Home

»

Latest News

టాప్‌లో నాని: సూపర్ స్టార్ రికార్డును సమం చేసిన న్యాచురల్ స్టార్.!

Sep 23, 2026 7:54PM

టాలీవుడ్ సినిమాలకు అమెరికాలో కూడా మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. అక్కడి బాక్సాఫీస్ లెక్కలపై కూడా ఆసక్తి ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా నాని మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.

అమెరికాలో ఒక సినిమాకు $1 మిలియన్‌కు పైగా వసూళ్లు రావడం అనేది అక్కడి మార్కెట్‌లో మంచి మైలురాయిగా భావిస్తారు. ఇప్పటివరకు ఈ లెక్కల్లో మహేష్ బాబు 12 సినిమాలతో టాప్‌లో ఉన్నాడు. తాజాగా ‘ది ప్యారడైజ్’తో నాని కూడా 12 సినిమాల మార్క్‌ను అందుకున్నాడు.

దీంతో అమెరికాలో $1 మిలియన్ క్లబ్‌లో అత్యధిక సినిమాలు ఉన్న టాలీవుడ్ హీరోల జాబితాలో నాని.. మహేష్ బాబుతో కలిసి టాప్ ప్లేస్‌లో నిలిచాడు. 

ఈ లిస్టులో మహేష్ బాబు – 12 సినిమాలు, నాని – 12 సినిమాలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో ఎన్టీఆర్ – 9 సినిమాలు, పవన్ కళ్యాణ్ – 9 సినిమాలు ఉండగా.. ప్రభాస్ – 8 సినిమాలతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

ఇది కూడా చదవండి: 'ప్యారడైజ్' ఫస్ట్ రివ్యూ.. అసలు ఈ కాకుల కథేంటి.?

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నాని ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తన సినిమాల మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు వంటి స్టార్‌తో కలిసి ఈ లిస్టులో టాప్‌లో నిలవడం.. అతని ఓవర్సీస్ మార్కెట్‌కు ఉన్న క్రేజ్‌ను చూపిస్తోంది.

ముఖ్యంగా ‘ది ప్యారడైజ్’పై విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండగా.. అమెరికాలో కూడా ఆ క్రేజ్ కలెక్షన్ల రూపంలో కనిపిస్తోంది. మరి ఈ సినిమా రన్ పూర్తయ్యే సమయానికి నాని ఈ లెక్కలను ఇంకెంత పెంచుతాడో చూడాలి.

మీకు నచ్చవచ్చు:
మోహన్ బాబు విలనిజం: మళ్లీ అదే రేంజ్‌లో ‘ది ప్యారడైజ్’.!
రాయలసీమ రామన్న చౌదరి.. మోహన్ బాబు ఏంటో తెలియాలంటే ఈ సినిమా చూడాలి.!

 

 

 

[The Paradise Movie, Nani Paradise, Nani Vs Mahesh Babu, Nani 1 Million Films, Paradise USA, Nani USA Box Office, Natural Star Nani, Telugu Film News, Telugu News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com