విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు, సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ. హీరోగా ఆయన చేసే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. విజయ్ ఆంటోనీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ తాజాగా ఖరారైంది.
ము. మారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నాన్న కుట్టి’ తండ్రీకూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే కథతో రూపొందుతోంది. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాను మేళవిస్తూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. కథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఉంటూనే ఉత్కంఠ కలిగించే అంశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. అక్టోబర్ 16న ‘నాన్న కుట్టి’ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇదే సినిమాకు తమిళంలో ‘అప్ప కుట్టి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ఇది కూడా చదవండి:
| టాప్‌లో నాని: సూపర్ స్టార్ రికార్డును సమం చేసిన న్యాచురల్ స్టార్.! |
ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీకి జోడీగా ప్రీతి అస్రాని నటిస్తున్నారు. లిథన్య కీలక పాత్రలో కనిపించనున్నారు. భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, లిస్సీ ఆంటోని తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
మరోవైపు ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ మరోసారి తన మల్టీటాలెంట్ చూపించారు. నటించడంతో పాటు సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. అంతేకాదు ఎడిటింగ్ బాధ్యతలను కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ అందించగా, ఏ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు చేపట్టారు.
తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధం, భావోద్వేగాలను యాక్షన్ అంశాలతో కలిపి తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. హృద్యమైన సంగీతం, ఎమోషనల్ సన్నివేశాలు, ఇంటెన్స్ డ్రామాతో ‘నాన్న కుట్టి’పై ఆసక్తి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చవచ్చు:
|
సుమలతకు షాక్ ఇచ్చిన ఫిల్మ్ ఫెడరేషన్.. అసోసియేషన్‌లో కీలక పరిణామం.! |
[Vijay Antony Nanna Kutti, Nanna Kutti Movie, Vijay Antony Nanna Kutti Release Date, Nanna Kutti Telugu Movie, Vijay Antony New Movie, Appa Kutty Movie, Vijay Antony Appa Kutty, Preethi Asrani, Lithanya, Mu Maran, Nanna Kutti October 16 Release]




