వివిధ రాష్ట్రాలకు కొత్త ఇన్‌ఛార్జీలను ప్రకటించిన కాషాయ పార్టీ..! రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో విజయం లక్ష్యంగా బీజేపీ అధినాయకత్వం పార్టీ సంస్థాగత యంత్రాంగంలో భారీ మార్పులు చేపట్టింది. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ అధికారికంగా జాబితాను ప్రకటించారు. ప్రాంతీయ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సమీకరణాలు, పార్టీ భవిష్యత్ వ్యూహాలను పరిగణనలోకి తీసుకుని కీలక నేతలకు ఆయా రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమన్వయం, ఎన్నికల వ్యూహాల అమలులో కొత్త ఇన్‌చార్జ్‌లు కీలకంగా వ్యవహరించనున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల వారీగా పార్టీ పనితీరును మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ నాయకురాలు స్మృతి ఇరానీకి కీలకమైన బాధ్యతలు అప్పగించారు.  ఆమెకు హర్యానా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల పార్టీ ఇన్‌ఛార్జి బాధ్యతలను కేటాయించారు. గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న స్మృతి ఇరానీకి రెండు ముఖ్యమైన రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో ఆమె ప్రాధాన్యత మరింత పెరిగినట్లయింది. మరోవైపు, పార్టీలో కీలక వ్యూహకర్తగా పేరుగాంచిన సునీల్ బన్సల్‌కు తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఇన్‌ఛార్జి బాధ్యతలు కేటాయించారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా జాతీయ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్: అర్వింద్ భదౌరియా ఇంచార్జ్‌గా, తమిళనాడు మాజీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ సహ-ఇంచార్జ్‌గా వ్యవహరిస్తారు.ఒడిశా: దగ్గుబాటి పురందేశ్వరి ఇంచార్జ్‌గా, డాక్టర్ స్వదేశ్ సింగ్ సహ-ఇంచార్జ్‌గా నియమితులయ్యారు. తమిళనాడు: రామ్ మాధవ్ ఇంచార్జ్‌గా ఎంపికవ్వగా, కో-ఇంచార్జ్‌లుగా డీకే అరుణ, నిర్మల్ కుమార్ సురాణా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే క్రమంలో మరికొద్ది మంది సీనియర్ నాయకులకు కూడా ముఖ్యమైన రాష్ట్రాల బాధ్యతలు దక్కాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న రామ్ మాధవ్‌కు తమిళనాడు, ఉత్తరాఖండ్ రాష్ట్రాల బాధ్యతలను కేటాయించారు. అలాగే, వినోద్ తావ్డేను ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జిగా, వినయ్ సహస్రబుద్ధేను ఢిల్లీ ఇన్‌ఛార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా మొత్తం 28 రాష్ట్రాలు మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన ఇన్‌ఛార్జీలు, సహ-ఇన్‌ఛార్జీల పూర్తి జాబితాను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసేందుకు, రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ తాజా మార్పులు ఎంతగానో ఉపయోగపడతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.       [ BJP state in charges, Smriti Irani, Sunil Bansal, Telangana BJP, Ram Madhav, BJP news updates, Arvind Bhadauria, Daggubati Purandeswari, DK Aruna,Ram Madhav, Nitin Nabeen ]  
ఏపీ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న విషయంపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు.  రాష్ట్ర రాజకీయాలలో స్థానిక ఎన్నికలపై చర్చ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అక్టోబరా, నవంబరా, లేదా తరువాతా అన్న ఉత్కంఠకు తెరదించుతూ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలోనే అంటే అక్టోబర్ లోనే స్థానిక సమరం ఉంటుందన్న స్పష్టత ఇచ్చారు.  ఎన్నికలు వాయిదా పడతాయంటూ జరుగుతున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదనీ..  ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు అక్కర్లేదని  తేల్చిచెప్పారు. మంత్రులు,  పార్టీ కీలక నేతల ఉన్నతస్థాయి భేటీలో నారా లోకేశ్  స్థానిక ఎన్నికలలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేయాలని, అందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. , క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.  గ్రామీణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి   స్థానిక ఎన్నికలు  కీలకమన్న నారా లోకేష్.. గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా,  పారదర్శకమైన పాలనను అందిస్తూ ప్రజల మధ్యే ఉంటున్న కూటమి శ్రేణులు ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయాలను నమోదు చేయాలని స్పష్టం చేశారు. కేవలం విజయం సాధించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని క్లీన్ స్వీప్ చేయాలని దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో కూటమి అభ్యర్థుల విజయం కోసం నాయకులంతా సమన్వయంతో పనిచేయాలన్నారు.    [Nara Lokesh, AP local body elections, Panchayat elections,  Andhra Pradesh, TDP alliance clean sweep, AP politics,Telugu One]
దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తెలుగుదేశం గూటికి చేరనున్నారా? జగన్ కు పెట్టని కోట లాంటి కడపలో వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే.. వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ సునీతను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దింపేందుకు  నిర్ణయించుకున్నారా? ఈ మేరకు లోకేష్ చేసిన ప్రతిపాదనకు వైఎస్ సునీత ఓకే చెప్పారా? ఈ ప్రశ్నలకు పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.    మంత్రి నారా లోకేష్  స్వయంగా ఈ  ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  వైఎస్ కుటుంబానికి, వైసీపీకి తిరుగులేని పట్టు,  బలం,  ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనే ఆ పార్టీని గట్టి దెబ్బకొట్టాలన్న వ్యూహంతోనే లోకేష్ ఈ ప్రతిపాదన చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి పీక్స్ చేరుతున్న తరుణంలో లోకేష్ చేసినట్లుగా చెబుతున్న ఈ ప్రతిపాదనకు  రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అధికారికంగా ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం ఏదీ బయటకు రాకపోయినా.. పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం వైఎస్ సునీత సైకిలెక్కి జగన్ కు సవాల్ విసరడం దాదాపు ఖాయమైందనే అంటున్నారు.  వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం తర్వాత వైఎస్ సునీత న్యాయం కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణానికి కారణమైన వారిపై రాజకీయంగా, న్యాయపరంగా ఆమె చేసిన పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు రాజకీయ ఆశ్రయం కల్పించడం ద్వారా ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టవచ్చని నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ  భావిస్తున్నాయి.  మరోవైపు, వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందుల ప్రాంతంలో ఇలాంటి పరిణామాలు జరిగితే స్థానిక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సొంత కుటుంబ సభ్యురాలే ప్రత్యర్థి పార్టీ మద్దతుతో బరిలోకి దిగితే అది రాజకీయంగా జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందంటున్నారు. ఏది ఏమైనా సునీత తెలుగుదేశం గూటికి చేరతారా అన్న విషయం ఆమె నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఖరారైనట్లు కాదని పరిశీలకులు అంటున్నారు.  [YS Sunitha, Nara Lokesh, Lingala ZPTC, Kadapa politics, TDP offer, Telugu Desham Party, Kadapa, ZP Chair Person, AP Politics, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దసరా’ వంటి భారీ విజయాన్ని అందించిన ఈ కాంబినేషన్‌ మరోసారి కలిసి పనిచేయడంతో సినిమాపై మొదటి నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో నాని, శ్రీకాంత్ ఓదెలకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా చిరంజీవి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. నాని ఎప్పటికప్పుడు కొత్త కథలు, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కమర్షియల్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక కథలు చేయడానికి కూడా ఆయన ఆసక్తి చూపిస్తుంటారు. అదే తరహాలో ‘దసరా’ సినిమాతో నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ తమలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘ది ప్యారడైజ్’పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి నానిని ఉద్దేశించి ప్రత్యేకంగా ఓ పోస్ట్ పెట్టారు. కొత్తదనాన్ని అన్వేషించడంలో నానికి ఉన్న ఆసక్తి, అంకితభావం, తపన తనను ఎప్పుడూ ఆకట్టుకుంటాయని మెగాస్టార్ పేర్కొన్నారు. ‘దసరా’ సమయంలో నాని, శ్రీకాంత్ ఓదెల చూపించిన ప్యాషన్, పట్టుదలను తాను చూశానని.. ఇప్పుడు అదే జోడి ‘ది ప్యారడైజ్’తో మరో కొత్త ప్రపంచాన్ని సృష్టించడం ఎంతో ఆసక్తిని కలిగిస్తోందని చెప్పారు. అంతేకాదు.. ‘ది ప్యారడైజ్’ను థియేటర్‌లో చూసేందుకు తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో పాటు నిర్మాత సుధాకర్ చెరుకూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, మొత్తం చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు, మైలురాళ్లు నెలకొల్పాలని కోరుకున్నారు. ఇక చిరంజీవి నుంచి ఇలాంటి ప్రశంసలు రావడంతో నాని అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే ‘ది ప్యారడైజ్’కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన కనిపిస్తోంది. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ‘ది ప్యారడైజ్’ విషయానికి వస్తే.. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ తర్వాత ఈ సినిమాపై సహజంగానే ఆసక్తి పెరిగింది. దీనికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించడం, భారీ స్థాయిలో సినిమాను తెరకెక్కించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్, పాటలు సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. ఇదిలా ఉంటే.. నాని, చిరంజీవి మధ్య మరో ఆసక్తికరమైన అనుబంధం కూడా ఉంది. ‘ది ప్యారడైజ్’ తర్వాత నాని నిర్మాతగా వ్యవహరించనున్న సినిమాలో చిరంజీవి హీరోగా నటించబోతున్నారు. ఈ చిత్రానికి కూడా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించనున్నారు. దీంతో నాని నిర్మాతగా, చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా రాబోతున్న ఈ కాంబినేషన్‌పై కూడా ఇప్పటికే ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ‘ది ప్యారడైజ్’తో నాని, శ్రీకాంత్ ఓదెల ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. విడుదలకు ముందే మంచి బజ్‌ తెచ్చుకున్న ఈ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆశీస్సులు అందించడం నాని అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది.     [Nani, Chiranjeevi, The Paradise, Nani The Paradise, Chiranjeevi Wishes Nani, Chiranjeevi Blessings Nani, Nani Srikanth Odela, Srikanth Odela, The Paradise Movie, Nani Latest News, Chiranjeevi Latest News, Nani Chiranjeevi Movie, The Paradise Release, Anirudh Ravichander, Sudhakar Cherukuri, Dasara Nani, Telugu Cinema News, Tollywood Latest News]
సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి.. ఒక్కో సినిమాతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాని. ఆర్టిస్ట్‌గా, హీరోగా ఎదుగుతున్న క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆయన సినిమాకు భారీగా క్రేజ్ ఏర్పడింది. ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా నాని భార్య అంజనా యలవర్తి సోషల్ మీడియాలో చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నాని కెరీర్‌లో ‘ది ప్యారడైజ్’ చాలా ప్రత్యేకమైన సినిమా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఒక రోజు ముందుగానే పెయిడ్ ప్రీమియర్స్‌తో సినిమా సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో తన భర్త ఇన్నేళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ అంజనా ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. నాని సినీ ప్రయాణంలో 2009 సంవత్సరం గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పటికి నాని కెరీర్‌ ఇప్పటిలా లేదు. నాని నటించిన ఓ సినిమాను చూసేందుకు కాలేజీకి డుమ్మా కొట్టి మరీ స్నేహితులతో కలిసి థియేటర్‌కు వెళ్లారట అంజనా. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ సినిమాకు కనీసం మార్నింగ్ షో కూడా లేదని తెలిసిందట. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోకు సినిమా విడుదల చేయించుకోవడం కూడా ఎంత కష్టమో అప్పుడు తనకు అర్థమైందని ఆమె గుర్తుచేసుకున్నారు. ఆ రోజుతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నాని సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కనిపిస్తోంది. ‘ది ప్యారడైజ్’ కోసం థియేటర్లకు ప్రేక్షకులు వస్తున్న తీరు చూస్తుంటే.. ఇన్నేళ్లుగా నాని ఒక్కో సినిమాతో సంపాదించుకున్న నమ్మకం ఎంత పెద్దదో అర్థమవుతోందని అంజనా పేర్కొన్నారు. ఈ ప్రయాణాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా తాను ఎంతో ఎమోషనల్‌గా, కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నానని తెలిపారు. నాని చేసిన ప్రతి సినిమాను తన బిడ్డలాగే చూసేవారని కూడా అంజనా చెప్పారు. కొన్ని సినిమాలు నెమ్మదిగా నడిచాయని, మరికొన్ని వేగంగా పరిగెత్తాయని.. ఇంకొన్ని తడబడినా.. ఏ సినిమా విషయంలోనూ నాని తన ప్రేమను తగ్గించలేదని ఆమె చెప్పుకొచ్చారు. ప్రతి సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని, దాన్ని ఒక బిడ్డలా భావించి ముందుకు తీసుకెళ్లేవారని వివరించారు. ఇక ‘ది ప్యారడైజ్’ విషయంలోనూ అదే భావనను వ్యక్తం చేశారు అంజనా. సినిమా ఇప్పుడు తన తొలి అడుగులు వేయబోతోందని, ఏం జరిగినా అంతా మంచే జరుగుతుందని భర్తకు ధైర్యం చెప్పారు. ‘‘మేమంతా నీకు అండగా ఉన్నాం’’ అనే భావనతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ నాని అభిమానులను కూడా ఆకట్టుకుంటోంది. నాని విషయానికి వస్తే.. ఆర్జేగా పనిచేసిన ఆయన ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘అలా మొదలైంది’, ‘పిల్ల జమీందార్’, ‘ఈగ’, ‘జెర్సీ’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మధ్యలో తమిళంలోనూ సినిమాలు చేసినా.. తెలుగులోనే ఎక్కువగా సక్సెస్ అందుకున్నారు. 2020లో వచ్చిన ‘V’ తర్వాత యాక్షన్, థ్రిల్లర్ కథల వైపు కూడా అడుగులు వేశారు. ఇప్పుడు ‘హిట్: ది థర్డ్ కేస్’ తర్వాత ‘ది ప్యారడైజ్’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక నాని, అంజనా ప్రేమించుకుని 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అర్జున్ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు నాని సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను చూస్తూ.. తన భర్త ఇంతదూరం రావడానికి పట్టిన సమయాన్ని, చేసిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ అంజనా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2009లో మార్నింగ్ షో కూడా లేని స్థాయి నుంచి.. ఇప్పుడు తన సినిమా కోసం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే స్థాయికి నాని ఎదిగిన ప్రయాణానికి ఈ పోస్ట్ ఓ చిన్న గుర్తుగా నిలిచింది.     [Nani, Nani Wife Anjana, Anjana Yelavarthy, Nani Emotional Post, Nani The Paradise, The Paradise Movie, Nani Career Journey, Nani Wife Emotional Post, Natural Star Nani, The Paradise Release, Nani 2009 Movie, Nani Latest News, Srikanth Odela, The Paradise Movie Release, Nani Anjana Yelavarthy]
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘OM’. ‘అమరన్’ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ముందుగా ప్రకటించిన ప్రకారం అక్టోబర్ 16న ‘OM’ థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే కొద్ది రోజులుగా సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ధనుష్ స్వయంగా దీనిపై అధికారిక ప్రకటన చేశారు. ‘OM’ సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయడం లేదని ధనుష్ వెల్లడించారు. ఇందుకు ప్రధాన కారణం సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’. ఈ సినిమా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే ‘జైలర్ 2’ విడుదలైన మరుసటి రోజే ‘OM’ రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రెండు భారీ చిత్రాల మధ్య పోటీని నివారించేందుకు తమ సినిమాను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు ధనుష్ తెలిపారు. రజినీకాంత్‌పై తనకున్న గౌరవాన్ని కూడా ధనుష్ స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా తామంతా గౌరవించే, అభిమానించే సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా తమ చిత్రానికి ఒక్క రోజు ముందు వస్తున్నందున, ఆయన పట్ల ఉన్న గౌరవంతో ‘OM’ను మరో తేదీకి మార్చుతున్నట్లు చెప్పారు. సినిమా విడుదల తేదీని మార్చడం అంత సులభమైన నిర్ణయం కాదని, అయినప్పటికీ పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ఏడాది దీపావళి సీజన్‌లో కూడా ‘OM’ను విడుదల చేయడం లేదని ధనుష్ స్పష్టం చేశారు. సూర్య నటిస్తున్న ‘Scene’ సినిమాను ఇప్పటికే దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో, వారి రిలీజ్ డేట్‌ను గౌరవిస్తూ తాము కూడా అదే సమయంలో తమ సినిమాను తీసుకురావడం లేదని తెలిపారు. పెద్ద సినిమాల విషయంలో పరస్పర అవగాహన, ఒకరి నిర్ణయాలను మరొకరు గౌరవించుకోవడం అవసరమని ధనుష్ అభిప్రాయపడ్డారు. ఇక ‘OM’ విషయానికి వస్తే.. ధనుష్‌తో పాటు మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల, నాజర్, నసీరుద్దీన్ షా తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతున్న ప్రాజెక్ట్‌లో తొలి భాగంగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ‘OM’ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే కొత్త తేదీని వెల్లడిస్తామని ధనుష్ తెలిపారు. దీంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ. హీరోగా ఆయన చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ తాజాగా ఖరారైంది. ము. మారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్న కుట్టి’ తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే కథతో రూపొందుతోంది. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఉంటూనే ఉత్కంఠ కలిగించే అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 16న ‘నాన్న కుట్టి’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇదే సినిమాకు తమిళంలో ‘అప్ప కుట్టి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇది కూడా చదవండి:  టాప్‌లో నాని: సూపర్ స్టార్ రికార్డును సమం చేసిన న్యాచురల్ స్టార్.! ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీకి జోడీగా ప్రీతి అస్రాని నటిస్తున్నారు. లిథన్య కీలక పాత్రలో కనిపించనున్నారు. భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, లిస్సీ ఆంటోని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మరోవైపు ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ మరోసారి తన మల్టీటాలెంట్ చూపించారు. నటించడంతో పాటు సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాదు ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా, ఏ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలను యాక్షన్ అంశాలతో కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. హృద్యమైన సంగీతం, ఎమోషనల్ సన్నివేశాలు, ఇంటెన్స్ డ్రామాతో ‘నాన్న కుట్టి’పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మీకు నచ్చవచ్చు:  సుమలతకు షాక్ ఇచ్చిన ఫిల్మ్ ఫెడ‌రేష‌న్‌.. అసోసియేష‌న్‌లో కీల‌క ప‌రిణామం.! మండాడి: నిన్న రజినీకాంత్.. నేడు కమల్ హాసన్.!     [Vijay Antony Nanna Kutti, Nanna Kutti Movie, Vijay Antony Nanna Kutti Release Date, Nanna Kutti Telugu Movie, Vijay Antony New Movie, Appa Kutty Movie, Vijay Antony Appa Kutty, Preethi Asrani, Lithanya, Mu Maran, Nanna Kutti October 16 Release]
ఓటీటీలో హారర్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. కథలో ట్విస్టులు, భయపెట్టే సన్నివేశాలతో ప్రేక్షకులను చివరి వరకు కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటి జోనర్‌లో తమిళంలో తెరకెక్కిన సినిమా ‘డార్క్’. అజయ్ కార్తీ, అంచనా నేత్రున్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కల్యాణ్ కె. జగన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికి వస్తే.. విఘ్నేశ్ ఉద్యోగం కోసం చెన్నైకి వస్తాడు. తక్కువ అద్దెకు ఇల్లు కావడంతో ఓ ఇంటి పై పోర్షన్‌లో ఉండేందుకు ఒప్పుకుంటాడు. అయితే ఆ ఇంటి గురించి యజమాని కరుణాకర్ చెప్పే విషయం అతడిని ఆలోచనలో పడేస్తుంది. గతంలో అదే పోర్షన్‌లో ముగ్గురు యువకులు ఉండేవారు. వారిలో జీవా అనే వ్యక్తి తన ఇద్దరు స్నేహితులను హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని కరుణాకర్ చెబుతాడు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన కొందరు కూడా దెయ్యాల భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తుంది. అయినప్పటికీ తక్కువ అద్దె కావడంతో విఘ్నేశ్ అక్కడే ఉండాలని నిర్ణయించుకుంటాడు. ఇక రాత్రి సమయాల్లో ఇంట్లో వింత సంఘటనలు మొదలవుతాయి. ఎవరూ ఆన్ చేయకుండానే టీవీ ఆన్ కావడం, వస్తువులు వాటంతట అవే కదలడం వంటి ఘటనలు అతడిని భయపెడతాయి. అసలు ఆ ముగ్గురు యువకులు ఎందుకు చనిపోయారు? ఇంట్లో నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? లేక విఘ్నేశ్ అనుభవిస్తున్నదంతా అతడి మానసిక భ్రమేనా? అనేదే కథలో ఆసక్తికరమైన అంశం. దర్శకుడు దెయ్యాన్ని నేరుగా చూపించకుండా హీరో భయాన్ని ప్రేక్షకులకు కూడా అనుభూతి కలిగించేలా కథను నడిపించే ప్రయత్నం చేశారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం ఇబ్బంది పెడుతుంది. ముగ్గురు యువకుల మరణం వెనుక అసలు కారణం ఏమిటనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రేక్షకుడు ముందుకు వెళతాడు. కానీ కొంతవరకు ఊహించగలిగే విధంగా ఫ్లాష్‌బ్యాక్ రావడంతో అప్పటివరకు ఉన్న ఆసక్తి తగ్గిపోతుంది. అలాగే సినిమాలో దెయ్యాలున్నాయా? లేక ఇదంతా సైకలాజికల్ ఎఫెక్టా? అనే అయోమయాన్ని క్రియేట్ చేయడానికి దర్శకుడు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం పూర్తిస్థాయిలో వర్కౌట్ కాలేదనే అభిప్రాయం కలుగుతుంది. సాధారణంగా హారర్ సినిమాలకు బలం చేకూర్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. నటీనటుల్లో హీరో పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎక్కువ భాగం కథ నాలుగు గోడల మధ్యే సాగుతుంది. భయపడుతున్న హీరోను చూపించడం ద్వారా ప్రేక్షకులను భయపెట్టాలని దర్శకుడు ప్రయత్నించినా, ఆ ఎఫెక్ట్ పూర్తిగా రాలేదు. చివర్లో దెయ్యం కనిపించినా పెద్దగా భయపెట్టే స్థాయిలో లేకపోవడం మైనస్‌గా మారింది.       [Dark Movie Review, Dark Telugu Movie Review, Dark OTT Movie Review, Dark Amazon Prime Movie, Dark Movie Review Telugu, Ajay Karthi Dark Movie, Anchana Nethrun, Kalyan K Jegan, Tamil Horror Thriller, Amazon Prime Telugu Movies]
టాలీవుడ్ సినిమాలకు అమెరికాలో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అక్కడి బాక్సాఫీస్ లెక్కలపై కూడా ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నాని మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అమెరికాలో ఒక సినిమాకు $1 మిలియన్‌కు పైగా వసూళ్లు రావడం అనేది అక్కడి మార్కెట్‌లో మంచి మైలురాయిగా భావిస్తారు. ఇప్పటివరకు ఈ లెక్కల్లో మహేష్ బాబు 12 సినిమాలతో టాప్‌లో ఉన్నాడు. తాజాగా ‘ది ప్యారడైజ్’తో నాని కూడా 12 సినిమాల మార్క్‌ను అందుకున్నాడు. దీంతో అమెరికాలో $1 మిలియన్ క్లబ్‌లో అత్యధిక సినిమాలు ఉన్న టాలీవుడ్ హీరోల జాబితాలో నాని.. మహేష్ బాబుతో కలిసి టాప్ ప్లేస్‌లో నిలిచాడు.  ఈ లిస్టులో మహేష్ బాబు – 12 సినిమాలు, నాని – 12 సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఎన్టీఆర్ – 9 సినిమాలు, పవన్ కళ్యాణ్ – 9 సినిమాలు ఉండగా.. ప్రభాస్ – 8 సినిమాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్' ఫస్ట్ రివ్యూ.. అసలు ఈ కాకుల కథేంటి.? ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నాని ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన సినిమాల మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు వంటి స్టార్‌తో కలిసి ఈ లిస్టులో టాప్‌లో నిలవడం.. అతని ఓవర్సీస్ మార్కెట్‌కు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది. ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండగా.. అమెరికాలో కూడా ఆ క్రేజ్ కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. మరి ఈ సినిమా రన్ పూర్తయ్యే సమయానికి నాని ఈ లెక్కలను ఇంకెంత పెంచుతాడో చూడాలి. మీకు నచ్చవచ్చు: మోహన్ బాబు విలనిజం: మళ్లీ అదే రేంజ్‌లో ‘ది ప్యారడైజ్’.! రాయలసీమ రామన్న చౌదరి.. మోహన్ బాబు ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.!       [The Paradise Movie, Nani Paradise, Nani Vs Mahesh Babu, Nani 1 Million Films, Paradise USA, Nani USA Box Office, Natural Star Nani, Telugu Film News, Telugu News]
The dispute surrounding the TFTDDA - Telugu Film and TV Dancers and Dance Directors Association has taken a fresh turn after months of tensions over the functioning of the union. The issue had earlier escalated between Jani Master, his wife Sumalatha and the Film Federation, with Jani Master even approaching the Telugu Film Chamber seeking intervention. The Federation later issued show-cause notices and a non-cooperation order against the duo. The non-cooperation action was eventually withdrawn after Jani Master appeared before the Federation and submitted his explanation. Chiranjeevi and Balakrishna also intervened in the matter, following which Jani Master apologised for his remarks and called for unity among the members. Now, the issue has returned to the spotlight with the Film Federation taking a fresh decision on the association’s leadership. In a meeting attended by 225 dancers, Sumalatha received the support of 11 members, while 214 members backed choreographer Raghu Master. Following the meeting, the Federation dissolved the existing executive committee headed by Sumalatha. Fresh elections for the Telugu Film and TV Dancers and Dance Directors Association have now been announced for October 11. The development marks another major turn in the prolonged dispute over the association’s leadership and functioning.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.  
టాలీవుడ్ ఫిల్మ్ ఫెడరేషన్ పరిధిలోని తెలుగు సినీ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షతన ఉన్న కార్యవర్గాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ రద్దు చేసింది. అసోసియేషన్‌లో కొంతకాలంగా కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నిర్వహించిన ఈ సమావేశానికి సుమలతతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు. మొత్తం 225 మంది డ్యాన్సర్లు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు మీడియా సంస్థ‌లు కథనాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా అసోసియేషన్‌లో నెలకొన్న పరిస్థితులు, సభ్యుల అభిప్రాయాలు, తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఇది కూడా చదవండి: బాక్సాఫీస్ క్లాష్: రాయుడు ముందు నిలబడలేకపోయిన బాస్.! ఈ సమావేశంలో సభ్యుల మద్దతు ఎవరికి ఉందనే విషయాన్ని కూడా తెలుసుకున్నారు. హాజరైన వారిలో సుమలతకు 11 మంది మద్దతు తెలిపినట్లు వెల్లడైంది. మరోవైపు రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు ప్రకటించినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశంలో పేర్కొంది. ఈ పరిణామాల తర్వాత సుమలత ఆధ్వర్యంలోని ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేయాలని ఫెడరేషన్ నిర్ణయించింది. దీంతో తెలుగు సినీ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త కార్యవర్గం ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేసిన నేపథ్యంలో తాజాగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించింది. వచ్చే నెల అక్టోబర్ 11న డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల ద్వారా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. అయితే ఈ పరిణామం ఒక్కరోజులో జరిగినది కాదు. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొంతకాలంగా అంతర్గత విభేదాలు, కార్యవర్గం పనితీరుపై చర్చలు జరుగుతున్నట్లు పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ ఫెడరేషన్ జోక్యం చేసుకుని సభ్యులతో సమావేశం నిర్వహించింది. తాజాగా జరిగిన భేటీలో సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ప్రస్తుత కార్యవర్గాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి.. సుమలత అధ్యక్షతన కొనసాగుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ కార్యవర్గం రద్దు కావడంతో టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో మరోసారి ఎన్నికల సందడి మొదలుకానుంది. అక్టోబర్ 11న జరగనున్న ఎన్నికల్లో కొత్త కార్యవర్గం కొలువుదీరనుంది. దీంతో రాబోయే ఎన్నికలపై డ్యాన్సర్స్ అసోసియేషన్ సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. మీకు నచ్చవచ్చు:  13 ఏళ్ల బంధంపై విడాకుల రూమర్స్.. ఎంత‌వ‌ర‌కు నిజం, అసలేం జరిగింది.? 30 నుంచి 28కి.. జీన్స్ సైజ్ చెప్పి సర్‌ప్రైజ్ చేసిన నివేదా.! 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తప్పక చేయాల్సిన ఆర్థిక ప్లానింగ్ .! ఒక స్త్రీ జీవితంలో తల్లి కావడం అనేది అత్యంత మధురమైన, భావోద్వేగపూరితమైన అనుభూతి. ఇంటికి చిన్నారి రాకతో కుటుంబంలో సంతోషాలు పదింతలు అవుతాయి. అయితే ఈ కొత్త ప్రయాణం కేవలం ఆనందాన్ని మాత్రమే కాదు, అనేక బాధ్యతలను కూడా తీసుకొస్తుంది. బిడ్డ ఆరోగ్య సంరక్షణ, సరైన పెంపకం, నాణ్యమైన విద్య, వారి భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడం వంటివన్నీ తల్లిదండ్రుల ముందు నిలిచే ప్రధాన బాధ్యతలు. ఈ క్రమంలో ముఖ్యంగా కొత్తగా తల్లి అయినవారు లేదా తల్లి కాబోతున్నవారు సరైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం. సమయానికి తీసుకునే సరైన  నిర్ణయాలు పిల్లల భవిష్యత్తును బంగారు బాటగా మారుస్తాయి. ప్రతి కొత్త తల్లి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఆర్థిక సూత్రాలు ఏంటో తెలుసుకుంటే.. ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఇన్సూరెన్స్.. ఆర్థిక ప్రణాళికలో వేసే మొదటి అడుగు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించడం కష్టం. వైద్య అత్యవసర పరిస్థితులు వచ్చినా లేదా ఉద్యోగంలో ఊహించని మార్పులు ఎదురైనా కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండటానికి కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బును అత్యవసర నిధిగా పక్కన పెట్టాలి. దీనివల్ల ఇతరులపై ఆధారపడే పరిస్థితి రాదు.  దీంతోపాటు తల్లి, బిడ్డ ఇద్దరికీ తగిన ఆరోగ్య బీమా రక్షణ ఉండటం చాలా కీలకం. ఒకవేళ ఇప్పటికే ఆరోగ్య బీమా పాలసీ ఉంటే, అందులో కొత్తగా పుట్టిన బిడ్డ పేరును వీలైనంత త్వరగా చేర్పించడం మర్చిపోకూడదు. పొదుపు అలవాటు , పెట్టుబడులు.. సాధారణంగా వచ్చే ఆదాయాన్ని పూర్తిగా ఖర్చు చేసే అలవాటు ఉంటే, తల్లి అయిన తర్వాత దానిని వెంటనే మార్చుకోవాలి. ఆదాయంలో కనీసం పాతిక శాతాన్ని పొదుపు చేయడం ఉత్తమమైన పద్ధతి. ఈ పొదుపు కేవలం బ్యాంకు ఖాతాలో ఉంచడమే కాకుండా, మంచి అవగాహనతో సరైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడం వల్ల చక్రవడ్డీ   లభిస్తుంది. కాలక్రమేణా ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని మంచి రాబడి రావడానికి, ఆర్థిక స్థిరత్వం సాధించడానికి ఈ అలవాటు ఎంతగానో తోడ్పడుతుంది. ఖర్చుల నిర్వహణ , బడ్జెట్.. పాప లేదా బాబు పుట్టిన తర్వాత ఇంట్లో ఖర్చులు అనుకోకుండా పెరుగుతాయి. అందుకే ప్రతినెలా వచ్చే ఆదాయం, జరిగే ఖర్చులను ఒక క్రమపద్ధతిలో నమోదు చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకు దుస్తులు, బొమ్మలు లేదా ఇతర అనవసర విషయాలపై ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంటే వాటిని గుర్తించి తగ్గించుకోవాలి. ప్రణాళికాబద్ధంగా బడ్జెట్ కేటాయించుకుని అనవసరమైన ఖర్చులను అరికడితే, ఆ డబ్బు పొదుపుగా మారి భవిష్యత్తులో బిడ్డ అవసరాలకు ఉపయోగపడుతుంది. చిన్న చిన్న టార్గెట్స్.. భవిష్యత్తు అవసరాలను ఒకేసారి పెద్ద భారంగా భావించకుండా ఉండటానికి ఆర్థిక ప్రణాళికను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. ఉదాహరణకు పిల్లలను స్కూల్ లో చేర్పించడం, సంవత్సరానికి సరిపడా  వైద్య ఖర్చులు, ప్రతి సంవత్సరం చేయాల్సిన పొదుపు వంటి వాటికి వేర్వేరుగా చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇలా చేయడం వల్ల ప్రణాళిక స్పష్టంగా ఉంటుంది, మనం ఎంతవరకు చేరుకున్నామో సులభంగా అర్థమవుతుంది. పెద్ద ఖర్చులను చిన్న భాగాలుగా విభజించి ప్రణాళిక వేసుకోవడం వల్ల ఒత్తిడి లేకుండా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చు. జీవిత భాగస్వామితో కలిసి ఆలోచించడం.. ఆర్థిక ప్రణాళిక అనేది ఒక్కరి బాధ్యత మాత్రమే కాదు. తల్లిదండ్రులిద్దరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ప్రతి నెల బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, పొదుపు చేయడం, పిల్లల చదువుల ఖర్చులు వంటి ప్రతి విషయంపై జీవిత భాగస్వామితో కలిసి చర్చించాలి. దీనివల్ల ఇద్దరికీ కుటుంబ బాధ్యతలపై స్పష్టత వస్తుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం తేలికవుతుంది. ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తే కుటుంబానికి బలమైన ఆర్థిక పునాది ఏర్పడి, బిడ్డ భవిష్యత్తుకు పూర్తి భద్రత లభిస్తుంది.                       *రూపశ్రీ.
నిద్ర పట్టడం లేదా బెడ్‌పై ఈ వస్తువులు అస్సలు పెట్టకండి! రోజంతా అలసిపోయినా రాత్రి పడుకున్న తర్వాత సరిగ్గా నిద్ర పట్టడం లేదా? తరచూ నిద్ర మధ్యలో మెలకువ రావడం, నిద్ర సరిగా లేకపోవడం వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడుతున్నాయి. నిద్రలేమి వల్ల మరుసటి రోజు అలసట, చిరాకు, ఏకాగ్రత తగ్గడం వంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మంచి నిద్ర కోసం మనం తీసుకునే ఆహారం, జీవనశైలి, నిద్రించే సమయం మాత్రమే కాకుండా పడకగదిలోని వాతావరణం కూడా ముఖ్యమని వాస్తు నిపుణుడు దంతూరి పండరినాథ్ గారు వివరిస్తున్నారు. ముఖ్యంగా బెడ్‌పై లేదా పడక దగ్గర ఎలాంటి వస్తువులు ఉంచకూడదు?అవి నిద్రకు ఎలా ఆటంకం కలిగిస్తాయి? నిద్రలేమికి కారణమయ్యే అంశాలు ఏమిటి? మంచి నిద్ర కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. నిద్ర సరిగా పట్టకపోవడం, తరచూ నిద్రకు ఆటంకం కలగడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ వీడియోలోని సూచనలను తెలుసుకోండి. అలాగే నిద్ర సమస్యలు నిరంతరం కొనసాగితే వైద్య నిపుణుల సలహా తీసుకోవడం కూడా ముఖ్యం. మంచి నిద్ర కోసం బెడ్‌పై ఉంచకూడని వస్తువులు, నిద్రలేమికి కారణాలు, పాటించాల్సిన జాగ్రత్తలు  తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
మన వంటింట్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయల్లో బంగాళాదుంప (ఆలూ) మొదటి వరుసలో ఉంటుంది. వేపుడు, కుర్మా, ఫ్రైస్ లేదా సమోసాలు.. వంటకం ఏదైనా సరే ఆలూ ఉంటే ఆ రుచే వేరు. అయితే ఇల్లాళ్లకు, వంట ప్రియులకు నిత్యం ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ఏమిటంటే.. బంగాళాదుంపల పొట్టు తీసి ముక్కలుగా కోసి పక్కన పెట్టగానే అవి కొద్ది నిమిషాల్లోనే నల్లగా లేదా గోధుమ రంగులోకి మారిపోతుంటాయి. అలా రంగు మారిన దుంపలను చూస్తే వంట చేయాలనే ఉత్సాహం తగ్గడమే కాకుండా, అవి పాడైపోయాయేమోననే అనుమానం కూడా వస్తుంది. సాధారణంగా ఉదయం పూట ఆఫీసులకు, పిల్లల స్కూల్ బాక్సులకు త్వరగా వంట పూర్తి చేయాలని ముందుగానే ఆలూ ముక్కలను కోసి పెట్టుకునే వారికి ఈ సమస్య మరింత చిరాకు కలిగిస్తుంది. అసలు బంగాళాదుంప ముక్కలు అంత వేగంగా ఎందుకు నల్లగా మారతాయి? దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి? మరియు అలా మారకుండా ఎల్లప్పుడూ తెల్లగా, ఫ్రెష్‌గా ఉంచడానికి ఉపయోగపడే కిచెన్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బంగాళాదుంపలు నల్లగా మారడానికి ప్రధాన కారణం  ఎంజైమాటిక్ బ్రౌనింగ్  (Enzymatic Browning) అనే సహజమైన రసాయన చర్య. బంగాళాదుంపల్లో పాలీఫెనాల్ ఆక్సిడేస్ (Polyphenol Oxidase) అనే ప్రత్యేకమైన ఎంజైమ్‌తో పాటు ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. మనం దుంపను చాకుతో కోసినప్పుడు, దానిలోని కణాలు దెబ్బతిని లోపలి భాగం నేరుగా గాలిలోని ఆక్సిజన్‌తో స్పర్శలోకి వస్తుంది. ఈ ఆక్సిజన్, ఎంజైమ్‌లతో చర్య జరపడం వల్ల మెలనిన్ (Melanin) అనే నల్లటి వర్ణద్రవ్యం ఉత్పత్తి అవుతుంది. ఇదే ఆలూ ముక్కలు రంగు మారడానికి అసలు కారణం. ఈ మార్పు వల్ల రుచిలో పెద్దగా తేడా రాకపోయినా, చూడటానికి అస్సలు బాగుండవు. పైగా ఇలా గాలికి ఎక్కువసేపు ఉంచడం వల్ల అందులోని కొన్ని నీటిలో కరిగే పోషకాలు కూడా నశించే అవకాశం ఉంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి మన వంటింట్లోనే దొరికే కొన్ని సులువైన పదార్థాలతో అద్భుతమైన పరిష్కారాలు కనుగొనవచ్చు. మొదటిది మరియు అత్యంత ప్రభావవంతమైన పద్ధతి  చల్లని నీటి చిట్కా . బంగాళాదుంపలను కోసిన వెంటనే గాలి తగలకుండా ఐస్ వాటర్ లేదా చల్లని నీళ్లు ఉన్న గిన్నెలో మునిగేలా వేయాలి. నీరు ఆక్సిజన్‌కు, ఆలూ ముక్కలకు మధ్య ఒక కవచంలా పనిచేసి ఆక్సీకరణ ప్రక్రియను అడ్డుకుంటుంది. నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టడం వల్ల ముక్కలలో ఉండే అదనపు స్టార్చ్ బయటకు వచ్చి, ఫ్రైస్ చేసినప్పుడు అవి మరింత క్రిస్పీగా వస్తాయి. ఇంకా ఎక్కువ సమయం అంటే 4 నుంచి 5 గంటల పాటు నిల్వ ఉంచాలనుకుంటే, ఆ నీటిలో అర టీస్పూన్ నిమ్మరసం లేదా కొద్దిగా తెల్ల వెనిగర్ (White Vinegar) కలపాలి. నిమ్మరసంలోని విటమిన్ సి (ఆస్కార్బిక్ యాసిడ్) మరియు వెనిగర్‌లోని అసిడిటీ ఎంజైమ్‌ల పనితీరును పూర్తిగా నిరోధించి ముక్కలు గంటల తరబడి తెల్లగా మెరిసేలా చేస్తాయి. మరొక అద్భుతమైన మార్గం  ఉప్పు నీటి శుద్ధి . ఒక లీటర్ నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు కలిపి అందులో కోసిన బంగాళాదుంప ముక్కలను వేసి ఉంచడం వల్ల అవి రంగు మారవు. ఉప్పు నీరు ఎంజైమాటిక్ చర్యను మందగించేలా చేస్తుంది. అలాగే, వంటను మరుసటి రోజుకి ప్లాన్ చేసుకుంటుంటే, ముక్కలను నీటిలో వేసి గాలి చొరబడని ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఉంచి ఫ్రిజ్‌లో పెడితే 24 గంటల పాటు అవి ఏమాత్రం రంగు మారకుండా తాజాగా ఉంటాయి. ఒకవేళ మీరు ముక్కలను నీటిలో వేయకూడదు అనుకుంటే, వాటిపై కొద్దిగా వంటనూనె (Cooking Oil) రాసి గాలి తగలకుండా ఉంచవచ్చు. ఈ చిన్న చిన్న కిచెన్ హాక్స్ పాటించడం వల్ల వంటగదిలో మీ సమయం ఆదా అవ్వడమే కాకుండా, బంగాళాదుంపలతో చేసే ప్రతి వంటకం ఎంతో రుచిగా, ఆకర్షణీయంగా మారుతుంది.     [ Potatoes, Potato Browning, Enzymatic Browning, Polyphenol Oxidase, Potato Storage, Kitchen Hacks, Prevent Potato Browning, Cold Water Soak, Lemon Juice, White Vinegar ]
వినాయక చవితి పూజలో వెలగపండు ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో  ప్రత్యేకంగా కనిపించే వెలగపండును కేవలం నైవేద్యానికే పరిమితం చేస్తుంటారు. చాలా ఇళ్లలో వెలగపండు నైవేధ్యంగా పెట్టాక వాటిని వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం లేదా పడేయడం లేదా వాటిని అలాగే వదిలేయడం చేస్తుంటారు. కానీ ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వెలగ పండుకు  చాలా ప్రాధాన్యత ఉంది. పైకి గట్టి పెంకుతో సాధారణంగా కనిపించినప్పటికీ, లోపల ఉన్న గుజ్జు అమృతంతో సమానమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ పండు కలిగించే ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థ.. వెలగపండులో   ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే అందులో ఉండే  టానిన్లు జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడేవారికి ఈ పండు సహజమైన ఔషధంగా తోడ్పడుతుంది. కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను నశింపజేసి ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తి  విటమిన్ సీ, విటమిన్ ఏ , వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు వెలగపండులో  పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వెలగపండు పాత్ర ప్రశంసనీయం. క్రమంతప్పకుండా పరిమితంగా తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం.. కాలేయం, మూత్రపిండాల రక్షణకు వెలగపండు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడి, దాని పనితీరును సమర్థవంతంగా ఉంచుతుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడి మూత్రసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. డయాబెటిస్ .. డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి వెలగపండు మంచి ఆహారం. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. శరీరం శక్తి కోల్పోకుండా, తక్షణ శక్తిని అందించడంలో దీనిలోని పోషకాలు తోడ్పడతాయి. మహిళల ఆరోగ్యానికి.. మహిళల ఆరోగ్యానికి కూడా వెలగపండు చాలా మేలు చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, అలాగే పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తి పెరగడంలో వెలగపండు గుజ్జు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి ఇందులోని యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి. వెలగపండును గుజ్జు రూపంలో నేరుగా లేదా కొద్దిగా బెల్లం లేదా తేనె కలిపి తీసుకోవచ్చు.  వెలగపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఏ ఆహారమైనా పరిమితికి మించి తీసుకుంటే సమస్యలు రావచ్చు. అతిగా తింటే కడుపునొప్పి లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, సరైన పరిమాణంలో తింటూ వెలగపండు నుంచి ఆరోగ్య లాభాలను పొందడం మంచిది.                   *రూపశ్రీ.  
రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు ఫోన్ చూడటం, ఆ తర్వాత దానిని దిండు కింద లేదా తలకు దగ్గర్లో  పెట్టుకుని నిద్రపోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పొద్దున్నే అలారం వినపడటం సులువవుతుందని కొందరు, అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఎత్తవచ్చని మరికొందరు ఇలా చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై, నిద్ర నాణ్యతపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో తెలిస్తే ఖచ్చితంగా దిగ్భ్రాంతి చెందుతారు. ప్రశాంతమైన నిద్రను దూరం చేయడమే కాకుండా, శరీరానికి ప్రమాదకరమైన సమస్యలను కొనితెచ్చే ఈ అలవాటు గురించి ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. దిండు కింద ఫోన్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదాలు,  ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలుసుకుంటే.. మన శరీరంలో నిద్రను నియంత్రించడానికి మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళ చీకటి పడినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ నుండి వచ్చే నీలి రంగు వెలుతురు (బ్లూ లైట్) మెలాటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫోన్ దిండు కింద ఉన్నప్పుడు, తరచుగా వచ్చే నోటిఫికేషన్లు, రింగ్ టోన్లు లేదా లైట్లు మన గాఢ నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల పొద్దున్నే లేచినా అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తున్నప్పుడు , నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం వెతుకుతున్నప్పుడు   రేడియేషన్ బయటకు వస్తుంది. ప్రతిరోజూ రాత్రి పూట ఎనిమిది గంటల పాటు ఫోన్‌ను తలకు అతి సమీపంలో ఉంచుకోవడం వల్ల ఈ రేడియేషన్ ప్రభావం నేరుగా మెదడుపై పడే అవకాశం ఉంటుందని  పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా యాప్ నడుస్తున్నప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. ఫోన్‌ను దిండు కింద పెట్టినప్పుడు ఆ వేడి బయటకు వెళ్ళడానికి దారి ఉండదు. దిండు, పరుపు వేడిని పట్టి ఉంచుతాయి. దీనివల్ల ఫోన్ తీవ్రంగా వేడెక్కి బ్యాటరీ పేలిపోవడం లేదా పరుపుకు నిప్పు అంటుకోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిద్రలేమి వల్ల కేవలం ఉదయం అలసట మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, మధుమేహం, బరువు పెరగడం , గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు జ్ఞాపకశక్తి, పనిలో సామర్థ్యం తగ్గుతాయి. ఈ  అలవాటు నుంచి బయటపడటానికి కొన్ని సులువైన మార్గాలు: నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను  మంచానికి కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరంలో ఉంచడం మంచిది. అలారం కోసం ఫోన్ వాడేవారైతే, దానికి బదులుగా ఒక సాధారణ టేబుల్ క్లాక్ లేదా అలారం గడియారాన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. నిద్రపోవడానికి అరగంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేసి, వైఫై లేదా మొబైల్ డేటాను ఆపివేయడం మంచిది. ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల  ఇలా చేస్తే నిద్ర నాణ్యత పెరగడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఎవరిని వారు  కాపాడుకోవచ్చు.                     *రూపశ్రీ.