'M Game failure, whether the actor be willing to take such a risk is to be seen.  Currently, the reports suggest that the makers are planning to start the remaining shoot and finish the project at the earliest with desired quality. Produced by Sandeep Gunnam and Ramya Gunnam under Lightbox Media, Aakasamlo Oka Taara is presented by Geetha Arts and Swapna Cinema.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లో తనదైన నటనతో విశేష ప్రేక్షకాదరణ పొందిన ప్రముఖ సీనియర్ నటి ప్రేమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి, విడాకులు మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. జీవితంలో ఒంటరిగా ప్రయాణించడం కంటే ఒక సరైన తోడు ఉండటం చాలా ముఖ్యమని ప్రేమ అభిప్రాయపడ్డారు. తనకు తగిన వ్యక్తి, తన మనసును అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే వయసుతో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయసులోనైనా రెండో పెళ్లి చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆమె స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని వెల్లడించారు. గతంలో వ్యాపారవేత్త జీవన్ అప్పచ్చును వివాహం చేసుకున్న ప్రేమ, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2016లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి తాను ఒంటరిగానే జీవిస్తున్నానని, భవిష్యత్తులో పరిస్థితులు కుదిరితే వివాహం చేసుకోవడంలో ఎలాంటి తప్పులేదని ఆమె పేర్కొన్నారు. ఇదే సమయంలో తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై కూడా ఆమె ఘాటుగా స్పందించారు. తనకు ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి సోకిందంటూ గతంలో కొన్ని మాధ్యమాల్లో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. తాను పూర్తిగా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి నిరాధారమైన వార్తను నమ్మవద్దని అభిమానులకు సూచించారు. 'ఓంకారం', 'దేవి' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ, తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనూ, ఆ తర్వాత కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని నిలబెట్టుకున్నారు. చాలా కాలం తర్వాత ఆమె తన వ్యక్తిగత విషయాలపై ఇంత స్పష్టంగా మాట్లాడడం ప్రస్తుతం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. నటి ప్రేమ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆమె అభిమానులు, నెటిజన్లు ఈ సీనియర్ నటి ధైర్యాన్ని మెచ్చుకుంటూ సానుకూలంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఆమె రీ-ఎంట్రీ ఇస్తారా లేదా అనే దానిపై కూడా అభిమానుల్లో చర్చ జరుగుతోంది.       [Actress Prema, Prema second marriage, Prema divorce, Prema cancer rumors, Telugu senior heroine news]
సినీ పరిశ్రమలో ఎవరూ ఊహించని సరికొత్త కాంబినేషన్స్ సెట్ అవ్వడం సహజమే. కానీ, సోషల్ మీడియాలో ఉన్నట్టుండి చక్కర్లు కొడుతున్న ఒక క్రేజీ కాంబో వార్త మాత్రం మెగా అభిమానులకు టెన్షన్‌ను తెచ్చిపెడుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్నారంటూ నేషనల్ అండ్ సౌత్ మీడియాలో ఒక్కసారిగా వార్తలు హల్‌చల్ చేయడం ప్రారంభించాయి. 'తానాజీ' లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించిన ఓం రౌత్.. ప్రభాస్ తో 'ఆదిపురుష్' తీసి విమర్శల పాలైన సంగతి తెలిసిందే. అలాంటి డైరెక్టర్‌తో చరణ్ ప్రాజెక్ట్ ఓకే అయిందంటూ వార్తలు రావడంతో ఫిల్మ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఓం రౌత్ ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా కథను సిద్ధం చేసి, రామ్ చరణ్‌ను కలసి వినిపించారని, దానికి చరణ్ బాగా ఇంప్రెస్ అయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కొందరు సోషల్ మీడియాలో కథనాలు వండి వార్చేశారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందంటూ ప్రచారం జరగడంతో.. ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ "అయ్యో వద్దన్నా.. ఆదిపురుష్ రిజల్ట్ చూశాం కదా, ఈ ప్రాజెక్ట్ వద్దు" అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే రామ్ చరణ్ సన్నిహిత వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ఇదొక బేస్‌లెస్ రూమర్ అని తేలిపోయింది. ఓం రౌత్ సౌత్ ఇండియాలోని ఒక టాప్ స్టార్‌తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్న మాట నిజమే అయినప్పటికీ, చరణ్‌ను కలిసి కథ చెప్పారనే వార్త పూర్తిగా కల్పితమని స్పష్టమైంది. ప్రస్తుతం రామ్ చరణ్ దృష్టి అంతా స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో చేయబోతున్న 'RC17' పైనే ఉంది. 'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పాత్ర కోసం చరణ్ సరికొత్త స్టైలిష్ లుక్‌లోకి మారుతున్నారు.  సుకుమార్ ప్రాజెక్ట్ తర్వాత మాత్రమే చరణ్ తన తదుపరి సినిమాలను లైన్‌లో పెట్టే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఓం రౌత్ - రామ్ చరణ్ కాంబినేషన్ అనేది కేవలం ఇంటర్నెట్‌లో ప్రచారంలో ఉన్న పుకారు మాత్రమేనని స్పష్టమవుతోంది.       [Ram Charan Om Raut Movie, Ram Charan RC17, Ram Charan Sukumar Movie, Adipurush Director, Ram Charan, Om Raut, Telugu Film News, Telugu News]  
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత శక్తివంతమైన సెన్సార్ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఒకే ఒక్క నిర్ణయంతో సమూలంగా ప్రక్షాళన చేసేసింది. ఏకంగా 9 ఏళ్ల తర్వాత బోర్డును పూర్తిగా రీకన్స్ట్రక్ట్ చేస్తూ నూతన సభ్యులను ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన నిర్ణయం ప్రకారం.. 2017 తర్వాత, అంటే దాదాపు తొమ్మిదేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం సెన్సార్ బోర్డును ఫుల్ లెంగ్త్‌లో పునర్వ్యవస్థీకరించారు. ప్రసార భారతి మాజీ సీఈవో శశి శేఖర్ వెంపటి నేతృత్వంలో విభిన్న రంగాలకు చెందిన 18 మంది ప్రముఖులతో కూడిన నూతన పాలకమండలిని కేంద్రం అధికారికంగా నియమించింది. ఈ కొత్త కమిటీ రాబోయే మూడేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగనుంది. బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా, విలక్షణ నటుడు పంకజ్ త్రిపాఠి, సీనియర్ యాక్టర్ సునీల్ శెట్టి, బెంగాలీ సూపర్ స్టార్ ప్రసేన్‌జిత్ ఛటర్జీలతో పాటు లెజెండరీ డైరెక్టర్ ప్రియదర్శన్‌లకు ఈ నూతన బోర్డులో మెంబర్షిప్ లభించింది. ఇక టీవీ అండ్ మ్యూజిక్ ఇండస్ట్రీల నుంచి ఐకానిక్ యాక్టర్ రూపాలీ గంగూలీ, మూడుసార్లు గ్రామీ అవార్డు గెలుచుకున్న మ్యూజిక్ డైరెక్టర్ రికీ కేజ్, సూఫీ గాయకుడు హన్స్ రాజ్ హన్స్, మనోజ్ జోషిలకు చోటు కల్పించారు. ఈ ప్రతిష్టాత్మక సెన్సార్ బోర్డులో తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధిగా ప్రముఖ నిర్మాత, అన్నపూర్ణా స్టూడియోస్ బిజినెస్ హెడ్ సుప్రియ యార్లగడ్డకి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. నాగార్జున మేనకోడలు, అక్కినేని కాంపౌండ్ నుంచి వచ్చిన సుప్రియ ఫిల్మ్ ప్రొడక్షన్, ఎగ్జిబిషన్, సినీ బిజినెస్ పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఆమె ఈ నూతన మండలిలో సభ్యురాలిగా నియామకం కావడంపై టాలీవుడ్‌లో హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో సినిమాల సెన్సార్ వివాదాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. టైటిల్స్ మార్పు, A సర్టిఫికెట్స్ ఇవ్వడం వంటి విషయాల్లో మేకర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో సీనియర్ నటీనటులు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఉన్న ఈ నూతన CBFC టీమ్ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోబోతోందో చూడాలి. సినీ ప్రపంచంలో క్రియేటివ్ ఫ్రీడమ్‌ని కాపాడుతూనే, ప్రేక్షకుల భావోద్వేగాలకు తగినట్టుగా ఈ కొత్త బోర్డు ఎలా వ్యవహరించనుంది? అనేది ఆసక్తికరంగా మారింది.        [CBFC New Board, Central Board of Film Certification, Supriya Yarlagadda CBFC, Indian Cinema Censor Board, Preity Zinta CBFC, Pankaj Tripathi CBFC, Telugu Film News, Telugu News]  
A recent report about Ram Charan teaming up with director Om Raut for a big-budget film has turned out to be untrue, with the latest information suggesting that the actor and filmmaker did not meet as claimed. The speculation had triggered considerable interest, particularly with reports suggesting that Raut was planning a large-scale project with Charan. Charan, meanwhile, continues to be committed to his next film with director Sukumar. The actor underwent surgery for a wrist injury sustained during the shoot of Peddi in July and has been recuperating since then. He has been advised to complete his rehabilitation before returning to shooting. On the work front, Sukumar’s film with Charan, tentatively referred to as RC17, remains the actor’s next project. Recent reports indicate that Sukumar has completed the scripting work and is involved in pre-production, while Charan is expected to begin preparing for the role. With the film still being readied, the makers are expected to announce the title, cast and other details officially at the appropriate time. Until then, the reports linking Charan with Om Raut appear to be nothing more than speculation. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ మూవీ 'రణబాలి' వాయిదా పడిందంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దసరా రేసు నుంచి తప్పుకొని, డిసెంబర్‌కి పోస్ట్‌పోన్ అయిపోయిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తూ చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. 'రణబాలి' సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. విజయ్ కి 'టాక్సీవాలా' వంటి సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పిరియాడిక్ యాక్షన్ మూవీపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. 19వ శతాబ్దం నాటి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగే ఒక పవర్‌ఫుల్ అండ్ రా యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.  అయితే, ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందని, విజువల్ ఎఫెక్ట్స్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అంతే కాకుండా బాక్సాఫీస్ రేసులో ఇతర పెద్ద సినిమాలు ఉండటంతో డిసెంబర్ 3కి రణబాలిని షిఫ్ట్ చేస్తున్నారంటూ ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.  https://x.com/MythriOfficial/status/2100444351256265108 అయితే వాయిదా వార్తలన్నీ ఫేక్ అని తాజాగా మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. షూటింగ్ పూర్తయిందని, అక్టోబర్ 16న సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. దీంతో దసరాకు బాక్సాఫీస్ దగ్గర రణబాలి విశ్వరూపం చూడటం ఖాయమైంది.  విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలసి నటిస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా, అజయ్ - అతుల్ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకి మెయిన్ హైలైట్ కానుంది. ప్రస్తుతం షూటింగ్ పార్ట్ పూర్తవ్వడంతో, మిగిలిన సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్వాలిటీగా పూర్తి చేయడానికి మేకర్స్ కేటాయిస్తున్నారు.       [Ranabaali Release Date, Ranabaali Dasara Release, Ranabaali Shoot Wrap, Ranabaali Movie, Vijay Deverakonda, Rashmika Mandanna, Rahul Sankrityan, Telugu Film News, Telugu News]  
‘దసరా’ వంటి మాసివ్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఒడెల కాంబినేషన్‌లో వస్తున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. రిలీజ్‌కి ముందే ఈ సినిమా సృష్టిస్తున్న బిజినెస్ సునామీ చూస్తుంటే ట్రేడ్ వర్గాలే షాక్ అయిపోతున్నాయి. నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ కలిపి ఏకంగా రూ. 103 కోట్లకు పైగా బిజినెస్ జరిగినట్లు సమాచారం. టాలీవుడ్ టాప్ స్టార్స్ కాకుండా, ఒక టైర్-2 స్టార్ సినిమా వంద కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయడం ఇదే తొలిసారి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బిజినెస్ నెక్స్ట్ లెవల్‌లో జరిగింది. నైజాం ఏరియా రైట్స్‌ ఏకంగా రూ. 35 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. ఆంధ్రాలో రూ.30.7 కోట్లు, సీడెడ్‌లో రూ.10 కోట్లు బిజినెస్ చేసింది. అంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ‘ది ప్యారడైజ్’ బిజినెస్ ఏకంగా రూ.75.7 కోట్లు చేసింది.  కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లో కూడా నాని మార్కెట్ విపరీతంగా పెరిగిపోయింది. ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులు ఏకంగా రూ. 18 కోట్ల రికార్డు ధరకు క్లోజ్ అయినట్లు సమాచారం. ఇక రెస్టాఫ్ ఇండియాలో మరో రూ.10 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ‘ప్యారడైజ్’ మూవీ రూ.103.7 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్‌గా నిలవాలంటే దాదాపు రూ. 105 కోట్ల షేర్ సాధించాల్సి ఉంటుంది. గ్రాస్ పరంగా చూస్తే, రూ.200 కోట్ల గ్రాస్ రాబట్టాల్సి ఉంటుంది. ఈ టార్గెట్ ను నాని రీచ్ అయితే.. ఆయన టైర్-1 స్టార్ గా అవతరించినట్టే.        [The Paradise Theatrical Business, The Paradise Pre Release Business, The Paradise Business, Paradise 100 Crore Business, Nani Paradise Movie, Natural Star Nani, Srikanth Odela, Telugu Film News, Telugu News]  
Rashmika Mandanna is taking on the biggest challenge in her acting career to play MS Subbulakshmi in the MS biopic. Kamal Haasan, Siva Kumar have attended the film event in Chennai as special guests. Kamal Haasan stated that he had always been a fan of MS ma'am and he met her during Hey Ram film for Vaishnava Janatho song.  He revealed that Mahatma Gandhi loved MS's voice and hence, he went to get her to sing. He further wished Anirudh Ravichander a film like Shankarabharanam, Sagara Sangamam with this carnatic based musical biopic. Further Kamal asked writer-director Gowtam Tinnanuri to make it realistic and use her real life screenplay as is.  Kamal also called MS as "Pan-India Star of Indian Music". He wished Rashmika to perform as her bravely as she is the first South Indian woman icon. Siva Kumar expressed his frustration about Tamil filmmakers not coming forward to make MS biopic but Telugu filmmakers doing it.  Geeta Arts, Bunny Vasu, Rockline Venkatesh, Allu Aravind are producing the film with Gowtam Tinnanuri directing it and Anirudh Ravichander composing music. Rashmika Mandanna will be seen as MS Subbulakshmi with Madhan Karky as writer. Kamal Haasan clapped in on Rashmika while Samuthirakani directed first shot.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
మన ఆరోగ్య సంరక్షణలో పీచు పదార్థం లేదా ఫైబర్ (Fiber) పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, మలబద్ధకం సమస్య దూరమవ్వాలన్నా, బరువు అదుపులో ఉండాలన్నా ప్రతీ ఒక్కరూ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోమని సలహా ఇస్తుంటారు. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు మరియు పప్పుధాన్యాలలో లభించే ఈ పీచు పదార్థం పేగులలోని మంచి బాక్టీరియాకు ఆహారంగా పనిచేసి పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అయితే, ఏదైనా అతిగా తింటే అమృతమైనా విషమవుతుందనే నానుడి ఫైబర్ విషయంలోనూ నూటికి నూరు శాతం వర్తిస్తుంది. ఫైబర్ ఆరోగ్యానికి మంచిదే కదా అని మోతాదుకు మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం బాగుపడటానికి బదులుగా తీవ్రంగా పాడయ్యే ప్రమాదం ఉందని పోషకాహార నిపుణులు మరియు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన మానవ శరీరానికి రోజువారీగా సుమారు 25 నుండి 30 గ్రాముల ఫైబర్ మాత్రమే అవసరమవుతుంది. కానీ చాలామంది బరువు వేగంగా తగ్గాలనే ఉద్దేశంతో లేదా జీర్ణ సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందాలని ఒక్కసారిగా తమ ఆహారంలో ఫైబర్ పరిమాణాన్ని 50 నుండి 60 గ్రాములకు పైగా పెంచేస్తుంటారు. ఇలా హఠాత్తుగా లేదా అతిగా పీచు పదార్థాన్ని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై విపరీతమైన భారం పడుతుంది. మన పేగుల్లో ఉండే బాక్టీరియా ఈ అధిక ఫైబర్‌ను వేగంగా ఫర్మెంటేషన్ (కిణ్వ ప్రక్రియ) చేయడం ప్రారంభిస్తుంది. దీని ఫలితంగా కడుపులో విపరీతమైన గ్యాస్ తయారవ్వడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపులో తీవ్రమైన నొప్పి మరియు అసౌకర్యం వంటి సమస్యలు వెంట వెంటనే తలెత్తుతాయి. అంతేకాకుండా, పరిమితికి మించిన ఫైబర్ తీసుకోవడం వల్ల విరోచనాలు (Diarrhea) లేదా కొందరిలో విరుద్ధంగా మరింత తీవ్రమైన మలబద్ధకం (Constipation) ఏర్పడే అవకాశం ఉంది. మనం తినే ఫైబర్ సరిగ్గా జీర్ణం కావాలంటే శరీరానికి తగినంత నీరు అత్యంత అవసరం. శరీరం లోపల నీటి శాతం తక్కువగా ఉండి, ఫైబర్ మాత్రమే ఎక్కువగా తీసుకుంటే, ఆ పీచు పదార్థం పేగుల్లోని నీటిని పీల్చేసుకుని గట్టిపడిపోతుంది. దీనివల్ల ఆహారం పేగుల్లో ముందుకు కదలకుండా అడ్డుపడి మలబద్ధకాన్ని మరింత క్లిష్టం చేస్తుంది. ఇది క్రమంగా కడుపులో తీవ్రమైన తిమ్మిర్లు మరియు పేగులలో వాపునకు దారితీస్తుంది. అధిక ఫైబర్ వల్ల మరొక ప్రధానమైన ముప్పు ఏమిటంటే పోషకాల లోపం. మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థం మోతాదుకు మించి ఉంటే, అది శరీరంలో కీలకమైన కాల్షియం, ఐరన్, జింక్ మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలను పేగులు పీల్చుకోకుండా అడ్డుకుంటుంది. ఫైబర్ ఈ ఖనిజాలతో బంధాన్ని ఏర్పరచుకుని, అవి శరీరానికి అందకుండానే మలం ద్వారా బయటకు పంపేస్తుంది. ఫలితంగా దీర్ఘకాలంలో రక్తహీనత (Anemia) మరియు ఎముకల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి రోజువారీ డైట్‌లో ఫైబర్‌ను ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా పెంచుకోవాలి. ప్రతిరోజూ కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు తాగుతూ, శరీరానికి సరిపడా సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం ద్వారా పొట్టను, పేగులను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.     [ Fiber, High Fiber Diet, Digestive Health, Constipation, Diarrhea, Gut Health, Bloating, Hydration, Nutrient Deficiency, Healthy Diet ]
నేటి వేగవంతమైన జీవనశైలి మరియు మార్పుచెందిన ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్ అనేది ప్రతి ఇంటా సాధారణ సమస్యగా మారిపోయింది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడు ఏ విధంగా పెరుగుతాయో తెలియక చాలామంది ప్రతిరోజూ ఆందోళన చెందుతుంటారు. ముఖ్యంగా ఉదయం పూట తినే అల్పాహారం లేదా బ్రేక్‌ఫాస్ట్ మన రోజంతా ఉండే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఉదయాన్నే మైదా, ప్రాసెస్ చేసిన పిండి వంటకాలు లేదా అధిక కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా స్పైక్ అవుతాయి. ఇలాంటి సమయంలో శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను స్థిరంగా ఉంచే ఆరోగ్యకరమైన టిఫిన్ ఎంచుకోవడం అత్యంత ఆవశ్యకం. మధుమేహ బాధితులకు దివ్యౌషధంగా పనిచేసే అలాంటి ఒక అద్భుతమైన సాంప్రదాయక ఉదయపు ఆహారమే జొన్న మెంతి పరోటా (Jowar Methi Paratha). జొన్నలు మరియు మెంతులు రెండూ కూడా ఆయుర్వేదంలో మరియు ఆధునిక పోషకాహార శాస్త్రంలో అత్యుత్తమ ఆహారాలుగా గుర్తించబడ్డాయి. సాధారణంగా మనం తినే గోధుమలు లేదా బియ్యంతో పోలిస్తే జొన్నలలో గ్లైసీమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. జొన్నల పిండిని ఆహారంగా తీసుకున్నప్పుడు అది శరీరంలో చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల రక్తంలోకి గ్లూకోజ్ ఒక్కసారిగా విడుదల కాకుండా క్రమంగా విడుదలవుతుంది. తద్వారా ఇన్సులిన్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. అంతేకాకుండా జొన్నలలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ లేదా పీచు పదార్థం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచి, ఎక్కువ సేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఇది పదే పదే ఆకలి వేయకుండా ఆపుతుంది, తద్వారా బరువు పెరగకుండా సమర్థవంతంగా అదుపు చేయవచ్చు. ఇక ఈ పరోటాలో ఉపయోగించే మరో ముఖ్యమైన దినుసు మెంతి ఆకులు. మెంతి ఆకులలో లభించే విశిష్టమైన గెలాక్టోమన్నన్ అనే పీచు పదార్థం మరియు అమైనో ఆమ్లాలు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని (Insulin Sensitivity) పెంచుతాయి. మెంతి ఆకులు రక్తంలోని గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేసి డయాబెటిస్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. జొన్న పిండికి సన్నగా తరిగిన పచ్చి మెంతి ఆకులు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, వాము మరియు తగినంత ఉప్పు కలిపి కొద్దిగా గోరువెచ్చని నీటితో సాఫ్ట్‌గా కలుపుకోవాలి. జొన్న పిండిలో గ్లూటెన్ ఉండదు కాబట్టి రొట్టెలు చేయడం కొద్దిగా కష్టంగా అనిపించినా, కొద్దిపాటి నూనె లేదా నెయ్యి రాసి నిదానంగా ఒత్తి పెనంపై కాల్చుకోవాలి. ఈ జొన్న మెంతి పరోటాను ప్రతిరోజూ ఉదయం టిఫిన్‌గా తీసుకోవడం వల్ల కేవలం షుగర్ లెవెల్స్ అదుపులో ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఐరన్ మరియు విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. నిత్యం బిపి, షుగర్ సమస్యలతో బాధపడేవారు మరియు బరువు తగ్గాలనుకునే వారు తమ రోజువారీ ఉదయపు ఆహారంలో ఒకట్రెండు జొన్న మెంతి పరోటాలను పెరుగు లేదా పుదీనా చట్నీతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ రుచికరమైన, పోషకాల గని వంటి బ్రేక్‌ఫాస్ట్‌ను మీ ఆహారంలో భాగం చేసుకోండి.     [ Jowar Methi Paratha, Diabetes, Type 2 Diabetes, Blood Sugar, Jowar, Methi Leaves, Low GI Foods, Dietary Fiber, Insulin Sensitivity, Healthy Breakfast ]  
వయస్సు పెరుగుతున్న కొద్దీ లేదా మారుతున్న జీవనశైలి కారణంగా మన శరీరంలో వచ్చే అత్యంత ప్రధానమైన మార్పు ఎముకల బలహీనత. చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు రావడం, కొద్దిపాటి దెబ్బలకే ఎముకలు విరగడం లేదా అరిగిపోవడం వంటి సమస్యలు నేడు చాలామందిని వేధిస్తున్నాయి. సాధారణంగా ఎముకల ఆరోగ్యం అనగానే మనకు వెంటనే గుర్తుకువచ్చేది పాలు మరియు పాల ఉత్పత్తులు మాత్రమే. కానీ మన ఇంట్లోనే లభించే కొన్ని సంప్రదాయ మరియు సహజ సిద్ధమైన ఆహార పదార్థాలు పాలకంటే అత్యంత శక్తివంతంగా ఎముకలను దృఢపరచగలవని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా నల్ల నువ్వులు, పొన్నగంటి కూర, తోటకూర మరియు రాగులు వంటి పదార్థాలలో లభించే కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం మరియు విటమిన్లు మన ఎముకల సాంద్రతను (Bone Density) ఊహించని రీతిలో పెంచి, వాటిని ఉక్కులా బలంగా మారుస్తాయి. నల్ల నువ్వులు (Black Sesame Seeds) ఎముకల ఆరోగ్యానికి ఒక గొప్ప నిధి లాంటివి. వీటిలో సాధారణ తెల్ల నువ్వుల కంటే అత్యధిక పరిమాణంలో కాల్షియం మరియు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. కేవలం వంద గ్రాముల నల్ల నువ్వులను తీసుకుంటే దాదాపు 1450 మిల్లీగ్రాముల వరకు ఉపాధి కలిగించే కాల్షియం శరీరానికి అందుతుంది. ఇది మనం రోజువారీ తాగే ఒక గ్లాసు పాలలో లభించే కాల్షియం కంటే దాదాపు ఐదు రెట్లు ఎక్కువ కావడం విశేషం. అంతేకాకుండా, వీటిలోని జింక్ మరియు రాగి (Copper) కండరాలు, ఎముకల అనుసంధాన కణజాలాన్ని బలోపేతం చేస్తాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఒక స్పూన్ వేయించిన నల్ల నువ్వులను లేదా నువ్వుల లడ్డును ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్ (Osteoporosis) వంటి తీవ్రమైన ఎముకల వ్యాధులు రాకుండా అరికట్టవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఆకుకూరల విషయానికి వస్తే పొన్నగంటి కూర మరియు తోటకూర ఎముకల బలానికి అద్భుతంగా తోడ్పడతాయి. పొన్నగంటి కూరలో కాల్షియంతో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి మరియు పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకల అరుగుదలను నివారించడమే కాకుండా, కీళ్ల మధ్య ఉండే సైనోవియల్ ద్రవం ఇంకిపోకుండా కాపాడుతుంది. మరొకవైపు, తోటకూర (Amaranth Leaves) అత్యధిక కాల్షియం మరియు మెగ్నీషియం కలిగిన ఆకుకూరగా పేరుగాంచింది. వంద గ్రాముల తోటకూరలో సుమారు 330 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది శరీరంలో ఎముకల నిర్మాణికి అవసరమైన ఆస్టియోబ్లాస్ట్ కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ ఆకుకూరలను పప్పు లేదా వేపుడు రూపంలో తీసుకోవడం వల్ల ఎముకల మాతృక (Bone Matrix) ఎంతో దృఢపడుతుంది. వీటితో పాటు మన సంప్రదాయ చిరుధాన్యమైన రాగులు (Ragi/Finger Millet) ఎముకల ఆరోగ్యానికి ఒక పవర్‌హౌస్‌గా పనిచేస్తాయి. శాకాహార ఆహారాలలో రాగులలో ఉన్నంత కాల్షియం మరే ఇతర ధాన్యంలోనూ లభించదు. ప్రతి వంద గ్రాముల రాగులలో దాదాపు 344 మిల్లీగ్రాముల సులభంగా జీర్ణమయ్యే కాల్షియం నిండి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే రాగి జావ తాగడం లేదా రాగి సంకటి, రాగి రొట్టెలు తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత క్రమంగా పెరుగుతుంది. చిన్నపిల్లల పెరుగుదలకు, గర్భిణులకు మరియు రుతుస్రావం ముగిసిన (Menopause) మహిళలకు ఎముకలు బలహీనపడకుండా ఉండటానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. ఈ నాలుగు సహజ ఆహారాలను మన రోజువారీ జీవనశైలిలో భాగం చేసుకోవడం ద్వారా ఎముకల నొప్పులకు స్వస్తి చెప్పి, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండవచ్చు.     [ Bone Health, Bone Density, Calcium Rich Foods, Black Sesame Seeds, Ponnaganti Leaves, Amaranth Leaves, Ragi, Osteoporosis, Joint Health, Strong Bones ]
అమరాంత్ సీడ్స్.. తోటకూర గింజలు లేదా రాజ్‌గిరా అని వీటిని పిలుస్తారు. ఇవి ఇటీవల కాలంలో సూపర్ ఫుడ్‌గా విపరీతమైన ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రాచీన కాలం నుండి మన సాంప్రదాయ ఆహారంలో భాగమైన ఈ గింజలు, ఆధునిక ఆరోగ్య నిపుణుల ప్రశంసలు అందుకుంటున్నాయి. మన నిత్య జీవితంలో తోటకూరను ఆకుకూరగా ఎంతగా ఉపయోగిస్తామో, దాని గింజలలో ఉన్న పోషక విలువలు కూడా అంతకంటే ఎక్కువే. సాధారణంగా కనిపించే ఈ చిన్న గింజలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. అమరాంత్ సీడ్స్ అంటే.. అమరాంత్ సీడ్స్ అనేది 'అమరాంథస్' అనే మొక్క నుండి లభించే గింజలు. తెలుగులో వీటిని తోటకూర గింజలు అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో వీటిని 'రాజ్‌గిరా' లేదా 'రామ్‌దానా' అని అంటారు. అమరాంత్ గింజలను ధాన్యాల జాబితాలో చేర్చినప్పటికీ, వృక్షశాస్త్రం ప్రకారం ఇవి నిజానికి సూడోసిరియల్స్ గా పిలుస్తున్నారు. అంటే బియ్యం, గోధుమల లాగా కాకుండా, ఇవి ఆకుకూరల జాతికి చెందిన గింజలు. అందుకే వీటిలో ఇతర సాధారణ ధాన్యాల కంటే పోషకాలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. ఇందులో గ్లూటెన్ ఉండకపోవడం వల్ల ఇది గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది. ఆరోగ్యానికి అమరాంత్ సీడ్స్ చేసే మేలు.. పోషకాల గని: అమరాంత్ గింజలలో శరీరానికి కావలసిన అత్యంత ముఖ్యమైన విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫోస్ఫరస్ , పోటాషియం సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన క్యాల్షియం ఇతర ధాన్యాలతో పోలిస్తే ఇందులో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్: సాధారణంగా వృక్ష సంబంధిత ఆహారాలలో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం చాలా అరుదు. కానీ అమరాంత్ లో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉంటాయి. ముఖ్యంగా 'లైసిన్' అనే అమైనో ఆసిడ్ ఇందులో ఉండటం వల్ల ఇది శరీరంలో ప్రొటీన్ శోషణకు ఎంతగానో తోడ్పడుతుంది. శాఖాహారులకు, కండరాల పుష్టిని కోరుకునే వారికి ఇది సరైన పోషకాహారం. జీర్ణవ్యవస్థ మెరుగుదల: అమరాంత్ గింజలలో  ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఫైబర్ ఎక్కువ సమయం కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి, అతిగా తినే అలవాటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం , కొలెస్ట్రాల్ నియంత్రణ: అమరాంత్ లో ఉండే సహజ నూనెలు , ఫైబర్ రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు గుండె నాళాల్లో పూడికలు ఏర్పడకుండా నిరోధించి, రక్తప్రసరణను నార్మల్ గా ఉండేలా చేస్తాయి. తద్వారా రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. బరువు తగ్గడానికి: బరువు తగ్గాలనుకునే వారికి అమరాంత్ సీడ్స్ చక్కని ఎంపిక. తక్కువ క్యాలరీలు, అధిక ప్రొటీన్ , పీచు పదార్థం కలిగి ఉండటం  వల్ల శరీర జీవక్రియ రేటు అంటే మెటబాలిజం  పెరుగుతుంది. కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమై, ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గడానికి ఇది దోహదపడుతుంది. డయాబెటిస్ నియంత్రణ: ఈ గింజలలో ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ సాధారణ ధాన్యాల కంటే తక్కువగా ఉంటుంది. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా క్రమబద్ధంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోజువారీ ఆహారంలో అమరాంత్ ను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి.. అమరాంత్ లో స్క్వాలేన్ , లోనాఫిన్ వంటి శక్తివంతమైన సమ్మేళనాలు  ఉంటాయి. ఇవి శరీరంలో  ఇన్ఫ్లమేషన్ తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో తోడ్పడతాయి. శరీర కణజాలాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఆహారంలో అమరాంత్ సీడ్స్ ఎలా తీసుకోవాలి? అమరాంత్ సీడ్స్ ని వివిధ రకాలుగా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. వీటిని వేయించి, పాప్‌కార్న్ లాగా మార్చి పాలు లేదా తేనెతో కలిపి ఉదయపు అల్పాహారంగా తీసుకోవచ్చు. వరి అన్నం లాగే వీటిని ఉడికించి తీసుకోవచ్చు లేదా ఉప్మా రూపంలో వండుకోవచ్చు. అమరాంత్ గింజలను పిండిగా తయారుచేసి  గోధుమ పిండితో కలిపి రొట్టెలు, చపాతీలు తయారు చేసుకోవచ్చు. పాయసం లేదా పానీయాలలో ఉడకబెట్టిన అమరాంత్ గింజలను చేర్చి పౌష్టికాహారంగా తీసుకోవచ్చు. సలాడ్లు లేదా సూప్‌లలో వేయించిన అమరాంత్ గింజలను పైన చల్లుకోవడం ద్వారా పోషక విలువలతో పాటు రుచిని పెంచుకోవచ్చు.                      *రూపశ్రీ.  
ఆరోగ్యం కోసం వాకింగ్ చేయాలని చాలామంది అనుకుంటారు. వాకింగ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బ్రిస్క్ వాకింగ్ , బ్యాక్ వాకింగ్.. అంటూ చాలా రకాలు ఉన్నాయి. వీటిలో 8 ఆకారంలో వాకింగ్ చేయడం చాలా పవర్ఫుల్ అంటున్నారు. దీన్ని అష్టాంగ నడక లేదా ఎనిమిది ఆకారపు నడక అని కూడా అంటారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే అద్భుతమైన సాంప్రదాయ వ్యాయామ పద్ధతి. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. అష్టాంగ నడక.. సాధారణంగా మనం ప్రతిరోజూ నేరుగా లేదా పార్కుల్లో రౌండ్‌గా నడుస్తుంటాం. కానీ ఒకే రీతిలో నడిచే నడక కంటే,  ఎనిమిది ఆకారంలో నడవడం వల్ల శరీరానికి ఎన్నో రెట్ల అదనపు ప్రయోజనాలు లభిస్తాయి. సరైన పద్ధతిలో ఈ నడకను  దినచర్యలో భాగం చేసుకుంటే, కొద్దిరోజుల్లోనే శరీరంలో వచ్చే మార్పులను ప్రత్యక్షంగా చూడవచ్చు. చిన్న స్థలం చాలు.. ఈ నడకను సాధన చేయడానికి పెద్దగా స్థలం లేదా ఖరీదైన పరికరాలు అవసరం లేదు.  ఇంటి ఆవరణలో లేదా ఒక ఖాళీ గదిలో దక్షిణం నుండి ఉత్తర దిశగా ఎనిమిది ఆకారాన్ని ఊహించుకుని లేదా సుద్ద ముక్కతో గీసుకుని నడవడం ప్రారంభించాలి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పరగడుపున పరధ్యానం లేకుండా పాదరక్షలు లేకుండా నడవడం చాలా మంచిది. ఎలా నడవాలి?  నడిచేటప్పుడు శ్వాసపై ధ్యాస ఉంచుతూ ప్రశాంతంగా, నిలకడగా అడుగులు వేయాలి. దాదాపు పదిహేను నిమిషాలు ఒక దిశలో నడిచిన తర్వాత, తదుపరి పదిహేను నిమిషాలు వ్యతిరేక దిశలో నడవడం ఈ పద్ధతి లో ఉండే  ముఖ్య నియమం. అష్టాంగ నడక వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. గుండె ఆరోగ్యం.. ఎనిమిది ఆకారంలో తిరుగుతూ నడవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ ఎంతో మెరుగుపడుతుంది. రెండు వైపులా  అడుగులు వేయడం వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు, ముఖ్యంగా గుండెకు తగినంత ప్రాణవాయువు అందుతుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. నాడీ వ్యవస్థ.. కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారంలో నడిచేటప్పుడు మోకాళ్లు, తుంటి భాగాలు, వెన్నుముక సహజంగా వంగుతాయి. దీనివల్ల వెన్నుముక బలపడి, నడుము నొప్పి , సయాటికా వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. పాదాల కింద ఉండే ఆక్యుప్రెజర్ పాయింట్లు నేలను తాకడం వల్ల నాడీ వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. మానసిక ఆరోగ్యం.. అష్టాంగ నడక మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎనిమిది ఆకారాన్ని అనుసరిస్తూ నడిచేటప్పుడు మనస్సు పూర్తిగా ఆకారం పైన నడక పైన దృష్టి పెడుతుంది. దీనివల్ల అనవసరమైన ఆలోచనలు తగ్గి, మెదడు ప్రశాంతంగా మారుతుంది. ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ నడకను సాధన చేస్తే మంచి నిద్ర పడుతుంది. డయాబెటిస్ కు మంచిది.. అష్టాంగ నడక వల్ల జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యాయామం వల్ల పొత్తికడుపు భాగంలో కదలికలు ఏర్పడి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరంలో పేరుకుపోయిన అనవసర కొవ్వు కరిగి, బరువు అదుపులోకి వస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో ఇన్సులిన్ స్థాయిలు సమతుల్యంగా ఉండటానికి, రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడానికి ఈ నడక ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం.. సాధారణ నడకతో పోలిస్తే అష్టాంగ నడక శరీరంలోని రెండు వైపుల కండరాలను సమంగా ఉపయోగిస్తుంది. దీనివల్ల శరీర సమతుల్యత పెరుగుతుంది. వయసు పైబడిన వారు పడిపోకుండా స్థిరంగా నడవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. రోజూ  నార్మల్ బ్యాకింగ్  కు బదులుగా  ప్రతిరోజూ కనీసం అర్ధగంట సేపు ఈ అష్టాంగ నడకను సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని , కొత్త ఉత్సాహాన్ని సొంతం చేసుకోవచ్చు.                          *రూపశ్రీ.